19, నవంబర్ 2006, ఆదివారం

వోక్సూ పోనాదండి

ఇక తేలిపోయింది. వోక్సువాగను పోయింది. వశిష్ట వాహన్ అనే అడ్రసులేని కంపెనీకిచ్చిన 11 కోట్లూ పోయాయి.

రాష్ట్రానికి అప్రదిష్ట మిగిలింది, బొత్స సత్యనారాయణ మిగిలాడు. ఆయనకు మంత్రి పదవి మిగిలింది. తమ్ముడితో కలిసి ఆయన చేసిన జర్మనీ పర్యటన మిగిలింది. ఆయనకి ఇంకా ఏమేం మిగిలాయో తెలీదు. ఆ 11 కోట్లూ ప్రభుత్వం ఎవరికిచ్చిందో గానీ, ఐపూ అజా లేవు.

ఈ వోక్సు వాళ్ళ పద్ధతేమి బాగాలేదు. కర్మాగారం పెడతామంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని తమ చుట్టూ తిప్పుకుని చివరికి మొహం చాటేసారు. కొందరు అధికారులు, అనధికారులు, మంత్రులు, అమంత్రులు వ్యవహారాన్ని సరిగా నిర్వహించలేదు గానీ మొత్తమ్మీద రాష్ట్రం దీనికోసం ప్రయత్నించిందని చెప్పుకోవచ్చు. ఇలాంటి నమ్మకం లేని కంపెనీల కోసం రాష్ట్రాలు తమలో తాము పోటీ పడితే వాళ్ళు దీన్ని అవకాశంగా తీసుకునే అవకాశం ఉంది. ఇలాంటి కంపెనీలకు దూరంగా ఉంటే మంచిదేమో!

అయితే ఇక్కడో చిక్కుంది. ఇలాంటి వ్యవహారాలు లేకపోతే తమ్ముళ్ళనీ, బామ్మర్దులనీ విదేశాలకు పంపడం కుదరదు. పైగా 11 కోట్లు ఎవరికో ఇచ్చేసి, సొమ్ములు పోనాయి అయితే ఏంటంట అని అడిగే అవకాశమూ ఉండదు.

సొమ్ములు పోనాయండి, వోక్సూ పోనాదండి!

2 కామెంట్‌లు:

  1. I believe some amount is recovered from the middle people. Not entire money is lost. There are shady activities by some people in this affair.

    రిప్లయితొలగించండి
  2. మన సొంత సొమ్ము పోనేదు కదా..జనాల సొమ్ము ఎంత కర్చెట్టినా కిమ్మనరు. ఓ రెండ్రోజులు పత్రికలు ఏడుస్తాయి, తర్వాత దానబ్బ లాంటి వార్తలు, స్కాములు వచ్చేసి పత్రికలు కూడా ఊరుకుంతాయి.

    మనం ముందు పెళ్ళాం గారికి బొబ్బిలి గెలిపించాల. వోక్సు సొమ్ములు పోతే పోనాయి, మనకి బొబ్బిలి సొమ్ములు వస్తే సాలు.

    రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు