27, డిసెంబర్ 2009, ఆదివారం

తెలంగాణవాదుల దొంగ లెక్కలు

ఎప్పుడో ఐదారు దశాబ్దాల కిందట.. పోలీసు చర్య తరవాత హైదరాబాదు రాష్ట్రం ఏర్పడింది. ఆ తరవాత ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. రెండు రాష్ట్రాలూ కలిసి ఒకే రాష్త్రంగా ఏర్పడాలని పెద్దలు కోరుకున్నారు. హైదరాబాదు రాష్ట్ర శాసనసభ మెజారిటీతో ఈ ప్రతిపాదనను ఆమోదించింది. ఆ విధంగా ఏకమయ్యాక, తెలంగాణకు అనేక అన్యాయాలు జరిగాయనే ఉద్దేశంతో, విడిపోవాలనే ఉద్యమం మొదలెట్టారు, తెలంగాణవాదులు. 1969లో పెద్ద ఉద్యమమే చేసారు. అప్పటికి ఆ ఉద్యమం చల్లారిపోయింది. ఆ తరవాత, ఈ నలభై యేళ్ళలోనూ అనేక మార్పులొచ్చాయి, అభివృద్ధి జరిగింది. అయితే విడిపోవాలనే తెలంగాణవాది కోరిక అలాగే ఉండిపోయింది. తెలంగాణవాదుల కసి ('ఆంద్రోళ్ళు' అభివృద్ధి చెందారు, మేం చెందలేదు అనే కసి), కాంక్ష (పదవీ కాంక్ష) అలాగే ఉండిపోయాయి. కానీ ఈ కారణాలను బైటకు చెప్పుకోలేరు. అంచేత అభివృద్ధి జరగలేదని చెబుతూ రకరకాలుగా అబద్ధాలు వ్యాప్తి చేస్తున్నారు. చేస్తూ, ప్రత్యేకరాష్ట్ర ఉద్యమం చేస్తున్నారు.


సాగునీటి వసతులు, పంటల విస్తీర్ణంలో తెలంగాణ వాళ్ళ దొంగ కబుర్లెలాంటివో నా గత టపాలో రాసాను. ఇక్కడ ఇంకొన్ని దొంగ కబుర్ల సంగతి చూద్దాం. ఈ మధ్య ఒక వెబ్‌సైటులో ప్రభుత్వోద్యోగుల గురించిన ఒక దొంగ లెక్క చూసాను. అందులో ఇలా రాసారు..

మొత్తం ప్రభుత్వోద్యోగులు – కోస్తా+సీమ (13 జిల్లాలు) 9 లక్షలు, తెలంగాణ (10 జిల్లాలు) 3 లక్షలు. తెలంగాణలోని ప్రభుత్వోద్యోగుల సంఖ్య కోస్తా సీమలతో పోలిస్తే మూడోవంతు మాత్రమే ఉన్నారంట! అబద్ధాలు చెప్పినా కాస్తో కూస్తో నమ్మేట్టుండాలి. ఈ లెక్కలను చిన్నపిల్లలు కూడా నమ్మరు. ఇలాంటి దొంగ లెక్కలు చెప్పి సానుభూతి కొట్టెయ్యాలని చూస్తూంటారీ తెలంగాణవాదులు. అసలు లెక్కలు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది: సీమ+కోస్తాలో ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య:684083 తెలంగాణలో:614971. చూసారా తేడా ఎంతలా ఉందో! ఇవి 2006 వ సంవత్సరంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక లెక్కలు.

ఈ అబద్ధాలు చెప్పడంలో వీళ్ళు ఒక టెక్నిక్ వాడుతూంటారు.. అదేంటంటే, తమకు అనుకూలంగా ఉందనుకుంటే హైదరాబాదును లెక్కలోకి వేసుకుంటారు లేదంటే తీసేస్తారు. తెలంగాణ పది జిల్లాలోను గణాంకాలు ఇలా ఉన్నాయి అని అంటారు. పది జిల్లాల గురించి మాట్టాడుతున్నారుగదా, హైదరాబాదును కూడా కలిపే ఉంటార్లే అని అనుకుంటాం మనం. కానీ అబద్ధాలు చెప్పడంలో చెయ్యి తిరిగిన తెలంగాణావాది సామాన్యుడనుకుంటున్నారా? ఉదాహరణకు ప్రభుత్వ గ్రంథాలయాల గురించిన లెక్క ఇలా చెబుతారు:
ప్రభుత్వ గ్రంథాలయాల సంఖ్య – కోస్తా (9 జిల్లాలు) 630, రాయలసీమ (4 జిల్లాలు) 243, తెలంగాణ (10 జిల్లాలు) 450.
తెలంగాణ 10 జిల్లాల్లోని గ్రంథాలయాల లెక్క అంటే.., హైదరాబాదును కూడా కలిపేసి ఉంటారు లెమ్మనుకుంటాం. కానీ పైలెక్కలో హై.లోని గ్రంథాలయాల లెక్క కలపలేదు. అది కలిపితే తెలంగాణ గ్రంథాలయాల సంఖ్య 562 అవుతుంది. మొత్తం గ్రంథాలయాల సంఖ్యలో 61 శాతం కోస్తా సీమల్లో ఉంటే 39 శాతం తెలంగాణలో ఉన్నాయి. ఈ గణాంకాలు కేవలం శాఖా గ్రంథాలయాల లెక్క మాత్రమే. అన్ని రకాల గ్రంథాలయాలను లెక్కలోకి తీసుకుంటే 60శాతం కోస్తా సీమల్లో ఉంటే, 40 శాతం తెలంగాణలో ఉన్నాయి. రెండు ప్రాంతాల భౌగోళిక నిష్పత్తితో సమానం.

ఇక జిల్లాల వెనకబాటుతనం చూద్దాం: తెలంగాణలోని మహబూబ్‌నగరు, నల్గొండ జిల్లాలు తప్పించి ఇతర జిల్లాలను పోల్చి చూడండి. మిగతా ప్రాంతంలోని అభివృద్ధి చెందిన జిల్లాలతో పోల్చదగిన అభివృద్ధి ఈ జిల్లాల్లో జరిగిందనేది వాస్తవం. రెండు ప్రాంతాల్లోని వరి ఉత్పత్తి గణాంకాల సంగతే చూడండి:
రాష్ట్రంలో జరిగే మొత్తం వరి ఉత్పత్తిలో కోస్తా+సీమల శాతం: 62
తెలంగాణ శాతం: 38. ఇది భౌగోళిక విస్తీర్ణాల ఉత్పత్తికి సమానం. (హైదరాబాదు జిల్లాలో వరి ఉత్పత్తి సున్నా అని గుర్తుంచుకోవాలి.

కింది పట్టికలో తెలంగాణ జిల్లాల్లోని వరి ఉత్పత్తిని, కోస్తా సీమ ప్రాంతాల్లోని వెనకబడ్డ జిల్లాల ఉత్పత్తితో పోల్చి చూపించాను.
2005-06లో కోస్తా, సీమల్లోని కొన్ని జిల్లాల్లో వరి ఉత్పత్తి ఇలా ఉంది: (టన్నుల్లో)
 1. శ్రీకాకుళం; 281,000
 2. విజయనగరం: 141,000
 3. విశాఖపట్నం: 132,000
 4. అనంతపురం: 125,000
 5. కడప: 142,000
 6. చిత్తూరు: 231,000
పై జిల్లాల్లో ఏ ఒక్క జిల్లా కూడా తెలంగాణ జిల్లాల వరి ఉత్పత్తికి సరిరాదు!

కేవలం ఉభయగోదావరులు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం నెల్లూరు, కర్నూలు జిల్లాలు మాత్రమే తెలంగాణ జిల్లాల్లో ఏదో ఒకదానికంటే ముందంజలో ఉన్నాయి.

తెలంగాణ ప్రాంతంలోని అన్ని జిల్లాల్లో ఉత్పత్తి ఇలా ఉంది: (టన్నుల్లో)
 1. నిజామాబాదు: 506,000
 2. కరీంనగరు: 913,000
 3. మెదక్: 248,000
 4. వరంగల్లు: 646,000
 5. ఖమ్మం: 531,000
 6. మహబూబ్‌నగరు: 320,000
 7. నల్లగొండ: 939,000
హైదరాబాదు జిల్లా పూర్తిగాను, రంగారెడ్డి జిల్లా చాలావరకు పట్టణీకరణం చెందిందని అక్కడ వ్యవసాయం దాదాపుగా లేదన్న సంగతిని మనం గుర్తుంచుకోవాలి.

"ఆంధ్ర ప్రదేశ్ లోని అత్యంత వెనకబడ్డ మహబూబ్‌నగరు జిల్లాలో 4% తెల్ల కార్డులిచ్చారు. అన్నిటికంటే అభివృద్ధి చెందిన పశ్చిమ గోదావరి జిల్లాలో 7% కార్డులిచ్చారు" అని తెలంగాణవాదులు తమ వెబ్‌సైటులో చెప్పుకున్నారు. అదెంత నిజమో చూద్దాం. 2005-06 లో ప్రభుత్వం పంచిన రేషను బియ్యం వివరాలు ఇలా ఉన్నాయి: మహబూబ్ నగరు: 1,33,796.505 టన్నులు. పశ్చిమ గోదావరి: 1,26,160.655 టన్నులు.అనంతపురం తరవాత మహబూబ్‌నగర్లోనే ఎక్కువ బియ్యాన్ని పంచారు. కార్డుల శాతాల్లో తెలంగాణవాదులు చెప్పిన తేడా నిజంగా ఉంటే, బియ్యం పంపిణీలో ఈ తేడా ఎలా వస్తుంది? ఈ లెక్కలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసినవి. తెలంగాణవాదులు తమ దొంగలెక్కలను ఎక్కడి నుంచి పట్టుకొచ్చారో తెలవదు మరి.

తెలంగాణ ముఖ్యమంత్రుల మొత్తం పదవీకాలం ఆరేళ్ళని రాసారు. కానీ అది దాదాపు తొమ్మిదేళ్ళు. చేతకానివాడు ఆరేళ్ళున్నా తొమ్మిదేళ్ళున్నా ఒకటేననుకోండి. తమ ప్రజాప్రతినిధుల చేతకానితనానికి తమను తాము నిందించుకోక, 'ఆంద్రోళ్ళ'ను నిందించడం తెలంగాణవాదులకు సహజనైజంగా మారింది.

లేనిపోని కట్టుకథలు చెప్పి, వాటన్నిటికీ కారణం 'ఆంద్రోళ్ళే' నని చెప్పడం తెలంగాణ వాదులకు అలవాటైపోయింది. కాబట్టి తెలంగాణవాదులు చెప్పే అంకెల్లోని నిజాలను గమనిస్తూ ఉండాలి.
----------------------------------------

తాజాకలం: రాష్ట్ర ప్రభుత్వ అధికారిక గణాంకాల కోసం ఈ లింకు చూడండి.

satya ఇచ్చిన లింకులు:
 • 610 GO: http://go610.ap.gov.in/
 • 6 సూత్రాల ఒప్పందం: http://www.aponline.gov.in/Apportal/HomePageLinks/PresidentialOrder/Presidential_Order.pdf
 • జలాశయాల వివరాలు: http://irrigation.cgg.gov.in/reservoirssms/
 • నీటిపారుదల ప్రాజెక్టులు: http://www.irrigation.ap.gov.in/ దీని ప్రకారం కొత్త ఆయకట్టు వివరాలు:
  • ఆంధ్ర: 477646
  • తెలంగాణ: 476479
  • రాయలసీమ: 57768
 • జలయజ్ఞం: http://www.irrigation.ap.gov.in/

42 కామెంట్‌లు:

 1. కోనసీమలో పండేది దాల్వా వరి. అది తెలంగాణాలో పండే వరి కంటే చాలా ఖరీదైనది. తెలంగాణా వరి ఉత్పత్తికీ, కోస్తా ఆంధ్ర వరి ఉత్పత్తికీ పోలికేమిటి?

  రిప్లయితొలగించండి
 2. మీ వరిలెక్క వక్రీకరణ బాగుంది.
  అయినా కోస్తా ఎప్పుడో వ్యాపారపంటలపరమైతే వరిలెక్కేమిటండీ బాబూ!!!

  రిప్లయితొలగించండి
 3. లెక్కలు బాగున్నాయి.
  ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన లెక్కల కోసం ఎదురు చూస్తున్నాము.

  రిప్లయితొలగించండి
 4. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలలో జనుము కూడా పండుతుంది. ఆ జిల్లాలవాళ్ళు వేసవిలో జనుము పంట వేస్తారు కానీ వరి వెయ్యరు. అందుకే అక్కడ వరి ఉత్పత్తి తక్కువగా కనిపిస్తుంది. దేశంలో బీహార్ తరువాత జనుము ఎక్కువగా ఉత్పత్తి అయ్యేది శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలలోనే. శ్రీకాకుళం జిల్లా పలాస, సోంపేట ప్రాంతాలలోనూ, తూర్పు గోదావరి జిల్లా తుని, కరవాక ప్రాంతాలలోనూ, ప్రకాశం జిల్లా వేటపాలెం, చిన్న గంజాం ప్రాంతాలలోనూ జీడి పంట కూడా పండుతుంది. దేశంలో కేరళ తరువాత జీడి ఎక్కువగా ఉత్పత్తి అయ్యేది శ్రీకాకుళం జిల్లాలోనే. వేరే వాణిజ్య పంటల లెక్కలు సంగతి ఏమిటి? కేవలం వరి లెక్కలు ద్వారా తెలంగాణా అభివృద్ధి చెందింది అనడం వ్యవసాయం పై ఏమాత్రం అవగాహన లేకపోవడమే.

  రిప్లయితొలగించండి
 5. అన్నా! మంచి సమాచారం ఇచ్చావు. ఈ విధంగ మీడియాలో తెలబాన్ల దొంగ ప్రచారాన్ని ఎండగట్టే సమైక్యవాద మేధావులు ఎవ్వరూ లేకపోవటం మన దౌర్భాగ్యం. ఉన్నాకూడా ముదనష్టపు చానెళ్ళు వారికి అవకాశం ఇవ్వరు. ఎంతసేపూ జయశంకర్,కోదండరామ్,హరగోపాల్, చక్రపాణి, వేణుగోపాల్,నాగేశ్వర్, గద్దర్ ,రామయ్య .. వీళ్ళె కనిపిస్తారు. కొంతవరకు ఉండవల్లి తప్ప పక్కా dataతో మాట్లాడే ఆంద్ర్హ నాయకులు కూడా లేరు. అదే తెలంగానా వాదనను కేసీఆర్,కేటీ ఆర్, హరీశ్ చాలా ప్రభావవంతంగా నిజంగా నిజం అనిపించేలా వినిపిస్తున్నారు.

  రిప్లయితొలగించండి
 6. మీరు పల్లెటూరు ఎన్నడూ వెళ్ళని సిటీ బాయ్స్ లాగ మాట్లాడుతున్నారు. వాణిజ్య పంటలు గురించి మాట్లాడకుండా కేవలం వరి పంట గురించి మాట్లాడి తెలంగాణా అభివృద్ధి చెందింది అనడం ఓ కథలో టీచర్ ఏది అడిగినా స్టూడెంట్ ఆవు వ్యాసం చెప్పడం లాంటిదే.

  రిప్లయితొలగించండి
 7. ఈ లెక్కల కోసం నేను ఎప్పటినుండో ఎదురు చూస్తున్నాను, ఎవరు బట్టబయలు చేస్తారా అని. అవకాశవాదులు చెప్పే తప్పుడు లెక్కల ప్రభావానికి గురికాకుండా విచక్షణతో ఆలోచించి తమకు కావలసింది ప్రత్యేక రాష్ట్రం కాదనీ సరిఅయిన నాయకత్వమనీ గుర్తించి ముందుకు వెళ్తారని ఆశిద్దాం.

  రిప్లయితొలగించండి
 8. చదువరి గారూ..
  మీరిచ్చిన సమాచారం తో పాటూ ఆ source సంభందించిన లింకులు కూడా ఇస్తే బాగుంటుంది..

  మహేష్ గారు,
  వక్రీకరణ అని మీరెల చెప్పగలరు? ఇంకొంచెం వివరిస్తే బాగుంటుందేమో!!

  రిప్లయితొలగించండి
 9. కోస్తా ఆంధ్రవాదుల లెక్కలు ఎలా ఉన్నాయంటే ఒక అబద్దాన్ని నమ్మాలంటే పది నిజాలు కావాలని మరచిపోవాలి అన్నట్టు. కోస్తా ఆంధ్రలో కూడా వరి అన్నం కాకుండా చోడి పిండి అంబలి తినే పల్లెటూరివాళ్ళు ఉన్నారు. కేవలం వరి పంట లెక్కలు చూపించి తెలంగాణా అభివృద్ధి చెందింది అనడం అవగాహన రాహిత్యమే అవుతుంది. ఖరీదైన దాల్వా వరి పండే కోనసీమలో కూడా చోడి పిండి అంబలి తింటారు. రాష్ట్రమంతా ప్రజలు ఒకే రకం ఆహారం తింటారన్నట్టు కేవలం వరి పంట లెక్కలు చూపించి వరి పంట ద్వారా మాత్రమే వ్యవసాయ రంగం అభివృద్ధి చెందుతుంది అనడం హాస్యాస్పదం. కోనసీమలో వాణిజ్య పంటలైన కొబ్బరి, అరటి కూడా పండుతాయి. తెలంగాణాలో పత్తి, పొద్దు తిరుగుడు లాంటి వాణిజ్య పంటలు కూడా పండుతాయి. ఇక్కడ కేవలం వరి పంట గురించి మాట్లాడి వరి పంట అభివృద్ధే వ్యవసాయ అభివృద్ధి అనుకోవడం అమాయకత్వమే అవుతుంది.

  రిప్లయితొలగించండి
 10. ప్రవీణ్, మీ కోటా అయిపోయింది. ఇప్పటికే సంబంధం లేని వ్యాఖ్యలు చాలా రాసేసారు, ఇహనాపండి.

  రిప్లయితొలగించండి
 11. బాబూ అశ్లీల కథాంశ డిండిమ,
  నీతో ఇక్కడ ఎవరూ మాట్లాడట్లేదు.. నువ్వు నీ కామెంట్లు రాసుకోవడానికి ఇంకేదైనా బ్లాగు చూసుకో!!

  రిప్లయితొలగించండి
 12. నువ్వెన్ని(మీరెన్ని) లెక్కలు చూపినా మేం ఇనం.మా దగ్గర కొన్ని పదాలున్నాయి, అన్యాయం జరిగింది,దోచుకున్నారు,మేం అవే అంటాం.టివిలలో అవే వింటాం.మీరూ అవే ఇనాల అనాల,లెక్కలు తీయకండి.

  రిప్లయితొలగించండి
 13. మొన్న ఓలంకె పట్టుకుని ఆంధ్ర వలసవాదుల పాలనలో తెలంగాణా దుస్థితి అన్న పుస్తకం చదవడం మొదలెట్టా. అది చదివితే తెలంగాణా అసలు పరిస్థితి తెలుస్తుందంటే నమ్మి టైటిల్ నెగిటివ్ గా ఉన్నా కూడా సంపూర్ణ నిజాయితీతో చదవా. కానీ చదువుకున్నవాళ్ళు కూడా తెలుగుప్రజలని విడదీయడానికి కంకణం కట్టుకున్నట్లుగా ఉన్నవీ లేనివీ ఆవేశకావేశాలని రెచ్చగొట్టే ఉద్దేశ్యంతో రాసినట్లుగా ఉందికానీ నిజానిజాలని ప్రజలకి చెప్పాలన్న చిత్తశుధ్దిలేదు. తెలంగాణా చారిత్రిక నేపధ్యం వేరు. అలాంటి నేపధ్యంవల్ల సహజంగాఅభివృధ్ధి నెమ్మదిగా వస్తుంది. తీరప్రాంతాలు, నదీ పరివాహక ప్రాంతాలూ అభివృధ్ధిలో ఏదేశంలోనైనా ముందుంటాయి. వాటిసమస్యలు వేరేరకంగా ఉంటాయి. పోలికతెచ్చుకుని అవతలివారిని శత్రువులుగా చూడడంకన్నా మితృలుగా భావించి పరస్పరపూరకాలుగా ముందుకెళ్ళచ్చు. సమైక్యంగా ఉందామని ఎవరైనా అంటే బూతుగాభావించి గూండాలతో కొట్టించి మరీ వెనకబడ్డామని టాంటాం చేయక్కర్లేదనుకుంటా.

  రిప్లయితొలగించండి
 14. ఇంత సోది ఎందుకు చెప్పు.... మాకు స్వపరిపాలన కావాలి అంటున్నం... ఇప్పుడు A-Z దాకా పోయే ఓపిక మాకు లేదు.. ఏదో ఒకటి రెండు విషయాలు చెప్పి కన్వీన్స్ చేయలేవు.. ఇది ఆత్మ గౌరవ పోరాటం..మరియు స్వపరిపాలన పోరాటం... ప్రవీన్ అనేటాయన ఏవో లాజికల్ చెప్తుండు కదా.. వాటికి సమాధానం ఇవ్వు.. అంతే కానీ... కోటా ఐందని అన్నవ్... మరీ మీ ఇంటికొచ్చిన వాడిని ఇలా అవమానించటం చదువరు లు చేసే పని కాదు.... నీకు బాగా బలుపు... బలుపరి..

  రిప్లయితొలగించండి
 15. రాజా వారికి స్వపరిపాలన కావాలంట. మరి అలాంటప్పుడు ఏకంగా ప్రత్యేక దేశం కోసమే ఉద్యమిస్తే ఒకే దెబ్బకు రెండు పిట్టలు రాలతాయికదా! ఎలాగూ వారికి ఓపిక లేదంటున్నారు కాబట్టి మళ్ళీ మళ్ళీ కష్టపడేబదులు ఏకంగా వేర్పాటు దేశమే ఏర్పాటు చేస్తే వాళ్ళకూ శ్రమ తగ్గుతుంది కాదూ.

  రిప్లయితొలగించండి
 16. Sharath నీ ఆలోచన ఏదో బాగానే ఉంది... మీ సహాయం ఉంటుందా మరి.. ఏదో PCC అధ్యక్ష పదవో ఇంకొటో ఇస్తాము లెండి.. ఐనా దెశం ఐతే లేని పోని తలనొప్పులు... రాష్ట్రం ఐతే ఏడవడానికి ఢిల్లీ ఒకటి ఉంటది కదా...

  రిప్లయితొలగించండి
 17. @ రాజా
  పి సి సి అధ్యక్ష పదవి? అబ్బే, లాభం లేదండి. కనీస మాత్రం రాజ్ భవన్ కావాలి నాకు. మీకు ఆమాత్రం ఇప్పించగలిగే పరపతి వుంటే చూద్దురూ.

  రిప్లయితొలగించండి
 18. Raja: నీ తెలంగాణా ఏడుపు సోది ఆపితే నా సోదీ ఆగిపోతుంది. ఆత్మగౌరవం అవతలోడి మీదబడి ఏడవడంలో లేదు, అత్మవిశ్వాసంలో ఉంది. నువ్వు పెద్దవాడివి కావాలంటే నీ చుట్టూ ఉన్నవాళ్ళంతా చిన్నవాళ్ళైపోతే చాలనుకునే చేతకాని మనస్తత్వం నుంచి నువ్వు బయటపడాలి.

  "ఏదో ఒకటి రెండు విషయాలు చెప్పి కన్వీన్స్ చేయలేవు" - మీ వెబ్‌సైట్లలో ఉండే వందలాది అబద్ధాలు చెప్పి కన్విన్సు చెయ్యలేరని చెబుతున్నాను, అది తెలుసుకో!

  ఇక నువ్వు నన్ను తిట్టిన సంగతి.. ఈ తెలంగాణావాది మనస్తత్వం నుంచి నువ్వు బైటికి వస్తే తెలంగాణ సంగతెలా ఉన్నా నీకు వ్యక్తిగతంగా మంచిది. ఈ మనస్తత్వం ఉన్నవాళ్ళు ఈ లోకం తమపై కుట్ర చేసిందంటూ పళ్ళు నూరుతూ తిరుగుతూంటారు. పళ్ళు అరిగిపోడం తప్పించి ప్రయోజనమేమీ ఉండదు. అంచేత స్వపరిపాలన లాంటి తెలివితక్కువ నినాదాలను పక్కనబెట్టి వాస్తవాన్ని చూడు.

  రిప్లయితొలగించండి
 19. చదువరి గారికి అభినందనలతో...మరికొన్ని నిజాలు ...

  వరి పంటకే అన్నిటికన్నా ఎక్కువ నీళ్ళు కావాలి. ఈ విషయం గమనించగలరు. వరి పండుతుందంటే వర్షాలు బాగా పడుతున్నాయి లేదా నది - కాల్వ వ్యవసాయం లేదా చెరువులు బాగా ఉన్నాయి లేదా భూగర్భ జలాలు వినియోగం జరుగుతున్నది(electricity available). మిగతా విషయాలు మీరే ఆలోచించుకోండి.

  "పెట్టుబడి పెట్టేది వాళ్ళ స్వలాభానికే" - అవును ఎవడయినా పెట్టుబడిపెట్టేది నాలుగు డబ్బులు సంపాదిన్చుకోనేన్దుకే, కాని వాటివల్లే అందరికి ఏమి లాభాలు లేవా? ఉద్యోగాలు, మనీ circulation and overall economy development.

  ఆంధ్ర కార్పోరేట్ కళాశాలలు తెలెంగాణా ను దోచుకున్టున్నై ....- అవన్నీ పెట్టిన తరువాతే కదా , AIEEE , IIT లలో సగం మంది తెలుగోళ్ళు ఆక్రమించింది! ( reason may be because they are competitors for one person in Hyderabad )

  రిప్లయితొలగించండి
 20. @ చదువరి : బాగున్నాయండి మీ లెక్కలు.
  "తమ ప్రజాప్రతినిధుల చేతకానితనానికి తమను తాము నిందించుకోక, 'ఆంద్రోళ్ళ'ను నిందించడం తెలంగాణవాదులకు సహజనైజంగా మారింది" నిజమే
  @ ప్రవీణ్ : "కోస్తా ఆంధ్ర వరి ఉత్పత్తికీ పోలికేమిటి?"
  ఒకే తల్లి పిల్లలు అందరూ ఒకేలా ఉండరు, ఒకడు బాగా చదువు కుంటాడు. మరొకడు చదువుకోడు. చాలా చాలా వ్యత్యాసాలు ఉంటాయ్.
  ఆంధ్రోల్లకి ఓడ రేవు ఉంది మాకు లేదు ఆంటే గెట్లుంటది అన్నా, గర్ధం చేస్కోవాలే.
  విడి పోదాం అనుకున్నప్పుడు విడి పోవడమే, అంతే కానీ "నాలుక కోస్తా, ఆంధ్రోల్లను తరిమి కొడతా , మా తెలంగానా ప్రజలు ఊరుకోరు" అని రెచ్చకొట్టే మూర్ఖులను ఊరుకోరు ప్రజలు.
  @ వేణు శ్రీకాంత్ : కరెక్టు చెప్పారు. " తమకు కావలసింది ప్రత్యేక రాష్ట్రం కాదనీ సరిఅయిన నాయకత్వమనీ గుర్తించి ముందుకు వెళ్తారని ఆశిద్దాం."
  @ రాజా : "మాకు స్వపరిపాలన కావాలి అంటున్నం" అన్నారుగా , నేను కూడా ఆడోళ్ళకు కూడా స్వపరిపాలన గావాలి గంటారు గిస్తామా ?
  గైతే నా బ్లాగ్ జూడరాదే జరా ఆడవారందరికీ ప్రత్యెక రాష్ట్రం కావాలి
  @ శరత్ : ఇది ప్రత్యెక రాష్ట్రం అయిన తర్వాత సౌత్ పాకిస్తాన్ అయిపోతుంది , అందుకని కొన్ని మతాల పెద్దలు సప్పుడు చెయ్యట్లేదు

  రిప్లయితొలగించండి
 21. అద్భుతమైన టపా.

  నిన్న ఏదో టీవీలో జేపీ గారు మాట్లాడుతూ, ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు సమస్యను ఏ రకంగానూ తీర్చదని వివరణాత్మకంగా చెప్పారు. మీ ఈ టపా, ఈ నిజాన్ని లెక్కలతో సహా నిరూపిస్తున్నది.

  రిప్లయితొలగించండి
 22. మొన్నెప్పుడో పెద్ద వ్యాఖ్య రాసాను గురువు గారూ, ఏమయిదో తెలీదు పబ్లిష్ అవ్వలా!!

  "పోతే ప్రత్యేక తెలంగాణ సౌత్ పాకిస్తాన్ అయిపోవడం గురించి నాకంత భయాలు లేవు కాని, కొత్తగా ఏర్పడిన చిన్న రాష్ట్రం, చాలా వరకు నక్సలైట్ల చేతుల్లోకి వెళ్ళిపోతుందన్న భయాలు మాత్రం చాలా ఉంది నాకూ.

  ఇప్పుడు వరంగల్ లాంటి జిల్లాల్లో మేము కొంచెం ప్రశాంతంగా(రిలేటివ్) బతుకుతున్నం, అది మళ్ళీ పూర్వపు స్థాయికి పోతుందన్నది నా అనుభవం లోంచి వచ్చిన అభిప్రాయం.

  ప్రత్యేక రాష్ట్రం లాంటి పెద్ద నిర్ణయాలు తీసుకునేప్పుడు హ్రస్వ దృష్టి పనికి రాదేమో.

  పరిస్థితి మెరుగుపరిచేందుకు ఆంధ్ర నాయకులే, తెలంగాణ పీపుల్ హార్ట్స్ అండ్ మైండ్స్ విన్ అయ్యే ప్రపోజల్ తో చిత్త శుద్దిగా ముందుకొచ్చి, ఈ ప్రాంత అభ్యున్నతి కోసం పాటు పడాలి. ఆ స్థానం ఎంప్టీ గా గా ఉంది. ఎవరైనా పొలిటికల్ ఐ క్యూ(మహాత్ముడి లాగా) ఎక్కువున్న వున్న వాళ్ళకిది చాలా మంచి అవకాశం. That would pay off big time and take them long way in AP politics and may be on the national stage too.

  I think Wareen Buffet once said, "you won't know who is swimming naked until the tide goes away". Today every political party has been caught naked on it's pretense of separate state.

  రిప్లయితొలగించండి
 23. చదువరి గారు మీరిచ్చిన ప్రభుత్వ ఉద్యోగుల లెక్కలు బాగానే ఉన్నాయి. కాని తెలంగాణ లెక్కలుచెప్పారే అందులో హైదరాబాద్ లో పనిచేసే సీమాంధ్రా ఉద్యోగుల లెక్కలు కూడా విదడీసీ చెబితే అప్పుడు తెలిసేది, రాష్ట్ర సచివాలయంలో ఎవరి నిష్పతి ఎంతొ అర్ధమయూండెధి.హైదరాబాద్లో ఉన్న సీమాంధ్రా ఉద్యోగుల లెక్కలు కూడ కలిపి తెలంగాణ లొనిఉద్యోగులలెక్క అని చెబితేనమ్మటానికి అమాయకులం కాదు.ఐన గిర్గ్లాని కమిషన్ ఏనాడో చెపింది వారిచ్చిన నివేధికలో హైదరాబాద్ లో పనిచేస్తున్న ఉద్యోగుల(సీమాంధ్రులు) తప్పుడు నివాస ద్రువీకరణ పత్రాలు సమార్పించారని పెర్కొన్నారు .కాబట్టి ఇంకా లోతుగా పరిశీలించాల్సిన అవసరము ఉందనీ , అదిచేస్తే దిగ్బ్రాంతి కలిగించే నిజాలు బట్టబయలవుతుందని పేర్కొనడం జరిగింది. కాబట్టి పైకి కనిపించేవే నిజాలని తొందరపడవొద్దు.ఏదయినా నిశితంగా పరిశీలించాలి.

  రిప్లయితొలగించండి
 24. Raj: తెలంగాణలో ఎన్ని ఉద్యోగాలున్నాయో చెప్పే అంకెలే కానీ, ఆయా ఉద్యోగాల్లో ఏయే ప్రాంతం వాళ్ళు ఎంతమంది ఉన్నారో చెప్పే లెక్కలు కావవి. గమనించగలరు.

  (పోతే తెలంగాణ వాళ్ళ ఉద్యోగాలను ఇతర ప్రాంతాల వాళ్ళు ఆక్రమించారనే విషయానికి సంబంధించి అనేక లెక్కలున్నాయి. గిర్‌గ్లానీ, 610,.. లాంటి అనేక రకాల లెక్కలు 2900 నుండి 58,000 దాకా మారుతూంటాయి. అత్యధిక సంఖ్య - 58,000 నే పరిగణించినా, తెలంగాణవాళ్ళే చేస్తున్న తెలంగాణ ఉద్యోగాల సంఖ్య: 614971 - 58000 = 556971. కానీ ఆ మూడులక్షల సంఖ్య ఎక్కడనుండి పట్టుకొచ్చారు సార్?)

  రిప్లయితొలగించండి
 25. రైల్వేలో మన రాష్ట్రానికి ఎప్పుడూ అన్యాయమే జరుగుతోంది కాబట్టి,ఆంధ్రపదేశ్‌ని ప్రత్యేక దేశంగా ప్రకటించాలి లాంటి వితండవాదనలు ఏదో రకంగా మొండిగా సమైక్యవాదాన్ని సమర్దించటం కోసమే గానీ వాదనలో పస లేదు.జై ఆంధ్ర అంటాను జైతెలంగాణా అంటాను.విడిపోతే తప్పేంటి అనే వెంకయ్యనాయుడులాగా సమైక్యవాదులు ఎందుకు కలిసుండాలో కారణాలతో సహా స్పష్టంగా చెప్పాలి.మన పక్కనే ఉన్న యానాం ను రాష్ట్రంలో కలపాలని అడగకుండా సమైక్యవాదులు ఎందుకు విడిచిపెడుతున్నారో అర్ధం కావటం లేదు.ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ దగ్గర 30చ.కి.మీ.విస్తీర్ణం ఉన్న కేంద్రపాలిత ప్రాంతం యానాం . దాదాపు 30వేల జనాభా.యానాం పర్యాటక ప్రాంతం. యానాం వార్తలు తూర్పుగోదావరి పేపర్లలోనే వస్తాయి.యానాంకు రాజధాని పాండిచ్చేరి సుదూరంగా తమిళనాడులో870కి.మీ దూరంలో ఉంది .యానాం 1954 దాకాభారత్ లో ఫ్రెంచ్ కాలనీగా ఉంది.నేడు పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతంలో భాగం.1954లో లో విమోచనం చెంది స్వతంత్రభారతావనిలో విలీనంచెందినా 1956 లో భాషా ప్రాతిపదికన తెలుగు రాష్ట్రంలో కలవలేదు.1948లో హైదరాబాద్ ను పోలీసు చర్యజరిపి ఇండియాలో కలిపారు.1949 లో అప్పటికి ఒక ఫ్రెంచి కాలనీ గా ఉన్న చంద్రనాగూర్, సమీపంలోని బెంగాల్ రాష్ట్రంలో విలీనం అయింది. కాకినాడ మునిసిపల్ కౌన్సిల్ కూడా యానాన్ని కలపాలని తీర్మానం చేసింది. 870కి.మీ దూరంలోని తమిళ పుదుచ్చేరి నుండి పాలన కష్టంగా ఉంది.పుదుచ్చేరికి యానాం ప్రజల ప్రయాణం ఆంధ్రలోని కాకినాడ నుండి జరుగుతుంది.దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని యానాంలో ఏర్పాటు చేయాలని యానాం కాంగ్రెస్ తీర్మానించింది.ఇండోర్ స్టేడియం,కళ్యాణమండపం,ధవళేశ్వరం-యానాం మంచినీటి ప్రాజెక్టులకు రాజశేఖరరెడ్డి పేరు పెడతామని పుదుచేరి రెవిన్యూ మంత్రి మల్లాడి కృష్ణారావు చెప్పారు. తెలుగుజాతి సమైఖ్యత,భాషాప్రయుక్తరాష్ట్ర ప్రధాన ఉద్దేశ్యం యానాం ఆంధ్రప్రదేశ్ లో కలిస్తే నెరవేరుతుంది.తెలుగుతల్లి బిడ్డలందరూ ఒకేరాష్ట్రంగా ఉంటారు.సమైక్యాంధ్ర కోసం ఇప్పుడు ఉద్యమాలు జరుగుతున్నాయి గనుక భౌగోళికంగా సామీప్యత, 100% తెలుగు ప్రజలున్న యానాం ను ఇప్పటికైనా తమిళ పుదుచ్చేరి నుండి విడదీసి సమైక్యాంధ్రలో కలపాలి.కలిస్తే బాగుంటుందని ఆశ.యానాంను తెలుగు ప్రాంత పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెయ్యాలి.

  ఆంధ్రప్రదేశ్ లో జిల్లాలు
  ఏర్పడిన సంవత్సరం ↓ జిల్లా ↓ జిల్లాకేంద్రం ↓ జనాభా (2001) ↓ వైశాల్యం (km²) ↓ జనసాంధ్రత (/km²) ↓ జిల్లావెబ్ సైట్ ↓
  1905 అదిలాబాద్ జిల్లా అదిలాబాద్ 2,479,347 16,105 154 http://adilabad. nic.in/
  1881 అనంతపూర్ జిల్లా అనంతపూర్ 3,639,304 19,130 190 http://anantapur. nic.in/
  1911 చిత్తూరు జిల్లా చిత్తూరు 3,735,202 15,152 247 http://chittoor. nic.in/
  1802 తూర్పు గోదావరి జిల్లా కాకినాడ 4,872,622 10,807 451 http://eastgodavari .nic.in/
  1794 గుంటూరు జిల్లా గుంటూరు 4,405,521 11,391 387 http://guntur. nic.in/
  1978 హైదరాబాద్ జిల్లా హైదరాబాద్ 3,686,460 217 16,988 http://hyderabad. nic.in/
  1910 కడప జిల్లా కడప 2,573,481 15,359 168 http://kadapa. nic.in/
  1905 కరీంనగర్ జిల్లా కరీంనగర్ 3,477,079 11,823 294 http://karimnagar. nic.in/
  1953 ఖమ్మం జిల్లా ఖమ్మం 2,565,412 16,029 160 http://khammam. nic.in/
  1925 కృష్ణా జిల్లా మచిలీపట్నం 4,218,416 8,727 483 http://krishna. nic.in/
  1949 కర్నూలు జిల్లా కర్నూలు 3,512,266 17,658 199 http://kurnool. nic.in/
  1870 మహబూబ్ నగర్ జిల్లా మహబూబ్ నగర్ 3,506,876 18,432 190 http://mahabubnagar .nic.in/
  1956 మెదక్ జిల్లా సంగారెడ్డి 2,662,296 9,699 274 http://medak. nic.in/
  1953 నల్గొండ జిల్లా నల్గొండ 3,238,449 14,240 227 http://nalgonda. nic.in/
  1906 నెల్లూరు జిల్లా నెల్లూరు 2,659,661 13,076 203 http://nellore. nic.in/
  1876 నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ 2,342,803 7,956 294 http://nizamabad. nic.in/
  1970 ప్రకాశం జిల్లా ఒంగోలు 3,054,941 17,626 173 http://prakasam. nic.in/
  1978 రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ 3,506,670 7,493 468 http://rangareddy. nic.in/
  1950 శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం 2,528,491 5,837 433 http://srikakulam. nic.in/
  1950 విశాఖపట్నం జిల్లా విశాఖపట్నం 3,789,823 11,161 340 http://visakhapatna m.nic.in/
  1979 విజయనగరం జిల్లా విజయనగరం 2,245,103 6,539 343 http://vizianagaram .nic.in/
  1905 వరంగల్ జిల్లా వరంగల్ 3,231,174 12,846 252 http://warangal. nic.in/
  1926 పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు 3,796,144 7,742 490 http://wgodavari. nic.in/
  విశేషాలు

  * అనంతపురం జిల్లా కంటే వైశాల్యంలో చిన్న దేశాలు : మాల్టా,గ్రెనెడా,ఆండొర్రా,బహ్రైన్,బ్రూనే,కేప్వర్ద్,సైప్రస్,డొమినికా,ఫిజీ,
  గాంబియా,జమైకా,కువైట్,లెబనాన్,లక్సెంబర్గ్,మారిషస్,పోర్టోరికో,
  కతార్,సీషెల్స్,సింగపూర్,స్వాజీలాండ్,టాంగో.ట్రినిడాడ్,టుబాగో,వనౌటూ.

  రిప్లయితొలగించండి
 26. girglani himself announced the 58000 is not the correct figure and there should be a further deeper investigation coz many of them filed wrong residence certificates .If u see hyderabad NGO's colony is the best example for the ratio of seemandhra in various departments of secretariat.out of 30% of the andhra population in hyderabad 15% are employees of various govt.departments.out of the remaining major percentage migrated just afew years back in search of IT jobs and new business ventures.

  రిప్లయితొలగించండి
 27. Raj: మీ లెక్కలు నాకు అర్థం కాలేదు. ఇది చూడండి:
  హై.లో కోస్తా సీమ వాసులు: 30% (అంటే హై. జనాభా 55 లక్షలనుకుంటే కోస్తా సీమ వాసులు: 16.5 లక్షలు)
  ప్రభుత్వ ఉద్యోగులు: 15% (అంటే 8.25 లక్షలు)
  ఈ లెక్కన హై.లో ప్రభుత్వ ఉద్యోగులు ఎంతమంది ఉన్నారని మీ ఉద్దేశ్యం?

  రిప్లయితొలగించండి
 28. 15% అంటే అందరూ ఉద్యోగస్తులే అని కాదు కానీ ఆ కుటుంబాలలోని వారు అని అర్ధం.10 సం।। పూర్వం ఇక్కడ ఆంధ్ర నుంచి వొచ్చిన మద్యతరగతి వారెవరూ చిన్న వ్యాపారం చేయలేదు. అంతా ఉద్యోగం మీద వచ్చినా వారే.ఇప్పుడు ప్రపంచీకరణ వల్ల వచ్చి వ్యాపారం చేయడం మూలాన హైదరాబాద్ లో వారి జనాబా పెరిగింది.

  రిప్లయితొలగించండి
 29. ప్రియమైన తెలుగు ప్రజలారా
  ఒక రాష్త్ర అభివృద్ధి కాని ఒక ప్రాంత అభివృద్ధి కాని అక్కడి ప్రజల మీద ఆదారపడి ఉంటుంది.అంతేకాని మరే ఇతర కారణాల మీద ఉండదు.ఏప్రాంతం వారైన కష్ట పడి పనిచెస్తే అభివృద్ధి సాద్యం అవుతుంది.ఒక ప్రాంతపు వారిని ప్రశ్నించె ముందు ఎవరికి వారు మొదట వాళ్ళ ప్రాంతం యొక్క స్థితిగతులు, ప్రజల పరిణతి, అలవాట్లు కష్టపడె తత్వం ఏంత వరకు ఉన్నయి అని ఒక్కసారి ఆలొచించండి? నిర్లజ్జ నాయకుల మాయ మాటల గారడి లొ పడకండి .
  మనం అంధరం ఎంత మొత్తుకున్న జరిగేది జరగక మానదు.చివరికి మన ప్రజలకి మిగిలింది కొన్ని సంవత్సారల పురొగతి.నిజమయిన ప్రజనాయకులు ప్రాంతం గురించి కాని ఆత్మ గౌరవం గురించి కాని ఉద్యమం జరపరు. ప్రజల తత్వం,ఆలొచన సరళి మార్చటనికి మెరుగైన తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు.మన దెశానికి నాయకుల లొపం.విభజించి ఫాలించె నాయకులు మనకు వద్దు.
  దయచేసి నా అభిప్రయలు ఒక ప్రాతం కొణంలొ నుండి ఆలొచించకండి.
  నా ఈ వాక్యలని ఆశా ద్రుష్టితొ తీసుకొవలసిందిగా మనవి చెస్తున్నాను.
  మీరు ఏ మాత్రం వివెకవంతులు అయిన ప్రత్యుత్తరాలు ఆపి ఆత్మ పరిశీలన మొదలు పెట్టండీ. ఈ వాక్యలు ఎవరి మనసు నయిన గాయపరిస్తె క్షమించండి.
  ఇట్లు,
  మి తోటి తెలుగు మనిషి.

  రిప్లయితొలగించండి
 30. "mee kodukki EAMCET lo rank raledavaya ?"
  "le ra , maa inti paina andhrolluntaru , vallu maa pilla chaduvuni dochukurru ..."

  what !!! ... ila untadi telangana vithanda vadula vadana....

  poverty ledu gadidi guddu ledu .. . Hyderabad lo settle avvalante ippudu koncham kastam [considering the real estate prices] , the only best option these educated people see is "jai Telangana" ... meeru amayakula... avva !!

  రిప్లయితొలగించండి
 31. ప్రవీణ్ ఎవురండి బాబు, బుర్ర ఇంట్లొ పెట్టొచ్చి మాట్లాడతున్నాడు, వరి పండే చోట మిగిలినవి పండవా? చూడబోతే ఈయనకు రెస్పాండ్ అవ్వటానికి కూడా ఎవరూ ఇంటరెస్ట్ చూపించట్లా...

  ఆయనెవురో ఆత్మ గౌరవం అంటా వచ్చాడు.. ఇటలీ నించి వచ్చిన 'అమ్మ ' కి జైజైలు కొడతన్న మీ నాయకులని అడగండయ్య ముందు ఆత్మగౌరవం గురించి.. బాబు, రాజ వారు, మీరు తెలంగాణా వాడు పెట్టిన కంపెనీ లోనే ఉద్యోగం చేస్తన్నారా? అమెరికా ఎందుకు పోతున్నారు ఉద్యోగాలకి? తెలంగాణా వాడు తయారు చేసిన పేస్టే వాడు తున్నారా? సబ్బు వాడుతున్నారా? తెలంగాణా లో ఆత్మ గౌరవం మరీ ఎక్కువగా ఉన్నట్లు ఉందే.. ఒక పది రాష్ట్రాలు చేస్తే పోద్దేమో.. లెకపోతే రేపు ఇంకొ ఆయన లేస్తాడు ఆదిలాబాద్ నుంచో, వరంగల్ నుంచో ఆత్మ గౌరవం అని..

  రిప్లయితొలగించండి
 32. అబ్బే చదువరిగారు మీ టపా లో పస లేదండి.
  అసలు అన్నిటికన్నా ఆంధ్రోల్లు చేసిన గొప్ప అన్నేయం తెలంగాణకు సముద్రం లేకుండా చేసేయడమే. ఒక్క సారి స్వపరిపాలన ఇచ్చి చూడండి.సొంతం గా కరీంనగర్ పక్కనో....సిద్ధిపేట కి ఓ మూలగానో సముద్రం కట్టేస్కుంటారు . మీరు ప్రబుత్వం చూపిన కాకి లెక్కలు టపాలో పెట్టి డబ్బా కొట్టుకోడం కాదు కావాలంటే తెలంగాణా నాయకులని అడగండి. ఒకడు చెప్పిన దాంతో ఇంకొకడికి పొంతన లేకుండా సవాలక్ష కారణాలు చెప్తారు. అన్నిటికీ పొరపాట్న మీరు వెర్రోడిలా వివరణ ఇచ్చారనుకోండి..మీ మీద తెలంగా ద్రోహి అని ముద్రేసి ముక్కు, చెవులు, నాలుక (ఎవరి స్టేట్మెంట్ ప్రకారం వాళ్ళు) కోసేసి తరిమేస్తారన్నమాట. "అంచేత నేను చెప్పొచ్చేదేంటంటే" చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు.

  రిప్లయితొలగించండి
 33. @SHANKY
  నాకో గొప్ప అవిడియా వచ్చింది. తెలంగాణా చుట్టూ పెద్ద కందకం తవ్వేస్తే ఆంధ్రోళ్ళు అటువైపు రాకుండా వుంటుంది, రక్షణా వుంటుంది. సముద్రం లాంటి నీళ్ళ ముచ్చటా తీరుతుంది. జల రవాణా కూడా పెరిగి తెలంగాణా ఆర్ధికంగా పరిపుష్టం అవుతుంది.

  రిప్లయితొలగించండి
 34. తెలంగాణ వాళ్ళు పరిపాలించింది 9 కాదు.. 12 యేళ్ళు. 1971 నుంచి 82 వరకు మధ్యలో ఒక యేడాది రాష్ట్రపతి పాలన మినహా 11 ఏళ్ళు. తరువాత మర్రి చెన్నారెడ్డి ఒక యేడాది. (dec 89- dec 90).http://ppms.cgg.gov.in/jsp/login/login.jsp ముఖ్యమంత్రుల విషయం లో తెలుగుదేశాన్ని, వైయస్ కాలాన్ని మినహాయించాలి. ఎందుకంటే ఒక తెలంగాణా వాడు ముఖ్యమంత్రి అవుతాడని టీడీపీ కి ఓటు వేసేవాడు ఉంటే వాడు కేసీఆర్ కన్నా పెద్ద వెధవ. అలానే రాజశేఖరరెడ్డి విషయం లొ కూడా..
  చివరిసారిగా ఆంధ్ర ప్రాంతం నుంచి కాంగ్రెస్ ముఖ్యమంత్రి వచ్చి 28 యేళ్ళు.. (భవనం వెంకట్రామిరెడ్డి.. ఈయన ముఖ్యమంత్రి గా చేసింది 7 నెలలే.. ఇంక ఇతనికి ముందు అంటే ఇంకో 11 యేళ్ళు.. అంటే ఆంధ్ర నుంచి ఒక స్థిరమైన కాంగ్రెస్ ముఖ్యమంత్రి వచ్చి 39 యేళ్ళు. ఇంకో విషయం.. అదే మొదట, అదే చివర కూడా..
  అలానే తెలంగాణ ముఖ్యమంత్రి చేసి 19 యేళ్ళు..
  అందరికన్నా ఎక్కువ పాలించింది రాయలసీమ నేతలే.. కానీ మన రాష్ట్రం లో అన్నిటికన్నా వెనుకబడిన ప్రాంతం రాయలసీమ..
  ఇప్పుడైనా అర్ధం చేసుకుంటారా ముఖ్యమంత్రులైతేనే స్వపరిపాలన అనే విషయం లో డొల్లతనాన్ని..

  ఇంక తెలంగాణా ఆత్మగౌరవ పోరాటం అనే వాళ్ళు కొన్ని సమాధానాలు చెప్పాలి.
  ఆత్మగౌరవం పేరుతో అన్నిటికి పేర్లు మారుస్తున్నారే.. మరి మిమ్మల్ని అత్యంత నిరకుశం గా పాలించిన నిజాం ల పేరు తో ఇంక యూనివర్సిటీలు, కాలేజీలు ఎందుకు నడుపుతున్నారు? మీకు చేతనైతే ముందు NIMS కు పేరు మార్చండి.. ఉస్మానియా కి మార్చండి.. నిజాం సాగర్ కి మార్చండి.. ఇవి చెయలేని మీకు తోటి తెలుగు వాళ్ళ పేరు పెడితే మార్చే హక్కు ఎక్కడిది? ఆచార్య ఎన్.జీ రంగా కి తెలంగాణ కు ఉన్న సంభంధం ఏంటి.. ఆయన తెలంగాణ కి చేసిన ద్రోహం ఏంటి? త్యాగరాయ గానసభ పేరు మార్చారు.. ఆయన చేసిన ద్రోహం ఏంటి... ద్రోహం చేసి, బతుకులు చితికిపోయేలా చేసిన వాళ్ళ పేర్లు ఉంచి సంభందం లేని వాళ్ళ పేరు మారుస్తారు.. మీకేం ఆత్మగౌరవం అయ్యా..
  తెలంగాణ చరిత్ర, సంస్కృతి గురించి మాట్లాడే కేసీఆర్ తన నియోజక వర్గ నిధులతో ఒఖ్ఖ కొమురం భీం విగ్రహం ప్రతిష్టించాడా? రాణీ రుద్రమదేవి ది? కాళోజీ ది? దాశరథి వారిది? వీరి విగ్రహాల వల్ల ఉపయోగం లేదు. తను అనుకున్న విద్వేషాలు రేగాలని తెలంగాణ తల్లి ని సృష్టించాడు. తెలుగుతల్లి ఆంధ్ర వారిది మాత్రమే అని ఎవరైనా అన్నారా..? తెలుగుబాష లో పీజీ చదివిన కేసీఆర్ తెలుగుతల్లి ని దెయ్యం అని తిట్టాడు. రేపు తెలంగాణ తల్లి ని ఏమంటాడో?
  20 సం!! రాజకీయాల్లో ఉన్న తర్వాత తెలంగాణ వెనుకబాటుతనం గుర్తొచ్చిందా అని నిలదీయండి.
  ఒక తెలుగువాడు ప్రధానమంత్రి అవుతాడని పోటీ గా అభ్యర్ధి ని నిలపలేదు ఎంటీఆర్. అలాంటి ఆయన విగ్రహాలకి ఆత్మగౌరవం పేరుతో మీరు చేస్తుంది సబబేనా?

  చదువరి గారు, i want to provide some more data
  610 GO: http://go610.ap.gov.in/ Details are provided departmentwise..
  6 point formula: http://www.aponline.gov.in/Apportal/HomePageLinks/PresidentialOrder/Presidential_Order.pdf
  reservoir details: http://irrigation.cgg.gov.in/reservoirssms/ .here we can see the capacity of jurala is 12 tmc.. but KCR always claims it as 5 TMC.
  see point 3, which related to the recent free zone issue
  irrigation projects: http://www.irrigation.ap.gov.in/ - clk on the link in new ayacut details in 2004 -2007
  andhra: 477646
  telangana: 476479
  rayalaseema: 57768

  jalayagnam: http://www.irrigation.ap.gov.in/ (you can verify in the prioritized projects link

  ఇలా చెప్తే చాలా statistical డేటా తో వాళ్ళ వాదన తప్పని నిరూపించచ్చు. కానీ దానికంటే ముందు వాళ్ళు విద్వేషాన్ని, అనుమానాన్ని పక్కన పెట్టాలి. ఒక తటస్థ స్థానం నుంచి వారి ఆలోచన మొదలు పెడితే అర్ధవంతం గా ఉంటుంది.. ఉదా!! కి రాష్ట్రం లో యేయే ప్రాంతం లో ఏ రంగం లో వెనుకబడి ఉన్నై అనే చోట నుంచి అలోచించినప్పుడే ఇతర ప్రాంతాల భాధలు కూడా అర్ధం అవుతాయి. అంతేగాని ముందే మా తెలంగాణ వెనకబడింది, దోపిడి, స్వపరిపాలన అనే hypothetical aspects నించి మొదలైన ఆలోచనలు సమస్యలు సృష్టిస్తాయే గానీ పరిష్కారాన్ని సృష్టించలేవు.

  రిప్లయితొలగించండి
 35. ఆదాయం లెక్కలలో హైదరాబాద్ ను కలుపుకొని, ఖర్చు వచ్చే వరకు దానిని తీసివేసి చూపటం తెలివికలవాళ్లం అని భావిస్తూ తెలబాన్లు అనిపించుకొనే మెదడు మోకాలిలో ఉండే వీరులకు సాధారణమే. విద్య, వైద్యం, పారిశ్రామిక ప్రగతి, మౌలికసదుపాయాల కోసం పెట్టిన ఖర్చు, ఇలాంటివాటిల్లో వీళ్లు చెప్పేది మాత్రం హైదరాబద్ తీసివేసే, మళ్లీ ఆదాయం చూపేది మాత్రం హైదరాబద్ తో పాటే :)

  మొన్నె మధ్య ఇలానే ఒ కామెడీ వీరుడు ఆదాయం 45 శాతం తెలంగాణా నుండి, ఖర్చు 38 శాతం, అంటె 17 శాతం ఆంధ్రావోల్లు దోచెసుకొంటున్నారు అంటూ ఓ కమెడీ టపా వ్రాస్తే, అలాంటి టపాలు చూసి, మన రాయలు లాంటి వాళ్ల గుండెలు కరిగి పోయయీనుకోండి. విషయం ఏమిటి అంటె ఆదాయం లో హైదరాబద్ వేసి, ఖర్చు లో మాత్రం దానిని తీసి kcr లాగా తెలివి గా మాట్లాడమని ఫీల్ అవ్వటం అన్నమాట. ఆ విషయమే అడిగితే కామెంట్ కూడా వేసుకోలేదనుకోండి. దానికి పోటీగా ఇంకో బుట్టదాఖలు చేసిన g.o మీద వేసారనుకోండి. పోనీ ఆ g.o బుట్టదాఖలు అయినాకన్నా correction లాంటివి ఎమయినా వెస్తారా అంటే, అబ్బే అలాంటి ఏమీ ఉండవు అన్నమాట, ysr మాటలలో చెప్పాలంటే బట్ట కాల్చి మొఖం మీద వేసి, నీ మొఖం నల్లగా ఉంది అని పడి ఏడవటం అన్నమాట :)

  ఇలాంటి వాళ్లను చూసే "దున్నేటప్పుడు దూడలలో, మేసేటప్పుడు ఎడ్లలో " అన్న సామెత వచ్చింది. అందుకనే నిన్న గాదె వెంకటరెడ్డి లాంటి మంత్రులు ముందు ఎక్కడెక్కడ ఎంత ఖర్చు పెట్టారో ఆ లెక్కలు తేల్చండి అని పనికిమాలిన కాశయ్యను అడిగింది (అలవాటు ప్రకారం అధిష్టానాన్ని అడిగి చెప్తా ఆ లెక్కలు అని ఉంటాడు అనుకోండి, అది వెరే సంగతి).

  మంచి టపా వేసారు, లెక్కల విషయంలో , అభినందనలు.

  రిప్లయితొలగించండి
 36. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 37. ఇక్కడ ఎవరూ కూడా తార్కికంగా ఆలోచించటం లేదు. మనం అందరం ఒక్క తల్లి బిడ్డలమే అయినా కానీ ఇలా కుక్కల్లా కోట్లాడుకోవడం మాత్రం ఏమి బావో లేదు. రాజకీయాల్లో సరైన పరిష్కారం లేదా తప్పు పరిష్కారం అంటూ ఉండవు. కేవలం మన సౌలబ్యం కోసం మనం అందరికీ అమూదయోగ్యం ఐన పరిష్కారం కనుక్కోవటం మాత్రం కావలి. ఇలా ఒకరి మీద ఒకరు బురద చల్లుకుని మనమే కరెక్ట్ అనుకునే నైజం పోవాలి. ఆంద్ర వాళ్ళు పోగారుబోతులని, తెలంగాణ వాళ్ళు సోమరిపోతులని ఇలాంటి gross generalizations చేసుకోవటం మన అవివేకం కాదా? మనవ సంబందాలు తెగిపోయాక ఇక కలిసున్నాలేకపోయినా పెద్ద లాబం లేదు. ఉద్యోగాల్లో, నీటి వనరుల వినియోగంలో తెలంగాణ వాళ్ళకి అన్యాయం జరిగింది (వాళ్లకి తెలివితేటలూ ఉన్నాయా లేదా అన్న విషయం పక్కన పెడితే) అన్న విషయం వాస్తవం. అలాగే హైదరాబాదు అభివృద్ధిలో అందరి చేయి ఉంది, కానీ ఇప్పుడు దానిని వదిలెయ్యాలి అనటం పూర్తీ గా అన్యాయం. ఇలాంటి పరిస్తితులలో చదువుకున్న మనం ప్రస్తుతం సంయమనం పాటించి అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం కోసం పాటు పడేలా ప్రోత్సహించాలి. అంతే కాని రోజు రోజుకి పడిపోతున్న సౌబ్రాతుత్వాన్ని మరింత తొక్కి మనకి మనం ఏమి మంచి చేసుకోవటం లేదు. Negotiations అందరికి అన్ని లాబాలు జరగవు, మనం కొన్ని పక్కవారి విషయంలో పస ఎంత ఉంది అనేది అలోచించి సర్దుకు పోవడం ముఖ్యం. అన్నింటి కన్నా ముఖ్యం, ఇది జీవన్మరణ సమస్య కాదు. కాని మనల్ని మనం కించ పరుచుకుమ్తున్న విదానం మాత్రం హేయం. అందరం కలుద్దాం పరిష్కారం వెతుకుదాం. రాజకీయంగా కాదు. బ్లాగు పరంగా. ఏమంటారు? కనీసం ఇక్కడైనా మనం వివేకులం అని చెప్దాం. సరైన బ్లాగ్ తయారు చేద్దాం, ఫోరం తయారు చేద్దాం, అందరికి నచ్చేట్టుగా నాయకులను (moderators) ఎన్నుకుని రాజకీయాలతో సంబంధం లేకుండా మనకి మనం పరిష్కారం చర్చిద్దాం. ఇది నేను అన్ని బ్లాగులలో పోస్టు చేస్తున్నాను. దయచేసి అందరం దగ్గరికి వద్దాం. విషం చిమ్ముకోవటం ఆపేద్దాం.

  రిప్లయితొలగించండి
 38. విజయ్,
  మీ ప్రయత్నం అభినందనీయమే, కాని అది కేవలం assumptions తో (అదీ నిర్దారణ కాని) మొదలుపెట్టకూడదు.
  ఉదాహరణ కు, మీరు "ఉద్యోగాల్లో, నీటి వనరుల వినియోగంలో తెలంగాణ వాళ్ళకి అన్యాయం జరిగింది (వాళ్లకి తెలివితేటలూ ఉన్నాయా లేదా అన్న విషయం పక్కన పెడితే) అన్న విషయం వాస్తవం." అన్నరు. అది వాస్తవం ఎలా అయ్యిందో చెప్పే " సమగ్ర స్టడీ " ఎదయినా చూపగలరా? కెవలం కొన్ని specific examples చూపించి దయచెసి దానినే వాస్తవం అని తెలబాన్లు అన్నట్లు అనకండి.

  విద్య, వైద్యం, పారిశ్రామిక ప్రగతి, వ్యవసాయం, మౌలిక సదుపాయాల కల్పన కోసం చేసిన ఖర్చు, అలాగే సెజ్ లకోసం తీసుకొన్న పొలాలు లాంటివి, ఏ ఏ ప్రాంతాలలో తలసరికి 1956 నుండి ఎంత, అనేదానిమీద ఇంతవరకూ మీరేమయినా శ్వెతపత్రం (wholesum study)లాంటిది చూసారా ఎక్కడయినా? చూసి ఉంటే దాని link ఇవ్వగలరా? అది లేనప్పుడు "వాస్తవం" లాంటి పడిగట్టు పదాలు కాకుండా, let us assume అంటూ మొదలెట్టి, ఆ assumptions కరెక్టో గాదో ముందు తెల్చుకొని, ఆ తర్వాత అవి నిజమయితే వాటిని ఎలా address చెయాలి, రాష్ట్ర విభజన ద్వారానా, లేకా వేరే మార్గాలద్వారానా అనేది, ఆ assumptions తప్పు అయితే వాటినే వాస్తవాలుగా ప్రచారం చెసే వాళ్లకు, వాటిని నిజమని నమ్మే ప్రజలకు ఎలా తెలియచెప్పాలన్నది ప్రస్తుతం మనందరి మధ్య ఉన్న సమస్య.
  అంతే కాని, తెలంగాణాకు అన్యాయం జరిగింది అనో (ఒక్క సమగ్ర స్టడీ కూడా లేకుండా), లేక హైదరాబాద్ అందరది అనో, తెలంగాణా వాళ్లది అనో (హైదరాబాద్, హైదరాబాద్ వాళ్లది అవుతుంది కాని, వేరే వాళ్లది ఎందుకు అవుతుంది అన్న బుద్ది లెకుండా) discussion పెట్టుకొంటే బ్లాగ్లు లోనయినా, ఎక్కడయినా ఉపయోగం ఏమిటి చెప్పండి.

  రిప్లయితొలగించండి
 39. KumarN: "మొన్నెప్పుడో పెద్ద వ్యాఖ్య రాసాను గురువు గారూ, ఏమయిదో తెలీదు పబ్లిష్ అవ్వలా!!"- వ్యాఖ్య ఏదీ నా ఈమెయిలుక్కూడ రాలేదండీ! బహుశా సబ్మిషను లోపం ఏదైనా ఎదురైందేమో!! నేనైతే వ్యాkhya దేన్నీ ఆపలేదండీ.

  Krishna: "దున్నేటప్పుడు దూడలలో, మేసేటప్పుడు ఎడ్లలో" - టపా సారాంశం మొత్తం ఇమిదిపోయిందండి ఈ ఒక్క సామెతలో!

  రిప్లయితొలగించండి
 40. మీ లెక్కలు చాలా బాగున్నాయి. వ్యవసాయంలో తెలంగానా జిల్లాల ఉత్పత్తి అనంతపురం, కదప, చిత్తూరు లాంటి జిల్లాలకంటే ఎక్కువే. ఐతే క్రిష్న, తుంగభద్రా నదులు, ఎన్నొ చిన్న ఏరులు వాగులు వున్న మహబూబ్ నగర్ ఒక్క నది కూడా లేని, భూగర్బ జలాలు ఎండి పోయి, వర్షపాతం తక్కువగా ఉండె అనంతపురం, కదప ల కంటే ఎక్కువగా వ్యవసాయోత్పత్తి చేస్తుందని చంకలు గుద్దుకోమంటారా, లేక క్రిష్నా తనగుండా పోతున్న ఎందుకు ఈ జిల్లాలో వ్యవసాయోత్పత్తి తక్కువ వుందో ఆలోచించాలా?

  మీరు మీ టేబుల్ లో చూపించిన అన్ని తెలంగానా జిల్లాలనుంచీ క్రిష్నాయో, లేక గోదావరియో వెల్తుంది. వర్షపాతం కూడా రాయలసీమ జిల్లాలకంటే చాలా ఎక్కువ. అయినా మరి ఎందుకు వెనుకబడి ఉన్నాయో?

  రిప్లయితొలగించండి
 41. ఇక పోతే విజయనగరం, శ్రీకాకులం, విశాఖ పట్నం జిల్లాల విస్తీర్నం ఎంత, మహబూబ్ నగర్, నల్లగొంద వరంగల్ లాంటి జిల్లాల విస్త్తిర్నం ఎంత, ఈ జిల్లాల్లో ఎంత ఏజన్సీ ప్రాంతం, ఎంత వ్యవసాయ భూములు ఉన్నాయి, అలాగే వంశధార నదికీ, క్రిష్నా, గోదావరులతో పోలిస్తే నీటి ప్రవాహం ఎంత ఉంది లాంటి వివరాలు కూడా జోడిస్తే మీ లెక్కలు ఇంకాస్త అర్ధవంతంగా ఉండేయేమో.

  రిప్లయితొలగించండి
 42. lekkalu telangana.org lo kooda iccharu...same AP GOV website nunde.....mari vaati sangathi emito

  Aina...meeku edo labam kanapadakapothe...kalisiundama ra baboo ante...samokyam samikyam godava enduko...

  Sare ippudante HYD baga develop ayyindi ...mari 50s 60s lo maatenti...appudu emi choosi telanganani vallaku ishtam lekunda kalupukunnaru

  Edo undabatte kalupukunnaru....appudaithe akkada Andravalla investments levu kada...
  Kabatte antaru Dochukodaniki opportunity kanipinchindi....

  రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు