18, మే 2009, సోమవారం

కాంగ్రెసు గెలిచింది

రాజశేఖరరెడ్డి గెలిచాడు.

రాజశేఖరరెడ్డి ఐదేళ్ళ అద్భుతమైన పాలనకు మురిసి ప్రజలు వోట్లేసారని కాదు, ప్రతిపక్షాలు ఈ ఐదేళ్ళలో అద్భుతమైన పనితీరేమీ కనబరచలేదు కాబట్టి. 'ఇదిగో వీళ్ళకు వోటేస్తే మంచి, సమర్ధవంతమైన పాలనను అందిస్తారు' అనే నమ్మకాన్ని ప్రజలకు కలిపించలేకపోయారు కాబట్టి కాంగ్రెసు గెలిచింది. ప్రభుత్వ వ్యతిరేక వోట్లను ప్రతిపక్షాలు చీల్చుకోడంతో కాంగ్రెసు గట్టెక్కింది. గతంలో కంటే సీట్లు తగ్గడాన్ని బట్టి తెలుస్తోంది, ప్రజలు కాంగ్రెసు పట్ల వ్యతిరేకతతో ఉన్నారని. వోట్ల శాతాలు వెల్లడైతే అప్పుడు పూర్తి సంగతులు తెలుస్తాయి.


కాంగ్రెసు గెలవడానికి గల కారణాల్లో నాకు తోచినవివి:
 1. చేతకాని ప్రతిపక్షం. ఇది అన్నిటికంటే పెద్ద కారణం. ప్రతిపక్షమంటే ఇక్కడ నా ఉద్దేశం మహాకూటమి. రాష్ట్రానికి సమర్ధమైన పాలనను అందించగలవాళ్ళమనే నమ్మకాన్ని ప్రజల్లో కలిగించలేకపోయారు. రాజశేఖరరెడ్డి మొండివాడు, మంచో చెడో.. అనుకున్నది చేసేస్తాడు, వీళ్ళు అలాంటివాళ్ళు కాదు అనే భావన ప్రజల్లో ఉంది. ఐదేళ్ళపాటు తెదేపా కాంగ్రెసును ఏమీ చెయ్యలేకపోయింది - బాబు రాజశేఖరరెడ్డిని ఏ..మీ చెయ్యలేకపోయాడు - రాజశేఖరరెడ్డి బలవంతుడు, బాబు బలహీనుడు అనే భావన ఏర్పడింది. పైగా రాజశేఖరరెడ్డితో పోలిస్తే బాబుకు విశ్వసనీయత తక్కువ. దానికి తోడు మహాకూటమి ఎన్నికల్లో పోరు చెయ్యలేదు, పోరు చేసుకుంది. కాంగ్రెసుతో కంటే దాంతో అదే  ఎక్కువ పోట్టాడుకుంది. పొత్తులు పొత్తులంటూనే కత్తులు దూసుకున్నారు, స్నేహపూర్వక యుద్ధాలు చేసుకున్నారీ విరోధాభాసానికి నమూనాలు, శత్రుత్వంతో కూడిన స్నేహితులు, ముత్తైదువు ముండలు.
 2. ప్రతిపక్షపు వోట్లు చీలిపోయాయి. ప్రరాపా, లోక్‌సత్తా కలిసి, తెదేపా వోట్లను చీల్చుకున్నాయి. ప్రజారాజ్యం కాంగ్రెసు వోట్లను కూడా చీల్చుకున్నప్పటికీ దెబ్బ తెదేపాకు బాగా తగిలినట్టు కనిపిస్తోంది.

అవినీతి ఆరోపణలను ప్రజలు పెద్దగా పట్టించుకోలేదు. ఖచ్చితంగా చెప్పాలంటే అవినీతినే పెద్దగా పట్టించుకోలేదనాలి. ప్రజలకు అవినీతి అలవాటైపోయింది, సహజమై పోయింది. అందరూ అవినీతిపరులే గదా.. అనే నిర్లిప్తత కూడా దీనికి కారణం కావచ్చు. చాలా ప్రమాదకరమైన సంగతిది. ఇదిగో ఈ కారణంగానే మనకు లోక్‌సత్తా లాంటి పార్టీలు మరిన్ని కావాలి.

ఈ ఎన్నికల్లో ప్రతిపక్షాలన్నీ కలిసి రాజశేఖరరరెడ్డిని హీరోగా చేసాయి. తన పార్టీ గెలుపోటములకు తానే బాధ్యుణ్ణని చెబుతూ, ఆ బాధ్యత మొత్తాన్నీ తన భుజాలపై పెట్టుకు మోసాడు. కాంగ్రెసు విజయంలో దోహదపడిన ప్రతీ పాజిటివు అంశానికీ ఆయనే కర్త. అంచేత కాంగ్రెసు విజయానికి ఆ పార్టీ తరపున పూర్తి శ్రేయస్సు ఆయనకే!

అయితే తామే స్వయంగా హీరోలైనవాళ్ళు ఇద్దరు..
ఒకరు బీజేపీ కిషన్‌రెడ్డి! కేవలం తన వ్యక్తిగత ప్రతిభతో, తాను చేసిన పనులతో ప్రజల మనసులను గెలిచినవాడాయన. జయప్రకాశ్ నారాయణ మరో హీరో. మార్పు తెస్తానని చెప్పిన నాయకుడిగా, తేవలసిన బాధ్యత ఉన్న నాయకుడిగా ఆయనమీద చాలా పెద్ద బాధ్యత ఉన్నది. అంతకన్నా పెద్ద బాధ్యత - పార్టీని ప్రజలకు మరింత చేరువగా తీసుకువెళ్ళాల్సిన బాధ్యత - కూడా ఆయనపై ఉన్నది. వచ్చే ఐదేళ్ళలో ఆ పని ఎంతవరకు చేస్తాడో చూడాలి. వీళ్ళిద్దరూ గెలవడం ఈ ఎన్నికల్లో మంచి కబురు.

సరే.. ఇక జీరోల సంగతికొస్తే..  చిరంజీవి అందరికంటే పెద్ద జీరో! తరవాత కేసీయారు. వీళ్ళిద్దరూ తప్పుల మీద తప్పులు చేసుకుంటూ చక్కటి ప్రదర్శన ఇచ్చారు. కేసీయారుది మరీ విచిత్రం.. ఎంతో కృషి చేసినా ఓడిపోయినవాళ్ళు ఉంటారెక్కడైనా. కానీ, ఓడిపోవడం కోసం ఇంత కృషి చేసినవాళ్ళు ఎక్కడా ఉండరేమో!.

ఈ ఎన్నికల్లో లోక్‌సత్తా ఉదయించడం ఒక మంచి విశేషం. ప్రజలు చెయ్యాల్సింది చేసారు.. 'ఇదిగో మీకీ అవకాశం ఇస్తున్నాం, పనిచెయ్యండి. మీ పనితీరు చూసాక, వచ్చే ఎన్నికల్లో మిగతా సీట్ల సంగతి చూద్దాం' అని చెప్పారు. ఇక మాట నిలుపుకోవాల్సింది లోక్‌సత్తాయే!

ఈసారి శాసనసభ కాస్తంత అర్థవంతంగా జరిగే అవకాశం కనిపిస్తోంది. జయప్రకాశ్ నారాయణ, కిషన్‌రెడ్డి లాంటి ఒకరిద్దరు చేసే ప్రసంగాలు కాస్త ప్రయోజనకరంగా ఉండొచ్చు. వీళ్ళని చూసైనా తెదేపా తన పద్ధతి మార్చుకుంటుందా..? ఏమో, అంత నమ్మకం కలగడంలేదు. కాంగ్రెసు ఎలాగూ మార్చుకోదు. రేవంత్‌రెడ్డి, పయ్యావుల కేశవ్ వంటి కొందరు తెదేపాలోనూ ఉన్నప్పటికీ వారికి మాట్టాడే అవకాశం ఎంతవరకు వస్తుందో చూడాలి.

ఫలితాలొచ్చాక, ఓడినవాళ్ళ పట్ల టీవీ ఛానెళ్ళ ప్రవర్తన చాలా జుగుప్సాకరంగా ఉంది. ఓడినవాళ్ళను ఎంతలా చులకన చేసాయో చూస్తే వాటిమీద ఏవగింపు కలిగింది. పోరులో గెలుపోటములు సహజం. వారి వ్యూహాలను, ప్రచారాలను, చెప్పిన మాటలను, పోయిన పోకడలను విమర్శించవచ్చు. ఎత్తిపొడవొచ్చు. కానీ వాళ్ళమీద సినిమా పాటలు కట్టి వాళ్ళను ఎగతాళి చెయ్యడం మాత్రం చవకబారుతనంగా అనిపించింది. ముఖ్యంగా చిరంజీవిని, కేసీయారునూ చితక్కొట్టేసారు. ఐన్యూసువాడి ఆ పిన్‌కౌంటరు దానయ్య మరీ బజారువెధవ లాగా మాట్టాడాడు. మామూలుగానే నాకది నచ్చదు, ఇప్పుడు మరీను.

25 కామెంట్‌లు:

 1. అవునండీ..!

  ఈసారి మన సభా స్థాయి క్రితం సారి కన్నా ఎన్నో రెట్లు మెరుగు పడాలని ఆశిస్తూ..., ( జేపీ, కిషన్, కేశవ్, రేవంత్ ల లాంటి నిబద్దత గల నాయకులు ఈ దిశ గా ప్రయత్నం చేయగలరనుకుంటున్నా )

  రిప్లయితొలగించండి
 2. అన్నిటికంటే పెద్ద జోక్ ఫ్రీ మనీ ట్రాన్స్ఫర్ స్కీమ్. ఆ స్కీమ్ ని జనం నమ్మలేదని జిల్లా స్థాయి నాయకులు చెపుతోంటే, ఆ స్కీమ్ ని జనంలో ఎక్కువగా ప్రచారం చెయ్యలేకపోయామని రాష్ట్ర స్థాయి నాయకులు చెపుతున్నారు. తెలుగు దేశం పార్టీకి దాదాపుగా అన్ని గ్రామాలలో కార్యకర్తలు ఉన్నారు. కార్యకర్తలు ఆ స్కీమ్ ని నమ్మకపోయినా నాయకుల మాట కాదనలేక ఆ స్కీమ్ గురించి ప్రచారం చెయ్యగలరు. కానీ జనాన్ని నమ్మించలేకపోయారు.

  రిప్లయితొలగించండి
 3. కాంగ్రెస్ గెలవడానికి కారణాలేవైనా, దాన్ని ఓడించడానికి ఈనాడు పత్రిక చూపిన చవకబారు అత్యుత్సాహం గురించి కూడా మీరు ప్రస్తావిస్తే బాగుండేది. రాహుల్ సభలకు జనం ఒక్కళ్ళు కూడా రాలేదనీ, రాజ శేఖర్ రెడ్డి ప్రసంగాలకు స్పందన లేదనీ, సోనియా వైపే ప్రజలు తిరిగి చూళ్ళేదనీ ఇలా ఎన్నో పిచ్చి రాతలు! ఎవరు సభ పెట్టినా జనం రాక మానరు. చివరికి వాళ్ల నిర్ణయం వాళ్ళు తీసుకోకా మానరు. పోలింగ్ మర్నాడే ఫలితాలు తెలిసి పోయినట్లు ఈనాడు చేసిన హంగామా తల్చుకుంటే నవ్వొస్తోంది."మహాకూటమిదే ప్రభంజనం" అని హెడ్డింగొకటి! ఈసారైనా తెదేపా తెలిస్తే కాస్త వూరట దక్కేదేమో రామోజీకి! పైగా ఉండవల్లి కూడా మొదటినుంచీ వెనకపడి ఉండి చివరికి గెలిచి కూచున్నాడు. రామోజీకి కష్టకాలమే!

  చిరంజీవి కి, అరవిందుకి తగిన శాస్తి జరిగింది. సామాజిక న్యాయం అంతే కులాలపేర్లతో జనాన్ని చీల్చడం కాదని ప్రజలే చక్కగా తెలియజెప్పారు వీళ్లకు.

  అందరికంటే జోకర్ చంద్రశేఖర్ రావు!ఇంతకంటే చెప్పక్కర్లేదు.

  నగదు బదిలీ పథకం కొంచెం కూడా పని చెయ్యలేదు.

  కానీ తలరాతల్ని మార్చడంలో లోక్ సత్తా వోట్లు కీలకమని తెలిశాక చాలా సంతోషం వేసింది. జేపీ అసెంబ్లీ ప్రవేశం నూతన రాజకీయాలకు ఒక నాంది మాత్రమే!

  రిప్లయితొలగించండి
 4. చంద్రబాబు నాయుడు అతని కొడుకు లోకేష్ సలహా ప్రకారం ఫ్రీ మనీ ట్రాన్స్ఫర్ స్కీమ్ పెట్టాడని చదివాను. ఏమి దృతరాష్ట్ర ప్రేమ రా బాబూ! సిగ్గు లేదూ... తాను రియల్ లైఫ్ దృతరాష్ట్రుడినని చెప్పుకోవడానికి?

  రిప్లయితొలగించండి
 5. కాంట్రాక్టర్ల నుంచీ ప్రభుత్వోద్యోగుల వరకూ మన రాష్ట్రంలోని కాంగ్రెస్ పాలనలో అమ్యామ్యాలకు అలవాటుపడి సుఖపడిపోయారు.They desperately wanted congress to come back to power.

  రిప్లయితొలగించండి
 6. జెపి గారేంచేస్తారో ఇక చూడాలి. ఇలాంటివాళవల్లనైనా సభాస్థాయి మెరుగుపడితే అదే పదివేలు. ఆయన ఈఅవకాశాన్ని వినియోగించుకుంటారని ఆశిస్తున్నాను. చిరంజీవి గారికి ఈ ఐదేళ్ళూ గడ్డుకాలమనటంలో సందేహంలేదు ఇక ఇప్పుడు మొదలవుతుంది ఆసలాట.

  రాజుగారు ఈనాడుని ఒక పట్టుపడితే చూడాలని వుంది. అలాగని నేనేం సాక్షికి పే...ద్ధ fanనేమీ కాదండోయ్ జస్ట్ చంద్రబాబు గారొచ్చేవరకూ ఆగమని అంతే. ఎలాగూ వారొచ్చి సాక్షి పని పడతారు. ఇద్దరూ కలసి వార్తాపత్రికా విలువల వలువలూడ్చారు.

  రిప్లయితొలగించండి
 7. సమర్ధమైన కాంగ్రెస్ అని కాదు చేతకాని ప్రతిపక్షం అన్న మీ వ్యాక్యలు 100% కరెక్ట్ దానికి తిరుగులేదు.మనకి కావలసింది సమర్ధమైన ప్రతిపక్షం మాత్రమే.

  రిప్లయితొలగించండి
 8. >>ఎంతో కృషి చేసినా ఓడిపోయినవాళ్ళు ఉంటారెక్కడైనా. కానీ, ఓడిపోవడం కోసం ఇంత కృషి చేసినవాళ్ళు ఎక్కడా ....
  :)

  రిప్లయితొలగించండి
 9. I am very happy to hear defeat news of Telugu Desam parasites. I am not Congress activist. మా జిల్లాలో పెండింగ్ ఇరిగేషన్ ప్రోజెక్టులు పూర్తవ్వాలి కనుక నేను తెలుగు దేశంకి వ్యతిరేకంగా కాంగ్రెస్ కి సపోర్ట్ ఇచ్చాను. నేను కాంగ్రెస్ విధానాలని ఎంత వ్యతిరేకించినా, ఇరిగేషన్ ప్రోజెక్టుల విషయంలో మాత్రం ఎప్పుడూ కాంగ్రెస్ కే సపోర్ట్.

  రిప్లయితొలగించండి
 10. ఏమి ఇరిగేషన్ ప్రాజెక్టులండీ బాబూ.. మా వూళ్ళో ఎకరాలెకరాలు భూఁవి తవ్వేసి పెట్టాడు. కనీసం ఒక ఏడైళ్ళైనా పంట పోయింది. ప్రపంచంలో పోలవరానే ముందు కాలవలు తవ్వి తరువాత ఆనకట్ట వేసింది. అదీను ఎప్పటికైనా వేస్తే.

  పైనెవరో అన్నట్టు, కార్యకర్తల్లోనే ఆ పథకాల మీద నమ్మకం లేదు. నేను నా బ్లాగులో వ్రాసినట్టు, నగదు బదలీ వస్తే మన x చిరుగుతుందని, నాతో వీర తెలుఁగుదేశం కార్యకర్తలే అన్నారు.

  అందరూ ఎదవలే ఏ ఎదవ వస్తేనేంటి. కనీసం మన జేపీ అయినా శాసనసభకు వెళ్ళినందుకు ఊరటగానుంది.

  రాకేశ్వర

  రిప్లయితొలగించండి
 11. తెలుగు దేశం కార్యకర్తలు ఇరిగేషన్ ప్రోజెక్టులని అడ్డుకుని రాజకీయ ప్రయోజనం పొందడానికి ప్రయత్నించడం వల్లే పోలవరం ఆలస్యమయ్యింది. తెలుగు దేశం కార్యకర్తలని చంపి ఇరిగేషన్ కాలువల గట్ల మీద సమాధులు కడితే ఆ సమాధులు చూసినవాళ్ళెవరూ ఇరిగేషన్ ప్రోజెక్టులని అడ్డుకోవడానికి ప్రయత్నించరు.

  రిప్లయితొలగించండి
 12. మంచి విశ్లేషణ. రాష్ట్రంలో సరైన ప్రత్యామ్నాయం లేకే కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి రావడం.

  రిప్లయితొలగించండి
 13. ఐదేళ్ళ క్రితం వ్యవసాయం వేస్టు, ఐ.టి.యే ముద్దు అని ప్రకటించిన వ్యక్తి తరువాత రైతుల దగ్గరకి వెళ్ళి తియ్యగా మాట్లాడితే ఎవరు నమ్ముతారు? తెలంగాణాలో చాలా గ్రామాలలో తాగు నీటి బావులు కూడా సరిగ్గా లేవు. వాటి గురించి పట్టించుకోకుండా YSR తెలంగాణా ద్రోహి అని ప్రకటించే తెలంగాణా రాష్ట్ర సమితి నాయకుల మాటలు కూడా ఎవరు నమ్ముతారు? మొన్నటి వరకు సమైక్యాంధ్ర పేరుతో తెలంగాణావాదాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన తెలుగు దేశంతో చేతులు కలిపితే జనం వీళ్ళని political prostitutes అనుకుంటారు.

  రిప్లయితొలగించండి
 14. విశ్లేషణ చాల బాగుంది. ఎన్నికల ఫలితాలపై నా అభిప్రాయాలను ఇక్కడ చూడ వచ్చు.

  రిప్లయితొలగించండి
 15. Mee vishleshana lo konni nijalu undavachu kani anni correct kaadu.
  YSR gelavataniki rendu karanalu unnayi
  Modatidi:
  SC/ST niyojaka vargalu target chesukunnadu. Endukante akkada general ga karchu chaala takkuva untundi . Inka pratipakshamu vallaite gali lo geluddamu ani alochistaru. Meeru okka sari election results chuste arthamavutundi , congress mottam 49 sc/st stanalalo 39 gelichindi.
  Rendavadi:
  TRS poti chesina chota target chesukunnaru. Vallu dabbu karchu pettaleru. 35 out of 45 gelichadu
  Inka viswasiniyata vishayaniki vaste chandra babu entho raja shekar kuda anthe. Udaharana ku telangana lo pracharam chesetappudu nenu telanagana ku vyatirakam kaadu annadu, raayalaseema loki vellagane nenu telanagana ki vyatirekam annadu.
  Chandra Babu meeda vishawasa neeyita leka povadam anedi tappu, meeru okka saari chuste asalu janakarshaka padakalu ku adyude chandra babu examples:
  1. Gas cylinders distrubution deepam padakam aa rojullo 5000 undedi gas connection , aa rojullone oka koti connections ichadu.
  2. DWACRA mahila sangalu
  3. Water sheds
  1999 lo YSR free current ani cheppina odipoyadu mamulu ga kaadu darunam gaa aa roju chandra babu ki BJP ki kalipi 190 seatlu vaste YSR 85 matrame vacheyi aa vijayam to ee vijayam chala takkuva. Free current gurunchi arthamavataniki alochinchadaniki 5 years pattindi janaliki.
  So viswasaniyata lo Chandra Babu entho YSR kuda anthe

  రిప్లయితొలగించండి
 16. Chaduvari Garu,

  Enduku intha Kasi, kopam YSR meedha.
  Mee lanti chaduvukonna Vyaktulu vasthavalanu vastavalu ga teesukovali kada.

  Nenu Strong TDP supporter Nu. ee sari kuda TDP ke vote vesa due to local politics.

  But YSR is million times a better human being than that of CBN.

  రిప్లయితొలగించండి
 17. వ్యాఖ్యాతలందరికీ నెనరులు.
  సుజాత: రామోజీకి ఏమైనా జరుగుతుందని నేను అనుకోవడంలేదు. ఏమీ చెయ్యలేరని కాదు, చెయ్యరని. అయితే కట్టుగొయ్యకు కట్టేసి మాత్రం ఉంచుతారు.

  Chandra Rao: మీరు చెప్పిన SC/ST ని.వర్గాల సంగతి ఆసక్తికరంగా ఉంది. చంద్రబాబు విశ్వసనీయత గురించి - బాబు జనాకర్షక పథకాలు పెట్టలేదని కాదు, మాటకు కట్టుబడి ఉంటాడా అనే విషయంలో బాబుకు విశ్వసనీయత తక్కువ అని అన్నాను.

  sourya: నాకు వయ్యెస్ మీద కోపముందన్నమాట వాస్తవమే. సిమెంటు ఫ్యాక్టరీలు, ఉక్కు ఫ్యాక్టరీలు, వేల కోట్ల డబ్బులు, ఆ పేపర్లు, ఆ టీవీలు,.. ఇవన్నీ మన డబ్బులేనని నా కోపం. మన డబ్బులతోటే ఆయనా, ఆయన అనుచరులూ, అంతేవాసులూ కోట్లకు పడగలెత్తారని నాకు కోపం. ఆ మేరకు మనం పేదవాళ్ళమైనట్టేనా కాదా?

  శౌర్య గారూ, నేను ఏ వాస్తవాన్ని వాస్తవంగా చూడలేదో చెప్పండి. పోనీ, నేను ఈ టపాలోగానీ, ఇప్పుడీ వ్యాఖ్యలోగానీ చెప్పినవాటిలో వాస్తవం కానిదేమైనా ఉంటే చెప్పండి.

  రిప్లయితొలగించండి
 18. ఎకం సత్ విప్రా బహుదా వదంతి

  రిప్లయితొలగించండి
 19. oremuna: ఏంటో మాస్టారూ, నాకు తెలుగే అంతంత మాత్రం. మీరేమో సంస్కృతంలో ఇలా..

  రిప్లయితొలగించండి
 20. చంద్రబాబు నాయుడు ప్రపంచ బ్యాంక్ నుంచి తెచ్చిన అప్పులు కూడా మన దగ్గర టాక్సుల రూపంలో దోచుకున్న డబ్బులుతోనే తీర్చాలి, సబ్సిడీలు కట్ చెయ్యగా మిగుల్చుకున్న డబ్బులతో కూడా తీర్చాలి, పల్లెటూర్లలో బెల్ట్ షాపులు, పట్టణాలలో బార్లు, నగరాలలో క్యాబరెట్లు లాంటి వాటిని ప్రోత్సహించడం వల్ల వచ్చిన డబ్బులతో కూడా తీర్చాలి. ఇక ఫార్ములా 1 లాంటి వాటికి కూడా డబ్బులు తగలేస్తే ఇంకెన్ని నీతిలేని పనులు చేసి అప్పులు తీర్చాలో? అందుకే నేను చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా రాజశేఖర రెడ్డికి సపోర్ట్ ఇచ్చాను. మన లాగ డబ్బున్న వాళ్ళైతే సూపర్ మార్కెట్లలో ఫైన్ క్వాలిటీ బియ్యం కొంటారు. చంద్రబాబు నాయుడు రేషన్ బియ్యం ధరలు, పప్పుల ధరలు పెంచిన తరువాత ఎంత మంది తిండికి కష్ట పడ్డారో.

  రిప్లయితొలగించండి
 21. Chaduvari Garu,
  Thanks Andi.

  Naa Life lo pedda ambition to visit Oxford, Cambridge, MIT, and Stanford Universities visit Cheyadam

  Ee February lo Stanford visit Chesanu. I spent around 5 hours there. In that process, I come across MBA department. Where CBN son studied his MBA. Whose money is it? Satyam money? Why Satyam gave the money? Meeru Dhani Meedha blog rayandi vivaranga.

  My mother always used to say behave gentle and honestly. If you dont behave properly, people will not spit on your face, they will spit on your in your mouth.

  Chaduvari Garu...What CBN did harm to farming and as a farming family, I can not forgive him. I am in very luxarious and comfortable position. I am worrying my old friends, who missed the bus.

  Just imagine, if you see 4 woman in the street, one among selling her body for food. it is the fate of Anantapur district during babu time. Read P.Sainath Articles sir..I also loved CBN like a family member. When I read P.Sainath Articles and some other Articles, I lost faith on it. Unfortunately, this time also I casted my vote to TDP, which is against my will.

  రిప్లయితొలగించండి
 22. శౌర్య గారూ, మీ ఇంగ్లీషు వ్యాఖ్యను నేను అర్థం చేసుకున్నంత వరకు ఇది: నేను వయ్యెస్‌ను విమర్శిస్తున్నాను కాబట్టి చంద్రబాబును ఆదరిస్తున్నట్టు. అంచేత మీరు వయ్యెస్‌తో పోల్చి, చంద్రబాబు ఎంత దుర్మార్గుడో చెబుతున్నారు. వాళ్ళిద్దరిని పోల్చినపుడు వయ్యెస్ చాలా మెరుగు కాబట్టి నేను వయ్యెస్‌ను విమర్శించకూడదు.

  ఒకవేళ మీరు చెప్పేది ఇదే అయితే.. మీరు నా భావాన్ని సరిగా అర్థం చేసుకోలేదు. ఒకటి: వయ్యెస్ మంచివాడు కాదని నేను అన్నంత మాత్రాన, బాబు మంచివాడని అన్నట్టు కాదు. నేను రాసిన దానిలో బాబు మంచివాడని అన్నట్టు ఎక్కడైనా కనిపించిందా? (ఇద్దర్నీ పోల్చితే ఎవరు మెరుగు అనే విషయంపై నేను మీతో విభేదిస్తాను. అయితే అది అప్రస్తుతం, నేనసలు పోల్చనేలేదు.) రెండు: నాకు ఇద్దరన్నా పడదు. పడదు కాబట్టి మొన్నటి ఎన్నికల్లో లోక్‌సత్తాకు వోటేసాను. నా ఇష్టానికి వ్యతిరేకంగా వోటు వెయ్యలేదు. మూడు: నేను మాట్లాడుతున్నది, వాళ్ళు సొంతానికి చేసుకున్న డబ్బుల గురించి, వాళ్ళ పరిపాలనా విధానాల గురించి కాదు.

  ఒక ప్రశ్న.. నేను బాబుగారి బాబు గారి చదువు గురించి రాయాలని మీకెందుకో ఆసక్తి? :)

  రిప్లయితొలగించండి
 23. Chaduvari Garu,

  I am silent reader for your blog for a quite long time. I replied to this post only. I realised now.
  Thank you once again for your prompt replies.
  Good Luck and bye.

  రిప్లయితొలగించండి
 24. పేద వానికి ఇవ్వోచు, మరి వాళ్ళు దోచుకోతం దేనికి. చంద్ర బాబు ఉన్నపుడు పనికి ఆహార పథకం పెట్టాడు, దానిలో avineethi jarigindi anakandi. avineethi prati chota unnade. 10 acres unnavalla daggara తెల్ల cardulu unaai, gudu leni vani daggara తెల్ల card లేదు. kilo రెండు rupayaliki biyyam iche దాని kanna పని చేస్తే దాని kinda biyyam ivvatamu anedi somari tananni praldrolatame. ఇప్పుడు jarugutunna durviniyogam వాళ్ళ manake నష్టం. నాకు తెలిసి వచ్చే ఐదు samtsaralalo య్స్ర్ inko 2-3 media and inko 2-3 cement factories open chestadu. 2014 lo hyd lo gajam 100000 data vachu, endu kante hyd nunchi 50km varaku gajam stalam kuda migalaka povachu.
  pydanta chadivi nenu TDP abhimaani ni anukokandi. 1999 lo congress vodi pote bada padi 2004 lo malli vote vesi congress vaste ananda padda vanne, aa anandam 100 rojulu kuda ledu.

  రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు