30, ఆగస్టు 2009, ఆదివారం

హిందూ వ్యతిరేక దళితిస్టువాదం

దేశంలో కొంతమందికి హిందూమతాన్ని విమర్శించడం ఫ్యాషనైపోయింది. హిందూమతాన్ని తిడుతూ, ఇతర మతాలను వెనకేసుకొస్తూంటారు. వీళ్ళు కాలం చెల్లిన, బూజు పట్టిన పాత కబుర్లు చెబుతూ, "మనుస్మృతిలో అలా చెప్పారు, రామాయణంలో ఇలా చెప్పారు, కొన్ని కులాల వాళ్ళను వేదం చదవనీయలేదు, కృష్ణుడు ఇలా చేసాడు, దేవుళ్ళంతా కొన్ని కులాలకే చెందినవాళ్ళు, ఇతర కులాలకు దేవుళ్ళు లేరు.." - ఇలాంటి అరిగిపోయిన వాదనలు చేస్తూంటారు. ఇలాంటి వాదనలు చేసేవాళ్ళను దళితిస్టువాదులు అనీ, వీళ్ళ వాదాన్ని దళితిస్టువాదం అని అంటారు.
బ్రాహ్మణవాదం, బ్రాహ్మిణికల్ యాటిట్యూడ్ అంటూ ఒక ఆలోచనాధోరణి ఉందని అంటూంటారు చూసారూ.. అలాంటిదే ఈ దళితిస్టువాదం. ఈ దళితిస్టువాదం కేవలం దళితకులాలవాళ్ళే చేస్తారని అనుకుంటే అది పొరపాటు; ఎవరైనా చేస్తారు. అలాగే దళితవాదం దళితిస్టువాదం ఒకటేనని కూడా పొరపాటు పడకూడదు. దళితవాదం దళితుల అభ్యున్నతి గురించో, దళితుల గురించో మాట్టాడుతుంది. ఇదలాక్కాదు.. దీనిముఖ్యమైన లక్షణమేంటంటే ప్రతిదానికీ హిందూమతాన్ని పట్టుకు విమర్శించడం! ఒక్క ఉదాహరణ చెబితే గబుక్కున అర్థమౌతుంది..

ఇదిగో మా ఇంట్లో ఇవ్వాళ పాలు విరిగిపోయాయి, మీ ఊళ్ళో నిరుడు శివరాత్రికి వాన కురిసిందిగదా.. అందుకే ఇలా జరిగింది. కాబట్టి తప్పంతా హిందూమతానిదే, అంచేత నువ్వు వెంఠనే మతం మారిపోవాలి.

ఇలా ఎవరైనా మాట్టాడితే వాళ్ళని దళితిస్టువాదులంటారు. దాన్ని దళితిస్టువాదం అంటారు.

దళితిస్టువాదులు 'ఇతర మతం' చేతిలో బొమ్మలు. ఆ మత ప్రచారకులకు వల్లమాలిన దొంగ తెలివితేటలుంటాయి. ఖతర్నాక్‌లు వాళ్ళు. వాళ్ళు ఈ దళితిస్టువాదులను ఆడిస్తూంటారు. వీళ్ళచేత మాట్టాడిస్తూంటారు. హిందూమతానికి వ్యతిరేకంగా మాట్టాడ్డానికి పురాణాలు వేదాలపై కత్తులు ఝళిపించేవాళ్ళు గతంలో. కానీ తమ కత్తిని హిందూవ్యతిరేకత మీద సానబట్టే క్రమంలో దాన్ని అరగదీసి, అరగదీసి, అరగదీయగా కత్తి పూర్తిగా అరిగిపోయి ఉత్త పిడి మిగిలింది వీళ్ళ చేతుల్లో. అది పట్టుకోని పిడివాదం చేస్తూంటారు. దళితిస్టువాదుల వాదాలు కొన్ని చూద్దాం.

గతంలో హిందూమతం నిరంకుశంగా పాలించి కొన్ని కులాలను అణిచేసింది. కాబట్టి వాళ్ళంతా ఇప్పుడు గబగబా మతం మార్చేసుకోవాలి అని అంటూంటారు. అందుకోసం ఒక భావజాలాన్ని వాడతారు వీళ్ళు. కొందరు, 'దళితుల తిండి వేరు, వాళ్ళ సంస్కృతి వేరు,' అంటారు. కొందరు ఇంకాస్త అతికిపోయి 'అసలు వాళ్ళు హిందువులే కాదు. వాళ్ళ దేవుళ్ళు వేరు, హిందూ దేవుళ్ళు వేరు' అంటూంటారు. పోచమ్మ, పోలేరమ్మలు హిందూ దేవతలు కారని ఒక ప్రొఫెసరు మాట్టాడితే ఓ పత్రికాసంపాదకుడు ఉదాహరణలతో సహా గట్టిగా జవాబిచ్చాడు.

ఇంకొంతమంది మాటల్లో విషం గక్కుతూ ఉంటారు. కొన్ని కులాలవాళ్ళ ఆహారపుటలవాట్లను హేళన చేస్తూంటారు, అక్కడికి వీళ్ళేదో రోజులో ఏడెనిమిదిపూట్ల ఉపవాసముంటున్నట్టు. ఇంకొందరుంటారు.. అసలు హిందూమతం అనే మతమే లేదంటారు. అదెప్పుడో తెలుసాండి.. ఎల్లప్పుడూ ఆమాట అనరు. దళితులు ఏ మతమైనా అవలంబించొచ్చు అని చెప్పేటపుడు 'అసలు హిందూ మతమనేదేలేదు, అంచేత మతమార్పిడి మార్పిడే కాదు ' అంటారు. కొన్ని కులాలను అణచివేసింది అని చెప్పేటపుడు మాత్రం వాళ్ళకి హిందూమతం ఉంటుంది. ఎందుకంటే అణచివేసిందెవరో చెప్పేందుకు ఒక మతం ఉనికి కావాలి కదా, అదన్నమాట! ప్రభుత్వంవారి దరఖాస్తుల్లో మతం అనేచోట హిందూ అని రాసేస్తూంటాం. మళ్ళీ అప్పుడు హిందూమతం ఉంటది.

కేవలం హిందూమతం మీద ఉన్న కసి కారణంగా తమకు తోచిన విధంగా హిందూమతాన్ని అడ్డగోలుగా విమర్శిస్తూంటారు. వీళ్ళ వాదనలు వైరుధ్యాల పుట్టలు.

కానీ ఇతరమతాలను పల్లెత్తి మాట అనరు. ఆయా మతాలతో రహస్య ఒప్పందమేదో ఉన్నట్టు ప్రవర్తిస్తూంటారు. ఆ మతాలను వెనకేసుకు వస్తూంటారు. లేదు లేదు, ఆయామతాలే వీళ్ళను ముందుపెట్టుకు వస్తూంటాయి. ఇస్లామిక ఉగ్రవాదులు ముంబైలో మారణకాండ సృష్టించారని ఎవరైనా అన్నారనుకోండి.. "అలా మతం పేరుపెట్టి అనకూడదు, తప్పు తప్పు", అంటూ మీదకొస్తారు. వీళ్ళు మాత్రం హిందూమతాన్నే కాదు, హిందూదేవుళ్ళను కూడా అడ్డగోలుగా విమర్శిస్తూంటారు.

'హిందూమతం మిమ్మల్ని అణచేసింది కాబట్టి మీరు హిందూమతాన్ని వీడిపోవాలి, పదండి పదండి' అని అమాయకులను ఎగదోస్తూ ఉంటారు. (ఈ సందర్భంలో హిందూమతం అనేది ఉంది -గమనించండి) అక్కడికి అవతలి మతాలేదో స్వర్గతుల్యమైనట్టు! ప్రపంచంలోని మతాలన్నిటికంటే ఈ దళితిస్టువాదులను నడిపిస్తున్న మతాలే భయంకరమైనవి. క్రూసేడ్లు చూడండి. తెల్లోడు మన దేశాన్ని ఆక్రమించుకునే క్రమంలో మతాన్ని ఒక ఆయుధంగా వాడిన సంగతి చూడండి. అసలు మన సంగతి ఎంత లెండి.. చాలా చిన్నది.. మొన్నటిదాకా జింబాబ్వే పేరు రోడీషియా. రోడ్స్ అనేవాడి పేరిట ఆ పేరు వచ్చింది. సంగతేంటంటే వాడు ఇంగ్లండు నుండి ఆ దేశానికి వలసవెళ్ళి, అక్కడ మైనింగు కోసమని భూముల్ని కాజేసి స్థిరపడిపోయాడు. వాడు పెట్టిన కంపెనీయేనట, డి బీర్స్ అనే వజ్రాల వ్యాపార సంస్థ. కాజెయ్యడమంటే మన దొరగారిలాగా ప్రభుత్వభూమి ఓ ఆరేడొందల ఎకరాలను ఆక్రమించేసుకోడం కాదు, మొత్తం దేశాన్ని ఆక్రమించేసుకుని దేశానికి తన పేరు పెట్టేసుకున్నాడు వాడు. ఇదీ వాళ్ళ గొప్పదనం. అమెరికాలో ఉన్నదెవరు? ఆస్ట్రేలియాలో ఉన్నదెవరు? -వీళ్ళు అణచివేత గురించి దళితిస్టువాదులచేత మనకు చెప్పిస్తూంటారు, భలే!

యూరపులో ననుకుంటా.. ఒక సన్నటి కొండ ఉంది.. ప్రాచీన మానవులు వేలాది గుర్రాలను మూడువైపుల నుండి కమ్ముకుని తమ ఆయుధాలు, కాగడాలతో భయపెట్టి, బెదరగొట్టి, తరిమికొట్టి వాటిని ఆ కొండకొమ్ముకు పరుగెత్తించి అక్కడినుంచి కింద లోయలోకి దూకేసేలా చేసేవారంట. అంత ఎత్తునుంచి అవి పడిపోయి తక్షణం చచ్చిపోయేవి. ఆనక తీరిగ్గా వాటిని తినేవారట.

ఇప్పుడు హిందూ వ్యతిరేకవాదులు, ప్రచ్ఛన్న మతప్రచారకులు కలిసి అమాయక హిందువులను తమ భావజాలంతో, దళితిస్టువాదంతో భయపెట్టి 'ఇతరమతం' లోకి దూకేలా చేస్తున్నారు. అదుగదుగో ఆ కొండకొమ్ముకు వెళ్ళి 'ఇతరమతం' లోకి దూకండి, అక్కడ మీకు స్వర్గం ఉంది అని చెబుతున్నారు. దూకాక ఇంకేముంది.. ఆనక ఆ 'ఇతరమతస్తులు' వాళ్ళను తీరుబడిగా నంజుకు తింటారు, అది ఖాయం!

ప్రజలను మతమార్పిడి కోసం ఉసిగొల్పేందుకుగాను, హిందూమతం గురించి ఎట్టా మాట్టాడినా పరవాలేదని దళితిస్టువాదం అనుకుంటోంది. వీళ్ళ వాదనల్లోని డొల్లతనాన్ని మనం బయటపెడుతూనే ఉండాలి.

------------------- -- X -- -------------------

49 కామెంట్‌లు:

 1. మెజారిటీ దళితవాదులు హిందూమతంలో ఉంటూనే హిందూ ఆభిజాత్యంతో పోరాడటానికి సుముఖత చూపుతారు. ఈ విషయం మీకు తెలీదు. ఎందుకంటే మీరు తెలుసుకోవడానికి ఎప్పుడూ ప్రయత్నించలేదు.

  మతం మార్పిడిని సైద్ధాంతికంగా దళితవాదం ప్రోత్సహించదు. కానీ వనరులను అందిపుచ్చుకోవడానికి,గౌరవప్రదంగా బ్రతకడానికీ కొందరు మతం మార్చుకుంటే దాన్ని సహానుభూతితో అంగీకరిస్తారేతప్ప గర్హించరు. ఈ పరిణామాన్ని సహానుభూతితో అర్థం చేసుకునే విశాలత్వం మీలాంటి హిందుత్వవాదులకు రాదు. ఎందుకంటే దళితుడిగా బ్రతకడమంటే ఏమిటో మీకు తెలియదు గనక.

  హిందుత్వాన్నితప్ప హిందూతత్వాన్ని వంటబట్టించుకోని మీలాంటి అతివాదాల అతివాదులున్నంతకాలం వాటికి ప్రతిగా కొన్ని నిరసనస్వరాలు వినిపిస్తూనే ఉంటాయి. పిడివాదమన్నా, దళితిష్టువాదమన్నా అవి ప్రతివాదాలేతప్ప సిద్ధాంతాలు కావని మీకు తెలీనంత వరకూ మీ మూర్ఖ్హత్వం మీది...అలాగే మాదీనూ!

  రిప్లయితొలగించండి
 2. మా పట్టణంలోని దళితుల్లో ఎక్కువ మంది హిందువులే. ఈ మధ్య ఒక దిన పత్రికలో వార్త వచ్చింది. "దళిత క్రైస్తవులలో ఎక్కువ మంది మాల వాళ్ళు" అని. మాల వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఇతర దళిత కులాల వాళ్ళతో పోలిస్తే చాలా మెరుగ్గా ఉంది. ఇంతకు ముంది నా ఆఫీస్ రెల్లి కులస్తులు ఉండే వీధి దగ్గర ఉండేది. వాళ్ళ వృత్తి మునిసిపాలిటీ పారిశుధ్య కార్మికులుగా పని చెయ్యడం, ఇంటి లెట్రిన్లు కడగడం, స్వీపర్ పని చెయ్యడం వగైరా. రెల్లి కులస్తులలో ఎక్కువ మంది హిందువులే. కొన్ని దళిత కులాల వాళ్ళు క్రైస్తవ మతం వైపు incline అయినంతమాత్రాన దళితులందరినీ హిందూ వ్యతిరేకులు అనడం సరైనది కాదు.

  రిప్లయితొలగించండి
 3. మన రాష్ట్రంలోని చర్చిలలో అగ్రకుల క్రైస్తవుల్ని ముందు వరసలో, దళిత క్రైస్తవుల్ని వెనుక వరసలో కూర్చోపెట్టడం జరుగుతోంది. హిందువులు దేవాలయంలోకి రానివ్వడం లేదని దళితులు క్రైస్తవ మతంలో చేరుతున్నారు కానీ క్రైస్తవ మతంలో చేరిన తరువాత వాళ్ళకి ఇలాంటి అనుభవాలు ఎదురవుతాయి. రాష్ట్ర జనాభాలో 16% మంది దళితులు. దళితుల్లో 100% మంది క్రైస్తవ మతంలో చేరినా సంఖ్య కారణంగా మీ హిందువులని ఓడించలేరు. క్రైస్తవ వ్యతిరేక ప్రచారం చెయ్యాలనుకుంటే ఫార్వార్డ్ కాస్ట్ క్రిస్టియన్ అయిన రాజశేఖరరెడ్డి పై విమర్శలు చెయ్యొచ్చు.

  రిప్లయితొలగించండి
 4. మీభావాలతో ఏకీభవించని ప్రతి ఒకరూ "మూర్ఖులు" గానూ, "విశాలభావాలు" లేని వారు గానూ కనిపిస్తారా మీకు? దళితుడిగా బ్రతకడం అంటే ఏమిటో తెలీదు, ఫలానా పుస్తకం చదువు, ముందు దళితవాదం తెలుసుకో, నే చెప్పిన రెండు చరిత్ర పుస్తకాలు చదువు - అన్న పనికిమాలిన రిటోరిక్ చర్చలకు ఏవిధంగానూ సహకరించదు - ఇవన్నీ భాషమీద మీ పైశాచిక బలాత్కారాలు, చర్చించడం చేతకాని అమర్యాదకరం తప్ప ఇంకేమీ కాదు. కాబట్టి అవి మానుకుని కొంచెం సెన్స్ మాట్లాడండి!

  1. అసలు హిందుఇజం ఉందా ళేదా? ఎప్పుడు ఉంది, ఎప్పుడు లేదు??
  2. మీరు వంటబట్టించుకున్న "హిందూతత్వం" ఏమిటి?
  ప్రస్తుతానికి ఈ రెండు ప్రశ్నలకు సమాధానం చెప్పండి, తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం!!

  మీతో నిజ్జెంగా సైద్ధాంతిక/తార్కిక/సామాజిక/ఋఏషనల్/లాజికల్/ఆంత్రొపాలాజికల్/రెలిజియస్/ఫిలసాఫికల్ చర్చలు చెయ్యాలన్న సదుద్దేశం తో మీకీ సవాల్. మీ తరఫున అకెడెమియా నుంచు గన్నయ్యలను ఎంతమందిని కావాలంటే అంతమందిని తెచ్చుకోండి. చర్చించండి. (వ్యక్తిగతదాడి, నువ్వు ఇంతకుముందు వేరో పేరుతో రాసావ్, నీతో చర్చలు వద్దు అని చచ్చు కబుర్లు చెప్పి మీ పిరికితనాని నిరూపించుఇకోకండే!)

  రిప్లయితొలగించండి
 5. కాలనేమి పేరుతో మాళ్ళీ బ్లాగులోకంలో కారుకూతలు కూస్తున్న యోగీ...నీ స్టాండర్డ్ ఏమిటో...నీకున్న వందపేర్లేమిటో నీ అసలు పేరేమిటొ...నీకున్న రోగాలేమిటో నాకు తెలుసు. కాబట్టి నీతో చర్చించే ఉద్దేశం,ఓపిక,విశాలత్వం నాకు లేవు. Get lost.

  రిప్లయితొలగించండి
 6. ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 7. ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 8. ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 9. కత్తి మహేష్ కుమార్:
  ముందు మీరు కాస్త టపాను చదివి మాట్టాడాలి. ఎవరి గురించి మాట్టాడుతున్నానో, దేని గురించి మాట్టాడానో దాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. నేను దళితుల గురించి రాయలేదు. దళితిస్టువాదం గురించి రాసాను. గతంలో నేను ముస్లిము ఉగ్రవాదం గురించి రాసినపుడు కూడా ఇలాగే ముస్లిములందరినీ అన్నట్టుగా ప్రచారం చేసారు మీరు. కాబట్టి కాస్త ప్రశాంతచిత్తంతో మళ్ళీ చదవండి. గబగబా అపార్థం చేసేసుకోడానికి, దాన్నిబట్టి మీ కసిని వెళ్ళగక్కడానికీ ఒంటికాలిమీద లేస్తూ ఉంటారు మీరు. కాస్త తగ్గాలి మరి!

  "మెజారిటీ దళితవాదులు హిందూమతంలో ఉంటూనే హిందూ ఆభిజాత్యంతో పోరాడటానికి సుముఖత చూపుతారు. ఈ విషయం మీకు తెలీదు. ఎందుకంటే మీరు తెలుసుకోవడానికి ఎప్పుడూ ప్రయత్నించలేదు." (అసలు మీరు రాసే వ్యాఖ్యలకు పైన మీ పేరు రాయనక్కరలేదు మహేష్ గారూ, ప్రతీ వాక్యంలోనూ మీ ముద్ర ఖ్ఖనబడిపోతూంటుంది. నాకు చానా తెలుసని అనుకోడం, అవతలివాడికి ఏమీ తెలియదని అనడం మీ ముద్రను పట్టిచ్చేస్తూ ఉంటుంది.) ఈ విషయం గురించి తెలీడానికి దళితుడిగా పుట్టడమే అర్హత అని మీరు అనుకుంటున్నట్టున్నారు. దాన్ని అతిగా ఆలోచించడం అంటారు. అసలైనా నేను దాని జోలికి ఇప్పుడు పోడంలేదు, ఈ టపాలో పోనూ లేదు. నేను మాట్టాడినదల్లా కొందరి నీచమైన ఎత్తుగడల గురించే!

  "మతం మార్పిడిని సైద్ధాంతికంగా దళితవాదం ప్రోత్సహించదు. కానీ వనరులను అందిపుచ్చుకోవడానికి,గౌరవప్రదంగా బ్రతకడానికీ కొందరు మతం మార్చుకుంటే దాన్ని సహానుభూతితో అంగీకరిస్తారేతప్ప గర్హించరు. ఈ పరిణామాన్ని సహానుభూతితో అర్థం చేసుకునే విశాలత్వం మీలాంటి హిందుత్వవాదులకు రాదు. ఎందుకంటే దళితుడిగా బ్రతకడమంటే ఏమిటో మీకు తెలియదు గనక." - దళితవాదం గురించి నేను మాట్టాడలేదు. దళితిస్టువాదమనే కొత్త, సంకుచిత, హిందూ వ్యతిరేక, ప్రచ్ఛన్న 'ఇతరమత' వాదం గురించి రాసాను. వ్యక్తులు మతం మార్చుకునేదానిపట్ల నేనసలు ఇక్కడ రాయలేదు. పదండి పదండి మతం మారిపోండి అంటూ ప్రజలను రెచ్చగొట్టి, హిందూమతాన్ని తిట్టే కుచ్చిత మనస్తత్వం ఉన్నవాళ్ళ గురించి రాసాను. మీరు మామూలుగా మీకు అలవాటైన ధోరణిలోనే తప్పుగా చూసి, తప్పుగా అర్థం చేసుకుని, తప్పుగా రాసారు. ఆపైన మళ్ళీ మీకలవాటైన ధోరణిలోనే నన్ను తప్పు పడుతున్నారు. ఎంత లాఘవం!

  "హిందుత్వాన్నితప్ప హిందూతత్వాన్ని వంటబట్టించుకోని మీలాంటి అతివాదాల అతివాదులున్నంతకాలం వాటికి ప్రతిగా కొన్ని నిరసనస్వరాలు వినిపిస్తూనే ఉంటాయి." - హిందూమతాన్ని ఎన్ని బూతు కూతలు కూసినా, ఎన్ని తిట్లు తిట్టినా నోరు మూసుకుని పడిఉండటమే హిందూతత్వమని దొంగ లౌకికవాదులు, ఇతరమతాలవాళ్ళు, ప్రచ్ఛన్న 'ఇతరమత' వాదులూ ఇచ్చే నిర్వచనం. ఆ రకంగా చూస్తే నాకు హిందూతత్వం లేదు. అది నాకు వద్దు కూడా! నా మతం గురించి నోటికొచ్చినట్టల్లా వదరుతూ ఉన్నా ఊరుకుని ఉంటే నేను హిందూతత్వమున్నవాడినా? ఎదురుతిరిగి మాట్టాడితే అతివాదినా? సరే, నేను అతివాదినే! ఆ లెక్కన ఒకమతాన్ని అణచిపారెయ్యాలని కుట్రలు పన్నే ఈ దళితిస్టువాదులను ఉగ్రవాదులనాలి.

  "పిడివాదమన్నా, దళితిష్టువాదమన్నా అవి ప్రతివాదాలేతప్ప సిద్ధాంతాలు కావని మీకు తెలీనంత వరకూ మీ మూర్ఖ్హత్వం మీది...అలాగే మాదీనూ!" - నేను చేస్తే సంసారం తాను చేస్తే వ్యభిచారం అన్నాడంట ఎవడో! ఆ వాదమనో ఈ వాదమనో మీరు మాట్టాడితే అది సిద్ధాంతమా? నేను మాట్టాడితే అది ప్రతివాదమా?దీన్ని మొండివాదమంటారు.

  రిప్లయితొలగించండి
 10. "మతం మార్పిడిని సైద్ధాంతికంగా దళితవాదం ప్రోత్సహించదు. కానీ వనరులను అందిపుచ్చుకోవడానికి,గౌరవప్రదంగా బ్రతకడానికీ కొందఱు మతం మార్చుకుంటే దాన్ని సహానుభూతితో అంగీకరిస్తారే తప్ప గర్హించరు."

  ఇక్కడ పదేపదే పట్టుబడిపోయారు ! ఏమిటండీ ఆ సో-కాల్డ్ వనరులు ? మీరనే వనరులకర్థం డబ్బు కాదూ ? డబ్బుకి విశ్వాసాల్ని అమ్మెయ్యమని ప్రోత్సహించేవాళ్ళకొక వాదం కూడానా ? సహానుభూతిట. అవునులే. ఒక విశ్వాసవిక్రేతకి ఇంకో విశ్వాసవిక్రేత మీద సహానుభూతి ఉండాలి కదా ! మఱి మేం (హిందువులం) మా విశ్వాసాల్ని కానీకి, బేడకి, అర్ధణాకి, పావలాకి అమ్ముకోలేదు గదా ! నిజమే మాకెలా తెలుస్తుంది ? మాకు తెలిసిందల్లా కష్టపడితే పేదఱికంలోంచి బయటపడొచ్చుననేదే ! పేదఱికంలోంచి బయటపడ్డానికి ఆధునిక సమాజం, ఆధునిక నాగరికత ఎన్నో అవకాశాల్ని సృష్టించింది. అ మాట దళితులకి ఎవరూ ఎందుకు చెప్పరు ? ఎంతసేపూ హిందువుల్ని ద్వేషించమనే చెబుతారెందుచేత ?

  గుళ్ళలోకి రానంతమాత్రాన హిందూవిశ్వాసాలు కేవలం అగ్రకులాలవారివేనా ? దళితులవి కావా ? కానప్పుడు రోమన్ క్యాథలిక్ దళితస్త్రీలు మంగళసూత్రాలెందుకు ధరిస్తున్నారు ? ఆరోగ్యమాత ఆలయానికి పోయి హిందూపద్ధతిలో కొబ్బరికాయలెందుకు కొడుతున్నారు ?

  దళితవాదులు తమ వ్రాతల్లోను, కూతల్లోను చిత్రిస్తున్న క్రూర హిందూసమాజం ఎక్కడా లేదు. ఆధునిక కాలంలో అసలే లేదు. అయినా ఇంకా అదే ద్వేషాన్ని ఎందుకు పనిగట్టుకొని రెచ్చగొడుతున్నారు, వెబ్ సైట్లు పెట్టి మఱీ ? అగ్రకుల హిందువులకి ఎస్సీచట్టం లాంటిది లేదనేనా ? తాము అణగాఱిపోతే అది హిందువుల అణచివేత. తాము పైకొస్తే మాత్రం అది తమ చైతన్యం, తమ ప్రతిభ, శభాష్ ! మఱి తమరు పైకి రావడం కూడా హిందువుల సౌహార్దం, సౌమనస్యం అని ఎందుకు ఒప్పుకోరు ? రిజర్వేషన్లు కల్పించిన రాజ్యాంగసభ సభ్యులు క్రైస్తవులనుకుంటున్నారా ?

  అసలు దళితవాదులనేవాళ్ళకి మతవిశ్వాసాలున్నాయా ? అని ! నిజంగా ఉన్నవాళ్ళయితే ఆ దేవుడు, ఈ దేవుడు అని వంద దిక్కుల్లో పరిగెడతారా ? లేదా జనాన్ని అలా తోల్తారా ? మనుషులు సరిగా చూడట్లేదని దేవుణ్ణి ద్వేషిస్తారా ? అగ్రకుల హిందువుల్లో కూడా తోటి మనుషుల చేతుల్లో అవమానాలకి గుఱైనవాళ్లున్నారు. దుర్భర పేదఱికపు జీవితాన్ని గడిపినవారున్నారు. అయినవాళ్ళందరి ఆదరానికీ దూరమైనవారున్నారు. కానీ వారు ఆ అవమానించినవాళ్ళతో దేవుణ్ణి ఐడెంటిఫై చేశారా ? హిందూదేవుడు తమ బాధలకి కారణమని ఆరోపించారా ? దేవుడు ఒక్కడేననీ, ఆయన నిజంగా అందఱివాడని నమ్మేట్లయితే మతమార్పిడితో అవసరం ఉందా ? ఎక్కిరాల భరద్వాజగారు ఈ విషయమై ఒక మాటన్నారు : "దేవుడు ఒక్కడే అయితే మతం మారడం అనవసరం. అలా కాకపోతే మతం మారడం ద్రోహం"

  రిప్లయితొలగించండి
 11. కత్తి మహేష్ కుమార్: మీరు ఇలా సహనం కోల్పోయి అలా మాట్టాడ్డం నాకు నచ్చలేదు. కాస్త సంయమనం వహించండి. మీరు రాసిన చివరి రెండు వ్యాఖ్యలను (August 30, 2009 2:58:00 PM IST
  August 30, 2009 3:00:00 PM IST) తక్షణం తీసెయ్యండి. ఇంకో పావుగంటలో తీసెయ్యకపోతే నేనే తీసేస్తాను.

  రిప్లయితొలగించండి
 12. హిందువులు మమ్మల్ని రాచి రంపాన పెడుతున్నారు. మతం అంటే తూచ్. మేము క్రైస్తవ మతం చేరుతాం. అక్కడా మాకు ఇక్కడ లభ్యమవుతున్న facilities అన్నీ కావాలి. facilities ఇక్కడే దుర్వినియోగం అవుతున్నాయి కదా అంటే, అది ప్రభుత్వం వారి లోపం. సరే, ఇండియా లో దళితులే కాక మిగిలిన 93 కోట్లకు పైగా ఇతరులు ఉన్నారుగా, వారి concerns వినాలిగా, అంటే, వాళ్ళు "బూచి" ని చూపిస్తున్నారు, వారంతా మతద్వేషులు!

  దేశంలో 30 కోట్లమందికి తిండి లేదు. ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి. కేవలం దళితులొక్కటే కాదు. గత 60 యేళ్ళుగా దాన్ని address చేస్తూనే ఉన్నారు.

  మానవతా వాదం ముసుగులో ఇక్కడ జరుగుతున్నది విద్వేష వాదం మాత్రమే. ద్వేషంతో ఏ సమస్యకు పరిష్కారం దొరకదు.

  రిప్లయితొలగించండి
 13. ఈ వారం లో మాల్స్ లో క్విక్ గన్ మురుగన్ విడుదలైయింది ఆ స్పుర్తితో ఒక కొత్త బ్లాగర్ గన్నయ గారు కన్నయ గారి బ్లాగులో ప్రత్యక్షమై వాళ్ళ అన్నయ కన్నయ నోరు తెరిచార౦టే మీ వర్గాలు ఇబ్బ౦దుల్లో పడతాయి. మమ్మలను ఎన్నో తరాలను౦చి అణగ తొక్కి మా భవిష్యత్తును కాలరాచిన చరిత్రలు చాలా వున్నాయి అని క్విక్ గన్ పేల్చారు. అక్కడ రాసినది చదివితే హేతువాద ముసుగులో ఇన్నళు వారు ఒక వర్గాన్ని టార్గెట్ చేసారేమొ అని అనిపిస్తుంది.

  రిప్లయితొలగించండి
 14. నాకు తెలిసిన కొందరు దళిత మిత్రులు మతం మారలేదు. ఎందుకు అని నేను అడిగితే వారిలా చెప్పారు."కెవలం డబ్బు కోసం, మా తాత ముత్తాతలు అనుసరించిన మతాన్ని మేము ఎలా మారతాము? పైగా, మాకు ఇన్ని అవకాశాలిచ్చిన హిందూ మతాన్ని మెము వదలము.అది ఆత్మ ద్రోహం అని అన్నారు.ఇలాటి వారు ఎక్కువగా,మాదిగ,యానాది,లంబాడీ కులాలలో ఉన్నారు.మత మార్పిడులన్నీ కెవలం డబ్బుకోసమో,లేక నిష్కారణ ద్వేషం తోనో జరిగేవే.లేకపోతే అడ్డమైన పాపాలు వారమంతా చెసి,వారాంతంలో ఒక్క confession తో మళ్ళీ హటాత్తుగా పవిత్రులై పోయి మళ్ళీ పాపాలు మొదలెట్టే సౌలభ్యం కోసం తప్ప, దేవునికోసం ఎవరూ మతం మారగా నేను చూడలేదు.

  రిప్లయితొలగించండి
 15. * దేశంలో కొంతమందికి హిందూమతాన్ని విమర్శించడం ఫ్యాషనైపోయింది.

  ఫ్యాషన్ కూడా పాతదై పోయింది ఇప్పుడు వారికి అది బ్రతుకు తెరువు అయింది. ఏ గడ్డి కరచి అయిన సరె వారు లాభ పడాలనుకొని నిరంతరం విద్వెషాన్ని వెళ్ళ గక్కు తూ పని పాటా లేని టపాలు (పి.పి.టి.) రాస్తూ అప్పుడప్పుడు స్త్రాటెజిక్ అలయెన్స్ కోసం మా లోకం బ్లాగులో దూరి తమ అజ్ఞానన్ని వారి అజ్ఞనం తో పంచుకొని ఆనందించటం ఇది వీరు చేసే పని. ఈ కాతి గారు కాని, మందార గాని ఒక్కరంటె ఒక్కరూ బూటాసింగ్ కొడుకు తీసుకున్న కోటి రూపాయల సంగతి ఎక్కడైనా ప్రస్తావించారా? తమ అడ్డదిడ్డమైన వాదనల తో ఆకరికి దళిత నాయకులు, విద్యావంతులు ఎలా తయారయ్యారు అంటె పాము తన గుడ్లను తానే తింటుందని చదివాం కదా వీరు అంతె వారి వర్గం లోని పేదల పేరు చెప్పుకొని వీరు సుఖాలు అనుబవించటం. వీరికి ఎప్పుడు ఇతర రాష్త్రాల దళిత నాయకుల బొమ్మలు తమ కార్య క్రమాలలో ఉంచటం. వారేదో ఆ రాష్ట్రలలో పొడి చెసినట్లు. వీరికి 60 సం|| స్వతంత్ర చరిత్ర లో ఒక్క తెలుగు దళిత నాయకుడు దొరకలేదా? కనీసం మన మాజి ముఖ్య మంత్రి దామొదర సంజీవయ్య గారిని కాని గౌతు లచ్చన్న గురించి కాని కనీసం ఒక్కసారి కూడా ఏ ప్రముఖ దళిత నాయకులు ప్రస్తావించరు.

  రిప్లయితొలగించండి
 16. బాగా గడ్డి పెట్టారు .. బెస్ట్ పొస్ట్

  రిప్లయితొలగించండి
 17. మహేష్ గారు, మిడి మిడి జ్ఞానం తో, విషపూరిత ఆలోచనలతో కళ్ళు మూసుకుపోయి "మైక్రోసాఫ్ట్ కంపెనీలో కూడా దళితులకు రిజర్వేషన్లు ఉండాలి, అసలు మెరిట్ ను ప్రాతిపదికగా తీసుకోకూడదు" అని అంత్యంత నీచ దిగజారుడు వ్యాక్ష్యలు చేసిన మీరు మరొకరిని "మూర్ఖుడు" అనడం పద్దతిగా లేదు.

  రిప్లయితొలగించండి
 18. దళితులు హిందూ మతాన్ని ద్వేషిస్తున్నారంటే, అది హిందూ మతంలోని ప్రజల లోపమే.
  వివక్ష లేకపోతే అలా ద్వేషించే అవకాశమే లేకపోయేది. గుర్రం జాషువా, అంబేద్కర్ ఈ అరాచకాలను తట్టుకోలేకనే వెళ్ళారు.
  వేరే మతంలో చేరటం అనేది ఒక సంస్కృతి ని వదిలిపెట్టేయటమే. అది యే సంస్కృతి ప్రజలకైనా బాధ కలిగించే విషయమే. ఇటువంటి అవకాశాలనే ఉపయోగించుకొని దుష్ట మత ప్రచారకులు అమాయక ప్రజల మీద రుద్దుతున్నారు.
  తాము అనుభవించిన కష్టాల మూలంగానే, వాటికి మూలం ఏమిటని అలోచించటం మొదలౌతుంది. కానీ ఈ క్రమలోనే వారు సమాజం మీద పగ తీర్చుకోవటం దురదృష్టకరం.

  ఈ సమస్యకు పరిష్కారం ముందు హిందూ మతంలోని వివక్షను రూపు మాపటమే. అది జరగటానికి చాలా సమయం పడుతుంది కనుక , అందుకోసం ప్రయత్నాలు జరగాలు.
  బాగా చదువుకున్న వాళ్ళే కులాన్ని ప్రదర్శించటానికి ప్రాముఖ్యం ఇస్తున్నారు. అది ఎప్పటికి పోతుందో ?

  అమాయక ప్రజల మీద తమ విశ్వాసాలను బలవంతంగా రుద్దుతున్న వారిని, చదువుకున్న దళితులైనా సమర్ధించకూడదు. ఇది మన నుంచే మొదలవ్వాలి .

  రిప్లయితొలగించండి
 19. ఒకప్పుడు దళితులకి ఆకు బయట వేసి భోజనం పెట్టేవారట.నానమ్మ గదిలోనే ఒక పక్క భోజన్మ్ పెట్టేవారు.అమ్మ హయాము వచ్చేసరికి మాతోనే పక్కన కుర్చుని తినేవారు.నాకు ఇప్పుడు ఎవరు ఏ కులం వాళ్ళో తెలియదు.అందరూ ఒకదగ్గరే తింటున్నాము.వివక్షత ఒకప్పుడు వుండేదన్న మాట నిజమే.కానీ రూపుమాసిపోతున్న దాన్ని రిజర్వేషన్లంటూ వాళ్ళ కులాన్ని పదే పదే పట్టి చూపిస్తూ వాళ్ళని వాళ్ళు జనాలనుండి సెపరేటు చేసుకుంటున్నారు.పదే పదే మీ కులాన్ని తక్కువ చేసి మాట్లాడుకోవడం మానండి.ఇప్పుడు అగ్రకులాలు అని చెప్పబడుతున్న రెడ్డి,కమ్మ మొదలైన కులాలవారిని ఒకప్పుడు శూద్రులు అనే అనేవారు.ఇప్పుడు వారెలా అగ్రకులాల వాళ్ళయ్యారు.వాళ్ళేమి పోరాటం చేసారు.ఆలోచించండి.మార్పు దానంతట అదే జరుగుతుంది.ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోండి. మీకేమతం మంచిదని అనిపిస్తే అదే అవలంభించండి.కానీ పనిగట్టుకుని పనికిమాలిన వాదనలొద్దు.హిందూ మతం పై అనవసర ప్రసంగాలొద్దు.హిందూమతం లో లోపాలుంటే మేము చూసుకుంటాము.వేరే మతాల వాళ్ళ సలహాలు మాకక్ఖర్లెద్దు.వద్దనుకుని వదిలి వెల్లిపోయి మళ్ళా రోజూ అదే తలవడం ఎందుకు.రాముణ్ణి వందసార్లు తిట్టారనుకోండి ఆయన పేరు ని వంద సార్లు జపించినట్టే తెలుసుకోండి.

  రిప్లయితొలగించండి
 20. ముఖ్యమంత్రి వై ఎస్ గారు తాంబూలాలిచ్చేసారు. ఇహ తన్నుకు చావండి అందరూనూ.

  రిప్లయితొలగించండి
 21. I second Sarath :-)

  Cool down. చదువరిగారు, ఈ రొంపిలోకి మీరు దిగుతారనుకోలేదు!

  రిప్లయితొలగించండి
 22. వెంకటరమణగారితో ఏకీభవించలేనందుకు విచారిస్తున్నాను. ఆయనకి సమస్య లోతుపాతుల్ని ఎవరైనా వివరిస్తే బావుంటుంది. హిందూధర్మంలో దుర్విచక్షణ ఉందనేది ప్రచారమే తప్ప వాస్తవం కాదు. మతానికీ, కులానికీ, సంఘానికీ అనవసరంగా ముడిపెట్టి మాట్లాడేవాళ్ళవల్లనే మనం ఈరోజు ఈ చర్చ చెయ్యాల్సి వస్తున్నది. ఆ పొఱపాటు మనం కూడా చేస్తే మంచిది కాదు. హిందూధర్మంలో హిందూశాస్త్రాల్లో దళితుల గురించి అస్పృశ్యత గురించి ఎక్కడా ప్రస్తావించబడలేదు. హిందూశాస్త్రాలు గుర్తించిన కులాలు నాలుగే. అస్పృశ్యుల ప్రస్తావన ఎక్కడా లేదు. అస్పృశ్యులు నాలుగో వర్ణమైన శూద్రకులాల కిందికి రారు. ఎందుకంటే శూద్రులు అస్పృశ్యులు కారు. అటువంటప్పుడు ప్రతిదానికీ హిందూధర్మాన్ని దోషిని చేసి మాట్లాడ్డం వ్యక్తుల దోషాలకి వ్యవస్థల్ని నిందించడం అసమంజసం.

  సరే, ఒకవేళ హిందూధర్మంలోనే నిజంగా లోపం ఉంటే ఎవరు సంస్కరించాలి ? దేన్ని సంస్కరించాలి ? ఎలా సంస్కరించాలి ? ఎవరికా అధికాఅర్ం ఉంది. లోపం ఒకచోటా, సంస్కరణ ఇంకో చోటా సాధ్యమవుతుందా ? హిందువులు అస్పృశ్యత పాటిస్తే హిందూమతం దుర్మార్గమైనదా ? హిందువులు దాన్ని పాటించడం మానేస్తే హిందూధర్మం మంచిదైపోతుందా ? ఎలాగబ్బా ? అంటే - హిందువుల్ని బట్టి హిందూధర్మమా ? హిందూధర్మాన్ని వ్యక్తుల నుంచి వేఱుచేసి చూడ్డం మనకి చేతకాదా ?

  దళితుల ద్వేషానికి గుఱైనంతమాత్రాన హిందువులు గానీ, హిందూధర్మం గానీ తప్పుచేసినట్లు కాదు. హిందూమతం మీద దళితులేమీ జడ్జిలు కారు. ఈరోజుల్లో ఎవరినైనా ద్వేషించడానికి కేవలం అర్థం లేని ప్రచారం, అవాస్తవికమైన నెగటివ్ పబ్లిసిటీ చాలు. ఆ ద్వేషించబడేవాళ్ళు ఏ అపకారమూ ఎవరికీ చెయ్యకపోయినా వాళ్ళని అందఱూ ద్వేషించేలా చెయ్యొచ్చు. యూదులు ఎవరికి అపకారం చేశారని వాళ్ళని నాజీలు చంపారు ? కేవలం యూదులు దుర్మార్గులని ప్రచారం చేసి, చంపారు.

  "మనమొక్కళ్ళమే హేతుబద్ధ ప్రవర్తన కలిగినవాళ్ళం, పూర్వీకులు కాదు" అనుకోవడం చాలా పొఱపాటు. పూర్వీకుల sense of justice కంటే మన sense of justice ఎంతమాత్రమూ గొప్పది కాదు. దళితుల్ని దూరం పెట్టడానికి వారికున్న బలమైన కారణాలు వారికున్నాయి. అవి వారి దేశకాల పరిస్థితులకి సంబంధించిన కారణాలు. ఆ దేశకాల పరిస్థితుల్లో మనం జీవించడం లేదు కనుక వాటిని మనం ఈ రోజు అర్థం చేసుకోలేము. కనీసం ఊహించను కూడా ఊహించలేము. అవన్నీ తెలుసుకోకుండా ఊరికే "హిందూమతం ద్రోహం చేసింది, ద్రోహం చేసింది" అని మాటకి పదిసార్లు అనడం న్యాయం కాదు.

  దళితులు ఈరోజు కనపడుతున్నట్లే ఆ రోజు కూడా ఉన్నారనుకోవడం అమాయకత్వం. అలాగే ఈరోజు ఉన్న దళితజనాభా కూడా ఆ రోజుల్లో లేదు. దళితులని చెప్పబడుతున్న వర్గాల యొక్క పూర్వీకుల చరితం సరైనది కాదు. దళితవర్గం మొదటినుంచి ఒక ఏకాండీవర్గంగా ఉంటూ వచ్చింది కూడా కాదు. అది క్రమేపీ నానాకులాలవారి చేఱికతో ఎవాల్వ్ అవుతూ పెఱుగుతూ వచ్చింది. ముందు అది తెలుసుకోవాలి.

  రిప్లయితొలగించండి
 23. తాడేపల్లి గారు నేను 'హిందూ మతంలోని ప్రజల లోపం' అన్నాను. హిందూ మతం సిధ్ధాంతాలలో అస్పృస్యత ఉందని అనలేదు.

  ఇక్కడ మీ వ్యాఖ్యతో ఏకీభవించలేకుండా ఉన్నానండీ. వివక్ష ఉండటానికి నిస్సందేహంగా హిందువులదే బాధ్యత.

  ఇప్పుడు కొంతవరకు తగ్గింది కూడా. అయినా అది సరిపోదు. నేను ప్రస్తావించిన విషయం 'హిందూ మతం ' మీద ఎందుకు ద్వేషం పెంచుకుంటున్నారనే. ఇది వాస్తవం. ఈ వివక్ష ఇంకా తగ్గించటం అన్నది మనందరి బాధ్యత.

  రిప్లయితొలగించండి
 24. హ హ .. యొగి స్టాండర్డ్ తొ పొలికా. ఆ స్టాండర్డ్ అందుకొలెకే కదా పారిపొయెది :-)

  రిప్లయితొలగించండి
 25. *ఇప్పుడు కొంతవరకు తగ్గింది కూడా. అయినా అది సరిపోదు. నేను ప్రస్తావించిన విషయం 'హిందూ మతం ' మీద ఎందుకు ద్వేషం పెంచుకుంటున్నారనే. ఇది వాస్తవం. ఈ వివక్ష ఇంకా తగ్గించటం అన్నది మనందరి బాధ్యత.*

  తాడెపల్లి గారు, మీరు ప్రతి పిల్ల వాడికి జావబులు ఇవ్వవలసిన అవసరం లేదు. నేను మా మేనల్లుడు 18 సం|| వాడికి నేను డిగ్రి చదివేవరకు మా చిన్నతనం లో టి.వి. లేదు అని చెపితె వాడు నమ్మలేదు. వాడికి నచ్చ చెప్పటానికి నాకు అరగంట పట్టింది. వెంకట రమణ బోటి వాళ్లకు పుస్తకాలు చదివి చలా తెలుసు అనుకుంటారు కాని వారికి తెసిందంతా సెకండ్ హాండ్ నాలేడ్జ్ మాత్రమే. ఇంత మంది ఇక్కడ మాట్లాడుతారు కదా అసలికి నాకు తెలిసి నా చిన్న తనం లో పాకీ వాళ్లు ఉండె వారు. వారి జీవితాన్ని మేరుగు పరచింది బాంబయ్ లేట్రిన్ లను కనుకొన్న వాడు. కాని ఆ ఇన్వెన్షన్ ని కనుగొన్న వారి గురిచ్ని అది భారతీయ సమాజమ్నికి ఉపయొగ పడీంట్లు నాకు తెలిసి ఇంకెమి అంత ఉపయొగ పడలేదు. ఎవ్వరు ఎక్కడా ఈ విషయాన్ని ప్రస్తావించరు.
  వెంకట రమణ ఎక్కడ మాట్లాడెవారు ఎవ్వరు కూడా వివక్షత పాటించరు కాని నువ్వు మనదరి భాద్యత అంటె ఎవ్వరు ఈ మనందరు? నువ్వు భాద్యత తీసుకొని అందరి దగరకి వేల్ళ్ళి చెప్పు మా తరపున. ఇలా ఎంతో మంది అగ్రవర్ణాలకి చెందినవారు ఆ రోజులలో చెప్పారు వారి వలననె ఎంతొ మేలు పొందిన దళితులు వారి వ్యాసాలలో ఎక్కడా ఈ అగ్రవరణ సామాజిక నేతల గురిచ్ణి రాయారు. ఎంత సేపటికి వారు పూలే లాంటి వారి గురించె రాస్తారు. వారేదొ బ్రాండ్ బిల్డింగ్ పని లో ఉంటె నీ లాంటి వారు ఎదో అంతా తెలిసినట్లు ఊరకే కామేంట్లు రాస్తారు. నీ వయసు 27, నువ్వు చేసెది software ఉద్యొగం నీకు ఉన్న తీరిక సమయమేంతా? నువ్వు చదివిన పుస్తకాలు ఎంఇటి? నీకు తెలిసిందెంతో (source of knowledge)మాకు తెలిపేది.
  *. వివక్ష ఉండటానికి నిస్సందేహంగా హిందువులదే బాధ్యత.*
  దళితుల హక్కులు కాపాటనికి ఎన్నొ చట్టాలు చేసారు. దానిని అమలు చేయటం లో ప్రభుత్వం ఫైల్ ఐతె హిందువుల భాద్యత ఎలా అవుతుంది? నేను నువ్వు భాద్యుడివి అంటె ఒప్పుకుంటావా? నువ్వు ఇంకా అంటరానితనం పాటిస్తున్నావా? నాకు 10+2 వరకు risarvetion ల గురించి కూడా తేలిదు. do not write like కొంతవరకు తగ్గింది it is responsibility of governament to act on this issue. go and ask govt do not blame hindus unnecessarly.

  రిప్లయితొలగించండి
 26. *చదువరిగారు, ఈ రొంపిలోకి మీరు దిగుతారనుకోలేదు!*
  అబ్రకదబ్ర గారు,
  నాకు తెలియక అడుగుతాను హిందువు మతం గురించి మాట్లాడటానికి యొగి,తాడెపల్లి, దుర్గేశ్వర్ రావు,సాయి కిరణ్ మొదలగు వారు మాత్రమే ఎమైనా గుత్తకు తీసుకున్నారా. మిగతా వారు రాస్తె మాత్రం రొంపి లోకి దిగటమా?

  రిప్లయితొలగించండి
 27. జయహో గారు, మీరన్నట్లు నాకు పుస్తకాల గురించి మరీ ఎక్కువ ఏమీ ఎలియదు.నేను నా అభిప్రాయం చెప్పా. నా చుట్టూ జరిగిన కొన్నింటి వలన అలాంటి అభిప్రాయం యేర్పడింది. హిందువులు కుల వివక్ష చూపిస్తారు, అని ఎవరైనా అంటే అది నన్ను, మిమ్మల్ని ఇంకా చుట్టూ ఉన్న వారందరినీ అన్నట్లే.

  రిప్లయితొలగించండి
 28. గజ దొంగని వదిలేసి చిల్లర దొంగని పట్టుకున్నట్టు ఆంధ్రా పోప్ జాన్ పౌల్ రాజశేఖరరెడ్డిని వదిలేసి దళితులని తిట్టడం బాగాలేదు. దళితులు పేదరికం వల్ల డబ్బుల కోసం మతం మారుతారు. మనలా డబ్బున్న వాళ్ళకి డబ్బులు ఫ్రీగా ఇస్తే తీసుకోము, నిజమే. కానీ కేవలం మాటల వల్ల మత మార్పిడులు ఆగవు. ప్రభుత్వం గ్రామ పాఠశాలల్లో కూడా ఇంగ్లిష్ మీడియం ప్రవేశ పెట్టి నాణ్యమైన చదువు అందిస్తే ఇంగ్లిష్ మీడియం విద్య కోసం క్రైస్తవ మిషనరీల పాఠశాలల్ని నమ్ముకోవలసిన అవసరం ఉండదు. ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలలో ఆసుపత్రులు కట్టిస్తే క్రైస్తవ మిషనరీ ఆసుపత్రులతో పని ఉండదు. ఇలా ప్రత్యామ్నాయాలు సూచించకుండా దళితులని తిడితే ఏమి లాభం? తిడితే ముందు కాంగ్రెస్, తెలుగు దేశం పార్టీలు రెండిటినీ తిట్టాలి. పశ్చిమ గోదావరి జిల్లాలో తెలుగు దేశం నాయకులు ప్రతి ఎన్నికల టైమ్ లోనూ ఎన్నికల నిబంధనలకి విరుద్ధంగా చర్చిలలో ప్రచారం చేస్తుంటారు. అయినా వాళ్ళకి హిందువుల వోట్లు పడుతుంటాయి. రాజశేఖర రెడ్డి క్రిస్టియన్ కనుక వాడు క్రైస్తవ మత ప్రచారం చెయ్యడం విచిత్రం కాదు. తెలుగు దేశం నాయకులు క్రైస్తవ మత ప్రచారం చేస్తోంటే హిందువైన చంద్రబాబు నోరు విప్పకపోవడం నిజమైన విచిత్రం. కమ్మ, రెడ్డి లాంటి అగ్రకులాల వాళ్ళు కూడా క్రైస్తవ మతంలోకి మారుతుండగా వాళ్ళని వదిలేసి దళితుల్ని తిట్టడం బాగాలేదు.

  రిప్లయితొలగించండి
 29. Dont be surprised but I agree with Martanda on this point. There is no point in generalizing it to all Dalits. All of them dont hate Hinduism - there are many of them who respect the Hindu culture more than the traiditonal Hindu communities do!

  Kancha Ilaiah doesnt reopresent all the Dalits.

  రిప్లయితొలగించండి
 30. @చదువరి: నావ్యాఖ్యల్ని తొలగించి, యోగి/కాలనేమి/భస్మాసుర/అశోక్/జయరామిరెడ్డి నన్ను "retard" అన్న వ్యాఖ్యని మాత్రం ఉంచడంలో మీ నిబద్ధత తెలుస్తోంది.

  I am striking off one more blog from my list where a sensible discussion can take place. Thank you.

  రిప్లయితొలగించండి
 31. ఇక్కడ దళితుల్నెవరూ ఏమీ అనడంలేదండి ! దళితిస్టువాదుల గుఱించే మాట్లాడుకుంటున్నాం. కమ్మ, రెడ్డికులాలవారు క్రైస్తవం పుచ్చుకోవడానికి కారణాలు వేఱే ఉన్నాయి. హిందూవారసత్వ చట్టాల ప్రకారం స్త్రీలక్కూడా ఆస్తి ఇవ్వాల్సి వస్తుందని మతం మార్చుకున్నవాళ్ళున్నారు. అది హిందూమతం మీద ద్వేషంతో కాదు.

  రిప్లయితొలగించండి
 32. మహేష్ గారు ఆవేశంలో అలా అంటారు కాని వారికున్న కుల గజ్జి కి వారు అలా వుండలేరు.. అంతకుముందు కూడా కూడలి నుంచి వెళ్ళిపోతున్న అని గోల చేసి మల్లి వచ్చి కూడలి లో చేరారు.. so dont take it serious.. :-)

  రిప్లయితొలగించండి
 33. కత్తి మహేష్ కుమార్: ఎంచేతోగానీ మీరు చాలా నెగటివ్‌గా ఆలోచిస్తున్నారు. కాలనేమి మిమ్మల్ని రిటార్డ్ అని అన్నది నిజమే! కాని దానికంటే ముందు రాసిన వ్యాఖ్యలో మీరేమి రాసారో చూడండి..

  "కాలనేమి పేరుతో మాళ్ళీ బ్లాగులోకంలో కారుకూతలు కూస్తున్న యోగీ...నీ స్టాండర్డ్ ఏమిటో...నీకున్న వందపేర్లేమిటో నీ అసలు పేరేమిటొ...నీకున్న రోగాలేమిటో నాకు తెలుసు. కాబట్టి నీతో చర్చించే ఉద్దేశం,ఓపిక,విశాలత్వం నాకు లేవు. Get lost."
  అని అన్నారు. దీన్నిబట్టి తెలిసేదేంటంటే ఈ తిట్ల కార్యక్రమాన్ని మీరు మొదలుపెట్టారు. ఇప్పుడు చెప్పండి.. మీరు రాసిన ఈ తిట్లను ముందు తీసెయ్యాలా? లెక కాలనేమి రాసినదాన్నా? నా నిబద్ధత సంగతి ఇప్పుడు చెప్పండి.

  మీరు మరింత సకారాత్మక దృక్పథాన్ని పెంచుకోవాలి. కాస్త సంయమనం పాటించాలి. మనుషుల గురించి కాకుండా వారి భావాల గురించి చర్చించాలి.

  రిప్లయితొలగించండి
 34. Praveen Sarma: "గజ దొంగని వదిలేసి చిల్లర దొంగని పట్టుకున్నట్టు ఆంధ్రా పోప్ జాన్ పౌల్ రాజశేఖరరెడ్డిని వదిలేసి దళితులని తిట్టడం బాగాలేదు." -మీరు పొరబడ్డారు. నేను దళితులను ఏమీ అనలేదు, అసలు వాళ్ళగురించి ఈ టపాలో రాయలేదు. దళితవాదుల గురించీ రాయలేదు. హిందూవ్యతిరేక పూనకాన్ని వ్యాపింపజేయాలని చూస్తున్న కొందరు దళితిస్టువాదుల గురించి, వారి కుట్రపూరిత ఆలోచనాధోరణి గురించీ మాత్రమే రాసాను.

  రిప్లయితొలగించండి
 35. ప్రవీణ్
  నువ్వు చెప్పింది తప్పు అనడం లేదు.
  చదువరి గారు దళితులను ఎకమొత్తంగా ఏమీ విమర్శించలేదు అనలేదు. ఆయన చెప్పింది దళితిస్టువాదం గురించి.. కొంత మంది ద్వంద వైఖరి అవలంబించే, రెండు నాల్కల కుహానా దళితిస్టుల (దళితులు కాదు) గురించి.
  You know it anyway... ***attitude is nothing to do with caste or section of society.

  రిప్లయితొలగించండి
 36. "బ్రాహ్మిణికల్ ఆటిట్యూడ్" అనేది కులానికి సంబంధిచినది కాదు అని బల్లగుద్ది వాదించిన మహేష్ "దళితిస్టువాదం" దళితులకు సంబంధించినది కాదు అంటే ఎందుకు ఒప్పుకోడు? :)

  ఎమైనా ఒకరి మనోభావాలు గాయపడినప్పుడు స్పందించడానికి ప్రతీ ఒక్కరికి హక్కు ఉంటుంది. స్పందన అనేది ఏ ఒక్క వర్గానికో పరిమితం కాదు. ఎదురు దాడి లేదు కదాని హిందూ మతాన్ని నిందుస్తూ వారి నమ్మకాలని హీనపరుస్తూ రాయడం బ్లాగుల్లో రోజు రోజుకూ ఎక్కువవుతోంది.

  రిప్లయితొలగించండి
 37. @తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం గారు

  1. "దళితుల ద్వేషానికి గుఱైనంతమాత్రాన హిందువులు గానీ, హిందూధర్మం గానీ తప్పుచేసినట్లు కాదు. హిందూమతం మీద దళితులేమీ జడ్జిలు కారు".
  మరి ఎవరు తప్పు చేసినట్టు?. థళితులు తప్పు చెసారా? పాపం చేసారా?
  2."దళితుల్ని దూరం పెట్టడానికి వారికున్న బలమైన కారణాలు వారికున్నాయి. అవి వారి దేశకాల పరిస్థితులకి సంబంధించిన కారణాలు. ఆ దేశకాల పరిస్థితుల్లో మనం జీవించడం లేదు కనుక వాటిని మనం ఈ రోజు అర్థం చేసుకోలేము. కనీసం ఊహించను కూడా ఊహించలేము. అవన్నీ తెలుసుకోకుండా ఊరికే "హిందూమతం ద్రోహం చేసింది, ద్రోహం చేసింది" అని మాటకి పదిసార్లు అనడం న్యాయం కాదు."

  ఛాలా అధ్బుటము అయిన మాట చెప్పారు. ఏమితొ ఆ కారణాలు. ఒక పుస్తకం రాయకూడధు చదువుకుంటాము.

  Thank God. ఈవాల థళితులు కాస్త చదువుకొని వాళ్ళ గురుంచి వాళ్ళు రాసుకంటున్నారు కాబట్టి కాని, లెకుంటే అసలు థలిటులను అంటరాని వాల్లు గానె చూల్లేధు, అంతా Missionary లు చెసిన Propaganda అనే వల్లేమొ.

  @Radhika gAru, Well said. That is the way for Dalits to grow and improve. Thanks for your understanding.

  Naresh

  రిప్లయితొలగించండి
 38. తెలుగు బ్లాగుల్లొ జోరు తగ్గిందనుకుంటున్న సమయం లొ మంచి టపా రాసారు. దళిత వాదానికి దళితిస్టువాదానికి తేడా బాగా తెలియ జెప్పారు.

  టపా కంటే వ్యాఖ్యలు చాలా వేడిగా ఉన్నాయి.

  కాముధ

  రిప్లయితొలగించండి
 39. ముల్లుని ముల్లుతోనే తీయాలన్న విధ౦గా మీ వాదనలు పదును గానే వున్నాయి. నేను మీతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను. మన స౦సృతి లోనే పుట్ట్టి, పెరిగి, చచ్చినా, దాన్ని అకారణ౦గా తిడుతూనే ఉ౦డట౦ కేవల౦ మూర్ఖత్వమే. ఇటువ౦టి వారివల్ల అది మరి౦తగా పటిష్టమవుతు౦ది కాబట్టి విచారి౦చవలసిన అవసర౦ లేదు. కానీ మీరన్నట్లు, కారుకూతలకు సమాధాన౦ చెప్పక పొవట౦ కూడా నేరమే. మీరు ఆ ప్రయత్న౦లొ విజయ౦ కొ౦తవరకూ విజయ౦ పొ౦దినట్లే.

  అసహన౦తో అనే మాటలను మీరు కత్తిరి౦చవలసిన అవసర౦ కూడా లేదు. అది వారికి గుర్తు౦డిపోయేలా అలాగే వు౦చ౦డి.

  దూరపుకొ౦డలు నునుపనే వైఖరితో ఇక్కడ ఇల్లు గుల్ల చేస్తున్న వీరికి స్వానుభవమే సరైన పాఠ౦ కాగలదు.

  రిప్లయితొలగించండి
 40. అయ్యా !
  హిందూ ధర్మాన్ని .దానిలో లోపాలున్నవని విమర్శిస్తున్న కత్తిమహేష్ గారి లాంటివారు ఇతరులను నేనొక సూటి ప్రశ్న వేస్తున్నాను. మీదౄష్టి కోణం లోంచి [మీరు కూడా హిందువులమే అని చెబుతున్నారు కనుక]మన ధర్మం లో వున్న లోపాలేమిటి? వాటి మూలాలేమిటి ? మరి వాటిని ఎలా నివారించాలని మీ ప్రణాళిక ? అసలు మీరు నమ్మినట్లు లోపాలుంటే మనధర్మాన్ని రక్క్షించుకోవడానికి మీ ఆలోచనలేమిటి ? విధర్మీయులుగా మారిన మనసోదరులను మరలా ఇంటికి చేర్చాలంటే ఏమి చేయాలి? ఆయావిషయాలపైన ఈధర్మానికి చెందిన సోదరులందరితో చర్చించి అనుమానాలు తీర్చుకోవాలని వుందా? ముందు మీరు ఈధర్మము పట్లనిబద్దత కలిగివుంటే నేను పైన అడిగిన ప్రశ్నలకు సమాధానమివ్వగలరు.లేదు అంటే మాకు హిందూధర్మము పట్ల నమ్మకము లెదు అని చెప్పి వైదొలగండి ఇలాంటి చర్చలనుంచి .అలాంటప్పుడు ఈధర్మాన్ని నిర్వీర్యం చేయాలనుకునే వారికి ,స్వధర్మాన్ని కాపాడుకునే వారికి ఎవరి ప్రయత్నాలు వారికుంటాయి .కనుక ముసుగులు వద్దు .అది దైవద్రోహం . కనుక అనవసర నిందల్తో కాల్ం వృధాచేయవద్దు.

  రిప్లయితొలగించండి
 41. ఈ కింద కామెంట్ లొ నాకొక్క విషయం అర్ధం కావట్లేదు.
  "ప్రపంచంలో ఎక్కడా లేని వర్ణ వ్యవస్థ మన దేశాన్ని 3000 సంవత్సరాలు ఏకచ్ఛత్రాధిపత్యంగా ఏలింది. ప్రపంచంలో ఎక్కడా లేని వర్ణ వ్యవస్థ మన దేశాన్ని 3000 సంవత్సరాలు ఏకచ్ఛత్రాధిపత్యంగా ఏలింది..... అగ్రవర్ణాల వారు మంచి ఉద్యోగాలను దక్కించుకుని రెక్కలు ముక్కలు చేసుకునే ఉద్యోగాలను శూద్రులకు కేటాయించారు"

  ఈ రొజు ఎవరు అగ్రవర్ణాలు.. ఎవరి చేతుల్లొ , డబ్బు ..అధికారం వుంది.. నాకయితె మూడు కులాలు కనిపిస్తాయి. " రెడ్లు , కమ్మ , కాపు ". ఏ రకం గా చూసినా ఈ మూడు కులాలదే అదిపత్యం. ఈ మూడు కులాలు పైన చెప్పిన శూద్రుల కేటగరి కదా.. వీళ్ళెలా డెవలప్ అయ్యారు (ఎలా శూద్రుల నుండి అగ్రవర్ణాలుగా ఎదిగారు) ?

  నిజం గా హిందుమతం లొనే ప్రాబ్లెం వుంటె .. ఈ శూద్రులను ఎలా ఎదగనిచ్చారు? వీళ్ళకి ఎప్పుడు ఎమీ రిజర్వేషన్స్ లేవే.. అంటే ఈ వివక్ష ఈ మద్యే మొదలయిందా..

  రిప్లయితొలగించండి
 42. ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రం బ్రాహ్మణ డామినేషన్ కంటే కమ్మ, రెడ్డి, కాపు డామినేషన్ ఎక్కువ కనిపిస్తుంది. సినిమా రంగాన్ని కూడా డామినేట్ చేసేది వీళ్ళే. చిన్నప్పుడు నేను సినిమా డైరెక్టర్ ని అవుతానంటే నా ఫ్రెండ్స్ వద్దురా, నీకు చాన్స్ ఇవ్వరు, నువ్వు కమ్మ వాడివి కాదు, కాపు వాడివి కూడా కాదు అనే వాళ్ళు.

  రిప్లయితొలగించండి
 43. నరేష్ గారూ ! ఈ సమస్య పట్ల సీరియస్ నెస్ లోపించడం చేత మీరు సరదాగా, ఎగతాళిగా తీసుకుంటున్నప్పటికీ మీరన్నట్లు నిజంగా ఈ టాపిక్ ఒక పుస్తకంగా వ్రాయదగ్గదే. ఎందుకంటే మీవంటివారికి, దళిత మేదావుల (మేధావులేనా ?) ప్రచారానికి లొంగిపోయినవారికి తెలియని Unexplored data నా దగ్గఱుంది. ఏదో ఒకరోజు తప్పకుండా రాస్తాను. కానీ మీకు ప్రస్తుతం క్లుప్తంగా సమాధానమిస్తాను. నిజాలు రాస్తున్నందుకు బాధపడవద్దు.

  మాదిగలు తప్ప మిహతా దళితుల పూర్వీకులు మొదట్లో స్థానిక నేరస్థులు. ఆ కారణం చేత వారు ఆ రోజుల్లో వెలివేయబడ్డ వర్గాలు. వెలివేయడానికి బలమైన కారణాలున్నాయి. అందుకనే పూర్వీకుల sense of justice ని తక్కువగా అంచనా వెయ్యొద్దంటున్నది. ఏ కాలానికి, ఏ దేశానికి చెందినా మనుషులు స్వతహాగా హేతుజీవులని మఱువరాదు. ఎవరూ ఎవరినీ అకారణంగా దూరం పెట్టరు. అప్పుడు మన పూర్వీకులు జీవించిన, రవాణా సౌకర్యాలు లేని గ్రామీణ జీవిత పరిస్థితుల్లోకి మనం వెళ్ళాలి.

  ౧. ఆ రోజుల్లో కులపంచాయితీలే తప్ప న్యాయస్థానాలు లేకపోవడం.

  ౨. ఈ రోజుల్లో మాదిరి ఆ రోజుల్లో నిర్ణీతకాలానికని చెప్పి చెఱసాల శిక్ష వెయ్యకపోవడం. (నేరస్థుల్ని చీకటికొట్లలో బంధించి ఏళ్ళతరబడి మేపడం మన పూర్వీకులకి తెలియదు)

  ౩. తీవ్రనేరాలకి మరణదండన, సంఘబహిష్కారం తప్ప వేఱే శిక్ష లేకపోవడం. మరణదండన విధించే అధికారం కులపంచాయితీలకి లేకపోవడం.

  ౪. కేవలం వ్యక్తుల్నే కాక వారి దుర్మార్గ ప్రవర్తనని అదుపులో పెట్టడంలో విఫలమైన నేరానికి, వారికి సహకరించిన నేరానికి వారివారి కుటుంబాల్ని కూడా వెలివెయ్యడం.

  ౫. మాదిగలు మినహాయిస్తే మిహతా దళితవర్గాలు ఒకే రక్తానికి చెందినవారు కారు. వివిధ తరాల్లో నేరస్థులైన వివిధకులాలవారు పైన చెప్పినవిధంగా వెలివేయబడి ఒక్కొక్కరుగా ఊళ్ళ శివార్లకి చేఱుకున్నారు. ఆ నేరస్థులలో బ్రాహ్మణులున్నారు. క్షత్త్రియులున్నారు. వైశ్యులున్నారు. ఇతర శూద్రకులాలవారూ, బీసీ కులాలవారూ ఉన్నారు. వారు తమ కులాన్ని కోల్పోవడం వల్ల తక్కిన నేరస్థులతో వివాహసంబంధాలేర్పఱచుకొని ప్రత్యేకకులాలుగా మారారు. వారెందుకలా ఊరి బయట నివసించాల్సి వస్తున్నదో శిక్షించిన పెద్దల సంతానానికీ తెలియదు. శిక్షించబడ్డవారి సంతానానికీ తెలియదు. కానీ వారిని దూరం పెట్టడాన్ని యథాపూర్వం కొనసాగించారు. దీనికీ హిందూధర్మానికీ ఏ సంబంధమూ లేదు.

  ౬. ఈ రోజు దిగ్భ్రాంతి కలగవచ్చు. కానీ అలా తమని వెలివేసినది, తద్ద్వారా అస్పృశ్యులుగా మార్చినది సాక్షాత్తు తమ స్వంత కులస్థులే. బ్రాహ్మణులు కారు. ఎందుకంటే ఏ కులానికి ఆ కులపంచాయితీ, ఆ కులసభ ప్రత్యేకంగా ఉండేవి. అయితే ఏ కులపంచాయితీ ఈ "వెలి" నిర్ణయాన్ని ప్రకటించినా మిహతా గ్రామమంతా (మిగతా కులపంచాయితీలు) దాన్ని అమలుపఱచడంలో సంఘటితంగా ఉండేది.

  రిప్లయితొలగించండి
 44. మందార ప్రభాకర్ గారు హిందూ మతంలో తిరిగి చేరిపోబోతున్నారు. నేను ఇప్పుడు కూడా గొప్ప నాస్తికుడినే కానీ అవకాశవాదమే ప్రమాణం అనుకునేవాళ్ళు తమ పూర్వ మతంలోకి తిరిగి చేరిపోవడం విచిత్రం కాదు. వాళ్ళు క్రైస్తవులైనా, ముస్లింలైనా, నాస్తికులైనా ఆ పనే చేస్తారు.

  రిప్లయితొలగించండి
 45. నరేష్ గారూ ! ఈ సమస్య పట్ల సీరియస్ నెస్ లోపించడం చేత మీరు సరదాగా, ఎగతాళిగా తీసుకుంటున్నప్పటికీ మీరన్నట్లు నిజంగా ఈ టాపిక్ ఒక [పుస్తకంగా వ్రాయదగ్గదే. ఎందుకంటే మీవంటివారికి, దళిత మేదావుల (మేధావులేనా ?) ప్రచారానికి లొంగిపోయినవారికి తెలియని Unexplored data నా దగ్గఱుంది. ఏదో ఒకరోజు తప్పకుండా రాస్తాను. కానీ మీకు ప్రస్తుతం క్లుప్తంగా సమాధానమిస్తాను. నిజాలు రాస్తున్నందుకు బాధపడవద్దు. .....]
  ====
  Very interesting @ Tadepally gaaru. I wish you write a series of articles on this.

  రిప్లయితొలగించండి
 46. @చదువరి గారు
  బాబోయి... లేవండీ.. మేల్కొనదిన్లో మీ అభిప్రాయ౦ విని మీ బ్లాగ్ చూశా..
  ఇన్నిరోజులు ఎలా మిస్ అయ్యాన అనిపించింది..

  చాల బాగా రాసారు.. రాస్తూ ఉండండి..

  రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు