24, డిసెంబర్ 2009, గురువారం

చవకబారున్నర విశ్లేషకుడు

ఆ మధ్య హై.లో సినిమా షూటింగుల మీదబడి ధ్వంసం చేసారు ముష్కరులు. మనోజ్ సినిమా షూటింగు సంఘటన పట్ల స్పందనగా మోహన్‌బాబు ఘాటుగానే మాట్టాడాడు. ఆ తరవాత అల్లు అర్జున్ సినిమా షూటింగు మీద కూడా దాడి జరిగింది.

మన టీవీలవాళ్ళకు ఘంటా చక్రపాణి అనే నిలయ విద్వాంసుడి లాంటి విశ్లేషకు డొకాయనున్నాడు. దాడి విషయమ్మీద ఓ టీవీలో మాట్టాడుతూ -
'మోహన్ బాబు మాట్టాడినదానిపై ఎవ్వరూ ఖండించలేదేంటి' అని వాపోయాడు. వెనువెంటనే, అల్లు అర్జున్ సినిమాపై జరిగిన దాడి గురించి మీరేమంటారు అని అడిగితే, అందుకు సమాధానంగా, అదెవరో ఏబీవీపీ వాళ్ళు చేసినది అని తేల్చెయ్యబోయాడు ముందు. మళ్ళీ తిప్పుకుని, దాడిని సమర్ధిస్తూ మాట్టాడాడు. బహుశా అతగాడి దృష్టిలో ముష్కరులు చేసిన దాడి సమర్ధనీయము, దాన్ని ఎదుర్కొన్నవాళ్ళ బాధ మాత్రం ఖండనీయము!  -రెండు నాలుకల విశ్లేషకుడు!

ఇవ్వాళ మహాటీవీలో అతడి ప్రవర్తన మరీ నేలబారుగా ఉంది. చర్చలో అతడితోపాటు ఒక సమైక్యాంధ్ర ఉద్యమ విద్యార్థి కూడా పాల్గొన్నాడు. ఆ కుర్రాడి వయసు ఇతగాడి వయసులో సగం కూడా ఉండదు. ఆ కుర్రవాణ్ణి ఇష్టమొచ్చినట్టుగా చీదరించుకున్నాడు, కసిరేసాడు. ఆ కుర్రాడు కేసీయారు గురించి మాట్టాడుతూ అతడి తాగుబోతుతనం గురించి మాట్టాడబోగా వ్యక్తిగత విషయాలు మాట్టడవద్దని చెబుతూ, "ఇక్కడ పిచ్చివాగుడు వాగకు" అని అన్నాడు. పోనీ ఘంటా ఏమన్నా సరిగ్గా మాట్టాడాడా.. విజయవాడలో ఒక ఎంపీ యొక్క ఇద్దరు భార్యల వ్యవహారం గురించి మాట్టాడాడు. అది ఆ ఎంపీ వ్యక్తిగత వ్యవహారమన్న ఇంగితం లేకుండా పోయింది అతడికి.  ఇదీ అతగాడి దిగజారుడు వ్యక్తిత్వం.

ఆ కుర్రాడు లగడపాటి గురించి మాట్టాడబోగా, మాకు అలాంటివాళ్ళ సంగతి అనవసరంలెండి అంటూ తీసేసాడు. అప్పుడా కుర్రవాడు అదేంటండీ ఆయన ఎంపీ, రేపు పార్లమెంటులో ఓటు వెయ్యాల్సి ఉంది మరి అని అన్నాడు. అందుకు ఘంటా చక్రపాణి ఏమన్నాడో తెలిస్తే ఆశ్చర్యపోతాం. "ఓటెయ్యకపోతే దొబ్బెయ్యమనండి, అతడి ఓటు మాకేం అక్కర్లేదు". ఖచ్చితంగా ఇవేమాటలుకాదుగానీ దాదాపుగా ఇవేముక్కలన్నాడు. ఒక చర్చలో ఇలా మాట్టాడే ఇతగాడొక ప్రొఫెసరంట! కనకపు సింహాసనమున.. గుర్తొచ్చింది నాకు.

అలా సాగిన ఆ చర్చలో ఆ కుర్రాడి గురించి, ఒకసారి ఇలా అన్నాడు..
"మీ ఉద్రేకాలు చూపించాలనుకుంటే మీ ప్రాంతంలో చూపించుకోండి, చానళ్ళలో కాదు." అంటే కోస్తా సీమల వాళ్ళు తమ ఉద్రేకాలను తమ ప్రాంతాల్లో చూపించాలి, ఈయన మాత్రం తన ఉద్రేకాన్ని చానళ్ళలో చూపిస్తాడు కాబోలు.

ఈ చర్చలో ఘంటా ప్రవర్తన ఏ క్షణంలో కూడా ఒక ప్రొఫెసరు స్థాయికి తగినట్టుగా లేదు. నిష్పాక్షిక విశ్లేషకుడు కాదుగదా.. కనీసం ఒక చవకబారు విశ్లేషకుడు లాగా కూడా ప్రవర్తించలేదాతడు. ఉద్యమాల పేరిట బస్సుల్ని తగలబెట్టే రౌడీమూక కూడా అట్టా మాట్టాడరు.

తెలంగాణ సమస్యకు సామరస్య పరిష్కారం కావాలనుకుంటే టీవీలవాళ్ళు ఈ రకపు పక్షపాత విశ్లేషకులను మాత్రం చర్చల నుంచి దూరంగా ఉంచాలి.

11 కామెంట్‌లు:

 1. అసలు చక్రపాణి ఒక పెద్ద మూర్ఖశిఖమాణి...ఫ్రీలాంస్ జర్నలిస్టు అని కొన్నిసార్లు. ఒక ఉద్యమకారుడిని అని కొన్నిసార్లు, ఒక మానవతా వాదిని అని కొన్నిసార్లు చెప్పుకుంటాడు..అతను ఇవేమికాదు..

  రిప్లయితొలగించండి
 2. ఇలాంటి పనికిమాలిన విశ్లేషణలు చూసి వాటి మీద మళ్లీ విశ్లేషణలు వ్రాసే మీ ఓపికను మెచ్చుకోవాలి :). నేను ఈ చెత్త న్యూస్ చానెళ్లు చూడ్డం మానేసి హాయిగా నవ్వుల టీవి,ఈటీవీ, తేజ సినిమాలు చూసుకుంటున్నాను. మీరు కూడా ఓ రెండు మూడు రోజులు అలా ప్రయత్నించి చూడండి మనసు ప్రశాంతంగా ఉంటుంది.

  రిప్లయితొలగించండి
 3. త్వరగా ఎవరన్నా విజయవాడ లోనో ,విశాఖ లొనొ ఒ చానల్ ఓపన్ చేస్తే బాగుండు, ఈ టాలిబన్ల విశ్లేషణ ఇక్కడి చానల్స్ లో చూడలేకున్నాం.

  రిప్లయితొలగించండి
 4. You are right venkata ramana Ji.... Presently we have non-sense channels no news channels ... they only discuss about all the non-sense only. If at all i found some time to watch TV i definitely going with Navvula channel these days.

  రిప్లయితొలగించండి
 5. @వెంకట్ రమణా
  అయితే TV9 లాంటి న్యూస్ ఛానల్స్ కన్నా మంచి కామెడీ ఛానల్స్ ఇంకా వున్నాయన్నమాట!

  రిప్లయితొలగించండి
 6. ఈ టీవీ వాళ్ళు కోస్తా సీమల వాళ్ళు కిచ్చే ట్రీట్మెంట్ చూస్తే వాళ్ళు పిలవగానే ఎందుకు వెళతారా అనిపిస్తుంది అందరు కలిసి boycot చేయచ్చు కదా .

  రిప్లయితొలగించండి
 7. సినిమాలలో తెలంగాణావాళ్ళని గూండాలుగా చూపించడం మాత్రం చవకబారుతనం కాదా? తెలంగాణా బాష - ఆంధ్ర బాష ఒకటేనా? - ఈ లింక్ చదవండి

  రిప్లయితొలగించండి
 8. ఇక్కడ మాట్లాడిన టాపిక్ కాకుండా యేవో లింక్ లు ఇచ్చి టాపిక్ పక్క దారి పట్టిస్తునారు ప్రవీణ్ కమ్మ్యునికేషన్స్ గారు, చేతనైతే ఘంట చక్రపాణి గురించి రాసిన వ్యాసం లో అయన గురించిమాట్లాడండి .

  సినిమాల గురించి సినిమాలో భాష కి సంబంధించిన వ్యాసం లో మాట్లాడుకోవచ్చు.

  @ చదువరి గారు సదరు చక్రపాణి ఎందుకూ పనికి రాని వ్యక్తి. ప్రాంతీయ విద్వేషాలు నింపుకున్న ఇతగాడు విశ్లేషకుడు ఎలా అయ్యాడో నాకు అర్ధం కాదు

  రిప్లయితొలగించండి
 9. తనకు తాను గొప్ప విశ్లేషకుడనని ఘంటా చక్రపాణి ఫీల్ అవుతుంటాడు. ఒకసారి చర్చ లో TRS తో పొత్తు పెట్టుకున్నప్పుడు తెలీదా ఆంధ్ర, రాయలసీమ ప్రాంత నాయకులకి తెలంగాణ ఇవ్వాలని.. ఇప్పుడు ఆందోళనలు చెయ్యటం ఏంటని.. అప్పుడు తెలెకపల్లి రవి గారు వేసిన ప్రశ్న తో అతని దిమ్మ తిరిగింది... మరి TRS సమైక్య రాష్ట్ర విధానం ప్రకటిచ్చిన CPM ఉన్న మహాకూటమి లో ఎందుకు చేరిందని? ఎన్నికల లబ్ది కోసం TRS వేసిన ఎత్తే మిగిలిన పార్టీలు కూడా వేశాయి. ఈ ప్రశ్న కి KCR గారి వివరణ చాలా కామెడీ గా ఉంటుంది. తమ పొత్తు కేవలం రాష్ట్రం వరికే పరిమితం అని.. అలాంటప్పుడు బెంగుళూరు లో జరిగిన 3rd front ర్యాలీ కి ఎందుకు హాజరు అయినట్లో చెప్పటానికి సమాధానం లేదు. పోని రాష్ట్రం వరకే పరిమితమైతే MP సీట్లలో కలిసి పోటీ చేయకూడదు. అయినా 100 రోజుల్లో తెలంగాణ ఇస్తామన్న బీజేపీ తో పొత్తు పెట్టుకోకుండా మహాకూటమి లో ఎందుకు చేరారు అనే ప్రశ్న కి కూడా చక్రపాణి దగ్గర సమాధానం లేదు.
  దురదృష్టం ఏంటంటే KCR, హరీష్ రావు, ఇతర తెలంగాణ నేతలు TVల ముందు బాగా మాట్లాడగలరు. ఎన్ని వెధవ పనులు చేసిన కప్పిపుచ్చుకోగలరు.. పైగా అంతటికి కారణం ఆంధ్రవాళ్ళే అని కధలు అల్లగలరు. వారికి ధీటుగా నీళ్ళు నమలకుండా సమాధానం చెప్పగలిగిన వాళ్ళు ఇటుప్రక్క లేరు. వైయస్ ఉన్నన్ని రోజులు అధికారిక గణాంకాలతో వీళ్ళ నోరు మూయించగలిగే వాడు. ఇప్పుడు అతను లేని లోటు సుస్పష్టం. బాబు కి ఆ సత్తా లేదు. :((

  రిప్లయితొలగించండి
 10. venkata ramana garu meeru ane maatalu same to same naku ade anipinchi asalu news channel ni choodatam maanesanu.....nijamga e godavalaki news channel paatra kooda chalane undi....prati chinna vishayalani(trp ratings ni penchevi) aite kaneesam oka padi sarlu(hourly news peruto) cheppinde different ga cheppi mari chiraku teppistaru....general ga aite etv lo vache 9.oopm news, papers matrame chaduvuta...kani e godava modalu aina tarvata news24*7 channels choose sariki artham ayyindi nenu ippati varaku enta manchi chesana ani(choodakunda undatam).....veelu chese public property destruction ni daani valla mukhyanga saamanyulu pade kastalani oka padi sarlu veyamanandi....kaneesam chese vallu aina aalochistaru entha nastam kaligincharo ani.....adi kaka ee godava valla aina nastam kaneesam oka pedda area ne bagu cheyavachu.....malli vidipovatam gurinchi matladite entha karchuto koodukunnadi....kaneesam konni vela kotlu ayye chances unnai...dani badulu ide godavani govt. valla areas ni cheyamani malliste entha laabam valla area bagupadutundi andaram kalisi undatam jarugutundi.....okati matram cheppagalanu vidipote oka manishi ki identity kolpoye pramadham undi.....elagantara husband west godavari vadu anukunnam wife karimnagar native place anukundam...puttina pillavadu kurnool lo perigadu anukunte vadu e area vadu avutado cheppandi...ippudu rastram vidipote repu vadu e rastram vadu avutado meere telchandi ani verpatu vadulanu adugutunanu.............

  రిప్లయితొలగించండి
 11. @టీవీలవాళ్ళకు ఘంటా చక్రపాణి అనే నిలయ విద్వాంసుడి లాంటి విశ్లేషకు డొకాయనున్నాడు...చదువరిగారు, మీరు "విదూషకుడు"అని రాయబొయి విద్వాంసుడు అని రాసారు. దయచేసి ఇలాంటి చవకబారు వ్యక్తులగురించి రాయవద్దు.మీ స్థాయి మీ బ్లాగ్ స్థాయి తగ్గే ప్రమాదముంది. మీ విశ్లేషణలు చక్కగా ఉన్నాయి. అభినందనలు :)

  రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు