18, జులై 2010, ఆదివారం

బాబ్లి సమస్య - చంద్రబాబుది ఉత్తమ స్వార్థం, మిగతావాళ్లది నీచ స్వార్థం!

గోదావరి మీద మహారాష్ట్ర కడుతున్న బాబ్లి ప్రాజెక్టు గురించి తెదేపా గొడవ చేస్తూ సమస్యను రాష్ట్రాన్ని దాటించి మహారాష్ట్రకు, అక్కడినుంచి ఢిల్లీకీ చేర్చింది. ప్రాజెక్టు చూస్తామంటూ బస్సు యాత్ర చేపట్టి అక్కడి ప్రభుత్వం చెరలో పడ్డారు. ప్రాజెక్టు చూడకుండా తిరిగి పొయ్యేది లేదని చెప్పి, చంద్రబాబు సమస్యను చాలా చక్కగా వెలుగులోకి తెచ్చాడు.

కానీ, ఈ ఆందోళనపై ప్రభుత్వమూ, మిగతా పార్టీల ధోరణి మాత్రం ఆందోళన కలిగిస్తోంది. ఎన్నికల లబ్ధి కోసం బాబు ఈ యాత్ర చేస్తున్నాడని విమర్శించారు. నిజమే, ఎన్నికల లబ్ధి కోసమే చేపట్టి ఉండొచ్చు. కానీ, ఆలోచించాల్సింది -అసలు సమస్య ఉందా, లేదా అనేది. అది మనకు ఎంత నష్టం కలిగిస్తుంది అనేది మనం ఆలోచించాలి. ఆ ప్రాజెక్టుల వలన మనకెంతో నష్టమని అందరూ అంగీకరించే విషయమే. కాని, సమస్యలోకి పార్టీల, ఎన్నికల గొడవను చొప్పించి, సమస్యను పలచన చేసి, మన వాదనను బలహీనం చేసి, రాష్ట్రం మొత్తాన్నీ పలచన చేసుకుంటున్నాం.  తెదేపాతో కలిసి ఆందోళన చెయ్యకపోతే మానె, ఆ ఆందోళనను సమర్ధించకపోవడం మాత్రం సమర్ధనీయం కాదు. పార్టీల సంగతి ఎట్టాగన్నా ఉండనీండి, కనీసం మన ప్రభుత్వం తన ఆందోళన చెప్పి ఉండాల్సింది. ముఖ్యమంత్రి గట్టిగా మాట్టాడి మన నాయకులను బాబ్లీకి వెళ్ళనివ్వకపోవడం తప్పని మాట్టాడి ఉండాల్సింది. అలాంటిది ఆయన కూడా చంద్రబాబును తప్పు పట్టటం తప్పు. తెదేపాకు లాభమేదో జరిగిపోతుందని ఈ సమస్యలో ఆయన మహారాష్ట్ర పక్షాన్ని సమర్ధిస్తాడా? లేక, రాష్ట్ర ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని, మహారాష్ట్ర చర్యను నిరసిస్తాడా?

బాబ్లితో పాటు కడుతున్న 13 ప్రాజెక్టులు పూర్తైతే మనకు నీళ్ళు హుళక్కేనని అంటున్నారు.  రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని అన్ని పార్టీలు ఈ సమస్య మీద గొంతెత్తాలి. అందరూ కలిసి, సమస్య మీద కేంద్రంపై వత్తిడి తేవాలి. తెదేపాతో కలిసి చెయ్యకపోయినా, కనీసం ఎవరి దారిన వాళ్ళైనా గొడవ చెయ్యాలి. తెదేపాను విమర్శించడం మానాలి. ఎన్నికల్లో చంద్రబాబు ఏదో బాగుపడిపోతాడని అసలు సమస్యను పక్కనబెట్టి తెదేపాను విమర్శించడం రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నట్టే! ఇంకోటేంటంటే, బాబ్లి మీద ఏ ఇతర రాజకీయ పార్టీ కంటే కూడా తెదేపాయే ఎక్కువ ఆందోళన చేసింది.


ఎన్నికల ప్రయోజనం కోసం చంద్రబాబు చేస్తున్నది స్వార్థమే, కానీ అది తన పార్టీతో పాటు రాష్ట్రానికీ ప్రయోజనం కలిగించేది. కాబట్టి అది మంచి స్వార్థమే. తెదేపాను విమర్శించే పార్టీలదీ స్వార్థమే. కానీ వాళ్ళది నీచ స్వార్థం. ఎన్నికల్లో చంద్రబాబు లాభం పొందకుండా చెయ్యడం తమకు లాభం కలిగించే స్వార్థం. దాంతోపాటు వీరి ధోరణి రాష్ట్రానికి  నష్టం కలిగిస్తోంది. అంచేతే వాళ్ళది నీచ స్వార్థం! వీళ్ళందరికంటే చంద్రబాబే నయం! పార్టీలకతీతంగా ప్రజలు తెదేపా నాయకుల యాత్రను సమర్ధించాలి, వాళ్ల అరెస్టును ఖండించాలి, సమస్య పరిష్కారానికై కేంద్రంపై వత్తిడి తేవాలి. 

20 కామెంట్‌లు:

 1. కేంద్రమా? అదెక్కడుందండీ? సమస్య గాంక్రెసుతో కాదు, దివాళాకోరుతనం ప్రదర్శించటం కాంగ్రెసుకు ఉగ్గుపాలతో వచ్చింది. ఇతర పార్టీలున్నాయి చూశారూ, వారు ఏకమై గళం విప్పితే ఫలితం ఉంటుంది. లోకాయుక్తలు, మెగాస్టారులు ఈ మధ్య ఎందుకో కనబడ్డం లేదు.

  రిప్లయితొలగించండి
 2. హ్మ్ ! ఏమిటో మన రాష్ట్ర పరిస్తితి చూస్తుంటే అయోమయం గా ఉంది . కొన్నిటికేమో ఎందుకో అర్ధం గాని అతి స్పందన . పనికొచ్చే విషయలకేమో పక్కన వాడు బాగుపడదేమో అన్న ఏడుపుతో పోరాడావలసిన వాళ్ళతో చేతులు కలిపి తమాషా చూడటం .

  రిప్లయితొలగించండి
 3. రాష్ట్రానికున్న సమస్యను గాలి కొదిలేసి...
  పక్క రాష్ట్రాల్లో చూసి కూడా మనమేదీ నేర్చుకోకపోతే ఎలా?

  రిప్లయితొలగించండి
 4. మీరు ప్రతి విషయాన్నీ రాజకీయ కోణంలో విమర్శిస్తారు అనుకున్నాను. I was WRONG.

  మీరు TDP or pro TDP ?

  రిప్లయితొలగించండి
 5. కేంద్రంపై వత్తిడి తెచ్చే సత్తా మన రాష్ట్ర ప్రభుత్వానికి ఉందంటారా?

  రిప్లయితొలగించండి
 6. To see similar view
  http://analysis-seenu.blogspot.com/2009/09/blog-post.html

  రిప్లయితొలగించండి
 7. a2zdreams: 1. మీరు అనుకున్నదేంటో నాకర్థం కాలేదు. 2. నేను తెదేపా మనిషిని కాను.

  రిప్లయితొలగించండి
 8. Good one, you can get a job in Eenadu or Andhra Jyothi.

  రిప్లయితొలగించండి
 9. మొండి ముండాకొడులుకు రాజ్యమేలుతున్నారు. ఒకడేమో తన రాజ్యంలోకి వస్తే జైల్లో తోస్తానంటాడు, మరొకడేమో పొయ్యేది ప్రజలే కదా నాకేమి అంటూ పట్టనట్టు ఉంటాడు. సోంపేటలో ముగ్గురిని పొట్టన పెట్టుకున్నారు. ఇక్కడకూడా అలా జరిగితేనేగానీ రాచపీనుగుల్లో చలనం రాదేమో? ఈ దెబ్బతో రాష్ట్రంలో కాంగ్రెస్ మట్టిగొట్టుకుపోవడం ఖాయం...! !

  రిప్లయితొలగించండి
 10. ఉత్తమ స్వార్థ చంద్రుడికి,ఆస్కార్ ఇవ్వాలి,సరే,
  ప్రతి నెలా 2000 గురించి మాట్లాడడే, ?
  తెలంగాణ,కు ఇప్పుడు అనుకూలంగా ఎలా ఉన్నాడు ?
  ఉచిత tv ల సంగతీ ?
  (పబ్లిసిటీ పిచ్చి పోతే బాగుంటుంది భవిష్యత్తు)

  రిప్లయితొలగించండి
 11. వోటర్లకు ఉత్తమ స్వార్ధం నచ్చినట్లుగా లేదు!:-)

  రిప్లయితొలగించండి
 12. సత్యాన్వేషి: అవును, ఉత్త స్వార్థమే నచ్చినట్టుంది. :-)

  రిప్లయితొలగించండి
 13. chaduvari 1000%(yes one thousand ) Kamma..otherwise he wouldn't support Chandrababu who backstab his own father-in-law. I still pity to the people who beleive in CBN. a person who backstabbed his own fatherinlaw, can easily backstab people.

  రిప్లయితొలగించండి
 14. ప్రతివారినీ, ప్రతిదాన్నీ ఎడాపెడా విమర్శించడమే మేధావిత్వం అనుకునేవాళ్ళకి ఈ టపా అర్థం కాదు. చంద్రబాబు స్వార్థపరుడు కాడని కాదు రచయిత అంటున్నది. స్వార్థంలో రకాలున్నాయి. తన స్వార్థం కోసం ఇతరుల స్వార్థాన్ని కూడా సంతృప్తిపఱచడం ఉత్తమస్వార్థం. తన స్వార్థం కోసం ఇతరుల స్వార్థాన్ని దెబ్బకొట్టడం మధ్యమస్వార్థం. తనకు ఏ లాభమూ లేకపోయినా ఇతరుల స్వార్థం దెబ్బదింటే చాలనుకొని అందుకోసం పనిచేయడం నీచస్వార్థం.

  రచయితలకు కులకోణాల్ని ఆపాదించి వారు చెప్పదల్చుకున్న విషయాల విలువని తగ్గించజూడడం బుద్ధిలేని సంస్కారహీనత్వం. వాదంలో గెలవలేక చేసే పిఱికి పని. ఈ పైన ఒకఱు ఆ ప్రయత్నం చేశారు. ఈ దేశంలో ప్రతివాడూ ఏదో ఒక కులంలో పుట్టక తప్పదు. అంతమాత్రాన ఎవఱూ తమ కులం తరఫున పనిచేస్తున్న కార్యకర్తలు కారు. కులమేదైనా ఎవడి బతుకు వాడిది.

  నేనిక్కడ చాలామందికి తెలుసు.

  రిప్లయితొలగించండి
 15. Sreeny: అయితే మీ సిద్ధాంతం ప్రకారం -మీరు కమ్మ కాదు కాబట్టి చంద్రబాబును వ్యతిరేకిస్తున్నారన్నమాట! కాస్త బుర్ర వాడండి మేస్టారూ, బుర్ర వాడండి.
  అజ్ఞాత: "కులమేదైనా ఎవడి బతుకు వాడిది." -కొంతమంది ముష్టెదవలు ఆ సంగతి ఎన్నటికీ తెలుసుకోరనుకుంటానండి.

  రిప్లయితొలగించండి
 16. "మనుషుల స్వభావం ఫలానా" అని శాశ్వతంగా ఫిక్స్ చేయడం పాత పద్ధతి. సందర్భానుగుణంగా మాత్రమే జడ్జ్ చేయడం ఆధునిక పద్ధతి. అందు కనుగుణంగానే "చంద్రబాబుది బాబ్లీ విషయంలో ఉత్తమస్వార్థం" అని చదువరిగారంటున్నారు. అందులో తప్పేమీ లేదు.

  రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు