14, ఫిబ్రవరి 2009, శనివారం

బ్లాగుల్లో దొంగలు పడ్డారు

..పడి, మన ఐడీలను కొట్టేస్తున్నారు. మన వేషాలేసుకుని, మన పేర్లతో దొంగ వ్యాఖ్యలు రాసేస్తున్నారు. ఇది ఎవరి పనో చెప్పనక్కర్లేదు, ఈ మధ్య కాలంలో జరుగుతున్న సంఘటనలను పరిశీలించినవారికెవరికైనా, ఈ పనులు చేస్తున్నది ఎవరో తెలిసిపోయి ఉంటుంది.


ఇప్పుడు మనం చెయ్యాల్సిన పనులు రెండు..

మొదటిది... ఈ ముచ్చులు మన బ్లాగులో ఇలాంటి రాతలు రాయకుండా చూసుకోవాలి. ముందుగా చెయ్యాల్సిన పని, మన బ్లాగులోకి అనామక వెధవల్ని రానివ్వకపోవడం. దీనితో ఈ కన్నం దొంగలకు కాస్త అడ్డం పడినట్టే! అలాగే వ్యాఖ్యల మోడరేషను కూడా పెట్టుకోండి. ఈ విషయానికి సంబంధించి కింది టపాలను చూడండి:

కొత్తపాళీ రాసిన ఈ టపా
నల్లమోతు శ్రీధర్ రాసిన ఈ టపా

పై టపాల్లోని సూచనలను పాటించండి.

ఇక రెండోది.. మీ బ్లాగుకు ఎవరెవరు వస్తున్నారో గమనించండి. ఇది చాలా తేలిక.. ఒక హిట్‌కౌంటరు లాంటిదాన్ని మీ బ్లాగులో పెట్టుకోండి. మీ బ్లాగుకు వచ్చే సందర్శకులు ఏయే ఐపీ అడ్రసుల నుండి  వస్తున్నారో, అది గమనిస్తూంటుంది. ఈ కన్నం దొంగలు వ్యాఖ్యలు రాసినపుడు, ఈడెవడో దొంగలాగున్నాడే  అని మీరు అనుమానించినపుడు, (వ్యాఖ్యను ఎలాగూ ప్రచురించరనుకోండి) అది ఏ ఐపీ అడ్రసునుండి వచ్చిందో గమనించి రికార్డు చేసిపెట్టుకోండి. దీని వలన తక్షణ ప్రయోజనం ఉండకపోవచ్చు.. కానీ ఈ కన్నం దొంగలు పెద్ద దొంగతనమేదైనా చేసినపుడు, మన దగ్గర ఉన్న ఈ సమాచారం, మిగతావారి దగ్గర ఉన్న సమాచారంతో పోల్చి చూసుకునేందుకు అక్కరకు రావచ్చు. గతంలో ఇది అక్కరకు వచ్చింది కూడా!


పై సూచనలను పాటిస్తే ఈ కన్నం దొంగలను కొంతవరకైనా అడ్డుకోవచ్చు. ఇది తక్షణావసరమని మనం గ్రహించాలి. 

-----------------------------------------------------------------


ఒకటి మాత్రం ఖాయం.. నేను బ్లాగడం మానను, వ్యాఖ్యలు రాయడం మానను, నా బ్లాగును కూడళ్ళతో సహా అందరికీ - అం... థరికీ - అందుబాటులో ఉంచడం ఖాయం. [నేను చేస్తున్న పనుల్లోని మంచిచెడుల పట్ల నాకు స్పష్టత ఉంది. నేనెవ్హడికీ భయపణ్ణు. తాలుమాటలు మాట్టాడే సవట సన్నాసులను అసలు లెక్కే చెయ్యను.]

కానీ..,

పైన చెప్పిన జాగ్రత్తలు మాత్రం తీసుకుంటాను. నన్నూ నా తోటి బ్లాగరులనూ ఈ దొంగల బారిన పడకుండా చేసే మార్గాలు ఇవని నేను గ్రహించాను.

17 కామెంట్‌లు:

 1. ఇప్పటికే ఈ ముష్కరులు చాలా అపోహలు కల్పించడంలో సఫలులయ్యారు. ఇప్పుడు మరిన్ని సమస్యలు సృష్టించడానికి తయారయ్యారు. మన జాగ్రత్తల్లో మనముండడం చాలా అవసరం.

  రిప్లయితొలగించండి
 2. చదువరి గారూ,
  Just so you know, It is very easy to spoof an IP address. For example, you will see that this comment is coming from an European IP address where as I am posting it from a computer with US IP address.

  రిప్లయితొలగించండి
 3. ఇంత కష్టపడకుండా ప్రొఫైల్ లో ఫోటొ పెట్టుకుంటే చాలు. ఎవరైనా మీ పేరుతో కామెంట్ రాస్తే ఫోటొ బట్టి దొరుకుతారు.

  రిప్లయితొలగించండి
 4. చదువరిగారూ,తప్పకుంద మీ సూచనలు పాటిస్తాము.

  రిప్లయితొలగించండి
 5. ఈ హిట్ కౌంటర్ ఎలా పెట్టాలి?కొంచెం మైల్ చేయండి

  రిప్లయితొలగించండి
 6. ఇలాంటివి అడ్డుకోవడం సాధ్యమైన పని కాదు. Ip address, PROXY లను ఉపయోగించి చాలా సులభంగా మార్చ వచ్చు. ఇక మలక్ పేట రౌడి గారి సూచన కూడా Tamper చేయవచ్చు. photo ని download చేసుకోవచ్చు కదా..... ఇంతకంటే వివరాలు ఇక్కడ ఇవ్వడము సాధ్యం కాదు.

  రిప్లయితొలగించండి
 7. శుభ్రంగా అందరూ వర్డ్‌ప్రెస్‌కి మారిపోండి. అక్కడైతే ఐపి పట్టుకోటం అతి సులువు. దాన్నుపయోగించి (చాలావరకూ) అసలు, నకిలీ వ్యాఖ్యాతల్ని పట్టేయొచ్చు.

  రిప్లయితొలగించండి
 8. అవును, వార్డ్ ప్రెస్ లో ఐ.పి. పట్టడం చాలా సులభమే. ఆ ఐ.పి. ఏ కంపెనీ వాళ్ళదో పట్టడం కూడా చాలా సులభమే. ఇది నా ఐ.పి. http://whois.domaintools.com/59.90.160.86

  రిప్లయితొలగించండి
 9. ఫొటొ ని డౌన్లోడ్ చేస్తే కొత్త ప్రొఫైల్ క్రియేట్ చెయ్యాలి. యూ ఆర్ ఎల్ వాడినప్పుడు అది పనికిరాదు.

  రిప్లయితొలగించండి
 10. కౄతజ్ఞతలు.. ఇంకా కొద్దిగా వివరణ ఇస్తే బాగుంటుంది

  రిప్లయితొలగించండి
 11. నోరొళ్లబెట్టుక్కూర్చున్నాను ఇది చదివి... ఓరి వీళ్ల ఠస్సాదియ్యా! మన జాగ్రత్తలో మనం ఉండడం మంచిది. మంచి సమాచారం అందించారు.

  రిప్లయితొలగించండి
 12. నేనెందుకో మొదటి నుండీ అజ్ఞాత వ్యాఖ్యలకు అవకాశం ఇవ్వలేదు. సకాలంలో స్పందించి మంచి సూచనలందించారు. ధన్యవాదాలు!

  రిప్లయితొలగించండి
 13. వ్యాఖ్యాతలందరికీ నెనరులు. దుర్గేశ్వర గారూ, మీరు statcounter.com అనే సైటుకు వెళ్ళి (అలాంటి సైట్లు చాలానే ఉన్నాయి) ఖాతా తెరచి, వాడు చెప్పినట్టుగా చేస్తే వాడు ఒక కోడు ఇస్తాడు. దాన్ని మన బ్లాగులో పెట్టుకుంటే సరిపోతుంది. అదెలాగో నేను మీకు రాస్తాను.

  రిప్లయితొలగించండి
 14. ఇది చదివి... ఓరి వీళ్ల ఠస్సాదియ్యా! మన జాగ్రత్తలో మనం ఉండడం మంచిది. మంచి సమాచారం అందించారు.
  saar mee choochanalu blogars andhariki chaala vupayeoga padathaayyi thank you sir

  రిప్లయితొలగించండి
 15. nenu kuda ee id theft ki guri ayyina vadine. telugupeople.com lo ilage evaro na id trap chesi dongatanam ga vaadukunnaru.naku telisi asalu nenu aa comment cheyyaledu :(

  రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు