20, జనవరి 2011, గురువారం

అధిష్ఠానం కేళి - కాంగీయుల కథాకళి

అసలు సంగతి కెళ్ళేముందు..

మన ప్రధానమంత్రి గారు ఇవ్వాళ కొన్ని రత్నాల్లాంటి మాటలు చెప్పాడు. వాటి సంగతి చూద్దాం.
1. తెలంగాణ సంగతి ఎప్పుడు తేలుస్తారు అని అడిగితే "సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటాం" అని చెప్పాడు. సరైన సమయమంటే మళ్ళీ మేడమ్మ పుట్టినరోజు రావాలి కాబోలు. ("సరైన సమయంలో సరైన నిర్ణయం" కోసం గూగిలించి చూస్తే..  2490 ఫలితాలొచ్చాయి.)


 2. చుక్కలనంటుతున్న ధరలను ఏనాటికి కిందకి లాక్కొస్తారు అని అడిగితే "నేనేమీ జ్యోతిష్యుణ్ణి కాదు చెప్పేందుకు. మార్చి నాటికి తగ్గించగలమని నా నమ్మకం" అని చెప్పాడంట. చిన్నప్పుడు మా ప్రైవేటు పంతులు గారు పిల్లకాయల మీద పిచ్చకోపం వచ్చినపుడు బండబూతులు బైటికి అనకూడదు కాబట్టి, మనసులోనే తిట్టేసి, బైటికి మాత్రం  నైసుగా ఒక తిట్టు తిట్టేవాడు, "ఒరే నువ్వు ఇరవయ్యెనిమిదో నక్షత్రంలో పుట్టి ఉంటావురా" అంటూ. అది గుర్తొచ్చింది నాకు.

3. స్విస్సు బ్యాంకు సొమ్ముల గురించి చెబుతూ ఇందుకు సంబంధించి తమవద్ద ఉన్న సమాచారాన్ని వెల్లడించడానికి నిబంధనలు అడ్డుపడతాయని అన్నారంట సారు. ప్రభుత్వం చెప్పేదేంటి బోడి.. మన జూలియన్ అస్సాంజ్ లేడూ! ఆయనకు ఆ అడ్డాలేమీ లేవు గదా!

నిన్న జరిగిన మంత్రివర్గ విస్తరణ సందర్భంగా విలేఖరులకు దొరికాడంట ఆయన. అప్పుడు వాళ్ళకు చెప్పిన మాటలివి. ఇప్పుడు అసలు సంగతి కొస్తాను.

ముందే ఈ విస్తరణ, మేడమ్మ మన కాంగీయుల మీద వేసిన ప్రాక్టికల్ జోకు లాగా ఉంటే, దాని పేరిట టీవీల వాళ్ళు మన తెలంగాణ కాంగీయులను చెడుగుడు ఆడుకున్నారు. "మంత్రివర్గంలో చేరితే ఉద్యమాన్ని దెబ్బ తీసినట్టు కదా, అలా చేరొచ్చా, తప్పు కదూ? కేసీయారు కోప్పడడూ?" అంటూ మొన్నా, నిన్నా పీడించారు వాళ్ళను. అంతేకాదు కెమెరా ముందుకొవచ్చిన ప్రతి విశ్లేషకుడి చేతా అడిగించారు. సమాధానాలు చెప్పుకోలేక నానా తిప్పలు పడ్డారు వాళ్ళు. "ఏం, తీసుకుంటే తప్పేంటంటా, ఇన్నాళ్ళకు రాకరాక ఈ అవకాశం వచ్చింది. మేము మరింతగా రాష్ట్రాభివృద్ధికి తోడ్పడవచ్చు గదా" (నవ్వకండి) అంటూ ఎదురుతిరిగారు కొందరు. కొందరు ఢిల్లీలోనే ఉండి పైరవీలు చేసుకున్నారంట. తీరా నిన్న మనాళ్ళకి చెయ్యిచ్చాక అదే టీవీల వాళ్ళు, "ఆంధ్ర ప్రదేశంటే కాంగ్రెసుకు చులకన, ముప్పై ఇద్దరు ఎంపీలున్నాగానీ ఏం లాభం.. మొండి చెయ్యి చూపించారు. ఇప్పుడు దీనికేమంటారు?" అంటూ నిన్న సాయంత్రం ఏడిపించుకు తిన్నారు.  పాపం కాంగీయులు.. మేడమ్మను సమర్ధించుకోలేక మళ్ళీ నానా తిప్పలూ పడ్డారు. ముందు కేసీయారు, వెనక మేడమ్మ - ఇదీ వాళ్ళ పరిస్థితి.

మావాళ్ళకు మంత్రి పదవులు ఎప్పుడిస్తారు అని ఇప్పుడు ప్రధానమంత్రినే అడిగామనుకోండి, ఆయన దగ్గర్నుండి సమాధానం ఏమొస్తుందీ.. "నేనేమైనా జ్యోతిష్యుణ్ణా ఏంటి? సరైన సమయంలో సరైన నిర్ణయం వస్తుందిలెండి"అని అంటాడు బహుశా. సంగతేంటంటే.., ఆ ’సరైన సమయమేం’టో ఆయనకు మేడమ్మ చెప్పాలి. అవిడేమో పుట్టినరోజు నాడు తప్ప ఇట్టాంటి వాటి గురించి పట్టించుకోదు.

దీన్నిబట్టి ఒకటి స్పష్టమౌతోంది.. కాంగీయులకున్న అతి గొప్ప సుడి ఏంటంటే -మేడమ్మ ఫిబ్రవరి 29న పుట్టకపోవడం! ఇంకోటి కూడా.. మేడమ్మ మన కాంగీయుల మీద వెయ్యగల అతిపెద్ద, అత్యంత క్రూరమైన జోకు ఏంటో తెలుసాండీ.. "నా పుట్టినరోజు జనవరి 33" అని ప్రకటించడం! నేననుకోవడం ఆ ముక్క వినగానే బహుశా మనాళ్ళు కొంతమంది ఆత్మహత్యలు చేసేసుకుంటారు కూడా.

9 కామెంట్‌లు:

 1. Well said.

  side kick: see the url

  http://news.yahoo.com/s/ap/us_alabama_governor_christians

  రిప్లయితొలగించండి
 2. చదువరీ,
  మంచి పోస్ట్. మన కాంగీ నాయాళ్ళంతా డమ్మీగాళ్ళే. ఒక రకంగా బేవార్స్ అనిన్నూ, మరొక రకంగా బేకార్ అనిన్నూ అనుకొనవచ్చు.

  @above అజ్ఞాత,
  మీరు యిచ్చిన లింక్ లో పోస్ట్ కి వచ్చిన కామెంట్స్ చూశారా? 24,500. Wow

  రిప్లయితొలగించండి
 3. వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ అడ్రెస్ లేకుండా పోవాలి

  రిప్లయితొలగించండి
 4. మీరు ఇంత వ్యంగ్యంగా చెప్పినవిధానానికి నవ్వాలో... ఇటువంటి నాయకుల పాలనలో బతుకుతున్నందుకు ఏడవాలో అర్ధంకావడంలేదు చదువరి గారు.

  రిప్లయితొలగించండి
 5. మన్మధన్ చెంబు: అవునండి. సరిగ్గా చెప్పారు.
  వేణూ శ్రీకాంత్: మన దురదృష్టం కొద్దీ మనకు కాంగ్రెసు పార్టీ దాపురించింది. నెహ్రూ కుటుంబం మన దేశానికి పట్టిన దయ్యం, దరిద్రమూ, శనీ! అది వదిలితేగానీ కాంగ్రెసుకూ, మనకూ విముక్తి లేదు.

  రిప్లయితొలగించండి
 6. "ముందు కేసీయారు, వెనక మేడమ్మ "

  idi correct.

  రిప్లయితొలగించండి
 7. కాంగ్రెస్ పార్టీ అంటే ఎంత అలుసైపోయిందో ఈ క్రింద ఇచ్చిన వ్యాఖ్యలు చూస్తూనె అర్ధమవుతుంది .
  1) విస్తరణలో మనవాళ్ళకు మంత్రిపదవులు రాకపోవడం నాకు అసంతృప్తి కలిగించింది.....టియస్సార్.
  2) వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ గా వోడిపోతుందని అర్ధమయ్యే మనవాళ్ళకెవరికీ పదవులివ్వలేదు.ఈ సారి ఎన్నికల్లో ప్రధాన పోటీ జగన్,టిడిపి మధ్యే ......రాయపాటి.

  రిప్లయితొలగించండి
 8. Just analyzing the Andhra Pradesh political situation. Take it easy.

  Congress will win next elections (majority MP's and sufficient MLA's) and form government with the help TRS, PRP, MQM. Sonia will use Income Tax Department and CBI to marginalize Jagan before elections.

  Reasons:

  1) Solid vote bank (35 - 50%)
  Reddy+Musl**+Chri**+Brahmin+some Kamma+some Kapu+majority BC's (Mad**,Mal**, etc)+majority ST's+some OBC's+some others)

  2) Money power (10 Lakh Crores were looted between 2004-2010 from AP alone)

  3) Support of Rich and powerful current Political Families across Caste, Religious, Regional lines.

  4) Media support (NDTV, TV9, Tehalka, The Hindu, Times of India, etc)

  5) Powerful mobilization forces in the form of Chur***+Misso**+Mull*.

  6) And more ...

  Have a good day.

  రిప్లయితొలగించండి
 9. http://en.wikipedia.org/wiki/Lok_Sabha

  See the share of MP seats among various groups.

  3rd front, 4th front and even others can support Congress.

  Most of 3rd front and 4th front parties never support BJP.

  If BJP want to win, they must get TDP, Biju Janata Dal and AIADMK on their side. It means that they win more MP seats in AP, Orissa and TN. And Maharastra, Rajasthan, UP and WB play key role.

  The way different groups (Communi**, Christ** Musli**, and anti-Hindu Caste Hindus) are aligned, it seems that Soni** will rule India for ever.

  For BJP to win they need another Ram Janma Bhumi movement. But BJP lost all credibility. So it is impossible.

  Take it easy.

  రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు