14, ఏప్రిల్ 2009, మంగళవారం

చారిత్రిక అవసరం

అధికారమనేది లక్ష్యం కాకూడదు, అదొక మార్గం అంతే! అంటున్నాడు లోక్‌సత్తా నేత జయప్రకాశ్ నారాయణ. జాతినిర్మాణం, బిడ్డల భవిష్యత్తూ లక్ష్యాలు కావాలి. అధికారం -దాన్ని సాధించే మార్గం కావాలి. కానీ సాంప్రదాయిక రాజకీయ పార్టీలు అధికారాన్ని లక్ష్యంగా చూస్తున్నాయి అని అంటున్నాడు.


పేదరికాన్ని తొలగిస్తాం, నిరుద్యోగాన్ని నిర్మూలిస్తాం, ఆరోగ్య సిరులు అందిస్తాం అని చెప్పుకునేవాళ్ళు చాలామందే ఉన్నారు. చాలా పార్టీలే ఉన్నాయి. కానీ, పేదరికాన్ని తొలగించవచ్చు, నిరుద్యోగాన్ని నిర్మూలించవచ్చు, ప్రతి ఒక్కరికీ ఆరోగ్య సౌభాగ్యాన్ని అందించవచ్చు అని చెబుతోంది లోక్‌సత్తా. అవి ఎలా సాధించవచ్చో కూడా చెబుతోంది. ప్రతీ సమస్యకూ నిర్దుష్టమైన పరిష్కార మార్గాలున్నాయని చెబుతోంది. ఈ లక్ష్యాలను సాధించడం కోసం అధికారమిమ్మంటోంది.

ఎన్నోసార్లు ఎంతోమందిని నమ్మాం. ఎంతోమంది దొంగలకు, వెధవలకూ వోటేసాం. వాళ్ళు దొంగలని తెలిసీ వేసాం. మనకు మరో అవకాశం లేక, వేసాం. ఉన్న వెధవల్లోనే కాస్త మంచివాణ్ణి ఎంచుకుని వోటేసాం. ఫలానావాడికి వోటేస్తే మనలను దోచుకుతింటాడని తెలిసీ వేసాం.

ఇప్పుడు మనకు లోక్‌సత్తా రూపంలో చక్కటి అవకాశం వచ్చింది. ఏం చెయ్యాలో తెలిసిన వాళ్ళు ఉండొచ్చు. కానీ లోక్‌సత్తాకు ఎలా చెయ్యాలోకూడా తెలుసు. అన్నిటికంటే ముఖ్యం.. అనుకున్నది చేసే చిత్తశుద్ధి, నైతికత, నిబద్ధత  ఆ పార్టీకి ఉన్నాయి.


లోక్‌సత్తా అంటే అభిమానం ఉండీ, వోటు వెయ్యడానికి వెనకాడేవారికి ఈ విజ్ఞప్తి:

నేనొక్కడిని వేసినంత మాత్రాన లోక్‌సత్తా గెలుస్తుందా అని అనుకోకండి. నేను వేస్తేనే గెలుస్తుంది అని అనుకోండి. పరీక్షలో "ఆఁ ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం రాయనంత మాత్రాన తప్పబోయామంటలే" అని వదిలేసామా?

పట్నాల్లోనే కాదు, చదువుకున్నవారిలోనే కాదు, పల్లెటూళ్ళలో కూడా, చదువుకోనివారిలో కూడా లోక్‌సత్తాకు అభిమానులున్నారు. (కొత్తగూడెంలో నా స్నేహితుడి భార్య కూరగాయలు కొనేందుకు మార్కెట్టుకు వెళ్తే, అక్కడికి ఓ పార్టీవాళ్ళు ప్రచారానికి వచ్చి, వోటెయ్యమని అడిగారట. వాళ్ళు వెళ్ళగానే కూరగాయలు అమ్ముకునే ఆమె పక్కామెతో "వీళ్ళకెందుకు వేస్తాం, ఈ సారి లోక్‌సత్తాకు వేద్దాం" అని అందంట!)

వాళ్లకున్న తెలివితేటలు, భవిష్యత్తు పట్ల వాళ్లకున్న జాగ్రత్త మనకు మాత్రం లేవా? రండి, మనమూ లోక్‌సత్తాకు వోటేద్దాం.

మనం కోరుకునే భవిష్యత్తు ఒక్క వోటు దూరంలో ఉంది.

22 కామెంట్‌లు:

 1. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 2. నేను ఎలక్షన్స్ ని ఫాలో అవ్వటం లేదు కానీ, ఇక్కడ బ్లాగులు చదూతూంటే నాకెందుకో అనిపిస్తోంది. లోక్సత్తా మీద కొంచెం ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువయ్యాయేమొనని. లోక్ సత్తా ఇప్పటి వరకూ అన్ టెస్టెడ్ ఎంటిటీ కదా?
  I lived long enough on this planet to see how people build up hopes and how they get shattered! I would like to be cautious (cautiously optimistic, as they say!)

  రిప్లయితొలగించండి
 3. మీరు చెప్పినది బాగానేఉంది.లోక్సత్తా రావడానికి ఇంకా చాలా కాలం పడుతుందని నా ఉద్దేశ్యం. ఈ మధ్యన రాజమండ్రీ లో ఒక షాప్ కి వెళ్ళాను. అక్కడ ఆ యజమాని తో ఈ పార్టీ ల గురించి మాట వచ్చి," మీరు ఎవరిని సమర్ధిస్తున్నారు?" అని అడిగాను. అంటే ఆయన "ఇప్పుడున్న పార్టీలన్నీ దొంగలని తెలుసండి బాబూ,

  ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వాళ్ళు తప్ప మనకి ఇంకో ఛాయిస్ లేదు కదా ." అన్నారు. " మరి లోక్సత్తా గురించి మీ అభిప్రాయం ఏమిటీ " అన్నాను.అంటే ఆయన " గురువు గారూ,కాంగ్రెస్, తెలుగుదేశం వాళ్ళు తినేది తినగా ఏదో పథకాల కింద ప్రజలక ఏదో చేస్తామంటున్నారు.--కిలో రెండు రూపాయల బియ్యం,పావలా వడ్డీ, పింఛనూ,ఆరోగ్యశ్రీ,కలర్ టీవీలు...." లోక్సత్తా వాళ్ళు ఇలాంటివి చేయాలంటే చాలా టైమ్ పడుతుంది కదా, నన్నిలా వదిలేయండి,ఇంకో పది సంవత్సరాల తరువాత మా పిల్లలూ, మనవళ్ళూ మీరు చెప్పే లోక్సత్తా కి వేస్తారు " అన్నారు.

  ఇలా పైన చెప్పినట్లుగా అలాంటి వోటర్లని ఎలా మారుస్తారు?

  రిప్లయితొలగించండి
 4. నాకు పెద్ద పెద్ద వ్యాసాలు వ్రాసేంత ఓపిక లేదు, అసహనం కావచ్చు. కాని ఒక్క విషయం, ప్రస్తుత పరిస్థితుల్లో లోక్ సత్తా ఎన్ని సీట్లు గెలుస్తుంది? అది అన్ని సీట్లు గెలవడం వల్ల వచ్చే ఉపయోగాలేమిటి? ఒక వేళ అదొక మార్పు తీసుకొస్తుందనుకుంటే, అలా వచ్చిన తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఇప్పుడు ఏమిటి? అవే ఆశయాలతో ఉందా లేక మిగిలిన వాటిల్లానే బ్రష్టుపట్టిపోయిందా?

  విపరీతమైన ప్రాంతీయపార్టీలవల్ల దేశం కుక్కలు చింపిన విస్తరవటం ఖాయం. మొఘలులు మన దేశాలమీదకి దందెత్తడానికి ముందు మన పరిస్థితి ఇలానే ఉండేది. అప్పుడు పార్టీల బదులు రాజరికాలు. మన దేశం బలంగా ఉండాలంటే బలమైన రాజకీయ పార్టిలు రెండే ఉండాలి.

  రిప్లయితొలగించండి
 5. తెలుగుదేశం లోక్ సత్తాలాంటి ఆశయాలతో ముందుకొచ్చిన పార్టీ కాదు. ఆ పార్టీకి, లోక్ సత్తాకి ఎందులోను పోలిక లేదు. అప్పట్లో కీ.శే.రామారావుగారికి వ్యక్తిగతంగా జఱిగిన అవమానం, కాంగ్రెస్ కి ప్రత్యామ్నాయం లేకపోవడం, కొన్ని సామాజికవర్గాలకి కాంగ్రెస్ తో గల అసంతృప్తి - ఇలాంటివన్నీ కలిసి తెలుగుదేశం ఆవిర్భావానికి దారితీశాయి.

  మార్పు ఒక్కరోజులో రాదు. అలా వచ్చే మార్పులు నిలబడవు. మార్పు క్రమేపీ వస్తుంది.

  లోక్ సత్తా ప్రాంతీయపార్టీ కాదు. ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు పెద్దలు. ముందు ఆంధ్రప్రదేశ్ లో రాజకీయప్రక్షాళన ప్రయోగం విజయవంతమయ్యాక ఇతరరాష్ట్రాల్లో విస్తరించే ఉద్దేశం ఉన్నట్లు శ్రీ జయప్రకాశ్ గారు అనేకసార్లు చెప్పారు.

  ఒకవేళ లోక్ సత్తా ప్రాంతీయపార్టీగానే మిగిలిపోయినా నష్టమేమీ లేదు. దేశానికి, దేశప్రజలకి కావాల్సింది ప్రాంతీయపార్టీలే. అది ఇప్పటికి చాలా సార్వత్రిక ఎన్నికల్లో నిరూపణైంది కూడా ! జనానికి జాతీయపార్టీలు నచ్చకపోవడానికి బలమైన కారణాలే ఉన్నాయి. ముఖ్యంగా జాతీయవాదం పేరుపెట్టి రాష్ట్రాల్ని అణగదొక్కిన విధానం, వాటి సంపదని, ఆదాయమార్గాల్ని దోచిన విధానం దారుణమైనది.తెలుగువాళ్ళు గుర్తించలేకపోతున్నారు కానీ అన్నిరాష్ట్రాలవాళ్ళు ఈ సంగతి గుర్తించారు. ఈ దోపిడికి మూలస్తంభమైన కాంగ్రెస్ అందుకనే ఏ రాష్ట్రంలోను పట్టుమని పన్నెండు స్థానాలు కూడా గెల్చుకోలేని దుఃస్థితిలోకి వచ్చింది.

  ఇతరదేశాల దురాక్రమణలకి వ్యతిరేకంగా మనం అభివృద్ధి చేసుకోవాల్సింది నపుంసకుల మందలా ఒకచోట గుమిగూడి గజగజ వణుకుతూ బతకడం కాదు, కావాల్సింది పురుషత్వం, వీరోచిత సంస్కృతి. తాలిబాన్ల లాగా పోరాటదృక్పథం.

  బ్రిటిషువాళ్ళు రాకముందు కూడా మన నవాబుల రాజ్యాలు చాలా పెద్దవి, చాలా సంపన్నమైనవి, సైనికపరంగా బలమైనవి కూడా ! అవి ఆనాటి ఇంగ్లండు కంటే ఫ్రాన్సు కంటే జర్మనీ కంటే అన్నివిధాలా శక్తిమంతమైనవి. కానీ కొన్ని విచిత్ర కారణాల చేత అవి విదేశీయుల పాలనలోకి వెళ్ళాయి. అదొక చారిత్రిక కాకతాళీయత. ఆ నిగూఢం ఇంతవరకు ఎవరికీ బో ధపడకుండానే మిగిలింది. అది మన చరిత్రలో మళ్ళీ పునరావృత్తమయ్యే అవకాశం లేదు. కారణాలు అన్వేషించేవారు ఈ అనైక్య సిద్ధాంతాన్ని పట్టుకొని చాలాకాలంగా వేళ్ళాడుతూ ఉన్నారు. వారిలో కాంగ్రెస్ వారు ముఖ్యులు. కానీ ఈ సిద్ధాంతం సంతృఫ్తికరం కాదు. ఎందుకంటే ఆ రోజుల్లో ఇండియాలోని రాజ్యాలే కాదు ప్రపంచంలో ఏ ఉపఖండంలోను ఏ రాజ్యాలూ సమైక్యంగా లేవు. ఉదాహరణకి యూరోపులోని రాజ్యాలన్నీ ఆ రోజుల్లో కొట్టుకు చస్తూండేవి. అదీగాక ఆ కాలపు టెక్నాలజీకి, వ్యవస్థలకీ ఇన్ని రాష్ట్రాలతో, జాతులతో కూడుకున్న సామ్రాజ్యాన్ని మెయిన్ టెయిన్ చెయ్యడం సాధ్యపడేది కాదు.

  ఒక ముఖ్యమైన కారణం - అవి ఎక్కువభాగం ముస్లిముల పాలనలో ఉండేవి. వారు శతాబ్దాల తరబడి హిందువుల్ని హింసించారు. కనుక ఇంగ్లీషువారి చేతిలో వారి సర్వనాశనాన్ని హిందువులు కసిగా, మనసారా ఎంజాయ్ చేశారు.

  --తాడేపల్లి

  రిప్లయితొలగించండి
 6. లోక్‌సత్తా మీద ప్రజలకున్న అభిమానం, నమ్మకం, సానుభూతి ఎంతవరకు ఓట్లగా మారతాయి? మారితే బాగుండు :) నా దృష్టి లో ఈ సారి అది కనీసం 10 స్థానాలు గెలుచుకొని లేదా ఒక 12% అయినా ఓటుబ్యాంకు ని సాధిస్తే 2014 లో అధికారం లోకి రావటం ఖాయం. అయితే పైన చెప్పిన 12% రావాలంటే ఓటింగ్ శాతం బాగా పెరగాలి. ఇప్పటివరకు ఓటింగ్ కి దూరంగా ఉన్నవాళ్ళు ఓటేస్తేనే అది సాధ్యం. ఇంక పది స్థానాలు రావచ్చనే నా ఆశ. 23 జిల్లా కేంద్రాలలో ఉన్న 50 కి పైగా నియోజికవర్గాల్లో లోక్‌సత్తా నిర్ణయాత్మక ప్రభావం చూపిస్తుందని నమ్మకం.

  రిప్లయితొలగించండి
 7. M.P. వొట్ మాత్రం జాతీయ పార్టిలకు వెయ్యండి అని ఎవరొ రాసినట్టుగా చదివాను. మనం లాస్ట్ టైం కాంగ్రెస్స్ ని గెలిపించాం, తమిళనాడు వాళ్ళు మాత్రం వాళ్ళ ప్రాంతీయపార్టిని గెలిపించుకున్నారు. ఇద్దరు అదికారం లొ వున్నా తమిళనాడు కి మనకి వచ్చిన ప్రాజెక్ట్స్, ఇంఫ్రాస్ట్రక్చర్ కంపెర్ చెసుకుంటె మనం చాల వెనుకబడి వున్నాం. లాలు కూడ మనకి అన్యాయం చెసాడు. ఆ రకంగా పొరాడే ప్రాంతీయ పార్టిలని గెలిపిన్స్తె బెటర్ అనిపిస్తుంది.
  (పొరాడె అన్నది అండర్ లైను చెసుకొండి )

  నిజంగా అభివ్రుద్ది చెయ్యలనె అలొచన పట్టుదల వుంటె జాతీయ పార్టి అయినా పర్లెదు , అది కెంద్రం లొ అదికారం లొ లెకపొయిన పర్లెదు అని గుజరాత్ ని చూస్తె అర్ధం అవుతుంది. ఎంతమంది అంగీకరిస్తారొ తెలీదు కానీ, నా నార్త్ ఇండియన్ ఫ్రెండ్స్ దగ్గర విన్నది, నెను చదివినదాని ప్రకారం , ఈ దశాబ్దం లొ నిజమయిన అభివృద్ది ఒక్క గుజరాత్ లొనె జరిగింది.

  లొక్ సత్తా గురించి - లొక్ సత్తా పార్టి కి ప్రజలు ఆకర్షించబడేల ప్రయత్నించాలి. జె పి కి కాదు. ఇలా వొన్ మేన్ షొ లా ఒక్కళ్ళు వుండి మర్చడానికి చాల సమయం పడుతుంది. ఇంకొ పదిమంది జె పి లాంటి లిడర్స్ రావాలి .

  రిప్లయితొలగించండి
 8. LBS: జేపీ గురించి ఏకవచనం వాడానన్న మీ విమర్శకు నేను బాధపడలేదు. ఎందుకు తొలగించారో తెలీలేదు. మీవంటి పెద్దలు చెప్పినదాన్ని పాటించాల్సిందే! కాకపోతే నా అభిప్రాయం కొంత వేరుగా ఉంది. దాని గురించి మరెక్కడైనా మాట్టాడతాను.

  satya: 6% కు పైన ఎంత వచ్చినా బాగా వచ్చినట్టే! 12% అనేది చాలా మంచి లెక్క అని నా ఉద్దేశం. దీనికి తోడు ప్రజారాజ్యం పొందే వోట్లు. ఈ రెండూ కలిసి మొత్తం సీట్ల లెక్కలను తారుమారు చేస్తాయేమో చూడాలి.

  మంచు పల్లకీ: ఈ ఎన్నికల తరవాత, లోక్‌సత్తాలో ప్రజలకు తెలిసే నాయకులు మరింత మంది వెలుగులోకి వస్తారని ఆశించవచ్చు. పోరాడే ప్రాంతీయపార్టీల విషయంలోను, గుజరాతు విషయంలోను మీతో ఎకీభవిస్తాను. పార్టీ ఏదైనా, నాయకుడికి నిబద్ధత ఉంటే పరిపాలన మెరుగ్గా ఉంటుందనేదానికి గుజరాతు ఉదాహరణ.

  రిప్లయితొలగించండి
 9. సుజాత: జయహో లోక్‌సత్తా! :)
  KumarN: లోక్‌సత్తాపై ఆశలు అనేకంటే ప్రజలపైన ఆశలు అంటే మరింత సముచితంగా ఉంటుంది.
  హరేఫల: "ఇలా పైన చెప్పినట్లుగా అలాంటి వోటర్లని ఎలా మారుస్తారు?" - లోక్‌సత్తాకు అతిపెద్ద ప్రత్యర్థి ఈ భావనలే. చూద్దాం దీన్నెలా అధిగమిస్తుందో.

  రిప్లయితొలగించండి
 10. సూర్యుడు: ఎన్ని సీట్లు గెలుస్తుందో చెప్పలేనుగానీ, ఒక్కటి గెలిచినా ఆమేరకు శాసనసభ శుభ్రపడినట్టే! మన దేశ సామాజిక వ్యవస్థకు రెండు పార్టీల పద్ధతి సరిపోదని నా ఉద్దేశం.

  రిప్లయితొలగించండి
 11. ఇన్నాళ్ళూ మనం రాజకీయాలలో మంచి పార్టీలే లేవని అనుకున్నాం.

  ఇపుడు ఒక పార్టీ మంచి విధానాలు, ఆదర్శాలతో ముందుకు వస్తే ఎంత మంది మద్దతు ఇస్తున్నారు?
  లోక్ సత్తా పార్టీ పేరుని ఇంచుమించుగా అనువదించి తన పార్టీ పేరును ‘ప్రజా రాజ్యం‘ అని పెట్టుకున్న చిరంజీవి సైతం లోక్ సత్తాతో పొత్తుకి ఏమీ ఆసక్తి చూపలేదు.

  మునిసిపల్ ఎన్నికల దాకా ఆగండి. లోక్ సత్తా తన సత్తా చూపుతుంది.

  రిప్లయితొలగించండి
 12. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురుచూసినంతకాలం మోసపోవడమే మన చరిత్ర అవుతుంది. అలా ఎదురుచూస్తూ కూర్చోవడమే మన సంప్రదాయమవుతుంది. ఇప్పటిదాకా ఈ దేశపు రాజకీయరంగం బాగుపడకపోవడానికి కారణమిదే. ఇకనైనా పరిస్థితుల్నిమన (ప్రజల) చేతుల్లోకి తీసుకుందాం. ఆరోజుల్లో విదేశీ దొరల మీద పోరాడ్డానికి చాలామంది లాఠీదెబ్బలు తిని చెఱసాలలకెళ్ళారు. మఱి అంతకంటే ప్రమాదకారులైన స్వదేశీదొరల మీద పోరాడ్డానికేంటి సంకోచం ? అయినా మనమేమీ చెఱసాలలకెళ్ళమనడంలేదే ! చదువులూ, ఉద్యోగాలూ మానుకుని లాఠీదెబ్బలు తినమనడంలేదే ! శాంతియుతంగా వోటుహక్కుని వినియోగించుకొని వ్యవస్థని మార్చమంటున్నాం. అది కూడా చేతకాదంటే ఎలా ? ఏ పార్టీ అయినా స్థాపించిన వెంటనే అధికారంలోకి రాదు. కమ్యూనిస్టుపార్టీని స్థాపించింది 1926 లో అయితే, అది మొదటిసారి అధికారంలోకి వచ్చింది 1955-56 ప్రాంతాల్లో ! Every dog has his day అన్నాడు తెల్లవాడు. ఏదో ఒకరోజు లోక్ సత్తా కూడా ఈ రాష్ట్రంలో తప్పనిసరిగా తన స్వంతబలం మీద ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసితీఱుతుంది.

  ఇహపోతే కొంచెం అప్రస్తుతప్రసంగం :-

  ఈస్టర్ పండుగ సందర్భంగా కార్యాలయాలకీ, బళ్ళకీ సెలవులొచ్చి ప్రవాసభారతీయులంతా ఏ విహారయాత్రలకో వెళ్ళినట్లున్నారు. ఏ బ్లాగులోను హిట్లు లేవు, వ్యాఖ్యల్లేవు. కూడలిలో కొత్త టపాల్లేవు.

  --తాడేపల్లి

  రిప్లయితొలగించండి
 13. ఎలెక్షన్ అప్పుడూ ప్రతీ పార్టీ వేడి పుట్టిస్తుంది... నేనైతే 10% వోటు వస్తుందని అనుకుంటున్నా... అందరూ అనుకునే దానికన్నా లోక్సత్తా కి ఎక్కువ వోటు శాతం వస్తుంది... కానీ ఇప్పుడు ప్రజల్లో పుట్టించిన వేడిని లోక్సత్తా కొనసాగించాలి... లోక్సత్త తరపున కనీసం ఒక నలుగురు అభ్యర్ధులు అసెంబ్లీ లో ఉండాలని దేవుడిని ప్రార్ధిస్తున్నాను...

  రిప్లయితొలగించండి
 14. "తెలుగువాళ్ళు గుర్తించలేకపోతున్నారు కానీ అన్నిరాష్ట్రాలవాళ్ళు ఈ సంగతి గుర్తించారు. ఈ దోపిడికి మూలస్తంభమైన కాంగ్రెస్ అందుకనే ఏ రాష్ట్రంలోను పట్టుమని పన్నెండు స్థానాలు కూడా గెల్చుకోలేని దుఃస్థితిలోకి వచ్చింది".

  తాడేపల్లి గారు ఒక మంచి point ను అందించారు. Andhra send 29 MP to Parliament, but got nothing for the state. Where as TN benefited immensly and even Bihar.

  Congress has support among Reddy, Brahmin, Kapu, Muslim, Christian and Madiga/Mala and some STs. Kapu's migrated Chiru party.

  This is the time to defeat anti-national congress headed by Nun Sonia and Samuel Reddy. Reddy with the help of his son-in-law and daughter converting Hindus with the help of Hindu castes votes (e.g. Reddy and Brahmin traditionally vote for Congress).

  రిప్లయితొలగించండి
 15. http://loksattaanswers.blogspot.com/

  indulo machchuki konnni.. so called JP abhimaanulu chadavaali ivi.. andari laage, eeyana kooda picture pefect, uttamundaine gopi emee kaadu ..

  1. Why were 5 tickets in Hyderabad given to Kammas?
  Hyderabad has a total of 12 constituencies for the state legislature. Five of these happened to be given to Kammas; but the caste was not the criteria. Very few people came forward to contest for or apply for the party ticket. Thereby, tickets were given to candidates already active with the Loksatta movement. The fact that five of the twelve were kamma is hardly a caste bias.


  Baagaa adaadu ikkada kadaa:--))


  2. Rattayya Chowdary is alleged to be a caste fanatic. Why was he given a ticket?
  While the allegation itself needs further substantiation, Rattayya Chowdary was given a ticket to the Loksabha contest based on his administrative capablities. Even though he was not a long standing member of Loksatta movement, as he has shown strong support to Loksatta's manifesto's emphasis on education, he was given a ticket. If he indeed turns out to be a caste fanatic, his candidature in the next election will be nullified.


  4. Is Dr. Narayana taking advantage of Kukatpally's caste demographics?
  More than 50% of Kukatpally's demographic is from backward classes. The percentage of Kammas in Kukatpally can be compared to all the other constituencies in Hyderabad like LB Nagar, Khairatabad, etc. Dr. Narayana wanted to contest in some constituency in Hyderabad and not a rural place away from the city as his residence is in the city. He chose Kukatpally owing to the large number of middle class educated voters who need very little stimulus to think seriosly in regard to voting, thereby freeing up Dr. Narayana's resources to focus on other constituencies

  5. Why is Loksatta in alliance with United BC party?
  United BC party is formed solely on basis of caste; but the primary objective of the party is elimination of caste. Loksatta is in alliance with this party not on the basis of their parties composition; but their objectives. More importantly, they are a party who have pledged not to use liquor or money or other inducements in elections.

  6. Why is there a distinct Kamma flavor to Loksatta?
  This is an often asked foolish question. The visible members of Loksata party belong to the educated upper middle class. Unfortunately in India, education has been privy to a few social sections for the last 60 years. So, it is not by design, but because of yester Governments' policies that quite a few people belonging to the educated upper middle class are Kammas. However, none of the policies of Loksatta are pro Kamma. Loksatta and BC United Front together are contesting 271 seats, 95 of which are allotted to BC aspirants. In addition, representation was given to 44 SCs, 16 STs. 30 women and 8 minorities. The physically challenged and former naxalites are among the candidates. More than 50 percent of candidates are younger than 35. These numbers invalidate such categorization.

  రిప్లయితొలగించండి
 16. idi highlite of india..

  2. Why did Loksatta clean up after PRP Vijayabheri?
  This was purely a political stunt aimed at increasing the publicity on Loksatta. PRP Vijayabheri was a big political extravaganza that generated lot of media coverage. The local Loksatta leader found this to be an apt oppurtunity to share the limelight. PRP was not targeted per se, but the timing of the event and the location of the event were the factors. Needless to say, there was no other political event in Hyderabad that generated as much media attention as did the PRP event at that time. This has also been criticized by some intellectuals within the party and therfore is unlikely to be repeated.

  ika mee vignata!! i didnt expect this from JP.. he is just like any other politician... Just suitu,bootu vesukontaadanthe!!
  inthoti daanniki, aayanedo maarpu testhunnadani, ikkada so called intellectuals feel avuthunnaaru.. which is very disappointing!! paigaam aayana main edupu PRP meeda!!

  evaro cheppaaru..
  LokChetta - oodavatam, edavatam
  :--))

  రిప్లయితొలగించండి
 17. copied from a discussion board..
  Questions for JP/LS/ JP fans etc..

  1. What did JP achieve that the other collectors/administrators in India could not achieve? Irrigation projects are OK. But almost every other collector can boast of the same achievement. What extra did JP bring to the table during the tenure as a district collector?

  2. If he is so popular in Prakasam district, why is he not contesting from Prakasam?

  3. His involvement in RTI. Was he a one man team or there were others in this team? What are his achievements in this team? Don't mention the team's achievements.

  4. He has taken a strong stance against corruption. But L Ratthiah has a criminal case pending. Why is he given a ticket?

  5. He believes in transparent governance. Fine. Why 9 of the 16 candidates in Phase 1 Lok Sabha elections did not provide their PAN card details?

  6. What are his contributions, if any, to the society - apart from his regular duties? Has he done any charity? helped any poor people?

  7. How exactly is PRP a kutumba party? If canvassing by family members is the criteria, LSP is also a kutumba party. Isn't it?

  8. Does he really believe that he can eradicate poverty in five years? If yes, fantastic, how exactly does he go about doing it? Any detailed plan showcased?

  9. I thought he said once - "Recession is only in your mind. There is no recession in India actually." Now, do you agree with this startling revelation?

  10. Last two months lo LSP - as a party - emi panulu chesindi... Elaa prachaaram chesindi? How does it differ from what the other parties have done?

  11. Allegations on purnachandra rao?
  12. Claniing stunt after PRP's sabha in HYD?

  రిప్లయితొలగించండి
 18. లోక్ సత్తా-విమర్శకులు తమ విమర్శలకి కనీసం ఒక్క సరైన కారణాన్ని చూపించలేకపోతున్నారు. If Chiranjeevi deserves a chance on account of being a fresher, so does JP too. Why not ?

  --తాడేపల్లి

  రిప్లయితొలగించండి
 19. JP abhimaanulu photo frame kattinchokovalasina quote

  http://epaper.eenadu.net/pdf/2009/04/27/20090427a_002101011.jpg


  "naakeppudu oka digulu undedi, Naaku emaina aithe Desham teevranga nashtapothundanna bayam vesedi "


  ika naa valla kaadu!!
  @tadepalli, mundara JP meeda questions ki answer cheyyandi saar!! JP is no different from rest.. thats my point.

  రిప్లయితొలగించండి
 20. @tadepalli..
  Kaani meeranna point correct. Fresher gaa, JP also deserves a chance!! anthaku minchii, naakaithe chaaritraka avasaram kaani, bhoogola avasaram kaani emi kanapaddam ledandi!!

  రిప్లయితొలగించండి
 21. చక్కటి పోస్టు. లోక్ సత్తాకి వోటేయమని పిలుపునిచ్చినందుకు ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు