బ్లాగరు వాడు ఒక కొత్త విశేషం తీసుకొచ్చాడివాళ. బ్లాగు నిర్వహణలో, ప్రచురణలో ఇదేమీ ఉపయోగపడనప్పటికీ, బ్లాగును కొత్తగా చూపించుకోడానికి డైనమిక్ వ్యూస్ అనే ఈ విశేషాన్ని వాడుకోవచ్చు.
ఈ అంశాన్ని వాడి, మన బ్లాగులను ఇప్పుడున్నట్టుగా కాక, మరో ఐదు వైవిధ్యమైన అమరికల్లో చూపించవచ్చు. టపాల అమరికలో ఉన్న తేడా తప్ప వేరే ప్రత్యేకతేమీ లేదు. కాకపోతే ఈ డైనమిక్ వ్యూలు ఉన్న మూసను వాడుకోవడం లేదు.సైడుబారులూ, హెడరూ, ఫుటరూ.. ఇవేమీ కనబడవక్కడ.
కింద ఇచ్చిన లింకులు ఒక్కోదాన్నీ నొక్కి ఎలా ఉన్నాయో చూడండి. ఈ లింకులన్నీ వేరే పేజీల్లో తెరుచుకుంటై.
ఫ్లిప్ కార్డ్
మొజేయిక్
సైడ్ బార్
స్నాప్ షాట్
టైమ్ స్లైడ్
ఏ బ్లాగుస్పాటు బ్లాగునైనా ఈ కొత్త అమరికల్లో చూడొచ్చు. బ్లాగు అడ్రసు చివర /view అని రాసి నొక్కితే ఈ కొత్త అమరికలకు వెళ్ళొచ్చు. మీ బ్లాగు డ్యాషుబోర్డులో సెట్టింగ్స్ -- ఫార్మాటింగ్ పేజీలో దీనికి సంబంధించిన సెట్టింగు చూడొచ్చు.
బ్లాగులో ఫోటోలు ఎక్కువగా ఉంటే ఈ అమరికలు బాగుంటాయని నాకు అర్థమైంది. ఉదాహరణకు, సాధారణంగా ప్రతి టపాకూ ఒక బొమ్మ ఉండే పర్ణశాల బ్లాగు ఈ కొత్త అమరికల్లో బాగుంటుంది. నా బ్లాగులాంటి అందవిహీనమైన బ్లాగులు ఈ అమరికలకు నప్పవని అనిపించింది.
ఇంకో విశేషమేంటంటే.. ఈ కొత్త అమరికల్లో, పైనున్న పట్టీలో "చదువరి" అనే పేరును నొక్కితే ఒక టెక్స్టు పెట్టెతో కూడిన పట్టీ కిందికి జారుతుంది. ఆ పెట్టెలో ఏదైనా బ్లాగుస్పాటు బ్లాగు అడ్రసు రాసి ఎంటరు నొక్కితే ఆ బ్లాగు కూడా ఈ కొత్త అమరికల్లో తెరుచుకుంటుంది. నా బ్లాగు నుండి నేను వేరే బ్లాగు ఆడ్రసు కొట్టి ఆ బ్లాగుకు బాగానే వెళ్ళాను. మళ్ళీ అక్కడ నా బ్లాగు అడ్రసు కొడితే "సారీ, ఈ బ్లాగుకు డైనమిక్ వ్యూలు అందుబాటులో లేవు" అని చెప్పింది . అది నేను కనుక్కున్న విశేషం! :)
ఏప్రిల్ ఒకటిన ఈ కొత్త అంశాన్ని జనంలోకి తెచ్చాడు. ఏప్రిల్ ఫూల్ చేసే ప్లానేమోనని అనుకున్నాను ముందు. గతంలో గూగుల్ వాడు అలా చేసాడు లెండి.
Thanks for sharing worthy info!
రిప్లయితొలగించండిధన్యవాదాలు. అంతా బాగుంది.కానీ బ్లాగ్ ముంగిట్లో ఈ ఆప్షన్ కనిపించేలా ఎలా చేయడం?
రిప్లయితొలగించండిసెట్టింగ్స్ లో కానీ, డిజైన్ లో కానీ లేదే?
ఎటెల్లిపోయావు బాబూ!
రిప్లయితొలగించండిగుసగుస
‘నా జీవితం తెరిచిన పుస్తకం..’, ‘పారదర్శకత’ అంటూ తెగ డైలాగులు చెబుతుంటారు చాలా మంది నేతలు. వారిలో చాలా మంది పుస్తకాల్లో కనిపించని ‘నల్ల’ పేజీలు చాలానే ఉంటాయి. ఇటువంటి వారిలో అగ్రగణ్యుడు మన తెలుగు గడ్డపైనే ఉన్నారని కాంగ్రెస్ నేతలే కాదు.. తెలుగుదేశం నేతలూ చెవులు కొరికేసుకుంటున్నారు. అవినీతి గురించి తెగ నీతులు చెప్పే ఈ ‘తెలుగు’ నేత హఠాత్తుగా మాయమైపోతారని, విదేశాల్లో ‘వ్యవహారా’లను చక్కదిద్దుకున్నాక మళ్లీ ప్రత్యక్షమవుతుంటారని అంటుంటారు. ఎవరేమనుకున్నా ఆయన పట్టించుకోరు. విదేశీ ‘వ్యవహారాలు’ చకచకా చక్కబెట్టుకొచ్చేస్తుంటారు. ఇటు అసెంబ్లీ సమావేశాలయ్యాయో లేదో.. ఆయన మాయం. అదీ ప్రధాన అనుచరులక్కూడా ముందుగా చెప్పకుండా. అవినీతిపై ఆయనసభలో చేసిన తెగావేశపూరిత ప్రసంగం ఇంకా కళ్ల ముందు చెదిరిపోలేదు. అంతలోనే ఎటెళ్లిపోయారు బాబూ!.. అని వారు బురల్రు గోకేసుకుంటున్నారు. ఆయన సింగపూరా.. కాదు కాదు దుబాయ్ .. అబ్బే మాల్దీవులకెళ్లుంటారని ఒక్కొక్కరూ ఒక్కో రకంగా చెప్తున్నారు. ఏదో ఒక దేశం వెళ్తే వెళ్లాడు కానీ, ఇప్పుడే యమర్జంటుగా వెళ్లిపోయేంత పనేం ముంచుకొచ్చిందని..! అందులోనూ.. హవాలా వీరుడు హసన్ అలీ నల్లడబ్బుతో ‘తెలుగు నేతల’కున్న లింకులు బయటపెట్టిన ఈ సమయంలోనా ‘సీక్రెట్’ పర్యటనలు? అందరూ నిజమనేసుకోరూ?.. అని అనుచరగణం తెగ మథనపడిపోతోంది.
రాజేష్: నెనరులు.
రిప్లయితొలగించండిమందాకిని: బ్లాగులో ఈ ఆప్షను చూపించే సౌకర్యం లేదనుకుంటానండి. మనమే లింకులను పెట్టుకోవాలి -నేను కుడిపక్కపట్టీలో పైన పెట్టినట్టు.
అజ్ఞాతా, అసందర్భ ప్రలాపీ, నీ వ్యాఖ్యకు తగ్గ టపా దొరకనపుడు, దొరికేదాకా ఆగాలి.
చైతన్య గారూ
రిప్లయితొలగించండిఇది http://pakkintabbayi.blogspot.com/ నా కొత్త బ్లాగు కూడలి లో ఇంకా లిస్ట్ చేయలేదు.ఈ లోగా మీరోసారి చూడాలని నా కోరిక(అసందర్భ ప్రసంగానికి క్షమాపణలతో)
--పవన్ సంతోష్ సూరంపూడి
అదేమి చిత్రమో గానీ మీ టపాలో నేను రెండవ అసందర్భ ప్రలాపిని(2:2 టై పడింది సందర్భశుద్ధి ఉన్న వారికి అసందర్భ ప్రలాపులకూ)
పక్కింటబ్బాయి (ఇల్లు మారాడు): నాకు అవకాశమివ్వకుండా మీరే అనేసుకున్నారు గదా! :)
రిప్లయితొలగించండిఅవునూ.., ఈ చైతన్య ఎవరండీ? :)