14, జూన్ 2011, మంగళవారం

మరింత దిగజారిన లౌకికవాదం

హిందూ వ్యతిరేక భావాలను పదేపదే నిర్లజ్జగా ప్రదర్శిస్తోంది లౌకికవాదం. 

బాబా రామ్ దేవ్ ఆరెస్సెస్ ఏజంటు
అన్నా హజారే ఆరెస్సెస్ ఏజంటు

ఇద్దరు పౌరులు తమతమ దారుల్లో చేస్తున్న ప్రజా పోరాటాల గురించి కాంగ్రెసు పార్టీ స్పందన ఇది. దోపిడీకి గురైన ప్రజలధనాన్ని వెనక్కి రప్పించడం కోసం, సదరు దోపిడీ దొంగలను పట్టుకుని చట్టానికి కట్టేసే వ్యవస్థ కోసమూ కృషి చేస్తున్నారు వాళ్ళు. అది కాంగ్రెసు పార్టీకి కంటగింపుగా మారింది. ముందు బతిమాలారు, చర్చలు జరిపారు. వాళ్ళు లొంగకపోయేసరికి ఇపుడు వాళ్లపైన దొడ్డిదారిన దాడి చేస్తోంది. విమానాశ్రయాల్లో ఎదుర్కోళ్లతో మొదలైన కాంగ్రెసు మార్కు రాజకీయం అర్థం పర్థం లేని ఆరోపణలు చేసేదాకా వచ్చింది.

సరే, వాదన కోసం.. వాళ్ళిద్దరికీ ఆరెస్సెస్సుతో సంబంధాలున్నాయన్న సంగతి నిజమేనని అనుకుందాం. ఉంటే ఏందంట? అందులో తప్పేంటి? ఏఁ.., అవినీతిపరుల్నీ లంచగొండుల్నీ దోపిడీగాళ్ళనీ ఎదిరించే హక్కు హిందువులకు లేదా? అక్రమాలను ప్రశ్నించే హక్కు హిందూ సంస్థలకు, హిందూ సాధువులకు లేదా? కాంగ్రెసు పార్టీ దొంగలు చేస్తున్న అవినీతి గురించి హిందువులు మాట్టాడకూడదనేది ఆ పార్టీ అభిప్రాయమా? అసలు హిందువులంటే ఏమైనా సమాజం నుండి బహిష్కృతులా?

అంతేకాదు, తమ మతపరమైన నమ్మకాలను దెబ్బతీస్తోంటే హిందువులు ఎదురు తిరగకూడదు. అలా చేస్తే వారిని నాజీలు, ఫాసిస్టులు అంటూ అడ్డమైన మాటలు అంటా రీ లౌకికవాదులు. హిందూ దేవతలను అసభ్యంగా చిత్రించి హిందువుల మనోభావాలను గాయపరచాడొక వ్యక్తి. తన తప్పులను కాచుకోలేక, కోర్టు వేసే శిక్షను తప్పించుకునేందుకు అతడు దేశం వదిలి పారిపోయి, మరో దేశంలో తలదాచుకున్నాడు. చివరికి ఈ రెండూ కాకుండా మూడో దేశంలో అనామకుడిలా గతించాడు. తాను ఏ దేశంలో అయితే పుట్టాడో ఆ దేశపు సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వాన్ని ఎగతాళి చేసి, ప్రజల మనసులను గాయపరచినవాడికి విధి వేసిన శిక్ష అది. కోట్ల మంది ప్రజలు పూజించే దేవతలను కించపరిచినందుకు గాను అతడు తన తప్పు నొప్పుకుని చెంపలేసుకుని ఉంటే పుట్టినగడ్దమీద అతడికి ఆరడుగుల నేల దొరికి ఉండేది. జనం గుండెల్లో కుసింత చోటూ దొరికి ఉండేది. కానీ, అతడికి హిందువుల మనోభావాల కంటే తన వికృత మనోవికారాలే ముఖ్యమయ్యాయి. అందుకే క్షమాపణ అడక్కుండా ఈ దేశ చట్టాల నుండి పలాయనం చిత్తగించాడు. లౌకికవాదులకు, కాంగ్రెసులాంటి లౌకికవాద/మైనారిటీవాద పార్టీలకూ కూడా హిందువుల మనోభావాల కంటే అతగాడి వికృత చేష్టలే ముఖ్యమయ్యాయి. అందుకే ఆ పార్టీలు తమ స్పందనల్లో  - మత ఛాందసవాదులు అతడి జీవితాన్ని నరకప్రాయం చెయ్యడం చేత అతడు దేశం వదిలిపోవాల్సి వచ్చిందని, ఇలా అనామకంగా చనిపోవాల్సి వచ్చిందనీ బాధపడి పోయాయి. హిందువులను మత ఛాందసవాదులుగా చిత్రించాయి.

ఇంతకీ అతడికి భారత రత్న ఇవ్వాల్సిందేనని లౌకికవాదినని చెప్పుకునే కులదీప్ నయ్యరు చెప్పేసాడు. భారతీయుణ్ణని చెప్పుకోడానికి సిగ్గుగాను, హిందువునని చెప్పుకోడానికి రెట్టింపు సిగ్గుగానూ ఉందట ఇతగాడికి!

32 కామెంట్‌లు:

 1. వాళ్ళు RSS/ISI/CIA/KGB/Al-queda/China/Le-T ఏజెంట్లా అన్నది కాదు, ఈ కాంగ్రెస్ ఎదవలు దేశాన్ని 60ఏళ్ళుగా దొబ్బితింటున్న పందికొక్కులన్నది మాత్రం తిరుగులేని,అందరు ఏకగ్రీవంగా అంగీకరించే పాయింటు.

  రిప్లయితొలగించండి
 2. రాందేవ్ ఆర్.ఎస్.ఎస్. ఏజెంటా, కాదా అనేది ఇక్కడ మౌలిక ప్రశ్న (fundamental question) కాదు. నిరాహార దీక్ష శిబిరానికి వచ్చిన భక్తుల కోసం భోజన కార్యక్రమం, కరెంట్ సౌకర్యం లాంటివి పెట్టి నిరాహార దీక్ష విలాసంగా జరిపాడు. నిరాహార దీక్షకి అంత ఖర్చు అవసరమా అనేదే ఇక్కడి మౌలిక ప్రశ్న. గతంలో పొట్టి శ్రీరాములు నిజంగా ఏమీ తినకుండా నిరాహార దీక్ష చేశారు. ఆ రోజులు పోయి నిరాహార దీక్షని పెళ్ళి కార్యక్రమం నిర్వహించినంత ఆడంబరంగా నిర్వహించే రోజులు వచ్చాయి.

  రిప్లయితొలగించండి
 3. అరవై సంవత్సరాల పాలనలో ఒక్క మంత్రగాడి మీదా ఆస్తుల విచారణ చేయని దద్దమ్మలు , గట్టిగా ఆడిగాడని రాందేవ్ ఆస్తులపై విచారణ జరిపింస్తారట...హజారే అంతపెద్ద ఉద్యమానికి డబ్బులెక్కది నుండి వచ్చయో తేలుస్తారట....హజారే మొండివైకరి వల్ల ప్రజాస్వామ్యానికి చేటు జరుగుతుందట...ఒక దేశ సంస్కృతిని గౌర వించకుండా, ప్రజల మనో భావాలని గౌరవించకుండా సున్ని తత్వాన్ని నిస్సిగ్గుగా వదిలి , ఎవడు ఏంచేసినా లౌకిక మంటూ గౌరవించడమేనా ప్రజాస్వామ్యం ?

  రిప్లయితొలగించండి
 4. బోజనాలు, ఫ్యాన్లు గట్రా పెట్టకపోతే గాలి ఆడక, ఆకలి తట్టుకోలేక భక్తులు ఇబ్బంది పడ్డారూ ఇదేనా రాందేవ్ నిర్వహణ? అంటారు పోనీ అవన్నీ పెడితేనేమో అంత ఖర్చు పెట్టి పెట్టాడు అంటారు? మరి రెండు నాలుకలుంటే ఎట్టా సచ్చేది ప్రవీణన్నాయ్?

  రిప్లయితొలగించండి
 5. పొట్టి శ్రీరాములు ఇంత మంది, మార్బలం చూపించి నిరాహార దీక్ష చెయ్యలేదు. అతను 1928 నుంచి 1952 వరకు రాజకీయాల్లో ఉన్నాడు కానీ రాందేవ్ లాగ ఇంత బహిరంగంగా వ్యక్తిగత పాపులారిటీ కోసం పాకులాడలేదు. ఇప్పుడు నిరాహార దీక్ష అనేది వ్యక్తిగత పాపులారిటీ కోసం పాకులాడేవాళ్ళ పనిమట్టు అయిపోయింది.

  రిప్లయితొలగించండి
 6. చీకాకులం ముఠాల్ మడయా పదే పదే విలాసవంతం గా అని వాగుతున్నావు, నీకు ఆ అపసవ్య అనే ఒకడు మద్దతు. మీ ఇద్దరు రావు గోపాల్ రావు , అల్లు అనుకొంటే మీ పైన పిలకలపల్లి కవి గారోక బాంబేయ్ నుంచి తీసుకొచ్చిన విలన్ అమ్రిష్ పూరి లాంటి వారు. ఇతరులలో అనుమానాలు కలిగించే విధంగా రాయటం లో ఆరితేరిన వారి శైలి, అతని పిచ్చిని మీ ఇద్దరికి ఎక్కించి తప్పుకొంటాడు. దానిని చదివి మీరిద్దరు మరింత అనుమానాలతో శివాలేత్తి మీరిద్దరు టపాలు, comments రాయటం. అసలికి మీ మోహం ఎప్పుడైనా డిల్లీ ఎండలను చూసిందా? ఇక్కడ ఎండలు పేలి పోతూంటే కూలర్ పెట్టుకొని నిరాహారదీక్ష చేశావని అంట్టున్నావు. ఆంధి అనే ఇసుక తో కూడిన గాలులు ఎండాకాలం లో ఎక్కువగా వచ్చి ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేస్తాయి.దానిని గురించి నీకు తెలుసా? విశాలమైన మైదానం లో ఎండ ఎంతో ఎక్కువగా ఉంట్టుంది. దానికి తోడు డ్రైనెస్. కూలర్ కూడా లేకుండా జనాలని చావ మంటావా? అక్కడ పాల్గొన్న వారు డబ్బులు లేని బీదా బిక్కి జనం కారు,తోలుకొచ్చిన జనం అసలేకాదు, ఒక్కొక్కరికి నేటి లేక్కల ప్రకారం కోట్ల ఆస్థి ఉన్నా ఒక ప్రజా సమస్య లో స్వచ్చందం గా అంత మంది పాల్గొనడం మంచి పరిణామం. అందువలననే ప్రభుత్వం వారిని చూసి భయపడింది. బీద బిక్కి, పేద వారు పాల్గోని ఉంటే పట్టించుకొనే నాధుడు ఉండరు. అది నీమోహానికి తెలుసా? యు. పి .నుంచి రైతులు వచ్చి డిల్లీ లో గలభా చేస్తే వారిని సాయంత్రానికల్లా తరమ గొట్టారు. రాందేవ్, అన్న ల విషయం లో అలా చేయలేక పోవటానికి కారణం. బాగా చదువుకున్న,డబ్బులు ఉన్న ప్రజలు పాల్గొనటం. ఇది పిలకలపల్లి కవి గారి లాంటి మొద్దు బుర్ర 1970 లో జీవించే బుర్రకి ఎప్పటికి అర్థం కాదు. రాయటం అలవాటుగనుక సొల్లు రాస్తుంటాడు. అది చదివి 20సం|| అమేరికా కి వేళ్లిన వాళ్ళు వీరి బ్లాగులో తొంగి చూసి భలే రాశారని పొగుడుతూంటారు. ఎవరైన ఇప్పటి తరం వారు వారిని ప్రశ్నిస్తే అంతే అన్ని కామేంట్లని తొలగిస్తారు.

  SrIRam

  రిప్లయితొలగించండి
 7. ప్రవీణ్ మీకు మౌలిక ప్రశ్నే కాదు, అసలు ప్రశ్నే ఈ జన్మలో అర్థమయ్యేట్టులేదు.
  'తిక్కోడి పెళ్ళిలో తిన్నోడు బుద్ధిమంతుడు' అన్నట్టు రాందేవ్ విందులో మీకు ఓ చేయేసే అవకాశం కలగనందుకు చింతిస్తున్నాము. :))
  అక్కడ తెర గారు, అవినీతిని తుదముట్టించే హక్కు వుంటే గింటే మూర్ఖిస్టు పార్టీలకే వుండాలని నొక్కి వక్కాణిస్తున్నారు. తమరటెళ్ళి వాళ్ళ కళ్ళు పెకలించైనా తెరిపించాల్సిన చారిత్రక అవసరం ఎంతైనా వుంది, ఎళ్ళండి, బాబూ. ఇక్కడేదో పిల్లకాయలం, గోబెల్స్ ప్రచారాలు కాని డిస్కషన్ చేసుకుంటాము. లేదా చక్కగా బూర/పీపీ వూదుకుంటూ వెళ్ళి బ్లాగుల్లో మీ చంకలిని పెచారం చేసుకోవచ్చుగా! :D

  రిప్లయితొలగించండి
 8. నేనేమీ కూలర్ అంటే ఏమిటో తెలియని పల్లెటూరివాడ్ని కాదు. నా షాప్‌లోనూ కూలర్ ఉంది, అందులోనూ ఐస్ ముక్కలు వేస్తుంటాను. అదంతా నా షాప్‌కి వచ్చే కస్టమర్లని ఆకర్షించడానికి. నిరాహార దీక్ష అనేది అలా కాదు. ప్రజా ఉద్యమం చెయ్యడానికి సినిమా షూటింగ్‌లాగ భారీ సెట్టింగ్‌లు, కూలర్లు అవసరమా?

  రిప్లయితొలగించండి
 9. ఇంకొకటి మనది ఒకే దేశమైనా కొన్ని సంస్కృతిక పరమైన, ఆహర, ఆహార్య తేడాలు భిన్నంగా ఉంటాయి. డిల్లిలో అమ్మాయిలకి చిన్నపటి నుంచి పాటలు పెట్టుకొని ఎగరటం అనేడి అలవాటు. పెద్ద ఐన తరువాత డిస్కో లో పోయి, కొంచెం చుక్క వేసుకొని, మోకాళ్ళ మీదికి మిడ్డిలుస్ వేసుకొని ఎగురుతూంటారు. వారి తల్లిదండృలు,సోదరులు ఎవరు దానిని తప్పుగా భావించరు. ఇంకా చెప్పాలి అంటే తల్లి కూడా ఒక మీడ్డి వేసుకొని తిరుగుతూంట్టుంది. అదే మన వైపు అమ్మాయిలు ఇలానటి చేస్తే మంగుళురు లో ప్రజలకి కోపం వచ్చింది. ఆడవాళ్ళేంది మిట్ట మధ్యాహనం తాగి డాన్స్ చేయటమనేది. ఆసంఘటన ఇక్కడి వారు చూసి సౌత్ లో వారు కృరులు గా అనుకొన్నారు. అందువలన చీకాకోళం ఒకరికి తప్పు అని పించింది ఇంకొకరికి తప్పుగా కనిపించక పోవచ్చు. నువ్వు ఎప్పుడో పొట్టి శ్రీరాములు నిరాహార దీక్ష సంగతి చెపుతున్నావు. ఆ రోజులలో ప్రజదగ్గర జీవన శైలికి ఇప్పటికి మార్పు లేదా? అందరు జీవితాంతం పొట్టి శ్రీరాములుగారిల వంటి పై పైపంచే తో కప్పు కోవాలా? నువ్వు అలా చేస్తున్నావా? నాకు నీ పోటొలో చొక్కా వేసుకొని కనిపించావు.

  SrIRam

  రిప్లయితొలగించండి
 10. ఎవఱు ఎవఱి ఏజంట్లో గానీ ఒక విషయం మాత్రం దేశప్రజలకందఱికీ సందేహాల కతీతంగా అర్థమయి పోయింది. కాంగ్రెస్ పార్టీ అవినీతిపరుల బహిరంగ ఏజంటు. అది స్విస్ బ్యాంకుల్లో డబ్బుదాచుకున్నవాళ్ళ ఫ్రంటు సంస్థ. UPA ప్రభుత్వానికి విస్తారిత రూపం - Unbridled Pelf Acquisition Government.

  రిప్లయితొలగించండి
 11. అయ్యా మార్థాండా రజత్ శర్మ స్లం లో తలదాచుకొంట్టూ, చదువుకొని ఈస్థాయి వచ్చాడు. ఆయన రాసినది చదువు.


  Congress' Midsummer Folly: Rajat Sharma
  http://www.indiatvnews.com/news/India/Congress_Midsummer_Folly_Rajat_Sharma-8347.html

  SrIRam

  రిప్లయితొలగించండి
 12. మంచి పని చేశావ్, ప్రవీణ్. కూలర్‌తో ఓ ఫ్రిజ్‌ని అనుసంధానం చేయ్ ప్రవీణ్, ఐయిసు ముక్కలని ఆటోమేటిక్ ్‌గా తీసుకునే మరచేయి ఒకటి ఏర్పాటు చేస్తే కష్టమర్లు కష్టనష్టాల్ మరచి సుఖంగా షాపులో నిద్రపోతారు. ఇంతకన్నా సామ్యవాదం చైనాలో కూడా వుండదు. :))

  రిప్లయితొలగించండి
 13. >>రాందేవ్ ఆర్.ఎస్.ఎస్. ఏజెంటా, కాదా అనేది ఇక్కడ మౌలిక ప్రశ్న (fundamental question) కాదు.

  ఇంత ఇంగ్లీష్ ఎక్కడ నేర్సుకున్నావ్ అన్యా?? నాకు సెప్పు నేనూ ఆ బడిలోనే దూరిపోతా..

  రిప్లయితొలగించండి
 14. నిరాహార దీక్షకి సెట్తింగ్స్ అవసరమా కాదా అన్నది ప్రశ్న కాదు. కాంగ్రెస్ దొంగ డబ్బు రప్పించాలా వద్దా అన్నది ప్రశ్న. అసలు వదిలేసే కొసరు పట్టుకొని వేళ్ళాడకండి.

  కాముధ

  రిప్లయితొలగించండి
 15. బాబూ శ్రీరాం, ప్రాంతం పేరుతో తిట్టడానికి నువ్వు చీకాకోళం లాంటి నిక్‌నేమ్స్ వాడుతున్నావు. నువ్వు శ్రీరంగనీతులు చెప్పడం విచిత్రంగా ఉంది. శిబిరంలో భోజనం, కూలర్లు ఏర్పాటు చెయ్యకపోతే జనం రారంటున్నావు. మందు సప్లై చేస్తే ఎక్కువ మందే వస్తారు. రికార్డింగ్ డాన్సో, భోగం మేళం డాన్సో ఏర్పాటు చేసి మహబూబా హెలెన్ రిచార్డ్‌సన్ డాన్స్ వేస్తే ఇంకా ఎక్కువ మందే వస్తారు. చిత్తశుధ్ధి లేనప్పుడు నిరాహార దీక్షలు ఎందుకు, గోర్లు గిల్లుకోవడానికి తప్ప?

  రిప్లయితొలగించండి
 16. *మందు సప్లై చేస్తే ఎక్కువ మందే వస్తారు. రికార్డింగ్ డాన్సో, భోగం మేళం డాన్సో ఏర్పాటు చేసి ..*

  మతిలేని మార్థాండా నీకు తెలియదా అవి ఎవరు సప్లై చేస్తారో అని? మేము డిల్లీ లో విపరితమైన ఎండలు కనుక గాలి, నీరు అవసరమైన వారికి భోజనం సప్లై చేశాము. అంతే! అందులో పదే పదే తప్పులు వెదకుతూ నువ్వు, అపసవ్యా, పిలకలప్పలి కవి వ్యాసాల మీద వ్యాసాలు రాస్తున్నారు. ఇకనునంచి నేను మిమ్మల్ని జోడీ నంబర్:10 అని పిలుస్తాము. ఇప్పటికి ముగ్గురు వున్నా రాబోయే కాలం లో మిగతా ఏడుగురిని భర్తి చేస్తాము. మీ గ్రుప్ మెంబర్ ల ప్రధాన లక్షణం ఎడ్డెమంటే తెడ్డేమనటమే.

  SrIRam

  రిప్లయితొలగించండి
 17. హిందువులు ఎన్నితిట్టినా ఎంత దోపిడికి గురైనా నోరెత్తకూడదు. ఇది వాళ్ల పాలసీ. ఏమాత్రం మెళకువవచ్చినా తిరగబడడం నేర్చుకున్నా వాళ్లకు నూకలు చెల్లుతాయి .అందుకే వారి మేధోపుత్రులను ఎగదోసి గోలగోల చేస్తుంటారు గోబెల్స్ మార్గంలో .

  రిప్లయితొలగించండి
 18. Congress accuses Baba Ramdev is a agent of RSS.

  Then who is Congress? It is the agent Kirastani Missionaries.

  Sonia, Digvijay Singh, Anthony, Thomas (CEC), late YSR, Paronny Roy and Arundati, Brinda Karat, Prakash Karat, and many more are Kirastani.

  Congress is hijacked by Kirastani and captured Political Power in India.

  After conversion, they keep Hindu names to fool Indians.

  రిప్లయితొలగించండి
 19. నిజం. నిజం. కాంగ్రెస్ క్రైస్తవ మిషనరీల ఏజంట్. ఆ సంగతి తెలియని హిందువులు స్థానిక పరిస్థితులు బాలేనప్పుడల్లా యాంట్-ఎస్టాబ్లిష్‌మెంట్ సెంటిమెంటుతో కాంగ్రెస్‌కి నెగటివ్‌వోట్లు వేస్తూ దాన్ని బతికించి అధికారంలోకి తెచ్చి పిచ్చోళ్ళవుతున్నారు.

  రిప్లయితొలగించండి
 20. రాందేవ్ వెనుకాల ఉన్న డబ్బు, మంది, మార్బలాన్ని చూసి ఫ్రీ పబ్లిసిటీ ఇచ్చిన మీడియా ఒక సాధారణ సన్యాసి గురించి కావాలని మర్చిపోయింది: http://www.rediff.com/news/slide-show/slide-show-1-ascetic-dies-after-114-day-fast-for-ganga/20110614.htm

  రిప్లయితొలగించండి
 21. @ ప్రవీను
  >>>నిరాహార దీక్ష శిబిరానికి వచ్చిన భక్తుల కోసం భోజన కార్యక్రమం, కరెంట్ సౌకర్యం లాంటివి పెట్టి నిరాహార దీక్ష విలాసంగా జరిపాడు.
  నీ మౌలిక ప్రశ్న, నువ్వూను
  వాటిని విలాసాలు అని అనరు , అవసరాలు
  భోజన సదుపాయం, త్రాగు నీరు , కరెంటు ఇవి కనీస అవసరాలు
  అవినీతి మీద పోరాడేందుకు ఒకడు వచ్చాడు అని ఆనందించక , ఉద్యమాన్ని నీరు కారుస్తున్నావ్
  ఈ ఉద్యమానికి రాజకీయ రండు పూసాడు మన ప్రణబ్
  తాళాలు కొట్టారు హిందూ మత ద్వేషులు

  రిప్లయితొలగించండి
 22. నిజంగా నిరాహార దీక్ష చేసిన నిగమానంద హాస్పిటల్‌లో చనిపోయినా పట్టించుకున్న మీడియా నాథుడే లేడు. అదే మీడియా రాందేవ్‌కి ఉన్న డబ్బు, మంది, మార్బలం చూసి ఫ్రీ పబ్లిసిటీ ఇచ్చింది. వ్యక్తిగత పాపులారిటీ కావాలనుకుంటే చిరంజీవిలాగ సినిమాల్లో నటించొచ్చు, అవినీతి వ్యతిరేక ఉద్యమం పేరు చెప్పి ఆడంబరాలు ప్రదర్శించి అవినీతి వ్యతిరేక ఉద్యమం అంటే డబ్బున్నవాళ్ళు వ్యక్తిగత పాపులారిటీ కోసం చేసే ఉద్యమం అని అర్థం తేవడం ఎందుకు?

  రిప్లయితొలగించండి
 23. ప్రవీణ్, ఈ టపాకు ఇక మీ వ్యాఖ్యలు ఆపండి.

  రిప్లయితొలగించండి
 24. మొరిగిందే ఎన్ని సార్లు మొరుగుతావు ప్రవీణ్, ఇగాపహే నీ యెంకమ్మా. దొంగలు పడి ఆర్నెల్లయ్యింది. ఇంత మతిలేని వాగుడుకాయని మావోఇస్టులు ఎలా భరిస్తున్నారు?

  రిప్లయితొలగించండి
 25. లౌకికవాదం అంటే హిందూ వ్యతిరేకవాదం అని నిఘంటువుల్లో చేర్చేస్తే సరి ఒక పనైపోతుంది.

  రిప్లయితొలగించండి
 26. "నిజం. నిజం. కాంగ్రెస్ క్రైస్తవ మిషనరీల ఏజంట్. ఆ సంగతి తెలియని హిందువులు స్థానిక పరిస్థితులు బాలేనప్పుడల్లా యాంట్-ఎస్టాబ్లిష్‌మెంట్ సెంటిమెంటుతో కాంగ్రెస్‌కి నెగటివ్‌వోట్లు వేస్తూ దాన్ని బతికించి అధికారంలోకి తెచ్చి పిచ్చోళ్ళవుతున్నారు."

  well said.

  One of the caste in AP, votes to Congress Party because of their hatred for a single person, who belongs to another Hindu caste.

  Why they project hatred against one person on to the whole caste? don't know? This is the key weakness among Hindus. This is the reason why foreigners (including Sonia) ruling this country over 800 years. Typical Hindu thinks that his/her greatest enemy is the person belongs to another competing Hindu caste.

  Any guess here?

  That caste that hates NTR, votes to Congress Party, even after they know that congress is a agent of kirastani missionaries.

  Their hatred for one person is so great, that they forget that Congress is anti-Hindu headed by a single Italian. And it is hell bent on converting Hindus.

  Looks like India (Hindus) is doomed for ever.

  రిప్లయితొలగించండి
 27. @well said,
  మీకేదొ తెలిసినట్లు సోది రాశారు. రామారావు పార్టి పెట్టినపుడు ఎంతో మంది మీరు విమర్శించిన వర్గం వారు మద్దతు ఇచ్చారు. ఆరోజులు సోషలిజం దెబ్బకి ప్రజల జీవితాలు,ఆర్ధికం దుర్భరంగా ఉండేవి. ఆయన నుంచి కొత్త దనాన్ని ఆశించారు. కాని తన తొందర పాటు నిర్ణయాలతో వారు అస్తవ్యస్థ పాలన చేశారు. ఆయన ప్రకటించిన పథకాలన్ని షార్ట్ టెర్మ్ తప్ప లాంగ్ టెర్మ్ లో ఉపయోగపడేది ఉండేది కాదు. ఎంత సేపటికి రెండు రూపాయలు కిలో బియ్యం. దానిని ఎన్ని కష్టాలైనా అమలు చేయాలనే మొండి పట్టుదల. ఇక మధ్య తరగతి వారి జీవితాలను మెరుగు పరచే పథకాలు పెద్దగా ఎవి చేపట్టలేదు. అప్పటికే కాంగి ఆర్ధిక విధానాలతో విసుగెత్తి ఉన్న ఈ ప్రజానికానికి ఈయన గారు ఎదో చేస్తారను కొంటే గొప్ప పథకాలు ఎవి ప్రవేశపెట్టక పోగా టిచర్లు ప్రైవేట్ చెప్పకుడదని ఒక రూల్ పెట్టారు, ఉదోగస్తులతో తగవులు, వారిని గోతికాడ పందికొక్కులు అనటం, వారు సమ్మే దిగి దాదాపు 50 రోజులు చేశారు. ఆరోజులలో ఉమ్మడి కుటుంబాలు, ఎదో టిచర్స్ ప్రైవేట్ చెప్పుకొని కుటుంబాలను పోషించుకొంటుంటే వారినెత్తిన ఒక నిఘా, వారు బయపడుతూ దొంగచాటుగా చెప్పుకొనే వారు. మధ్యతరగతి వారికి మేలు చేయకపోగా వారిని అణచటం మొదలు పెటారు. ఈదెబ్బతో ఈయన గారి కన్నా కాంగి వారే ఉత్తములు అని మధ్య తరగతి వారు ఒక నిద్దారణకు వచ్చారు. తెలుగు దేశం వారు ఎప్పుడు ఉద్యోగస్తుల, మధ్యతరగతి వారికి మోచేయి చూపించేవారే.

  రిప్లయితొలగించండి
 28. @తెలుగు దేశం వారు ఎప్పుడు ఉద్యోగస్తుల, మధ్యతరగతి వారికి మోచేయి చూపించేవారే.....
  అందువల్లే మట్టి కొట్టు పోయారు...ఇప్పుడు బ్రతికి ఉందంటే..కాడర్ వల్లే....

  రిప్లయితొలగించండి
 29. చదువరి గారు..! నేను ఈ బ్లాగ్ప్రపంచానికి కొత్త..! మీ టపాలని చాలాకాలం నుంచి చదువుతున్నా వ్యాఖ్యలు రాయలేక పొయేవాణ్ణి. So, ఇదేనా మొదటి వ్యాఖ్య.
  ప్రభుత్వం అన్నాహజారే గారి దీక్షకి మొదట్లో భయపడినట్టు,తర్వాత దిగివచ్చినట్టు పొలిటికల్‌ డ్రామాలు ఆడింది, కేవలం ఐదు రాష్ట్రాల ఎన్నికల కోసమే.! తర్వాత బాబా రాందేవ్‌ దీక్షకి తన అసలు ఉద్దేశ్యం బయటపెట్టింది. అదేంటంటే ప్రభుత్వం(అది యూపియే అయినా ఎన్డీయే అయినా) అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నా ప్రజలు నిరశనలు చేయకూడదు(లేదా ప్రశ్నించకూడదు లేదా ఎదురు తిరగకూడదు(ఏదైనా కావచ్చు)).
  ఏ ఉద్యమానికైనా వ్యవస్థ (లేదా ప్రభుత్వం) భయపడేది, దాన్ని ముందుకు తీసుకువెళ్లే మద్దతుదారులను చూసి మాత్రమే..! అన్నాహజారే అయినా బాబా రాందేవ్‌ అయినా దీక్ష చేసినపుడు ప్రభుత్వం దృష్టిలో ఉన్నది వాళ్లే..అంటే మనమే..! ముందు దీక్షకి తర్వాతి దీక్షకి ఉన్న తేడా ఏంటన్నది అందరికీ తెల్సు..! మొదటి దీక్ష టైంలో ఎన్నికలున్నాయి..తర్వాతి దీక్ష టైంలో అవి లేవు. మొదటి దీక్ష సమయంలో ప్రభుత్వానికి ఊపిరి పీల్చుకొనే ఆస్కారం కూడా లేదు..కానీ తర్వాతి దీక్ష .. దానికి బాగున్న టైంలోది.! కనుకే లాఠీలు తీసుకుని వచ్చింది.
  బాబాని గానీ అన్నా హజారేని గానీ ముందు పల్లెత్తు మాటకూడా అనని మంత్రివర్యులు ఇప్పుడు వాళ్ళని ఆరెస్సెస్‌ ఏజెంట్‌ అనడంలో ఉద్యమాన్ని బలహీనపరిచే దురుద్దేశ్యాలు ఉన్నాయని నా అభిప్రాయం. ఆరెస్సెస్‌ పేరెత్తగానే ఛీదరించుకునేవాళ్లు, యుద్ధోన్ముఖులయ్యేవాళ్ళు ఉద్యమాన్ని వదిలేస్తారని వాళ్ల కుట్ర..ఆ లక్ష్యంలో ప్రభుత్వం విజయం సాధించిందేమోనని నా అనుమానం. ఎందుకంటే ఇప్పటికే చాలామంది మైనారిటీలు సైలెంట్‌ అయిపోయారు. కొంతమంది ఉద్దేశ్యపూర్వకంగా తమతమ పరిధిలో దుష్ప్రాపకాండ ప్రారంభించారు. హిందూ లేదా టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా కి వచ్చే పాఠకుల ఉత్తరాలను చూస్తే ఆ అనుమానం కలగకమానదు. వాటిలో బాబా దీక్షకి వ్యతిరేకంగా వచ్చే ఉత్తరాలలో 70 శాతం వరకూ ముస్లింలు లేదా క్రిస్టియన్లవే.!
  అంటే ఆ విధంగా ఓ 20 శాతం మంది దేశ ప్రజలను ఉద్యమo నుంచి పక్కకు తప్పించినట్లందన్నమాట..!
  ఇంక తర్వాతేముంది ఎవరో ఒక ఎస్సీ/ఎస్టీ నాయకుణ్ణి ఈ బాబానో,అన్నా హజారేనో అవమానించినట్టుగా చూపిస్తారు..అక్కడితో ఇంకో 30శాతం మంది ఫట్‌..! ఆ తర్వాత ఈ ఉద్యమం కేవలం అగ్రవర్ణాల మధ్య ఆధిపత్యపోరు రూపాంతరం చెందినా ఆశ్చర్యపోవడానికి. ఇది చాలదా ఉద్యమం చప్పబడిపోవడానికి..! ఆ విధంగా అవినీతి వ్యతిరేక ఉద్యమం విఫలమవడమే కాంగ్రెస్‌ లేదా ప్రభుత్వం లేదా అవినీతిపరుల కుట్ర..

  ఆ సివిల్‌ సొసైటీగానీ ఇండియా ఎగినెస్ట్‌ కరెప్షన్‌ సంస్థగానీ ఆ ప్రయత్నాలను తిప్పికొట్టాలి. లేకపొతే సమయం మించిపోతుంది.

  రిప్లయితొలగించండి
 30. "మీరు విమర్శించిన వర్గం"

  I did not accuse any caste there. Please re-read my comment. Only point I am raising is, even though Hindus were majority, they fail to form the Govt. at center because of hatred between various castes.

  Who tend to vote for anti-Hindu minorities. If you observe, since 2004 the Political Power was firmly with anti-Hindu minorities at center. At one point of time, PM, President and most powerful politician belong to minorities.

  It won't happen any where in the world. They imposed South African type Apartheid in India.

  Have a good day.

  రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు