7, జనవరి 2009, బుధవారం

అసత్యం

లాభాలు అబద్ధం.
చూపెట్టిన అప్పులు అబద్ధం.
రావాల్సి ఉందని చెప్పిన ఆదాయం అబద్ధం.

ఆయన కుటుంబానికే చెందినవి మేటాస్ ఇన్ఫ్రా, మేటాస్ ప్రాపర్టీస్ కంపెనీలు. (వీటినే సత్యంలోకలిపెయ్యబోతే షేరుహోల్డర్లు ఎదురుతిరిగారు.) మేటాస్ ఇన్ఫ్రాయే హై.లో మెట్రో రైలు ప్రాజెక్టును చేపట్టబోతోంది. ఆ ప్రాజెక్టును వాళ్ళకు ఇచ్చినందుకుగాను, ఆశ్చర్యకరమైన రీతిలో 35 ఏళ్ళలో ప్రభుత్వానికే 30 వేల కోట్లు ఎదురు చెల్లిస్తామని ఒప్పుకుంది -ప్రభుత్వం ఇస్తానన్న రెండున్నర వేల కోట్ల రూపాయల డబ్బులు వద్దని మరీ! ఎలా చేస్తారో మరి!!

రామలింగరాజు.. అంతా తానొక్కణ్ణే చేసినట్టూ, డైరెక్టర్లెవ్వరికీ ఈ తప్పుడు లెక్కలు తెలవదనీ చెబుతున్నాడు. ఆడిటర్లకు కూడా తెలవదా?

ఆయన ఇంకా ఇలా అన్నాడు : "నేను చట్టపరమైన శిక్షలకు, తదనంతర పరిణామాలను ఎదుర్కోడానికి సిద్ధమౌతున్నాను." ముఖ్యమంత్రి గారు చట్టం తనపని తాను చేసుకుపోతుందని ఇంకా అనలేదు.

20 కామెంట్‌లు:

 1. ముఖ్యమంత్రి గారు చట్టం తనపని తాను చేసుకుపోతుందని ఇంకా అనలేదు. ... ... అయ్యో ఇంత ఆలస్యం చేస్తారా ఇలాంటివాటిల్లో ... ... *** While I have no doubt in my mind that Law will take its own course" ... Original Article : Text of YSR's letter to PM on Satyam fraud

  రిప్లయితొలగించండి
 2. మనదేశం నుంచి ఎదిగిన సత్యం ఇలా అప్రతిష్టపాలు కావడం నాకు కొంచెం బాధగా వున్నా, ఈరోజు దినపత్రికల్లో ఈ వార్తను చదువుతూ, దీనిపై ఎవరైనా చిన్న టపా రాస్తే అసత్యం అనే శీర్షిక బాగుంటుందనుకున్నాను. ఇక్కడ చూస్తున్నాను. :)

  రిప్లయితొలగించండి
 3. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 4. అవి నిజంగా తప్పుడూ లెక్కలా! లేదా వచ్చిన డబ్బులు మింగి లెక్కలు తప్పు అని అన్నాడా?!! ఇంకా తెలియదు మరి.

  రిప్లయితొలగించండి
 5. రామలింగ రాజా ఇలాంటి పని చేసింది అనే విషయమే నాకు ఆశ్చర్యం కలిగిస్తోంది. అంతగా నమ్మామే? నమ్మకద్రోహమంటే ఇదే అని ఇవాళ తెలుస్తోంది.

  ముఖ్యంగా ఆడిటర్లకు విషయం తెలియకుండా సంస్థ చైర్మన్ సొంతంగా బాలెన్స్ షీట్ ఎలా తయారు చేస్తాడో రాజు గారు ఎంత చెప్పినా అర్థం కావట్లేదు.

  రాష్ట్రానికి పేరు తెచ్చిన రాజు, ఆయన సంస్థ ఇలా అప్రతిష్ట పాలు కావడం,(పరిస్తితులేవైనా) నిజంగానే బాధగా ఉంది.

  చట్టానికి చుట్టాలుండరా ఏమిటీ ?

  రిప్లయితొలగించండి
 6. మొత్తానికి చాలా disturbed గా ఉంది ఈ వార్త విన్నప్పటినుంచీ!మనింట్లో వాళ్ళే మనల్ని మోసం చేసినట్లుగా ఉంది. అందునా మా ఇంట్లో మాజీ satyamates మస్తుగా ఉండటం వల్ల, రాజు మేథ గురించి ఎప్పుడూ చెప్పుకుంటూ ఉంటామేమో మరీ ఇదిగా ఉంది! ఎవరిమీదో చెప్పలేని కోపమొస్తోంది.

  రిప్లయితొలగించండి
 7. తెలుగువాడిని: ముఖ్యమంత్రి గారు నేననుకున్నదానికంటే చాలా ఫాస్టు! :) చాన్నాళ్ళకు కనిపించారు మళ్ళీ! ఏమైపోయారు సార్!?

  రానారె: :)

  శ్రావ్య గారి వ్యాఖ్యను తొలగించింది నేను కాదు, వారే! నేను తొలగించానంటూ చేస్తున్న ఆ ఆరోపణ అనువాదకునిదని గమనించ ప్రార్థన. :)

  నిరంజన్ పులిపాటి: అసత్యమనేది ఈ సంఘటనకు చాలా సహజమైన శీర్షిక అనుకుంటా. ఇక్కడున్నవాళ్ళలోనే ముగ్గురికి వచ్చింది ఈ ఆలోచన. వచ్చినా చెప్పనివాళ్ళు ఉండి ఉండవచ్చు :)

  మరమరాలు: మీరన్న అనుమానాలు త్వరలో విడిపోతాయి. డబ్బులు బయటికి పోయే ఉండొచ్చు. అవి పోయినా పోకున్నా.., మేటాసులను సత్యంలో కలిపెయ్యబోవడం దురుద్దేశపూరితమేనన్నది స్పష్టం.

  సుజాత: రాజు మిగతా డైరెక్టర్లకు తెలీదని అంటున్నాడుగానీ, ఆడిటర్లకు తెలీదని అనలేదనుకుంటా. డైరెక్టర్లకు తెలీకుండా ఎలా ఉంటుందనేది కూడా అనుమానాస్పదంగా ఉంది. ఈ మేనేజిమెంటు లంచాలిచ్చి కస్టమర్లను మోసం చేసింది. తప్పుడు లెక్కలు చూపించి వాటాదారులను మోసం చేసింది. ఉద్యోగుల గతేంటో పాపం!

  రిప్లయితొలగించండి
 8. చదువరి గారు నేనే తొలిగించానండి :) ఎందుకో అసలు రాజు గారి గురించి negative గా ఆలోచించలేక పొతున్నా:( .
  I just love his vision in various projects like 108, Grameena IT etc.

  May be false Prestige thrown him into this situation.

  రిప్లయితొలగించండి
 9. ఎవరిబాధ వారిది. సాఫ్ట్వేరు,షేర్లు, ఇవేవీ మాకు తెలీదు(తూ.గో.జి, ప.గో.జి ,గ్రామవాసులకి) గోదావరి జిల్లల్లోని వూర్ల పొలిమేరల్లో స్వాగతం చెపుతూ కనిపించే" బైర్రాజు ఫౌండేషన్" బోర్డులే కళ్ళముందు ఆడుతున్నాయి . మంచినీరు, వైద్యం, విద్య, వంటి అనేక సౌకర్యాలు ,సేవలు వారి ద్వారా పొందిన అనేక గ్రామాలు ,అంత ఎత్తుకు ఎదిగిన ఆయన మావాడే అని ఇంతకాలం గొప్పగా చెప్పుకున్న ప్రజలు ఏం జరిగిందో తెలీక పోయినా అయ్యో ఇలా జరిగిందే అని బాధ పడటం తప్ప ఏం చెయగలరు . పొరపాటునో, గ్రహపాటునో కిందపడ్డ ఆయన మీద మరో రాయి వెయటానికి మనసు రావటం లేదు . ఎవరిపాపానికి వారే పోతారు ,నిజంగా చేసింది పాపమే అయితే
  ఏదో నా బాధ నేను బయటపెట్టుకున్నాను ,దయచేసి దీని మీద ఎవరూ కామెంట్ చెయ్యొద్దు

  రిప్లయితొలగించండి
 10. చదువరి గారు, నాదే పొరపాటు. "బాలెన్స్ షీట్ ఎలా తయారు చేస్తాడో?" పక్కన full stop ఉండాలి. మొత్తం కలిసి పోయి ఒకటే వాక్యంగా తయారైంది.

  రిప్లయితొలగించండి
 11. సత్యం మోసం వెనక కథ ఏమిటో ఈ లింకులో ఉంది ఎవరైనా చూశారా?

  రిప్లయితొలగించండి
 12. సత్యం మోసం వెనక కథ ఏమిటో ఈ లింకులో ఉంది ఎవరైనా చూశారా?
  http://clickandhra.com/index.php?option=com_content&task=view&id=861&Itemid=1

  రిప్లయితొలగించండి
 13. ఇది కూడా చూడండి

  *15 May 2008 Satyam loses appeal in Upaid case; may face $1 billion plus penalties news:*

  In a case spanning three continents, India's fourth-largest software exporter, Satyam Computer Services is being sued by Upaid Systems, a UK-based online and mobile payments service company, in Texas.

  Call it the perils of globalisation, for Satyam could be staring down the gun barrel at more than $1 billion in penalties, depending on how the case pans out.

  Upaid is an old Satyam client dating back to the heyday of the dotcom boom of the late 1990s. In 2006, it had filed certain claims of infringement against some companies in the US and in the proceedings, two former Satyam employees were also named, who later denied signing the patent assignment documents in 2002.

  Upaid then filed a lawsuit in a Texas court in 2007 alleging that Satyam provided forged documents to Upaid in patents filing that eventually resulted in the company losing its patents infringement case against telecom giants Qualcomm and Verizon.

  It has claimed compensatory and punitive damages from Satyam in the case that is scheduled for hearing in June 2009 in the Texas court.

  ''The damages, to be awarded, will be determined by a jury in Texas. I cannot predict the future. But going by the numbers in the public documents that have been filed over the course of the proceedings in the London court, the amount could be considerably over $1 billion,'' said Upaid chairman and CEO Simon Joyce.

  The case is at a very preliminary stage and has to undergo the due process of law and Satyam is confident that it has merits ito contest the case. ''It is premature to make any judgement on the quantification of any potential damages and also the matter is sub-judice. Satyam is considering its legal options as regards the dismissed appeal in the London courts,'' Satyam said in a statement.

  Satyam just lost a case in the Court of Appeal in London, seeking to shift the dispute with Upaid Systems to the UK. Satyam had earlier sought a High Court injunction in London that claimed that on the basis of the termination agreement between the two, any residual claims against it would have to be tried in London.

  However, on Wednesday, the court in London ruled in Upaid's favour that the case could be heard in the US court.

  After this ruling, Upaid issued a statement, ''This ruling allows Upaid's lawsuit against Satyam alleging fraud, misrepresentation, and breach of contract and what Satyam admits are 'extremely large sums of money', to proceed to a US trial in a Texas federal court.''

  Satyam later issued a statement, ''The courts in London have decided that the case in Texas can continue and be heard based on an earlier assignment agreement signed by Satyam's then subsidiary and Upaid. Thus the current decision in the UK court has determined the jurisdiction lies in US and the underlying case is expected to be tried in US in 2009.''

  Satyam said it would consider all its legal options. "The issue is still hovering around the jurisdiction matter we have not even started to discuss the core issue. We will work with our lawyers and take an appropriate decision," said Srinivas Vadlamani, CFO, Satyam Computer Systems.

  రిప్లయితొలగించండి
 14. దాని తాలూకూ లింకు ఇది....

  http://www.domain-b.com/companies/companies_s/Satyam_Computers/20080515_satyam_computer.html

  రిప్లయితొలగించండి
 15. సత్యం సంస్థని కుటుంబ ఆస్థిలా వాడుకున్నారు రాజు గారు. ఆయన వాటా 8 శాతమే అయినా, తన కొడుకు కోసం మొత్త్తం సంస్థని ముంచేసారు.రామలింగ రాజు గారి కొడుకు తేజా రాజు అర్హత లేకున్నా, ఆకాశానికి నిచ్హెనలు వేసి రాజు గారిని, సత్యం ని ముంచేశాడు.అవినీతి శేఖరుడు తన ముడుపులు కోసం సత్యం ని, రాజు గారిని పావులా వాడుకున్నాడు. నాలుగు సంవత్సరాలుగా రామోజి సామ్రాజ్యాన్ని కూలగొట్టాలని విశ్వప్రయత్నాలు చేసినా వీలుగాని రౌఢీ శేఖరుడు,ధుర్యోధనుడిని, కౌరవ సామ్రాజ్యాన్ని ముంచేసిన శకుని వలే,తేజా రాజుని, సత్యం ని ముంచేచాడు.కొడుకు అత్యాశకి ద్రుతరాష్టుడిలా సత్యం సామ్రాజ్యాన్ని బలిపెట్టారు రామలింగరాజు.నాగార్జునా ఫీనాన్సు లో డ్యెరెక్టురుగా వున్న నిమేష్ కంపాని ని అరెష్టు చేయటానికి ఆఘమేఘాల మీద హడావిడి పడిన శేఖర్ దాదా (కేవలం రామోజి సంస్థ లో 1200 కోట్లు పెటుబడి పెట్టిన నేరానికి....),ఇప్పుడు రాజు నేరం ఒప్పుకున్నా గాని అరెష్టు చెయ్యటానికి ముందుకు రాని వెనుక ఎన్ని వందల కోట్ల అవినీతి సొమ్ము వుందో ఈ ప్రభుత్వ పెద్దలవద్ద.

  రిప్లయితొలగించండి
 16. ఏమిటీపరిస్థితి దేశానికి? ఎవరుబడితేవారు మోసం చెయ్యగలుగుతున్నారు,లేక ముంచగలుగుతున్నారు జనాన్ని.ఇప్పుడు ఈనష్టాన్ని తట్టు కోలేనికుటుంబాల పరిస్థితి ఏమిటి? ఎన్ని మోసాలు ,కుంభకోణాలు జరిగినా చేయగలిగేవారికి భయమ్ లేదు.మోసపోయేవారికి జాగ్రత్త లేదు ప్రభుత్వాలకు బాధ్యతలేదు.ఏమైపొతుందీ దేశం.

  రిప్లయితొలగించండి
 17. Very nice post. i like it.
  Keep it up
  With best wishes

  రిప్లయితొలగించండి
 18. http://kaburlu.wordpress.com లో రామలింగ రాజుని వెర్రిగా అభిమానించే ఒక అమాయక చక్రవర్తి వ్రాసిన వ్యాసం చదివి ఈ వ్యాసం వ్రాస్తున్నాను. వ్యక్తి పూజ చేసే కొంత మంది నీతి లేని మనుషులు ఉంటారు. ఒక మనిషి ఎంత నీతి లేని వాడని తెలిసినా అతనికి ఉన్న డబ్బుని చూసి గౌరవిస్తారు. వాడు ఎంత డబ్బు మింగినా వాడు అమాయకుడని నమ్మించడానికి తమకి సాధ్యమైనంతగా ప్రయత్నిస్తారు. సినిమా హీరో అభిమానికి తన హీరో పై ఎంత వెర్రి అభిమానం ఉంటుందో, కొంత మంది వెర్రి వెంగలప్పలకి డబ్బున్న వాళ్ళ పై అంత వెర్రి అభిమానం ఉంటుంది. రోడ్డు మీద చిరంజీవికి సపోర్టుగా కేకలు వేసే వాళ్ళని చూసి వాళ్ళు పని లేని పాపారావులని అనుకున్నాను. రామలింగ రాజుకి సపోర్టుగా వెర్రి వాదనలు చేసే వాళ్ళు మాత్రం చదువుకున్న మూర్ఖులు, సాఫ్ట్ వేర్ ఇంజినీర్లుగా పని చేసే బజారు మనుషులు. వీళ్ళకి సమాధానంగా కె.వి. గిరిధర రావు అనే అతను ఇలా వ్రాసారు.

  “ఈ దేశాన్ని బాగు చేయడం దేవుడి తరం కూడా కాదు అన్న అర్థం వచ్చేలా ఈమధ్యనోసారి సుప్రీం కోర్టు అన్నట్లు పేపర్లో చదివాను. సత్యం ఉదంతమ్మీద విద్యావంతుల అభిప్రాయాలు చదివి, సుప్రీం కోర్టు అన్నదాంట్లో నిజం ఉందనిపిస్తోంది.
  రామలింగ రాజు క్రిమినల్. అది ఆయన ఒప్పుకున్నదే! మనం కొత్తగా కనిపెట్టాల్సిందేమీలేదు.
  ఆయన చేసింది అయ్యో పాపం అని జాలి పడాల్సిన నేరంగా చూస్తున్నామంటే, వ్యక్తి ఆరాధన ఏ స్థాయిలో ఉందో, నైతిక విలువల పట్ల సమాజానికెంత అవగాహన ఉందో అవగతమౌతుంది.
  అన్ని దారులు మూసుకు పోయి, ఇవ్వాళ కాకపోతే రేపైనా దొరికేది ఖాయమని తెలిసాకే, రాజు గారు ఆత్మ నివేదన చేసుకున్నారు. ఇడుపుల పాయ ఉదంతంలో మరో రాజు గారు ఇంచుమించు ఇలాగే అసెంబ్లీలో నివేదించుకున్న విషయం గుర్తుందా? బహుశా చాలా మంది మరచి పోయుంటారు. ఈ రాజుగారి లీలలూ అంతే.
  ఆవేశం ఆలోచనల్ని మింగేసినప్పుడు, మన కడుపులో చల్ల కదలకుండా ఉన్నప్పుడు, ఎల్లాంటి నేరస్తులనైనా సమర్ధిస్థాం. వీలైతే అంబారీ అందలాలు ఎక్కించి, అంకుశాలను చేతుల్లో పెడతాం.”

  గిరిధర రావు గారు చెప్పింది నిజమే. పేద వాళ్ళని దొంగలనో, అడుక్కునే వాళ్ళనో వెక్కిరిస్తాం. డబ్బున్న వాడు కోట్లు దొంగతనం చేసినా ఏనుగు అంబారి ఎక్కిస్తాం. చదువుకున్న మూర్ఖులు నేర్చుకునే కుళ్ళు కంపు నీతి ఇది. చదువు సంస్కారం నేర్పిస్తుందని భ్రమ పడతారు కొందరు అమాయకులు. చదువు సంస్కారం నేర్పించదు కానీ డబ్బున్న వాడికి కంబారి(పాలేరు)లా దండం పెట్టడం నేర్పిస్తుంది. మంచి బట్టలు వేసుకును మంచి తిండి తిన్నంత మాత్రాన అది నాగరికత అయిపోదు. నీతి, నిజాయితీ నేర్చుకోకపోతే నాగరికత అనే పదానికే అర్థం ఉండదు.

  మరింత దారుణమైన విషయం ఎమిటంటే పోలీసులు కూడా రామలింగ రాజుకి మర్యాదలు చెయ్యడం. చట్టం దృష్టిలో అందరూ సమానులేనన్న విష్యయం పోలీసులకి తెలియదట! రామలింగ రాజుకి జైల్లో చికెన్ తో ఆహారం పెట్టారట. డి.జి.పి. ఈ విషయం తెలిసి “అలా పెట్టొద్దు, దాని వల్ల పోలీస్ డిపార్ట్మెంట్ కి చెడ్డ పేరు వస్తుంది” అని పోలీసులకి ఆదేశం జారీ చేశాడట. మద్దిలచేరువు సూరికి జైల్ లో స్వీట్లు, జీడి పప్పు కూడా పెట్టారు. అప్పుడు మాత్రం డి.జి.పి.కి పోలీస్ డిపార్ట్మెంట్ పరువు గురించి గుర్తు రాలేదు. సూరి రాష్ట్రంలో పేరు మోసిన క్రిమినల్ అయితే రామలింగ రాజు అంతర్జాతీయ క్రిమినల్. క్రిమినల్స్ ని డబ్బుని చూసి ఆరాధించే హీనమైన స్థితిలో ఉన్నారు మన చుట్టూ ఉండే అమాయకులు. డబ్బున్న వాడు ఎంత మందిని మోసం చేసి ముంచినా ఫర్వా లేదు. మన లాంటి వాళ్ళు మాత్రం నిజాయితీగా డబ్బున్న దొంగలని గౌరవించాలి అనడం మనకి ఏ నాగరికత నేర్పింది?

  రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు