26, ఆగస్టు 2011, శుక్రవారం

లే థింకర్లు, లే.థింకర్లు, భలే థింకర్లు, రిలే థింకర్లు

ముందుగా లే. థింకర్ల గురించి. లే. థింకర్స్ అంటే లే థింకర్స్ (lay thinkers) అని కాదు, ’లే’ పక్కన చుక్క ఉంది చూడండి. లే. థింకర్స్ అంటే లేటరల్ థింకర్స్ అని అండి.  మామూలుగా సూటిగా, నిటారుగా ఆలోచించకుండా కొంత అడ్డంగా, కుసింత ఐమూలగా ఆలోచించేవాళ్ళను లేటరల్ థింకర్స్ అని అంటారు. కాబట్టి వీళ్ళను తేలిగ్గా తీసుకోవద్దని మనవి. కొన్ని సమాజాల్లో వీళ్ళని కూడా మేధావులు అనే అంటూంటారు. వీళ్ళ ఆలోచనలు సమాజం ఆలోచించే పద్ధతికి కొంత ’తేడా’గా ఉంటది. ఉదాహరణకు -

అవినీతిని ఎదుర్కొనేందుకు పదునైన చట్టం కావాలి, పళ్ళు లేనిది కాదు అని అన్నా హజారే ఉద్యమం చేస్తున్నారు కదా..
అరుంధతీ రాయనే ఒక లే.థింకరు ముందుకు దూసుకొచ్చి, ’తన ప్రాంతంలో జరుగుతున్న రైతుల ఆత్మహత్యల గురించి అన్నా హజారే ఏం మాట్టాడలేదు’ అని అన్నా మీదకు ఒక రాయి ఇసిరేసింది. నిజమే.., అన్నా ఏమీ మాట్టాడి ఉండకపోవచ్చు, మాటల మనిషి కాదు గదా! చేతల మనిషి కాబట్టి తాను చెయ్యదలచివినవేవో చేసాడు, తన ఊరిని మార్చేసుకున్నాడు. చుట్టుపక్కల ప్రజలకు స్ఫూర్తినిచ్చాడు. ఆంధ్రప్రదేశ్ తో సహా, పక్క రాష్ట్రాల వాళ్లకు మాట సాయం చేసాడు ఏం చెయ్యాలో నేర్పాడు. ఈవిడ లే. థింకరు కాబట్టి, రాళ్ళేసే బాపతు కాబట్టీ, రాళ్ళేసేసి ఊరుకుంటది. కానీ అన్నా అలాంటివాడు కాదు, పని చేసేవాడి మీద రాళ్ళు విసరడు, రాళ్ళెత్తి పనిచేస్తాడు, జనాల చేత పని చేయిస్తాడు. అంచేతే రాలెగావ్ సిద్ధి ఇవ్వాళ కళకళ్ళాడుతోంది.

అరుంధతీ రాళ్లకీ, అన్నా హజారేకీ ఉన్న తేడా -రాలెగావ్ సిద్ధి.
మైకుల ముందుజేరి పోసుకోలు కబుర్లు చెప్పేవాళ్ళకీ ఆన్నాకీ ఉన్న తేడా -అవినీతిపై పోరాటం.
తిట్టేవాళ్లకు - అందునా, కోర్టుల్ని కూడా తిట్టి జైలుకెళ్ళొచ్చినవాళ్లకు - ఈ తేడా తెలీదు మరి.

ఇక ఇంకొందరుంటారు, ఆంధ్రభూమిలో సాక్షి లాగా! వీళ్ళు ఉత్త లే.థింకర్లు కాదు, భలే థింకర్లు! ’అన్నా హజారే, గాంధీలాంటివాడు కాదు ’ అనే ముక్క తీసుకుని గాంధీనీ ఈయన్నీ పోలుస్తూ మూణ్ణాలుగు కాలాల వ్యాసం రాసిపారేస్తారు. అంతా చదివాక, ’పాపం, ఈయన సొమ్మంతా అన్నా దోచేసుకుని ఉంటాడు, అందుకే ఈయనకు అన్నా మీద మంట లాగుంది" అని మనం అనుకుంటే అది మన తప్పేం కాదు.
 ...................................
బాబూ కొడుకులు కలిసి అధికారాన్ని అడ్డం పెట్టుకుని వేల కోట్లు బొక్కేసారనే అనుమానాలు నిజమౌతున్నాయి. తండ్రి సచివాలయంలో కూచ్చుని సంతకాలు పెట్టేసి ప్రభుత్వ ఆస్తులు రాసిచ్చేస్తూ ఉంటే, రాయించుకున్నవాళ్ళు దొడ్డి దారిన కొడుకు కంపెనీల్లో పెట్టుబళ్ళు పెట్టేస్తూ ఉండేవాళ్ళంట. ఈ ముక్క కోర్టుకు చూచాయగా అర్థమై కూలంకషంగా దర్యాప్తు చేద్దామని నిశ్చయించింది. చెయ్యమని సీబీఐని ఆదేశించింది. అది దాడులు చేసి, సాక్ష్యాలు తవ్వి, అనుమానితుల మీద కేసులు కూడా పెడుతోంది.

వెంటనే లే.థింకర్లు లేచారు. లేని జూలు విదిల్చి ఓండ్రపెట్టారు.
చూసారా.. చచ్చిపోయిన మహానేతను కూడా వదలడం లేదు.
ముప్పై యేళ్ళ కుర్రాడని కూడా చూడకుండా వెంటాడుతున్నారు.
జగను వ్యాపారాలు చేసుకోవడం కూడా తప్పేనా? జగనేనా ఇంకెవరూ చేసుకోలేదా వ్యాపారాలు?
రాశేరె ఒక్కడే చేసాడా? మంత్రివర్గానికి బాధ్యత లేదా?
-ఇవీ లే.థింకర్ల వాదనలు.

ఇవన్నీ వినగానే రిలే థింకర్ల బుర్రలు నిదర లేచినై. ’రిలే’ థింకర్లు కాబట్టి సహజంగానే సొంతంగా ఆలోచించరు, పక్కోడి ఆలోచనలని రిలే చేస్తూంటారు. మహానేత పేరెత్తారు కాబట్టి మా మనోభావాలు దెబ్బతిన్నాయి అంటూ వీళ్ళు రాజీనామాలు చేసారు. ఇంతకీ.. అసలువాళ్ళు ఇద్దరూ మాత్రం రాజీనామాలు చెయ్యలేదు. వాళ్ళమనోభావాలు దెబ్బతిన్నట్టు లేవు. వాళ్లిద్దరికీ లేని దురద తమ కెందుకో ఈ కత్తిపీటలకు తెలవదు -రిలే బుర్రలు కదా!

కాసిని చిల్లర డబ్బులు పడేస్తే మనుసును మడిచేసి, మహానేత గారి మహాకొడుకు గారి మట్టికాళ్ల దగ్గర మూటగట్టి పడేసే మహాచవటల క్కూడా మనోభావాలుంటాయని మాత్రం మనకు తెలిసింది.

ఇంతా చేసీ.. వాళ్ళిద్దరూ అక్రమాలు చెయ్యలేదని ఎవరూ అనడం లేదు, గమనించండి.
...................................
ఇక లే థింకర్ల గురించి..

’లే’ పక్కన చుక్కలేదు చూడండి, వీళ్ళుత్త లే థింకర్లే (lay thinkers), లే.థింకర్లు కాదు.  లే థింకర్లంటే సగటు మనుషులు, సామాన్య మానవులన్నమాట. వీళ్ళు మామూలుగా ఆలోచిస్తారు. సూటిగా ఆలోచిస్తారు. వీళ్లలో ఒక్కరవ్వ కూడా ’మేధావితనం’ ఉండదు. అంటే మనమే నన్నమాట! అదండీ సంగతి!

70 కామెంట్‌లు:

 1. హ హ భలే రాసారు వీళ్ళ గురించి ! ఇంకా కొంతమంది ఉంటారు మా ఇంటి పక్కన ఇంతకన్నా పెద్ద విషయం జరిగింది దాన్ని గురించి కాకుండా జనాలందరూ వేరే ఏదో మాట్లాడతారేంటి అని వీళ్ళ బాధ . ఇంకా కొంతమంది ఘనులు ఉంటారు వాళ్ళకి ఈ విషయమైనా సరే కులం , లేదా మతం , లేదా వెనకబాటు తనం దీనితో ముడి పెట్టక పొతే నిద్ర పట్టదు. ఇంతా చేసి వాళ్ళ బాగు కోసం ఎమన్నా చేస్తారా ఉహు కేవలం మాటల్లో బాధ పడటానికే లేదా మేధావి తనం చూపించటానికే వీటి అవసరం .

  రిప్లయితొలగించండి
 2. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 3. ఈ అధోగతి రాయ్ ని మన బాలయ్య బాబుకిచ్చి పెళ్ళి చేస్తే ఎలా ఉంటుందంటారు?? :D నాకు తెలిసి ఆమె కంపు నోరు మూతపడాలంటే ఇంతకంటే మంచి ఉపాయం లేదు.. ఈ విషయం మీద తేటగీతి మురళి గారు ఒక టపా రాస్తే చదవాలని ఉందండీ..

  రిప్లయితొలగించండి
 4. లేకి థింకర్ల గూర్చి బాగావ్రాశారు

  రిప్లయితొలగించండి
 5. excellent!! I didn't understand as to what Arundhati Roy was doing when those farmers were committing suicides. She does not make any sense.

  రిప్లయితొలగించండి
 6. అలాంటివే:
  1) "జనలోక్‌పాల్ చట్టంతో అవినీతిని పూర్తిగా తొలగించలేము "
  2) " చట్టాలు పార్లమెంటులో చేయబడతాయి, మైదానాల్లో/రోడ్లమీదబో కాదు " 3) పార్లమెంటు సారభూమత్వమాన్నే ప్రశ్నిస్తారా? " ...

  ఎందుకివన్నీ?! - పటిష్టమైన చట్టం చేయండ్రా సన్నాసి ఎదవల్లారా అని హజారే బృందం అడిగినందుకు.

  రిప్లయితొలగించండి
 7. ఎందుకివన్నీ?! - పటిష్టమైన చట్టం చేయండ్రా సన్నాసి ఎదవల్లారా అని హజారే బృందం అడిగినందుకు.
  -------------
  Snkr గారు గ్రేట్ :))))

  రిప్లయితొలగించండి
 8. ఈ మధ్య, అనగా ఓ మూడు నాలుగు వారాల్లో - మీర్రాసిన వాటిల్లో ఇది బెష్టు...

  రిప్లయితొలగించండి
 9. :) అవును రావు గారు, అన్నా టీమ్ గ్రేట్. సాధిస్తారో సాధించలేరో అది వేరే విషయం, అతి సామాన్యమైన సమస్య మీద ఉద్యమించి, అతి తక్కువ సమయంలో మామూలు మనుషులను తన పట్టుదలతో జాగృతం చేశారు. అన్నాని అరెస్ట్ చేయించి, చిదంబరం, సైబాల లాంటి ఎదవలు కూడా యధాశక్తి సాయం చేశారు.
  నాకు అన్నా టీం లో బాగా నచ్చిన వ్యక్తి కేజ్రీవాల్, మంచి టాస్క్ మాస్టర్‌లా అనిపిస్తాడు. ఒక్కమాట అన్నాతో అనిపించాడు " పి.ఎం కపిల్ సైబాల్ లా మాట్లాడుతున్నాడు" అని, అంతే .... సైబాల్ నోరు మొసేయించారు. :))

  రిప్లయితొలగించండి
 10. @చదువరి గారు థాంక్స్ ఫర్ ది పోస్ట్.
  @snkr you are straight and sharp in what you say. That is the good thing about you.

  రిప్లయితొలగించండి
 11. బాగా రాశారు.

  వై.సెస్. విషయానికొస్తే - ఒక వ్యక్తిగా వై.ఎస్. ని పక్కన బెట్టి ఒక ప్రభుత్వంగా ఆలోచిస్తే ప్రభుత్వాలకి వివిధ వ్యక్తులకీ, సంస్థలకీ భూములు కేటాయించే అధికారం ఉంది మొదట్నుంచీ ! శతాబ్దాల నుంచీ, సహస్రాబ్దాల నుంచీ ! ఆ అధికారం లేదంటే ఇంక ప్రభుత్వాలకి ఏ అధికారమూ లేనట్లే కదా. అవి ప్రభుత్వాలనిపించుకోవు.

  జగన్ కంపెనీల్లో ఆ సంస్థలు పెట్టినవి పెట్టుబడులే, తమ పేరుమీది వాటాలే కదా ! అవి లంచం కాజాలవని నా అభిప్రాయం. వాళ్ళు ప్రతిఫలంగా చేసినది వై.ఎస్. కుటుంబానికి డబ్బివ్వడం కాదు. ఆ కుటుంబం మీద ఉన్న వ్యాపారపరమైన నమ్మకంతో అతన్ని ఒక పారిశ్రామికవేత్తగా ప్రమోట్ చేశారనిపిస్తోంది. అది తప్పు అని అనలేకపోతున్నాను. ఇందులో ప్రజాధనం ( I mean actual public money or tax money) ఎక్కడ ఇన్వాల్వ్ అయిందనేది నాకు అంతుపట్టడం లేదు. ఎందుకంటే చేసిన కేటాయింపులు కేటాయించక తప్పనివి. అవి కేంద్రప్రభుత్వం యొక్క sez ల విధానం (policy) లో భాగంగానే చేశారు. వై.ఎస్. కాకుండా మఱెవఱున్నా ఆ కేటాయింపులు చేసి తీఱాల్సిందే.

  ఇందులో లోపాయికారీగా జఱిగిన డబ్బులావాదేవీల పరంగా నైతే, దివంగత వై.ఎస్. ఒక పాత్రధారి మాత్రమే. అతన్ని అందుకు వాడుకున్నవాళ్ళూ, అసలైన సూత్రధారులూ, లబ్ధిదారులూ హస్తినాపురంలో ఉన్నారు. వాళ్ళల్లో ఒకావిడ ఇప్పుడు అమెరికాలో చికిత్స చేయించుకుంటోంది. మన కళ్ళెదుట తిరిగిన మనిషి కాబట్టి మనకి. వై.ఎస్. దోషిలా కనబడుతున్నాడు.

  రిప్లయితొలగించండి
 12. LBS తాడేపల్లి: "అవి లంచం కాజాలవని నా అభిప్రాయం."

  - ఏది లంచం? లంచం అని దేన్ననాలి? ఒకరి దగ్గర డబ్బులు తీసుకుని దరఖాస్తుపై సంతకం పెట్టేవాడు లంచాన్ని డబ్బుల రూపేణా తీసుకున్నట్టు. ఇక్కడ.. తండ్రి సంతకం పెట్టేస్తాడు. కొడుకు లంచం తీసుకుంటాడు. డబ్బు రూపంలో కాకుండా షేర్ల రూపంలో నొక్కేసాడు. లంచం ఇచ్చే రూపం మారింది తప్ప దాన్ని లంచం కాదని అనలేం. మీరు ఇంకో మాట కూడా చెప్పారు.. ఆ పెట్టుబడులు పెట్టినవాళ్ల పేరుమీదే ఉన్నాయిగానీ జగను పేరు మీద లేవు గదా, ఇక దాన్ని లంచం అని ఎలా అంటారు అని మీరు ధ్వనించారు. అడగాల్సిన ప్రశ్నే ఇది. ఒక ఉదాహరణ ద్వారా అయితే నేను మరింత తేలిగ్గా చెప్పగలను..

  జగను ఒక్కో షేరు పది రూపాయల చొప్పున లక్ష షేర్లతో KD&Co అనే ఒక కంపెనీ మొదలెట్టాడు. అప్పుడు ఆ కంపెనీ విలువ పది లక్షల రూపాయలు. ఇప్పుడు జగను ఆ కంపెనీకి వంద శాతం సొంతదారు.

  అది ఇంకా పని చెయ్యడం మొదలుకాకుండానే (అంటే కంపెనీ విలువ పది లక్షల రూపాయలుగానే ఉంది), నిజాంపట్నంలో పదివేల ఎకరాలు రాయించుకున్న మాయదారి ప్రసాదు ఈ KD&Co లో ఒక పదివేల షేర్లు కొన్నాడు. కానీ కొన్నది పది రూపాయల ధరకు కాదు.. పది రూపాయల షేరునే ఒక్కోటి నాలుగొందలకు కొన్నాడు. అంటే నలభై లక్షలు పెట్టి పదివేల షేర్లు కొన్నాడు. ఇప్పుడు..

  KD&Co మొత్తం విలువ - 50 లక్షలు. అందులో జగను పెట్టింది: 20% ప్రసాదు పెట్టింది: 80%
  కంపెనీలో ఉన్న మొత్తం షేర్లు: 1,10,000. అందులో జగను వాటా: 91% ప్రసాదు వాటా: 9%

  80% డబ్బులు పెట్టేసి కేవలం 9% వాటా మాత్రమే తీసుకునేవాణ్ణి ఏమంటారనేది మనం ఆలోచించుకోవాలి. ఈ వ్యవహారం మొత్తాన్నీ ఏమనాలో కూడా మనమే నిశ్చయించుకోవాలి.

  రిప్లయితొలగించండి
 13. మీరన్నది నిజమే. వాళ్ళు అసలు ముఖవిలువ కన్నా ఎక్కువ పెట్టి షేర్లు తీసుకున్నారు. ఇందులో ప్రజాధనం ఎక్కడుంది ? ప్రజాధనం బుగ్గిపాలు ఎక్కడయింది ? అంతా ప్రైవేట్ ధనమే కనిపిస్తోంది కదా ?

  రిప్లయితొలగించండి
 14. క్కడ.. తండ్రి సంతకం పెట్టేస్తాడు. కొడుకు లంచం తీసుకుంటాడు. డబ్బు రూపంలో కాకుండా షేర్ల రూపంలో నొక్కేసాడు. లంచం ఇచ్చే రూపం మారింది తప్ప దాన్ని లంచం కాదని అనలేం.

  అంతవఱకు ఒప్పుకుంటానండీ. కానీ లెక్కలూ డొక్కల దగ్గఱికొచ్చేసరికి ఈ విషయాన్ని నిరూపించడం సి.బి.ఐ.కి చాలా కష్టం. ఎందుకంటే ఉదాహరణకి, నిజాంపట్నంలో ప్రసాద్ కి ఇచ్చిన భూమి ఊరికే ఇచ్చినది కాదు. ప్రభుత్వభూమి అసలే కాదు. దాన్ని రైతుల నుంచి సేకరించారు. దానికో ధర ఉంది. ఆ ధర నచ్చనివాళ్లూ, అంతకంటే ఎక్కువ మొత్తం కోరుకునే రైతులూ న్యాయస్థానానికి వెళ్ళొచ్చు. గతంలో చాలాచోట్ల చాలాసార్లు భూయజమానులు అలా వెళ్ళి కావాల్సిన నష్టపరిహారం తీసుకున్నారు. మఱి ఇక్కడ ప్రజాధనం జగన్ జేబుల్లోకి వెళ్ళిందంటూ ఈనాడులాంటి వెస్టెడ్ ఇంటరెస్ట్ గల పత్రికలు చేస్తున్న బయాస్డ్ ప్రచారాన్ని మనం విశ్వసించవచ్చునా ? ఇక్కడ మనకి - డబ్బు చెల్లించి కొనుక్కున్న ప్రజాభూమి మాత్రమే కనిపిస్తోంది. ప్రజాధనం కనిపించడం లేదు. కేవలం దీని ప్రాతిపదిక మీద జగన్ అవినీతిపరుడు అనొచ్చునా ?

  రిప్లయితొలగించండి
 15. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 16. @నిజాంపట్నంలో ప్రసాద్ కి ఇచ్చిన భూమి ఊరికే ఇచ్చినది కాదు. ప్రభుత్వభూమి అసలే కాదు.కేవలం దీని ప్రాతిపదిక మీద జగన్ అవినీతిపరుడు అనొచ్చునా ?

  హ్మ్, ఇ౦దులో ప్రభుత్వ ప్రమేయం ఎ౦తవరకు వు౦డాలి అని విశ్లేషిస్తే తెలియవచ్చు.

  రిప్లయితొలగించండి
 17. మొట్టమొదటి సంగతి: "ప్రభుత్వభూమి అసలే కాదు. దాన్ని రైతుల నుంచి సేకరించారు " -నిజాంపట్నం వాడరేవుల మధ్య ఆ ప్రసాదుకు దోచిపెట్టిన భూమిలో కొన్ని వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. అంతా ప్రైవేటు భూమి కాదు.

  రెండో సంగతి: "దానికో ధర ఉంది. ఆ ధర నచ్చనివాళ్లూ, అంతకంటే ఎక్కువ మొత్తం కోరుకునే రైతులూ న్యాయస్థానానికి వెళ్ళొచ్చు." - ప్రైవేటు భూమి అని అనుకుంటున్న దానిలో చాలావరకు ఎసైన్డ్ భూమి ఉంది. అది ప్రభుత్వం ప్రజలకిచ్చిన భూమి. ఉంటే అది లబ్ధిదారుని వద్ద ఉండాలి, లేదా ప్రభుత్వం దగ్గరుండాలి. మూడో వ్యక్తికి దాన్ని అమ్మే హక్కు లబ్ధిదారుడికి లేదు. కానీ దొంగ కాగితాలు కల్పించి, ఆ భూమిని అమ్ముకున్నారు. దాన్ని అమ్మనిచ్చారూ అంటే ప్రభుత్వం తన భూమిని ఇచ్చేసినట్టే! విశేషమేంటంటే.. ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తి అమ్ముకున్నాడు. కాబట్టి ప్రభుత్వానికి డబ్బు రాలేదు. అత్త సొమ్ము అల్లుడు అమ్మేసుకున్నట్టు.

  మూడోది: ఇక ఈనాడు గురించి.. ఈనాడులోగానీ, మరే పత్రికలోగానీ వచ్చే వార్తల్లోని నిజానిజాలు, వార్త రాసిన వారి పక్షపాత ధోరణినీ గుర్తించగలిగేంతటి శక్తి కొంతవరకూ నాక్కూడా ఉందని నేను అనుకుంటున్నాను. ఏనాడైనా, ఈనాడు సాక్షి కంటే వేల రెట్లు నయమని కూడా తెలుసు. సాక్షి రాతలు నమ్మేవాళ్లకు జగను కూడా నీతిమంతుడిగానే కనిపిస్తాడు. ఎందుకంటే సాక్షిది పక్షపాతధోరణి కాదు.. సాక్షి అంటేనే పక్షపాతం, అవినీతి, అక్రమం. అసలది సాక్షి కాదు పాక్షి. (తాడేపల్లి గారూ, పాక్షి చదివి మీరు అభిప్రాయాలు ఏర్పరచుకున్నారని నా ఉద్దేశం కాదు.)

  రిప్లయితొలగించండి
 18. తాడేపల్లి గారూ.. మరోసంగతి: కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని తీరప్రాంతం దాదాపుగా అంతటినీ ప్రభుత్వం వాన్ పిక్కుకో మరో పిక్కుకో ధారాదత్తం చెయ్యడంతో, భారత రక్షణ శాఖకు (హెచ్చేయెల్లుకు గానీ బీడీయెల్లుకు గానీ) భూమి అవసరమైతే ఇవ్వడానికి కొంత కూడా లేకపోయిందని మనకు వార్తలొచ్చాయి. మీకు గుర్తుండే ఉంటుంది.

  రిప్లయితొలగించండి
 19. ఇంకో సంగతి: "మీరన్నది నిజమే. వాళ్ళు అసలు ముఖవిలువ కన్నా ఎక్కువ పెట్టి షేర్లు తీసుకున్నారు. ఇందులో ప్రజాధనం ఎక్కడుంది ?" - ఇక్కడ జరిగింది ప్రజాధనాన్ని పంచిపెట్టడమే కాదు, మరో రకమైన అధికార దుర్వినియోగం కూడా. నిజాంపట్నాన్ని మాయదారి ప్రసాదుకివ్వాలా, అల్లిబిల్లి ఆనందుకివ్వాలా అనేది ముఖ్యమంత్రి ఇష్టం (రాశేరె అలా నడిపించాడు మరి). ఆ అధికారాన్ని అడ్డం పెట్టుకుని - నీకు సంతకం పెడతాను, నాకు పెట్టుబడి పెట్టు అనే ఒప్పందం కుదుర్చుకుని - నిజాంపట్నాన్ని రాసిచ్చేసాడు, తన కొడుకు కంపెనీల్లోకి పెట్టుబళ్ళు రాబట్టుకున్నాడు. పదవి ద్వారా సంక్రమించిన అధికారాన్ని దురుద్దేశంతో, స్వలాభం కోసం వినియోగించాడు.

  రిప్లయితొలగించండి
 20. నేను మూడుపేపర్లు తెప్పిస్తానండీ. ఒకటి కాదు. నేను అన్ని పేపర్లనీ ఒకే దృష్టితో చూస్తాను. ఏ పేపరు వల్లా ప్రభావితుణ్ణయ్యే మనిషి కాను.

  అసైన్డ్ భూమి అనేది ఒక సాంకేతిక సాకు అని నా అభిప్రాయం. వాటి పుట్టుపూర్వోత్తరాలలోకి వెళితే అసైన్డు భూములు వాస్తవానికి ప్రభుత్వభూములు కావు. అవి అగ్రకులాల దగ్గఱనుంచి బలవంతంగా లాక్కుని ఎస్సీ ఎస్టీలకి పంచిన అక్రమ ఆస్తులు. వాటిని సాగు చేయలేక ఆ దళితులు వాటిని తిరిగి ఆ అగ్రకులాలకే అమ్మితే అది అక్రమం అంటున్నారు. ఇందులో ఎవఱు నష్టపోయారు ? ఒక్క కలం పోటుతో అగ్రవర్ణాల భూముల్ని ఉల్ఫాగా దొబ్బిన ప్రభుత్వమా ? తమవి కాని భూముల్ని అమ్ముకుదొబ్బిన ఎస్సీలా ? డబ్బిచ్చి కొనుక్కున్న ఇతరులా ? నైతికదృష్టితో చూసినప్పుడు నిజంగా అందులో అవినీతి ఏముంది ?

  ప్రభుత్వభూమి ఎంతోకొంత ఉందనుకున్నా, అది ఒక ప్రాజెక్టు నిమిత్తం ఇవ్వబడింది. ఆ స్థలంలో నిర్ణీత/ ఒప్పంద సమయం లోపల ఆ ప్రాజెక్టు గనక రాకపోతే ఆ స్థలాన్ని వెనక్కి తీసుకునే అధికారం ఆంధ్రప్రభుత్వానికి ఉంది. అది ప్రసాదుకు రాసేశారనడం మీడియా మాయాజాలంలా కనిపిస్తోంది. ఎందుకంటే సాంకేతికంగా అది సాధ్యం కాదు. ఆ స్థలాన్ని ప్రాజెక్టుతో పాటు ఇతరేతర అవసరాలకి ప్రసాద్ ఉపయోగించుకుంటాడనేది నిజం. కానీ అంతమాత్రాన స్థలం ఇవ్వకుండా ఉండలేం. ఆ మాటకొస్తే ఇప్పుడు హైదరాబాదులో అమలవుతున్న HMR చేపట్టులో కూడా సుమారు 230 ఎకరాల స్థలాన్ని ఆ చేపట్టుకు నిర్మాత/ గుత్తదారైన L&T సంస్థకి ధారాదత్తం చేశారు. ఇది తప్పు కానప్పుడు, అది తప్పెలా అవుతుంది ? ఇందులో కనిపించని అవినీతి అందులో ఎలా కనిపిస్తోంది ? దీని మీద జఱగని విచారణ దాని మీద ఎందుకు జఱపాలి ?

  రిప్లయితొలగించండి
 21. కార్తీక్ గారు,

  అయ్య బాబోయి, అలాంటి కోరికలేంటండి బాబూ! మీకు బాలయ్య బాబు అంటే ఎంత పడక పోయినా, అధోగతి రాయ్ లాంటి మేధావిని ఆయనకిచ్చి పెళ్ళి చేసి ఆయన బతుకు బుగ్గిపాలు చేయమంటారా? నాకింక కూసింత మానవత్వం మిగిలి ఉందండీ!
  :-(

  -మురళి

  రిప్లయితొలగించండి
 22. బాలయ్యకేమి ఖర్మ,
  బ్లాగ్ ఓంకార్ కార్తీక్ ఉండగా, అధోగతిరాయ్, ఓంకార్తీక్ ఇద్దరూ ముదురు బెండకాయలే, ఈడూ జోడూ సరిపోతుంది.

  రిప్లయితొలగించండి
 23. మురళి గారూ..
  మీరు మరీ మొహమాట పడుతున్నారు.. మీరు పూనుకోవాలేగానీ వీళ్ళిద్దరినీ ఒకేసారి డొక్క చించి డొలు కట్టేయగలరు. నా మాట విని ఒకసారి ఆ డైరెక్షన్ లో ఆలోచించండి.. :)

  రిప్లయితొలగించండి
 24. అజ్ఞాతా,
  నీ అభిమానం చూస్తుంటే ముచ్చటేస్తుందోయ్.. నువ్వింతగా అడిగుతున్నావ్ కాబట్టి నేను రెడీ.. నువ్వే వెళ్ళి సంబంధం మాట్లాడి రా.. నీ కష్టం ఉంచుకోను లే.. ఎంతోకొంత బ్రోకర్ చార్జ్ ఇచ్చేస్తాను..

  రిప్లయితొలగించండి
 25. "ప్రభుత్వభూమి ఎంతోకొంత ఉందనుకున్నా, అది ఒక ప్రాజెక్టు నిమిత్తం ఇవ్వబడింది." - ప్రభుత్వ భూమిని ఇచ్చింది, ప్రాజెక్టు నిమిత్తమేనండి. ఎప్పుడైనా ప్రభుత్వం భూమిని ప్రాజెక్టుకే ఇస్తది. కానీ తండ్రి ప్రాజెక్టుకు భూమిని ఇచ్చినందుకు ప్రతిగా కొడుకు కంపెనీల్లో పెట్టుబళ్ళ రూపంలో లంచాలు పొందారు. అదీ అసలు సంగతి! (ఎంతో కొంత కాదండి.. రెండు వేల ఎకరాల దాకా ఇచ్చారంట.)

  "HMR చేపట్టులో కూడా సుమారు 230 ఎకరాల స్థలాన్ని ఆ చేపట్టుకు నిర్మాత/ గుత్తదారైన L&T సంస్థకి ధారాదత్తం చేశారు. ఇది తప్పు కానప్పుడు.." నేను ముందే చెప్పినట్టు ప్రాజెక్టుకోసం భూమిని ఇవ్వడం తప్పుకాదు. అందుకు ప్రతిగా లంచాలు పొందడమే తప్పు. ఎలెన్ టీ కూడా వీళ్ళకు లంచాలిచ్చి ఉంటే అదీ తప్పే, పరిశీలనార్హమే. దర్యాప్తు జరగాల్సిందే! లంచాలు ఎవరెవరిచ్చారన్నది కాదు.. రాశేరె, జగను, ఇతర మేళ్ళు పొందిన జనం ఎంతెంత నొక్కేసారన్నది ముఖ్యం.

  రిప్లయితొలగించండి
 26. తాడేపల్లి గారు,
  ఇదివరలో రాజకీయ చైతన్యం లేని కోస్తా ప్రజలు ఎంకెవరూ లేనట్టు సీమ వాడైన జగన్ వెంట పడూతున్నారు అన్నారు. ఇప్పుడేమో జగన్ అమాయకుడు అన్నట్టు మీరే... :)
  నాకు కంఫ్యూజన్ గా వుంది. దయచేసి, వివరంగా చెప్పగలరు. కార్పొరేట్ ఫ్రాడ్‌లో ప్రాధమిక ఆధారాలున్నాయని కోర్ట్ నమ్మింది కనుకనే ఇంకా దర్యాప్తు చేయమన్నారు. సుప్రీం స్టే కూడా తిరస్కరించింది. కేస్ సబ్ జ్యుడిస్ అయి వున్నప్పుడు, మీరిలా జగన్ కీన్ అనే సర్టిఫికేట్ ఇచ్చేయడం ... నాకంత నచ్చలేదు.

  రిప్లయితొలగించండి
 27. కోర్టుల స్వతంత్ర ప్రతిపత్తిని, సచ్ఛిలతనీ, సదుద్దేశాల్నీ నేను కూడా ఒకప్పుడు ప్రగాఢంగా నమ్మేవాణ్ణి.

  నా దృష్టిలో - వై.ఎస్. చేసిన కేటాయింపులూ, జగన్ పొందిన పెట్టుబడులూ రెండూ పరస్పర సంబంధం లేని విషయాలు. జగన్ కంపెనీలలో పెట్టుబళ్ళు పెట్టిన కంపెనీలు తొంభై ఉన్నాయి, వాటన్నింటికీ వై.ఎస్. చేపట్లని గానీ భూముల్ని అప్పగించినట్లు ఆధారాలు లేవు. ఈ రకమైన లావాదేవీలున్నట్లు చాలా తక్కువ పేర్లు వినబడుతున్నాయి. చేపట్లు అప్పగించడమే తప్పు అనేట్లయితేనే జగన్ దగ్గఱ పెట్టుబడులు పెట్టడం తప్పవుతుంది. "చేపట్లు ఫర్వాలేదు గానీ ఆయన కొడుకు దగ్గఱ మాత్రం ఎవఱూ పెట్టుబళ్ళు పెట్టకూడదు" అని ఈనాడు - ఆంధ్రజ్యోతి అండ్ నాయుడు ముఠా వాదిస్తూంటే నాకెందుకో నవ్వొస్తోంది.

  ఒక పెట్టుబడిదారు ఒకేసారి ఎన్నిచోట్లనైనా, ఎంతమందితోనైనా వ్యాపారం చేయొచ్చు. "అతను ప్రభుత్వంతో మాత్రమే వ్యాపారం చేయాలి, ఆ సమయంలో ఇంకెవ్వఱితోనూ వ్యాపార సంబంధాలు కలిగి ఉండకూడదు" అని రూలెక్కడుంది ? వాళ్ళ డబ్బు వాళ్ళిష్టం, వాళ్ళు ఎక్కడినా పెట్టుబడి పెట్టుకుంటారు. అడగడానికి కోర్ట్ ఎవఱు ? సి.బి.,ఐ. ఎవఱు ? ప్రభుత్వ చేపట్టుని తీసుకున్నంతమాత్రాన ఆ పెట్టుబడిదారు ఇహ అధికారపార్టీ నాయకుల బంధువులతో ఏ వ్యాపారమూ చేయకూడదు, చేస్తే అది అవినీతి, లంచమివ్వడం అవుతుంది" అని మొదలుపెడితే ఱేపు ప్రభుత్వ చేపట్టులు తీసుకోవడానికి ఏ పెట్టుబడిదారు, ఏ గుత్తదారు ముందుకొస్తాడు ?

  ఇదంతా ఒక అప్రజాస్వామికమైన, అమానుషమైన కక్షసాధింపు వ్యవహారం అని నేను దృఢంగా నమ్ముతున్నాను.

  రిప్లయితొలగించండి
 28. జగన్ దగ్గర వేల కోట్ల డబ్బు ఉందని చిన్న పిల్లాడికి కూడా తెలుసు. అది రాశేరె పదవిని అడ్డు పెట్టు కొని సంపాదించిందని కూడా తెలుసు. మరో విషయం ఏంటే ఇది అందరికి తెలుసునని జగనుకి కూడా తెలుసు. అందుకే దాన్ని ఖండించకుండా మొత్తం మంత్రివర్గాన్ని దీన్లోకి లాగి కాంగ్రెస్ చేత్తో కాంగ్రెస్‌నే నరికేద్దామని చూస్తున్నాడు.

  జగన్ దగ్గర ఉన్నవి విపరీతమైన ఉక్రొషం, విపరీతమైన డబ్బు. ఈ రెంటితో అధికారం, పరువు ప్రతిష్ట గెలవాలని చూస్తున్నాడు.

  రిప్లయితొలగించండి
 29. మరో విషయం ఏంటంటే పైన ఇది రైటు, ఇది తప్పు అని వాదిస్తున్న తాడెపల్లి వారికి కూడా ఈ విషయం తెలుసు

  రిప్లయితొలగించండి
 30. @చేపట్లు అప్పగించడమే తప్పు అనేట్లయితేనే ...

  అదే మొదట నిర్ధారిస్తారు లె౦డి.

  రిప్లయితొలగించండి
 31. ఈ చర్చని పొడిగించడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే నా వైఖరిని పైవ్యాఖ్యల్లోనే పూర్తిగా వెల్లడించాను గనుక !

  జగన్ దగ్గఱ ఎంత డబ్బుందో నేను చూడలేదు. నాకు తెలియదు. బహుశా ఎవఱికీ తెలియదు, చూడకుండానే, తెలియకుండానే అతని మీద ఒక ముద్ర వేయడం పట్ల నాకు ఆసక్తిలేదు. ఈనాడు ఎవఱిని దొంగ అంటే వారిని నేను కూడా గొంతు కలిపి దొంగ అనలేను. అలాగే కాంగ్రెస్ ఎవఱిని దేవుడంటే వారు దేవుడనీ, వారు ఎవఱిని దెయ్యమంటే వారు దెయ్యమనీ నేను అనుకోను.

  అధికార స్థానాల్లో ఉన్నవారు ఆశ్రితులకీ, సన్నిహితులకీ వ్యాపార ప్రయోజనాల్ని నెఱవేర్చడం Crony capitalism అయితే ధనసంపాదన చేసిన ప్రతివాడి మీదా అక్రమాస్తుల వ్యాజ్యాలు బనాయించి అతన్ని సర్వనాశనం చేసి తాము బాగుపడాలని చూడడం రౌడీ క్యాపిటలిజమ్. నా దృష్టిలో సమాజానికి క్రోనీ క్యాపిటలిజమ్ కంటే రౌడీ క్యాపిటలిజమ్ అత్యంత ప్రమాదకరమైనది. ఎందుకంటే ఱేపు మనం బాగుపడినా మన శత్రువులు మనల్ని సర్వనాశనం చేయడానికి సరిగ్గా ఇదే మార్గాన్ని ఎంచుకుంటారని మర్చిపోవద్దు.

  రిప్లయితొలగించండి
 32. తాడేపల్లి గారు,

  మీరు సత్యసాయిబాబా కు, జగన్ కు, ఇ౦కే రాజకీయ నాయకుడి కైనా సమన్యాయం వర్తి౦ప చేస్తున్న౦దుకు అభిన౦దిస్తున్నాను. జగన్ వద్ద ఉన్న సొమ్ము పై ఎవ్వరికి ఆసక్తి లేదు .కాని ఆ సొమ్ముతో ప్రజలను కొనెయ్యకు౦డా ఉ౦డాలి కదా. అదే సమయం లో హై కోర్టు , సి బి ఐ నిరూపి౦చలేక పోవచ్చు కూడా . మీరు నిరూపి౦చినా కూడా నమ్మను అ౦టే , మీరు నమ్మే వ్యవస్థ ఏది లేదని అర్ధం. శత్రువులు ఇదే మార్గాన్ని మల్లి ఎ౦చుకున్నా ప్రజలకి అభ్య౦తర౦ ఉ౦డదు.

  ఇన్ని చెప్పే మీరు తెలుగువాళ్ళ ఆదాయం ప్రతినెలా సూట్‌కేసుల రూపంలో ఆయా అధిష్థానాలకు వెళ్ళకుండా తెలుగుప్రజలకే ఉపయోగపడాలి అన్నారు . ఇది మాత్రం మీరు చూచారా ?

  రిప్లయితొలగించండి
 33. జగన్ నేరుగా ప్రజల డబ్బు నొక్కక పోయుండొచ్చు (అసలు పెద్దాయన మాస్టర్ ప్లాన్ అదే కదా) కానీ అతనికి ఆ డబ్బులిచ్చిన గుత్తేదార్లు రేపు వాళ్ళుచేసే పని నాసిరకంగా చేసి ప్రజల డబ్బు నొక్కుతారు. హస్తినా పురపు మూటల తాలూకు డబ్బు డొంకతిరుగుడుగా అయినా ప్రజలదే. కాబట్టి జగన్ ప్రజల డబ్బు నొక్క లేదనడం అన్యాయం. మీ కష్టార్జితాన్ని ఎవడో ఇలానే దోచుకుంటాడని అవతలివాడి కష్టార్జితం కాని సంపాదనని వెనకేసుకొస్తే ఎలా?

  రిప్లయితొలగించండి
 34. అయ్యా ! మఱి మీ న్యాయం ప్రకారం అనుమానమున్నప్పుడు కాంగ్రెస్ అధిష్ఠానం మీద కూడా విచారణ జఱగాలి. నాకు తీవ్రమైన అనుమానాలున్నాయి. నాలాగే కోట్లాదిమందికి ఉన్నాయి. ఈ విచారణలు చంద్రబాబునాయుడు మీదా, రామోజీరావు మీదా కూడా జఱగాలి. అది మాత్రం జఱగట్లేదేం ? ప్రతి కొత పరిశ్రమలోనూ తనకి వాటాలు ఇచ్చితీఱాలని బొత్సా పారిశ్రామికవేత్తల్ని బెదిఱిస్తున్నాడు. ఆయన మీద ఏ విచారణా జఱగట్లేదు. ఎన్నో సంవత్సరాల బట్టీ మల్‌రెడ్డి రంగారెడ్డీ, DK అరుణ భర్తా రోడ్ల మీద లారీలు ఆపేసి మఱీ రౌడీ మామూళ్ళు వసూల్ చేస్తున్నారు. వాళ్ళ మీద ఏ విచారణా జఱగట్లేదేం ? రోశయ్యగారి అమీర్‌పేట భూముల కుంభకోణంలోంచి ఆయన్ని అర్ధాంతరంగా ఎందుకు తప్పించారు ? ఇదంతా selective గా జఱుగుతోందనీ, పనిగట్టుకుని కక్షసాధిస్తున్నారనీ అర్థమైన తరువాత ఇహ ఆ విచారణల మీదా వాటిని జఱిపీమ్చేవాళ్ళ మీదా వాటి పిండితార్థాల మీదా నాబోటివాడికి గౌరవం నశించిపోతే అందులో తప్పేముంది ?

  నా ఉద్దేశంలో కక్షసాధింపుల కంటే ఏదైనా సహించదగినదే. ఈ కాలంలో కష్టార్జితమంటూ ఏమీ లేదు. అందఱూ ఒళ్ళొంచకుండా సంపాదిద్దామని ప్లాన్లు వేస్తున్నవాళ్ళే.

  నేనడిగిన ఒక ప్రశ్నకి ఎవఱూ ఇంతవఱకూ సమాధానం చెప్పలేదు. జగన్ దగ్గఱ "మా డబ్బుంది. ఆయన మమ్మల్ని మోసం చేశాడనీ, ఆయన మమ్మల్ని దోచాడని ఎవడైనా ఫిర్యాదు చేశాడా ?" అసలు జగన్ దగ్గఱ ఉందని ఆరోపిస్తున్న ప్రజాధనం ప్రభుత్వంలో ఏ విభాగానికి చెందినది ? అసలు అతను ఎవఱిని దోచాడు ?

  అలాంటివేమీ లేనప్పుడు ఈ witch hunting దేని గుఱించి ? అన్యాయపు టూళ్ళో ఆలుమగలకే ఱంకు అన్నట్లు కక్షసాధింపుల వాతావరణంలో ప్రతీదీ వివాదాస్పదం చేయొచ్చు.

  రిప్లయితొలగించండి
 35. 2G లొ ఎవరు నా డబ్బు పొయిందని complaint చేసారు. - విచారణ జరుగుతొంది కాదా?

  అలాగే మిగతావాటి మీద కూడా జరుగుంతుంది. మనమే జనలొక్‌పాల్ వచ్చిన తరువాత జరిపిద్దాం. కాని విచారణ జరుగుతున్న వాటిని ఎందుకు ఆపాలి. ఒకటి నిజం జగన్ అమయకుడు కాదు, మీలాగ, నాలగా జీతం రాళ్ళతో బతికే ఆసామి కూడా కాదు. వేలకొట్లు మింగేసిన పెను తిమింగలం. మీరు చెప్పినట్లు ఇంకా ఇలాంటి తిమింగలాలు చాలా ఉన్నయి. అన్నిటినిని బయటకు రప్పిద్దాం.

  రిప్లయితొలగించండి
 36. వాళ్ళది కక్షసాధింపు చర్య కాబట్టి ఇతను చేసింది ఒప్పైపోతుందా? వాళ్ళపై విచారణ జరగలేదు కాబట్టి ఇతనిపై కూడా జరగకూడదా? ఇంక ఈ విధమైన రాయితీలు కూడా ఇచ్చుకుంటూ పోతే ఇంక అంతే. ఈ సంఘటనను 2జి స్పెక్ట్రంతోనో, యాడ్యురప్ప సంఘటనతోనో పోల్చుకుంటే మీకు కాస్త ఊరట కలుగుతుందేమో.

  రిప్లయితొలగించండి
 37. తాడెపల్లి గారు,
  అప్పనం గా ప్రజల డబ్బు అధికారం అడ్డం పెట్టుకొని తిన్న వారు ఎవరయినా సరే, వారందరి మీదా విచారణ జరగాల్సిందే, మీరు ఉదహరించిన బొత్సా దగ్గరనుండి బాబు వరకు ఎవరనీ ఉపేక్షించకూడదు అంటారా, అందులో అభ్యంతరం లేదు,

  కాకపోతే జగన్ డబ్బులు తిన్నవాళ్లు ఎవరయినా కంప్లైంట్ చేసారా? అని అడుగుతున్నారే, అదే అర్ధం లేకుండా ఉంది :(. ఆ మాటకొస్తే 2G లో మా డబ్బులు నొక్కాడు అని రాజా మీద ఎవరయినా కంప్లైంట్ చేసారా? రాజా ఎవరి డబ్బులు తిన్నాడు? అంతెందుకు భోఫర్స్ లో రాజీవ్ మా డబ్బులు తిన్నాడు అని ఎవరయినా కంప్లైంట్ చేసారా? చీరాల ప్రాంతంలో తర తరాల నుండి వ్యవసాయమో, పశువులను మేపుకోవటమో చేసుకొంటున్న భూములను, అస్సైండ్ ల్యాండులు, లేకపోతే భంజర భూములు, అదీ కాకపోతే బెద్రించి తీసుకొన్న వాళ్లను అన్యాయ్మ్ చేసింది ఎవరంటారు? పల్లెలకు పల్లెలు ఖాళీ చేయమనటం, మోటుపల్లి లాంటి చారిత్రాత్మిక ప్రదేశాలను ఏకంగా పూడ్చేయాలనుకోవటం, మా పొలాలను ఇవ్వవం అన్న ఆ గ్రామస్తుల మీద ఏకంగా నక్సలైట్లని మరీ కేసులు పెట్టటం మీద ఎవరిని తప్పుపట్టమంటారు? చచ్చిన దేముడు, ఆయన కట్టబెట్టిన ఆ భూముల మీద పరోక్షం గా లాభం పొందిన వాళ్లది తప్పు లేదంటారా?

  ఇక ఇంతకముందు ఆ దేముడు బతికినప్పుడు నెత్తిన పెట్టుకొన్నవాళ్లు, ఆ మహా మేత తిన్న దానిలో వాటాలు పొంది, కిక్కురుమనకుండా ఉన్న వారు, ఇప్పుడు మహా మేత పుత్ర రత్నాన్ని తప్పు బట్టటం కారణాలు ఏమయినా సరే, బాలేదంటారా? దొంగలు దొంగలు కొట్టుకొంటూ ఉంటే, కాస్త సామాన్య జనానికి లాభం కలగదంటారా? అప్పుడు అందులో వాటాలు తిన్నవారు మాట్లాడనంత మాత్రాన, చచ్చిన మహా మేత, ఆ అధికారం ద్వారా లాభ పడిన పుత్ర రత్నాలు చేసింది, చేస్తున్నది మంచే నంటారా? మహా మేత భజనపరులలో చేరి సువార్త కూటాలు కూడా పెట్టే వారిలో మీరు చేరదలుచుకొన్నరా?

  ఇక తిన్న వారి మీద, అందులో వాటాలు పంచుకొన్న వారు, అలాంటి వారి అందరి అవనీతి మీద ప్రస్తుతం విచారణ జరగటం లేదు కాబట్టి, ఈ విచారణ కూడా జరగటం తప్పు అంటారా? అసలు జగన్ సంపాయించిన ఆస్తులు, పుట్టించిన కంపెనీలు అన్నీ సక్రమం అయిపోతాయి అంటారా?
  లంచం తీసుకొంటూ పట్టు బడిన ప్రతి లంచగొండి చెప్పినట్లే నేను ఫలానా కులపోడిని, ఫలానా ప్రాంతం వాడిని కాబట్టి నన్ను పట్టుకొన్నారు అన్నదే తన సంజాయిషి గా చెప్పుకొన్నట్లు, ఫలానా వాళ్లని పట్టుకోలేదు కాబట్టి, జగన్ నిజాయితీ పరుడే అంటారా? ఉదాహరణ కు బెంగులూరులో కోట్లు అద్దెకొచ్చే భవనాన్ని కొట్టేసి సారి కొనుక్కొని ఆ అమ్మినోడికి ఓ 250 ఎకరాలు శమ్షాబాదు దగ్గర అప్పనం గా కట్టబెడితే అది నిజాయితీ గా వ్యాపారం చేసినట్లు అవుతుందా? ఆ భవనం అమ్మినోడు దానికి ప్రతిఫలం గా జనాల భూమి 250 ఎకరాలు లేని ప్రాజెక్ట్ల పేరుతో వచ్చినందుకు, తను నా డబ్బు కొట్టేసాడు అని కంప్లైంట్ ఇవ్వకపోతే అది సక్రమమయిన వ్యాపారం అవుతుందా? ఆ లావాదేవీ న్యాయపరమయిందే నంటారా? దానిమీద ఎటువంటి చర్యా తీసుకోవటమే తప్పు అంటారా?

  లేక మీరో, నేనో చూడలేదు కాబట్టి, ఇవ్వన్నీ తప్పుడు ప్రచారాలేనంటారా? ఓక్కటి మరచిపోకండి హస్తినతో చెడింది కాబట్టి వీటి మీద ఇప్పుడు CBI కన్ను పడినది కాని, ఈ ఆరోపణలు, కనిపించే ఆస్తులు, ఆ ఆస్తులతో వచ్చిన అహంకారాలు, రాత్రికి రాత్రే పుట్టిన, పుట్టించిన కంపెనీలు, వాటి ద్వారా వచ్చినవి అని చెప్పబడుతున్న డబ్బులు, అసెంబ్లీ లో అతి నవ్వులు అనేవి మనమందరమూ గమనించలేదా? లేక గమనించినా, మీకు అనిపించినా, హస్తినకు ఎదురు నిలబడ్డాడు కాబట్టి అదీ కాంగీలో మహా దొంగ కొడుకు, మహా వ్యాపారస్తుడు అయిపోయాడంటారా?

  రిప్లయితొలగించండి
 38. తాడేపల్లి గారు, మీరు తెలీక అవివేకంగా మాట్లాడుతున్నరో, లేక విషయాలు తెలిసీ అతి తెలివి తో మాట్లాడుతున్నారో లేక కేవలం మీ వాదనా పటిమ కోసం మాట్లాడుతున్నారో అర్ధం కావట్లేదు. మీరు చర్చించటానికి ఇష్టపడితే తదుపరి వ్యాఖ్యల్లో ఈ అంశం గురించి విపులంగా మాట్లాడటానికి నేను సిద్దం. ఒకటి మాత్రం నిజం.

  జగన్ కంపెనీ లో పెట్టుబడులు పెట్టిన వాళ్ళు ఆయనేదో అద్భుతమైన వ్యాపారవేత్త అనో, గొప్ప ఇన్నోవేటర్ అనో 2008 తర్వాత ఆయన అమోఘ వ్యాపార దక్షత ఉన్నపళాన బాహ్య ప్రపంచానికి తెలిసీ వారు అబ్బురపడి పెట్టిన వారు కాదు. వారికి మరొక రకం గా లబ్ధి చేకూర్చుకోటానికి అదొక మార్గం.

  రిప్లయితొలగించండి
 39. కారణమేదైనా విచారణను వ్యతిరేకించడమెందుకో నాకర్ధంకావటంలేదు. అవినీతి ఆరోపణలున్నవారందరిపైనా విచారణ జరగాలనికోరుకొవడంలో అర్ధంవుందిగానీ వారిమీదజరుగని విచారణ వీరిమీదమాత్రం ఎందుకని అంటే ఇంకెవరినీ విచారణకు గురిచెయ్యలేము. కాంగ్రెస్ మీద ద్వేషంతో వారి వ్యతిరేకులందరికీ ఉత్తములని సర్టిఫికెట్ ఇవ్వడం ఎందుకో కూడా అర్ధం కాకుండావుంది.

  రిప్లయితొలగించండి
 40. ఆర్యా ! నేను చర్చలకు వ్యతిరేకం కాదు. కానీ మన దృక్కోణాలు పూర్తిగా వేఱైనప్పుడు మనం కలిసి కూర్చుని చర్చ చేయడంలో అర్థం లేదు. ఆ మార్గంలో మీరు నా కళ్ళు తెఱిపించలేరు. నేనూ మీ కళ్ళు తెఱిపించలేను. నేను చర్చించడం లేదు. నా అభిప్రాయాలు చెబుతున్నానంతే !

  అధికార దుర్వినియోగం ఆనాడు వై.ఎస్. చేసినా, ఈనాడు అతని కొడుకు మీద కాంగ్రెస్ అధిష్ఠానం చేసినా ఖండించవలసిందే. ఇక్కడ అధికార దుర్వినియోగమంటే అధికారాన్ని అడ్డం పెట్టుకొని డబ్బు సంపాదించడం ఒక్కటే కాదు. ఆ అధికారాన్ని తమకి నచ్చనివాళ్ళందఱినీ శాశ్వతంగా మూసేయడం కోసం ఉపయోగించడం కూడాను. నాదృష్టిలో మొదటిదాని కంటే రెండోదే సమాజానికీ, ప్రజాస్వామ్యానికీ ఎక్కువ ప్రమాదకరం, భయంకరం. మొదటిది మీకు తాత్కాలిక ఆర్థిక నష్టాన్ని మాత్రమే కలిగిస్తుంది. రెండోది మిమ్మల్నీ, మీ కుటుంబాల్నీ ప్రాణాలు కూడా తీసి నామరూపాల్లేకుండా చేస్తుంది. మనం ఇలాంటివి హర్షిస్తూ పోతే, గతంలో కమ్యూనిస్టు దేశాల్లో ఎఱ్ఱపార్టీలు అధికారంలోకి వచ్చాక లక్షలాదిమంది నాన్-కమ్యూనిస్టుల్ని ఇళ్ళలోంచి లాగి మఱీ చంపడాన్నీ, వారి కొంపాగోడూ అంతా దురాక్రమించడాన్ని కూడా సమర్థించాల్సి వస్తుంది.

  వై.ఎస్. తాను కేటాయించిన భూముల్ని బలవంతంగా లాక్కున్నాడనీ, అడ్డొచ్చినవాళ్ళ మీద దొంగకేసులు బనాయించారనీ, వారసత్వ సంపదని నాశనం చేయడానికి పూనుకున్నారనీ చెబుతున్నారు. వాస్తవమే. కానీ ఆ పనులు ఆనాడు వై.ఎస్. చేసినప్పుడు ఎవఱూ వాటికి వ్యతిరేకంగా న్యాయస్థానానికి ఎందుకు వెళ్ళలేదు ? ఈరోజు "భలే భలే" అని సంతోషిస్తున్నవాళ్ళల్లో కనీసం ఒక పదీ-ఇఱవైమంది కలిసి ఆనాడు వై.ఎస్. మీద Class action లాంటిది ఎందుకు తీసుకోలేదు ? ఈరోజున నీతిపాఠాలు వల్లిస్తున్న నాయుడూ, ఆంధ్రజ్యోతీ, ఈనాడు గ్యాంగ్ తో సహా ? ప్రజలకి ఏ జోలీ, సొంఠీ లేని ఈ విచారణల్ని న్యాయబద్ధమనీ, ఇవి సక్రమమైన మార్గంలో నడుస్తాయనీ, నిజాల్ని వెలికి తీస్తాయనీ నన్నెలా ఆశించమంటారు ?

  బాధితులు తాము స్వయంగా బాధితులమని చెప్పుకోనప్పుడు ఎవఱిని నేఱస్తుల్ని చేయాలి ? బాధితులు లేకుండా ప్రపంచంలో ఎక్కడైనా నేఱస్తులుంటారా ? మిమ్మల్ని అలా చేస్తే మీరొప్పుకుంటారా ? "నావల్ల ఎవఱు నష్టపోయారో చూపించండి" అని నిలదీయరా ? అవినీతి వాళ్ళే చేస్తారు. వాళ్లే చేయిస్తారు. వాళ్లే వాటాలు పంచుకుంటారు. నచ్చనివాళ్ళ మీద మళ్లీ వాళ్లే వ్యాజ్యాలు బనాయించి వాళ్లే శిక్షిస్తారు. ఏమిటి ఇందులో ప్రజలుగా మనం సంతోషించాల్సింది ? ఏంటి మన పాత్ర ఇందులో ? ఎందుకు చంకలు గుద్దుకోవాలి ?

  నీతికీ, న్యాయం అనేవాటికి ఆ పేరు రావడానికి కారణం - అవి అందఱికీ సమానంగా వర్తించబడడం అని మర్చిపోతున్నారు. "సోనియాకో నీతి, జగన్‌కో నీతి ; అలాగే రామోజీరావుకో నీతి, వై.ఎస్. కి ఇంకో నీతి, బొత్సాకి ఇంకో నీతి, నాయుడికి మఱో నీతి" అంటే అయ్యలారా ! సారీ, నాకిందులో నీతి కనిపించడం లేదు, కక్షసాధింపు మాత్రమే కనిపిస్తోంది. అన్నిరకాల అవినీతివ్యాపారాల్లోనూ ఉద్యోగాలు వెతుక్కుంటూ మఱోపక్క అవినీతిని విమర్శించే హిపోక్రైట్ మధ్యతరగతివాళ్ళ శునకానందం మాత్రమే గోచస్తోంది. తాము తప్ప ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యామ్నాయ నాయకత్వాల్ని ఎదగనివ్వమని శపథం చేసిన అప్రజాస్వామిక నియంతృత్వం కనిపిస్తోంది. చనిపోయిన తండ్రి చేసిన పొఱపాట్లకి తండ్రిలేని కొడుకు మీద కక్ష తీర్చుకునే మారుమూల మధ్యయుగాల నాటి అనాగరికతా, బర్బరతా కనిపిస్తోంది.

  ఎవఱో వై.ఎస్. కుటుంబం యొక్క మతం గుఱించి వ్రాశారు. మతం గుఱించి మాట్లాడే సందర్భం కాదిది.

  రిప్లయితొలగించండి
 41. మీరు ఒక పస లేని వాదనని ఎందుకిలా నెత్తినేసుకుంటున్నారో తెలియటం లేదు. మీ అనేకానేక పాత టపాలు చూస్తే వాటికీ దీనికి మధ్యన వ్యత్యాసం మీకే తెలుస్తుంది మీరు చేస్తున్న ఈ వాదన అర్ధరహితం అని. మిగతా వంద మీద చర్య తీసుకుంటేనే గానీ జగన్ మీద చర్య తీసుకోకూడదా? ఇదెక్కడి ధర్మ సూత్రం? ఇదే సూత్రాన్ని మీ రోజు వారీ జీవితంలో అన్నింటికీ అన్వయం చేసుకోగలితే... అసలు మన మనుగడ సాధ్యమేనా? ఒకడిపైనన్నా తీసుకున్నారని సంతోషించటం పోయి.. శేషన్ మొదలెట్టేదాకా అవే అరాచక ఎన్నికలు... ఆయనప్పుడే ఎందుకు చేసాడు... ఇదివరకు ఎందుకు చెయ్యలేదంటే.... ఆయన మొదలెడితే కాస్తో కూస్తో ఇప్పుడు ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. అలానే ఇదీ రేపటి రోజులకొక పునాదేమో ఎవరికి తెలుసు? ఇక అప్పుడెందుకు బాధితులు అరవలేదు అంటే... ఈ ప్రశ్నకి మీకు సమాధానం నిజంగా తెలియదనుకోను...ఏదో మీరెత్తుకున్న వాదనని సమర్ధించుకోవాలన్న తాపత్రయం తప్ప. ఆ సమయంలో అవతల బతికున్నాయన శక్తిసామర్ధ్యాలు తెలియవా? ఏదేమైనా, ఇన్ని లొసుగులున్న వాదనని మీరిలా పట్టుకు వేలాడతారనుకోలేదు.

  రిప్లయితొలగించండి
 42. >> ఆ అధికారాన్ని తమకి నచ్చనివాళ్ళందఱినీ శాశ్వతంగా మూసేయడం కోసం ఉపయోగించడం కూడాను.

  మీరు చెప్పినట్లు నచ్చని వాళ్ళని మూసివేసే 'అధికార దుర్వినియోగం' లో వైయస్ ని మించిన వాళ్ళు లేరు. ఒక పరిటాల రవి హత్య కాని, కొవ్వూరు ఎమ్మెల్యే ఉదంతం కాని చూస్తే అందులో అతను ఎంత సిద్దహస్తులో తెలుస్తుంది. అధికార దుర్వినియోగమే కాదు, అధికారం కోసం హత్యలు గావించటం లో కూడా సిద్దహస్తుడే. ఆ చర్చ ఇప్పుడనవసరం అనుకోండి.

  సీబీఐ వేగవంతం గా దర్యాప్తు జరపటం అధికార దుర్వినియోగం కాదు. గతం లో జరపకపోవటం దుర్వినియోగం. అయినా జగన్ ఏ అక్రమ సంపాదన కి పాల్పడకపోతే తనకొచ్చిన ఇబ్బంది ఏంటి ఏ దర్యాప్తు అయితే మటుకు?

  ప్రభుత్వాల్లో ఉన్నవాళ్ళు అవినీతి, అక్రమ ఆర్ధిక సంపాదన మూలంగా, స్వప్రయోజనాలు చేకూరే అడ్డగోలు లావాదేవీల మూలంగా ఎంతోమంది బ్రతుకులు ఎదుగు బొదుగు లేకుండా చిద్రమవుతున్నాయి. ఇవన్నీ పరోక్ష హత్యలు.తప్పు చేసిన వ్యక్తుల పై రాజకీయ ప్రయోజనాలకోసమైనప్పటికి సరైన దర్యాప్తు జరపటం ఏ రకం గా అనర్ధమో అర్ధం కావటం లేదు. ఉదాహరణ కి తమిళనాడు లో పరిస్థితులు చూడండి. అక్కడ రాజకీయం గా ఒకరికొకరు బద్ద శత్రువులు.. దాని వల్ల ప్రజలకు వాటిల్లే నష్టం ఏమీ లేదు. ఇంకా ఎంతో కొంత ప్రయోజనమే. ఉదాహరణ కి గత ప్రభుత్వం 500 కోట్ల తో కట్టించిన కొత్త అసెంబ్లీ భవనం ఈ రోజు మంచి ఆసుపత్రి గా మరింది.

  మీరన్నట్లు ఇది కక్ష సాధింపు అనుకున్నా ఇలాంటి చర్యలు సామన్య ప్రజలపై ఏమీ జరగట్లేదు. కాబట్టి మీరు చెప్పే కమ్యూనిస్ట్ తరహా హత్యలు పూర్తిగా వాస్తవ దూరం. మన రాజకీయాలు ఎంత కాదనుకున్న ఒక matured పద్దతిలోనే ఉన్నాయి. ప్రత్యర్ధులను భౌతికం గా ఆంతమొందించే రాజకీయాలు ఈ కాలం లో కూడ చేయాలనుకొన్నది ఎవరో జగద్వితితమే. అలాంటి మహానాయకుల వారసులు అంతకన్నా గొప్పగా ఉంటారా?

  ఇంకొక విషయం. ఎటువంటి నైతిక విలువలు లేకుండ కేవలం తమ అక్రమ ఆస్తులని కాపాడుకోవటానికి, విస్తరించుకోవటానికి రాజకీయాల్లోకి వచ్చే ఇలాంటి కొందరు వ్యక్తులు డబ్బుతో దేన్ని అయినా కొనచ్చు అనుకునే ఆలోచన ధోరణి మూలంగానే ఈ దేశ ప్రజాస్వామ్యానికి అధిక నష్టం. గత ఏడాదిన్నర కాలంగా కర్ణాటక లోని పరిణామాలు చూసినవారికి ఈ విషయం సులభంగానే అర్ధమవుతుంది.

  వైయస్ అక్రమాలు పాల్పడ్డ 'ఆనాడు ' కేసులు వెయ్యలేదు కాబట్టి ఇంక ఎప్పుడూ వెయ్యకూడదనేది మీ వాదనా? ఆనాడు పత్రికలు, ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు వివిధ మార్గాల ద్వారా వైయస్ అక్రమాలపై పోరాడాయి. నాకు తెలిసి న్యాయస్థానాల్లో కొన్ని కేసులు కూడా ఉన్నాయనుకుంటా. పోనీ అధికారులు సహకరించరేమో అని ఆనాడు వెయ్యకున్నా అది అప్పటి అధికార దుర్వినియోగం క్రిందకు వస్తుంది కాని ఈ రోజు వేస్తే అధికార దుర్వినియోగం ఎలా అవుతుంది? మీ లాజిక్కు వాడినట్లైతే ఇండియా లో ఇక నేరం చేసిన ఏ వ్యక్తికీ శిక్ష పడే అవకాశం లేదు. ప్రతీ ఒక్కడు ఫలానా వాడు తప్పించుకున్నాడు కాబట్టి నేనూ తప్పించుకుంటా అనచ్చు.

  మీరు జగన్ లాగా ఒక అసహ్యకరమైన వాదన చేస్తున్నారు. వాళ్ళు అందర్ని వదిలేసినప్పుడు నన్ను ఎందుకు వదిలెయ్యరు అన్నట్లు.. వేలకోట్ల ప్రజాధనం ఇలా అక్రమ మార్గాల ద్వారా, ప్రభుత్వ పెద్దల నిర్వాకాల వల్ల కేవలం పదుల సంఖ్య లోని అనర్హుల చేతుల్లోకి వెళ్తుంటే ప్రజలకు ఏ జోలి, శొంఠి లేదని మీకు మీరే ఎలా తీర్మానించారు?

  బాధితులు వ్యక్తులుగా కాక సమాజం/ప్రభుత్వం అనే సమూహంగా ఉంటే అది బాధితులు కారా? అసలు ఇలాంటి వారివల్ల భాదితులు మన ముందు తరాలవారే. ఆర్ధిక నేరాల్లో ప్రచ్చన బాధితులే కాదు.. పరోక్షంగా కూడా ఉంటారు. ఉదాహరణ కి వేల కోట్ల విలువైన ఖనిజ నిక్షేపాలని తక్కువ రాయల్టీ కి గుంపగుత్త గా లీజు ఇస్తారు.. వాళ్ళు ప్రతిఫలం గా ప్రభుత్వం లో వాళ్ళు సూచించిన వారి కంపెనీల్లో పెట్టుబడి పెట్టారనుకుందాం. ఈ మొత్తం వ్యవహారం లో నష్టపోయింది ప్రభుత్వ ధనం, అంటే ప్రజలది, లాభపడింది ఆ వ్యక్తులు.

  రిప్లయితొలగించండి
 43. continuation....

  ఇక్కడ ఎవరూ సోనియా కి ఒక నీతి జగన్ కి ఒక నీతి ఉండాలనుకోవట్లేదు. అయితే కోరుకునే తీరులోనే ఉంది తేడా అంతా.. జగన్ నీతి ని సోనియా కి కూడా వర్తించాలనుకుంటున్నాం. మీలా వితండం గా సోనియా కి ఉన్న నీతిని జగన్ కి వర్తించాలనుకోవట్లేదు. అయినా మీరన్నట్లు సోనియా అంతటి అవినీతిపరురాలైనప్పుడు జగన్ వాళ్ళ అయ్య అప్పుడెందుకు మాట్లాడలేదు, పోని ఈ జగన్ అప్పుడు ఎందుకు అడగలేదు? సాక్షి లో అవన్నీ ఆనాడు ఎందుకు రాలేదు?

  ఎవరి చేతుల్లో ఉన్న అవకాశాలతో వాళ్ళు పోరాడుతున్నారు. అప్పనం గా వచ్చిన సొమ్ముతో ప్రభుత్వాన్ని కూలుద్దాం అనుకున్నాడు ఒకడు, చేతిలో ఉన్న అధికారబలం తో దాన్ని నిలువరించాలనుకునేది ఇంకొకరు. అయితే ఇందులో తప్పు చేసినవారికి శిక్ష పడటం ఏనాటికైన ప్రజలకు ఉపయోగమే.

  చనిపోయిన తండ్రి చేసిన 'పొరపాట్లా '? ఈ ఒక్క పదం చాలు మీరు ఎంత పెంకి వాదన చేస్తున్నారో అర్ధం అవ్వటానికి. అవి పొరపాట్లు కాదు సార్. అధికార మదం తో కన్ను మిన్ను కానక చేసిన అరాచకాలు. ఏదయితేనం.. మీలో ఉన్న గొప్ప rational thinking అవగతమయ్యిన ఒకప్పటి మీ అభిమానుల్లో నేనూ ఒకణ్ణి. ఇంతలా అధర్మాన్ని వెనుకోసుకొస్తున్న మీరు హిందూ 'ధర్మ 'సూత్రాలు వల్లించటం వింతే.

  మీకు కాంగ్రెస్ మీద నరనరాల్లో ద్వేషం ఉండొచ్చు.. అంత మాత్రామాన ఇలాంటి అవినీతి పరుల్ని వెనుకోసుకొచ్చే నీచంగా వ్యవహరిస్తారని అనుకోలేదు.

  రిప్లయితొలగించండి
 44. నేనడిగిన ప్రశ్నల్లో ఒక్కదానికీ సమాధానం రాలేదు గానీ నా వాదన పసలేని వాదన అంటున్నారు. ఎందుకని ? ఇక్కడ ఈ విచారణ పేరుతో కాంగ్రెస్ అండ్ టి.డి.పి. జాయింట్ వెంచర్ పాల్పడుతున్న రాజకీయ వ్యభిచారాన్ని ఖండిస్తున్నవాణ్ణి నేనొక్కణ్ణే ఉండడం వల్లనా ?

  అన్యాయానికి గల ప్రధాన లక్షణం - అందఱికీ సమంగా న్యాయాన్ని వర్తింపజేయకుండా తమ శత్రువులైనవారికి మాత్రమే దాన్ని వర్తింపజేయడం. ఈ మాట చెప్పినంతమాత్రాన జగన్ తప్పు చేశాడని కాదు. కక్షసాధింపులు ఎలా జఱుగుతున్నాయో వివరిస్తున్నామంతే ! జగన్ తప్పుచేశాడని మనకంత ఖచ్చితంగా ఎలా తెలుసు జాయింట్ వెంచర్ చేస్తున్న ప్రచారం మినహాయిస్తే ? హిందూధర్మం అదీ అంటున్నారు. ఏ ఆధారాలూ లేకుండా మనుషుల్ని ఇలా ప్రీజడ్జ్ చేయమని హిందూధర్మం ఎక్కడైనా చెప్పినట్లు జ్ఞాపకం రావడం లేదు. ఇందులో నిష్పక్షపాతత లోపించింది కనుక ఈ విచారణం న్యాయంగా జఱిగే అవకాశం లేదు. జగన్ 5 లక్షల మెజారిటీతో గెలిచినాక అతను అవినీతిపరుడని కాంగ్రెస్ కి అనిపించడం మొదలయింది. అంతకుముందు లేదు. ఇదొక్కటి చాలదా ?

  ముందు కొన్ని విషయాలు అనుమానాలకు అతీతంగా క్లారిఫై చేసుకుందాం. ఒకటి - నేను నా పాతటపాల్లో జగన్ ని గానీ, అతని తండ్రిని గానీ దేనికైనా శిక్షించాలని కోరిన సందర్భం ఒక్కటీ లేదు. వై.ఎస్. మఱియు ఆయనగారి అనుచరుల భూమిదాహాన్ని నేనెప్పుడూ సమర్థించలేదు. అంతమాత్రాన అది అవినీతి అని కూడా నేను భావించలేదు. ఎందుకంటే దేశ భూభాగం మీద ప్రభుత్వాలకి తరతరాలుగా హక్కుంది, ఆ ప్రభుత్వాలు మంచివైనా, చెడ్డవైనా ! దివంగత వై.ఎస్. ఆ అధికారాన్ని విచక్షణారహితంగా వాడడాన్ని నేను నా బ్లాగులో ఖండించి ఉన్నాను. అయితే ఇక్కడ వై.ఎస్.నీ, ఆయన ప్రభుత్వాన్నీ మన కన్వీనియెన్సు ప్రకారం, మన ప్రిజుడీసులకు అనుగుణంగా కాసేపు అభేదంగానూ, కాసేపు వేఱుగానూ చూస్తున్న ఈ అవకాశవాదపు ద్వంద్వ - రెండునాలుకల ఆత్మవంచననే నేను ప్రశ్నిస్తున్నాను. వై.ఎస్. యొక్క భూకేటాయింపుల ద్వారా అసలుసిసలైన Cash bundles ని అందుకున్న హస్తినాపురపు భారీ కాంగీ తిమింగలాల్ని వదిలిపెట్టి ఆ cash ఇచ్చిన కంపెనీల మోచేతినీళ్ళూ, ఎంగిలిమెతుకులూ మాత్రమే రుచిచూసిన జగన్ ని పట్టుకోవడంలోని ఔచిత్యాన్ని నేను ప్రశ్నిస్తున్నాను. వై.ఎస్. చేసిన కేటాయింపులు కేంద్రప్రభుత్వ అనుమతితో, కేంద్ర పాలసీలకు అనుగుణంగా, కేంద్రం యొక్క పారిశ్రామిక పథకాలలో భాగంగా జఱిగినప్పుడు ఆ అనుమతులు మంజూరు చేసి సొమ్ము చేసుకున్న ఢిల్లీ మహానుభావుల్ని ఎందుకు వదిలిపెడుతున్నారని అడుగుతున్నాను.

  ఈ కేసుకి కారకుడైన మంత్రి శంకర్రావు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతానికి సింహస్వప్నం. ఇతను అవినీతి గుఱించి మాట్లాడుతూంటే నవ్వొస్తుంది.

  రెండో తరం తరంగావళి వ్యాజ్యం (2G spectrum case) ఇంతదూరం రావడానికి కృషిచేసిన సుబ్రమణ్యమ్ స్వామి ఆరోపణల ప్రకారం ఆ వ్యవహారంలో రూ.50 వేలకోట్లు సోనియా ద్వారా విదేశాల్లో ఉంటున్న ఆమె సోదరికి అందాయి. కానీ ఆయన సూచించిన డి.ఎమ్.కె. మంత్రుల్ని చెఱసాలకి పంపారు తప్ప సోనియాని ముట్టుకోలేదు. ఇది న్యాయమేనా ? మఱి మీ లెక్క ప్రకారం ఆరోపణలొచ్చిన ప్రతివారినీ విచారించాలి కదా ?

  KG బేసిన్ లో అక్రమంగా కేటాయింపులు పొందారనీ, అలా వేలకోట్ల గ్యాస్ చట్టవిరుద్ధంగా కొట్టేశారనీ CAG నివేదికలో తేలిన తరువాత కూడా అంబానీల మీద ఏ విధమైన CBI దాడులూ జఱగట్లేదేమీ ? అప్పుడు ఏమైంది మీ పసగల వాదన ? వీళ్లందఱినీ ఆంబోతుల్లా వదిలిపెట్టి - జగన్ ఒక్కడి మీద పడడం కక్షసాధింపు కాదని ఎలా వాదిస్తున్నారు ? మీకెలా మనసొప్పుతోంది ? ఇంత కక్షసాధింపు దీని వెనక ఉన్నప్పుడు, అవసరమైనవాళ్ళందఱినీ కాంగ్రెస్ పార్టీ ముందే కొనేసి పెట్టుకున్నప్పుడు ఈ కంగారూ విచారణ మూలాన జగన్ నిర్దోషిగా ఎలా బయటపడతాడు ? ఈ ప్రభుత్వం ఎలాంటిదంటే మీ యింటిమీదికి ఒకరోజున ఒక IB టీమ్ ని పంపి తామే గూఢచర్యపు సామగ్రిని ప్లాంట్ చేసి "మీ యింట్లో అభ్యంతరకర మెటీరియల్ దొఱికిందనీ, అందుచేత మీరు పాకిస్తాన్ గూఢచారి" అని టామ్ టామ్ వేయగలిగినది.

  రిప్లయితొలగించండి
 45. తగిన లైసెన్సులు లేకుండా జనం నుంచి రు.1200 కోట్ల డిపాజిట్లు అక్రమంగా వసూలు చేసి వ్యాపారాలు చేసి ఆస్తులు పెంచుకుని ఆదాయప్పన్నుశాఖకి మాత్రం నష్టాల్లో ఉన్నట్లు తప్పుడు లెక్కలు సృష్టించి అడ్దంగా పట్టుబడ్డ రామోజికి సి.బి.ఐ. ఎందుకు ఎలా క్లీన్ చిట్ ఇచ్చిందో అర్థం కాలేదు. అందులో ఏ రాజకీయమూ లేదంటారా ? అలాంటి రామోజి ఈరోజున జగన్ మీద ఏవేవో వ్రాస్తే అవన్నీ మనం నమ్మితీఱాలా ? భూసంస్కరణల చట్టం ప్రకారం తెలంగాణలో మనిషికి 50 ఎకరాల కంటే ఎక్కువభూమికి అనుమతిలేదు. కానీ హైదరాబాదు సమీపంలో రామోజి రెండువేల ఎకరాల ఏకచెక్కని ఏ చట్టం ప్రకారం హస్తగతం చేసుకున్నాడో, చేసుకునీ కూడా చెఱసాలకి వెళ్ళకుండా ఎందుకు మన మధ్య తిరుగుతున్నాడో అర్తం కాలేదు. పక్షపాత ధోరణులు ఇంత స్పష్టంగా నగ్నంగా బయటపడుతూంటే, ఇష్టం లేనివాళ్ళందఱినీ 1976-77 నాటి ఎమర్జెన్సీలో మాదిరి మూసేస్తున్నారని కళ్ళకి కట్టినట్లు కనబడుతూంటే "మన రాజకీయవ్యవస్థ కాస్తో కూస్తో న్యాయంగా ఉం"దని మొండిగా వాదించడం ఏమైనా బావుందా ? పైగా నాది పసలేని వాదన అంటారే ?

  అప్పుడు కేసు పెట్టకపోయినా ఇప్పుడు పెట్టొచ్చు అంటున్నారు. బహిరంగంగా అందఱికీ తెలిసేలా జఱిగిన సంఘటనలు, అవి జఱుగుతున్నప్పుడు అందఱూ తూష్ణీంభావం వహించి ఆ తరువాత ఎప్పుడో వాటి మీద ఫిర్యాదు చేయడం చట్టప్రకారం అనుమతార్హమే అయినా అది మతున్నవాళ్ళు చేసే పనేనా ? పదేళ్ళ క్రితం పెళ్ళయ్యి, కాపరం చేసి పిల్లల్ని కూడా కన్నాక ఆ భార్యాభర్తల్లో ఒకఱు లేచి "అది బలవంతప్పెళ్ళి కనుక ఇప్పుడు నా స్పౌజ్ మీద కేసు పెడతా" నంటే అది ఎలా ఉంటుంది ?

  రిప్లయితొలగించండి
 46. ఇక్కడ మీరు జగన్ నీ, నన్నూ ఆడిపోసుకోవడానికి నేపథ్యంగా పనిచేస్తున్న తప్పుడు కాన్సెప్టులు కొన్నున్నాయి.

  1. ఈనాడు లాంటి పత్రికల ప్రచారం ద్వారా జగన్ దగ్గఱ ఏదో వందలాది బిలియన్ రూపాయల డబ్బు కుప్పలుతెప్పలుగా ఉందని మీరు నమ్మించబడడం. దీన్ని Trial by media అనాల్సి వస్తుంది. ముందే ఒక కుక్కకి పిచ్చికుక్క అని పేరుపెట్టి ఆ తరువాత దాన్ని చంపడానికి సమాజం నుంచి అనుమతి సంపాదించడమన్నమాట. ఈ మార్గంలో ప్రతి రాజకీయ ప్రత్యర్థినీ బజారుకు ఈడ్వొచ్చు, మిమ్మల్నీ, నన్నూ కూడా ! వాస్తవమేంటంటే - జగన్ దగ్గఱున్నదంతా bonds and shares రూపంలో మాత్రమే ఉంది. వేలాదికోట్ల cash రూపంలో లేదు.

  ఈనాడు విషయానికొస్తే ఎవఱు బాగున్నా రామోజీ ఓర్వలేడు. తనకి 70 దాటినా సరే, ప్రపంచంలో అందఱూ నాశనం కావాలి, తానొక్కడే బావుండాలనుకుంటాడు. తన మార్గదర్శికి పోటివస్తారనే భయంతో చిన్నచిన్న స్థానిక సహకార బ్యాంకుల మీద ఈనాడులో తప్పుడురాతలు రాసి ఎన్నో బ్యాంకింగ్ కుటుంబాలు వీథిన పడ్డానికీ డిపాజిటర్లు దివాలా ఎత్తడానికీ, ఆత్మహత్యలు చేసుకోవడానికీ కారకుడైన మహానుభావుడతను. జగన్ బాగుపడ్డాడని తెలియగానే రామోజి మళ్ళీ ఈ పాత కుళ్ళు వ్యూహాలకి పదును పెడుతున్నాడని గమనించండి.

  2. జగన్ దగ్గఱున్నది ప్రజాధనమని నమ్మడం. ఇప్పటిదాకా ప్రాథమికంగా తేల్తున్నదాన్నిబట్టి - ఉంటే గింటే జగన్ దగఱున్నది ప్రైవేట్ డబ్బే. ప్రజల డబ్బు కాదు. ప్రభుత్వవిభాగాల డబ్బు అంతకంటే కాదు. జగన్ ప్రభుత్వపదవులలో ఎప్పుడూ లేడు. అటువంటప్పుడు మనమెందుకు శోకాలు పెట్టాలో నాకర్థం కాదు. ఆయా కంపెనీలు తమకిష్టమై తమ కష్టార్జితాన్ని జగన్ దగ్గఱ పెట్టుబడి పెడితే అది నేఱం ఎలా అవుతుందో ఎన్నిసార్లు అడిగినా ఎవఱూ చెప్పడం లేదు.

  3. ప్రజాధనం అనేదేదో ఉందనీ అది ప్రజలకి ఉపయోగపడాలనీ నమ్మడం. మీరు షాకైనా సరే, నేను నిజం చెప్పక తప్పదు. ప్రజాధనమనేది ఒక ఆలంకారిక కవితాత్మక ప్రయోగం మాత్రమే, ప్రజాధనమంటూ వాస్తవంగా ఆచరణాత్మకంగా ఏమీ లేదు. కొన్ని అవసరాల కొద్దీ మనం ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తున్నాం. ఆ అవసరం తీఱగానే ఆ పన్నుడబ్బులతో మనకి ఋణం తీఱిపోతోంది. ఆ విధంగా మీ ధనం మీ దగ్గఱ ఉంది. నా ధనం నా దగ్గఱుంది. ప్రభుత్వధనం ప్రభుత్వం దగ్గఱుంది. దాన్ని ప్రజల కోసమే ఖర్చుపెట్టాలని రూలెక్కడా లేదు. ఎక్కడా ఖచ్చితంగా అలా ఖర్చుచేయడం లేదు.

  4. ఎంతోకొంత డబ్బు సంపాదించి బాగుపడ్డ ప్రతివాణ్ణీ దుర్మార్గుడుగా చూడడం. కసిపెంచుకోవడం. జగన్ పట్ల జనం ఏడ్పులో ఇదే ఎక్కువ పాత్ర పోషిస్తోంది. 90 శాతం ఇదేనని చెప్పడానికి నేను సంకోచించను. ఇది చాలావఱకు మన దేశానికున్న సోషలిస్టు నేపథ్య ప్రభావఫలితం.

  5. వై.ఎస్. చేసిన భూ కేటాయింపులూ, జగన్ కంపెనీల్లో పెట్టుబడులూ రెంటినీ ఒకటి చూస్తున్నారు. ఇది ఈనాడూ, కాంగ్రెస్ పార్టీ కల్పించిన ప్రచార మాయాజాలం, కుతర్కం మాత్రమే. వాటిని వేఱువేఱుగా చూడడమే సహజన్యాయం అనిపించుకుంటుంది. లేకపోతే ప్రపంచంలో ఏ వ్యాపారమూ చేయలేం.

  రిప్లయితొలగించండి
 47. రకరకాలు గా తాడెపల్లి వాదన.
  జగన్ దగ్గర ఎంత డబ్బు ఉందొ నాకు తెలీదు. బహుశా ఎవరికీ తెలీదు.
  మీద కామెంట్ లో జగన్ దగ్గఱున్నదంతా bonds and shares రూపంలో మాత్రమే ఉంది. వేలాదికోట్ల cash రూపంలో లేదు.
  CBI మరి జగన్ ని ప్రశ్నించే అవసరం లేదు. తాడెపల్లి వారిని ప్రశ్నిస్తే అన్ని తెలిసి పొతాయి.

  రిప్లయితొలగించండి
 48. ఎంతోకొంత డబ్బు సంపాదించి బాగుపడ్డ ప్రతివాణ్ణీ దుర్మార్గుడుగా చూడడం అన్నది మీ వాదన. నారయణ మూర్తి, టాటా లు డబ్బు సంపాదిస్తే ఎవరు చెడ్డగా చెప్పుకొరు. పైగా గర్వపడతారు.

  మీ జగన్ వ్యాపరం లో సంపాదించినిది ఎంత. రాశేరె పదవి అడ్డు పెట్టుకొని సంపాదించినిది ఎంత.

  రిప్లయితొలగించండి
 49. @కముధ,
  మీరు తాడేపల్లి గారి మీద అనవసరంగా నోరు పారేసుకోవటం ఆపుతారా? ఆయన ఎంతో సమయం తీసుకొని తన వాదనని చాలా చక్కగా వినిపిస్తుంటే , మిడిమిడి జ్ణానం తో మధ్యలో దూరి మార్థండ లేని లోటును తీరుస్తున్నారు.

  రిప్లయితొలగించండి
 50. @సత్య గారు

  మీ వ్యాఖ్యలతో , మరి ముఖ్యం గా చివరి వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నాను

  @kamudha గారు

  తాడే పల్లి గారు చెప్పినట్లు గా, జగన్ వద్ద ఉన్న సొమ్ము త౦డ్రి ను౦డి స౦క్రమి౦చినది .కాని జగన్ ఏమి చెయ్యలేదు. త౦డ్రి చేసిన దానాలు, అప్పులు, పాపం ,పుణ్యం లకు జగన్ బాధ్యుడు కాదు. అ౦దుకే త౦డ్రి వృద్ది చేసిన పార్టి ని కూడా వదిలేసాడు :) స్వ౦తమ్ గా పార్టి, స్వ౦తమ్ గా కార్యకర్తలను సాధి౦చుకొ౦టున్నాడు . రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు కూడా జగన్ ని సమర్ధుడైన నాయకుడుగా భావి౦చి వచ్చారు కాని, త౦డ్రి ని చూసి కాదు.కదా!

  @తాడేపల్లి గారు

  అన్నప్రాసన రోజే ... అని ఒక సామెత ఉ౦ది కదా, అలానే ఇప్పుడు ప్రజలు మిగిలిన స్కామ్స్ గురి౦చి మాట్లాడితే మొదటికే మోసం వస్తు౦ది. (ప్రజలకు )

  రిప్లయితొలగించండి
 51. తాడేపల్లి గారూ,
  మీరు ఎక్కడో ఒకచోట తర్కాన్ని వాడకపోతారా అని చూస్తూ ఉన్నాను. కానీ,

  జగనేనా తప్పు చేసింది, ఈనాడు చెయ్యలేదా? సోనియా చెయ్యలేదా? చంద్రబాబు చెయ్యలేదా అంటూ ఈనాడు, సాక్షిల మార్కు కుతర్కాన్ని వాడుతున్నారే తప్ప, అసలు విషయానికి రాలేదు. వాన్ పిక్కులో ప్రభుత్వ భూమిని ఇచ్చారు అన్నదాన్ని పట్టించుకోకుండా ప్రజాధనమేమీ లేదు, అంతా ప్రైవేటు ఆస్తే అంటూ వాదిస్తూ పోతున్నారు.

  "అసైన్డ్ భూమి అనేది ఒక సాంకేతిక సాకు అని నా అభిప్రాయం.".."నైతికదృష్టితో చూసినప్పుడు నిజంగా అందులో అవినీతి ఏముంది ?" అంటూ రాశేరె మార్కు బుల్డోజరు వ్యాఖ్యలు చేసేస్తున్నారే తప్ప, అది ప్రైవేటు భూమి కాదు, దాన్ని అమ్మే హక్కు భోక్తకు లేదు అన్న సంగతిని తప్పించారు. మీరు గౌరవించే రాశేరె కూడా ఎసైన్డ్ భూమి అనే ఉద్దేశంతోటే త భూమిని ప్రభుత్వానికి ఇచ్చేస్తున్నట్టు ప్రకటించాడనీ, రామోజీ భూములను స్వాధీనం చేసుకోబోయారనీ గుర్తుకు తెచ్చుకోవాలి మీరు.

  ఇలాంటి తర్కరహితమైన వ్యాఖ్యలు గుప్పిస్తూనే.. "నేనడిగిన ప్రశ్నల్లో ఒక్కదానికీ సమాధానం రాలేదు గానీ నా వాదన పసలేని వాదన అంటున్నారు." అని వాపోతున్నారు. పస ఎందుకు లేదో పైన రాసాను, పైన సత్య రాసారు. అసలుది కింద ఉంది, చూడండి:

  జగనుపై దర్యాప్తు మొదలైనపుడు మీరు చెప్పింది ఇది: "మంచి పరిణామమే గానీ జగన్ ని పట్టుకోవడం ఎవఱి తరమూ కాదని నా అభిప్రాయం. ఎందుకంటే అది ఏకముఖీనంగా జఱిగిన అవినీతి కాదు. బహుముఖీన అవినీతి.. అదొక కో-ఆపరేటివ్ అవినీతి మహాయజ్ఞం." ఆశ్చర్యపోకండి, మీరు అన్న మాటలే అవి!

  ’అవినీతి మహాయజ్ఞం’ అని గర్జించిన మీరే, నెలాపదిహేను రోజుల్లోనే హఠాత్తుగా ఇవ్వాళ, "జగన్ దగఱున్నది ప్రైవేట్ డబ్బే. ప్రజల డబ్బు కాదు. ప్రభుత్వవిభాగాల డబ్బు అంతకంటే కాదు. ఆయా కంపెనీలు తమకిష్టమై తమ కష్టార్జితాన్ని జగన్ దగ్గఱ పెట్టుబడి పెడితే అది నేఱం ఎలా అవుతుందో ఎన్నిసార్లు అడిగినా ఎవఱూ చెప్పడం లేదు." అంటున్నారు.
  ఇలాంటి పసలేని వాదనలు చేసిన మీరు ఆ ముక్కే అన్నందుకు చింతిల్లడంలో అర్థం లేదు.

  సత్య గారూ, బాగా చెప్పారు. కానీ నిదర నటించేవాళ్ళను లేపడం కష్టం!

  రిప్లయితొలగించండి
 52. తాడేపల్లిగారు నావో నాలుగు ముక్కలు,

  >>ఆయా కంపెనీలు తమకిష్టమై తమ కష్టార్జితాన్ని జగన్ దగ్గఱ పెట్టుబడి పెడితే

  ఎవడి కష్టార్జితాన్ని వాదు ఇష్టం వచ్చినట్టు తగేసుకోవచ్చు, అడిగేవాడు ఎవడూలేడు, కానీ ప్రజల దగ్గిర సొమ్ము తిసుకున్న కంపెనీలు, అనగా పబ్లిక్ ఇష్యూకి వచ్చిన కంపెనీలు కొన్ని చట్టాలకి అనుగూణంగా పనిచెయ్యాలి అన్నది మర్చిపోకుడాదు.

  పబ్లిక్ ఇష్యూ కి వచ్చిన కంపెనీల విలువ నిజ విలువకన్నా కొన్ని రెట్లు ఎక్కువగా ఉంటుంది, అంచేత, ఇలా అడ్డగోలుగా ప్రజల సొమ్ము కొల్లగొట్టడానికి అదో మార్గం అవుతుకుండా కొన్ని చట్టాలు ఉంటాయి.

  >>వాటిని వేఱువేఱుగా చూడడమే సహజన్యాయం అనిపించుకుంటుంది. లేకపోతే ప్రపంచంలో ఏ వ్యాపారమూ చేయలేం.

  ఐతే ప్రపంచంలో ఎక్కడా సహజ న్యాయం లేనట్టే, ఎందుకంటే ఇది ఈ ప్రజాస్వామ్య దేశంలో చేసినా పెద్ద స్థాయి అవినీతే, మనకే కొద్దిగా తక్కువ జైలు శిక్షలు ఉన్నాయి (కానీ కంపెనీలకి పెద్ద ఎత్తునే ఫైన్స్ పడతాయి, కొన్ని సార్లు 20రెట్ల దాకా)

  >>జగన్ దగఱున్నది ప్రైవేట్ డబ్బే. ప్రజల డబ్బు కాదు. ప్రభుత్వవిభాగాల డబ్బు అంతకంటే కాదు.

  దేశంలో ఉన్న సహజవనరులపై ప్రతి పౌరునికీ సమాన హక్కు ఉంటుంది, ప్రభుత్వం తెలిసీ, కావాలని తక్కువ రాయల్టీకి ఒప్పుకుంటే అది చట్టరిత్యా నేరం, ప్రభుత్వం, కంపెనీ రెండూ నేరం చేసినట్టే, కంపెనీ కొన్ని రెట్లు ఎక్కువగా ఫైన్ కట్టాలి, ఆ ఫైన్ కట్టేది ప్రభుత్వానికే అని వేరేగా చెప్పక్కర్లేదు కదా?

  >>దాన్ని ప్రజల కోసమే ఖర్చుపెట్టాలని రూలెక్కడా లేదు.

  ప్రజలకే ఖర్చు పెట్టాలి అని లేదు, కానీ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడితే నేరమే అని ఉన్నది.

  >>ఇది చాలావఱకు మన దేశానికున్న సోషలిస్టు నేపథ్య ప్రభావఫలితం.

  ఆధారాలు లేకుండా రామోజీ ఏడుస్టుంటే, జగన్ చక్కా పరువు నష్టం దావా వేయించి ఈనాడుని మూయించొచ్చును నిస్సందేహంగా.

  రిప్లయితొలగించండి
 53. నాకు అమీర్ పేట లో YSR ఒక మూడు ఎకరాలు భూమి ఇస్తే ( కంపెనీ పెట్టడానికి..కోట్ల ఉద్యోగాలు ఇవ్వడానికి)....నేను కూడా జగన్ కంపెనీ లలో పది కోట్లు పెట్టేవాడిని. నేను ఎవరికి లంచం ఇవ్వలేదు. కనక నేను కరక్ట్.

  YSR లంచం తీసుకోలేదు కనుక YSR కరక్ట్.

  జగన్ కు అసలు ఈ భూమి లావాదేవీ లతో సంబంధం లేదు కనుక అతడూ కరక్టే.

  కాని సరిగా చూస్తే..పజల సొమ్ము మూడు ఎకరాలు నాకు లాభం. ( worth at least Rs 100 crore ).

  నేను, YSR, జగన్ ఏ ఒక్కరూ అవినీతి చేయలేదు. మరి ప్రజలకు Rs 100 కోట్లు నష్టం ఎలా వచ్చిందబ్బా ?!

  రిప్లయితొలగించండి
 54. @జాన్
  ఈ రోజే ఈ కొత్త విషయాన్ని తెలుసుకున్నాను. మీకు కూడా తెలియజెప్పాలని ఇక్కడ పెడుతున్నాను.
  3. ప్రజాధనం అనేదేదో ఉందనీ అది ప్రజలకి ఉపయోగపడాలనీ నమ్మడం. మీరు షాకైనా సరే, నేను నిజం చెప్పక తప్పదు. ప్రజాధనమనేది ఒక ఆలంకారిక కవితాత్మక ప్రయోగం మాత్రమే, ప్రజాధనమంటూ వాస్తవంగా ఆచరణాత్మకంగా ఏమీ లేదు. కొన్ని అవసరాల కొద్దీ మనం ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తున్నాం. ఆ అవసరం తీఱగానే ఆ పన్నుడబ్బులతో మనకి ఋణం తీఱిపోతోంది. ఆ విధంగా మీ ధనం మీ దగ్గఱ ఉంది. నా ధనం నా దగ్గఱుంది. ప్రభుత్వధనం ప్రభుత్వం దగ్గఱుంది. దాన్ని ప్రజల కోసమే ఖర్చుపెట్టాలని రూలెక్కడా లేదు. ఎక్కడా ఖచ్చితంగా అలా ఖర్చుచేయడం లేదు.

  రిప్లయితొలగించండి
 55. Johnగారు,

  >>నాకు అమీర్ పేట లో Yశృ ఒక మూడు ఎకరాలు భూమి ఇస్తే

  YSR ఇస్తే పర్లేదు, కానీ ముఖ్యమంత్రి ఇస్తేనే వచ్చిన గొడవల్లా, ప్రతిపక్షాలు లంచం తిని ఇచ్చావన్నా ఎవరూ ఏమీ చెయ్యలేరు, కానీ, ప్రభుత్వం భూమి ఇవ్వాలన్నా తీసుకోవాలన్నా కొన్ని పద్దతులు ఉంటాయి, అమీర్ పేటలో భూమి అంటున్నారు కదా, అక్కడ అమితమైన డిమాండ్ ఉంటుంది, అప్పుడు వేలం వెయ్యాలి (ఐదు లక్షలు సాధారనమైన లిమిట్, ముఖ్యమంత్రికి కొన్ని అధికారాలు ఉంటాయి వాటి పరిధివరకు), సో నేను అదే భూమికి వెయ్యి కోట్లు ఇస్తాను, మీరు చేసే పనే చేస్తాను అన్నా నాకు ఇవ్వకుండా మీకు ఇస్తేనే చట్టరిత్యా నేరం.

  భూమి ఇవ్వడం తప్పు కాదు, దానికి చట్టాన్ని అతిక్రమించి ఇవ్వడం నేరం, (అది కనిపించే వరకు YSRki మచ్చ రాదు), ఇక నిభంధనలు అతిక్రమించి కొందరికి లాభం చేకూర్చి వారు తిరిగి జగన్ కి పెట్టుబడి పెట్టడం ఇంకా పెద్ద నేరం, నష్టం ఎలా అంటారా, వేలం వేస్తే వచ్చే డబ్బులు రావు కదా, అది నష్టం.

  రిప్లయితొలగించండి
 56. >> ఇక్కడ ఈ విచారణ పేరుతో కాంగ్రెస్ అండ్ టి.డి.పి. జాయింట్ వెంచర్ పాల్పడుతున్న రాజకీయ వ్యభిచారాన్ని ఖండిస్తున్నవాణ్ణి నేనొక్కణ్ణే ఉండడం వల్లనా ?

  విచారణ పేరుతో రాజకీయ వ్యభిచారామా? దేశం లో అనేక పార్టీలు ఇతర పార్టీలపై కానీ, వ్యక్తులపై కానీ ఆరోపణలు చేస్తాయి. అంటే అది రాజకీయ వ్యభిచారామా? ఇప్పుడు జగన్, కాంగ్రెస్ కలిసి చంద్రబాబు అవినీతి పై ఎన్నో ఆరోపణలు చేస్తున్నాయి. అంటే వారిరువురు రాజకీయ వ్యభిచారానికి పాల్పడుతున్నారా? జగన్ కి కేసీయార్ కి లోపాయకారి అవగాహన ఉందని వార్తలు ఉన్నాయి. అంటే ఇక్కడా రాజకీయ వ్యభిచారామా? అసలు మీ రాతల ఉద్దేశం ఏంటి? పోనీ కాంగ్రెస్, చంద్రబాబు కలిసి ఆరోపణలు చేస్తున్నారు కాబట్టి అవి చెల్లవు, అవాస్తవాలు అని మీరు declare చేస్తున్నారా? కోర్టులు కూడా అలాగే పరిగణించాలని మీ అభిప్రాయమా? జగన్/వైయ్యస్ అవినీతి పై తెలుగుదేశం ఈ రోజు కొత్తగా ఆరోపణలు చెయ్యటం లేదు కదా... వారు గత 4 సంవత్సరాలుగా వివిధ మార్గాల్లో పోరాడటం లేదా? వేల కోట్ల ధన లూటి ని ఏదో రాజకీయ అంశం గా, కక్షసాధింపు అనో, ఇది ప్రజలకు సంభందం లేని విషయం గా తమరు మసి పూయాలనుకున్నా ఇక్కడ నమ్మటానికి ఎవరూ సిద్దంగా లేరు. దొంగలు, దొంగలు ఊళ్ళు పంచుకోవాలనుకున్నారు. వాటాల్లో, అవగాహనలో తేడా వచ్చి ఒకడు దొరికాడు. మిగిలిన వాళ్ళు దొరికేదాక ఈ ఒకడ్ని వదిలెయ్యమని ఏ న్యాయశాస్త్రం చెప్తుంది తమరికి?

  >> జగన్ తప్పుచేశాడని మనకంత ఖచ్చితంగా ఎలా తెలుసు జాయింట్ వెంచర్ చేస్తున్న ప్రచారం మినహాయిస్తే ?

  ఒక వ్యక్తి తప్పు చేసాడా, లేదా అని కోర్టు ప్రాధమికం గా ఒక అవగాహన కి వచ్చి పూర్తి స్థాయి దర్యాప్తు కి ఆదేశిస్తే ఇంకా 'మనకెలా తెలుసు ' అంటూ నిద్ర నటిస్తారే? ఎవరైన 'ఖచ్చితంగా తప్పు చేసారా లేదా అనేది విచారణ పూర్తి అయితేనే తెలుస్తుంది. అంతేగాని పూర్తిగా తెలిసేదాకా అసలు విచారణే చెయ్యకూడదంటే ఇంక కోర్టులు ఎందుకు? మీరు కనీసం వక్ర మార్గాల్లో పెట్టిన అక్రమ వెంచర్ పత్రికైనా పూర్తిగా చదవండి.. అందులో కూడా వ్రాసారు కదా.. హైకోర్టు ఆదేశాల గురించి.. అక్కడేదొ రామోజి, చంద్రబాబు కలిసి విచారణ కి ఆదేశించినట్లు ఎవర్ని బుకాయించటానికి మీ వాదనా?

  >> నిష్పక్షపాతత లోపించింది కనుక ఈ విచారణం న్యాయంగా జఱిగే అవకాశం లేదు

  వైయ్యస్ ముఖ్యమంత్రి గా ఉన్న కాలం లో పరిటాల రవి హత్య కేసులో జగన్ పై జరిగిన విచారణ నిష్పక్షపాతం గా జరిగినదేనా? అధికారం లో ఉన్నప్పుడు సీబీఐ అత్యున్నత విచారణ సంస్థ, లేనప్పుడు కక్షసాధింపు వ్యవస్థ అవుతుందా?

  >> జగన్ 5 లక్షల మెజారిటీతో గెలిచినాక అతను అవినీతిపరుడని కాంగ్రెస్ కి అనిపించడం మొదలయింది. అంతకుముందు లేదు. ఇదొక్కటి చాలదా ?

  జగన్ కి కూడా ముఖ్యమంత్రి పదవి దక్కకపోయేసరికి కాంగ్రెస్ పార్టీ చేతకాని, అసమర్ధ పార్టీ అయింది. అంతకు ముందు ఎప్పుడూ లేదే? కనీసం వాళ్ళ నాన ముఖ్యమంత్రి గా లేనప్పుడు కూడా ఏమీ లేదే? సోనియా పై సుబ్రమణ్యస్వామి 2004 కి ముందు నించే కేసులు వేసి పోరాడుతున్నాడు, మరి సాక్షి లో 2009 సెప్టెంబర్ 2 వరకు సోనియా కి, కాంగ్రెస్ కి వ్యతిరేకంగా ఏ వ్రాతలు లేవెందుకని?

  రిప్లయితొలగించండి
 57. >> వై.ఎస్. యొక్క భూకేటాయింపుల ద్వారా అసలుసిసలైన Cash bundles ని అందుకున్న హస్తినాపురపు భారీ కాంగీ తిమింగలాల్ని వదిలిపెట్టి ఆ cash ఇచ్చిన కంపెనీల మోచేతినీళ్ళూ, ఎంగిలిమెతుకులూ మాత్రమే రుచిచూసిన జగన్ ని పట్టుకోవడంలోని ఔచిత్యాన్ని నేను ప్రశ్నిస్తున్నాను.

  ఈ మొత్తం అవకతవకల్లో సోనియా కి పెద్ద వాటా దక్కితే ఆ వివరాలు జగనే బయట పెడితే అంతకన్నా కావల్సింది ఏముంది? గత కొన్ని రోజులుగా సాక్షి లో సోనియా అవినీతి గురించి ఊదరగొట్టకపోతే ఇప్పటికైనా మేల్కొని కేసులు వెయ్యచ్చుగా? లేదూ.. జగనే ఆ కేసుల్లో ప్రతివాది గా జాయిన్ అవ్వచ్చుగా.. సుబ్రమణ్యస్వామి కి జగన్ కి మద్య ఉన్న రాజకీయ వ్యభిచారం ఏంటో, ఉన్నట్లుండి ఈయనకు అతని మద్దతు ఎందుకు వచ్చిందో తమరు శెలవిస్తే మంచిది. అలానే జగన్ కి బీజేపీ కి ఉన్న రంకు కూడా మీరు బట్టబయలు చెయ్యండి.

  >> ఈ కేసుకి కారకుడైన మంత్రి శంకర్రావు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతానికి సింహస్వప్నం. ఇతను అవినీతి గుఱించి మాట్లాడుతూంటే నవ్వొస్తుంది.

  తిక్క శంకరయ్య సింహస్వప్నం? మంచి జోక్ పేల్చారు ఉన్నట్లుండి. శంకర్రావే సింహస్వప్నం అయితే వైయ్యస్ గూండాగిరి ఏమిటి మహాశయా? జైల్లో పోలీస్ కస్టడీల మధ్య ఉన్నవాళ్ళు కూడా శవాలై తేలతారు, రామకోటి కి ఇబ్బంది కలిగిస్తే..

  >> ఆయన సూచించిన డి.ఎమ్.కె. మంత్రుల్ని చెఱసాలకి పంపారు తప్ప సోనియాని ముట్టుకోలేదు. ఇది న్యాయమేనా ? మఱి మీ లెక్క ప్రకారం ఆరోపణలొచ్చిన ప్రతివారినీ విచారించాలి కదా ?

  సోనియా ని విచారించకూడదు అని ఇక్కడెవరైనా కోరుకున్నారా? అయితే దానికి జగన్ పై విచారణ కి సంభందం ఏమిటి? ఇలా అయితే సోనియా పై విచారణ జరిగే దాకా దేశం లో ఏ చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై విచారణ జరపకూడదని, అప్పటివరకు కోర్టులు, పోలీసు వ్యవస్థ అన్నీ మూసివేసుక్కూర్చుందామా స్వామీ? సోనియా పై కేసులున్న విషయం తెలిసీ జగన్ 2009 లొ కాంగ్రెస్ తీర్ధం ఎందుకు పుచ్చుకున్నట్లో? ఆమెను తమ నాయకురాలిగా, త్వాగమూర్తిగా ఎందుకు నెత్తికెత్తుకున్నారు?

  >> వీళ్లందఱినీ ఆంబోతుల్లా వదిలిపెట్టి - జగన్ ఒక్కడి మీద పడడం కక్షసాధింపు కాదని ఎలా వాదిస్తున్నారు ? మీకెలా మనసొప్పుతోంది ? ఇంత కక్షసాధింపు దీని వెనక ఉన్నప్పుడు, అవసరమైనవాళ్ళందఱినీ కాంగ్రెస్ పార్టీ ముందే కొనేసి పెట్టుకున్నప్పుడు ఈ కంగారూ విచారణ మూలాన జగన్ నిర్దోషిగా ఎలా బయటపడతాడు ?

  అయ్యో పాపం.. మనసొప్పకపోవటానికి, మీరిలా ముద్దు-మురిపెం చెయ్యటానికి బుజ్జి పాపాయి కాదులే తాడేపల్లి గారు.
  కాంగ్రెస్ పార్టీ కొనేసిందని మీ దగ్గర ఆధారాలుంటే చెప్పి పుణ్యం కట్టుకోండి. మీకు ఎల్లుండికే వైయ్యస్సార్ పార్టీలో ఉపాధ్యక్ష పదవి వచ్చేసినా రావచ్చు.

  రిప్లయితొలగించండి
 58. >> ఈ ప్రభుత్వం ఎలాంటిదంటే మీ యింటిమీదికి ఒకరోజున ఒక IB టీమ్ ని పంపి తామే గూఢచర్యపు సామగ్రిని ప్లాంట్ చేసి "మీ యింట్లో అభ్యంతరకర మెటీరియల్ దొఱికిందనీ, అందుచేత మీరు పాకిస్తాన్ గూఢచారి" అని టామ్ టామ్ వేయగలిగినది.

  అవునా? ఈ ప్రభుత్వం అంత దుర్మార్గమా? గతం లో వైయ్యస్ రామోజి మీద దాడి చేయించింది కూడా అలాంటిదేనా? ఎక్కడో కేరళ వెళ్ళిపోయిన నర్సింగ్ విధ్యార్ధినులు నెల తర్వాత, అది నేరు గా హోమ్మంత్రి వద్దకు వచ్చి ఎమ్మెల్యే అసభ్య ప్రవర్తన గురించి భోరు భోరున గోడు వెళ్ళబోసుకోవటం కూడా అదే కోవకి చెందినదా?

  >> 1200 కోట్ల డిపాజిట్లు అక్రమంగా వసూలు చేసి వ్యాపారాలు చేసి ఆస్తులు పెంచుకుని ఆదాయప్పన్నుశాఖకి మాత్రం నష్టాల్లో ఉన్నట్లు తప్పుడు లెక్కలు సృష్టించి అడ్దంగా పట్టుబడ్డ రామోజికి సి.బి.ఐ. ఎందుకు ఎలా క్లీన్ చిట్ ఇచ్చిందో అర్థం కాలేదు.

  రామోజీ అంత అడ్డంగా పట్టుబడితే మీరు ఆ ఆధారాలు కోర్టుల్లో ఎంచక్కా ప్రవేశపెట్టుకోండి. పోనీ రామోజీ అడ్డంగా దొరికినా వదిలేసారు కాబట్టి జగన్ని కూడా వదిలేయాలని మీ వాదనా? ఇదేనా తమరి పసగల వాదనా? ధర్మం గురించి మాట్లాడటం అంటే జగన్ లాగా రామోజీ ని కూడా శిక్షించాలని అడగటమా లేక రామోజీ లా జగన్ని కూడా వదిలెయ్యండని కోరటమా? ఎవరు నేర్పారు ఈ ధర్మం మీకు? భగవద్గీతా? రామాయణమా? లేక గురు గ్రంధమా? పోనీ మీరు కొలిచే షిర్డీ సాయి బాబా నా?

  >> అలాంటి రామోజి ఈరోజున జగన్ మీద ఏవేవో వ్రాస్తే అవన్నీ మనం నమ్మితీఱాలా ?

  ప్రాధమిక ఆధారాలున్నాయని చెప్పింది కోర్టు అయితే మీరేంటి రామోజీ వల్లే పాపం జగన్ అన్యాయం అయిపోయాడు అన్నట్లు మాట్లాడతారు? పోతుంది ప్రజలసొమ్ము అంటే ఇదేదో రామోజీ కి జగన్ కి మద్య విషయం గా ఎందుకు చిత్రీకరిస్తున్నారు? పైగా ప్రజాధనం అనేదే మిధ్య అనే కొత్త వేదాంతం చెప్తున్నారు. ఇదే విషయం తమరు జగన్ తరఫు లాయర్లకు సలహా ఇస్తే కోర్టుల్లో చెప్పి జగన్ను బయటపడేస్తారు కదా.

  >> భూసంస్కరణల చట్టం ప్రకారం తెలంగాణలో మనిషికి 50 ఎకరాల కంటే ఎక్కువభూమికి అనుమతిలేదు. కానీ హైదరాబాదు సమీపంలో రామోజి రెండువేల ఎకరాల ఏకచెక్కని ఏ చట్టం ప్రకారం హస్తగతం చేసుకున్నాడో,

  మీకు వ్యక్తిగత ఆస్థి కి, కంపెనీ ఆస్థి కూడా తేడా తెలీదా లేక ఏదో ఒకటి వాదించాలని వాదిస్తున్నారా? అయినా రామోజీ పై ఆరోపణలు నిజమయ్యి అతనూ జైలుకెళితే ప్రజలకు ఇంకో అవినీతి పరుడి బెడత తప్పుతుంది కదా.. అంతెగానీ రామొజీ పేరు చెప్పి జగన్ని వదిలెయ్యమని అడగటమేమిటీ?

  >> ఇష్టం లేనివాళ్ళందఱినీ 1976-77 నాటి ఎమర్జెన్సీలో మాదిరి మూసేస్తున్నారని కళ్ళకి కట్టినట్లు కనబడుతూంటే "

  నచ్చని వాళ్ళని కేసులు పెట్టి మూసేస్తుందా? మరి 1976-77 ఎమర్జన్సీ కేసులకు కక్ష సాధింపుగా సుబ్రమణ్యస్వామి సోనియా పై కేసులు పెట్టాడేమో కదా? అయినా అలా కేసులు పెట్టి మూసేస్తే ఇన్ని పార్టీలు కాంగ్రెస్ కి వ్యతిరేకంగా ఎలా పుట్టుకొచ్చాయి? ఎమర్జెన్సీ తర్వాత ఎంతోమంది కాంగ్రెస్ కి వ్యతిరేకంగా నిలిచి విజయం సాధించారే. వాళ్ళందరూ బాగనే ఉన్నారే నేటి వరకు. బీజేపీ లాంటి పార్టీలు అధికారం లోకి కూడా వచ్చాయి. బైదవే, చంద్రబాబు అధికారం లో ఉన్నప్పుడు వైయ్యస్ పెట్టిన కేసులు కూడా మూసెయ్యటానికే పెట్టినవా? కాంగ్రెస్ కి వ్యతిరేకంగా ఎన్నో పార్టీలు, వ్యక్తులు నేడున్నారు, వాళ్ళందరకి కనిపించంది తమ కళ్ళకు అంత కట్టినట్టు ఏం కనిపిస్తుందో?

  రిప్లయితొలగించండి
 59. >> బహిరంగంగా అందఱికీ తెలిసేలా జఱిగిన సంఘటనలు, అవి జఱుగుతున్నప్పుడు అందఱూ తూష్ణీంభావం వహించి ఆ తరువాత ఎప్పుడో వాటి మీద ఫిర్యాదు చేయడం చట్టప్రకారం అనుమతార్హమే అయినా అది మతున్నవాళ్ళు చేసే పనేనా ?

  కేసులు పెట్టటమే మతి లేని పనిగా తోస్తే వైయ్యస్ మరి చంద్రబాబు పై కేసులు పెట్టి వాటిని మళ్ళీ తనే ఉపసమ్హరించుకొని తర్వాత బాబు అవినీతి అంటూ గొంతు చించుకోవటం ఇంకెంత మతి లేని పని మహాశయా? సోనియా పై కేసులున్న విషయం కాంగ్రెస్ నించి బయటకు రాగానే గుర్తుకు రావటం మతి గల పనా?

  >> జగన్ దగ్గఱున్నదంతా bonds and shares రూపంలో మాత్రమే ఉంది. వేలాదికోట్ల cash రూపంలో లేదు.

  మీరు చెప్పిందల్లా నమ్మేసే అంత అఙ్ఞానులం కాదు. ఆ bonds and shares ని అధిక ప్రీమియం తో కొనుక్కొనే వాటాదారులు మూలధనం సమకూర్చారు. కాని కంపెనీ లాభాల్లో ఎక్కువ షేర్లు ఉన్న జగన్ కి అధిక లాభం, అసలు మొత్తం పెట్టుబడి సమకూర్చిన వారికి కేవలం 10 శాతం లాభం. మీరు ఎంతలా అబద్దాలను అల్లటానికి ప్రయత్నిస్తున్నారో ఈ వాక్యం లో తెలుస్తుంది. bonds and shares అనే వాటికి విలువలేదా? అసలు కంపెనీ లో ఉత్పత్తి కూడా ప్రారంభం కాని ఈ విలువ లేని షేర్లని పదులరెట్లు అధిక ప్రీమియం తో ఎంతటి పిచ్చివాళ్ళు కాకపోతే కొనుక్కున్నారంటారు మాష్టారు? మీరేదో ఎర్ర బస్సు ఎక్కి వచ్చిన వాళ్ళకు చెప్పినట్లు 'అబ్బే అవన్ని ఉత్తి షేర్లే.. cash కాదు.. చిత్తు కాగితాలు అని ' ఎందుకు కధలల్లుతున్నరు? అయినా cash రూపం లో లేని, ఎందుకూ పనికి రాని bonds and shares ని మూడువేలకోట్లకి అమ్మి 82 కోట్ల advance tax ఎలా చెల్లించారో కొంచెం వివరిస్తారా?

  >>ఈనాడు విషయానికొస్తే ఎవఱు బాగున్నా రామోజీ ఓర్వలేడు. తనకి 70 దాటినా సరే, ప్రపంచంలో అందఱూ నాశనం కావాలి, తానొక్కడే బావుండాలనుకుంటాడు

  అవునా? రామోజీ ఎవరు బాగుపడ్డ ఓర్వలేడా? మరి తెలుగు లో ఈనాడు కాకుండా చాల పత్రికలు ఉన్నాయి, ఛానెళ్ళున్నాయి.. వాళ్ళంతా ఎలా బ్రతికి బట్టకట్టారబ్బా? ఈ రోజు రాష్ట్రం లో ఎన్నో చిట్‌ఫండ్ కంపెనీలు ఉన్నాయి (శ్రీరాం, కపిల్..) మరి వీటన్నిటిని రామోజీ తొక్కెయలేదా? అయినా మీరసులు సంభందం లేని విషయాలు మాట్లాడుతారేంటి? కోర్టులు రామోజీ చెప్పినట్లు, చంద్రబాబు చెప్పినట్లు నడుస్తాయా?

  తమకెన్నిసార్లు చెప్పిన వినిపించుకోనట్లు నిద్ర నటిస్తే చేసేదేముంది? జగన్ దగ్గర పెట్టుబడి పెట్టిన కంపెనీలు వైయ్యస్ ప్రభుత్వం లో అక్రమ లబ్ధి పొందిన కారణంగానే కానీ జగన్ వ్యాపార సామర్ధ్యం చూసి కాదు.

  దేశ భూభాగం మీద ప్రభుత్వాలకు ఉన్నది హక్కు కాదు.. బాధ్యత. ప్రజల ప్రయోజనాలు సక్రమంగా అందేలా భూముల్ని వినియోగించటం ప్రభుత్వాల బాధ్యత.

  ప్రజాధనం అని గానీ, public property అనేవి గాని ఏమీ లేవా? ఇవి కేవలం 'ఉవ్వువ్వ ' నా? అయితే మీరు రేపు వెళ్ళి ఇందిరా పార్కు లో ఇంటి నిర్మాణం మొదలుపెట్టగలరా? ఎవడైన అడిగితే మీ కళాత్మక నిర్వచనం చెప్పి వారి కళాత్మక సమాధానం స్వీకరించగలరా?

  రిప్లయితొలగించండి
 60. @Satya, well said. తాడేపల్లి గారికి సమాధానం ఇద్దాం అని వస్తే, దాదాపు ప్రతి పాయంట్ కవర్ చేసారు.

  రిప్లయితొలగించండి
 61. @సాంబశివుడు గారు,
  కొముధ గారిది మిడి మిడి ఙ్నానం అయితే, మీ ఙ్నానాన్ని ఎదో చూపవచ్చు గా :), పొరపాటున ఈ బ్లాగు ఎదో భజనపరుల బ్లాగు అనుకొని ఇటు వచ్చారా?

  తను అడిగిన ఒకే ఒక ప్రశ్న కు మీవద్దనేమయినా సమాధానం ఉందా? జగన్ తను సొంతగా సంపాదించింది ఎంత, బాబు పదవిని అడ్డుపెట్టుకొని సంపాదించింది ఎంత అన్నదానికి?

  లేక మళ్లీ మార్థాండా అంటూ మొదలెడతారా? లేక బాబు సంపాదించిందో, రామోజి సంపాదించిందో అంటొ మొదలెడతారా? కాస్త చెప్పండి మార్థాండ ను మించిన మార్థాండ అభిమాని గారు :)

  రిప్లయితొలగించండి
 62. భూకేటాయింపుల ద్వారా cash bundles అందుకున్నారు ఢిల్లి పెద్దలని ఒక వైపు..
  జగన్ అవే భూకేటాయింపుల ద్వారా ఎంగిలి మెతుకులు మాత్రమే తిన్నాడని ఒప్పుకోలు మరోవైపు..

  ఒకే లావాదేవీ కి సంభందించి ఢిల్లి పెద్దల్ని అరెస్ట్ చెయ్యాలిగాని, జగన్ మాత్రం ఏ తప్పు చెయ్యలేదని ఇంకోవైపు..
  భూకేటాయింపులు, జగన్ ఎంగిలిమెతుకుల పెట్టుబడులు రెండు పరస్పర సంభందం లేని విషయాలని మరోసారి.. (సంభందం లేకపోతే జగన్ కి, సోనియా కి ఇద్దరికీ వుండదు కాని కేవలం ఒకళ్ళకే వుంటుందా).. ఏమిటో ఈయనకు అర్ధాంతరంగా జగన్ పై వ్యామోహం.. బుర్రలో ఇంత కంఫ్యూజన్ పెట్టుకోని ఈయన దేన్ని సమర్ధించాలని తాపత్రయపడుతున్నారో అర్ధం కాదు.

  రిప్లయితొలగించండి
 63. *మన రాజకీయాలు ఎంత కాదనుకున్న ఒక మెట్యురెడ్ పద్దతిలోనే ఉన్నాయి. ప్రత్యర్ధులను భౌతికం గా ఆంతమొందించే రాజకీయాలు ఈ కాలం లో కూడ చేయాలనుకొనహ్నది ఎవరో జగద్వితితమే. *
  @తాడేపల్లి గారు,
  పైన రాసినది చదివారు కదా! ఆకాలం లో కుళ్ళు కుతంత్రాల, నక్క జిత్తుల కాంగ్రెస్ పాలన నుంచి తెలుగు ప్రజలను అభివృద్ది వైపుకు తీసుకు పోతానని పార్టి పెట్టిన ఒక మహానటుడు, అధికారం చెప్పటిన కాలం లోనే విజయ వాడలో వంగ వీటీ మోహన రంగా గారి హత్య జరిగింది. ఆ హత్య తరువాత కొన్ని రోజులు ఆ వూరు అటుడికింది. దాని వలన ప్రజలకి ఎమీ ఇబ్బందులు కలగలేదన్నమాట!
  ------------------------------------------------
  మరి ఈ కాలంలో ఆ మహా నటుడి అబ్బాయిగారు, వారితో సినేమాతీసిన నిర్మాతనే కాల్చరు. ఈ నటుడు డిప్రేషన్ లో వున్నారని ప్రముఖ అంతర్జాతీయ వైద్య నిపుణుడు కాకరకాయల డబ్బారావు గారు బులేటిన్ విడుదల చేసారు. తెలుగు సినేమాలు చూసే చంటి బిడ్డకు తెలుసు ఆ అంతర్జాతీయ వైద్య నిపుణుడు చెప్పేది అబ్బదమని. ఆరోజుల్లో అదొక వింత! చావు బ్రతుకుల్లో వున్న అల్లంకొండ నరేష్ ను పలకరించటానికి ఒక్కరు ముందుకు రాక పోగా, బట్టతల ముసలి మహా నటుడు నుంచి, చిన్న నిర్మాత వరకు అప్పుడే మతి స్థిమితం కోల్పోయిన ఆ నటుడిని పలకరించటానికి క్యులుకట్టారు. ఆ నటుడికి వై.యస్. గారి ప్రభుత్వం పెద్ద మనసు చేసుకొని శిక్ష పడకుండా తప్పించారు. ఈ కాలంలో ఇలా చేతికి చిక్కిన వారిని వదిలేసిన చరిత్ర గల వారు ఎవరో జగద్వితితమే! కొందరు మహానేత ఉదార బుద్దిని సమయానుకూలంగా మరచి పోతూంటారు.

  రిప్లయితొలగించండి
 64. @క్రిష్ణ గారు,
  ఇప్పటికే ఇకడ పెద్దలందరు సత్య,చదువరి, తాడేపల్లి గారు ఎంతో జ్ణానం పంచేసారు. ఎమీ మిగల లేదు. ఈ సారి ఇంకొక టపా రాసిన వేంటనే జ్ణాన్ని ప్రదరిసించటానికి ప్రయత్నిస్తాను:)

  రిప్లయితొలగించండి
 65. సాంబశివుడు గారు,
  మహా మేత గారు మహా గుండె తో ఎవరినో మహా గా వదిలేస్తే, ఇప్పుడు మహా మేత కొడుకు మహా నిజాయితీ పరుడు అంటారు, అదెనా మీ సమర్ధన.
  మరి మహా అల్లుడు అనిల్ గారిని టెలికం స్కాం నుండి NDA ప్రభుత్వంలో తప్పించింది ఎవరో కూడా మరచే పోయారా? మడమ తిప్పని మహా మేతలు సుప్రీం కోర్ట్లో ఎందుకు కేసులు వెనక్కి తీసుకొన్నారో మరచే పోయారా? అంత మహా ఉదార హృదయాలు ఉన్నవాళ్లయతే ముందు ఎందుకు కోర్ట్లు కు వెళ్ళినట్లు? వెళ్లి మడమలేమి ఖర్మ అన్నీ తిప్పుకొని కేసు ఎందుకు వెనక్కి తీసుకొన్నట్లు, కాస్త చెబుతారా? మీరు మిడి మిడి ఙ్ణానులు కాదు కదా!!!

  చేతికి చిక్కిన మహా అల్లుడు అపర ఏసు ప్రభువు అవతారులను విడిపించిన ఆయన ది కూడా మహా ఉదారబుద్దేనా, మన డిక్షనరీ లో? లేక మహా మేతలతో పాటు మహా ఉదారబుద్దులు కేవలం, మహా వంశాలకే ఉంటాయా?:)) అలా ఎవరయినా కుమ్మక్కు అయితే తాడేపల్లి గారి మాటలలో అది వ్యభిచారం, మరి మీ మహా మేత మహా వ్యభిచారులని మహా అభిమానులు మీరే ఒప్పుకొంటున్నారా?

  అసలు ప్రస్తుతం జగన్, ఆయన మీద జరుగుతున్న విచారణకు, దానిమీద కోర్టులు ఆదేశించటానికి, బాలక్రిష్ణ కేసులో జరిగిన సినెమా కు సంబంధం ఏమిటి మార్థాండ మహాశయా?

  రిప్లయితొలగించండి
 66. క్రిష్ణ గారూ, సాంబశివుడు గారు ఈ మధ్యే జనజీవన స్రవంతి లోకి వచ్చినట్టున్నారు.. దేన్ని దేంతో లింకు పెట్టాలో తెలీక అయోమయం ప్రదర్శిస్తున్నారు. బట్టతలలు మోకాళ్ళూ కూడా గుండ్రంగానే, నున్నగానే ఉండటంతో పాపం తికమక పడుతున్నట్టున్నారు. వారి ’మహా’ జ్ఞానాన్ని ఇక్కడ ప్రదర్శిస్తే మనం తట్టుకోగలమో లేమో..! :)

  రిప్లయితొలగించండి
 67. సత్య గారూ,
  ఒక్కొక్క పాయింటునే తీసుకుని చాలా సమర్ధవంతంగా వాదించారు. హైలైటు మాత్రం ఇది: తాడేపల్లి గారు, జగను పార్టీ & బజన సంగం చేస్తున్న ఒక ప్రధానమైన వాదనను ఒక్క వాక్యంలో ఇమిడ్చారు.. "పోతుంది ప్రజలసొమ్ము అంటే ఇదేదో రామోజీ కి జగన్ కి మద్య విషయం గా ఎందుకు చిత్రీకరిస్తున్నారు?"

  మొదట్నుంచీ సాక్షి, జగను, రాశేరె చేస్తున్న పని ఇదే. తాము చేసే తప్పులను కప్పిపుచ్చుకోడానికి, తమపై వచ్చే ఆరోపణలను ఎదుర్కోవడానికీ రామోజీపై దండెత్తేవారు- అదేదో తమకూ రామోజీకీ మాత్రమే సంబంధించిన విషయం అన్నట్టు. తాడేపల్లి గారు దాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళారు. ఆయన వాదనలో రామోజీ, ఈనాడుల ప్రస్తావన ఎన్నిసార్లు వచ్చిందో చూడండి; బహుశా సాక్షిలో కూడా ఇన్నిసార్లు రాదేమో!

  రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు