6, డిసెంబర్ 2008, శనివారం

మన భద్రతే మనకు ముఖ్యం

దేశానికి నాయకుల ప్రాణాలు ఎంత ముఖ్యమో, సామాన్యుడి ప్రాణాలు కూడా అంతే ముఖ్యం -తేడాయే లేదు. ఆఫ్టరాల్ నాయకుడికే జెడ్లూ, జెడ్‌ప్లస్సులూ ఉంటే అతణ్ణి తయారుచేసిన సామాన్యుడికెన్ని ఉండాలి? ముందు మనమీ సంగతిని ఒప్పుకుంటే ఇక ముందుకు పోవచ్చు.

---------------------------------------------
నిఘా వర్గాల నివేదికలను బట్టి, విమానాశ్రయాలను, ఓడరేవులను, భవనాలను, నేలను, నీటిని, గాలిని, కాపలా కాసి, దాడి చేసే ఉగ్రవాదులను ఎదుర్కొని, యుద్ధాలు చేసి, బాంబులను నిర్వీర్యం చేసి, వాళ్ళను చంపి, లేదా పట్టుకుని, జైల్లో పెట్టి, కేసులుపెట్టి,..
ఈ పద్ధతిలో ఉగ్రవాదాన్ని అరికట్టడం అసంభవం - కనీసం మన దేశంలో!

ఉగ్రవాదులకు ముఖ్యమైన అవసరాలు - మనుషులు, డబ్బులు, ఆయుధాలు, పేలుడు పదార్థాలు. వీటిని అందకుండా చేస్తేనే ఉగ్రవాదాన్ని అరికట్టగలం. కింది చర్యలు తీసుకోవాలని నా ఉద్దేశ్యం..

 1. పౌరుడి భద్రత తరవాతే - కులం, మతం, సామాజిక వ్యవస్థ, రాజకీయాలు, విదేశాలతో సంబంధాలు,.. - ఏ అంశమైనా సరే! ఇక్కడో సంగతి చెప్పుకోవాలి: ఈ మధ్య మనదేశానికి చెందిన ఓ ప్రభుత్వేతర సంస్థ నుండి కెనడాకు వెళ్తున్న ఇద్దరు వ్యక్తుల్లో ఒకరిని పారిస్‌లో ఎయిర్ కెనడా విమానం ఎక్కకుండా దింపేసారు. పాస్‌పోర్టులో ఏదో అనుమానాస్పదంగా ఉందని కారణంగా చెప్పారు - కానీ, ఖచ్చితంగా అదేంటో చెప్పలేదు. రెండో వ్యక్తిని పోనిచ్చారు -అతని పేరు దినేష్ మిశ్రా, ఆపేయబడ్ద వ్యక్తి కమాల్ హుస్సేన్. కమాల్ అదే పాసుపోర్టుతో భారత్ నుండి పారిస్‌దాకా ఇబ్బందేమీ లేకుండానే వెళ్ళాడు, అక్కడ మాత్రం తేడా కనిపించింది. వాళ్ళు చెప్పిన కారణం ఏమైనప్పటికీ (అసలు కారణమేంటో ఊహించలేనంత కష్టమేమీగాదు) - వాళ్ళకు అనుమానం వచ్చింది, మొహమాటాలేమీ లేకుండా దింపేసారు, ఎవ్వరూ మాట్టాడలేదు. "ముస్లిము కాబట్టి దింపేసారు" అని గోల చేస్తారేమో అని వాళ్ళు ఆలోచించలేదు, దింపేసారంతే! అంత గట్టిగా మనమూ ఉండాలి. భద్రత విషయంలో సర్దుకుపోయే ప్రసక్తే ఉండకూడదు.. హిందువైనా ముస్లిమైనా, మరొకరైనా కటువుగా ఉండాల్సిందే! మంత్రిగా అమెరికా వెళ్ళిన జార్జి ఫెర్నాండెజ్‌ను ఎలా శోధించారో మనకు తెలిసిందే. అంచేత భద్రత తరవాతే ఏదైనా.
 2. దేశం సంతబజారేమీ కాదు, ఎవడుబడితే వాడు వచ్చిపోయేందుకు.. పాకిస్తాను నుండి, బంగ్లాదేశు నుండి ఎట్టాబడితే అట్టా వచ్చేస్తున్నారు. వాళ్ళకి ఇక్కడ చక్కగా ఉంటానికీ తింటానికీ సకలసౌకర్యాలూ సమకూరుతున్నాయి. ముందీ ఆశ్రయం ఇచ్చే ఇంటిదొంగలను లోపలెయ్యాలి. బయటినుండి వచ్చినవాళ్ళని వెతికి పట్టుకుని నిర్మొహమాటంగా వెనక్కి పంపాలి. పోనివాణ్ణి జైల్లో వెయ్యాలి (ఈ దేశాలు ఎలాగూ వాళ్ళని రానివ్వవు; శత్రు (కిరాయి) సైనికుల శవాలకు కూడా శాస్త్రోక్తంగా శ్రాద్ధకర్మలు నిర్వహించే సంస్కారం మనకుందిగానీ, తమవాళ్ళను తమవాళ్ళేనని చెప్పుకునే ధైర్యం లేని దేశాలవి) జన సమూహపు భద్రత ముఖ్యం, ఎవరో కొందరి - అందునా దొంగల, ఉగ్రవాదుల - మానవహక్కులు కాదు. మానవహక్కుల గురించి మాట్టాడినవాణ్ణి, ముందు గ్వాంటనామో బే గురించి తెలుసుకో బే అనాలి. 
 3. కొందరు రాజకీయనాయకులు నేరస్తులకు వత్తాసుగా నిలబడుతూంటారు. మన రాష్ట్రంలోనే ఒక మంత్రి ఒక నేరస్తుడి ఇంటికెళ్ళి పరామర్శించాడు. ఆ సంగతి ఇప్పటికి అనేకసార్లు పేపర్లలో వచ్చింది కూడాను. అటువంటి వాళ్ళని వ్యవస్థలో ఏ పదవినీ చేపట్టకుండా అనర్హులుగా ప్రకటించాలి. అందుగ్గాను..
 4. రాజకీయాల్లో నేరస్తులను ఏరెయ్యడానికి సుప్రీమ్ కోర్టు చేసిన సూచనలను పాటించి, తగు చట్టం చెయ్యాలి. ఇది చెయ్యకపోతే ఈ రాజకీయ నాయకులకు భద్రతాచర్యలపై చిత్తశుద్ధి లేనట్టే. ఈ చట్టాన్నే గనక కట్టుదిట్టమైన రూపంలో తెస్తే, కాంగ్రెసు ఎంత వెధవాయి పార్టీ అయినా సరే.. ఈ ఒక్క పని చేసినందుకు నా వోటేసేస్తాను.
 5. భద్రతావ్యవస్థలో రాజకీయాల జోక్యం కూడదు. లేదా రాజకీయాల జోక్యం లేని భద్రతావ్యవస్థ ఉండాలి. అంత తేలికైన సంగతి కాదిది.. కానీ మనకు ఎన్నికల కమిషను, విజిలెన్సు కమిషను వంటి రాజ్యాంగ వ్యవస్థలున్నాయి. ఇవి మిగతా ప్రభుత్వ విభాగాల్లాంటివి కావు. వీటి మీద ప్రభుత్వ ఆజమాయిషీ ఉండదు. అలాగే రాజకీయ జోక్యం ఉండకూడని ప్రతిపత్తి కలిగిన జాతీయ భద్రతాసంస్థ ఒకటి ఉండాలి.
 6. పోలీసు వ్యవస్థను సంస్కరించాలి. ప్రస్తుతం పోలీసు శాఖ అంటే మనం దూరందూరంగా ఉంటాం. వాళ్ళకు ప్రజలతో అనుబంధం తక్కువ. బహుశా పోలీసు శాఖకు అనుబంధంగా ప్రజలతో మమేకమై ఉండే ఒక పారా పోలీసింగు వ్యవస్థ ఉంటే బాగుంటుందనుకుంటా. స్థానికంగా సమాజంలో జరుగుతూండే మార్పులను ఈ వ్యవస్థ మరింత చురుగ్గా పసిగట్టగలుగుతుంది. సున్నితమైన ప్రాంతాల్లో ఈ వ్యవస్థ మరింత ప్రభావవంతంగా ఉంటుంది. ముంబై దాడికి సంబంధించి అనుమానం మీద తిరువూరులోని ఒక జాలకేంద్రపు స్వంతదారును అదుపులోకి తీసుకున్నారట. పారాపోలీసుల వలన ఈ సంగతి సంఘటనకు ముందే తెలిసి ఉండేదేమో!
 7. భద్రతలో కన్నాలు ఏర్పడేందుకు ముఖ్యకారణం... ఫెటీగ్! అనుమానితుల కోసం, అనుమానాస్పద వస్తువు లేదా అంశం కోసం చూస్తూంటారు. రోజూ దొరుకుతాయా? దొరకవు. పదేపదే బాంబులు పెట్టారన్న ఫోన్లొస్తూంటాయి.. అన్నీ నాన్నా పులి కథలే! కానీ ఎక్కడో ఒకదాన్లో నిజముంటుంది. ఆ సరికి పోలీసులకు ఈ వెతుకులాట మామూలైపోతుంది.. అలసత్వం ఏర్పడుతుంది. నిజంగా దాడి జరిగే సమయానికి ఎదుర్కోలేని పరిస్థితిలో ఉండవచ్చు. ఏ షాపులోనో చూస్తూంటాం.. అక్కడొక ద్వారం పెట్టి ఉంటుంది, మనం అందులోంచి వెళ్తాం, అది కీబామని అరుస్తూనే ఉంటుంది, కానీ ఎవ్వరూ పట్టించుకున్నట్టుండరు. అసలు ఆ తోరణం లోంచి వెళ్ళకపోయినా అడిగేవాడుండడు. బహుశా దీనికి కారణం ఈ ఫెటీగేననుకుంటా. సరైన శిక్షణ పొందిన సిబ్బంది, సరిపడినంతమంది, సరైన పరికరాలూ ఆయుధ సంపత్తితో భద్రత కోసం సిద్ధంగా ఉండాలి..
 8. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు చెబుతూంటారు. భద్రతలో మీరూ భాగస్వాములే అని అంటారు. చెప్పేందుకు బానే ఉంటాయి గానీ, మన సామాజిక వ్యవస్థలో ఇవి సాధ్యమవుతాయా? ఫుట్‌పాతుల మీద నిద్రపోయేవాళ్ళు, బాంబులకు భయపడితే ఎక్కడ పడుకుంటారు? నిరుపేదలు, కేవలం చెత్త కుండీలు, చెత్త కుప్పలలో దొరికే ఇనుప, ప్లాస్టిక్కు వ్యర్థాలను సేకరించి, అమ్ముకుని, జీవనం గడిపేవారు అక్కడ బాంబులుంటాయేమోనని వాటి జోలికి వెళ్ళకపోతే వారి జీవనం గడిచేదెలా? ఇవి కేవలం ఉదాహరణలే! ఇలాంటివి మరెన్నో! కేవలం బాంబులు పేల్చడమే, మనుషులను చంపడమే, ప్రజలను భీతావహులను చెయ్యడమే ఉగ్రవాదుల ధ్యేయమైతే, మనమెన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే.., వాళ్ళు ఆ పనులు చెయ్యగలరు - ఆ అవకాశం వాళ్ళకు ఉంటూనే ఉంటుంది. అంచేత ఉగ్రవాదానికి మందు ఉగ్రవాదులు, వాళ్ళ పోషకులు లేకుండా చెయ్యడమే! వాళ్ళకు బాంబులు, ఆయుధాలు దొరక్కుండా చెయ్యడమే!
 9. బాంబుల కోసం పేలుడు పదార్థాలు ఎంత తేలిగ్గా దొరుకుతాయో మనదేశంలో! పేలుడు పదార్థాలు వాడే సంస్థలు అనేకం ఉన్నాయి. ఉదాహరణకు గనుల కంపెనీలు! వాళ్ళకు అనేక నిబంధనలుంటాయి.. ఎంతబడితే అంత పేలుడు పదార్థాల నిల్వలు పెట్టుకోకూడదు, వాటి వాడకానికి సంబంధించిన అన్ని వివరాలనూ ప్రభుత్వానికి తెలియబరచాలి,.. ఇలాగ. ఇన్ని నిబంధనలున్నా, ఈ సంస్థలనుండి పేలుడు సరంజామా మాయమౌతూంటుంది. నక్సలైట్లు ఇలా కూడా పేలుడు పదార్థాలను సేకరిస్తూంటారు. జనాలను లోభపెట్టో భయపెట్టో ఈ సంస్థలనుండి సరంజామా సేకరించడం తేలిక. ఈ వ్యవస్థను, సదరు సంస్థల వ్యవహారాలను కట్టుదిట్టం చెయ్యాలి.
 10. 'అతడికి ఫలానా విధంగా అన్యాయం జరిగింది. అంచేత పాపం అతడు ఉగ్రవాది అయ్యాడు, తప్పేముంది?', 'ముస్లిము ఉగ్రవాదులు కల్లోలం సృష్టిస్తున్నారు కాబట్టి, హిందువులూ తుపాకులు పట్టొచ్చు', 'గుజరాతులో జరిగినదానికి స్పందనగానే ముస్లిములు ఉగ్రవాదులౌతున్నారు' - లాంటి వాదనలు వింటూ ఉన్నాం. ఈ వాదనలు ఉగ్రవాదుల పనులను అన్యాపదేశంగా సమర్ధిస్తూంటాయి. వీటిని ఆపాలి.
 11. అవినీతి, లంచగొండితనం - కనీసం భద్రతావ్యవస్థల్లోనైనా - అరికట్టాలి.
 12. ప్రతీ పౌరుడికీ ఏకీకృత వ్యక్తిగత గుర్తింపు కార్డు ఉండాలి. మన దేశంలో ఇది ప్రవేశపెట్టడం, దాన్ని నిర్వహించడం కష్ట సాధ్యమే. కానీ దీర్ఘకాలిక దృష్టిలో ఇది అవసరం.
 13. ముందే మన సమాజంలో అనేక భేదభావాలున్నాయి. ఉన్నవాటితోటే సతమతమౌతూంటే, అది చాలవన్నట్టు కొత్తవి పుట్టుకొస్తున్నాయి. ఇలాంటివాటిని అరికట్టాలి. ఉదాహరణకు, మత మార్పిళ్ళు. 
ఉగ్రవాదానికి అన్నిటికంటే ముఖ్యమైన ముడిసరుకు, ప్రేరేపక శక్తి - మతం!   
మతం పట్ల ముస్లిముల ధోరణి గురించి ఇక్కడ చెప్పుకోవాలి (ఇక్కడ రాస్తున్నది ఎక్కువమంది ముస్లిముల ధోరణి గురించి, ప్రతీ ఒక్ఖ ముస్లిమూ ఇలాంటివారేనని అర్థం కాదు). ముస్లిములను మత ప్రాతిపదికన ఏర్పడిన ఒకే వోటు బ్యాంకుగా రాజకీయ నాయకులు చూసే స్థాయికి ముస్లిములే తెచ్చుకున్నారు. ప్రతీదాన్నీ మతంతో ముడిపెట్టే ముస్లిముల విధానం వలననే ఈ పరిస్థితి వచ్చింది. వాళ్ళకి ఈ ప్రపంచంలో అన్నిటికంటే మతమే ప్రధానమైనది. మనమంతా భారతీయులం అనే భావన కంటే మనమంతా ముస్లిములం అనే భావన ఎక్కువ. ఒక ఉదాహరణ చూడండి..

'ముస్లిములలో అభివృద్ధి తక్కువ', 'దేశ అభివృద్ధి ఫలాలు వాళ్ళకి దక్కలేదు.', 'సామాజికంగా బలహీనంగా ఉన్నారు' అని చెబుతూ, వాళ్ళు ఉగ్రవాదం వైపు మొగ్గు చూపడానికి ఇదో కారణం అని లౌకికవాదులమని అనుకునే కొందరు చెబుతూంటారు. అబివృద్ధిలో వెనకబడింది ముస్లిములేనా? హిందువులు వెనకబడిలేరా? వాళ్ళు ఉగ్రవాదులుగా మారారా? దేశమ్మీదబడి సాటి దేశీయులనే చంపుతున్నారా? పరాయి దేశస్తులతో కలిసి కుట్రలు చేసి, విధ్వంసాలకు పాల్పడుతున్నారా? లేదే! మరి ముస్లిములలో ఎందుకుందా ధోరణి? ముస్లిములను బయటి దేశీయులతో కలిపే బంధం మతం తప్ప మరోటి ఉందా? లేదు!

అంటే, మన దేశం మన ప్రజలు అనే భావన కంటే మన మతం అనే భావనకే ఇక్కడ ప్రాముఖ్యత ఇచ్చారు. మతపరమైన ఐక్యతాభావన ఎంత బలంగా ఉంటుందంటే.. సద్దాం హుసేన్ను ఉరితీస్తే, మన ఊళ్ళో నిరసన ప్రదర్శనలు, ధర్నాలు చేస్తారు. మన దేశంలో ఏదైనా దుర్ఘటన జరిగితే అంతలా స్పందించరు.

ముస్లిములను కేవలం ఓటుబ్యాంకుగా చూస్తారు రాజకీయులు. హిందువు, ముస్లిము, గొప్పా బీదా, అగ్రకులస్తుడు, నిమ్న కులస్తుడు - రాజకీయులకు ఎవరైనా ఓటరే! కానీ మిగతావాళ్ళతో వ్యవహరించడంలోను, ముస్లిములతో వ్యవహరించడంలోను రాజకీయుడు తేడా చూపిస్తాడు. మీ మతస్తులకు అన్యాయం చేస్తున్నారు అంటూ, ప్రతీ విషయంలోను మతాన్ని వేదికగా చేసుకునే మాట్టాడతాడు. రంజాను రోజుల్లో విందులిచ్చి, షేర్వాణీ, టోపీ పెట్టుకుని పేపర్లలో పడితే వాళ్ళు ముస్లిముల హితైషులని లెక్క. సద్దాము హత్యను విమర్శిస్తే వాళ్ళు ఆప్తులు. తస్లీమా నస్రీనుకు ఆశ్రయం ఇస్తే వాళ్ళు ముస్లిము విరోధులు, కాఫిర్లు, మతవాదులు, లేదంటే స్వచ్ఛమైన లౌకికవాదులు. అమెరికాతో అణు ఒప్పందాన్ని కూడా ముస్లిముల కోణం నుండే చూస్తారు మన నాయకులు.

ఇలా ముస్లిములను బుజ్జగిస్తూ వచ్చి, ఈ రాజకీయులు ముస్లిములకు ఎంత మంచి చేసారోగాని, ముస్లిముల మతభావనల పట్ల - జాతీయత కంటే మతమే ముఖ్యమన్న వాళ్ళ ధోరణి పట్ల - నాబోటి సామాన్యుల్లో కూడా వ్యతిరేకతను కలిగించగలిగారు. మన కుహనా లౌకికవాదులు ఎంత కాదన్నా ఇది నిజం! ముస్లిములు ఈ సంగతిని గ్రహించి తమ ధోరణిని మార్చుకుంటే వాళ్ళు మిగతా భారతీయులతో కలిసిపోగలరు. లేకపోతే ఈ రాజకీయుల క్రూర క్రీడలో పావులైపోతూనే ఉంటారు, లౌకికవాదులంటున్నట్టు పరాయీకరణకు గురవుతూనే ఉంటారు.

73 కామెంట్‌లు:

 1. excellent.....even dignified people like shabana azmi uses this muslim weapon irrespective of honours given to her by the
  goverment

  రిప్లయితొలగించండి
 2. Hello !! Time to wakeup !! Dream is over :P
  Nothing's going to happen !!
  We're doomed.

  రిప్లయితొలగించండి
 3. సరే!
  "భద్రతావ్యవస్థలో రాజకీయాల జోక్యం కూడదు. లేదా రాజకీయాల జోక్యం లేని భద్రతావ్యవస్థ ఉండాలి. అంత తేలికైన సంగతి కాదిది," అని మీరు సెలవిస్తున్నారు. అలాంటి రాజకీయవేత్తని ఎన్నుకునేది ఎవరు? వారి జోక్యం లేకుండా
  ఆలాంటి వ్యవస్థని ఏర్ఫాటు చేసేది ఎవరు?

  రిప్లయితొలగించండి
 4. మగవాడు: మనమేనని నా ఎరుక. ఎవరో మీరు సెలవివ్వండి!

  రిప్లయితొలగించండి
 5. @చదువరి:కదా! మరి మనం ఎన్నుకునే వాళ్ళకి ఉండవలసిన అర్హతలు ఏవిటి?

  రిప్లయితొలగించండి
 6. చెప్పదలచినదేంటో సూటిగా చెప్పండి

  రిప్లయితొలగించండి
 7. @ చదువరి:
  ఒక మతన్నో, ఒక దేశాన్నో నిందించి లాభం లేదు. ఈ రోజున ఈ మతం. మొన్న మరొక జాతి. అటు మొన్న ఒక భాష. రేపు మరొకటి.
  ఈ ఆవేశ, కావేషాలు, భయాలు, దిగుళ్ళు మనల్ని నీరస పరుస్థాయి. అవి కాదు మనకి కావలిసింది. ఒక నిర్దుష్టమైన కార్యాచరణ ప్రణాలిక.

  అందరికి తెలిసిందే. నిఘా సంస్థలు వైఫల్యం. రాజకీయవేత్తల స్వార్ధం. వ్యవస్థలో లొసుగులు. సమాజంలో ఆర్ధిక సామాజిక అసమానతలు. ఇంకా మరేన్నో కారణాలు.

  జుత్తు పీక్క్కుంటూ కూర్చోవడం కాదు. అది చెయ్యాలి. ఇది చెయ్యాలి అని కాదు. పిల్లి మెడలో గంట కట్టాలి అన్నది నిర్వివాదాంశం. ఎవరు, ఎప్పుడు అన్నది ప్రశ్న.

  మనమే.
  ఇప్పుడే అది జవాబు.
  మరి కర్త్వ్యవ్యం.

  ఒక చక్కటి వ్యవస్థని ఏర్పాటు చేసుకోవాలి. ఒక చక్కని రాజకీయ వాతావారణం సృష్టించుకోవాలి. దాన్ని కాస్త నేర్పుగాను, ఓర్పుగాను చేసుకోవాలి.

  భయపడితేనో, దిగులుతోనో అలాంటివి సాధించలేము. మన ఆవేశాన్నో, ఆగ్రహాన్నో "వాడి" మీద చూపించిన తరువాత?
  కాబట్టి, ముందు:
  "మనం మారాలి.
  మనతో పాటు మన వ్యవస్థ మారాలి.
  ఆ వ్యవస్థకు తగిన నాయకులను కావాలి.
  అటువంటి నాయకులని మనం గుర్తించాలి.
  వారిని మనం ఎన్నుకోవాలి.
  మన చేతిలో ఓటు ఉంది.
  రేపటి ఎన్నికల రణ రంగంలో మనం ఒక సుక్షితుడైన ఎన్.ఎస్.జి కంమెండో లాగ ఒక చక్కని నాయకుడిని ఎన్నుకుందాం.
  ఆ ఎన్నికలో, మన కోసం ప్రాణాలొడ్డిన వారందరిని స్మరించుకుంటూ - మన వ్యవస్థకు పట్టిన చీడపురుగులను ఏరి పారేసి వారిని తుదముట్టిద్దాం. శత్రుశేషం ఉంచరాదు.
  ఒక సరికొత్త బంగారు భవిష్యత్తుని నిర్మించుకుందాం. దాన్ని మన పిల్లలకందిద్దాం!
  అప్పుడే ఎన్.ఎస్.జి కమెండో ఉన్నికృష్ణన్ వీరోచిత మరణానికి మనం న్యాయం చేసినవారమవుతాం!
  దానికి ఇప్పటినుంచే ప్రణాళిక వేసుకుందాం.
  మీ చేతిలో ఓటు ఉంది.
  అదే మీ ఏ.కే 47.
  మీరు కూడా ఒక ఎన్.ఎస్.జీ కమాండొకండి.
  ఒక చక్కని నాయకుడిని ఎన్నుకోండి!"
  Quote లో ఉన్నది నా టపాలోని కొన్ని వాక్యాలు.

  రిప్లయితొలగించండి
 8. మగవాడు: చక్కగా, స్ఫూర్తివంతంగా చెప్పారు. అయితే...
  చక్కని నాయకుడిని ఎన్నుకుందాం అని చెప్పేసి ఆగిపోక, ప్రస్తుతం మనకున్న నాయకుల్లో ఒక్కరినో ఇద్దరినో - లేదా మీకు చక్కని నాయకులనిపించిన వాళ్ళందరి పేర్లనూ సూచించగలరు.

  తరవాత, చక్కని నాయకుని కోసం చూసి ఎన్నుకోవాలో ఎన్నికైన వాళ్ళచేతే అవసరమైన పనులు చేయించుకోవాలో కూడా చర్చిద్దాం.

  రిప్లయితొలగించండి
 9. @చదువరి: ముంబై ఘాతుకం నేపధ్యంలో వస్తున్న మీ వ్యాసపరంపరంతా నిరాశ,భయం,అపనమ్మకం,దిగులు,ఆవేశం,విద్వేషం నింపే దిశగా వుంటున్నాయేగానీ సమస్యకు సమాధానాలు వెతికే దిశగా వుండటం లేదు.

  దాదాపు హిందూవాద భావజాలంలాంటి మీ ఆలోచనల యొక్క ఉద్దేశం అదే అయినప్పుడు సమస్య లేదు.కానీ ఎవరైనా కొంత alternative ప్రతిపాదిస్తే వాళ్ళని pseudo-secularists లేదా hypocrites అనే ముందు మీలోని pseudo-hinduist (కొత్తపదమా!!), hypocrite ని ఒకసారి చూసుకోండి.

  రిప్లయితొలగించండి
 10. చదువరి గారు మీరు చెప్పింది సరే. మగవాడు గారు మీరు చెప్పినట్టు ఓటు వెయడంతోనే మన సమస్య తీరి పొతుందా. అధికారం లో కి వచ్చాక నాకు తెలిసి అందరూ దాపుగా ఒకటే. మరి అలాంటపుడు ప్రజల బాధ్యత ఏమిటి? మళ్ళి 5 సంవత్సరాల వరకు ఎదురు చూస్తు కూర్చొవలసిందేనా. ప్రజల కొసం ఏర్పడ్డ ప్రభుత్వాన్ని మన కోసం పని చేయించుకునేట్లు చేసెదెలా? పన్నుల రూపెణ ప్రజల నుండి వసూలు చేసిన ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చూసుకొనే బాధ్యత ఎవరిది? కొంచెం వివరించగలరా.

  స్నేహ

  రిప్లయితొలగించండి
 11. Mahesh,

  What exactly you want to tell here! When the problem is crystal clear what is the necessity to do R & D ? Ok Do you want to study the history why muslims are poor and not developed? If you are more interested you can go and so research and spare your life for the welfare the muslims.
  BTW what do meant by
  pseudo-hinduist (కొత్తపదమా!!), hypocrite ? Like you should everybody prompt for mulsims?

  రిప్లయితొలగించండి
 12. @చదువరి గారు,

  చాలామంచి వ్యాసాన్ని.. అందులో చక్కని విశ్లేషణను, అంతే చక్కని సూచనలను అందించారు. ధన్యవాదాలు!

  మీకు, మగవాడు గారికి మధ్యన ఆసక్తికరమైన చిన్నపాటి చర్చ జరిగినది. అందులో మీరిరువురూకూడా ‘ఓటు’, ‘ఎన్నికలు’ మొదలైన అంశాల మీద గాఢమైన విశ్వాసాన్ని ప్రకటించారు...మంచిది! అయితే, ఆ రెండూ కూడా ఈ వ్యవస్థలో అంతర్భాగాలే కదా! ఎన్నికలు పార్టీల కబంద హస్థాల్లో ఇరుక్కుపోలేదా?! పార్టీలు స్వార్థపరుల జేబుసంస్థలుగా మారలేదా?! ఓట్లు వేసేది మీ ఇరువురు లాంటి విజ్ఞులు మాత్రమే కాదుగదా! ఓటు విలువ తెలియని తాగుబోతులు, కరెన్సీ నోటుకు తన ఓటు అమ్ముకునే దౌర్భాగ్యులు, ఓటే వేయని పౌరుల మధ్యన మీలాంటి వారెందరు?

  ఈ దేశంలో మీరు.. నేను అంతా ఆశించే ఆ చక్కని నాయకులు లేకుండా పోలేదు. కానీ వారిని నాయకత్వక్రమంలో అగ్రభాగాన నిలుపగలదా ఈ వ్యవస్థ?! పరిపాలనా పగ్గాలను వారి చేతికి అందించగలదా ఇప్పుడున్న నిర్మాణం?! పోనీ అటువంటి చక్కని నాయకులు పార్టీలు పెట్టినా ఈ గుంట నక్కలు, ఈ తోడేళ్ళమధ్యన వారు నెగ్గుకు రాగలరా?!

  రిప్లయితొలగించండి
 13. @Mahesh I always have a doubt in my mind are you an Indian or an implant by Pakistan like a character in Kasonova novel of Yandamuri ? Don't take it as a personal attack :(

  రిప్లయితొలగించండి
 14. కత్తి మహేష్ కుమార్: మీరు హెజిమొనీ అనో మరోటో పేర్లు పెడుతున్నారుగానీ, విషయమ్మీద చర్చకు ఆసక్తి చూపడం లేదు. ఇప్పుడు సూడో హిందూయిస్టునన్నారు, కానీండి! నీకూ వాదన కోసం ఒకటుండాలి కదా అంటూ నా వాదనను తేలిక చెయ్యబోయినపుడే మీరు హిపోక్రైట్‌లా కనబడుతున్నారని అన్నాను తప్ప, మిమ్మల్ని బాధించాలని కాదు, ఆ రకంగా వాదించాలనీ గాదు.


  మీరిలా తీర్పులు ఇచ్చేసేకంటే, నేజెప్పిన దానిలో తప్పులు చూపెట్టి ఉంటే బాగుండేది. తప్పైతే ఒప్పేసుకుంటా.

  సరే, విషయానికొద్దాం.. నా గత జాబులో "మీరు వ్యాసంలో చెప్పిన విషయాలతో నాకు విభేధం లేదు. కానీ,మూలవిషయాన్ని ప్రస్తావిస్తూ మీరు చేసిన మైనారిటీ-మెజారిటీ రాజకీయవాదంతోనే నా అభ్యంతరమంతా" అని అన్నారు. ఆ తరువాత ఇస్లామిక్ టెర్రరిజం ప్రపంచమంతా వ్యాపించి ఉందనీ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దృగ్విషయాన్నే కదా నేను ప్రస్తావిస్తున్నది? నేను సూడో హిందూయిస్టునెలా అయ్యాను?

  రిప్లయితొలగించండి
 15. 'ముస్లిములలో అభివృద్ధి తక్కువ', 'దేశ అభివృద్ధి ఫలాలు వాళ్ళకి దక్కలేదు.', 'సామాజికంగా బలహీనంగా ఉన్నారు' అని చెబుతూ, వాళ్ళు ఉగ్రవాదం వైపు మొగ్గు చూపడానికి ఇదో కారణం అని లౌకికవాదులమని అనుకునే కొందరు చెబుతూంటారు. అబివృద్ధిలో వెనకబడింది ముస్లిములేనా? హిందువులు వెనకబడిలేరా? వాళ్ళు ఉగ్రవాదులుగా మారారా? దేశమ్మీదబడి సాటి దేశీయులనే చంపుతున్నారా? పరాయి దేశస్తులతో కలిసి కుట్రలు చేసి, విధ్వంసాలకు పాల్పడుతున్నారా? లేదే! మరి ముస్లిములలో ఎందుకుందా ధోరణి? ముస్లిములను బయటి దేశీయులతో కలిపే బంధం మతం తప్ప మరోటి ఉందా? లేదు!


  పాత బస్తీలో అమ్మాయిలను దుబాయ్ షేకులకు అమ్ముకునే పేద జనాలు ఇలా అలోచించడం ఎలా సాధ్యం అనేదే నా డౌటు.

  రిప్లయితొలగించండి
 16. Saraswathi Kumar: చాన్నాళ్ళకు మళ్ళీ! :)
  మీరు చెప్పేది నిజమే! కానీ ఈ వ్యవస్థలో మనకు ప్రత్యామ్నాయం లేదుగదా! మగవాడు గారు చెప్పేది ఈ వ్యవస్థలో మనం చెయ్యగలిగే అత్యుత్తమమైన పని అని నా ఉద్దేశ్యం. అందరూ అలాంటివాళ్ళనే ఎన్నుకోలేకపోయినా.., నిజాయితీగా గళాన్ని వినిపించగలిగేవారు కొందరినైనా ఎన్నుకొంటే పరిస్థితులు వేరుగా ఉండే అవకాశం ఉంది. మన ప్రయత్నం మనమూ చెయ్యాలి గదా!

  రిప్లయితొలగించండి
 17. అప్పుదు మాదుగుల ఫణి శర్మ జ్ఞాపక శక్తికి అంటూ సరస్వతి లేహ్యం తమలపాకులో పెట్టి $ 116 కు అమ్మారు... ఇన్నయ్య గారు తమ టపా లో ఈ విషయం రాసారు. అందరూ కలసి అడుగుదాము శర్మ గారిని.. ఉగ్రవాదం తుదముట్టించే మందు ఆయన దగ్గిరుందేమో నని. లేకపోతె ఏ యాగం చేస్తే బాగుంటుందో చెప్పమందాం. (కాకపొతే బంజారా హిల్స్ లో అయిదు ఎకరాలు అడుగుతాడు).

  రిప్లయితొలగించండి
 18. @మొదటి అజ్ఞాత:మీకు అంత crystal clear గా అనిపించిన విషయాలేమిటో చెబుతారా? ముస్లింల పరిస్థితికి కారణాలు వెదకడానికి కొత్తగా పరిశోధనలు చెయ్యనఖ్ఖరలేదు. సచ్చర్ కమిటి రిపోర్ట్ చదివితే చాలు. ఆ కమిటీ సిఫార్సులను చిత్తశుద్దితో అమలుజరపగల ప్రభుత్వాలు,ముస్లిం రాజకీయ- సామాజికనేతృత్వం కావాలి. అలా జరిగితే కనీసం కొన్ని సంవత్సరాలకైనా ముస్లింల పరిస్థితి కొంత మెరుగుకాగలదేమో!

  కేవలం ముస్లింల జీవనప్రమాణాలేకాదు మొత్తం భారతీయ జీవన ప్రమాణాలు పెరిగే విధంగా నా వంతు కృషి నేను ఎప్పుడూ చేస్తూనే వున్నాను. నీలాంటి పేర్లుకూడా లేని వారికన్నా నా identity ఈ దేశానికి కొంత ఖచ్చితంగా ఉపయోగపడేదే అని చెప్పడానికి గర్విస్తాను.


  @రెండవ అజ్ఞాత:నేను ముస్లింల తరఫున మాట్లాడినంత మాత్రానా నేనొక పాకిస్తాన్ ఏజంటునన్నట్లు వ్యాఖ్యానించారు చూడండి..అక్కడే మీ మూర్ఖత్వం బయటపడుతోంది. "పాకిస్తాన్= ముస్లిం= తీవ్రవాదం=భారతీయ ముస్లిం" అనే equation చేసే మీలాంటివాళ్ళకన్నా నాలాంటివాళ్ళు భారతదేశానికి ప్రమాదకరమేమీ కాదు.

  @చదువరి: ముంబై ఘటన ఇస్లామిక్ టెర్రరిజాని సంబంధించినదే అయినా, ఇందులో పాకిస్తాన్ యొక్క Geo-political కుట్ర ఉందని మొదటిరోజునుంచీ తెలిసికూడా,భారతీయ రాజకీయనినాదాలైన మెజారిటీ-మైనారిటీ విషయాల్ని మీ వ్యాసానికి ప్రాతిపదికగా చేసుకోవడాన్ని నేను విభేధించాను. గ్లోబల్(ఇస్లామిక్)టెర్రరిజానికి భారతీయముస్లింల ముఖంగా చూపేట్లు మీ వ్యాసంలో కొన్ని సంకేతాలుండటాన్ని నేను తప్పుబట్టాను. అంతే తప్ప మీ ఆవేదనని అర్థం చేసుకోలేక కాదు.

  కాకపోతే మీ ఆవేదన ఒక (motivated) రాజకీయ భావజాలకోణంలోంచీ మాత్రమే కనిపించడం, ఆపైన నా వ్యాఖ్యను హిపోక్రసీగానూ,సూడో సెక్యులర్ గోడుగానూ చెప్పుకొచ్చిన వ్యాఖ్యకు మీ సగర్వ మద్దతు చూసి మీ వాదన ఆ కోణంనుంచే అనే అభిప్రాయానికి రావాల్సొచ్చింది.అందుకే సూడో సెక్యులరిస్టుకు ప్రతిగా సూడోహిందూఇస్ట్ పదాన్ని సృష్టించాల్సొచ్చింది.

  నా అభిప్రాయం అపోహకావచ్చు. కానీ ప్రస్తుతానికి అలాగే అనిపించింది.

  రిప్లయితొలగించండి
 19. I have a different opinion on this. Elections and votes won't make an iota of change in the current situation. People of India should change, change for the better, in their thinking, behavior. Don't tell me that we have some more leaders who haven't shown their colors till now. Change should come from within. Whoever may be the leader, can't change the way we think or the way we behave unless we support him / her.

  We are a polarized lot. We see everything through the lenses we are wearing. We can't see the other point of view (may be we need to read The seven habits of highly effective people once again ;))

  My 2c worth crib as usual ;)

  ~sUryuDu :-)

  రిప్లయితొలగించండి
 20. కత్తి మహేష్ కుమార్: "గ్లోబల్(ఇస్లామిక్)టెర్రరిజానికి భారతీయముస్లింల ముఖంగా చూపేట్లు మీ వ్యాసంలో కొన్ని సంకేతాలుండటాన్ని నేను తప్పుబట్టాను." -ఈ వాక్యం నాకు సరిగ్గా అర్థం కాలేదు, వివరించండి. మీరు నా "ప్రధానికో లేఖ" వ్యాసంలో తప్పుబట్టిన అంశం ఏంటసలు? సంకేతాలేవో ఉన్నాయన్నారు, ఏంటవి? అవేంటో అప్పుడూ చెప్పలేదు, ఇప్పుడూ చెప్పలేదు! తప్పు మాత్రం అప్పుడూ పట్టారు, ఇప్పుడూ పట్టారు!!

  "సగర్వ మద్దతు" :) - నేను దానికి మద్దతివ్వలేదు.. మీరే ఆ వ్యాఖ్యను నిజం చేస్తున్నారు అని అన్నాను. ఎందుకో కూడా చెప్పాను. చర్చను పక్కనబెట్టేసి, "కానీ, ఎంతైనా మీ తరఫునుంచీ ఒక వాదన కావాలికదా!!! I understand that." అంటూ నా వాదనను తేల్చిపారేసే ధోరణిలో అన్నందుకే అలా రాసాను. నేను రాసినది ఓసారి మళ్ళీ చదవండి..

  పోతే నేనో కుహనా లౌకికవాదినని మీరే సగర్వంగా చెప్పుకొన్నారు - కానీ నేనెప్పుడూ కుహనా హిందూవాదినని చెప్పుకోలేదు - మీరే నాకా బిరుదును అంటగడుతున్నారు. :)

  రిప్లయితొలగించండి
 21. సరైన వాళ్లకు వోటు వేయాలి...బాగానే ఉంది. జయప్రకాష్ నారాయ్ణ గారు కూడా ఇదే చెప్తున్నారు చాల్రోజులనుంచీ! ఎవరికి చెపుతారు ఇవి? ఇలా కాస్తో కూస్తో చదువుకుని, కొద్దో గొప్పో బుర్రతో ఆలోచించగలిగే వాళ్లకు! మరి పేదరికంలో మగ్గే వాళ్లకి,చదువుకున్నా లాభం లేక కుల ప్రాతిపదిక మీద వోట్లేసే వాళ్లకి, సినిమా నటులు సినిమాల్లో చూపిన సాహసాలు చూసి వెర్రి అభిమానంతో వోట్లేసే వాళ్లకి...వీళ్లనెలా వొప్పిస్తారు సరైన వాళ్లను ఎన్నుకోడానికి? "మీరంతా వచ్చి జయప్రకాష్ నారాయణకి, ఆయన పార్టీ అభ్యర్థులకి వెయ్యండి వోట్లు" అని చెప్తే ఎవరు వేస్తారు వీళ్లలో? వీళ్లలో కొందరిది తెలియని అజ్ఞానం, అవసరం(డబ్బు తీసుకుని వోట్లేసే వారిది) అయితే మరికొందరిది తెలిసి చేసే మూర్ఖత్వం!దీన్ని ఎలా మట్టుబెట్టాలో వీళ్లకి ఎలా జ్ఞానోదయం కలిగిస్తారో ఆలోచించండి!


  పైన మీరు చెప్పిన 13 అంశాల్లో, అన్నీ బాగానే ఉన్నాయి గానీ, మీరు మీడియా మీద జాలి చూపించి వదిలేసారేం? మీడియాకు పరిమితులేం లేవా? ముంబాయి సంఘటన జరిగినప్పటినుంచి ఒక చానెల్ వాళ్ళు ఇహ వేరే న్యూస్ ప్రసారం చేస్తే ఒట్టు. ఈనాటి వరకూ చివరికి తీవ్రవాదులకు ఎటువంటి శిక్షణ ఇస్తారో స్వయంగా చూసినట్టు మరీ కథలల్లి ఊదర గొట్టి చంపేస్తున్నారు. ఇందులో information కన్నా, మెరుగైన సమాజం కోసం చేసే కృషి కన్నా ప్రజల్ని భయభ్రాంతుల్ని చేసే అంశాలే ఎక్కువ! దీనిమీద మీరు విడిగా ఒక టపా రాయాలి.

  రిప్లయితొలగించండి
 22. "ఇందులో పాకిస్తాన్ యొక్క Geo-political కుట్ర ఉందని మొదటిరోజునుంచీ తెలిసికూడా,భారతీయ రాజకీయనినాదాలైన మెజారిటీ-మైనారిటీ విషయాల్ని మీ వ్యాసానికి ప్రాతిపదికగా చేసుకోవడాన్ని నేను విభేధించాను."

  "పాకిస్తాన్= ముస్లిం= తీవ్రవాదం=భారతీయ ముస్లిం" అనే equation చేసే మీలాంటివాళ్ళకన్నా నాలాంటివాళ్ళు భారతదేశానికి ప్రమాదకరమేమీ కాదు.

  Kudos మహేష్! You nailed it. నేను అప్పటి నుంచీ మొత్తుకొంటున్నదీ ఇదే! The people who commented here are no more patriots than you and I are. Social Service sectorలో పనిచేస్తున్న మీ దేశభక్తినే శంకిస్తున్న వాళ్లు ముస్లిం పేరున్న నేను మీ వాదాన్ని వినిపిస్తే నన్ను కూడలి నుంచీ వెలెయ్యమన్నా ఆశ్చర్యం లేదు.

  @చదువరి గారూ...
  మీ పదమూడు పాయింట్లూ బాగానే ఉన్నాయి. కానీ మళ్లీ మళ్లీ మీరు (కుహనా లౌకికవాదులు జపించినట్లు) ఒకే మంత్రాన్నే జపిస్తున్నారు. మీ పంథా మార్చుకోమని చెప్పడం లేదు కానీ, కనీసం solutions తెలిపే టపాలో నైనా కాస్త నిగ్రహం వహించాల్సింది. Don't take it personally, though.

  రిప్లయితొలగించండి
 23. ఈ దేశంలో ముస్లిములకి పాకిస్తాన్ భక్తి, ఇస్లాం వెఱ్ఱి తగ్గేదాకా నిజమైన భారతదేశభక్తి అలవాటు కాదు, అప్పటి దాకా ఉగ్రవాదానికి వాళ్ళ మద్దతు ఆగిపోదు. అప్పటిదాకా ఈ వాళ్ళకి ఈ దేశం బస ఉంటున్న లాడ్జి మాత్రమే. ఒక అలవాటైన పశువుల కొట్టపు పరిసరాల్లాంటిది మాత్రమే. ఒక మక్కా మీదా, మదీనా మీదా ఉన్న సెంటిమెంటు వాళ్ళకి దీని పట్ల లేదు.

  వెనకబాటుతనం ఏ వర్గం విషయంలోనైనా ఎల్లవేళలా మూడొంతులు self-imposed, ఒకవంతు బయటి ప్రభావాలు. ముస్లిములు ఇందుకు మినహాయింపు కాదు. వెనకబడ్డామన్న బాధ కంటే తమ మతానికి ఏదో అయిపోతోందన్న భ్రమే వాళ్ళలో కొంతమందిని ఉగ్రవాదం వైపు నడిపిస్తోంది. ఒకవేళ తమ మతానికి నిజంగానే ఏదో అయిపోతూంటే అందుకు తమ మతస్థులు ఎంతవఱకు కారకులని వాళ్ళు కాసేపు మనసుపెట్టి ఆలోచిస్తే వాళ్ళు ఉగ్రవాదం వైపు వెళ్ళజాలరు. నడుస్తూంటే గుమ్మానికి కాలు కొట్టుకొని నొప్పి పెడుతుంది. శారీరికమైన బాధ కంటే ఇలా కొట్టుకోవడానికి బాధ్యులెవరనే ఆలోచన మనిషిని ఎక్కువ బాధిస్తుంది. ఎవరిమీద కసి తీర్చుకోవాలో తెలియనప్పుడు ఒక ఊహాజనిత శత్రువుని కనుగొనాల్సి వస్తుంది. అప్పుడు మనసు శాంతిస్తుంది. ఆ విధంగా ఇప్పుడు కొందఱు తప్పుదారి పట్టిన ముస్లిములకి ఊహాజనిత శత్రువులు హిందువులు.

  మీరన్నట్లు వివిధ మతాల మధ్య చిచ్చు రగిలిస్తున్న మతమార్పిళ్ళ వంటి అంశాల్ని సైతం దేశవ్యాప్తంగా చర్చిస్తేనే తప్ప ఈ ఉగ్రవాదాల్ని, ఎదురు-ఉగ్రవాదాల్ని సమర్థంగా అఱికట్టలేము. ఒక మతానికి బహిరంగంగా కొమ్ముకాసేవారంతా హిందువులు మాత్రం నిష్పక్షపాతంగా ఉండాలని డిమాండు చేస్తూంటారు. ఇక్కడ మీ టపా కింది వ్యాఖ్యల్లో కూడా ఆ ధోరణి గమనిస్తున్నాను. నాకు చాలా నవ్వొస్తోంది. హిందువుల ప్రాథమిక ఉనికికే ఎసరొచ్చాక వారు నిష్పక్షపాతంగా ఉండే అవసరం లేదని అటువంటివారు గమనిస్తే మంచిది. ఆ రోజులు పోయాయి. ఇక మళ్ళీ రావు. ఎందుకంటే హిందువులు మేల్కొంటున్నారు.

  చాలా రోజుల తరువాత షడ్రసోపేత విందు భోజనం లాంటి టపా రాశారు. ఇదొక టాప్-టపా. నెనర్లు.

  రిప్లయితొలగించండి
 24. ఇస్మాయిల్ గారూ,

  "The people who commented here are no more patriots than you and I are."
  ఆ వ్యాఖ్యతో ఎవ్వరూ విభేదించరు. I completely agree with every word of it.

  ఇకపోతే, మీ పేరు చూసి మీరు ముస్లిం అని నేనెప్పుడు అనుకోలేదు, ఇప్పటికీ అనుకోవట్లేదు. It doesn't matter . నాకు ఇస్మాయిల్, ఇమాన్యూల్ ఇలాంటి.. పేర్లు కొంచెం కంఫ్యూజన్ ఎప్పుడూ. క్రిస్టియన్ పేర్లని అనుకుంటాను ఎప్పుడూ కూడా.
  సరే, నాకు మీరు చెప్పిన దాంట్లో చాలా అభ్యంతరకరమయిన విషయం ఏంటంటే, మీకు మీరు ఓ ఆధిపత్య స్థానాన్ని ఆపాదించేసుకోని, నాకు ముస్లిం పేరు ఉంది కాబట్టి, ఇలాంటి వాదన నేను చేస్తే నన్ను కూడలి లోంచి వెలివేయాలన్నా ఆశ్చర్యం లేదు అన్న స్టేట్మెంట్ పైన వ్యాఖ్యానించిన వాళ్ళనే కాకుండా కూడలి లో ఉన్న వాళ్ళనందరినీ అవమానించేలా ఉంది.

  మీరెలా, మిగతా వాళ్ళకన్నా ఏ మాత్రం తీసిపోని దేశ భక్తులో, ఇక్కడ రాసిన వాళ్ళంతా, మీకన్నా తక్కువ సెక్యులరిస్టులేమీ కాదు. ఒకవేళ మీరు వాళ్ళ కన్నా ఎక్కువ అని, above-allఅని భావిస్తే, అది సిగ్గు పడాల్సిన విషయం.

  They are not fundamentalists, వరుసగా ఒకే వైపు నుంచి జరుగుతున్న దాడుల్ని చూస్తే, అది జరిగిన వెంటనే, కడుపు రగిలి కొంచెం ఆవేశంగా ఎవరైనా మాట్లాడుతారు. అది మనం మన కుటుంబం లోనే చూడొచ్చు. మీరు చెప్పేదే నిజమయితే, ఈ దేశంలో హిందువులు ఈ పాటికి ముస్లిం లందరినీ దేశం లోంచి వెలివేయాలి అన్నడిమాండ్ చేసే వాళ్ళు. ఎప్పుడైనా చూసారా అలాంటి పబ్లిక్ ప్రదర్శనలు? ఎప్పుడో ఎందుకు, ఇప్పుడు ముంబాయి అటాక్ తర్వాతైనా విన్నారా? అంతెందుకు మహేష్ ని ఎదురించే వాళ్ళంతా, ఆయన్ని కూడలి లోంచి బయటకెళ్ళి పొమ్మని ఎప్పుడైనా అన్నారా? On the other hand I wrote in another blog that I am dead sure that Mahesh is not an Anti-Hindu, Anti-God, Anti-Indian ani, I defended him, and I will continue to do it.

  మనుషులని అవమానించడం మానేయండి, ముఖ్యంగా క్రైసిస్ టైంస్ లో సం యమనం పాటించే గొప్ప వాణ్ణి నేను అనే attitude display చేసే మీరు.

  CHADUVARI & OTHERS: PLEASE PROTEST THIS KIND OF INSULTING STATEMENTS FROM Dr ISMAIL.
  WE WILL GIVE OUR LIVES FOR HIS RIGHT OF SPEECH, BUT WHEN HE INSULTS US LIKE THIS, IT'S TIME TO RAISE VOICE.
  మీరు చెప్పేది హిందువులకే కాదు ఇస్మాయిల్ గారూ, Muslims are under-priviliged, Muslims are paid-less అనే ఒక సిగ్గులేని, senseless justification ఇచ్చే Fareed Zakaria , Aryn Baker లాంటి Intellectuals కీ, పాత బస్తీ లోని ముస్లిం లీడర్స్ కి కూడా చెప్పండి, ఇవ్వే సూక్తులు. వాళ్ళ దగ్గర మీరు ఎంత welcome గావించబడతారో చూసి వచ్చి అప్పుడు ఇక్కడ వీళ్ళందర్నీ తీరిగ్గ అవమానిద్దురు గాని.

  రిప్లయితొలగించండి
 25. సరిగ్గ చాలామంది (95%) అనుకునే దానిని మీరు మంచి వ్యాసంగా రాసారు. మంచి పరిష్కార మర్గము చూపించారు కూడాను.
  @ మహేష్
  "నిరాశ,భయం,అపనమ్మకం,దిగులు,ఆవేశం,విద్వేషం నింపే దిశగా వుంటున్నాయేగానీ సమస్యకు సమాధానాలు వెతికే దిశగా వుండటం లేదు"
  పది మంది 200 మంది ని చంపితే, దేశం అంతా దానిని చూసి ఉత్సాహం,దైర్యము,నమ్మకం,శాంతి, ప్రేమ గా కలసి మెలసి ప్రజలు అందరు అదే రాజకీయ పార్టీ లను వాళ్ల పాత పని తీరును అలాగె కొనసాగించ మనె వ్యాసాలు రాయలా? How can you use విద్వేషం word here because wrecking poison against India is goal of that country. Not chaduvari's writeup. Don't misuse words.

  You always says that you didn't give right solution to the problem.
  మీదగ్గర వున్న పరిష్కారం ( సచ్చర్ కమిటి రిపోర్ట్ ) అమలు జరపడము కాకుండా ఇంకెమైనా పరిష్కారం వుందా? ఎందుకంటె మీరు చెప్పారు దానిని అమలు జరిపి ఫలితాలు రావదాని కి కొన్ని సంవత్సరాలు పడుతుందని (ఆ కమిటీ సిఫార్సులను చిత్తశుద్దితో అమలుజరపగల ప్రభుత్వాలు,ముస్లిం రాజకీయ- సామాజికనేతృత్వం కావాలి. అలా జరిగితే కనీసం కొన్ని సంవత్సరాలకైనా ముస్లింల పరిస్థితి కొంత మెరుగుకాగలదేమో!)
  If you consider implementing Sacchar report as a solution, this is going to be long term plan. Do you have any sugestions for short term plan so that ALL Indian peolple feel Happy and Secure in this country.
  Could you please let me know what is Geo political plot means?

  SSR

  రిప్లయితొలగించండి
 26. మీ టపా నిత్యసత్యానికి నిలువుటద్దం చూపింది. ముస్లిములందరూ ఉగ్రవాదం వైపు తిరగడం లేదు. అర కొర సదుపాయాలతో సతమతమయ్యే యువతే వారిలో vulnerable కేటగిరీ.Religion is opium to masses అని పెద్దలెవరో అన్నారు. మత్తు మందులకి బానిసలయ్యేది అధిక శాతం యువతేగదా! మన బిడ్డే మనకోసం (మన మతం కోసం) అసువులు బాస్తోంటే (!?)మిగతా వాళ్లకి మాస్ హిస్టీరియా కలగడం సహజం. ఇవే సమస్యలు, మిగతా జన సామాన్యానికంతటికీ వున్నా, కేవలం ముస్లిము యువతే ఎందుకు ఈ విపరీత ధోరణికి ప్రేరేపింపబడుతోంది?

  ఆఫ్ఘనిస్థానులోనూ, పాకిస్థాను లోనూ ముస్లిమేతరుల జీవన స్థాయి ఏవిటో క.మ.కు. గారికీ, డా.ఇ. గారికి తెలుసా? అక్కడి ముస్లిమేతరులగురించి, ఇక్కడి వారేమీ శివాలెత్తిపోవటంలేదే!

  మొదట్లో, కమకు గారి కత్తి తెగ పదును అనుకునేదాన్ని. తర్వాత కొన్నాళ్లకి తెలిసింది, దానికి రెండు వేపులా పదును అని.

  రిప్లయితొలగించండి
 27. Mr.Kumar...

  Mind your language. I did not- I repeat - I did not attack any one personally. By taking my name and smearing me with accusations that are completely baseless is not right minded.

  Chaduvari, Veeven and et al know me since the time of birth of Telugu Blogs. They know who I am what I stand for. Don't try to advise them to wage a war against me. If you don't believe me try to talk to them personally.

  " ఏ కులమని వివరములడిగిన ఏమని చెప్పుదు లోకులకు...
  లోకులకు బలుఁగాకులకు, దుర్మార్గులకు, దుష్టులకు...:
  అని తత్వం పాడి వాపోయిన సిద్ధయ్యనే "దూదేకుల సిద్ధయ్య"గా పిలిచే సమాజం మనది. I was born Muslim and now married to a పదహారణాల తెలుగు Hindu girl and by choice I am an Agnostic.

  What I am trying to say by that sentence is to negate Chaduvari gari view in his first proposal "ఆపేయబడ్ద వ్యక్తి కమాల్ హుస్సేన్. కమాల్ అదే పాసుపోర్టుతో భారత్ నుండి పారిస్‌దాకా ఇబ్బందేమీ లేకుండానే వెళ్ళాడు, అక్కడ మాత్రం తేడా కనిపించింది. వాళ్ళు చెప్పిన కారణం ఏమైనప్పటికీ (అసలు కారణమేంటో ఊహించలేనంత కష్టమేమీగాదు) - వాళ్ళకు అనుమానం వచ్చింది, మొహమాటాలేమీ లేకుండా దింపేసారు, ఎవ్వరూ మాట్టాడలేదు." by bringing my name and the various connotations it can bring in a funny way. May be I should have added a smiley:-) after my sentence. Please don't you ever try to smear me again. Thanks!

  రిప్లయితొలగించండి
 28. Mr Ismail,
  It's good that you explained. Neither did I use any bad language on you, nor would I use against anyone. So, you don't have to preach to me about my use of language. Keep it to yourself. Don't know why you took offense about the language.

  If you are refering to "సిగ్గులేని, senseless justification ఇచ్చే Fareed Zakaria , Aryn Baker", then it's very obvious that I was referring to their acts. It's nothing about you.

  I came back here to say sorry, if I used any bad word about you, but now that I realised that I didn't do it, I won't do it.

  ఏది ఏమైనా, నేను మీరన్న మాటల్ని ఫోకస్ లోకి తెస్తే , మీకు భాధ కలిగితే, కడుపు రగిలి ఆవేశంగా ఉన్న టైం లో, మీరన్న మాటలు కూడా మిగతా మనుషులకు బాధే కలిగిస్తాయి.

  పోతే మీ గురించి... మీ పర్సనల్ లైఫ్ గురించి నా కనవసరం. ఇక్కడ ఏం రాసారన్నదే ముఖ్యం. (మీరు ఆముక్త మాల్యద అభిమానులని నాకు బాగా తెలుసు. నాకు అదే అభిమానం తో నా కూతురుకి కూడా అదే పేరు పెట్టుకున్నా, ఇంతకన్నా ఎక్కువ పర్సనల్ విషయాలు చెప్పడం ఇష్టం లేదు, ఎపుడైనా కలిస్తే చెపుతా)

  మీరే కాదు Mr Ismail, మహేష్ గాని, మిగతా ఎవ్వరూ గాని హిందూ వ్యతిరేకులనో, ముస్లిం వ్యతిరేకులనో, irrationalists అనో, జనాల ఫీలింగ్స్ అర్ధం చేసుకోలేనంత in-sensitive అనో ఎవ్వరూ అనుకోవట్లేదు. అస్సలు నిజంగా జీవితంలో 99,9% of the people ఒక ethnic group ని, అకారణంగా ఎవ్వరు హేట్ చేయరు. మనమంతా ఆ 99.9% లోన్ని వాళ్ళమే.

  Yes, as you were saying, if you were to put a SMILEY next to your sentence, it wouldn't have stirred emotions.

  And yes, please don't you ever try to suggest that I am smearing you, without me actually smearing you.

  Thanks
  Kumar

  రిప్లయితొలగించండి
 29. 'కుమార్' గారూ...

  "మీకు మీరు ఓ ఆధిపత్య స్థానాన్ని ఆపాదించేసుకోని,.."
  "ఒకవేళ మీరు వాళ్ళ కన్నా ఎక్కువ అని, above-allఅని భావిస్తే, అది సిగ్గు పడాల్సిన విషయం..."
  "క్రైసిస్ టైంస్ లో సం యమనం పాటించే గొప్ప వాణ్ణి నేను అనే attitude display చేసే మీరు..."
  "CHADUVARI & OTHERS: PLEASE PROTEST THIS KIND OF INSULTING STATEMENTS FROM Dr ISMAIL."

  ఇవి వ్యక్తిగత దాడులు కాకపోతే మరేంటి? నేనెప్పుడూ నేను గొప్ప అని భుజాలు చరచుకోలేదే? నా భావాన్ని మీరు మరోలా అర్థం చేసుకొంటే నేనేం చేయను? చదువరి గారితో ఆపాటి చనువు నాకుంది, నాబ్లాగులో వారు, వారి బ్లాగులో నేను ఈమాత్రం ఎత్తిపొడుపులు చేసుకోవడం సాధారణం. మీ బ్లాగులో చేయలేదే నేనీ వ్యాఖ్యలు...అంతలా మీరు రెచ్చిపోవడానికి!

  తెలుగు బ్లాగ్లోక ఆదికవి "ఒరెమూనా" చావాకిరణ్ దగ్గర నుండీ అందరితో నాకు సత్సంబంధాలే కానీ ఏనాడు ఓ మాట అనుకొనింది లేదు. నా Personal lifeలో జరిగిన ఎన్నో సంఘటనలకు నా బ్లాగు మిత్రులు సాక్షీభూతాలు. నేను కష్టాల్లో ఉన్నప్పుడు మంచి మాటలతో స్వాంతన కలిగించారు, వెన్ను తట్టి స్ఫూర్తిని రగిలించారు,వీలైతే నా పాత టపాలు తిరగేయండి...fyi...
  http://krishnadevarayalu.blogspot.com/2007/03/blog-post_15.html

  http://krishnadevarayalu.blogspot.com/2008/03/blog-post_17.html

  ఇహపోతే నేను క్రిస్టియనా? లేక మరోటా? అనే ధర్మసందేహం వెలిబుచ్చారు చూడండీ అందుకే నా పర్సనల్ లైఫ్ గురించి రాయాల్సి వచ్చింది. That said, 'ఆముక్తమాల్యద' అని మీ అమ్మాయికి పెరుపెట్టిన మీ సహృదయృతను, సాహిత్యాభిలాషను అభినందించకుండా ఉండలేకపోతున్నాను.

  నా బ్లాగులో మీ వ్యాఖ్య కింద నా మెయిల్ ఐడి ఇచ్చాను, వీలైతే మెయిలు కొట్టండి మన మధ్య తగవులు ఇక్కడేల? మీరు దగ్గరే కనుక ఉన్నటైతే ఓ కప్పు కాఫీ తాగుతూ మాట్లాడుకొందాం.

  @ చదువరి...

  ఇలా మీ బ్లాగును దుర్వినియోగపరచినందుకు క్షమించండి.

  రిప్లయితొలగించండి
 30. అయ్యా ఇస్మాయల్ గారు,
  ముస్లిం తీవ్రవాదులు ను , వారికి సహకరించేవారిని విమర్శించుతుంటె మీకు ఇంత బాధ గా ఉంది, మరి మహేష్ పని గట్టుకొని ఈ దేశాన్ని, మా మతాన్ని అదే పని కనిపించిన బ్లాగులే నల్లా వ్యతిరేకిస్తుంటే మా కెంత కాలుతుందొ మీకు తెలుస్తుందా ? మీరు అయన గారి టపాలన్ని చదివరా? ఆయనకి దెశభక్తా? దెశభక్తి అంటె అయన మటలలొనే ఆయన గారి బ్లాగ్ లొనే చదవండి మీరు. కాశ్మిర్ ఇచ్ఛేయాలి ? తరవాత ఏమవుతుంది ఈయన తెలియదా ? అసలు ఒకటి కాదు ప్రతిది ఈయనకు తప్పే కనపడది.ఇక్కడ మీరు ముస్లిం కాబట్టి ముమ్మలిని వ్యతిరేకించిన వారిని చూపించండి.

  రిప్లయితొలగించండి
 31. @SSR: జరిగిన ఘటనకు కారణాల్ని,బాధ్యుల్ని వెతకడం మంచిదే.కానీ,వాటిని ‘మన ఖర్మింతే!’ అనేట్టుగా చెప్పడం లేక ‘కారణంవీళ్ళు’ ‘ఏదో ఒకటి చేసెయ్యాలి’ అనే misguided anger లేక politically motivated inflammatory rhetoric ను తో నేను అంగీకరించను.

  Coming to the use of the word "విద్వేషం". పాకిస్తాన్ తో మనకున్నది బౌగోళిక-రాజకీయ (Geo-political అంటే ఇదే) శతృత్వం.దానికి మతవిద్వేషం రంగునిచ్చింది పాకిస్తానీ ఆర్మీ,ISI మరియూ దాని ప్రభుత్వమైతే దాన్ని విజయవంతంగా ఉపయోగించుకుని భారతీయముస్లింల పట్ల విద్వేషాన్ని నింపడానికి ప్రయత్నిస్తున్నది హిందుత్వభావజాలం.ఈ contextలో మెజారిటీ-మైనారిటీ వాదాన్ని ముంబైఘటనకు కట్టబెట్టడం విద్వేషాన్ని మరింత పెంచిపోషించడమేతప్ప మరోటికాదు.అందుకే ఆపదాన్ని వాడటం జరిగింది.

  నేనిక్కడ సమస్యలకు సమాధానాలను ఆశించడం లేదు. కానీ కనీసం చర్చలూ,వ్యాసాలూ ఆదిశగా కాకపోయినా కనీసం defeatist గా ఉండకూడదని మాత్రమే ఆశించాను.అది నా కోరిక మాత్రమే. ఆతరువాత బ్లాగరి ఇష్టం.

  సచ్చర్ కమిటీ అమలు ఒక దీర్ఘకాలిక సమాధానం. కానీ ప్రస్తుతం మనం చెయ్యాల్సింది భారతీయ ముస్లింలను కనీసం alienate చెయ్యకుండా ఉండటం.ముంబై ఘటనను దేశంపై దాడిగా గుర్తించి దానికి తగిన రాజకీయ-సామాజిక-మిలటరీ సమాధానాన్ని అందించడం. That has to be done irrespective of religious identities.


  @ఆఖరి అజ్ఞాత: కనీసం నా టపాల్ని పుర్తిగా చదువు బాబూ!ఆ తరువాత తీరిగ్గా కాలుదువుగానీ.

  రిప్లయితొలగించండి
 32. @Mahesh : I asked Mr. Ismail I didn't understand you responded. Anyway yes that is only my understanding level I am not a inteliigence fellow like you, no poblem, the same answer will applicable to you when you answer or comment to others posts.

  రిప్లయితొలగించండి
 33. And yes why some special previlages given you muslim only tell me - special pesmission should be given to these people in Ramzan time they can leave offices one houe why it should be ! special reservations should be given why?
  Where yo are seeing discrimation against mulsims tell me ? In this country till three mujslim are ruling the bollywood. One muslim is president for 5 year . One muslim enjoyed as the captain as Indian team ? where you are found the descrimination? Have you saw how MIn MLAs behaved in assembly in this sessions . what it is indicating ?

  రిప్లయితొలగించండి
 34. ఇస్మాయిల్ గారూ,

  మీ సమాధానానికి ధన్యవాదాలు.

  నేను మీ మతం గురించి అస్సలు సందేహం వెలిబుచ్చలేదండి. మీరు మీ ముస్లిం నామం గురించి చెపితే, అసలా విషయమే నా మెదడుకు తట్టలేదు అప్పటివరకూ, బహుశా నాకా నామం ఎప్పుడూ క్రిస్టియన్ నామమని నా మనసులో ఉన్న భావం వల్ల కావచ్చు అని అన్నా అంతే. ఈ పేర్ల, మతాల డిస్కషన్ కొంచెం చిరాగ్గా ఉంది నాకు, దయచేసి ఇక్కడితో వదిలేద్దామా.

  ఇకపోతే పైన మీరు చూపించిన మాటల్లో bad language ఏమీ లేదండి. సెక్యులరిజం పేరు మీద, ఎవరైనా(మీరైనా, మా నాన్నయినా..) high-road, preaching-tone తీసుకొని ఓ high-moral attitude display చేస్తే నేనూ నా voice-raise చేస్తా..ఆ సూక్తులేవో అటు పక్క వాళ్ళక్కూడా చెప్పి, తర్వాత ఇక్కడకు రండి అని ఖశ్చితంగా అంటా. అది పర్సనల్ అటాక్ కాదని నేను మీకు సవినయంగా మనవి చేసుకుంటున్నాను. అందులోనూ మీలాంటి వీళ్ళ మీద అస్సలు కాదు.

  I firmly believe that the time has come to HALLA BHOL.

  గత ఇరవై సంవత్సారులుగా కడుపు రగిలి పోయి ఉన్నాం సార్ మేం. ఇప్పటి వరకూ కడుపులోనే దాచుకొని ఉంటున్నాం. మేమేం చేసామని, ఏం చేస్తున్నామని అటు ఆ దాడులూ, ఇటు ఈ నీతులూ భరించాలండి మేము? అయ్యో ఇప్పుడే ఈ దాడులు జరిగి, ఈ సంవత్సరం లో వరుసగా జరుగుతున్న దాడుల వళ్ళ, వీళ్ళ మోరల్ చాలా దెబ్బ తిని ఉందేమో ఆ సూక్తులు అన్నీ కొద్ది రోజులాగి చెపుతామన్న కనీస compassion లేకుండా పోతే ఎట్లా?

  ఇక నన్నెన్ని తిట్టినా ఇదే నా చివరి వ్యాఖ్య ఈ టపాకి.
  PS: మీరు లూసియానా లో ఉంటే నాకు దూరమే. నేను ప్రతి వారం ట్రావెల్ చెసే ఉద్యొగాన్నే వెలగబెడుతున్నప్పటికీ, మీ వైపు ఈ మధ్య ఎప్పుడూ అవసరం పడలా, ఎప్పుడో మెక్సికొలో ఉద్యొగం చేసినప్పుడు తప్పితే. ఈ సారి వచ్చినప్పుడు ఖశ్చితంగా కలుస్తా.


  చదువరి గారూ, I apologize for all this ,but I just couldn't control it.

  రిప్లయితొలగించండి
 35. Here nobody is alienating the muslims , they themselves are alienating by asking special permissions and sepcial reservations. I think you know better how other religious people in soudi countries leading their life! Eventhough they are not muslims they should follow Ramzam, they should follows praying restiction? You don't have voice on this. I know to discuss with you useless you never change your mind set. I don't want any reply form you on this! Please don't post something increase my BP level.
  Thanks.,

  రిప్లయితొలగించండి
 36. ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 37. @ చదువరి: మీకు చక్కని నాయకులనిపించిన వాళ్ళందరి పేర్లనూ సూచించగలరు
  తెలుగువారిలో : " ఎన్.జి రంగా, మే.జ, కృష్ణారావు, కామ్రేడ్ పుచ్చలపల్లి, పాములపర్తి వెంకట నరసింహా రావు, చంద్రబాబు, మర్రి చెన్నారెడ్డి, జలగం వెంగళ రావు, మండలి వెంకట కృష్ణారావు, ఎన్.టి.ఆర్, జయప్రకాశ్ నారాయణ.

  పైన ఉదహరించివారిలోని అన్ని గుణాలు అందరికి అందరికి నచ్చకపోవచ్చు. కాని మంచి గుణాలున్నవి. వాటిని మాత్రమే చూడండి. దీనికి మరిన్ని పేర్లు జోడించవచ్చు. ఇంకా అర్హులున్నారు. వారి పేర్లు తెలిసినా నేను ఇక్కడ ఇవ్వడంలేదు. ఇది మొదలు మాత్రమే. చూసాముగా. ఒక నిర్దుష్టమైన కార్యాచరణ ప్రణాళిక అని అనుకుంటే, సంభాషణ పక్క దారి పట్టింది.

  నా టపాకి స్నేహ ఒక జవాబిచారు:- "మీక్కావలసినట్లు వండుకు తినండి అని చెప్తే మీరు ఇచ్చిన వంకాయలు పుచ్చువి ఎలా వండాలండి అన్నట్లు వుంది." అన్న విమర్శలుంటునే ఊంటాయి. కాని మన పని మనం చెయ్యాలి.

  @ sneha // December 6, 2008 7:25:00 PM IST
  చదువరి గారు మీరు చెప్పింది సరే. మగవాడు గారు మీరు చెప్పినట్టు ఓటు వెయడంతోనే మన సమస్య తీరి పొతుందా?

  తీరిపోదు స్నేహా! కాబట్టి కూర్చుని ఏడుద్దామా? మొదలు పెట్టాలిగా. ఇక్కడ, ఇలా మొదలు పెడదామని అన్నాను. మీకు మరోక క్రియాశీలక ఆలోచన ఉంటే చెప్పండి. బాగుంటే ఆచరిద్దాం.

  @ Saraswathi Kumar // December 6, 2008 8:07:00 PM IST
  " @చదువరి గారు, చాలామంచి వ్యాసాన్ని.. అందులో చక్కని విశ్లేషణను, అంతే చక్కని సూచనలను అందించారు. ధన్యవాదాలు!
  మీకు, మగవాడు గారికి మధ్యన ఆసక్తికరమైన చిన్నపాటి చర్చ జరిగినది. అందులో మీరిరువురూకూడా 'ఓటు', 'ఎన్నికలు' మొదలైన అంశాల మీద గాఢమైన విశ్వాసాన్ని ప్రకటించారు...మంచిది! అయితే, ఆ రెండూ కూడా ఈ వ్యవస్థలో అంతర్భాగాలే కదా! ఎన్నికలు పార్టీల కబంద హస్థాల్లో ఇరుక్కుపోలేదా?! పార్టీలు స్వార్థపరుల జేబుసంస్థలుగా మారలేదా?! ఓట్లు వేసేది మీ ఇరువురు లాంటి విజ్ఞులు మాత్రమే కాదుగదా! ఓటు విలువ తెలియని తాగుబోతులు, కరెన్సీ నోటుకు తన ఓటు అమ్ముకునే దౌర్భాగ్యులు, ఓటే వేయని పౌరుల మధ్యన మీలాంటి వారెందరు?"

  అని అందరూ, ఆ కుండలో నీళ్ళు పోస్తే, పాలు పోసేదెవరు?

  @~sUryuDu :-) So what do you suggest we do?

  @ సుజాత // December 6, 2008 10:30:00 PM IST
  సరైన వాళ్లకు వోటు వేయాలి...బాగానే ఉంది. జయప్రకాష్ నారాయ్ణ గారు కూడా ఇదే చెప్తున్నారు చాల్రోజులనుంచీ! ఎవరికి చెపుతారు ఇవి? ఇలా కాస్తో కూస్తో చదువుకుని, కొద్దో గొప్పో బుర్రతో ఆలోచించగలిగే వాళ్లకు! మరి పేదరికంలో మగ్గే వాళ్లకి,చదువుకున్నా లాభం లేక కుల ప్రాతిపదిక మీద వోట్లేసే వాళ్లకి, సినిమా నటులు సినిమాల్లో చూపిన సాహసాలు చూసి వెర్రి అభిమానంతో వోట్లేసే వాళ్లకి...వీళ్లనెలా వొప్పిస్తారు సరైన వాళ్లను ఎన్నుకోడానికి? "మీరంతా వచ్చి జయప్రకాష్ నారాయణకి, ఆయన పార్టీ అభ్యర్థులకి వెయ్యండి వోట్లు" అని చెప్తే ఎవరు వేస్తారు వీళ్లలో? వీళ్లలో కొందరిది తెలియని అజ్ఞానం, అవసరం(డబ్బు తీసుకుని వోట్లేసే వారిది) అయితే మరికొందరిది తెలిసి చేసే మూర్ఖత్వం!దీన్ని ఎలా మట్టుబెట్టాలో వీళ్లకి ఎలా జ్ఞానోదయం కలిగిస్తారో ఆలోచించండి!

  వీలు లేకపోతే, వీలుచేసుకుని వారిని చైతన్యవంతులని చెయ్యాలి. తప్పదు. రెప్పొద్దున్నే వ్య్వస్థ మారిపోదు. ఒక అడుగు ముందు వేసాం కదా. మరో అడుగు వేద్దాం. మార్పు గురించి ఆలోచన మొదలైంది కదా. మీరందరూ ఆలోచిస్తున్నారు కదా. మరొక అడుగు ముందుకు వెయ్యండి.

  @ kumar // December 7, 2008 1:00:00 AM IST
  ఇస్మాయిల్ గారూ, "నన్ను కూడలి లోంచి వెలివేయాలన్నా ఆశ్చర్యం లేదు" అన్న స్టేట్మెంట్ పైన వ్యాఖ్యానించిన వాళ్ళనే కాకుండా కూడలి లో ఉన్న వాళ్ళనందరినీ అవమానించేలా ఉంది.
  నిజమే, స్మైలీ ఉండి ఉంటే బాగానే ఉండేది.
  వ్యవస్థ బాగుండి ఉంటే అన్ని బాగానే ఉండేవి. కాని లేదుగా. అందుకేగా ఈ అపోహలు, అభిప్రాయబేధాలు. ఆలోచన మారాలి.
  Come on folks, get your acts together! This is your goddamn country and it needs you now, Dammit!

  రిప్లయితొలగించండి
 38. @ మహేష్, "‘మన ఖర్మింతే!’ అనేట్టుగా చెప్పడం లేక ‘కారణంవీళ్ళు’ ‘ఏదో ఒకటి చేసెయ్యాలి’, misguided anger లేక politically motivated inflammatory rhetoric"
  I don't agree with your above views ( words ) because these attacks happend several times in this year itself. We must question ourself what is my role as an individual. Security of a citizen is govt top most responsibility. Then what is Govt? Govt nothing but group of political parties. Look at ruling political parties behaviour, Is their any change in them after so many incidents ? No. Recent example is Narayan Rane. He is not bothered about Mumbai incident et al. This incident happend because we ( political leadership) didn't act sternly against the terrorist and still there is no change in our leaders behaviour. Then definately Chaduvari and many people will feel "మన ఖర్మింతే', we know who and why they are not taking action ('కారణంవీళ్ళు' ) and we want to do something ('ఏదో ఒకటి చేసెయ్యాలి’). Do you think this is a misguided action or లేక politically motivated inflammatory rhetoric" ? Definetly it is not so.
  పాకిస్తాన్ తో మనకున్నది బౌగోళిక-రాజకీయ (Geo-political అంటే ఇదే) శతృత్వం. But Pakistan has one more reason apart from Geo-political that is they consider India as a Hindu ruling country. They don't have any concern about Indian muslims. If they have that feeling how can they kill Indian muslims also. I don't think they are considering indian muslims equal to them. Probably they will be thinking majority Indian Muslims are converted hindus.
  Infact Govt of Andhra informed to court that 85 % muslims converted from Hinduism to support its argument for BC reservation. If pakistan ( including ISI, army etc., )really concern about Indian Muslims they should not indulge in such acts because as you said hindutva forces will take advantage of these incidents. But these incidents shows us clearly they are not bothered about Indian muslims.
  Chaduvari is not talking about "మెజారిటీ-మైనారిటీ " instead of that as an individual he is more concern about ground reality of the situation , Practical approach to resolve the issue, Security of the people and Equlity of the all Indian citizens.

  My typing speed is very slow. Forget about spell mistakes and try to understand what I am saying conceptually.

  SSR

  రిప్లయితొలగించండి
 39. కత్తి మహేష్ కుమార్: "...That has to be done irrespective of religious identities." అని అన్నారు మీరు - ఇన్నాళ్ళుగా అలా జరగలేదనే నేనంటున్నాను. ఉగ్రవాదాన్ని అణిచేందుకు ఇప్పటిదాకా ప్రభుత్వం తీసుకున్న చర్యలు మతాతీతంగా జరగలేదు. ముస్లిములన్న కారణంతో చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం వెనుకంజ వేసింది. -అని నేను అంటున్నాను. కాదూ బానే చేసారు అని మీరు ఖచ్చితంగా చెప్పలా ఇంతవరకూ! ఇప్పుడు చెబుతారా? ప్రభుత్వమే గనక అలా చేసి ఉంటే నేడు ఈ చర్చ ఉండేదేగాదు.

  ఇక నేనెంత చెప్పినా మీరు అర్థం చేసుకోగలుగుతారని నాకు అనిపించడం లేదు. ఎందుకంటే ఉగ్రవాద పోషక ముస్లిముల పేరెత్తితే వాడు మతవాది, హిందూవాది, (ఇప్పుడు కొత్తగా సూడో హిందూయిస్టు అన్నారనుకోండి) అని మీ మనసులో స్థిరపడిపోయింది. అవే నాపైనా రుద్దుతున్నారు. కావాలంటే పాకిస్తాన్ను తిట్టు, అయ్యస్సైని తిట్టు, ఇంకెవరినైనా అను, అంతేగానీ, వాళ్ళకు సాయం చేసేవాళ్ళు మన దేశంలోనే మనమధ్యే ఉన్నారని మాత్రం అనకు. ఎందుకంటే అది ముస్లిముదూషణ, లౌకికభావాలకు గొడ్డలిపెట్టు -ఇదీ మీ ఉద్దేశ్యంగా నాకు కనిపిస్తూంది. ఇక మీతో ఈ విషయమై చర్చించినా పెద్ద ఫలితం ఉండేట్టు కనబడ్డం లేదు. ఎందుకంటే మీరు చర్చించడం లేదు, తీర్పులు చెప్పేస్తున్నారు, ముద్దర్లేసేస్తున్నారు. పైపెచ్చు హెజిమోనీ, నాదని అంటున్నారు. ప్చ్!

  కుమార్, ఇస్మాయిల్: చర్చ వేడిగా జరిగినా.., హుందాగా ముగించారు, నెనరులు.

  ఇస్మాయిల్: "ముస్లిం పేరున్న నేను మీ వాదాన్ని వినిపిస్తే నన్ను కూడలి నుంచీ వెలెయ్యమన్నా ఆశ్చర్యం లేదు." - ఈ వాక్యం చాలా కష్టం కలిగించింది. స్మైలీ పెట్టినా, కష్టంగానే ఉండేది. మీరైనా, మహేష్ అయినా, మరొకరైనా.. ఎవరి అభిప్రాయాలు వారికుంటాయి. మీమీ అభిప్రాయాలు నాకు నచ్చకపోవచ్చేమోగానీ, మీరు, మీ కులమూ, మతమూ - ఇవేవీ మన చర్చలకు అడ్డం కావు.

  కమాల్ హుసేన్ విషయాన్ని చర్చలోకి తెచ్చింది, భద్రత విషయంలో సదరు ఎయిర్‌లైను సంస్థ రాజీలేని తత్వం గురించేగానీ, మరో ఉద్దేశ్యంతోగాదు. ముస్లిములనే ఉద్దేశ్యంతో నేరస్తుల మీద కూడా మన రాజకీయులు సరైన చర్యలు తీసుకోవడం లేదు అనేది నా అతిపెద్ద బాధ. వాళ్ళు ఈ ఎయిర్‌లైను సంస్థను ఆదర్శంగా తీసుకోవాలి. ఎందుకంటే భద్రత విషయంలో రాజీపడరాదు అనేది మాత్రమే నా ఉద్దేశ్యం. దీనికి అర్థం అంతదూరం లాగారని మీరు వివరించి చెప్పేదాకా నాకు తెలీలేదు. నా భావం విస్పష్టంగా మళ్ళీ చెబుతున్నా.. భద్రత విషయంలో కఠినంగా ఉండాలి -మతాతీతంగా, కులం, వర్గం, హోదాల వంటి వాటి కతీతంగా!

  రిప్లయితొలగించండి
 40. చదువరి గారూ,
  నా భాధ మీక్కూడా కలిగినందుకు, అందుకు స్పందించినందుకూ చాలా ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 41. చదువరి గారు, మహేష్ గారు ఇలా ఎంతసేపు వాళ్ళది తప్పు, వీళ్ళది తప్పు అనేకన్న మార్పు కోసం ఎదైన చేద్దాం అండి.మగవాడు గారు చెప్పినట్టు ఓటు సరైన వాళ్ళకు వేసే దిశగా మెదటి అడుగు వేద్దాం. సరైన వాళ్ళను చూపించండి అనే ప్రశ్న బదులు మనకున్న పార్టీలలో సరి అయినదేదొ చూద్దాం.సుజాత గారు మనమే ప్రజలను చైతన్యవంతులను చేయడానికి ప్రయత్నిద్దాం.మన బ్లాగులను ప్రజలకు ప్రేరణ కలిగించే దిశగా ఉపయోగిద్దాం.దీనివళ్ళ మార్పు వస్తుందా అంటారా. తెలీదండి. మీలాగే నాకు కూడా మార్పు వస్తే బాగుండును అని వుంది. ఆ దిశగా ప్రయత్నిద్దామన్న చిన్న ఆలొచన ఇది. మీరేమంటారు? ఇంకో విషయం అండి దీనికి ప్రణాళిక ఏంటి? ఎలా చేస్తారు అన్న ప్రశ్నలకు నా వద్ద సమాధానం లేదు. వీలైతే సాధ్యాసాధ్యాల గురించి చర్చిద్దాం. ఇష్టం లేదూ అంటే వదిలేయండి అనవసర వ్యాఖ్యలు వద్దు. అందరికి విలువైన సమయాన్ని వృథా చేయవద్దు అనవసర వ్యాఖ్యలతో.

  రిప్లయితొలగించండి
 42. @మగవాడు...

  మీ ప్రతివ్యాఖ్యతోనూ సంపూర్ణంగా ఏకీభవిస్తున్నాను. మన రాజకీయాలు ఇలా ఎందుకు ఏడుస్తున్నాయంటే ఓంప్రథమంగా కన్పించే కారణం పేదరికం, రెండు- నిరక్షరాస్యత, మూడు-కులాల కుమ్ములాటలు. మూడో దాని గురించి మనమేమీ చేయలేకపోయినా మొదటి రెండింటినీ నిర్మూలిస్తే కాస్తలో కాస్త మార్పు రావొచ్చు. మఱి అది మన చేతుల్లో ఉందా? అని భయపడితే ఎంత కాలమైనా ఇలాగే ఉంటుంది.

  "Be the Change you belive in" అన్నాడు మహాత్ముడు. మనం అందరూ సంఘటితమై ఓ పల్లెటూర్లో, ఓ పూరిపాకలో, ఓ పాఠశాల ప్రారంభిస్తే ఎలా ఉంటుంది? దాని కోసం మన బ్లాగర్లలందరమూ పూనుకొంటే ఎలా ఉంటుందంటారు? "కొత్తపల్లి" అన్న బ్లాగు నిర్వహిస్తున్న మా "చెన్నేకొత్తపల్లి" టింబక్టు వారి సహాయసహకారాలు తీసుకోవచ్చు. "కూడలి" అన్న పేరు పెడితే సముచితంగానూ ఉంటుంది. అప్పుడు మనం కూడా "నేను సైతం విశ్వవృష్టికి అశ్రువొక్కటి ధారవోసాను" అని కాస్తైనా తృప్తి చెందొచ్చు.

  @చదువరి...

  "మీకు" కష్టం కలిగిస్తే నా 'కూడలి'వ్యాఖ్యను ఉపసంహరించుకొంటున్నాను.

  కానీ మీరన్నట్టు...
  "హిందువైనా ముస్లిమైనా, మరొకరైనా కటువుగా ఉండాల్సిందే!"
  "మతాతీతంగా, కులం, వర్గం, హోదాల వంటి వాటి కతీతంగా!"

  మరి 'కమాల్ హుస్సేన్' చేసిన తప్పేమిటి? 'దినేష్ మిశ్రా' చేసిన ఒప్పేమిటి? కేవలం పేరు ఆధారంగా వివక్ష చూపించడం పైనే నా ఆవేదనంతా. ఈ విషయంలో మీతో రాజీ పడలేక పోతున్నాను. నా వాదానికి కట్టుబడి ఉంటున్నాను.

  @కుమార్...

  "ఊరకున్నంత ఉత్తమం లేదు..." అని తెలిసివచ్చింది. No comments.

  @"అజ్ఞాత"లకు...
  నో కామెంట్సూ:-)

  రిప్లయితొలగించండి
 43. డా.ఇస్మాయిల్: కమాల్ హుసేన్ తప్పేదో ఉందన్నది నా ఉద్దేశ్యం కాదు. అలా నేనననలేదు

  రిప్లయితొలగించండి
 44. ఇస్మాయిల్,

  :-) నిజమే, మీకే కాదు, నాక్కూడా వర్తిస్తుంది కదా :-), కాని ఊరకుండలేకే..

  మీరు పైన చెప్పిన కొత్తపల్లి బ్లాగుని వెదకి పట్టుకున్నా. బాగుంది. టింబక్టు ఏంటో సరిగ్గా భోధపడలేదు. మీరు ఏమైనా చేపడితే, దానికి చేయాల్సినది ఏమైనా ఉంటే, నా వంతు ధర్మం నేను నిర్వర్తించడానికి, దయచేసి నాకు కూడా అవకాశమివ్వండి.

  నా ఈమేయిల్ ఐడి: ఎన్ కె యు ఎం ఏ ఆర్ టి ఇ ఎల్ ఎట్ జీమేయిల్

  రిప్లయితొలగించండి
 45. ఒక సూచన.. లోక్‌సత్తా పట్ల మీలో ఎవరికి ఏ విధమైన అభిప్రాయం ఉందో నాకు తెలీదు. నాకు సదభిప్రాయమే ఉంది. లోక్‌సత్తాను అధికారంలోకి తేలేమేమోగానీ, నిజాయితీతో కూడిన ఒక గొంతును శాసనసభలో వినిపించేలా చెయ్యగలమన్న ఆశ ఉంది నాకు. అలా చెయ్యగల అవకాశం మనకుంది.

  జయప్రకాశ్ నారాయణ బహుశా కూకట్‌పల్లిలో పోటీ చేసే అవకాశం ఉంది. లోక్‌సత్తాపై మీకూ సదభిప్రాయమే ఉంటే, దానికి మనం దోహదపడదాం రండి. సాయం ఏ విధంగానైనా చెయ్యొచ్చు. అర్థికంగానూ, క్షేత్ర స్థాయిలో పని చేస్తూను. ఆర్థిక సాయం వాళ్ళ వెబ్‌సైటులోనూ చెయ్యవచ్చు. క్షేత్ర స్థాయిలో కూకట్‌పల్లిలో పని చెయ్యదలిస్తే, మనం కలుద్దాం. ఆసక్తి ఉన్నవాళ్ళు ముందుకు రండి.

  రిప్లయితొలగించండి
 46. చదువరి గారు, లొక్ సత్తా పట్ల నాది కూడా మీ అభిప్రాయమే నండి. నేను ప్రవాసం లో ఉన్నందుకు క్షేత్రస్థాయి లో పని చేయడం కుదరదు గాని నాకు వీలయినంత నేను చేస్తాను. ఇంకో విషయం అండి మన బ్లాగుల ద్వారా మనం ఎదైనా చేసే అవకాశం వుందా.ఎదైన అవకాశం వుంటే నా వంతు బాధ్యత నిర్వర్తించడానికి నేను సిద్దం.

  రిప్లయితొలగించండి
 47. మొత్తం చదివాను.

  @చదువరి గారు
  మీకు అభినందనలు. ఎప్పటికప్పుడు ఎదురవుతున్న ప్రతీ సమస్య గురించి మీరు ఆలోచించి స్పందించడం నన్ను ప్రభావితం చేస్తుంది. నాలో ఉన్న బద్ధకాన్ని వెక్కిరిస్తుంది. మీ టపా చాలా సమగ్రంగా ఉంది. పరిష్కార మార్గాలనే చూపారు. నాకు ఆ దిశే కనపడింది కానీ, ఏదో మతప్రాతిపదికగా పక్షపాతంగా పరిష్కారాలు సూచించినట్టు కనపడలేదు... మీ మీద ముద్ర వేసినా సమర్ధంగా, సంయమనంతో ఎదుర్కొన్నందుకు మరిన్ని అభినందనలు.

  @ కత్తి మహేష్ గారు

  "నిరాశ,భయం,అపనమ్మకం,దిగులు,ఆవేశం,విద్వేషం నింపే దిశగా వుంటున్నాయేగానీ సమస్యకు సమాధానాలు వెతికే దిశగా వుండటం లేదు.

  దాదాపు హిందూవాద భావజాలంలాంటి మీ ఆలోచనల యొక్క ఉద్దేశం అదే అయినప్పుడు సమస్య లేదు.కానీ ఎవరైనా కొంత alternative ప్రతిపాదిస్తే వాళ్ళని pseudo-secularist లేదా hypocrites అనే ముందు మీలోని pseudo-hindusit(కొత్తపదమా!!), hypocrite ని ఒకసారి చూసుకోండి"

  మీరు ఆ పదాలు ఎందుకు ఎక్కువగా వాడుతున్నారో నాకు అర్ధం అవ్వడం లేదు. చదువరిగారి గత టపాలోను, ఇక్కడ కూడా! please stop using them before those words become cliches ( తెలుగులో ఊతపదాలు సరైన అర్ధం). నాకు ఈ దాడుల నేపధ్యంలో చదువరి రాసిన టపాలలో ఆందోళన కనపడింది(ఆయన దిగులుని వ్యక్త పరచినా), ఆ ఆందోళన నుండి సమగ్రమైన పరిష్కార మార్గాలు అన్వేషించాలి అనే ఆలోచన కనపడింది.

  నాకు ఈ టపాలో మత పక్షపాతం ఎక్కడా కనపడలేదు.

  పది మందితో సమాలోచన చెయ్యాలి అని ప్రయత్నించే ( సమస్యకి పరిష్కారం కావాలి అనే నిజయితీతో కూడిన ప్రయత్నం) మనిషికి ఒక కొత్త ముద్ర వేసేసి, పరిష్కార మార్గాన్నో పరిష్కారాన్నో మీరు సూచించకుండా రాళ్ళు విసరడం అనేది నిజంగా నాకు విభ్రాంతి కలిగిస్తుంది... విషయ సమగ్రత/వ్యక్తిత్వ సమగ్రత లేని వ్యక్తి కానీ, సమగ్రత కోసం ప్రయత్నించే వ్యక్తి అయ్యి ఉంటే అతనికి మీరు వేసిన ఆ ముద్ర చాలా నష్టం కలిగిస్తుంది. చర్చని ముందుకు సాగనివ్వదు.

  మొత్తం చదివాను. మీరు అసలు టపాలో విషయం గురించి చర్చించలేదు. పరిష్కారాన్నీ సూచించలేదు.

  @ఇస్మాయిల్ గారు
  అవును, మీరు స్మైలీ పెట్టినా పెట్టకపోయిన అది నాకు కూడా ఇబ్బంది కలిగించిన వ్యాఖ్యే. ఇంకో విషయం కమాల్ హుస్సైన్ పేరు చూసి ఫ్రాన్స్ వాళ్ళు ఆపేసిన ఉదాహరణనే చదువరి గారు చుపించారు. యూరోప్ లో కూడా ఇస్లాం తీవ్రవాదం ఉంది దానికి కారణాలు ఏవైనా కావొచ్చు. వాళ్ళకి అనుమానం వచ్చింది ఆపేసారు. చదువరి గారి మాటల్లో నాకు కేవలం పేరు చూసి మాత్రమే ఆపెయ్యాలి అనో, తప్పు లేకుండా కూడా ఆపెయ్యాలనో, ముస్లిం అయ్యాడు కాబట్టి ఆపెయ్యాలనో ద్వనించలేదు. కేవలం అనుమానం వచ్చింది, ఆలోచించకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారు అని మాత్రమే కనపడుతుంది.

  ఇంకో విషయం, అజ్ఞాత చేసిన వ్యాఖ్యలో "పాకిస్తాన్= ముస్లిం= తీవ్రవాదం=భారతీయ ముస్లిం" ఈక్వేషన్ కనపడలేదు. అలా అని ఆ అజ్ఞాతకి మహేష్ గారు ఆపాదించారు.. ముద్ర వేసారన్నమాట. మీరు దానికి స్పందించకుండా ఉంటే బాగుండేది. అలా స్పందించడంలో బాగంగా ఈ టపాకి సంభంధంలేని వ్యాఖ్య చెయ్యడం వల్ల అనవసరమైన రచ్చ జరిగింది.

  చివరి విషయం, మీరు చదువరి కి చెప్పిన మాటల్లో "కానీ మళ్లీ మళ్లీ మీరు (కుహనా లౌకికవాదులు జపించినట్లు) ఒకే మంత్రాన్నే జపిస్తున్నారు. మీ పంథా మార్చుకోమని చెప్పడం లేదు కానీ, కనీసం సొలుతిఒన్స్ తెలిపే టపాలో నైనా కాస్త నిగ్రహం వహించాల్సింది." ఒకే మంత్రం అన్నారు. అసలు మీకు అనిపించిన ఒకే మంత్రం ఏంటో నాకు అర్ధం కాలేదు. మరి చదువరి గారికి కానీ, ఇంకెవరికైనా కానీ అర్ధమయిందో లేదో!

  నాకైతే ఈ టపాలో చాలా నిగ్రహం కనపడింది. మీరే కొంచెం emotional అయి వ్యాఖ్యలు రాసినట్టుంది.

  రిప్లయితొలగించండి
 48. ముస్లింల వెనుకబాటుతనం, నిరక్షరాస్యత మొ!! సామాజిక సమస్యలు. ఉగ్రవాదం, మతోన్మాదం జాతీయ భద్రతా సమస్యలు. ఈ రెండిటిని ఒకదానితో ఒకటి ముడిపెట్టి చూడటం కరక్ట్ కాదు. ఈ దేశం లో చాలామంది కులమతాలతో సంభందం లేకుండా పేదరికం, అవిద్య వంటి సమస్యలతో వున్నారు. వారందరి సమస్యలో భాగం గానె ముస్లింల సమస్యని కూడ చూడాలి కాని దానికి ప్రత్యేకత ఆపాదించటం, భద్రతా సమస్య లో భాగం చెయ్యటం కూడదు.

  కొంతమంది మనకి పాకిస్తాన్ తో geo-political సమస్య అని, దానివల్లే ఉగ్రవాదం అని majority-minority/ఇస్లాం మతం తో దీనికి అసలు ఏ సంభందమూ లేదనట్లు మాట్లాడుతున్నారు. మరి
  మనం కష్టపడి స్వాతంత్రం ఇచ్చిన బంగ్లాదేశ్ తో మనకి ఉన్న geo-political సమస్య ఏంటీ?
  ఆఫ్గానిస్తన్ తో వున్న geo-political సమస్య ఎంటీ?
  దావూద్ ఇబ్రహిం తో వచ్చిన geo-political సమస్య ఎంటీ?
  అసలు పాకిస్తాన్ తో ఉన్నది కేవలం geo-political కుట్ర అయితే దాన్ని ఎలా అయిన ఎదుర్కోగలం. కానీ వచ్చిన చిక్కంతా కొందరు ఇంటి దొంగల గురించే. మతం కారణం గా వీళ్ళు వారికి మద్దతు ఇస్తున్నారు. కాబట్టి దీన్ని మతం నించి వేరు చేసి చూడలేము. చదువరి అన్నట్లు ఉగ్రవాదులకి సహకరించే ఇంటిదొంగలని తిడితే అది ముస్లిం దూషణ అనేది కొందరి విషయం లో నిజమే అనిపిస్తుంది.

  అసలు ఇక్కడ సచ్చార్ కమిటి ప్రస్తావన ఎందుకు వచింది? ఈ బ్లాగు కంటెస్ట్ ఉగ్రవాద నిర్మూలన అయినప్పుడు? ఆ రెండిటికి correlation పెట్టాలని ఎందుకు చూసున్నరో అర్ధం కాదు. చదువరి గారు వ్రాసిన దాన్లో ఉగ్రవాద నిర్మూలన కి ఎన్నో చర్యలు సూచించారు. వ్యవస్థ ఎలా వుండాలో తన అభిప్రాయం చెప్పారు. ఇవేమి కనపడక పోగా, ఎక్కడా mention చెయ్యని నిరాశ, నిస్పృహ, విద్వేషం, అపనమ్మకం మాత్రమే ఎందుకు కనిపించాయి. బ్లాగుని ఏ కోణం లోంచి చూస్తున్నరో అర్ధం కావట్లేదు. నిజానికి భద్రతాదళాలకి సరైన రక్షణ కవచాలు, night vision lens లాంటివి కూడా లేవని తెలిసిన ఇటువంటి పరిస్థితులలో అపనమ్మకం, నిరాశా కాక సంతోషమేస్తుందా? సోమాలియా, సూడాన్ , ఉగాండా లాంటి పరిస్థితులు మనకి లేవు కదా అని..ఏమో, ఈ తోలు మందం నేతలు మనకి అంతటి భాగ్యం కలిగించినా ఆశ్చర్యం లేదు.

  పొలిటికల్ ఇంటెరెస్ట్స్ తో రాజీ పడని మంచి నిఘా, భద్రతా వ్యవస్థని కోరుకోవటం 'దాదాపు హిందూ భావజాలం తో సమానమైతే' నాది అదే.
  ఇస్మాయిల్ గారు, మీరు చదువరి చూపిన కమాల్ హుస్సేన్ ఉదహరణ వరకే చదివినట్లు గా ఉంది. తను ఆ తర్వాత జార్జ్ ఫెర్నాండెజ్ ఉదంతం కూడ వ్రాసి, దాన్ని సమర్ధిస్తూనట్లుగా మాట్లాడారు. అది ఎలా ఓవర్ లుక్ చేసి, రాజీ పడలేకపోతున్నా అని కామెంటారు? ఇక్కడ జార్జ్ ఫెర్నాండెజ్ క్రిస్టియన్ పేరు అయినా కూడా వాళ్ళు తనిఖీ చేసారు కదా మరి.

  Times లో వచ్చిన ఈ వ్యాసం ఎవరో లింక్ ఇస్తే చూశాను. ఇది చదివితే తెలుస్తుంది, విద్యావంతులైన ముస్లింలలో కూడ ఆలోచనా ధోరణ్ని ఎలా ఉందో..ఇది నేను మీకు ఆపాదించట్లేదు. కేవలం కొందరిది ప్రొజెక్ట్ చెయ్యటానికి ఇస్తున్నా.
  మచ్చుకి,!
  "Still, many South Asian Muslims insist Islam is the one and only force that can bring the subcontinent together and return it to pre-eminence as a single whole. "We [Muslims] were the legal rulers of India, and in 1857 the British took that away from us," says Tarik Jan, a gentle-mannered scholar at Islamabad's Institute of Policy Studies. "In 1947 they should have given that back to the Muslims." Jan is no militant, but he pines for the golden era of the Mughal period in the 1700s and has a fervent desire to see India, Pakistan and Bangladesh reunited under Islamic rule"

  link: http://www.time.com/time/world/article/0,8599,1862650,00.html

  తాడేపల్లి గారు, కొంతమంది ఉగ్రవాదానికి, ముస్లింల స్థితిగతులకి లింక్ పెట్టినట్లు, మీరు కూడా మతమార్పిళ్ళకి లంకె పెట్టటం సబబు కాదేమో. మీ వ్యాఖ్య ఉద్దేశ్యం అదో, కాదో నాకు మాత్రం అలా అనిపించింది. మతమార్పిళ్ళు భద్రతా సమస్య కాదు

  చదువరి గారు,
  వ్యవస్థ ఎలా ఉండాలో వ్రాసారు, అందుకు మనం చెయ్యవలసినవి కూడా మరింత విపులంగా, ఆచరణ లో పెట్టదగినదిగా చెప్తే బాగుండేది.

  నాకు తెలిసి, ప్రజాస్వామ్యం లో మార్పు ఓటు ద్వారానే వస్తుంది. బ్లాగు లో మనం చేస్తున్న చర్చలు, outcome, ఓటు వేసే ప్రతీవారికి చేరాలి.మన అభిప్రాయాలు ఇక్కడితో ఆగిపోకుండా ఎక్కడైతే మార్పు కి తొలి అడుగు పడాలో అక్కడి వరకు వెళ్ళలని నా ఆశ. అందుకే ఓటువేసే ముందు ప్రతీ కుటుంబం లోనూ, సమాజం ఏ విధం గా ఉండాలి, వాళ్ళ ఆకాంక్షలని తీర్చటానికి ఎవరు తగినవాళ్ళు అనే విషయాలలో చర్చ జరగాలి. విద్యావంతులున్న కుటుంబాలలో ఇది కొంత సాధ్యమే. కాని, గ్రామాలలో ఇందుకు అవకాశం తక్కువ. దీనికి నాకు తోచిన పరిష్కారం, నేను మరికొందరి మిత్రులు తో ఎన్నికలకి కనీసం ఒక వారం రోజుల ముందు మా ఊరికెళ్ళి, ఓటు విలువ, దాన్ని సరైన వాళ్ళకి వెయ్యాల్సిన ఆవశ్యకత తెలియచేయాలి అనుకున్నాం. ఇందుకు పెద్దల సహకారం కూడా తీసుకోవలనుకున్నాం. ప్రతీ ఇంటికి వెళ్ళి వివరించాలి అని భావిస్తున్నాం. అంతేకాదు, వాళ్ళకి ప్రభుత్వం, నేతలు అంటే ఏ అభిప్రాయం ఉందో తెల్సుకోవలని కూడా మా ప్రయత్నం. దీనిద్వారా వాళ్ళ ఆలోచనలు కొంత analyze చెయ్యలని అనుకుంటున్నాం. ఎందుకంటే చాలా మందికి రాజకీయ నాయకులనీ, అధికారులనీ పాలకులగా తప్పితే సేవకులుగా భావించట్లేదు. వాళ్ళ అభిప్రాయాలు తీసుకోవటం ద్వారా వాళ్ళు ఎందుకు అలా అనుకుంటున్నరో తెల్సుకోవలని మా ఉద్దేశ్యం, కాకపోతే, మా చిక్కల్లా ఒక్కటే, మొహమాటం కొద్దీ మేము చెప్పింది అంతా విని,చివరకు వాళ్ళు అవిస్తాం, ఇవిస్తాం, అవి-ఇవి రెండూ ఇస్తాం అని చెప్పే నేతల మాయ లో పడకుండా సరైన వాళ్ళకి ఓటేశాలా చెయ్యటం ఎలా అని? :( అంత చైతన్యం ఎలా తేవాలీ? వాళ్ళని అంత బాగా ఎలా motivate చెయ్యాలి? ఎలా explain చేస్తే అర్ధం చేసుకోగలుగుతారు? ఎలాంటి ఉదాహరణలు ఇవ్వాలి? వీటన్నిటి మీదా ఇంకా conclusion కి రాలేదు,

  I would like invite you to share ur thoughts at

  -indiasucceeds@gmail.com


  చివరగా, నాకు బ్లాగు లోకం లో అజ్ఞాత, చదువరి, ఇస్మాయిల్, తాడేపల్లి, మన్మోహన్ సింగ్, మారెప్ప లకి తేడా ఎంటో ఎవరైనా వివరించగలరు.. నేను ఆ కామెంట్ వ్రాయకపొయినా పేరు చెప్పుకోవటం ఎదో ప్రివిలేజ్ గా భావించటం ఎంటో తెలియట్లేదు.

  రిప్లయితొలగించండి
 49. @ఏకాంతపు దిలీప్: ఇదివరకూ ఒక చర్చలో జరిగినట్లే you have chosen not to see what I wanted to suggest. అలాంటప్పుడు చర్చే అప్రస్తుతం.

  నేను వాడే పదాలు cliche అయ్యుండచ్చు. అంతమాత్రానా (నా)నిజాల్ని నేను చెప్పకుండా ఉంటానా!

  ఈ సమస్యలకు సమాధానాలు వెతికే దిశగా చర్చలతోపాటూ కొన్ని ప్రయత్నాలూ చెయ్యడానికి అవకాశాలు వెదికేవాళ్ళలో నేనూ ఒకడ్ని. చదువరి గారి మార్గం నా మార్గం వేరైనా ఆశయం ఒకటే అనే నమ్మకం ఇంకా కొంత ఉంది.

  @సత్య:చదువరి గారి సూచనలతో నాకు సమస్య లేదు. అందుకే వాటి గురించి చర్చించలేదు. కానీ ఆ సూచనల నేపధ్యంలో వారు తెలివిగా pack చేసిన ideological rhetoric మాత్రమే నాకు ఆమోదయోగ్యం కాదన్నాను.

  అంటే, ఈ భావజాలం public discourse లో ఉన్నప్పటికీ నాకు ఆమోదం కాదని మాత్రమే అర్థం.Its an ideological difference in spite of accepting the facts he has put forth.

  రిప్లయితొలగించండి
 50. రాజకీయ కార్యాచరణకు దిగడమే ఏ సమస్యలనైనా ఎదుర్కొనే దారి. దానికంటే గత్యంతరం లేదు. లోక్ సత్తా పార్టీ తరపున ప్రచారం చేస్తానన్న చదువరి గారి దారే సరైనది.

  రిప్లయితొలగించండి
 51. @ mahEsh gaaru
  I would have considering choosing or not if you had suggested something.. మనం ఈ టపా గురించి మాట్లాడదాము. ఏమైనా suggest చేసారా మీరు? ఒకవేళ నేను కనుక్కోలేకపోయి ఉంటే ఇదీ నేను సూచించాను అని చెప్పండి తెలుసుకుని మాట్లాడతాను. ఇందులో సూచించిన దాని మీద చర్చ చేసారా? ఈ సూచనలని శల్యపరీక్ష చేసారా? నాకైతే కాదు అనిపిస్తుంది. మీరు అంటున్న rhetoric ideology ఎలా కనపడిందో?

  ఊతపదాలు ఎందుకు వాడతారో, ఆయా సంధర్భాల్లో ఎందుకు వాడారో ఎవరికీ తెలియదు. ఆ ఉద్దేశంతోనే నేను రాసాను. అవి వాడుతుంటే మాట్లాడటం తేలిక అవుతుంది అవి వాడేవాళ్ళకి.మీరు ఇక్కడ వాడిన పదాలు ఎందుకు వాడారో చదివే అందరికీ తెలియకపోతే వాటిని పట్టించుకోరు...

  ఇకపోతే మీరు చేసిన వ్యాఖలు సద్విమర్శలలాగా నాకు అనిపించలేదు.రాళ్ళు విసురుతున్నట్టు ఉంది...

  రిప్లయితొలగించండి
 52. లౌకికవాదం..కుహనా లౌకికవాదం అంటే ఏంటి? (సెక్యులరిజం అని మాత్రం చెప్పకండి బాబోయ్)
  మమ్మల్ని ఏయిర్‌పోర్టులో తడిమిచూశారు తెలుసా అనేవాళ్లని కంటిచూపుతోనే కాల్చెయ్యాలనిపిస్తుంది.
  ఒక ఆసక్తికరమైన విషయం గమనించా..అదేంటంటే బీబీసీలో ఒక జనరల్ ఒపినియన్ సర్వేలాంటిది చేశారు. అందులో ఈ దాడులకు భారత్ పాకిస్తాన్ని దోషిగా చూపెడుతుంది. మరి మీరేమంటారు? అని వీధిలో ప్రజలను అడిగితే ఒక్కరు కూడా అవును పాకిస్తాన్ దే బాధ్యత అని అనలేదు..అమ్మతోడు http://news.bbc.co.uk/2/shared/spl/hi/pop_ups/08/south_asia_mumbai_attacks0_karachi_voices/html/1.stm
  దీనికే సంబంధించిన మరో విషయం డాన్ పత్రిక కాలమిస్ట్లందరూ (ఐదు మంది) పాకిస్తాన్ బాధ్యత ఉంది. ఈ విషయమై ఏదో ఒకటి చెయ్యాలి అని ఒప్పుకోవటం విశేషం. మచ్చుకు ఒకటి. http://www.dawn.com/weekly/mahir/mahir.htm

  రిప్లయితొలగించండి
 53. రవీ,
  Dawn లింకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు.

  అక్కడి దాకా ఎందుకండీ, ముంబాయి లో మూడవ రోజు పోరాటం ఇంకా కొలిక్కి రాకముందే, అసలెవరు చేసారు అన్న విచారణ ఇంకా ప్రారంభమవ్వకముందే , మన ఘనత వహించిన 'The Guru' దీపక్ చోప్రా గారు సి ఎన్ ఎన్ లో 'India should stop blaming Pakistan' అని సెలవిచ్చారు. అమ్మ తోడు exact quote . ఇంకా వేరేవి PC statements కూడా ఇచ్చాడనుకోండి. ఇహ మన Bernie Kerik గారు, 'all they have is one guy in custody, they can't blame Pakistan on his revealings' అని కూడా భోధించారు. వెతికే ఓపిక లేదు, లింకులు కావాలంటే ఇస్తా.

  రిప్లయితొలగించండి
 54. @ఏకాంతపు దిలీప్: ఇక్కడ జరుగుతున్న చర్చ ఇదివరకటి టపాలో సాగిన దానికి కొనసాగింపు. ఆ విషయం చదువరిగారికీ ఆ చర్చల్లో పాల్గొన్నవారికీ విదితమే! మధ్యలో మీరే సగం విషయపరిజ్ఞానంతో judgments pass చేస్తున్నారు.

  నేను వాడేవి ఊతపదాలు కావు.కొన్ని వందలపేజీల విశ్లేషణ కలిగిన అర్థవంతమైన భావాలు పొందుపరచబడిన పదాలు.వాటి పుట్టుపూర్వోత్తరాలు, చారిత్రక ప్రాముఖ్యతా,సామాజిక అర్థవంతత తెలీకుండా మీరు తేలికచెయ్యడం నా మూర్ఖత్వంకన్నా మీ తెలియని తనాన్ని బయటపెడుతోంది.

  నేను విమర్శ కాకుండా రాళ్ళు విసరడం ఉద్దేశంగా పెట్టుకునుంటే సరైన రాళ్ళని ఎంచుకుంటాను. అవి చాలా బలంగా, సరైన చోట తగలగలవు. కానీ నా ఉద్దేశం అది కాదు. ఈ బ్లాగరికి కూడా ఆవిషయం సుస్పష్టంగా తెలుసు. అందుకే నా వ్యాఖ్యల్ని ఖండించడమో లేక విభేధించడమో చేస్తున్నారేతప్ప మీలా అర్థరహితమని ఎద్దేవా చెయ్యటం లేదు.

  రిప్లయితొలగించండి
 55. @రవి వైజాసత్య: మీరు సరదాగా అడిగినా చాలా fundamental ప్రశ్న అడిగారు.మతానికీ మతనమ్మకాలకీ అతీతంగా యంత్రాంగాన్ని నడిపే ప్రభుత్వాలను లౌకికవాద ప్రభుత్వాలంటారు. ఇలాంటి ప్రభుత్వాలు నిజం,అధారం,తర్కాల్ని మూలాలుగా చేసుకుని నిర్ణయాలు తీసుకుంటాయోతప్ప మతపరమైన నమ్మకాలు,సాంప్రదాయాల ఆధారంగా కాదు. అంటే రాజకీయానికీ మతపరమైన లంకె తెగ్గొట్టడాన్ని సెక్యులరిజం అంటారు.

  రాజ్యాంగపరంగా మనం లౌకికప్రజాస్వామ్యమైనా,ఓటుబ్యాంకు రాజకీయాల నేపధ్యంలో అత్యంత ప్రభావితమైన మతాన్ని రాజకీయ వ్యవస్థనుంచీ దూరం చెయ్యలేకపోయాము.ప్రభుత్వాలు రాజకీయాలతో మమేకమైపోవడం వలన ప్రభుత మరియూ రాజకీయ వ్యవస్థలు రెండూ మతపరమైన ప్రభావం నుంచీ తప్పించుకోలేక పోయాయి.

  ఈ పరిణామక్రమంలో హిందుత్వ(మెజారిటీ)వాదంతో రాజకీయ రంగప్రవేశం చేసిన బీజేపీ పార్టీ (ఓటుబ్యాంకు రాజకీయాలలో భాగంగా)ముస్లింలనూ, క్రైస్తవులనూ మరియూ ఇతర మతాలపట్ల సానుకూలవైఖరిని కలిగివున్న కాంగ్రెస్ ప్రభుత్వాలను "కుహానా"లౌకికవాద పార్టీగా ముద్రవేసింది. ముఖ్యంగా ఈ పదాన్ని కనిపెట్టిన ఘనత శ్రీ ఎల్.కె.అద్వానీ గారికి దక్కుతుంది.

  ఇక్కడ గమనించాల్సిందేమిటంటే, కాంగ్రెస్ ను కుహానా లౌకికవాది అని ముద్రవేసే బీజేపీకూడా మతారాధిత రాజకీయాన్ని లక్ష్యంగా చేసుకుంది కాబట్టి ఆ పార్టీకూడా కుహానాలౌకికవాద పార్టీయే!అంటే, మొత్తానికి మన భారతదేశంలో ఏ రాజకీయపార్టీ కూడా సెక్యులర్ కాదన్నమాట. పార్టీలు లౌకికవాదులు కానప్పుడు ప్రభుతలు మాత్రం సెక్యులర్ ఎలా అవుతాయి?

  ఇక్కడ లౌకికవాదం అనే ఆలోచనలో ఎటువంటి సమస్యా లేకపోయినా, మన రాజకీయ వ్యవస్థ దేశాన్ని రాజకీయాల్నీ లౌకికవాదిగా ఉంచడంలో అసమర్ధులయ్యాయని చెప్పొచ్చు.

  రిప్లయితొలగించండి
 56. Judgementlu మీకన్నా ఎవరు బాగా పాస్ చెయ్యగలరు? మీ వాదనని నెగ్గించుకోవాలి అనుకుంటే ముద్రలు కూడా వెయ్యగలరని తెలుసు... నేను మిగిలిన టపాలు చదవలేదనుకోవడం మీ అజ్ఞానం.

  ఆ పదాలకి ఉన్న విలువ నాకు తెలుసు. మీరు వందల పేజీలు చదివి ఉండొచ్చు. అన్ని పేజీలు చదివే సమయం నాకు లేకపోయినా నేనూ కొన్ని వందలు జాతీయ, ప్రాంతీయ పత్రికల్లో అడపా దడపా పుస్తకాల్లో చదివి తెలుసుకున్నదే... కానీ అలా చదవడం ద్వారా తెలిసిన పదాలు,వాటి ప్రాముఖ్యతని గుర్తించి అవసరం ఉన్నా లేకున్నా నేను ఇక్కడ పెట్టదలచుకోలేదు.. ఎందుకంటే ఇక్కడ చదువరి గారి రచనకి ఆ పదాలని జోడించాల్సిన అవసరం నాకు కనపడ లేదు... అంతగా అవగాహన లేని ఆవేశపరులు,అమాయకులు, మూర్ఖులు మాట్లాడినప్పుడు వారి ముందు అలాంటి పదాలు ఉపయోగించండంలో అర్ధం ఉంది... ఇక్కడ ఉపయోగిస్తే అది rhetoric గా అనిపిచి, out of context gaa కూడా అనిపించింది నాకు.

  మీరు చదువరి గారి "దిగులుగా ఉంది" రచనకి judgement పాస్ చేసేసారు ( అసలు దాని స్పూర్థి ని అర్ధం చేసుకోకుండా). అది చదివి మీ వ్యాఖ్య చదివితే మీరే ఏదో rhetoric gaa ( రాజకీయులు ఇలాంటప్పుడు చేసే cliche వ్యాఖ్యల్లాగా) మాట్లాడినట్టనిపించింది కానీ దాని స్పూర్తిని, అందులో ఆందోళనని, ఆలోచనని అర్ధం చేసుకున్నట్టు కనపడలేదు...
  ఈ టపాలో కూడా అలానే అనిపించింది... అంటే టపా స్పూర్తిని, అది సూచించే దాని గురించి సరైన ఆలోచన చెయ్యకుండా మీరు ఇంకకుముందు చదువుకోవడం ద్వారా వచ్చిన జ్ఞానాన్ని ఇక్కడ ప్రదర్శించినట్టుంది... అసంధర్భంగా...!

  ఒక విషయం ఏంటంటే మీరు చేసే ప్రతీ వ్యాఖ్యకి చదువరి గారు స్పందించాలని లేదు. ఆయనకి అంత సమయం లేకపోవచ్చు. ఇంకా చదువరులు ఎవరైనా మాట్లాడతారేమో చూద్దాము అనుకుని కూడా ఉండొచ్చు. అలా ఎవరైనా వ్యక్తం చేసినప్పుడు తనకి ఆ అవసరం ఉండదు. ఆయనో లేకపోతే ఇంకో బ్లాగరో స్పందించనంతమాత్రాన మీ వ్యాఖ్యలకి ఆమోదం లభించింది అనుకోవడం అమాయకంగా అనిపిస్తుంది నాకు. నేను చేసే దానిలో ఎద్దేవా ఏముంది? మీరు అలా తీసుకోకండి అని చెపుతున్నాను. మీ వ్యాఖ్యల ఔచిత్యాన్ని ఈ టపాల పరంపరలో ప్రశ్నించానే గానీ దాన్ని మీరు ఎద్దేవాగా తీసుకోవడం మీరు చర్చకి ఎంత సిద్ధంగా ఉన్నారో తెలుపుతుంది...

  నేను ఎక్కడా మీది మూర్ఖత్వం అనలేదు.

  @చదువరి గారు, ఇది వ్యక్తి మీద దాడిగా అనుకోరనుకుంటున్నాను.

  రిప్లయితొలగించండి
 57. అయ్యా:
  "మనం ఈ టపా గురించి మాట్లాడదాము. ఏమైనా suggest చేసారా మీరు?"

  రిప్లయితొలగించండి
 58. ఇప్పటికే ఇక్కడ చాలా రచ్చ జరుగుతుంది. ఆ పెంట మీద నా ఱాయి.

  మొదటి విషయాలు మొదట, నేను ఈ టపా చదివి చాలా నిరాశ చెందాను, అది ఎందుకు అన్నది నేను సవివరంగా వివరింపదలచలేదు. ఇప్పటికే ఒకఱిద్దరు ఆర్యులు ఆ పని చేఁబట్టి తీవ్రంగా విఫలమయ్యారు. కానీ లెజండరీ బ్లాగర్లని కారణాలు చెప్పకుండా దూషించడం చాలా నిందతో కూడిన పనే అవుతుంది.అలాని విత్తనం వుంటేనే నీరు పోయగలం, ఒకరు చెబినంతనే ఇంకొకరు గ్రహిస్తారని నేననుకోను.

  మీ టపా, సగటు భారతీయుని స్పందన. భయపడితే ప్రాణులు స్పందిస్తాయి. భయపడ్డ నగరవాసుల typical స్పందన అద్భుతమైన భాషలో బధ్రపరచబడడం ఈ టపా. ఈ టపాలో నాకు కనిపించిన న్యాయమైన మాట : ఓటు బ్యాంకుల కోసం రాజకీయనాయకలు ముస్లింలకు కొన్ని ఇవ్వకూడని స్వాతంత్రాలని ఇస్తారన్నద్ది. అంతే! అది అందరికీ తెలిసిన విషయమే.

  ఇదే అంశం మీద ఒక గాంధీగారో రవీంద్రనాథుడో ఎలా స్పందిస్తారో ఒక సారి ఊహించుకోండి. గొప్ప వారి ఊహ మనకు పూర్తిగా అందదు, కాబట్టి కనీసం స్ఫూర్తిపొంది ఆలోచించండి ఒక్క క్షణం. వారు ఐడియలిష్టులు, వారి కాలం చెల్లింది - అని నన్ను కొట్టి పారేస్తే నేను చెప్పేదేదీ లేదు.

  ముస్లిములను మత ప్రాతిపదికన ఏర్పడిన ఒకే వోటు బ్యాంకుగా రాజకీయ నాయకులు చూసే స్థాయికి ముస్లిములే తెచ్చుకున్నారు
  ఇలాంటి వ్యాఖ్యలు ఇతర టాప్ బ్లాగర్ల టపాల్లో తఱచూ చూస్తూంటాము గాని, మీ బ్లాగులో ఎప్పుడూ చూడలేదు. సోదరుని అజ్ఞానాంధకారాన్ని క్షమించని రోజులనుకుంట ఇవి. అయినా మనం మాత్రం వెలుగుఁలో వున్నామనెందుకనుకోవాలి? అందరం వెలుగులో వుంటే ప్రపంచం ఇలా ఎందుకుంటుంది. ఆ ౧౩ సూత్రాలు కాలేజి పిల్లల్ని ఎమ్‌టీవీ వారు కింకర్తవ్యం అని అడిగితే వారు చెప్పే మాటల ధోరణిలో వున్నాయి. ఆ ధోరణిలో కాకుండా ఇంకేమైనా ఉన్నతాలోచనలు వస్తే చెప్పండి.

  తీవ్రవాదుల విజయంలో వారు చంపిన జీవితాలు సగం మాత్రమే. మిగిలిన సగం బ్రతికి వున్న పురవాసుల గుండెల్లో వారు పాతిన భయం, పిల్లిగడ్డం వున్న తోటిదేశీయునిపై వారు మన మనసులో పాతిన అసహ్యపు మొలకలు!

  రాకేశ్వరం

  ముఖ్య గమనిక నా వాఖ్యకు నా పరిచయం లేని వారు స్పందించరాదు. అజ్ఞాతులు ససేమిరా స్పందించరాదు. ఐ గాట్ నో పేషన్స్ ఫర్ క్రాప్.

  రిప్లయితొలగించండి
 59. రాకేశ్వరం: యు గాట్ నో పేషన్స్ ఫర్ క్రాప్! నిర్హేతుకంగా మిమ్మల్ని తిడితే మీకు నచ్చదు. అడ్డదిడ్డంగా వాదిస్తే, చెత్త రాసేస్తే మీకు చిరాకు, సహించరు -అది నా బ్లాగైనా, మీ బ్లాగైనా! నాకూ నచ్చదు, నేనూ సహించను. ఆ చెత్త మన గురించో, మనమీద రాస్తేనో మాత్రమే గాదు, తోటి బ్లాగరుల మీద రాసినా కోపం వస్తుంది. అలా చెత్త రాసినవాళ్ళనుగూడా 'సాటి జాలజనులేగదా, ఏదో తెలివి తక్కువగా రాస్తున్నార్లే' అని సరిచెప్పుకుని వాళ్ళ అజ్ఞానాంధకారాన్ని క్షమించగలమా? గలము, కానీ కొంతవరకే! మన సహనానికీ హద్దులున్నాయి గదా! మీరూ హెచ్చరించారు, నేనూ హెచ్చరించాను (నా వ్యాఖ్యల పెట్టె పైన చూడండి)

  ఇప్పుడు చెప్పండి, ఆ అజ్ఞాత చెత్త వీరులంటే మనకు భయమా? కేవలం కోపం, అసహ్యం -అంతే!

  ఇక, మనకు వాళ్ళమీద కోపం వచ్చి హెచ్చరించాం, అయినా వాళ్ళు ఆగుతారా? ఇప్పటిదాకా ఏరా, ఒరేయ్ అన్నవాళ్ళు, తరవాత బూతులు తిడతారు. అంతమాత్రాన మనమూరుకుంటామా? ఊరుకోం, ఆ బ్లాగుస్పాటు వాడికి చెప్పి 'ఈ బాపతు అనామకులను రానివ్వకురా బాబూ' అని వేడుకుంటాం, గోలెడతాం. అవకాశం ఉంటే వాడి జుట్టట్టుకుంటాం. (జుట్టు కాదుగదా, వాడి కాలిగోరు కూడా పట్టుకోలేమన్న సంగతి తెలిసినప్పటికీ ప్రయత్నం చెయ్యక మానం. వీడుగాకపోతే వర్డ్‌ప్రెస్సాడిదగ్గరికి వెళ్దామనుకుంటాం. వాడూ ఇట్టాంటి ఎదవేనని తెలిసినా )

  ఒకవైపు అలా చేస్తూనే, మరోవైపు సాటి బ్లాగరులందరమూ చెప్పుకుంటాం... 'ఈ బాపతు అనామక జనాన్ని మన బ్లాగుల్లో వ్యాఖ్యలు రాయనివ్వవద్దు, ఒకవేళ రాసినా వెంటనే తీసవతల పారేద్దాం. అవకాశం ఉంటే నిషేధించేద్దాం' అని కట్టుగా అనుకుంటాం. అనుకుంటామా అనుకోమా? (నేను ఈ జాబులోనే రెండు తిట్ల దండకాలను తీసేసాను. పైన చూడొచ్చు. నన్ను తిట్టినవి కావవి, నా తోటివారిని తిట్టినవి.)

  ఎంత అలా కలసికట్టుగా ఉన్నప్పటికీ, కొందరు బ్లాగరులు మనతో కలవకుండా, పనిగట్టుకుని అజ్ఞాతులను ఉసిగొలిపి, తమ తమ బ్లాగుల్లో సాటి బ్లాగరుల మీద క్రాప్ రాయించారనుకోండి, మనమేం చేస్తాం? దాన్నెలా ఆపాలో చర్చించుకోమూ? వాళ్ళు ఆ తిట్ల దండకాలను తమ బ్లాగుల్లో రాయనివ్వడం తప్పని మనం అనుకోమూ? వాళ్ళను ఆపాలని అనుకోమూ? ఆ పని ఆపని పక్షంలో కూడలి నుండి గెంటాలని అనమూ? ఊరుకున్నామా? చర్చించామా లేదా? తప్పేనని తేల్చామా లేదా? ఆపించామా లేదా? కూడలి నుండి గెంటాలని అన్నామా లేదా? -నేరుగాగానీ, అన్యాపదేశంగాగానీ! గెంటామా లేదా?

  అలా సాటి బ్లాగరులను తిట్టిన సంఘటన జరగడం అదే మొదటిసారా? కాదు, అంతకుముందూ జరిగాయి. కానీ మనం సహనం వహిస్తూ వచ్చాం. (వాళ్ళూ 'సాటి జాలజనులేగదా, ఏదో రాయనిస్తున్నార్లే' అని సరిచెప్పుకుని వాళ్ళ అజ్ఞానాంధకారాన్ని క్షమించాం.)

  మనిద్దరికీ తేడా అంటూ ఉంటే అది ఒకటే -మీకు సహనం ఎక్కువ. నాక్కాస్త తక్కువ. కానీ, మీ సహనం అనంతమైనదేమీకాదు. కదూ?

  రిప్లయితొలగించండి
 60. బ్లాగులో ఏదో ఇబ్బంది వచ్చి డా. ఇస్మాయిల్ గారు వ్యాఖ్య రాయలేకపోయారు. ఆయన పంపిన వ్యాఖ్య ఇది.
  -----------------------------------------------------------------------------------
  @రాకేశ్వర రావు...

  1.Well said.
  2.'Pun'ను పొడిచారుగా:-)
  3."ముఖ్య గమనిక- నా వాఖ్యకు నా పరిచయం లేని వారు స్పందించరాదు. అజ్ఞాతులు
  ససేమిరా స్పందించరాదు. ఐ గాట్ నో పేషన్స్ ఫర్ క్రాప్." మీ మాటే, నా మాట
  కూడా!

  @Kumar...
  మీ స్నేహానికి చేయి చాస్తూ... ఇప్పుడే మీకో మెయిలు కొట్టాను:-)
  ------------------------------------------------------------------------------------

  రిప్లయితొలగించండి
 61. రాకేశ్వర రావు గారూ, మీ వ్యాఖ్యకూ, ఈ క్రింది దానికీ ఏ సంబంధం లేదండీ.నేను మీ టపాల అభిమానిని.
  ------------------------------------------

  చదువరి గారూ, మీ రిప్లై లో నాకయితే నిగూఢ భావాలు చాలా కనబడుతున్నాయి. మీ సమాధానంలో "అజ్ఞాత చెత్త రాసే వీరుల" స్థానంలో ఈ ఇస్లామిక్ టెర్రరిస్టులూ, "బ్లాగు స్పాటు" స్థానంలో పాకిస్తాన్ ని, "సాటి బ్లాగర్ల" స్థానంలో దేశంలో ఉన్న తోటి ముస్లిములని పెడితే, you drove your point very succesfully అని నాకనిపిస్తోంది.

  సమస్యల్లా ఏంటంటే, ఇన్ని సంవత్సరాల నుంచి "సహనం" వహిస్తోంది ఒక వైపు వాళ్ళే అనీ, మళ్ళీ మళ్ళీ వాళ్ళనే సహించమని అడగడం నాకు సబబుగా తోచడం లేదు. మనమేమీ ఇప్పుడెళ్ళి అందర్నీ చంపమనడం లేదు కదా. మాకూ కొన్ని షరతులూ, అంచనాలూ ఉంటాయి ప్రభుత్వాల దగ్గర్నుంచీ, ethnic groups నుంచీ అని నొక్కి చెప్పదల్చుకున్నాం అంతే.

  On the other hand, there is a self-proclaimed spritual guru preaching here that, if we take real hard-core stand against muslims, we run into the risk of turning moderates into extremists ani..నాకు నవ్వాలో ఏడవాలో తెలీడం లేదు ఈ జ్ఞానుల అజ్ఞానానికి. అది రెండు పక్కలా వర్తిస్తూంది కదా అన్నది వీళ్ళకు ఎందుకెక్కదో. హిందువులని వీరబాదుడు బాదుతుంటే వాళ్ళలో మోడరేట్స్ కూడా extremism వైపు మళ్ళుతారు కదా!!!!..మరి ఫండమెంటలిస్టిక్ ఇస్లామిక్ దేశాలకి వెళ్ళి ఇలాంటి భోదనలు ఎందుకు చేయరో మరి ఈ so-called secular liberal peace-mongers.

  రిప్లయితొలగించండి
 62. కుమార్: మీరూహించింది నిజం, కొద్ది తేడాతో. నా ఉద్దేశమిది:
  అజ్ఞాతంగా చెత్త రాసేవారు -- ఇస్లామిక్ టెర్రరిస్టులు
  బ్లాగు స్పాటు, వర్డ్‌ప్రెస్సు -- రాజకీయ పక్షాలు (ముఖ్యంగా అధికార పక్షాలు)
  బ్లాగరులు -- మనమంతా, జనమంతా
  అనామకులను ప్రోత్సహించే బ్లాగులు -- ఉగ్రవాదులను పోషించే ముస్లిములు

  ఏకాంతపు దిలీప్: మహేష్ గారికి ఇంతకుముందు వ్యాఖ్యలో చెప్పాను... "ఎందుకంటే మీరు చర్చించడం లేదు, తీర్పులు చెప్పేస్తున్నారు, ముద్దర్లేసేస్తున్నారు." అని.

  కత్తి మహేష్ కుమార్: పైన వైజాసత్యకిచ్చిన సమాధానంలో మీరు రాసారిది:
  "ఈ పరిణామక్రమంలో హిందుత్వ(మెజారిటీ)వాదంతో రాజకీయ రంగప్రవేశం చేసిన బీజేపీ పార్టీ (ఓటుబ్యాంకు రాజకీయాలలో భాగంగా)ముస్లింలనూ, క్రైస్తవులనూ మరియూ ఇతర మతాలపట్ల సానుకూలవైఖరిని కలిగివున్న కాంగ్రెస్ ప్రభుత్వాలను "కుహానా"లౌకికవాద పార్టీగా ముద్రవేసింది...."
  బీజేపీదేమో హిందుత్వ వాదం, మెజారిటీ వాదం. కాంగ్రెసుది మాత్రం క్రైస్తవుల పట్ల, ముస్లిముల పట్లా సానుకూలత -దీన్ని మాత్రం మైనారిటీ వాదం అనరు!! ఇవే ద్వంద్వ ప్రమాణాలంటే. సరైన రాళ్ళనే ఎంచుకున్నారు లెండి, బలంగా విసిరారు కూడా. ఈ రాళ్ళూ, ఇలాంటి రాళ్ళతోటే లౌఖిఖవాదులు హిందువులను కొడుతూంటే వాళ్ళు ఆర్తనాదాలు చేస్తున్నారు. ఇంతకంటే పెద్ద రాళ్ళను కూడా విసిరారు మీరు గతంలో- మరింత బలంగా, మరింత సూటిగా !

  రిప్లయితొలగించండి
 63. @చదువరి: మధ్యలో బ్రాకెట్ పెట్టి మరీ "ఓటుబ్యాంకు రాజకీయాలలో భాగంగా" అన్నాను. అంటే అదొక రాజకీయ అవసరం అనిమాత్రమే అర్థం అంతేతప్ప అది సరైన విధానమని కాదు. అయినా, if you chose to understand it other wise its fine with me.I know that we are pursuing different paths and may the aim still be the same.

  రిప్లయితొలగించండి
 64. కత్తి మహేష్ కుమార్: ఆ బ్రాకెట్టులో ఉన్న భాగం (దాన్ని నేనేమీ ఎగరగొట్టలేదు) మైనారిటీ పక్షపాతాన్ని దాచిపెట్టడం లేదు, నేను దాన్ని వేరొక రకంగా అర్థం చేసికోలేదు. అసలా వ్యాఖ్యలోని మైనారిటీ పక్షపాతాన్ని వేరొక రకంగా అర్థం చేసికొనే వీలేలేదు. బ్రాకెట్లు తీసేస్తే ఇలా ఉంటుందది:

  "ఓటుబ్యాంకు రాజకీయాలలో భాగంగా బీజేపీ మెజారిటీ, హిందుత్వ వాదంతో రంగప్రవేశం చేసింది, ఓటుబ్యాంకు రాజకీయాలలో భాగంగా కాంగ్రెసు, క్రైస్తవులూ ముస్లిముల పట్ల సానుకూల ధోరణిని అవలంబించింది." మీకు అత్యంత అనుకూలంగా బ్రాకెట్లను తీసేస్తే మనక్కనబడేది ఇది. హిందువుల పక్షాన మాట్టాడే బీజేపీదేమో మెజారిటీవాదం, క్రైస్తవులు, ముస్లిముల పక్షాన మాట్టాడే కాంగ్రెసుది వారి పట్ల సానుకూల వైఖరి. మైనారిటీ పక్షపాత ధోరణిని ఇది దాస్తోందా?

  ఈ విషయాన్ని ఇంతలా ఎందుకు తర్కిస్తున్నానంటే.. లౌకికవాదం ముసుగేసుకున్న ఈ మైనారిటీవాదం వల్లనే అనేక నష్టాలు కలుగుతున్నాయనేది నా బాధ కాబట్టి. ఈ "మైనారిటీ సానుకూల" వైఖరే మతాల మధ్య వైషమ్యాలు పెరగడానికి కారణం. లౌకికవాదం గురించి మాట్టాడేటపుడు నిక్కమైన, నిజాయితీతో కూడిన లౌకికవాదాన్ని వినిపించాలి; ముస్లిము, క్రైస్తవ సానుకూల వైఖరి కాదు. అలాంటి వాదాన్ని అందరూ చెవివొగ్గి వింటారు, ఆదరిస్తారు, గౌరవిస్తారు.

  రిప్లయితొలగించండి
 65. @చదువరి:నిక్కమైన లౌకికవాదం గురించి మాట్లాడాలంటే రాజకీయాల్లో,ప్రభుత్వాల్లో,బహిరంగప్రదేశాల్లో మతప్రసక్తి,ప్రవర్తనని నిషేధించాలి.వ్యక్తిగత హక్కులతో సంబంధం లేకుండా సార్వజనికమంచి కోసం పాటుపడాలి.అదినాకు అంగీకారమే! కానీ,అదిప్పట్లో అసాధ్యంగనక utopiaని మరచి reality లో మాట్లాడుకుందాం.

  ఇప్పుడు నేను చెప్పిన వాక్యంకన్నా, మీరు సవరించిన వాక్యంలో మరిన్ని లొసుగులు కనబడుతున్నాయి. గమనించగలరు.

  రిప్లయితొలగించండి
 66. కత్తి మహేష్ కుమార్: లొసుగా.. లొసుగేంటి?
  'నిజమైన లౌకికవాదం సాధ్యం కాదు', అంటే మీరు మాట్టాడేది మైనారిటీ (పోనీ.. 'సానుకూల' కలుపుకోండి) వాదమేనన్నమాట! - మొట్టమొదటిసారిగా వాస్తవానికి దిగొచ్చి మాట్టాడినందుకు నెనరులు. ఇకపోతే..,

  లౌకికవాదమనే పేరు పెట్టుకుని మాట్టాడ్డమెందుకు.., దాన్ని వదిలెయ్యండి.

  రిప్లయితొలగించండి
 67. మతాన్ని వాడుకొంటున్న వారు రాజకీయ నాయకులు, మత పెద్దలు.
  ఏ మతానికి చెందినా, సామాన్యులంతా అందులో పావులే. వాళ్ళ తప్పేమీ లేదు.
  ప్రతీ పౌరుడికి సమానావకాశాలు ( విద్య, ఉద్యొగం) కల్పిస్తే ఎవరూ ఉగ్రవాదులు కారు.

  రిప్లయితొలగించండి
 68. మానవత్వం ఏమతం? "ఆపదలోని మానవుడిపై అమృతం వర్షించే కరుణాంతరంగమే మతానికైనా, మానవత్వానికైనా సుక్షేత్రం కాగలదు. నిరుపేదలను ఆదుకోవటం వల్ల ముక్కోటి దేవతలను సందర్శించిన దానికంటే మించిన మోక్షం.ఆత్మతృప్తి కలుగుతాయి.(వార్త సంపాదకీయం 30-3-2003) ఇటీవల ఓ జిల్లా కేంద్రంలో నూర్ బాషాలు అంటే దూదేకుల కులస్థుల సమావేశం జరిగింది. హాజరయిన పెద్దలు "మనం ముస్లిములమా?హిందువులమా?" అనే మీమాంసంలో పడి రసవత్తరమయిన చర్చ జరిపారు. ఉర్దూ భాష నమాజురాకపోవటం వలన ముస్లిములు తమను చిన్నచూపు చూస్తున్నారని, వాళ్ళ పిల్లలకు తమ పిల్లల్నిచ్చి పెళ్ళిళ్ళు చేయటానికి ముందుకు రావడంలేదని కొందరు ముస్లిం దూదేకుల వారు వాపోయారు. మాకు తెలుగు మసీదులు కావాలన్నారు. నిజంగా హిందూ దేవుళ్ళను నమ్ముకొని తిరుపతికి పోయి గుండు చేయించుకొచ్చినా, సాయిబుల పేర్లుండటం వలన హిందువులు కేటాయించి చూస్తున్నారనీ, షేక్ శ్రినివాసరావు, షేక్ పద్మావతులు గూడా హిందువుల ఆదరణకు నోచుకోవటం లేదని, మరికొందరు హిందూ దూదేకులవారు బాధపడ్డారు. మన విలువ పెరగాలంటే దూదేకుల సిద్ధప్పను తలదన్నే తాత్వికులతో పాటు ప్రత్యేక పూజారులు, పురోహితులు కావాలన్నారు. వేటపాలెం దగ్గర మా మందంతా క్రైస్తవ మతం పుచ్చుకొని హాయిగా ఉన్నాం. చర్చిలో మమ్మల్ని ముందు వరసలో కూర్చోబెట్టి గౌరవిస్తున్నారు మాకు ఉర్దూ బెడదలేదు. కులం గొడవాలేదని షేక్ ఏసుపాదం, షేక్ దానియేలు లాంటి క్రైస్తవ దూదేకుల వాళ్ళు సెలవిచ్చారు. పైగా త్వరలో స్వంత చర్చి కడతారట. నూతిలో పడతావా? పాతర్లో పడతావా? అన్నట్లయింది సమావేశం. ఎవరి మతాన్ని వారు సమర్ధించుకున్నారు. మనమంతా ఒక కుల పోళ్ళం కాబట్టి మనకందరికీ ఒకే మతం ఉండాలని కొందరు పిడివాద దూదేకులు వాదించారు. ఎవరి మతం ఎవరు విదిచిపెడతారు? ఎవరి మతం వారిదేనని కొందరు ఉదారవాద దూదేకులు ఎదురు తిరిగారు. ఆహా! ఏమీ లౌకికవాదం! ఎంతటి అద్భుతమీ భిన్నత్వంలో ఏకత్వం! సకల మతాల సారాలను ఆచారాలను తనలో ఇముడ్చుకొని సర్దుకొని చక్కగా పోతున్న దూదేకుల ఐకృత వర్ధిల్లాలని కొందరు సెక్యులర్ దూదేకుల వారు అరిచారు. అన్ని మతాల వాళ్ళూ మనల్ని కరివేపాకుల్లాగా వాడు కొని అవతల పారేస్తున్నారు. వెనుకపడిన కులాల జనాభాలో 4 శాతం ఉన్నాం. ఎప్పుడన్నా మనకు ఎమ్మెల్యే పదవిచ్చారా? ఒక్క దూదేకుల వాడైనా ఐ.ఎ.ఎస్. ఆఫీసర్ అయ్యాడా? ఆర్ధికాభివృద్ధి లేకుండా ఈ మతాలెందుకు? అని కొందరు హేతువాద దూదేకులు ఆక్రోశించారు.


  దూదేకటం అనే వృత్తి పోయింది. ఇప్పుడెవరూ ఆ వృత్తి చేయటం లేదు. ఇక మీదట ఆ వృత్తినే చేసి బ్రతికే అవకాశమూ లేదు. ఇంకా ఆ వృత్తి పేరుతోనే కులం పేరు ఎందుకు? మన కులానికి మరేదయినా మంచి పేరు పెట్టాలని కొందరు సంస్కరణవాదులు మాట్లాడారు. కూటికీ గుడ్డకూ రాని బ్యాండు మేళాలు,సన్నాయి వదిలేసి సాంకేతిక విద్యలు చదవాలనీ, ప్రభుత్వాన్ని భూములడగాలనీ కొందరు కమ్యూనిస్టు దూదేకులవారు డిమాండ్ చేశారు. బంతికే రావద్దంతే విస్తరాకు తెమ్మన్నట్టుంది మీ వ్యవహారం. ఏదో ఒక మత గుంపులో చేరితే తప్ప బెదురు తీరని బడుగు జీవులం మనం. ఏమతంలో చేరితే మన పేదరికం అంతరిస్తుంది? ఏ మతంలో చేరితే మన పిల్లల భ్వష్యత్తుకు భధ్రత కలుగుతుంది? ఏ మతంలో చేరితే వాళ్ళ పిల్లల్ని మన పిల్లలకిచ్చి పెళ్ళిళ్ళు చేసి మనల్ని హృదయ పూర్వకంగా కలుపుకుంటారు? మనం దాడిచేసేవాళ్ళం కాదు ఎప్పుడూ దాడులకు గురవుతున్న వాళ్ళం. ఇప్పుడు కావలసింది మన ఆత్మల రక్షణ కాదు. మన ప్రాణాలకు భౌతిక రక్షణ, ఆర్ధిక రక్షణ, సాంఘిక రక్షణ, ఏ మతంలో దొరుకుతుంది? కుల విచక్షణ చూపకుండా మానవతాభావంతో కరుణ రసాన్ని కురిపించి మనపట్ల సమ గౌరవం చూపే మతమేది? ఆ మనవతా మత మేది? అంటూ కొందరు సభ లోనే అన్వేషించారు. కానీ ఫలితం కానరాలేదు. ఓదార్చేకొద్దీ ఏడ్చే బిడ్దల్లాంటివే కష్టాలన్నారు. కణత తలగడ కాదు. కల నిజం కాదు. కుల మత రహితం కాకపోయినా వాటి ప్రసక్తి లేని లౌకిక భారతం ఓ మంచి ఆశే. మానవ మత భారతం చక్కటి అభిలాషే. కానీ అది ఎన్నటికీ నిజంకాని కల అని కులమతాల నెత్తుటి చరిత్ర నిరూపించింది. రిజర్వేషన్లు లేనిదే ఎక్కిరాలేని జాతులు, రిజర్వేషన్ల కోసమే కొనసాగింపబడుతున్న కులాల లెక్కలూ, రాజ్యాంగ బద్దం కాగా ఇక కులమత ప్రసక్తి లేని లౌకిక రాజ్యం ఎలా సాధ్యం? రాజ్యాంగం రాసినవాడే కులాంతర, మతంతర వివాహాలకు మాత్రమే రిజర్వేషన్లను పరిమితం చేసినా ఈ 53 ఏళ్ళలో కులమత ప్రసక్తిలేని, ఏ కులమో చెప్పలేని భారత జాతి గణనీయంగా పెరిగి కుల, మత కలహాలను సమసింపజేసి ఉండేది. ఇప్పుడు కుల మత సంఘాల పేరుతో గిరులు గీసుకొని కంచెలు కట్టుకొని స్వకీయ రక్షణ. పరపీడన సిద్ధాంతాలతో సాగిపోతున్న నరహంతక ముఠలు ఎన్నని చెప్పగలం? భారతీయ సమాజం కుల మతాల విభజన వల్ల మానసికంగా చిందర వందరై పోయింది. కుహనాఇక్యత వర్ధిల్లుతోంది. మానవత్వాన్ని, ప్రోది చేసి మనందరినీ నిజంగా ఐక్యపరిచే సాధనం మానవతావాదమే. దేవుడి పేరుతో స్ధాపించబడిన కులమతాలు మానవ ఐక్యతకు, మానవ సౌభాగ్యానికి బాటలు వేయాలంటే మతదురభిమానాపు పొరలు కప్పిన వారి కళ్ళల్లో మానవత్వపు కరుణా కాంతులు నిండాలి. హత్యలు చేసే చేతులు పదిమందికి అన్నం పెట్టాలి. ఆస్తులు, ప్రాణాలు, మానాలు దోచుకునే దుర్మాగులు పరోపకారులుగా మారాలి. ఇలా మనుషుల్ని కారుణ్యమూర్తులుగా మలచలేని మతాలు వ్యర్ధం. మానవత్వాన్ని కాలరాచే మతాలు మన పాలిట శాపాలు. మతాలకు మానవత్వమే గీటురాయి.

  రిప్లయితొలగించండి
 69. You may get many questions answered here by going to the root of the problem.

  What is the root? Please read here...

  http://www.faithfreedom.org/Articles/quran_teaches.htm

  రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు