21, అక్టోబర్ 2011, శుక్రవారం

గెలిచినవాడు నీచ మానవుడు

బాన్సువాడ ఉప ఎన్నిక ముగిసింది. తెరాస అభ్యర్థి గెలిచాడు. కానీ అనుకున్నంత మెజారిటీ రాలేదు. కాంగ్రెసుకు చాలానే వోట్లొచ్చాయి, స్వయంగా వాళ్ళు కూడా ఊహించనన్ని వోట్లొచ్చాయి. అందుకు గాను తెరాస తరపున గెలిచిన అభ్యర్థి ఏమన్నాడో చూసారా..? తమకు వోటెయ్యని వాళ్ళు ద్రోహులంట. ఏగడ్డ మీద బతుకుతున్నారో ఆ గడ్డకు ద్రోహం చేసేవాళ్ళంట. ఇతడి ధోరణి వాళ్ళను భయపెట్టేవిధంగా కూడా ఉంది.


తమకు వోట్లు వెయ్యనంత మాత్రాన ప్రజలను మూకుమ్మడిగా ద్రోహులని ప్రకటించవచ్చా? ఎన్నికల్లో ఓడిపోయిన వాళ్ళు కూడా ఇలాంటి ఆలోచన చెయ్యరు. ప్రజల తీర్పును తలదాలుస్తామని హుందాగా చెబుతారు. కానీ ఇతగాడు గెలిచినా కూడా, వాళ్ళపై పగబట్టాడు. తన సంస్కారాన్ని, తన వికృత మనస్తత్వాన్నీ బైటపెట్టుకున్నాడు. 

అయితే ఇది సంస్కార హీనత మాత్రమే అనిపించడం లేదు, నేరం కూడా నేమో ఆలోచించాలి. ఈ ఒక్కడి సంస్కార హీనత మాత్రమేనని కూడా అనిపించడం లేదు. తమ వ్యతిరేకుల పట్ల తెరాస దాని ఉపగ్రహాలూ అనుసరించబోయే వ్యవహారం గురించి ఇతడి ప్రసంగం సూచిస్తోందనిపిస్తోంది. ప్రజలను ఇలా అవమానించినందుకు గాను, భయపెట్టే ప్రయత్నం చేసినందుకు గాను అతడిపై కేసు పెట్టి, విచారణ చెయ్యొచ్చేమో ఆలోచించాల్సి ఉంది.

7 కామెంట్‌లు:

 1. ప్రజాస్వామ్యస్వామ్యం గూర్చి ఏమాత్రం అవగాహన లేని మూర్ఖుడు..ప్రజా ప్రతినిధి అంటే ముందు చేయాల్సింది ప్రజాసేవ అని తెలియని ఒక తెలివితక్కువ వాడు ఇవాళ బాన్సువాడకి ప్రజాప్రతినిధి గా అసెంబ్లీ కి వెళ్ళబోతున్నాడు.వాడి ఉద్దేశ్యంలో ప్రజాప్రతినిధి అంటే వేర్పాటువాద ఉద్యమాల్నిబలపరిచే ఒక అతివాది మాత్రమే అని అనుకొంటున్నాడు.ఇవాళ తెలంగాణ ప్రజల్లో ప్రత్యేక రాష్ట్ర కాంక్ష బలంగా ఉంది.అందుకే తెలంగాణ ఏర్పడాలి అని ఎందుకంటున్నారు..ప్రజాస్వామ్యం లో ప్రజల మాటే అంతిమని కదా..మరి ఇవాళ ఆ ప్రజల్లోనే కొంతమందికి ప్రత్యేక రాష్ట్ర కాంక్ష బలహీనంగా ఉందేమో.అందుకే భారి మెజార్టీ ఇవ్వలేదు..దానికి ప్రజల్ని ద్రోహులంటాడా?ప్రజలు ఏం తీర్పు ఇస్తే ఆ తీర్పు గౌరవించడం ఏ రాజకీయ నాయకుడి కైనా ప్రధమ విధి.సరే పోనీ మనసులో ఎన్ని ఉన్నా బయటకు ఆ ఆక్రోషాన్ని చూపించకూడదనే ఇంగిత జ్ఞానం లేని వాడు రేపు ప్రజాసేవ ఎలా చేస్తాడో?........అసలు ఈ మాట పోలింగ్ కి ముందు అనాల్సింది...ఖచ్చితంగా భారి మెజార్టీ వచ్చేదే..ఎవరికి? అతనికి అనుకొన్నారా?.... అతనికి కాదు...అతనికి సమీప ప్రత్యర్థి కి
  అవును అన్నట్టు చెప్పడం మరిచా....ఇతగాడు ఒక పార్టీకి గుడ్ బై చెప్పి రాజీనామా చేసి వేరే పార్టీ చేరినప్పుడు అసెంబ్లీ సాక్షిగా అతని కళ్ళ లో జాలువారిన అనంత అశ్రుధార ని పాపం జనం నమ్మలేనట్టు ఉంది

  రిప్లయితొలగించండి
 2. గ్లిజరిన్ కన్నీళ్ళు అని తెలిసిపోయిందేమో ప్రజలకి

  రిప్లయితొలగించండి
 3. 35000 మందిని ద్రోహులు అనే దానికన్నా, ఎదవ అపోజిషన్ వాడినొక్కడిని లేపేసి వుంటే ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యేవాడు కదా! గొర్రెలండి బాబూ అనాగరికమైన గొర్రెలు, ఆ పెజలెంతో, నాయకులు అంతకన్నా ఎక్కువ.

  రిప్లయితొలగించండి
 4. తెలబాను మార్కు వాఖ్యలు. ఇంతకంటే దరిద్రగొట్టు జాతి వేరే ఏదీ ఉండదేమూ..ఈ ప్రపంచంలో

  రిప్లయితొలగించండి
 5. ఆనందిని బ్లాగ్ రచయితకు నా సమాధానం..వివరాలకు కింద లింక్ చూడండి.
  http://www.facebook.com/note.php?note_id=292842364076494

  కోవెల సంతోష్ కుమార్ గారికి,
  ఒక వ్యాఖ్యాత అభిప్రాయాలని సమైఖ్యఆంధ్రప్రజల బావాలకు ఆపాదించిన మీ మేదోసంపత్తికి లాల్ సలాం. సీమాంధ్ర ప్రజలు ఎపుడూ మేం గొప్పవాళ్ళమని ఎక్కడా చెప్పినట్లు నేను ఎపాత్రికలోనూ చదవలేదు మీ నాయకుల విక్రుతవ్యాఖ్యాల్లో తప్ప మిమ్మల్ని మీరు రెందోజాతిగా చిత్రికరించుకొంటూ సానుభూతిపొండడానికి ప్రత్నిస్తూ తిరిగి అదే ఆయుధంగా సీమాంధ్ర ప్రజలపై దాడికి ఉపయోగించే మీ రెండునాల్కల ధోరణికి హాట్స్ ఆఫ్.కులతత్వానికి అరాచాకాలకి ఏప్రాంతం ఎక్కువగా లోనయిందో ప్రజలు దానినుండి బయటకి రావడానికి ఎలా పోరాడారో చరిత్ర తెలిసిన ప్రతీ వారికి తెలుస్తుంది. లేకుంటే ఒక్కసారి మందక్రిష్ణగారిని అడగండి. తెలంగాణలో వ్యసాయం పెరిగిన మాట వస్తామాకాదా అనేది రాష్ట్ర స్టాటస్టిక్స్ చూస్తే తెలుస్తాయి మీ నాయకుల మాటలు కాదు. ఆయకట్టుప్రాంతం అనేది ఆప్రాంత భోగోళికధర్మాలపై ఆధారపడి ఉంటుంది. గోదావరి జిల్లాలు డెల్టా ప్రాంతాలు అవి చదునుగా ఉంటాయి తెలంగాణా ప్రాంతం అంట చదునుగా ఉండదు అందువల్ల తెలంగాణా ప్రాంతానికి కావలసినవి ఎత్తిపోతల పధకాలు. కానీ దానిని కూడా మసిపూసి మారేడుకాయ చేయడానికి ప్రయత్నించారు. కానీ మీరు రైస్ బౌల్ కరీంనగర్ గురించి చెప్పినపుడు బోర్లకింద పండించారు అని రాసారు. మరి ఎగువ,మధ్య,దిగువ లోనేరు డాములు ,శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఏమిచేస్తున్నాయో చెప్పనేలేదు. పని సంస్కృతి గురించి కూడా మీరు విలువైన వ్యాఖ్యలు చేసారు. ఉద్యోగాలు దోచుకుంటున్నారు అని గొంతుచిన్చుకొంతున్నది మీ నాయకులేతప్ప వేరేవారు కాదు. మరి పొలమూరు కార్మికులు అంత పని చేస్తున్నప్పుడు వారి పని ఎవరూ లాక్కోలేరే? నల్లగొండ ఫ్లోరోసిస్ పాపాన్ని కూడా సీమాంధ్ర ప్రజల మీదికి నెట్టే మీ ప్రయత్నం అనన్యసామాన్యం. ఫ్లోరోసిస్ అనేది మీ నల్లగొందలోనే కాదు ఆంధ్రప్రదేశ్లో ఇంకా ఇదు జిల్లాలు ఫ్లోరోసిస్ ప్రభావిత జాబితాలో ఉన్నాయి అని మీరు తెలుసుకొని ఉంటె కొంచెం విజ్ఞత అనిపించుకోనేది. వివక్ష గురించి మీరు మాట్లాడడం చాల వింతకదండీ మనం అంటే ఇస్టపదనివాళ్ళు మమ్మల్ని ఎంతసేపు మీరు వేరు అని చెప్పేవాళ్ళు మమ్మల్ని వివక్ష చూపుతున్నారు అనడం ఓహ్....ఏమని రాయాలో తెలియడంలేదు. రైస్ బౌల్ అని, పాలమూరు పని సంస్కృతి అని చెప్పి మళ్ళీ మీకులా మూడుపంటలు పండుతలేదు అని చెప్పడం ఎం న్యాయమో మీరే ఆలోచించాలి. చదువులు గురించి చెప్పారు మరి చదువులు బాగానే చదివిన్చుకొంతున్నపుడు ఇంకా కొలువులగురించి దిగులేల సామీ? ఇది సర్కారీ కొలువులకోసం ఎగబడే కాలం కాదే మరి ఇంకెందుకు ఈ అసంబద్దపు వ్యాఖ్యానాలు. ప్రజాస్వామ్య భావాలు అంటే ఒక వ్యక్తి అతని కుటుంబం పాలిన్చడమా? రెండుకులాల గురించి చెప్పారు మరి మీ ప్రాంతంలో ఎన్ని ఏమ్మేల్యే పదవులు ఒక్క కులం అనుభవిస్తుందో తెలియదా? అదేకులం రాస్త్ర్రాన్ని ఎక్కువకాలం పాలిన్చిందన్న చేదునిజం తెలియదా? మీ ప్రాంతం నుండి కేంద్రంలో ఉన్న ఒక్క కేబినేట్ మంత్రి కూడా అదే కులానికి చెందినవాడు అని,మీకు గుర్తుకురాకపోవడం పెద్ద ఆశ్చర్యం ఏమీకాదు.కులాల సమతుల్యం సీమంధ్రలో ఎక్కువా తెలంగాణలో ఎక్కువో ఒక్కసారి గత నాలుగైదు మంత్రివర్గ కూర్పును చూస్తేమీకే తెలుస్తుంది కాని సీమాంధ్ర మీద విషం జల్లడమే పనిగా పెట్టుకున్న మీబోటి పెద్దలకు అంతతీరిక ఉండకపోవచ్చు. సూట్ కేసులతో అన్నిటినీ కొనగలిగినప్పుడు మీ ఉద్యమం పెరుగుదలకు ఎన్ని సూట్ కేసులు ఎక్కడినుండి వచ్చాయో మీ నాయకుడు దానిని ఎక్కడ ఎలా పెట్టుబడులు పెట్టాడో కూడా గద్దర్ లాంటి నాయకులు చాలా బాగా వివరించారు వినండి.continued...

  రిప్లయితొలగించండి
 6. మా ఇంటికొస్తే అనే సామెత ఎవరికీ వర్తిస్తుంది సారూ? ఎంతసేపూ మాతెలంగాణా మాగ్గవాలే సీమంద్రోళ్ళు మమల్ని దోచుకొన్నారు జాగో బాగో అనేది ఎవరు? అనడంతప్ప దోచుకోన్నది ఎవరు అనేది ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకొంటే తెలుస్తుంది మిమ్మల్ని ఇన్నాళ్ళుగా మోసంచ్స్తున్నది మీనాయకులాకాదా అన్నది. సూట్ కేసులతో అమ్ముడుపోయేది మీ నాయకులు అయితే ఉమ్మడి రాష్ట్రం అయితే ఏమిటి విడిపోతే ఏమిటి అప్పుడు మీ నాయకులు సూట్ కేసులకు అమ్ముడుపోరనే గ్యారంటీ ఏమైనా ఉందా? రెండు మూడు భాషలు మాట్లాడగలిగే వాళ్ళు చాలా తెలివైనవాళ్ళు అయినపుడు మరి వాళ్ళను ఇలా మోసం చేయడం ఎలాకుడురుతుందో మీరే చెప్పాలి.మహారాష్ట్రల ఉన్న తెలుగోళ్ళు మహారాష్ట్ర మన సరిహద్దు గురించి వెళ్లారు తప్ప మరోటి కాదనే సత్యాన్ని పీకనోక్కి చంపటం, అదే తెలుగోళ్ళు చెన్నైలోనూ, బెంగళూరు లోనూ ఉన్నారని సాఫ్ట్ వేర్ లో ప్రావీణ్యం మీ తెలంగాణా ప్రజల సొత్తుకాదని అమీర్పేట్ సాక్షిగా మీకు చెపుతున్నాను. చెన్నై నాయుళ్ళు బెంగళూరురెడ్లు ఆంధ్రా నుండి వెళ్ళినవాళ్ళేనని వాళ్ళు అక్కడ రియల్ ఎస్టేట్ రాజ్యాన్ని పాలిస్తున్నారని మీకు తెలియకపోవడంలో వింతలేదు. మీ తెలంగాణా సోదరులు ప్రపంచమంతా తిరుగాడుతున్నారు కాని ఒక సీమాంధ్ర లో తప్ప అన్నారు మరి వరంగల్, నిజామాబాద్, కరీంనగర్లో ఒక్క సాఫ్ట్వేర్ కంపనీ ఎందుకు పెట్టలేదు సారూ? విశాఖపట్నంల మీ తెలంగాణా సాఫ్ట్ వేర్ సోదరులు ఉన్నారని మీకు మీ నాయకులు చెప్పకపోవచ్చు...మీరు కొంచెం తరచి చూస్తె తెలుస్తుంది. పైత్యం తలకెక్కిన మాటలు మాభావాలను దెబ్బతీస్తాయని మీకు తెలుసు అందుకే మరిన్ని మాటల తూటాలు పెలుస్తారు కానీ మాలక్ష్యం మాకు తెలుసు మామాటలు వాదనలు నిజాలు అని కూడా తెలుసు. సత్యమేవ జయతే అనే సూక్తి నిజం ఆ నిజం ఎప్పటికైనా గెలుస్తుంది.
  by Annaji Sekhar Gubbala on Saturday, October 22, 2011 at 2:08am
  http://www.facebook.com/note.php?note_id=292842364076494

  రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు