14, డిసెంబర్ 2008, ఆదివారం

అసలు నేరస్తులు

వరంగల్లు విషాదంలో రెండు సంఘటనలున్నాయి: ఒకటి యాసిడు పోసిన ఘటన, అందుకు దారితీసిన పరిస్థితులు, రెండోది పోలీసులు చేసిన ఎన్‌కౌంటరు.


యాసిడు ఘటనకు సంబంధించి తల్లిదండ్రుల బాధ్యత విషయంలో ప్రసాదం గారు చెప్పినదానితో ఏకీభవిస్తాను. తల్లిదండ్రుల బాధ్యతతో పాటు మరో ముఖ్య విషయాన్ని నేను ప్రస్తావించదలచాను. అది సినిమాలు, టీవీ, పత్రికలు. ప్రజాభిప్రాయాన్ని, సామాజిక ధోరణులను ప్రభావితం చెయ్యడంలో వీటి పాత్ర ఉపేక్షించరానిది.

గత ఏప్రిల్లో రాసిపెట్టుకున్న నా జాబును కొన్ని మార్పుచేర్పులతో, జాబులోని హాస్య, వ్యంగ్య ధోరణిని సవరించి, పెడుతున్నాను. నేరాల గురించి బ్లాగుల్లో చర్చ జరిగినపుడు ఆ జాబును పెడదామనుకున్నానుగానీ పెట్టలేదు. ఇప్పటి పరిస్థితికీ సరిపోతుంది.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

మన సినిమాలు, టీవీలు, పత్రికలు మనిషిలోని నేరప్రవృత్తికి ఆజ్యం పోస్తున్నాయనేదాన్ని నేను నమ్ముతాను.
పంతుళ్ళను ఎగతాళి చేసే పిల్లకాయలు. అసభ్యకరంగా, అనాగరికంగా, వెకిలిగా  ప్రవర్తించే పంతుళ్ళూ పంతులమ్మలు,  కేవలం ప్రేమించుకోడానికి మాత్రమే కాలేజీలకి పోయే పిల్లలు. (కాలేజీయే కాదు బడుల్లో కూడా!) పదో తరగతిలో ప్రేమ. ఏడో తరగతిలో ప్రేమ, ఏడో యేట ప్రేమ! ప్రేమకోసం తల్లిదండ్రులను ఎదిరించే పిల్లలు. తండ్రిపై చెయ్యెత్తే పిల్లలు. ప్రపంచంలో ప్రేమ తప్ప మరోటి లేదని, జీవితానికి ప్రేమ తప్ప మరో పరమార్థం లేదంటూ ఇచ్చే సందేశాలు, ప్రేమ కోసం పోరాటాలు -ఇవీ నేటి సినిమాలు.

టీవీలు చూద్దామా... చిన్నపిల్లలతో, యుక్తవయసులో ఉన్న ఆడపిల్లలతో, ఆడా మగా పిల్లలతో వెగటు కలిగించే డాన్సులు, వెకిలి చేష్టలు. టీవీలు రాకముందు స్టేజీలెక్కి రికార్డింగు డ్యాన్సులేసే పిల్లకాయల్ని చూసామా? కాలేజీ అంటే ప్రేమ తప్ప మరోటి కాదనీ, కుర్రాళ్ళకు మొదటి అర్హత ప్రేమించటమేనని ఎవరు నేర్పారు మనకు? మగ స్నేహితులు లేని ఆడ జన్మ, ఆడ స్నేహితులు లేని మగ బతుకూ వ్యర్థమని భావించగలిగే స్థాయికి తెచ్చిందెవరు? ఇవన్నీ రైటేననుకునే కొందరు తల్లిదండ్రులకు ఆలోచనలిచ్చిందెవరు? రేయింబవళ్ళూ మనం చూస్తున్న సినిమాలూ, టీవీ కార్యక్రమాలది సింహభాగం! అంచేత వాటి పాత్ర పతనంలో చాలా ఉంది.

కొన్ని పత్రికల మూడోపేజీ గురించి మనకందరికీ తెలుసు. (కొన్ని పత్రికల్లో పేజీలన్నీ కూడా మూడో పేజీలేననుకోండి!) అలాంటి పత్రికలూ నేరంలో భాగస్తులే! విషయం చెబుతాను... డెక్కన్ క్రానికిల్ అనే (బూతు) పత్రికలో సారి వ్యాసం వచ్చింది. ఆడాళ్ళు అండర్వేరు కనబడేలా కూర్చున్నపుడు ఎలా కూర్చోవాలి, అప్పుడు అండర్గార్మెంటు రంగు, బయటి బట్టల రంగుతో పోలిస్తే ఎలా ఉండాలి అనే వ్యాసం రాసారు - బొమ్మలతో సహా! సిగ్గుందా వీళ్ళకి? నేను వాళ్ళకో ఉత్తరం రాసాను - వెయ్యలేదు, మామూలుగానే! టైమ్స్ ఆఫ్ ఇండియా అనే మహా బూతు పత్రికను కూడా చూసే ఉంటారు.

ఇప్పుడు తెలుగు పత్రికలకు కూడా విస్తరిస్తోందీ జబ్బు .సినిమా పేజీలో ఈనాడు వాడే భాష చూసారా? మిగతా పత్రికకలో వాడే భాషకూ ఈ పేజీలోని భాషకూ చాలా తేడా ఉంటుంది. పద్ధతైన పత్రికలు వాడే భాష కాదది. స్త్రీ సౌదర్యం గురించి మాట్లాడాలంటే అందం గురించి మాట్టాడాలి. అంతేగానీ అందాల గురించి మాట్టాడితే ఒక వార్తాపత్రిక స్థాయికి అది అసభ్యమే! ఆ పేజీలో ప్రచురించే ఫోటోలూ అంతే!

సినిమాల్లో వేసుకునే వేషాలు ఇప్పుడు బయట పార్టీల్లో కూడా వేసుకు తిరుగుతున్నారు హీరోయినులు. బాపతు జనం బజాట్టోకెళ్ళినపుడు ఎవడన్నా చెయ్యట్టుకు లాగాడంటే లాగడూ మరి!? దానికి, ... బాధపడిపోతే ఎలా? మనం వేసుకునే డ్రస్సులు మన ఒంటితో పాటు మన వ్యక్తిత్వాన్నీ చూపిస్తాయి గదా! బట్టల్లో నన్ను మా తల్లిదండ్రులు, అన్నల్దమ్ములు, అక్కచెల్లెళ్ళు చూస్తే ఎంత నామర్దా అని అనుకోని వాళ్ళు బజాట్టో ఎవడో చెయ్యట్టుకున్నాడంటే బాధెందుకు? [ఏప్రిల్లో తిరపతిలో ఓ సినిమా హీరోయినుతో అసభ్యంగా ప్రవర్తించాడొకడు. ఈవిడగారు నేను పైన చెప్పిన దక్కనుక్రానికిలు వారి వ్యాసాన్ని అనుసరించి ఓ సినిమా పండక్కి వెళ్తే అప్పట్లో పెద్ద గోలైంది, కోర్టు కేసూ ఐంది. ఈ పేరా ఆ సందర్భాన్ని ఉదహరించి రాసినది.]
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
అసలు నేరస్తులు ఇలా స్వేచ్ఛగా సమాజంలో తిరిగేస్తూంటే ఎన్‌కౌంటరైపోయేవాళ్ళ, దాడికి గురై అసుపత్రుల్లో చేరినవాళ్ళ, అమ్మాన్నాన్నలు పాపం ఎలా అలమటిస్తున్నారో గుండెను పిండేసే ఈ వార్త చెబుతుంది:

ఎన్‌కౌంటరైపోయిన శ్రీనివాస్ తల్లిదండ్రులు అతడి శవాన్ని తీసికెళ్ళేందుకు నిరాకరించారు. 
వాళ్ళబ్బాయి చేసిన పని, అతడు తెచ్చిన అప్రదిష్ట, అతని జీవితం అంతమైపోయిన విధానానికి ఆ అమ్మానాన్నలు ఎంతగా క్షోభించారో పాపం! ఎంత కష్టం!
---------------------------------------------------------------------
ఇక ఎన్‌కౌంటరు గురించి: పోలీసులు చేసిన పని చట్టబద్ధంగాదు. వాళ్ళ విచ్చలవిడితనానికి నిదర్శనం. కానీ ఎన్‌కౌంటరు పట్ల నేను వ్యతిరేకంగా స్పందించలేకున్నాను. అలాంటి యాసిడు దాడి మరొకరు చెయ్యాలంటే ఈ ఎన్‌కౌంటరు తరవాత మరి కాస్త ఆలోచిస్తారు.

శిక్ష గుర్తొచ్చి నేరం చేసేవాడు ఆగుతాడా అని అనేవాళ్ళకు నాదో మనవి: క్షణికావేశంలో నేరం చేసేవాళ్ళ సంగతి పక్కనబెడదాం.. పదహారు సార్లు రిహార్సళ్ళు వేసుకుని మరీ దాడి చేసేవాడికి ఈ ఎన్‌కౌంటరు గుర్తొస్తే ఆగుతాడేమో!!

28 కామెంట్‌లు:

 1. చదువరి గారు, ఎప్పటి లాగానే మీ ఈ టపా కూడ నాకు 100% కాదు 200% నచ్చిందండి.
  Actually I am curiously waiting for your response on this issue after seeing the post on the same issue in SARIGAMALU blog.:) :)

  రిప్లయితొలగించండి
 2. కానీ ఎన్‌కౌంటరు పట్ల నేను వ్యతిరేకంగా స్పందించలేకున్నాను... నిజాయితీగా చెప్పారు. అబినందనలు.

  రిప్లయితొలగించండి
 3. యాసిడ్ దాడి దారుణమైనదీ,గర్హించదగినదే.కాదనను.ఎన్కౌంటరును కూడా అంతకంటే తీవ్రంగా పరిగణించి ప్రతిఘటించడం కూడా అందరూ చేయాలన్నదే నా అభిప్రాయం.

  రిప్లయితొలగించండి
 4. చాలా బాగా చెప్పారు. "నా జీవితం నాశనమైపోయినా ఫర్వాలేదు. నన్ను మోసం చేసిన ఆ అమ్మాయి మాత్రం బ్రతకడానికి వీళ్ళేదు". ఇది సినిమాల్లో అమ్మాయి చేతిలో మోస పోయిన ప్రేమికుడి నుండి తరచుగా వినిపించే డైలాగు.

  ఇక ఇటువంటి ఎన్ కౌంటర్ల వల్ల కొన్ని సార్లు మంచే జరగవచ్చు. సందర్భం వేరైనా ఒక ఉదాహరణ: నేను B.Tech చదివిన కాలేజీలో కుల ఘర్షణలు ఎక్కువగా జరుగుతుండేవి. కాని ఒక ఫ్రొఫెసర్ తనకున్న పలుకుబడితో అకాడమిక్ విభాగాన్ని తన చేతిలోకి తీసుకొని, కాలేజీలో ర్యాగింగ్ చేసేవాన్ని, కులం పేరుతో గొడవలు పడే వాన్ని, పరీక్షల్లో పాస్ చేయకుండా ఆపేసేవాడు. ఇలా కొద్ది మంది జీవితాలు నాశనమయ్యాయి. ఆ దెబ్బకు భయపడి కాలేజీలో కుల ఘర్షణలు లేకుండా పోయాయి. ర్యాగింగ్ కూడా తగ్గిపోయింది. కొద్దిమంది జీవితాలు నాశనమైనా, చాలా మంది బాగుపడ్డారు. ఎన్ కౌంటర్ల వల్ల కూడా ఇటువంటి ఫలితం కొద్దో, గొప్పో వుంటుందని నా అభిప్రాయం.

  ఇక సినిమాల్లో వేసుకునే డ్రెస్సులు హీరోయిన్లే కాదు, ఈ మధ్యకాలంలో మధ్యతరగతి అమ్మయిలు కూడా వేసుకుంటున్నారు. ఇక్కడికొచ్చిన కొత్తలో ఒకసారి మా క్లాసులో ఒకమ్మాయి, తన అండర్ వేర్ కనిపించేలా డ్రెస్ వేసుకుని వస్తే, నేను, మా ఫ్రెండు చాలా ఇబ్బంది పడ్డాము. ఇప్పుడా సమస్య లేదులెండి. ఎందుకంటే అటువంటి వాటికి బాగా అలవాటు పడిపోయాము. ఇంకోసారి మా ఈతకొలనులోకి ఒకమ్మాయి "టూపీస్" వేసుకుని వస్తే, అటువంటి డ్రెస్సులు వేసుకురావద్దని, నిర్వాహకులు ఆ అమ్మాయికి చెప్పి పంపించారు.

  "అసలు నేరస్తులు" విషయంలో నేను కూడా మీతో ఏకీభవిస్తున్నాను.

  రిప్లయితొలగించండి
 5. You said that films are spoiling the people, then what is the role of Censor board? and who is controling censor bord/ nominating the members of censor board ( Govt ). Nobody pointing out failure of censor board (i.e. failure of Govt.) here.

  రిప్లయితొలగించండి
 6. టపా బావుంది చదువరి గారు...

  పాకుడు పట్టిన బుర్రల్లో గుఱ్ఱపు డెక్కలు మొలిపించటానికి మనం ప్రయత్నం చెయ్యక్కరలా.....దానంతటదే చిన్న తొట్టిలో వటవృక్షం అవుతుంది...

  రిప్లయితొలగించండి
 7. Good post.
  ఇప్పటిదా ఈ సమస్య. తా చెడ్డ కోతి వనమెల్లా చెరిచిందట. మగ స్నేహితులు, శరీరానికి అంటుకు పోయే దుస్తులు చాల కామన్ అన్నట్టు అందరు అనుకునేలా చేసేవాళ్ళు కొందరు ప్రబుద్దులు(అమ్మయిలే). పధ్ధతి గా వుండే వాళ్ళని కూడా చెడగొడుతూ వుంటారు వీళ్ళు. అదేమంటే బ్రెయిన్ వాష్ అని స్పష్టం గా చెప్పేవాళ్ళు.

  రిప్లయితొలగించండి
 8. Many years ago on a newsgroup (now defunct) I voiced my VERY strong opinion about movies - and those who form committees, forums, fans associations etc and people flamed me at their highest pitch. My opinion was that movies project our culture and NOT vice versa. But they said movies ARE our culture. Those who argued included IITians (famed) and physicians, psychiatrists and so on.

  I concluded to myself never to speak on that topic again but this post made me comment here. Movies are NEVER our culture. They are a medium for junka$$ people who flunk out of schools to become directors, musicians etc and make money. Whether you do a research on how a particular character is changing over 3 of an idiot's movie and get a masters degree or not, the basic rule remains the same - make quick buck. And in that process they would stoop to any low level. And push down our throats any kind of pill. If we do not swallow our noses will be blocked so we must swallow. Other "PROMINENT" bloggers just fan the flames so that this pills further go down our throats, with their great research on Ram Gopal Varma or another junk idiot. If that varma is an idiot, this prominent blogger is an equal if not bigger idiot.

  The encounter is fine. These moron bastards have no right to throw acid on anyone. I am happy they are dead but would have been more happy if their faces were given an acid treatment first and then paraded in the town before shooting them. So police were 50% successful in that process. Imagine what Ravana would have done if it happened in his Kingdom. Err, btw do we not have our ravana rajyam now?

  I detest and congratulate the police for their earlier failure on PraNita's first complaint to nab the guys and then subsequent enounter. And what the hell this guy is named after the most famous God Srinivas. What a dourBAgyam!

  Finally congratulations to the father who did not want to see the son's deadbody. I am with you pal, you never had a son that did such a ghostly act. He was never like a human being.

  రిప్లయితొలగించండి
 9. చదువరి గారూ..
  వార్తా పత్రికల గురించీ, సినిమాల గురించీ, టీవీల గురించీ బాగా చెప్పారు.
  అసలు అమ్మాయిల వస్త్రధారణ విషయంలో చివరికి ఏ పరిస్థితి వచ్చిందంటే..ఎలాంటి బట్టలేసుకున్నా గానీ.. వింతగా అనిపించట్లేదు.. ఎందుకంటే.. టీవీల్లోనూ, సినిమాల్లోనూ, బయట రోడ్ మీదా..పెద్ద తేడాలు కనిపించట్లేదు. అందరూ ఒకలాగే తిరుగుతున్నారు. చూసీ చూసీ జనాలకి కూడా అలవాటయిపోయింది.. గత నాలుగైదు ఏళ్ళుగా టీవీ చూడకపోయినా.. టీవీలు బాగా శృతి మించిపోతున్నాయని మీ టపా చూసి బాగా అర్ధం అయ్యింది నాకు.
  ఈ రకంగా మనం దినదినాభివృద్ది అయిపోతుంటే.. అసలు ఇంకా ముందు ముందు ఎన్ని ఘోరాలు చూడాలో, వినాలో అని భయంగా ఉంది నాకయితే :(

  రిప్లయితొలగించండి
 10. మీకు మరో విషయంలో అభినందనలు చెప్పాలి.
  లోక్ సత్తా జయప్రకాశ్ గారిని సపోర్ట్ చేస్తూ బ్లాగ్లోకంలో నేను చూసిన మొదటి వ్యక్తి మీరే..
  చాలా సంతోషంగా ఉంది :)

  రిప్లయితొలగించండి
 11. మీరింకా ఇలాంటి టీవీ ప్రోగ్రాంలే చూస్తున్నారా? నేను చూసే వాటిల్లో చాల వరకు బట్టలే ఉండవ్. అపార్ధం చేసుకోకండి. డిస్కవరీ, యానిమల్ ప్లానెట్ ఛానెల్స్ నే ఎక్కువ చూస్తా. తోటరాముడు అన్నట్లు 'సూర్య ' టీవీ ప్రోగ్రాములు కావు. మాకెందుకో అవి రావు :( సీరియస్ టపా లో సోది కామెంట్లేందని తిట్టుకోకండి. ఇప్పటికే చాలా కామెంటి లైట్ తీసుకున్నా! అనవసరం అనిపిస్తే నిర్ధాక్షిణ్యం గా తొలగించండి.

  రిప్లయితొలగించండి
 12. varangal..sangatana..amanushaminadi..nerastulaki..tagina siksha pdindi.deeni taruvataina...ammayeelanu vedinchadam agalani korukuntunnanu.neram jarigina ventane siksha padite..inka evvaru neram cheyadaniki sahasam cheyyaru.
  meeru chala baga rasaru......
  prema anedi balavantanga kalagadani na nammkam. deeni pi mee abiprayam korutunnanu

  రిప్లయితొలగించండి
 13. శ్రీనివాస్ తల్లిదండ్రులు అతడి శవాన్ని తీసుకెళ్ళకపోవడానికి కూడా మీడియానే కారణం. ఎంత దుర్మార్గుడైనా తల్లికి బిడ్డే! అందునా దార్ణంగా చనిపోయిన తర్వాతైనా అతడి మీద ఉన్న కోపం పటాపంచలవుతుంది. కానీ శవాన్ని తీసుకెళితే మన తొమ్మిదో టీవీ వాడొ మరొకడో "కసాయి కొడుక్కి గౌరవంగా అంత్యక్రియలు చేసిన తండ్రి!" అనో మరో హెడ్డింగో పెట్టి వాళ్ల జీవితాల్లోకి చొచ్చుకుపోడూ? జనాన్ని వాళ్ళ మీదికి ఉసిగొపలడూ?

  ఎన్ కౌంటర్ ని చూసో, మరణ శిక్షను చూసో నేరాలు చేయాలనుకునే వారు మారతారనుకోవడం హాస్యాస్పదం! పదహారు సార్లు రిహార్సల్ చేసిన వాడైనా, ఇప్పుడు శ్రీనివాస్ దొరికాడు కాబట్టి తను దొరక్కుండా చేయడం ఎలాగో ప్రాక్టీస్ చేస్తాడు.తను వెనక ఉండి మరొకరి చేత చేయిస్తాడు. అంతకంటే పెద్ద తేడా ఉండబోదు.

  రిప్లయితొలగించండి
 14. "తను వెనక ఉండి మరొకరి చేత చేయిస్తాడు. అంతకంటే పెద్ద తేడా ఉండబోదు". సుజాత గారు, ముందుకు వచ్చి చేసేవాడు దొరకరండి. ఈ ఎన్ కౌంటర్ దెబ్బకి.

  రిప్లయితొలగించండి
 15. శ్రావ్య: :) (ఒకే ఒరలో రెండు కత్తులు!)
  చిలంకూరి విజయమోహన్, జల్లిపల్లి కృష్ణారావు, నాగప్రసాద్, అరుణ, మూడో అజ్ఞాత: నెనరులు
  నరసింహ: మీ అభిప్రాయాన్ని గౌరవిస్తాను
  నెనరులు
  మొదటి అజ్ఞాత: ఔను, సెన్సారు వాళ్ళ బాధ్యత కూడా ఉంది.
  రెండవ అజ్ఞాత: సినిమాల గురించి మీరు చెప్పింది నిజం
  మధురవాణి: నెనరులు. టీవీల్లో వచ్చే డ్యాన్సు కార్యక్రమాలు చూస్తే జుగుప్స కలుగుతుంది.
  సత్య: :)
  నవ్య: ప్రేమ మీద నా అభిప్రాయమా? :) ఇవ్వాళ అదో ఫ్యాషనైపోయింది. నల్లకళ్ళజోడు పెట్టుకోటం, కొత్తరకం బూట్లో, గడియారమో పెట్టుకొని బడాయిలు పోతామే అలాగే ప్రేమిస్తున్నామని చెప్పుకోటం కూడా!
  సుజాత: మీ వాదనను కొంతవరకు ఒప్పుకుంటాను. రెటమతంగా ఉందని అనుకోకపోతే :) ... ఆలోచించండి - అసలు నేరాలకు శిక్షలు ఎత్తేసాం అనుకోండి, అప్పుడు నేరాలు పెరుగుతాయా తగ్గుతాయా? పోనీ యాసిడు పోసిన నేరానికి శిక్షగా పది రూపాయలు ఫైను కడితే సరిపోతుంది అని శిక్షాస్మృతిలో ఉందనుకోండి, యాసిడు ఘటనలు పెరుగుతాయా తగ్గుతాయా? (జేబులో పది రూపాయలున్న ప్రతీవాడూ యాసిడు పొయ్యకపోవచ్చు, కానీ యాసిడు పొయ్యదలచిన ప్రతీవాడూ పోసేస్తాడు - జేబులో పది రూపాయలుంటే చాలు!)
  రెడ్డి: ఆలోచన చేసినవాడు తప్పించుకున్నా, యాసిడు పోసినవాడు దొరుకుతాడు గదా అని మీ ఉద్దేశం అయితే.., -అవునండి, మీరు చెప్పేది నిజమే!

  రిప్లయితొలగించండి
 16. వంశీ మాగంటి: నెనరులు. వ్యాఖ్యలు రాయటంలో ఈ మధ్య మీరు ప్రవేశపెట్టిన శైలి బావుంటోంది. :)
  ఆ లింకు నన్ను ఆశ్చర్యపరచింది.

  రిప్లయితొలగించండి
 17. హైదరాబాద్ పుస్తక ప్రదర్శనలో ఈ- తెలుగు తెలుగు బ్లాగుల గురించి ప్రచారం చెయ్యడానికి మనకు అనుమతి దొరికింది.
  సమయం : శనివారం సాయంత్రం 6- 7
  వేదిక :పీపుల్స్ ప్లాజా, నెక్లేస్ రోడ్.
  దయచేసి, వీలు చేసుకుని హాజరవుతారని ఆశిస్తున్నాం.

  రిప్లయితొలగించండి
 18. చాలా బాగా చెప్పారు చదువరి గారు,
  కాని ఇందుకు బాధ్యత చాలమటుకు తల్లిదండ్రులది కూడా ఉంది అనిపిస్తుంది.

  రిప్లయితొలగించండి
 19. మంచి టపా. ఇలాటి స్ఫూర్తి జనాల్లో కలిగించే కథలూ, సినిమాలూ, టీవీ ప్రోగ్రాములూ రావాలి. ఎప్పుడు, ఎలా అంటే ఇలాటి అభిరుచులు గలవారు వదలకుండా పోరుతూ వుంటేనే...
  అలాటి రోజు రాగలదని ఆశిస్తూ,

  రిప్లయితొలగించండి
 20. చదువరి గారు,
  నేరాలకు శిక్షలు ఎత్తేయాలి అని "ఏ మతస్థులైనా" వాదించరు. ఇన్స్టంట్ ఎన్ కౌంటర్ల వల్ల నేరస్థుల మనస్థత్వం మారదు అనే నేను చెప్పాలనుకుంది. మారేదే నిజమైతే సమాజంలో మళ్ళీ మళ్ళీ నేరాలు జరగవుగా! మొత్తానికి నేను రెటమతస్థుల జోలికి రాకపోయినా నన్ను తీసుకెళ్ళి మతం ఇప్పించారన్న మాట. సరే, కానీండి!

  రిప్లయితొలగించండి
 21. సుజాత: "రెటమతంగా ఉందని అనుకోకపోతే " -- నా వాదన రెటమతంగా ఉన్నది అని మీరు అనుకోకపోతే... అని అర్థం. మీది రెటమతమని నేను అనలేదు. నే రాసినదానిలో ఆ అర్థం స్ఫురించినట్టు కూడా లేదు!

  రిప్లయితొలగించండి
 22. దొరక్కుండా చెయ్యడం కూడా మన టి.వి. వాళ్ళే నేర్పిస్తారు కదా మళ్ళీ నేరాలు ఘోరాలు అంటూ...

  రిప్లయితొలగించండి
 23. ఈ పాలక వర్గం ఎవరి కోసం? అని అడిగితే అది డబ్బున్న వాళ్ళ కోసం అని చెప్పుకోవాలి.

  1. పేదవారి పిల్లలు చదువుకునే గ్రామ పాఠశాలల్లో కూర్చోడానికి బల్లలు కూడా వెయ్యరు కానీ డబ్బున్న వాళ్ళ పిల్లలు చదువుకోవడనికి ఇంజినీరింగ్ కాలేజిలు కట్టిస్తారు.
  2. దళిత స్త్రీలని అగ్రకులం వాళ్ళు రేప్ చేస్తే వాళ్ళని ఏమీ చెయ్యరు కానీ డబ్బున్న వాళ్ళ అమ్మాయిల మీద ఏసిడ్ పోస్తే మాత్రం ఎంకౌంటర్ చేసి చంపేస్తారు.
  3. పేదవారు ప్రయాణించే బస్సు చార్జిలు పెంచేశారు కానీ డబ్బున్న వాళ్ళు ప్రయాణించే విమాన చార్జిలు తగ్గించారు.

  డబ్బున్న వాళ్ళు అడక్కపోయినా వాళ్ళ కోసం ఎర్ర తివాచీ పరచడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు మన పాలకులు.

  రిప్లయితొలగించండి
 24. >>>
  పంతుళ్ళను ఎగతాళి చేసే పిల్లకాయలు. అసభ్యకరంగా, అనాగరికంగా, వెకిలిగా ప్రవర్తించే పంతుళ్ళూ పంతులమ్మలు,
  >>>

  సినిమాలలో ఆడ లెక్చరర్లు స్టూడెంట్స్ దగ్గర లూజ్ గా బిహేవ్ చేస్తున్నట్టు చూపిస్తున్నారు. ఈ సినిమాలు లెక్చరర్ల భర్తలు చూసినప్పుడు నిజ జీవితంలో వాళ్ళు కూడా తమ భార్యలని అనుమానించడం జరుగుతుంది.

  రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు