తెలుగులో తేదీ ఆకృతి - తేదీ ఫార్మాట్ (Date format) - ఎలా ఉండాలి?
’ఎలా ఏముంది.. 08/31/11 అని ,అంతేగా’ అంటారు నేటి ఐటీ ఘనపాఠీలు. నాకు తెలిసిన ఐటీ కుర్రాడొకడు కిస్మీసు సెలవలకి అమెరికా నుంచి వాళ్ళూరు వచ్చాడు. వాళ్ళ తాతకు ఏదో కాగితం రాసిపెడుతూ తేదీని 12/13/06 అని రాసాడంట. అదిచూసి, ఆ పెద్దాయన, ’సదవేత్తే ఉండమతి పోయిందిరా నీకు’ అని అన్నాడంట. తేదీని తిరగరాసి, ’ఎమెరికన్స్ డేట్ ని అట్లాగే రాస్తారు తాతా’, అని అసలు సంగతి చెప్పాడంట, మనవడు. అమెరికా వోళ్ళకు తిక్కగానీ ఉందేంట్రా.. రోడ్డుకు కుడేపున పోతారంటగా? అని అడిగాడంట ఆయన. ఔను తాతా. అంతేకాదు, లోకమంతా లీటర్లు, కిలోమీటర్లూ అంటూ ఉంటే వాళ్ళు ఔన్సులు, అడుగులూ, మైళ్ళూ అంటారు. వాళ్ళక్కొంచెం తిక్కలే! అని చెప్పాడంట.
ఆ కుర్రాడంటే తేలిగ్గానే అలవాటు పడ్డాడుగానీ, నాకు ఎమ్మెమ్/డీడీ/వైవై తో తికమకగానే ఉంటది. జ్ఞానం వచ్చిన దగ్గర్నుంచీ డీడీ/ఎమ్మెమ్/వైవై కి అలవాటు పడి, ఇప్పుడు మార్చుకొమ్మంటే బుర్ర వై? వై? అని క్రొశ్నించదూ మరి! పదమూడో తేదీ నుండి కుసింత నయం.. అక్కణ్ణుంచీ నెలలుండవు కాబట్టి. ఆలోపు తేదీల తోటే చిరాకు. అమెరికావోడు మనమీద అన్నీ రుద్దేస్తన్నాడు. హాలీవుడ్డుకు తోకల్లాగా బాలీవుడ్డు, టాలీవుడ్డు, కాలీవుడ్డు, ఖాళీవుడ్డు అని అఘోరించినట్టు, తేదీలను కూడా మన పత్రికలు అనుకరించబోయారు. నాలుగైదేళ్ళ కిందట, జూలై పదకొండున ముంబైలో ఉగ్రవాద దాడులు జరిగినపుడు దాన్ని 7/11 అని ప్రచారంలో పెట్టారు.
సరే.. ఇదంతా పొట్టి తేదీ సంగతి. దాన్నలా ఉంచి, విషయంలోకి మరింత లోతుకు పోయి, పొడుగుతేదీ ఎలా ఉండాలో చూద్దాం..
పొడుగు తేదీని ఎలా రాయాలి? ఇంగ్లీషులో August 28, 2011 (లేదా 28 August, 2011) అని రాస్తాం. వాక్యంలో అలా రాస్తేనే చదవడానికి వీలుగా ఉంటుంది.. ఆన్ ది ట్వెంటీ ఎయిత్ ఆఫ్ ఆగస్ట్, టూ థౌజండిలెవెన్ (లేదా ఆన్ టెన్టీ ఎయిట్ ఆగస్ట్ టూ థౌజండిలెవెన్ ).. అంటూ చదువుకుపోతాం.
తెలుగులో కూడా అదే పద్ధతిలో -31 ఆగస్టు, 2011 - అని రాసామనుకోండి, వాక్యాన్ని ఎలా చదూతాం.. ఇరవై ఎనిమిది ఆగస్టు, రెండువేల పదకొండో తేదీన అని చదవాల్సి వస్తది. కానీ అది సహజంగా అనిపించడం లేదు. రెండువేల పదకొండు, ఆగస్టు ఇరవయ్యెనిమిదో తేదీన అని చదవడం సహజంగా ఉంది. అంచేత తెలుగులో రాయాల్సిన పద్ధతి "2011, ఆగస్టు 31" -ఇలా అని నేను అనుకుంటున్నాను.
సరే, నేను ఎలా అనుకుంటే ఏంలే.. అసలు ప్రామాణిక పద్ధతంటూ ఒకటేమైనా ఉందా అని వెతికితే..
ఇక బ్లాగుల సంగతికొస్తే.. ఎక్కువ బ్లాగుల్లో తేదీ ఇంగ్లీషు ఆకృతిలోనే ఉంటది. (కొన్నిటిలో ఇంగ్లీషులోనే ఉంటది). కారణం ప్రధానంగా సాంకేతికం. బ్లాగర్ బ్లాగుల్లో ఈ ఆకృతిలో తేదీని పెట్టుకునేందుకు వీలు లేదు. ఆకృతిని మార్చుకోవచ్చు. కానీ, వాడు ఇచ్చిన ఆకృతుల్లోంచి ఎంచుకోవాలే తప్ప, మనకు నచ్చినట్లుగా పెట్టుకునే వీలు లేదు. మనక్కావలసిందేమో.. వాడి దగ్గర లేదు. ఉదాహరణకు ఈ టపా తేదీ చూడండి, ఎలా ఉందో.. తేదీతో పాటు టైము కూడా కావాలంటే అంతే మరి. వర్డుప్రెస్సులో మాత్రం, మనకు నచ్చినట్టుగా పెట్టుకోవచ్చు. ఇదుగో, ఈ పేజీ చూడండి.. వర్డు ప్రెస్సు ఎంత వీలుగా ఉందో గమనించండి. Y, F j అని పెట్టామనుకోండి, "2011, ఆగస్టు 31" అని చూపిస్తుంది!
తెలుగులో పొడుగు తేదీని రాసేందుకు ప్రామాణిక పద్ధతంటూ ఒకటేదైనా ఉందా? చెప్పి పుణ్యం కట్టుకోండి. అలాగే, మీ అభిప్రాయం ఏమిటో కూడా చెప్పగలరు.

- మైక్రోసాఫ్టు వాడు (OS లో) ఇంగ్లీషు ఫార్మాటులోనే - ఆగస్టు 31, 2011- రాస్తున్నాడు. పొట్టితేదీని మాత్రం మన పద్ధతిలోనే రాస్తున్నాడు.
- ఒక వికీపీడియా వ్యాసం, దక్షిణ భారత భాషల్లో 2011, ఆగస్టు 31 లాగే రాస్తారు అని చెబుతోంది. తమిళ ఉదాహరణ కూడా ఇచ్చారు.
- సరే, తెలుగు పత్రికలు ఏమంటున్నాయో చూడబోతే, దాదాపుగా అన్ని పత్రికలూ కూడా వాటి వెబ్ సైట్లలో తేదీని ఇంగ్లీషులోనే రాస్తున్నాయి -ఈనాడు, జ్యోతి, ప్రభ, భూమి, విశాలాంధ్ర, ప్రజాశక్తి అన్నీ! ఇంగ్లీషులోనే రాస్తున్నాయి కాబట్టి, ఇంగ్లీషు పద్ధతిలోనే రాస్తున్నాయి. ఒక్క సాక్షి మాత్రం సోమవారం, 22/8/2011 అని రాస్తోంది. ప్రింటులో ఈనాడు కూడా ఇలాగే రాస్తోంది.
ఇక బ్లాగుల సంగతికొస్తే.. ఎక్కువ బ్లాగుల్లో తేదీ ఇంగ్లీషు ఆకృతిలోనే ఉంటది. (కొన్నిటిలో ఇంగ్లీషులోనే ఉంటది). కారణం ప్రధానంగా సాంకేతికం. బ్లాగర్ బ్లాగుల్లో ఈ ఆకృతిలో తేదీని పెట్టుకునేందుకు వీలు లేదు. ఆకృతిని మార్చుకోవచ్చు. కానీ, వాడు ఇచ్చిన ఆకృతుల్లోంచి ఎంచుకోవాలే తప్ప, మనకు నచ్చినట్లుగా పెట్టుకునే వీలు లేదు. మనక్కావలసిందేమో.. వాడి దగ్గర లేదు. ఉదాహరణకు ఈ టపా తేదీ చూడండి, ఎలా ఉందో.. తేదీతో పాటు టైము కూడా కావాలంటే అంతే మరి. వర్డుప్రెస్సులో మాత్రం, మనకు నచ్చినట్టుగా పెట్టుకోవచ్చు. ఇదుగో, ఈ పేజీ చూడండి.. వర్డు ప్రెస్సు ఎంత వీలుగా ఉందో గమనించండి. Y, F j అని పెట్టామనుకోండి, "2011, ఆగస్టు 31" అని చూపిస్తుంది!
తెలుగులో పొడుగు తేదీని రాసేందుకు ప్రామాణిక పద్ధతంటూ ఒకటేదైనా ఉందా? చెప్పి పుణ్యం కట్టుకోండి. అలాగే, మీ అభిప్రాయం ఏమిటో కూడా చెప్పగలరు.
తేదీ మరియు సమయాలను రాయడానికి అంతర్జాతీయ ప్రమాణాల సంస్థ (ISO) వారి ప్రమాణం ఉంది. ఈ లంకెలను కూడా చూడండి:
రిప్లయితొలగించండి1. అంతర్జాతీయ తేదీ ఆకృతి
2. తేదీ మరియు సమయాలపై W3C వారి నోటు
నా వరకూ వస్తే, చదివేలా రాయడానికి ఆగస్టు 31, 2011 అనీ లేదా మరీ పొడుగ్గా, బుధవారం, ఆగస్టు 31, 2011 అని రాస్తాను. పొట్టి రూపంలో అయితే 2011-08-31 అన్న దానికి నా ప్రాథాన్యత.
జపాన్ వాళ్ళు కూడా మనలాగే వ్రాస్తారు . అంటే , 2011 సెప్టెంబర్ 1 అని. మీరన్నట్లు ఇది చాల సౌలభ్యంగా వుంటుంది అలాగే తికమకగా అనిపించదు.
రిప్లయితొలగించండి