1, నవంబర్ 2011, మంగళవారం

జయహో ఆంధ్రప్రదేశ్!

దాదాపు నూట యాభై ఏళ్ళ వియోగం తరవాత 1956 నవంబరు 1 న తెలుగుజాతి తిరిగి ఏకమైంది. అభివృద్ధి పట్ల, జీవన పరిస్థితుల మెరుగుదల పట్లా ప్రజల్లో ఉన్న ఆకాంక్షలను తీర్చడానికై  సమైక్య రాష్ట్రం ప్రభుత్వాలు కృషి చేస్తూ ఉన్నాయి. మామూలుగా ప్రభుత్వాల్లో ఉండే అలసత్వం, నాయకులు, పాలకుల్లో ఉండే అవినీతి, అక్రమాల వంటి అవలక్షణాలు ఈ ప్రభుత్వాల్లోనూ ఉన్నాయి. ఈ అవకరాల గురించి చేసే విమర్శలు రోజూ మనం చదువుతూనే ఉన్నాం. వింటున్నాం. మనమూ రాస్తున్నాం. బ్లాగుల్లోను, ఇతర మీడియాలోను, ప్రజల్లోను, వివిధ వేదికల మీదా అనేక విమర్శలు వస్తున్నాయి.

ఈ అవలక్షణాలు సరే.. అసలు రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో అభివృద్ధి ఎలా ఉంది..  ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక మూడు ప్రాంతాల్లోనూ జరిగిన అభివృద్ధి ఏమిటి.. ఈ విషయాలను మనం సంగ్రహంగా తెలుసుకునే అవకాశమేమైనా ఉందా?  ప్రభుత్వాలు చేస్తూ వచ్చిన అనేక అభివృద్ధి కార్యక్రమాలు, వివిధ ప్రాంతాల్లో ఎటువంటి ప్రగతిని సాధించాయి అనేది గణాంకాల్లో చూడగలమా?

ఒక పెద్ద నివేదికలో చూపించాల్సిన అంశాలన్నిటినీ ఒక చిన్న టపాలో చూపించలేమేమో గానీ..,  రెండు కొలతల సాయంతో కొంతవరకైనా ఈ సమాచారాన్ని చూపించవచ్చేమోననిపించింది. ప్రాంతాలవారీగా జీడీపీ, తలసరి ఆదాయం అనే రెండు కొలతలను తీసుకున్నాను. నాకు 1993-94, 2004-05 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన అంకెలు దొరికాయి. వాటిని ఆధారంగా తీసుకుని కింది రెండు పట్టికలను తయారుచేసాను.

జిల్లా వారీగా జిల్లా తలసరి జీడీడీపీ ఇలా ఉంది.

జిల్లా 1993-94 2004-05 పెరుగుదల శాతం
కోస్తా ప్రాంతం7540.67 11963.56 58.65%
రాయలసీమ7553.25 9967.75 31.97%
కోస్తా+సీమ 7544.54 11349.46 50.43%
తెలంగాణ 7062.6 11818 67.33%
తెలంగాణ (హై. లేకుండా) 6993.33 11381.89 62.75%
ఆంధ్ర ప్రదేశ్7416 11756 58.52%


తలసరి ఆదాయం (డీడీపీ)
ప్రాంతం 1993-94 2003-04 పెరుగుదల శాతం
తెలంగాణ 819.9 1309.4 59.70%
తెలంగాణ (హై. లేకుండా) 810.33 1259.56 55.44%
కోస్తా 842.22 1325 57.32%
రాయలసీమ 842 1083.25 28.65%
కోస్తా+సీమ 842.15 1250.61 48.50%
ఆంధ్రప్రదేశ్
832.5
1276.17 53.29%

(ఈ గణాంకాలను http://www.aponline.gov.in/apportal/Human-Development.html నుండి తీసుకున్నాను.)

జీడీడీపీ పెరుగుదల రేటులోను, తలసరి ఆదాయం లోను తెలంగాణ ప్రాంతం మిగతా ప్రాంతాల కంటే ముందంజలో ఉంది -హైదరాబాదును కలుపుకుని చూసినా, తీసేసి చూసినా!  

అభివృద్ధిలో రాయలసీమ బాగా వెనకబడింది. అయినప్పటికీ రాయలసీమ ప్రజలు నాయకులూ సంయమనం పాటిస్తూండగా, ప్రగతిలో మిగతా ప్రాంతాలను వెనక్కు నెట్టి ముందుకు దూసుకుపోయిన తెలంగాణలో మాత్రం కొందరు నాయకులు వెనకబడిపోయామంటూ విద్వేషాలను రెచ్చగొడుతున్నారు. తమ స్వార్థ, సంకుచిత లాభాల కోసం ప్రజలను రెచ్చగొట్టి,  తంపులు పెట్టి, రాష్ట్రాన్ని, ప్రజలనూ చీల్చాలని ప్రయత్నిస్తున్న ఈ నాయకులు ప్రజాద్రోహానికి పాల్పడుతున్నారు. సమైక్య రాష్ట్రం తమకు ద్రోహం చేసిందంటూ పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. తెలుగుజాతికి పీడగా దాపురించారు. ఈ ద్రోహులకు తగిన విధంగా బుద్ధి చెప్పి, అభివృద్ద్ధిని అడ్డుకునే వాళ్ళ కుయుక్తులను తిప్పికొట్టి, ప్రజలకు వాస్తవాలను తెలియజెప్పేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరింతగా పురోగమించాలనీ, వెనకబడిన రాయలసీమ కూడా అభివృద్ధి వేగాన్ని అందుకోవాలని, మూడు ప్రాంతాలూ సమానంగా అభివృద్ధి పొందాలనీ ఈ అవతరణ దినాన కాంక్షిస్తున్నాను.

జయహో ఆంధ్రప్రదేశ్!

11 కామెంట్‌లు:

 1. /తెలుగుజాతికి పీడగా దాపురించారు/
  అవును, అపద్దాల ఏడుపు గోస బ్లాగులు, అసత్యాన్వేషకులు, చీకటివెలుగుల బొద్దింక బ్లాగులు, బ్లాగులోకానికే పీడగా దాపురించారు. :))

  రిప్లయితొలగించండి
 2. తలసరి ఆదాయం సంవత్సరానికా నెలకా తెలుపగలరు

  రిప్లయితొలగించండి
 3. మీడియా అధినేతలు కూడా నిజానిజాలను వెల్లడించే ధైర్యం చెయ్యలేకపోవడం నాయకగణాల అసత్యవాదనలకు మరింత బలం చేకూరుతుంది. పార్టీలతో ప్రమేయం లేకుండా ప్రస్తుతం అందరు నాయకులు తమ స్వార్దప్రయోజనాలతో తేనెపూసిన కత్తుల్లా ఎదురుచూస్తున్నారు.వీటివలన నాయకులకె గాని ప్రజలకు వుపయోగం లేదనేది జగమెరిగిన సత్యం.

  రిప్లయితొలగించండి
 4. జయహో ఆంధ్రప్రదేశ్!

  రిప్లయితొలగించండి
 5. జై తెలుగు తల్లి జై జై ఆంధ్రప్రదేశ్

  రిప్లయితొలగించండి
 6. kamudha: ఇవి సంవత్సర ఆదాయాలండి, 1993-94 రేట్ల ప్రకారం.

  చిన్న సవరణ చేసాను.. మొదటిది తలసరి జీడీడీపీ, రెండోది తలసరి డీడీపీ. ఈ రెంటీకీ తేడా ఏంటో నాకు తెలీదు. బహుశా జీడీపీ, జీఎన్‍పీ లకు ఉన్న తేడా లాంటిదేమో మరి!

  ఈ లెక్కలను CESS వాళ్ళు తయారు చేసిన AP Human Development Report నుంచి తీసుకున్నాను. ఈ నివేదికను http://www.aponline.gov.in/apportal/Human-Development.html నుండి తీసుకోవచ్చు.

  రిప్లయితొలగించండి
 7. బాగా తెలిపారు.

  మన తెలుగుతల్లికి మల్లెపూదండ.

  ప్రస్తుత వికృత ఉద్యమం పాలకవర్గాల అండతో, వాళ్ళ నిధులతో, వాళ్ళ తెఱచాటు సహాయసహకారాలతో వాళ్ళు ఉద్దేశపూర్వకంగా ప్రేరేపించగా నడుస్తున్నటువంటిది. ఇది మన తెలబాన్లకి తెలీక "నాలుగుకోట్లమంది మనోభీష్టం, అదీ ఇదీ" అంటూ తెగ రెచ్చిపోతున్నారు. కానీ రాబోయే 8 నెలల్లో ఈ వాదానికి శాశ్వతంగా సమాధి.

  రిప్లయితొలగించండి
 8. సూపర్ బ్రదర్...కాని మన కళ్ళు ఉండి చూడలేని వేర్పాటు కబోధులకు ఎన్ని చెప్పినా అర్థం కావటం లేదు..అందుకే ఈ వేర్పాటు తెలబాన్ వెధవలను ఆస్ట్రేలియా కు తన్ని తరిమేస్తే అక్కడైన వాళ్ళ సొంత నిజాం నవాబు వారసులతో గొర్రెలు కాచుకొంటూ బాంచన్ దొరా అంటూ బతికేస్తారు..
  ఏది ఏమైనా నా ....మన తెలుగు జాతి రాష్ట్రాభివృద్ధి లో ,సంక్షేమం,వ్యవసాయం,పరిశ్రమలు...ఇలా అన్ని రంగాల్లో No .1అభివృద్ధి చెందాలని ఆశిస్తూ....నిజాం వేర్పాటు వసూళ్ళ తెలంగాణా తీవ్రవాదులతో సహా .....అందరికి ఆంధ్ర రాష్ట్ర అవతరణ శుభాకాంక్షలు..
  జయహొ తెలుగు తల్లి ...జై జై ఆంధ్ర ప్రదేశ్..జై జై జై తెలుగు జాతి..

  రిప్లయితొలగించండి
 9. GDDP - Gross District Domestic Product
  DDP - District Domestic Product

  GDP/GDDP alone does not give the correct indicator. you can go thru the complete human development report of AP at http://hdr.undp.org/en/reports/national/asiathepacific/india/APHDR_2007_India.pdf

  There are lot many parameters that gives u a better understanding.

  రిప్లయితొలగించండి
 10. satya,
  Thanks for the link. Actually I had used that link to download the entire PDF. But I could not locate its link on the site yesterday; hence gave the individual chapters' links.

  DDP and GDDP - The acronyms are fine.. I wanted to know the difference between the two.

  రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు