మొన్నామధ్య నూరేళ్ళ పార్టీ హైకమాండు కడప మీంచి బిళ్ళబీటుగా కింద పడింది. అంతెత్తునుంచి కింద పడటంతో వెన్నెముక విరిగింది, కాళ్ళు రెండూ కూడా విరిగిపోయాయి. నడవలేని స్థితిలో మంచాన బడింది. ముందే హైకమాండంటే ఎటకారమై పోయిన ఆ పార్టీ నాయకులు కొందరికి మరీ అడ్డూ ఆపూ లేకుండా పోయింది. వంకరమ్మ అనే ఒక పార్టీ నాయకురాలు ’అసలు హైకమాండు ఉత్త పిరికిది. పేరుకే అది హైకమాండు, దానికి హై లేదు, కమాండూ లేదు. ఇప్పుడు వెన్నెముక కూడా విరిగింది కాబట్టి, ఇక అది ఉన్నా లేనట్టే" అని అనేసింది. దానిమీద రంజనీకాంతు తొమ్మిదో టీవీలో చర్చ పెట్టాడు. ఆ చర్చ ఇలా జరిగింది..
రంజనీకాంతు: రాజకీయనాయకులంటే రంజనీకాంతుకు ఎగతాళి. వాళ్ళ మీద మనకు జాలి కలిగిస్తూంటాడు కూడాను. వాళ్ళు మాట్టాడిన దాంటోంచి గబుక్కున అర్థాలు, పెడర్థాలూ తీసి, వెంటనే సారాంశాన్ని తీర్మానించేస్తూ ఉంటాడు. ప్రస్తుతం ఈయన దగ్గర ముగ్గురు కూచ్చొని ఉన్నారు. ఇరానీ హోటల్లో బుల్లి బుల్లి టేబుళ్ళుంటై చూడండి, అలాటి టేబులొకదాని చుట్టూ కూచ్చుని ఉన్నారు.
రంజనీకాంతు తులషిరెడ్డిని అడిగాడు: "తులషిరెడ్డి గారూ, మీరు చెప్పండి , కడప మీంచి కిందపడ్డాక మీపార్టీ పరిస్థితి మరీ దయనీయమైపోయింది.హైకమాండు పిరికిది, అది ఉన్నా లేనట్టే అని మీ నాయకురాలు వంకరమ్మ గారే అన్నారు, దీనికి మీరేమంటారు?"
తులషిరెడ్డి: తులషిరెడ్డిది ఒక ప్రత్యేక పద్ధతి. అడిగిన ప్రశ్న ఏదైనా కానీండి.. అసలు భూమ్మీద జీవం ఎలా పుట్టింది అనే దగ్గర మొదలు పెట్టి జీవపరిణామ సిద్ధాంతం మీదుగా, జాయిగా నరుక్కుంటూ వస్తాడు. పై ప్రశ్నకు ఆయన సమాధానం - "ఇప్పుడూ.., మా పార్టీ నూటా ముప్పై సమచ్చరాల చరిత్ర కలిగినదీ, ఎన్నో.. రాజకీయ ఘటనలను చూసినది, ఈ దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిందీ. ఇకపోతే, సోదియా గాంధీ గారు గొప్ప త్యాగశీలి, దేశం కోసం ప్రధాన మంత్రి పదవినే వదులుకున్న వ్యక్తి,.. " ఈలోగా రంజనీకాంతు అడ్డుకుంటాడు. (నిజానికి రంజనీకాంతు మొదటివాక్యం దగ్గరే అడ్డుకోడం మొదలెట్టాడుగానీ, తులషి రెడ్డి పట్టించుకోలేదు. ఇదిగో ఇప్పటికి అడ్డుకోగలిగాడు.) "అది సరే తులషి రెడ్డి గారూ, ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పండి, హైకమాండు పిరికిది అన్న వ్యాఖ్యకు మీ స్పందన ఏంటి?"
తులషి రెడ్డి "అదే అదే, ఆడికే వస్తాండా. ఇపుడేమంటే.. మా పార్టీ పెద్ద సముద్రం లాంటిది. అదొక ఓషన్. మాదాంట్లో ప్రజాస్వామ్యం మీతా పార్టీల్లోకంటే కొంచెం ఎక్కువ. కావ్..ట్టి, కొం..చెం ఎక్కడైనా.. కొంత.. అటూ ఇటూగా.. మాటాడుతుంటారు, అది సహజం. పెద్దగా పట్టించుకోనక్కర్లేదు." అంటూ చెప్పుకుపోతూండగా..
రంజనీకాంతు గురివిందకుమార్ గౌడ్ను అడిగాడు -"మీ రేమంటారు గురివిందకుమార్ గారూ?"
గురివిందకుమార్ గౌడు: చర్చలో మూడొంతులు సమయం ఈయనే తీసుకుంటాడు. మిగిలిన సమయంలో అవతలివాళ్ళని మాట్టాడనిస్తాడు. ఇలా అన్నాడు-"మాకు ఆ పార్టీ మ్యాటర్ అనవసరమండి. వాళ్ళూ వాళ్ళూ ఎప్పుడు కొట్టుకుంటా ఉంటరు. ఈరోజు కొత్తేమీ కాదుగదా. మొన్న ఫలానా నాయకుడు ’ఏడిశావ్, నువ్వూ ఒక నాయకుడివేనా ’ అని ముఖ్యమంత్రినే అన్నడు. సోదియా గాంధీని పట్టుకుని ’సోదియా, తుమ్ ఇస్ దేశ్ కో క్యాదియా? ఖాయా, పీయా, బస్.. చల్దియా’, అని అన్నడు, ఏమైంది? గతంలో తిరుపతిల ప్రధానమంత్రి పైననే చెప్పులేయించిన్రు. తరవాత వాల్లే ముఖ్యమంత్రులైనరు -చూసినం గదా! అసలు హైకమాండుకు కమాండుంటే గదా! అయినా అది ఆ పార్టీ అంతర్గత వ్యవహారమండి, మేం కామెంట్ చెయ్యం" ముందూ వెనకా డిస్క్లెయిమర్లిస్తూనే అనాల్సిన నాలుగూ అనేసాడు.
ఆ తరవాత రంజనీకాంతు, "చెప్పండి తృష్ణారావుగారూ, మీరేమంటారు?"
తృష్ణారావు: ఈయన ఆంధ్రనేల పత్రికలో బ్యూరో ఛీఫ్ గా పని చేస్తున్నాడు. రాజకీయ పరిశీలకునిగా బాగా అనుభవమున్న వ్యక్తి. కొంతమంది రాజకీయ నాయకులు ఆయన్ను బాబాయ్ అనిఅంటూంటారు. అనుభవము, పరిజ్ఞానంతో వచ్చిందేమో... అహం కొంత ఆయనలో కనిపిస్తూంటుంది. అయితే అది ఆయనకు శోభనే ఇస్తుంది. అయన నవ్వు, ’వీళ్ళ సంగతులన్నీ నాకు తెలుసులే’ అన్నట్టుంటుంది. ’వ్యవహారం’ అనేది ఈయన ఊతపదం. ముందొక నవ్వు నవ్వి, ఆయనిలా అన్నాడు: "అసలు వాళ్ళ వ్యవహారమే అంత! ఎవరు ఎందుకు మాట్లాడుతున్నారో, ఏం మాట్లాడుతున్నారో వీళ్ళకెవరికీ తెలియదు. తొట్టిలో చేపలు అడ్డదిడ్డంగా ఈదుతుంటాయి చూసారూ, అలా ఉంటుంది వీళ్ళ వ్యవహారం. అదే మనిషి రేపు హైకమాండే దేవత అని అన్నా మనం ఆశ్చర్యపోకూడదు" అని మళ్ళీ నవ్వాడు.
అంతటితో ఊరుకోకుండా, "గురివిందకుమార్ గారు అలా అంటున్నారుగానీ, వాళ్ళ తెలుగు రాజ్యం పార్టీలో మాత్రం వ్యవహారాలు తిన్నగా ఉన్నాయా ఏంటి? అంతా ఆగమాగంగానే ఉన్నాయి గదా!"
ఇప్పుడు రంజనీకాంతు తెలంగాణ వేర్పాటు సమితి నాయకుడు రఘుచందనరావును "మీరేమంటారు రఘుచందన్రావు గారు?" అని అడిగాడు.
రఘుచందనరావు: ఈయనకో ప్రత్యేకత ఉంది.. కోపంగా మాట్టాడుతున్నా, ప్రసన్నంగా ఉన్నా, చిరాకుగా ఉన్నా, సంతోషం, దుఃఖం, ఏమున్నా సరే.., మొహంలో ఎక్కడా సదరు ఛాయలు కనబడవు. గొంతులో ఒకటే మాడ్యులేషను! ఆవేశం వస్తే అరుదుగా గొంతు పెంచుతాడు. ఎప్పుడన్నా అరుదుగా నవ్వుతాడు. అయితే అనర్గళంగా మాట్టాడుతాడు. చక్కటి లాజిక్ మాట్టాడతాడు. ఎక్కడా తొణకడు. "ఈరోజు ఆ పార్టీలో ఏం జరుగుతుందో తెలంగాణ ప్రజల కనవసరం. ’హైకమాండు పిరికిదని అంటున్నరు.., మరి అదే హైకమాండు తెలంగాణ ఇస్తదని ఏ ధీమాతో చెబుతున్నరు’ అని ఆత్మహత్య చేసుకున్న ఆరువందలమంది సాక్షిగా ప్రతీ ఒక్క తెలంగాణ పౌరుడు అడుగుతున్నడు. ఈ క్రమంలో ఆ పార్టీ నాయకులు సమాధానం చెప్పాల్సిన చారిత్రిక ఘట్టమిది" తామేం మాట్టాడినా యావత్తెలంగాణ ప్రజలు మాట్టాడినట్టేనని తెవేస నేతలు అనుకోవడం మనకు తెలిసిందే!
"ఇప్పుడు అంబలి రాంబాబు గారిని అడుగుదాం", .. "హలో, అంబలి రాంబాబు గారూ చెప్పండి, హైకమాండు పిరికిది అని ఆ పార్టీ వాళ్ళే అంటున్నారు. మీరూ మొన్నటిదాకా అక్కడ ఉన్నవారే కదా.. మీరేమంటారు?"
అంబలి రాంబాబు: ఈయన మహానేతకు మహానుయాయి. ఇలా అన్నాడు: "అసలు హైకమాండుకు వెన్నెముక విరిగిందనే మాటనే నేను ఒప్పుకోనండీ. ఎంచేతంటే, ఉంటేగదండీ విరగడానికి!! దానికి అసలు వెన్నెముకే లేదు. దివంగత మహానాయకుడుండగా హైకమాండు ఆయన వీపు మీదెక్కి ఊరేగింది. ఆయన మరణించాక, అంతలా మోసే సమర్ధుడు దొరక్క చతికిల పడింది. మా యువనేత ’నేను మోస్తా నా వీపెక్కండి’ అన్నా వినిపించుకోకుండా వాళ్లనీ వీళ్ళనీ పిలిచి వాళ్ల వీపెక్కింది. ఇప్పుడేమైందో చూడండి, హైకమాండుకు కమానుకట్టలు విరిగినై. అయినా అప్పుడే ఏమైంది లెండి, ముందుంది ముసళ్ళ పండగ. ఈ ముదుసళ్ళు, ఈ వెన్నెముక లేనివాళ్ళు, వెన్నెముకలు విరిగినవాళ్ళు, ఈ నడుములు పడిపోయినవాళ్ళు, ఈ సన్నాసులూ అందరూ మూలన కూచ్చునే రోజులు రాబోతున్నాయి."
ఇక రంజనీకాంతు ఘొల్లు రవితో అన్నాడు: "మీ హైకమాండుకు కమానుకట్టలు విరిగాయని రాంబాబు గారు అంటున్నారు - నిజమేనా ఘొల్లు రవి గారూ?"
వెంటనే మళ్ళీ తనే అన్నాడు: "రవి గారు సమాధానం చెప్పే ముందు..
ఒక చిన్న బ్రేక్"

చాలా బాగా రాసారు. మీ బ్లాగు ఇప్పుడే చూసాను. కొన్ని పాత టపాలు చదివాను. బాగా రాశారు.
రిప్లయితొలగించండిమన తెలుగులో ఇంత చక్కని వ్యంగ్యం రాసేవారున్నారా ! చాలా చాలా బాగా రాశారండి . వేసుకోండి రెండు వీరతాళ్ళు !
రిప్లయితొలగించండిbrilliant.
రిప్లయితొలగించండిగురివిందకుమార్ - కేక
రమణగారు, మీరు చదువరి గారి సెటైర్లు చదవలేదా? వెంటనే పాతటపాలన్నీ తిరగెయ్యండి ఈ బ్లాగులో.
ఎంత బాగా observe చేసి రాస్తారండి .చదువుతుంటే నవ్వాగ ట్లేదు మీరు పెట్టిన nicknames .........గురువింద రావు ,రంజనికాంత్ వగైరాలన్నీ అదుర్స్
రిప్లయితొలగించండి