28, సెప్టెంబర్ 2009, సోమవారం

జగనే మాయ! పదవే మాయ!!

రాష్ట్రంలో కాంగ్రెసు నాయకులు ఎప్పుడూ కూడా అధికార కుటుంబానికి పాలేళ్ళే. ఇందిర, రాజీవ్, సోనియా, రాహుల్.. ఇలా ఎప్పుడూ ఎవరో ఒక వ్యక్తికి ఊడిగం చేస్తూ ఉంటారు. కొందరు పెద్ద పాలేళ్ళు, కొందరు ఇంట్లో పనులుచేసే చిన్న పాలేళ్ళు, కొందరు రోజుకూలీలు. ఎన్ని రకాలున్నప్పటికీ అందరూ పాలేళ్ళే. దొర కనుసన్నలలో ఉండటం కోసం నానాతంటాలు పడతారు.


కానీ గత ఐదేళ్ళుగా పరిస్థితి ఏంటంటే.. ఢిల్లీలోనే కాకుండా ఇక్కడే, హై.లోనే ఒక కొత్త కుటుంబం తయారైంది. ఈ స్థానిక కుటుంబ నాయకుణ్ణి పాళెగాడు అనొచ్చు. ఇప్పుడు కాంగ్రెసు నాయకుల విధేయత ఢిల్లీ సుల్తాను పట్లే కాకుండా పాళెగాడిపట్ల కూడా వ్యక్తమౌతోంది - బలంగా వ్యక్తమౌతోంది. రాజశేఖరరెడ్డి ఉన్నన్నాళ్ళూ ఆయన పట్ల ఉన్న విధేయతను, ఆయన పోయాక, ఆయన కొడుకు వైపుకు మళ్ళించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అధిష్ఠానానికి ఇది కలత కలిగించేదే! రాశేరె ఉన్నన్నాళ్ళూ ఆయన్ను అడ్డుకోలేకపోయారు. ఆయన పోయాకకూడా తమ ప్రాభవాన్ని పెంచుకునే అవకాశాన్ని అందిపుచ్చుకోకపోతే ఎలా?

అసలీ స్థానిక కుటుంబం ఇంతలా ఎలా బలపడిందో గత ఐదేళ్ళ పరిపాలన చూసినవారికి బాగానే బోధపడుతుంది. ఐదేళ్ళుగా పాళెగాడి పాలనలో 'తన' అనుకున్నవాడు ఏంచేసినా చెల్లింది, కానివాళ్ళు శంకరగిరిమాన్యాలు పట్టిపోయారు. భూముల్ని నమ్ముకున్నవాళ్ళు మట్టిగొట్టుకుపోతే భూముల వ్యాపారం చేసేవాళ్ళు డబ్బుల దిబ్బలేసుకుపోయారు. రాష్ట్రంలో అధికారం, బలం, బలగం మొత్తం ఒక కుటుంబం చేతిలో కేంద్రీకృతమైంది. స్థానిక అధికార కుటుంబాన్ని నమ్ముకున్నవాళ్ళు, విధేయులు కోట్లకు పడగలెత్తే అవకాశాలు పొందారు. తామాడింది ఆటగా, పాడిందిపాటగా పాలన సాగింది. నమ్ముకున్నవాళ్ళకు ఇన్ని మేళ్ళు కలుగుతూండగా, కాస్తో కూస్తో పేరున్న ప్రతీ నాయకుడూ విధేయుడే అయ్యాడు, దాసోహమే అయ్యాడు. మరోరకంగా ఉండాల్సిన అవసరమే లేకపోయింది వాళ్ళకు.  ఇదొక మాఫియా ముఠాగా తయారయింది. మాఫియా పాలన అది. జలయజ్ఞం, సెజ్జులు, రింగురోడ్లు,.. ఏ ప్రాజెక్టైనా ఏ కార్యక్రమమైనా తామూ తమవాళ్ళూ డబ్బులు దోచుకునే అవకాశాలుగా మారిపోయాయి. ఐదేళ్ళయ్యాక, మళ్ళీ అధికారానికి వచ్చేసరికి రాజశేఖరరెడ్డి మరింత పుంజుకున్నాడు, పార్టీలోని ఆయన వ్యతిరేకులు దాదాపు కనుమరుగయ్యారు.

రాజశేఖరరెడ్డి గాలివానకు బలయ్యాక, ఆయన్ను నమ్ముకున్నవాళ్ళు హతాశులయ్యారు. తమ ఆదాయమార్గాలు నిరంతరాయంగా సాగాలంటే రాశేరె కొడుకు రాజవ్వాలని భావించారు. అంచేతే.. శవసంస్కారం జరక్కముందే జగన్ను ముఖ్యమంత్రిని చెయ్యాలనే వాదన మొదలైంది. ముఖ్యమంత్రిత్వం కోసం మరో అభ్యర్థిని పరిశీలనలోకే రానివ్వకుండా, అసలు మరో స్వరం వినబడకుండా చేసే ప్రక్రియలో భాగంగానే ఈ ప్రచారం మొదలైంది. పాళెగాడి కుటుంబానికి పెద్దపాలేళ్ళు అనదగ్గవాళ్ళు చొరవ తీసుకుని ఈ వాదన మొదలెట్టారు. రాజీనామాలు చేసిపారేస్తామని గాండ్రించారు కూడాను. తటస్థులను నోరెత్తనీకుండా చేసి, తమవైపుకు తిప్పుకున్నారు. మొత్తం ఎమ్మెల్యేలంతా ఇందుకు అనుకూలంగా ఉన్నట్టు చెప్పడమే కాకుండా, రాష్ట్ర ప్రజలు కూడా ఇదే కోరుకుంటున్నారని ప్రచారం చెయ్యడం మొదలెట్టారు.

జగన్‌కు కాస్తో కూస్తో వ్యతిరేకులనదగ్గవాళ్ళు బైటకి ఏమీ మాట్టాడకపోయినా, చెప్పాల్సినవాళ్ళ దగ్గర తమ అభిప్రాయాలు చెప్పారు. ఈలోగా ఖమ్మంలో సోనియా బ్యానరును చించెయ్యడం, రాజమండ్రిలోబస్సును తగలెట్టడం జరిగాక వీరికి ఒక ఆయుధం దొరికింది. ఇక రెచ్చిపోయి, వీరంగం ఆడేసారు. స్వరం పెంచి ఎదురుదాడి చేసారు. ఈ ఎదురుదాడిని చూస్తూంటే ఇది బలం పుంజుకుని, జగన్‌కు అనుకూలంగా సంతకాలు పెట్టినవాళ్ళను ఈ సుడిలోకి లాగేస్తుందేమోనని జగన్ వర్గీయులు కలతచెందారు. బలంగా ఎదురు తిరిగితే తప్ప జగన్మోహనరెడ్డిపైనున్న వ్యతిరేకతను అదుపు చెయ్యలేమని వాళ్ళకు తెలుసు, అంచేతే ఎక్కడ ఏకొంచం ధిక్కార స్వరం వినబడినా దాడి చేస్తున్నారు, విరుచుకుపడుతున్నారు. మాటలజోరు పెరిగింది. రాజశేఖరరెడ్డిని వటవృక్షంగా కీర్తిస్తూ ఈ వ్యతిరేకులను పిచ్చిమొక్కలని అన్నారు.

కానీ తన అనుచరులు చేసిన ఆగడాలకు తాను మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి జగన్‌కు ఎదురైంది. గత్యంతరం లేని పరిస్థితులలో తన వర్గీయుల ఆగడాలకు వ్యతిరేకంగా ప్రకటన ఇవ్వక తప్పలేదు. జగన్‌సేన లాంటివాటికి తన మద్దతు లేదని చెప్పాల్సొచ్చింది.  జగన్ బలహీనపడుతున్నాడనేదానికి,  అధిష్ఠానం పుంజుకుంటున్నదనేదానికి ఇది సంకేతం కావచ్చు. జగన్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు దాదాపుగా లేనట్టుగానే కనబడుతోంది. అయితే ఓ మార్గం ఉంది..

కాంగ్రెసు ఎమ్మెల్యేల్లో 130 మందికి తగ్గకుండా కొనేసి, ఢిల్లీపై తిరుగుబాటు చేసి స్వతంత్రం ప్రకటించుకోవాలి. చిరంజీవి ఎమ్మెల్యేల్ని కొనేసి, తనవైపు తిప్పుకోవాలి. మిగతాపార్టీల్లోకూడా ఉన్న లూజు కారెక్టర్లను కొనేసి తగిన మద్దతు కూడగట్టుకోవాలి.ఆ విధంగా ముఖ్యమంత్రి కావడం.

ఇంకో మార్గం కూడా ఉంది.. రాష్ట్రానికి చెందిన ఎంపీలను కూడగట్టుకుని, కేంద్ర ప్రభుత్వ మనుగడపై అధిష్ఠానాన్ని బెదిరించి, బేరాలాడుకుని తాను ముఖ్యమంత్రి కావడం. ఇది జగన్ చంద్రుడిపై కాలూనినంత తేలిక.

~~~~~~~~~~~~~~~~~

ఇక, రోశయ్య మాత్రం నిదానంగా బలపడుతున్నట్టుగా కనిపిస్తోంది. తనపదవిపై తనకు నమ్మకం కలుగుతున్నట్టుగా ఉంది. సోమవారం సాయంత్రం ఐన్యూస్ వాడు ఆయనతో ఇంటర్వ్యూ ఏర్పాటు చేసాడు. అందులో ప్రేక్షకుల ప్రశ్నలనూ ఆహ్వానించారు. లైను దొరకలేదుగానీ, దొరికితే నేనూ ఒక ప్రశ్న అడిగేవాణ్ణి.. ముఖ్యమంత్రి గారూ, మీ మాటలో వినిపిస్తున్న ఆత్మవిశ్వాసం నాకు సంతోషాన్నిస్తోంది. జగన్ను ముఖ్యమంత్రిని చెయ్యాలని మీ మంత్రివర్గం తీర్మానించిందికదా.., ప్రస్తుత పరిస్థితుల్లో ఆ తీర్మానానికి మీరు కట్టుబడి ఉన్నారా?

~~~~~~~~~~~~~~~~~~

ఏదేమైనా, ముఖ్యమంత్రి గారూ మీరు కొనసాగడమే రాష్ట్రానికి మేలు. లేని పరిస్థితుల్లో జరిగే మేళ్ళను తట్టుకునే శక్తీ రాష్ట్రానికి ఉందని అనుకోను.39 కామెంట్‌లు:

 1. అసలు సంబంధిత చట్టసభల ప్రస్తుత సభ్యులు కానివాళ్లని సైతం ముఖ్య/ప్రధాన మంత్రులుగా చేసేందుకు అనుమతిస్తున్న రాజ్యాంగాన్ననాలి.

  రిప్లయితొలగించండి
 2. 1) ఎవరు ఎక్కువ ఎంపీ సీట్లు ఇవ్వగలరు.
  జగనా.. లేక మరో కోన్ కిస్కానా..
  2) ఇప్పడు అదే రీతిలో సూట్కేసులు రావాలి
  అవి ఎవరు పంపగలరు.
  ఈ రెండు అంశాలే సీఎం పదవిని నిర్ణయిస్తాయి....
  I agree..


  anyway ..after a long time we are seeing congress mark politics (internal).. I am enjoying ..

  రిప్లయితొలగించండి
 3. చాలా చక్కని విశ్లేషణ . అభినందనలు.
  కాంగ్రెస్ లో ధిక్కార స్వరాలు పెరుగుతున్నట్టే - మన బ్లాగుల్లో కూడా జగన్ మాయ నుంచి , మాస్ మానియా భయం నుంచి బయటపడి మంచి విశ్లేషణలు వస్తున్నాయి .
  >>>>
  అసలీ స్థానిక కుటుంబం ఇంతలా ఎలా బలపడిందో గత ఐదేళ్ళ పరిపాలన చూసినవారికి బాగానే బోధపడుతుంది. ఐదేళ్ళుగా రాష్ట్రంలో ఒక పాళెగాడి ప్రభుత్వం రాజ్యం చేసింది. తన అనుకున్నవాడు ఏంచేసినా చెల్లింది, కానివాళ్ళు శంకరగిరిమాన్యాలు పట్టిపోయారు. భూముల్ని నమ్ముకున్నవాళ్ళు మట్టిగొట్టుకుపోతే భూముల వ్యాపారం చేసేవాళ్ళు డబ్బుల దిబ్బలేసుకుపోయారు. రాష్ట్రంలో అధికారం, బలం, బలగం మొత్తం ఒక కుటుంబం చేతిలో కేంద్రీకృతమైంది. స్థానిక అధికార కుటుంబాన్ని నమ్ముకున్నవాళ్ళు, విధేయులు కోట్లకు పడగలెత్తే అవకాశాలు పొందారు.
  >>>>>
  ఎంత కరెక్ట్ గా చెప్పారు .
  ఇంట అవనీతి సామ్రాజ్యాన్ని నిర్మించి ఇష్టారాజ్యంగా వ్యవహరించిన వాడు మరో దేశం లో అయితే నేరస్తుడుగా నది బజార్లో నిలబడాల్సి వచ్చేది . కాని విచిత్రం మన దేశంలో పేదల పాలిటి పెన్నిధి గా గాందీ కి కూడా రానంత కీర్తిని ఉత్త పుణ్యానికే సొంతం చేసుకున్నాడు . చేసిన అవనీతి , అక్రమాలు , బెల్ట్ షాపులతో జనాన్ని మత్తులో ముంచెత్తడం పేద ఆడపడచుల బతుకులని సంసారాలని సర్వనాశనం చేయడం , భూముల ఆక్రమణలు , రైతుల ఆత్మ హత్యలు తదితర పాపాలన్నీ మాఫ్ అయిపోయాయి .
  అందుకే కాబోలు గురజాడ ఏనాడో అన్నాడు
  మనవాళ్ళు ఉట్టి వెధవాయిలోయ్ అని .
  ఈ కాంగ్రెస్ అధికార అవకాశవాద డ్రామా ఇంకా మునుముందు ఇంకా ఎన్ని మలుపులు తిరగనుందో చూడాలి .
  నిన్నటి వరకు పెద్ద దిక్కు పోయిందని ఏడ్చినా జనాల కు ఈ డ్రామా తో వూరట లభిస్తుంది . ఈ వినోదం తో వాళ్ళ కళ్ళు ఇప్పటికైనా తెరుచుకుంటాయని ఆశిద్దాం

  రిప్లయితొలగించండి
 4. *లెక్కంతా 2014 ఎన్నికల మీదే ఉంటుంది. రాహుల్ అప్పటికల్లా ప్రధాన మంత్రి కావాలి.*
  మీరు రాసినదాని తో నేను ఏకీభవించను. కాంగ్రెస్ పార్టీకి నిజం గా నిధులు కావలంటె అదొక సమస్యే కాదు. వాటిని వసూలు చేయడం లో వారు నిష్ణాతులు. ఆ విద్యలో 60 సం|| గా ఆరితేరారు. రాజనుకుంటె కొరడా దేబ్బలకు కొదవా. ఈ సుట్కేస్ ల విమర్శలన్ని ఖాళీగా ఉన్న చంద్ర బాబు నాయుడిగారి పస లేని విమర్శ. నిజం గా రాహుల్ ప్రధాన మంత్రి కావలనుకుంటె ఆయన పూర్తి మేజారిటి ఉన్న ఈ సమయంలో నే కాగలడు. నాకు అనుభవం వచింది వచ్చె సంవత్సరం ప్రధాన మంత్రి అవుతాను అంటే వద్దనే వారెవరు చెప్పండి. అప్పుడు మీడియా ఇంకొక విధము గా రాయడం మొదలు పెడుతుంది. అందరు ఆయన కి జోరు గా భజన చేస్తారు. ఇక జగన్ విషయానికి వస్తె మంచొ చెడొ వచ్చెసారి ఆంధ్రాలో గెలెవక పోయినా పరవాలేదు ఆయన సి.యం. కావటానికి వీలు లేదు అని నిర్ణయించారని అని పిస్తుంది. దీని వెనుక మనం ఊహకకు అందని కారణం ఉండవచ్చు. అంతేకాని మీడియాలో రాసే నాసి రకం అనాలిసిస్ సర్కార్ రాజ్ -2 రాంగోపాల్ వరమ సినేమాలో అనాలిసిస్ లా ఉంది. కాని ప్రస్తుతానికి మనకు ఒక మంచి ముఖ్యమంత్రి దొరికాడు అనిపిస్తుంది. రోశయ్య గారు రానునున్న రోజులలో ఒక కంపేని సి.ఈ.ఓ. లా పనిచేస్తారు. ఆయనకు ఏ గ్రుపులు లేవు కనుక ఇక అందరూ కొంచెం క్రమశిక్షణ నేర్చు కోవాలి లేక పోతె మేల్లగా బయటకు సాగనంపుతారు. ఈ శాసన సభ్యులు వారిని వారు చాల ఎక్కువ అంచనా వేసుకొని ఉరకనే నోరు పారెసుకొంట్టున్నారు.ఇక పార్టి చిల్చటం అలాంటివి అవ్వని అయ్యే పని కాదు. అలా జరిగినా వారు ఎక్కువ కాలం మన లేరు. వీరంతా రేడ్డి కాంగ్రెస్ పార్టి గురించి మరచి పోయారు. మనం ఇప్పుడు గ్లొబలిసషన్ రోజులలో ఉన్నం. ఒకప్పటి తో పోలిస్తె ప్రతి రోజు ప్రతి ఒక్కరూ కొన్ని నిర్ణయాలను తీసుకొని అమలు జరపాలి. ఇప్పటి జీవితం వ్యాపారం తో ముడిపడి ఉంది, ఇటువంటి సమయం లో మనకి ఆ వర్గానికి చెందిన వారె ముఖ్యమంత్రి కావడం ఒక విధం గా మంచిది. ఇకనైన తెలుగు వాళ్ళు భూస్వామ్య వర్గా భావజాలం నుంచి బయట పడటానికి ఇది మంచి అవకాసం. లేక పోతే నాయాకులు కోట్లలో తిని సోమరులకు/కార్యకర్తలకు ఎదో ఒక పథకం పేరు తో వందలలో తినిపించి అభివృద్ది అని డప్పు కొట్టి సామాన్య మానవుడి నిస్సహాయులను చేస్త్తున్నారు. ఈ వొరవడి కొంచెం రోశయ్య గారి పాలనలో బ్రెక్ పడుతుంది, పడాలి కూడా లేక పొతే మనం ఒక విధమైన హిస్టిరియాతో నాశనం వైపుకి అభివృద్ది పేరు తో పరుగులు పెడుతున్నాము.

  రిప్లయితొలగించండి
 5. జగన్ కి అవకాశాలు రోజు రోజుకీ తగ్గిపోతున్నాయని స్పష్టమవుతోంది.. బహుశా పార్టీ రాష్ట్ర శాఖని తన గుప్పెట్లో పెట్టుకోడం కోసం హైకమాండ్ తీసుకున్న నిర్ణయమేమో ఇది .. బాగుంది మీ విశ్లేషణ..

  రిప్లయితొలగించండి
 6. ఇది చాలా అభ్యంతరకరం అధ్యక్షా ! నేను రాయాల్సిన టపా మీరు ముందే రాసేసి నా బ్లాగు హిట్లన్నీ అక్రమంగా కొట్టేసినందుకు నేను అధిష్ఠానానికి ఫిర్యాదు చెయ్యబోతున్నాను. (ఏ పార్టీ అధిష్థానమంటారా ? అదేంటో నాకే తెలియదు. ఈమధ్య పేపర్లు చదివీ చదివీ ఇలా అయిపోయాను)

  రాశేరె హయాములో జఱిగిన అరాచక, కీచక, రాక్షస పాలనని సవివరంగా వర్ణిస్తూ ఏదైనా పుస్తకమో, టపాల పరంపరో వస్తే బావుంటుందనిపిస్తుంది. ఎందుకంటే తెలిసిన మనలాంటివాళ్ళు నోరుమూసుకుని ఊరుకుంటే పాలేళ్ళంతా ఏకమై చచ్చినవాణ్ణి కాస్తా ఒక మహాత్ముణ్ణో మార్టిన్ లూథర్ కింగునో చేసేట్లున్నారు. అలా కుదరదు. భావితరాలకి సదరు వ్యక్తి నిజస్వరూపం ఏంటనేది తెలియాలి.

  --తాడేపల్లి

  రిప్లయితొలగించండి
 7. తాడేపల్లి,

  మీరు అనుకున్నట్టే దాశరథి కూడానిజాం గురించి భవిష్టత్ తరాలకు చెప్పాలని శాయ శక్తులా కృషి చేశాడు, అయినా ఇప్పుడు చూడండి .....

  మానవ ప్రయత్నం చెయ్యండి.

  రిప్లయితొలగించండి
 8. మీ పోస్టు బాగుంది , జయహో గారి కామెంట్ కూడా చాల బాగుంది .

  రిప్లయితొలగించండి
 9. ఆఫిసుకు పొయే తొందరలో ఇంకొక పాయింట్ రాయడం సాధ్యపడలేదు. అదేమిటంటె రోశయ్యను తొలగిస్తె అది కాంగ్రెస్ కి భవిష్యత్ లో ఐడియాలజికల్ గా చాల పెద్ద నష్టం. క్రితం ఎన్నికల వరకు బి.సి. లను సి.యం. చేయాలి వత్తిడి వచ్చినప్పుడు Y.యస్. మా పార్టిలో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుంది అన్ని వర్గాల వారు ముఖ్యమంత్రిని చేసిన ఘనత కాంగ్రెస్ దే అని పి.వి.,జలగం, దామొదరం సంజీవయ్య లాంటి వారిని పెర్కోనే వాడు. ఇప్పుడు మొదటి సారిగా వైశ్య వర్గానికి చెందిన రోశయ్య గారు ముఖ్యమంత్రి అయితె ఆయనను రేపు తొలగించి జగన్ కి అవకాశమిస్తె వచ్చె ఎన్నికల నాటికి వైశ్య,బి.సి. వోటర్ల వోట్లు ఒక్కటి కూడా పడదు. జగన్ వయసు 36 ఆయన సి.యం. యిప్పుడైతె పార్టీలో మిగిలిన వర్గాలకి ఇంకొక 20 సం|| వరకు ఎమి అవకాశం ఉంట్టుంది? అందువలన మేల్లగా వచ్చె ఎన్నికల నాటికి బి.సి.లు ఇంకొక పార్టిని చూసుకుంట్టారు. భవిష్యత్ లో కాంగ్రెస్ పార్టి కి రామజన్మ భుమిలా ఒక చెరగని మచ్చ ఆంధ్రా కాంగ్రెస్ కి ఈ విషయం లో పడుతుంది. ఆ పార్టి లొ ఒక్క వర్గానికే సి.యం. పదవి అని మిగతా వాటికి ఏ మాత్రం ప్రాధాన్యం ఉండదని ఒక స్పష్టమైన శిలా శాసనం లాంటి భావం అధికారికం గా ఏర్పడుతుంది.

  చదువుకున్న వాళ్ళు లోక్ సత్తాని సమర్ధించినట్లు ఇప్పుడు అందరూ రోశయ్య గారిని సమర్ధించాలి. ఏదైనా ఆయనకు మద్దతుగా ఒక కెంపైన్ నడిపితె బాగుంట్టుంది. ఒక విధం గా పాత కొత్త తరాల రాజకీయలకు వారధి లాంటి వారు రోశయ్య గారు. అంత అనుభవం, మంచి అడ్మినిస్త్రేటర్ అయిన రోశయ్య కు ఈ జలయజ్ఞ, మిగతా పథకాలను సక్రమం గా అమలు చెస్తె వచ్చె ఎన్నికలలో మంచి టఫ్ ఫైట్ ని ఇవ్వ వచ్చు. కావాలంటె వచ్చె ఎన్నికలకి జగన్ ని సి.యం. గా ప్రోజేక్ట్ చేసుకొవచ్చు.

  రిప్లయితొలగించండి
 10. డిల్లీ కాంగ్రెస్ వాళ్ళు వచ్చె ఎన్నికలలో ఆంధ్రా కాంగ్రెస్ వల్ల కలిగె నష్టాన్ని బెంగాలు, బీహార్, యు.పి. ల తో పూడ్చవచ్చు అనే నమ్మకంతో ఉన్నారేమొ. Any thoughts, ideas -:)

  రిప్లయితొలగించండి
 11. *కాంగ్రెసు ఎమ్మెల్యేల్లో 130 మందికి తగ్గకుండా కొనేసి, ఢిల్లీపై తిరుగుబాటు చేసి స్వతంత్రం ప్రకటించుకోవాలి.*
  మీరు అన్నవి జరగడానికి కేంద్ర ప్రభుత్వ సహాయం ఉండాలి అంటె గవర్నర్ అసెంబ్లి లో బల పరిక్ష జరపమనడం లాంటివి. గవర్నరే కేంద్ర తరపున నిలబడితె చీలిక బౄందం చంద్ర బాబు నాయుడు రాశెరే అవినితి మీద ఆరోపణలు చేస్తూ అప్పుడప్పుడు గవర్నర్ ని కలిసి విజ్ఞాపన పత్రం సమర్పిస్తుంటారు. దానిని గవర్నర్ గారు చదివి ప్రతిపక్షాల మాటలు ఆశక్తి గా విని బుట్టలో వేస్తారు. ఇటువంటివి పేపర్ లో రావడం తపితె వీటిపై చర్యలు తీసుకోరు. రేపు జగన్ గారి సంగతీ కూడా అంతె నాకు మద్దతు ఉంది అంటె రోజుకొక వంకతో వార్ని రాజభవన్ తిపించుకొని మెల్లగా ఆయన వర్గాన్ని నిరుత్సహపరచి వారి కంటిని వారి వేలి తో నే పొడుస్తారు. ఇంతలో ఢిల్లి పెద్దలు జగన్ గారి లోపాలను పెద్దవి చెసి ఆయన వర్గీయులకే చూపి మనసు మారుస్తారు. సంతాప సభలో డి.యస్. మాట్లాడుతుంటె చేసిన గలభాలాంటి వి చూస్తె మన జగన్ గారి నాయకత్వ ప్రతిభ అర్థమౌతున్నాది. అతను స్త్రటెజికలి పూర్ అని. గోటితో పొయే దానిని కొండంతలు చేశారు.

  రిప్లయితొలగించండి
 12. టపా బాగుంది. జగన్ పాలెగాళ్ళు రోశయ్య ను ఉండనిస్తారా? జగన్ కోసం బస్సులను ఆహుతిస్తున్నారుగా!!

  రిప్లయితొలగించండి
 13. డిల్లీ కాంగ్రెస్ వాళ్ళు వచ్చె ఎన్నికలలో ఆంధ్రా కాంగ్రెస్ వల్ల కలిగె నష్టాన్ని బెంగాలు, బీహార్, యు.పి. ల తో పూడ్చవచ్చు అనే నమ్మకంతో ఉన్నారేమొ. Any thoughts, ideas -:)>>

  అదే అర్థం కాక ఒక వారం పది రోజుల గా ఒకటే కడుపునొప్పి మీకేమయినా తెలిస్తే ఒక ముక్క ఇటు వేయండి ప్లీజ్. వీలు కాక ఆగిపోయాగాని అసలు సోనియా గాంధీ అడిగి తెలుసుకుందామన్న క్యురియస్ గా ఉంది :)

  రిప్లయితొలగించండి
 14. వ్యాఖ్యాతలందరికీ నెనరులు.

  వెన్నెల రాజ్యం, జయహో: ఈ తిరుగుబాట్లు, బ్లాక్‌మెయిలింగులు జరిగే అవకాశాలు తక్కువే. కాని వాటిని పూర్తిగా కాదనలేం -అవీ కొన్ని వికల్పాలే.

  జగన్, అధిష్ఠానాల మధ్య ఇప్పుడొక బలప్రదర్శన జరుగుతోంది. అధిష్ఠానం ముందు ఉన్న అతిపెద్ద సమస్య -రోశయ్యకు మద్దతుగా ఎమ్మెల్యేలను సమీకరించడం. అది జరిగాక మాత్రమే సీయెల్పీ సమావేశం జరుగుతుంది. అది జరగాలంటే జగన్ రెక్కలు విరవాలి, లేదా అతడితో సంధి చేసుకోవాలి. రెక్కలు విరిచే ప్రయత్నం ప్రస్తుతం జరుగుతోంది. జగన్ను ఎదిరించడం అధిధ్ఠానానికి ప్రస్తుతానికి కష్టంగానే ఉన్నట్టు తోస్తోంది. సరిపడినంతమందిని తమవైపుకు లాక్కోగలరో లేదో చూస్తారు, కుదరకపోతే సంధి ప్రయత్నం చేస్తారు. సంధికోసం కేవీపీ ఏదో ఒక సూత్రాన్ని తయారు చేస్తాడని నా ఉద్దేశం.

  ఇంత జరిగాక జగన్ను ముఖ్యమంత్రిని చెయ్యాల్సే వస్తే.. కాంగ్రెసు అధిష్ఠానం తనను తాను న్యూట్రలైజు చేసుకున్నట్టే!

  రిప్లయితొలగించండి
 15. @వెన్నెల రాజ్యం,
  *ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న రాష్ట్రాల్లో కాంగ్రెస్ బలహీనంగా ఉంది. ఒక్క ఆంద్రప్రదేశ్ లో తప్ప. ఈ నేపథ్యంలో అలాంటి ప్రాంతీయ పార్టీలను ఎదుర్కొవాలంటే రాజశేఖర్, లేదా జగన్ తరహా నాయకులనే కాంగ్రెస్ పైకి తీసుకురావాలి. *ఇక్కడ మంచోడు.. నిజాయతీ పరుడు లాంటి పదాల గురించి మనోళ్లు కొందరు వెదుకుతుంటే కొంచెం నవ్వు వస్తోంది.* *

  కోట్ల సి.యం. అయినప్పుడు ఆయంకి తగిన వ్యవధి ఉండెది కాదు అంటె అందరు కొట్టుకొని ఎంత గబ్బు పట్టాలో అంత పట్టిన తరువాత ఆయన అయ్యేవాడు. ఆ ఆఖరి ఒక్క సం || ఎంత చేసినా జనం అభిప్రాయాలు మారేది కాదు. ఇక పోతె మిగతా రాష్ట్రాల సంగతి కరుణా నిధి ఇప్పుడు కాంగ్రెస్ తో మరో శరద్ పవర్ లా కలసి పోయాడు. నీతీష్ కుమర్ ఒక గోపి గాడు వారు వచ్చె ఎన్నికల్లో నవీన్ పట్నాయక్ లా బి.జె.పి.కి నామం పేట్టినా పెట్టవచ్చు. లాలు జార్ఖండ్ ఎన్ని కలలో కాంగ్రెస్ తో కలసి పోటి చెయటానికి తహ తహ లాడు తున్నాడు. మాయవతి, ములాయం ఇద్దరు ప్రస్తుతం కేంద్రానికి మద్దతు ఇస్తున్నారు. వచ్చె ఎన్నికల లో వీరిద్దరిలో ఎవరు బలం ఎక్కువుంటె కాంగ్రెస్ వారితో జత కడుతుంది. బెంగాల్ లో కాంగ్రెస్ పూర్తి మెజారీటీ తో వచ్చెట్లు లు ఉన్నారు. అక్కడ ఉప ఎన్నికలో కమ్యునిస్ట్ లు ఆంధ్రా కమ్యునిస్ట్ లా గెలుస్తున్నారు. సీతారాం ఎచురి మీడీయా ముందుకు వచ్చి ఎన్ని రోజులు అయింది ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. ఇక పోతె భా.జ.పా. పునరుజీవం పొoదటం అనేది ఇప్పటీ లో జరిగె పనికాదు. వారు మహా అయితె అధికారం లో ఉన్న రాస్ట్రాలను నిలబెట్టుకుంటె ఎక్కువ. ఇక కాంగ్రెస్ కి కాంపిటషన్ ఎక్కడ ఉంది? జగన్ అవసరం ఎమీటి?

  రిప్లయితొలగించండి
 16. జగన్ బీజేపీలో చేరిపోతే ? :)
  ఎలాగూ గాలి దగ్గరే కదా.

  రిప్లయితొలగించండి
 17. బి..జె.పి.లో చేఱడానికి జగన్ హిందువైతే గదా ?

  --తాడేపల్లి

  రిప్లయితొలగించండి
 18. ఒక బ్లాగులో నే రాసిన వ్యాఖ్య

  --తాడేపల్లి

  రిప్లయితొలగించండి
 19. * జగన్ కూడా ఓ ప్రాంతీయ పార్టీ పెట్టొచ్చు.*
  జగన్ ప్రాంతీయ పార్టీని వెనకనించి నడపటానికి రోశయ్య ఉండడు, ఉండవల్లి మద్దతు కూడా అనుమానమే (ఇలాంటి వారు తెలివి, మాటల చాతుర్యం కల వారు) వీరి సహాయం లేకుండా వారు రెండు నేలలు కూడా నెగ్గుకురాలేరు. మహా ఐతె అయనకి కె.వి.పి. ఒక్కడె మద్దతుగా మిగులుతారు. కొండా సురేఖ లాంటి నాయకులు పెద్ద విదుషకులు. వారిని ఆంధ్ర బార్డర్ దాటితె పట్టించు కొనే వారు ఉండరు. ఢిల్లి ఆంధ్ర భవన్ లో రూం బాయ్ కూడా లెక్క చేయరు. వీరికి మాట్లాడటానికి హింది,ఇంగ్లిష్ భాషలే సరిగ్గా రావు వీరికి ఉన్న నాయకత్వ ప్రతిభ చాలా మంది కి మన ఊరిలొ కూడా ఉంట్టుంది.


  *రాష్ట్రాల్లో బలం లేకపోయినా కేంద్రంలో తమ ప్రభుత్వానికి మద్దతిస్తే సరిపోతుందన్న కొత్త విధానాన్ని కాంగ్రెస్ ఎప్పటి నుంచి పాటిస్తుందో నాకైతే తెలియదు.*
  ఇది అనఫిషియల్ పాలసి. కేంద్రం లో వారు బల పడాలి రాష్ట్రంలో ఓడి పొతె ఆ పార్టీ కి చెందిన వారికి మిగతా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో కాంట్రక్ట్లు ఇప్పిస్తారు. వారు తరువాతి ఎన్నికల లో కంగ్రెస్ పార్టి తరపున పోటి చెసి సంపాదించిది ఖర్చు పేడతారు. అందువలననే కాంగ్రెస్ పార్టి 10 సం|| అధికారంలో లేక పోయినా తిరిగి మళ్ళి తిరిగి రాగలుగుతారు. చాలమంది నాయకులు దానిని విడిచి పెట్టరు. వోడిపోయిన టైం లో వేరే రాష్ట్రాలలో పనులు చేసుకుంటారు.ఈ సూత్రం ప్రాంతీయ పార్టీ వర్తించదు వీరికి వేరే రాష్ట్రాలలో కాంట్రాక్ట్ ఇచ్చె వారు ఎవ్వరు ఉండరు కనుక పార్టిని నడపడటం చాల కష్టమౌతుంది.

  రిప్లయితొలగించండి
 20. ఈ క్రింది వ్యాఖ్య సరదాకి రాశాను జగన్ కొత్త పార్టి పెట్టి మళ్ళి తిరిగి కాంగ్రెస్ తో జత కట్టె టప్పటి సన్నివేశం ఎలా వుంటుందంటే

  ఆ సమయంలో విలేఖర్లు మీరు మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీ లో చెరుతున్నారు కదా దానికి కారణం ఎమీటీ అని అడుగుతారు. అప్పుడు జగన్ మాది తాతల కాలం నుంచి కాంగ్రెస్ కుటుంబం. మాతాత పులివెందుల సర్పంచ్, మా చిన్నాయన యం.పి. గా గెలిచాడు ఆరోజులలో, మా నాన్న సి.యం. గా పనిచేసారు ఈ పార్టీ ద్వారా. కాంగ్రెస్ పార్టీ నాకు తల్లి లాంటిది, కొన్నిసార్లు తల్లితో విబెదాలు వస్తాయి కాని అవి శాశ్వతం గా ఉండవు. నేను ఈ రోజు ఈ పార్టిలో మళ్ళి చెరటం తల్లి ఒడిలో బిడ్డ చెరటం లాంటిది . తల్లి ని వదలి బిడ్డలు ఎక్కువ రోజులు ఉండలేరు అని అంటాడు.

  రిప్లయితొలగించండి
 21. జయహొ: హహ్హహ్హ! మరి, గాంధీభవన్ ఎదురుగా ముక్కును నేలకేసి రాసి తప్పైపోయిందని చెంపలేసుకుంటేనే రానిస్తాం అనే మగ/ఆడ గంగాభవానీలెవరంటారు?

  రిప్లయితొలగించండి
 22. ఇదంతా కాదు గాని ఈ సారీ దీనిని కెంద్రం లో ప్రణబ్ ముఖర్జి హాండిల్ చెసుతున్నారు. శరద్ పవార్ ఈ యన గురిచి ఎమన్నాడు అంటె మీరు ప్రపంచంలో ఎంతటి జటిలమైన సమస్యను ఆయన కి చెప్పండి ఆయన మీకు ఒక యాంబికబుల్ సమధానం సూచిస్తారు. ఇందిరా గాంధి ఈ యనని మానవ కంప్యుటర్ అని పిలిచెది. మన ఆంధ్రా మూకకి వీధి పోరాటాలు చెయటం తప్ప లాజిక్ గా మాట్లాడి తెలివిగా పని చెసుకు రావటం తెలియదు. వీరు పొయి బాక్ డొర్ చర్చ ల లో ఆరితెరిన ప్రణబ్ ముఖర్జిని కె.వి.పి. గారు కన్వీన్స్ చేయగలుగుతారా? ఆంధ్రా కాంగ్రెస్ లో ఒకప్పుడు చాలా మంది
  తెలివిగలవారు ఉండెవారు కాని ఇప్పుడు రోశయ్య లాంటి వారు ఒకరిద్దరు మిగిలారు. జగన్ గారికి ప్రణబ్ కూడా అనవసరం రోశయ్యె చాలు చెక్ పెట్టటానికి ఆయన కొంచెం పైవారి నిర్ణయం కొరకు వేచి చూస్తున్నారు.

  రిప్లయితొలగించండి
 23. ఆరోజులలో భుస్వామ్య వర్గాలు వారి ఊరిలో నాటకాలు వేయించి నటులకు బిరుదులు ఇచ్చెవారు నట మార్తాండ, నట కిరీటీ లాంటివి. అది సినెమా వచ్చిన తరువాత సినెమా నతీ నటులకు ఇచ్చె వారు. ఆంధ్ర కాంగ్రెస్ పార్టి లో భూస్వామ్య వర్గాల భావజాలం ఎక్కువ కాబట్టి ఆపార్టి సభ్యులకి బిరుదులు లాంటి పదవుల టైటిల్స్ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు మొ|| అని ఇస్తున్నారు. వీరు చేసె కన్స్ట్రక్టివ్ పని ఎమీ ఉండదు టి.వి. ముందు రెచ్చి పోయి మాట్లాడటం,ఎవరైనా చస్తె బోరున ఏడవటం. ఈ విదుషకులను మీడియా విదూషకులు పదే పదే అడిగిన ప్రశ్నలనే అడిగి ఒక 30 ని|| పోగ్రాం రూపొదించటం. ఈ పొగ్రాం తో వీరు ఫెమస్ కావటం వీరంతా పొగయితె ఎదో అయిపొతున్నాదని మీడియా బిల్డప్.

  రిప్లయితొలగించండి
 24. tabasu,

  అవసరం కోసం ఆ మతం నుండి ఈ మతం మారిన వారు - ఈ మతం నుండి ఆ మతం మారటం ఎంత సేపు ?

  రిప్లయితొలగించండి
 25. @ mancupallaki
  చిన్న సవరణ:
  అందువలననే కాంగ్రెస్ పార్టి 10 సం|| అధికారంలో లేక పోయినా తిరిగి మళ్ళి అధికారం లోకి వచ్చారు అని నా అభిప్రాయం. మొత్తానికి చెప్పొచేదేమంటె జాతియ పార్టీ గా కాంగ్రెస్ కి కొన్ని లాభాలు ఉన్నాయి. ఒక సారీ ఓడి పోయినా ప్రాంతీయ పార్టిలా భయపడావలసిన అవసరం కాంగ్రెస్కి ప్రస్తుత పరిస్థిలో లేదు.

  రిప్లయితొలగించండి
 26. నా దగ్గఱున్న సమాచారం ప్రకారం వై.ఎస్. కుటుంబం అవసరం కోసం కాక ఒక విధమైన కసికొద్దీ మతం మారింది. అవసరం కొద్దీ అయితే మీరన్నది కరెక్టే.

  --తాడేపల్లి

  రిప్లయితొలగించండి
 27. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 28. ఒకవేళ జగన్ ముఖ్యమంత్రి అయితే కాంగ్రెస్ పరిస్థితి కూడా తెలుగు దేశంలా తయారవుతుంది. చంద్రబాబు ఎన్ని తప్పులు చేసినా తెలుగు దేశం నాయకులు అతన్ని విమర్శించిన సందర్భాలు తక్కువ. ఎందుకంటే తెలుగు దేశంలో వ్యక్తిపూజకి ప్రాధాన్యం ఎక్కువ. కాంగ్రెస్ లో కూడా వ్యక్తిపూజ సంస్కృతి ఉంది కానీ రోశయ్య గారికి వ్యక్తిపూజ చేసేవాళ్ళు లేరు. జగన్ ముఖ్యమంత్రి అయితే ఇంత వరకు రాజశేఖర నామ జపం చేసినట్టు కొత్తగా జగన్ నామ జపం కూడా చేస్తారు. MLA పదవి లేని జగన్ ని ముఖ్యమంత్రిని చేసి వ్యక్తిపూజ చేస్తే వ్యక్తిపూజ సంస్కృతి పెరిగినట్టే.

  రిప్లయితొలగించండి
 29. సోనియా గాంధీ జగన్ కి ముఖ్యమంత్రి పదవి ఇచ్చేంత తెలివి తక్కువ పని చేస్తుందని నేను అనుకోను. రాజకీయ అనుభవం పెద్దగా లేని వాడికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం అంత సులభంగా జరగదు.

  రిప్లయితొలగించండి
 30. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 31. "...చంద్రబాబు ఎన్ని తప్పులు చేసినా తెలుగు దేశం నాయకులు అతన్ని విమర్శించిన సందర్భాలు తక్కువ..."

  ప్రవీణ్ శర్మగారూ ! అకారణద్వేషం ఇలా అహేతుకమైన కంక్లూజన్స్ కి దారితీస్తుంది. ఈ మాట ఎన్.టి.ఆర్ హయములో నిజం కావచ్చునేమో గానీ నాయుడుగారి హయాములో మాత్రం కాదు. సారథ్యం వహించేవారి వ్యక్తిత్వాన్ని బట్టి పార్టీల స్వభావాలు మారుతూంటాయి. సైద్ధాంతిక పార్టీలు కూడా ఇందుకు మినహాయింపు కాదు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయినప్పటినుండి ఆయన పార్టీలో ఎంతమంది ఆయనతో విభేదించారో గుర్తుకు తెచ్చుకోవడం అవసరం. ఇప్పడు కూడా పార్టీలో కొనసాగుతూనే ఆయన్ని బహిరంగంగా విమర్శిస్తున్నారు హరీశ్వర్ రెడ్డి, తలసాని యాదవ్, నల్లపరెడ్డి, మంత్రాలయం శాసనసభ్యుడు. అయినా నాయుడుగారు వాళ్ళనేమీ అనలేదు. తనని చాలా అసహ్యంగా విమర్శించి పార్టీ వదిలిపోయిన దేవేందర్ గౌడుని కూడా చిఱునవ్వుతో అక్కున చేర్చుకున్న సత్సంస్కారం నాయుడుగారిది.

  -- తాడేపల్లి

  రిప్లయితొలగించండి
 32. చంద్రబాబు నాయుడు దొంగ సన్నాసే కానీ అమాయకుడు కాదు. దేవేందర్ గౌడ్ ని పార్టీలోకి పున:స్వాగతించినా, దేవేందర్ గౌడ్ మళ్ళీ చేరిన తరువాత అతనికి అంత ప్రాధాన్యత ఇవ్వలేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు దేవేందర్ గౌడ్ లాంటి అవకాశవాదులని నమ్మేంత తెలివితక్కువవాడు కాదు.

  రిప్లయితొలగించండి
 33. దొంగసన్నాసి కావడం అమాయకుడు కావడం - ఈ రెండే ఉంటాయా ప్రపంచంలో ? ఈ రెంటికీ భిన్నంగా మంచితనమనేదొకటి ఉంటుంది. మానవసంబంధాలనేవి ఉంటాయి. మీరు ముందేమో "వ్యక్తిపూజ" అన్నారు. తరువాత "దొంగసన్నాసి" అదీ ఇదీ అంటున్నారు. వీటిల్లో ఏది తెలుగుదేశాన్ని ఎక్కువ డామినేట్ చేస్తోందంటారు ? నాకు తెలిసి, ఒకటుంటే రెండోది అవసరం లేదు.

  -- తాడేపల్లి

  రిప్లయితొలగించండి
 34. మామనే వెన్నుపోటు పొడిచిన అవకాశవాదికి అవకాశవాదం గురించి బాగానే తెలిసి ఉంటుంది. అందుకే చంద్రబాబు నాయుడు దేవేందర్ గౌడ్ లాంటి అవకాశవాదుల్ని నమ్మేంత అమాయకుడు కాదు అన్నాను.

  రిప్లయితొలగించండి
 35. జగన్ కి ముఖ్యమంత్రి పదవి ఇస్తే సోనియా గాంధీకి కూడా కొన్ని సమస్యలు వస్తాయి. రాహుల్ గాంధీ కూడా తన తండ్రి వారసత్వంతో ప్రధాన మంత్రి పదవి కావాలంటాడు. ప్రధాన మంత్రి అవ్వాలంటే రాజకీయ అనుభవం ఉండాలి అని సోనియా గాంధీ చెపితే జగన్ కి అనుభవం లేకుండానే ముఖ్యమంత్రి పదవి ఎలా ఇచ్చావు అని అడగగలడు. ఇప్పట్లో జగన్ ముఖ్యమంత్రి అవ్వకపోవచ్చు.

  రిప్లయితొలగించండి
 36. మంచి చర్చ జరిగింది. నేను రాశేరె చనిపోయారని తెలిసిన నాడే నా సహచరుడు బ్లాగులో మరోమారు షాజహాం మరణించాడు అని రాసాను. అందులో జగం భజన పరులగురించి రాసాను. నే వ్యక్త పరిచిన అనుమానాలు తరువాత్తరువాత చాలామంది ప్రకటించారు. ఏదేమైనా మనలను పాలించే వాళ్ళను ఎన్నుకొనేది మనం ఎన్నుకున్న శాసన సభ్యులకు కూడా లేని స్వతంత్రం మనది. ప్రతిదానిలో కులం పాత్ర వుంటోంది. హైకమాండ్ సంస్కృతిపోవాలి.

  రిప్లయితొలగించండి
 37. రాజశేఖర రెడ్డి చనిపోయినందుకు మా బంధువులు సంతోషించారు. రాజశేఖర రెడ్డి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలలో ఉండే పట్నాయక్ కులస్తులని BCలో చేర్చాడు. కళింగ వైశ్యులని కూడా BCలో చేరుస్తానని మాటిచ్చాడు. కోమటోళ్ళనీ, కరణపోళ్ళనీ BCలో చేరిస్తే తూర్పుకాపు లాంటి BC కులాల వాళ్ళు SC\ST కోటాలో రిజర్వేషన్లు కావాలంటారు. మా వాళ్ళు STలు కావడం వల్ల రాజశేఖర రెడ్డి చనిపోవడం వల్ల మంచే జరిగిందని భావించారు. రాజశేఖర రెడ్డి చనిపోవడం వల్ల నేను అంత కంటే ఎక్కువే సంతోషించాను. నల్లమల కోబ్రాస్, కాకతీయ కోబ్రాస్ లాంటి గ్యాంగులతో హత్యలు చెయ్యించినవాడు చనిపోతే శని వదిలినందుకు సంతోషించకుండా అతని కొడుకుకి ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలా?

  రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు