14, నవంబర్ 2006, మంగళవారం

తెలుగు, ఆంధ్రం - కనకదుర్గ గారి అబద్ధాలు, దూషణలు

ఆంధ్రజ్యోతిలో కనకదుర్గ దంటు గారు రాసిన వ్యాసం చదివి నేనీ స్పందనను రాస్తున్నాను. ఆ వ్యాసంలో ఆమె చాలా అవాస్తవాలను రాసుకు పోయారు. తెలుగు అనే మాట తెలంగాణ వాళ్ళదనీ, ఆంధ్ర ప్రాంతం వారికి దానితో అసలు సంబంధమే లేదనీ ఆవిడ వాదించారు. ఇంత పరమ మూర్ఖపు వాదనను చదివాక నా స్పందనను రాయకుండా ఉండ లేకపోతున్నాను. ఇక ఆంధ్ర అనేమాటను ఆమె కోస్తా, రాయలసీమ ప్రాంతాన్ని దృష్టిలో ఉంచుకుని వాడారు. నా దృష్టిలో అది తప్పైనా, వాదన కోసం నేనూ అదే వాడాను.


తెలుగు మాసొత్తు అని చెప్పుకుంటున్నారు అనే విమర్శ గురించి: తెలుగు మా ఒక్కరి సొత్తు అని ఎవరూ అనలేదు. తెలుగు అందరిదీ.. భాష తల్లి లాంటిది.. అలాంటి తల్లిని దిక్కుమాలినది అని తిట్టే దౌర్భాగ్యుల గురించి మాత్రమే ప్రజల విమర్శ. అయితే, ఇప్పుడు కనకదుర్గ గారు మాత్రం "తెలుగు మాది.. మీది ఆంధ్రం" అని తమ ఆంధ్ర "సోదరు"లను అంటున్నారు. మా అమ్మను మేము తిట్టుకుంటాం, చంపుకుంటాం మీకెందుకు అని ఆమె వాదన కామోసు!


తెలుగు అనేమాట మనకు ఉర్దూ నుండి వచ్చిందని చెబుతున్నారు కనకదుర్గ గారు! ఇది తెలివైన వాదనే అనుకుందాం ప్రస్తుతానికి.. మరి ఈ ప్రాంతాన ఉర్దూ వినిపించి కేవలం కొన్ని వందల ఏళ్ళే అయింది. అంతకు ముందు తెలుగును ఏమనే వాళ్ళో ఆమె వివరిస్తే బాగుండేది.. ఆంధ్రం అనేవాళ్ళా?


మూడు క్షేత్రాల మధ్య నున్న ప్రాంతమే తెలుగు ప్రాంతమని ఆమె అంటున్నారు, మరి దీనికి బయట ఉన్న తెలంగాణ ప్రాంతమెక్కడిది? తెలుగువారిది కాదన్న మాటేగా? బయటి ప్రాంతాన్ని తెలంగాణలో కలిపేసుకున్నారా? మరి ఇక్కడి తెలుగువారు తెలుగువారా లేక మహారాష్ట్ర, కన్నడ జాతులతో కూడిన సంకర జాతా? అలాగే తెలుగు భాగవతం అనే దానికి కూడా ఆధారం ఇవ్వలేదు.ఆంధ్ర జాతి అనేది 5 వేల ఏళ్ళ కిందటే ఉండేదని రాసారు, సంతోషం! దండకారణ్యానికి దిగువన ఉండే ప్రాంతం ఇప్పటి ఆంధ్ర ప్రాంతమని కూడా సెలవిచ్చారామె. ఇప్పటి ఖమ్మం జిల్లా, వరంగల్లు జిల్లాలోని కొంత భాగం దండకాటవికి నేరుగా దిగువన ఉన్నదని ఆమెకు తెలిసినా తన వాదనకు సౌకర్యంగా ఉంటుందని పక్కన పెట్టినట్టున్నారు. మరి.. ఖమ్మమూ, వరంగల్లులోని కొంత భాగమూ ఆంధ్ర ప్రాంతానికే చెందాలంటే ఆమె ఒప్పుతారా? ఇది మూర్ఖవాదనని నాకు తెలుసు.. 'త్రిలింగాల మధ్యనున్నదంతా మాదే.. మేమే తెలుగులము' అన్న ఆమె వాదన ఎంత మూర్ఖమైనదో చెప్పడం కోసమే రాసానిది.ఆంధ్రా వాళ్ళకు తెలుగు ఊతపదమైందట.. పైగా ఎలాగయిందో చెబుతానంటూ తప్పులో కాలేసారు, దుర్గ గారు! శంకరంబాడి సుందరాచారి బాపట్ల కు చెందిన వారు కాదు, ఆయన రాయలసీమకు - తిరుపతికి - చెందిన వారు. ఆయన మొదటిసారిగా తెలుగు అనేమాటను దోపిడీ చేసి కొల్లగొట్టుకు పోయారట! కృష్ణా, గోదావరులు తెలంగాణలోనే ఎక్కువ భాగం ప్రవహిస్తున్నాయనీ, అంచేత వాటి ప్రసక్తి "మా తెలుగుతల్లికి.." పాటలో ఉండడాన్ని తప్పుబట్టారు. రాసిన మహానుభావుడికి ఆ భావనలేమీ లేవు. అందుకే రుద్రమ్మ భుజశక్తి గురించీ రాసాడు. ఆయన రాసింది యావజ్జాతి గురించీ! ఇలాంటి సంకుచిత స్వభావులకు అది అర్థం కావడం కష్టమే.


బహుశా నిజాము పాలన ప్రభావం కాబోలు.. ప్రతీవాళ్ళనూ దోపిడీదారు అని కలవరించడం అలవాటైపోయింది దుర్గ గారికి. నిజాము పాలనలో ఉండి బయటి ప్రపంచంతో సంబంధాలు లేకపోవడం వలన శంకరంబాడి సుందరాచారి గారు "తెలుగు" అనే మాటను కొట్టేసిన విషయం తెలీలేదట.. ఆ పాలన ముగిసి ఇప్పటికి యాభైఆరేళ్ళు దాటిందే.. మరి ఇన్నాళ్ళూ ఈ విషయం ఆమెకు ఎందుకు తెలీలేదో!? (హఠాత్తుగా కరీంనగర్ ఉప ఎన్నికకు ముందు తెలిసింది!) నీళ్ళూ, నిధులూ, నియామకాలతో పాటు సూర్యకాంతిని, వర్షాలను, సముద్రాన్ని, తుపానులను కూడా కొట్టేసారనలేదు, సంతోషం! ప్రాస కలవక అనలేదనుకుంటాను.


మొట్ట మొదటగా సుందరాచారి గారే తెలుగు అనే మాటను కొట్టేసారని ఆమె చెబుతున్నారు. "దేశభాషలందు తెలుగు లెస్స" అనే వాక్యం ఆమె విన్నారా? అందులో తెలుగు అనే మాట ఉంది గమనించారో లేదో మరి? దాన్ని రాసింది శ్రీకృష్ణదేవరాయలనీ, శ్రీనాథుడనీ రెండు వాదనలున్నాయి. మరి వాళ్ళ కాలం ఈమె అంటున్న కాలానికి కనీసం 400 ఏళ్ళ ముందు. ఇద్దరూ తెలంగాణ ప్రాంతానికి చెందినవారు కాదు. దుర్గగారికి ఈ విషయం తెలిసినట్లు లేదు.. లేకుంటే శ్రీకృష్ణదేవరాయలను, శ్రీనాథుడినీ ఏకి పారేసి ఉండేవారు.., కవిత్రయపు కవిత్వాన్ని అన్యాపదేశంగా విమర్శించినట్లు!


భాష, సంస్క­ృతి వేరైన ప్రజలు కలిసి ఉండడం సాధ్యంకాదు అని
ఈమె అంటున్నారు..మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే భాషా, సంస్కృతీ వేరైన ముస్లిములను తెలంగాణ నుండి వెళ్ళగొడతారు గామోసు!


ఆంధ్రం 5 వేల ఏళ్ళ నాటిదని ఆమే స్థిరపరచారు. అలాగే "తెలుగు"కు ఆ పేరు ఉర్దూ మాట్లాడే జనం ఇక్కడికొచ్చాకే ఏర్పడిందని కూడా నిర్ణయించేసారు. అంటే కొన్ని వందల ఏళ్ళ కిందటిదన్న మాట. మరి ఆమె చెప్పుకుంటున్న "వారి భాషలో" ఆమే చెబుతున్న "ఆంధ్ర" భాషలోని అక్షరాలు, పదాలు, వ్యాకరణమే ఉన్నాయేమిటి? దుర్గగారూ, ఆంధ్రం లోని అక్షరాలను, పదాలను, వ్యాకరణాన్నీ తీసుకుని దాని క్రియల్ని మార్చి ఇవ్వాళ "మీది"గా చెప్పుకుంటున్న తెలుగుగా మార్చారా మీ పూర్వీకులు? అంటే మీ పూర్వీకులు ఆంధ్రులు లేదా ఆంధ్ర సంతతి అయినా అయి ఉండాలి. ఈ సంగతి అర్థం కాక మీరు తెలుగు నాదే, నీది కాదు, నువ్వు వేరే పేరు పెట్టుకో అంటూ తెలివి తక్కువ వాదన చేస్తున్నట్టున్నారు.


ఇక్కడో విషయం.. కనకదుర్గ గారు ఆంధ్ర ప్రాంతం వారందరినీ అంటున్నారు.. నేను మాత్రం ఆమె ఒక్కర్నే అంటున్నాను. ఎందుకంటే ఇంత తెలివి తక్కువగా, మూర్ఖంగా అందరూ ఆలోచించరు కాబట్టి. ఆమె మూర్ఖత్వానికి పరాకాష్ఠ.. ఆంధ్రులను తెలుగువారు అని అనరాదట! ఈ మాట చెప్పేందుకు ఆమె ఎవరు? నేను కూయందే పొద్దే పొడవదన్న కోడి లాగా ఏమిటీ తెలివితక్కువ వాదన?


ఇక కాళోజీ ఎకసక్కెం గురించి కొంత.. దుర్గ గారంటున్న ఆంధ్ర ప్రాంతం వాళ్ళు ఇంగ్లీషు నేర్చి తెలుగును జోకొట్టారు, అందులో సందేహం లేదు. మరి కాళోజీ సమకాలికులైన తెలంగాణ వారు స్వచ్ఛమైన తెలుగు మాట్లాడుతున్నారా? ఆమే రాసారుగా.. సడకు, అదాలతు, ముల్జీం (ముజిలిం), షక్కరు.. ఏడికెల్లి అచ్చినయి గా మాటలు? ఉర్దులకెల్లి అచ్చినయి గావా? కాకతీయుల కాలంలో ఉన్నాయా అవి? భాష పరిణామంలో ఇవి సహజం, నేను తప్పుబట్టడం లేదు.. కానీ కాళోజీ తప్పుబట్టాడని ఆమె ఎత్తిజూపడం మర్యాద కాదు అని చెబుతున్నాను.అసలెందుకు చేస్తున్నారీ కొత్త వాదనలు?

ఈ తెలివితక్కువ వాదనలు ఇప్పుడే ఎందుకు చేస్తున్నట్లు? కేసీయార్ దిక్కుమాలిన డైలాగుతో మొదలైందిది. ప్రస్తుతం కరీంనగర్ ఉప ఎన్నికలు దగ్గర్లో ఉన్నాయి. ఈ ఎన్నికల్లో తెరాస ఓడిపోతే అది ఆ పార్టీకి పెద్ద దెబ్బ అవుతుంది. అంచేత ఏదో రకంగా తగువు పెట్టుకుని తెలంగాణ ప్రజల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టి, ఈ ఉప ఎన్నికలో గట్టెక్కాలన్న దుగ్ధ కనిపిస్తోంది ఈ తెలుగుతల్లి దూషకుల్లో, తెరాస విదూషకుల్లో! తెరాస నేత మొదలెట్టిన ఈ దూషణల పర్వాన్ని తెరాస బుర్రకథకుల గుంపుకు చెందిన వంతగాళ్ళు కొనసాగిస్తున్నారు! అందులో భాగమే ఇది. తెరాస గెలుస్తుందా, తెలంగాణ ఏర్పడుతుందా అనేది కాదు విషయం, ఈ ప్రేలాపనల్లో పస ఉందా లేక అంతా బుసేనా అని!చివరగా..

అమ్మా! ఈ కనకదుర్గ అనే పేరు ఎక్కడి నుండి వచ్చిందో తెలుసుకోవాలని ఉంది.. బెజవాడ కనకదుర్గమ్మ పేరా, లేక తెలంగాణ లోనే ఆ పేరు గల దేవత ఉందా? ఒకవేళ బెజవాడ కనకదుర్గ పేరే మీరు పెట్టుకుని ఉన్నా.., అంత మాత్రాన "కనకదుర్గ మాకే చెందుతుంది, మీరా పేరును మార్చేసుకుని వేరే పేరు పెట్టుకోండి" అని అనేంత మూర్ఖ శిఖామణులు మనరాష్ట్రంలో లేరులే!

16 కామెంట్‌లు:

 1. చాలా బాగా వ్రాశారు,
  ఈ రచనతో కనకదుర్గ గారు మూర్ఖత్వానికి ఒక ఉదాహరణ అయ్యారు. అయినా ఆంధ్రజ్యోతి సంపాదకులు యధవలు కాబట్టె ఇలాంటి మూర్ఖుల రచనలు ప్రచురిస్తున్నారు.

  రిప్లయితొలగించండి
 2. చాలా చక్కగా రాసారు చదువరి గారు. సరిగ్గా నాకు కూడా 'దేశభాషలందు తెలుగు లెస్స' అన్న ఉదాహరణ తట్టింది.

  తెలుగదేల యన్న దేశంబు తెలుగేను
  తెలుగువల్లభుండ తెలుగొ కండ
  యెల్ల నృపులు గొలువ నెఱుగవే బాసాడి
  దేశభాషలందు తెలుగు లెస్స!

  ఈ పద్యంలో అంతా తెలుగే తప్ప అంధ్రం మాచ్చుక్కయినా కనిపించదే!!!

  రిప్లయితొలగించండి
 3. A vyAsam cadivi cAlA kalata cendAnu. Especially after reading chomsky's Manufacturing consent I stated hating the media which systematically creates an illusory perception of the world around us. chAvA kiran said somewhere that media is trying to make us habituated to bribe issues by publishing them regularly. This time, if there are any motivations behind the article, must be deeply poisonous. Actually, it was full of lies from top to bottom, including "Telugu came from trilinga". I believe that telugu came from "ten-un-ku" which in proto-dravidian, means kui language spoken in southern regions. Indeed Kui belongs to same sub-family as Telugu. Andhra-Jyothi has blindly published that..? I don't know..I don't read it regularly so donot know its standards; but definitely it wouldnot have surprised me had it been Eenadu.

  chetta cinemalu, chetta vaarta patrikalu ..janalaku telugubhasha mida leni makkuva prantalapai puttatam..ivanni chustunte telugu vallamemai potama anipistondi...

  రిప్లయితొలగించండి
 4. ఇది చదివి నవ్వుకోవడానికి చాలా బాగుంది. ఇలాంటి హాస్యభరితమైన వ్యాసాలని ఇంకా ప్రచురించాలని ఆంధ్రజ్యోతి ని కోరుతున్నాను. రేప్పొద్దున కేసీయార్ సార్ ఇంకా తెలంగాణా వీరులు తెలంగాణాకు మద్దతుగా ప్రముఖ చరిత్రకారిణి, ప్రముఖ పత్రికా రచియిత్రి దంటు కనకదుర్గ గారి వ్యాసాన్ని ఉటంకిస్తారన్నదే ఐరనీ. కనీసము పరిశోధన వ్యాసాల్లోనైనా ఈమె పేరును కొంచెం ప్రశాంతంగా వదిలేస్తారని ఆశిస్తూ...

  రిప్లయితొలగించండి
 5. దుర్గ లాంటి వారు రాసే వ్యాసాలు, మాటలు తెలుగు వారిలో పరస్పర విద్వేష భావాలు, Negative thinking కు దోహద పడుతున్నాయి. ఇది విచారకరమైన పరిణామం.దుర్గ గారికి దీటైన జవాబు రాశారు.మీ స్పందన ఆంధ్ర జ్యోతి కి పంపండి.

  రిప్లయితొలగించండి
 6. ఏమైనా మన ఇనుపదుర్గ గట్టిదే. ఇతువంటి బేవార్సు రాతలు ప్రచురించడంలో తప్పు లేదు. ఎందుకంటే పత్రికా స్వాతంత్రాన్ని మనం గౌరవించాలి కదా!

  రిప్లయితొలగించండి
 7. నాకు ఈ వ్యాసం చూస్తే (అనగా ఆంధ్రజ్యోతిలో వ్యాసం చూస్తే, చదువరి గారిది కాదు) ఓ విషయం తళుక్కున మెరుస్తుంది

  రామయ్య వర్గం, సోమయ్య వర్గం కొట్టుకుంటున్నారు

  రామయ్య ఎలాగయినా గెలవాలనుకున్నాడు

  అందుకని తమ మనిషిని సోమయ్య వర్గంలోని పంపించి, ఓ అద్భుతమైన, ఆవేశపూరితమైన వ్యాసం రాపిస్తాడు

  కానీ ఆ వ్యాసం మొత్తం చెత్త, దానిలో ఒక్క మాట కూడా విశ్లెషణకు నిలిచేది ఉండదు

  ఆ వ్యాసాన్ని రామయ్య వర్గం చీల్చి చెండాడి, సోమయ్య వర్గ వాదన మొత్తం అలాంటిదే అని అందరినీ నమ్మిస్తారు

  చివరిగా సోమయ్య ఏమి చెప్పినా ఎవరూ నమ్మరు.

  ---

  ఈ జ్యోతిలో వ్యాసం చదవగానే నాకు ఆ విషయమే గుర్తు వచ్చినది.


  ఈ దుర్గ గారి వ్యాసంలో ఒక్కటంటే ఒక్కటి కూడా పస ఉన్న వాదన లేదు.


  ఇంతకీ ఈ మహా తల్లి ఎవరు?

  రిప్లయితొలగించండి
 8. కొంత మందిని మనం తిటవలిసిన అవసరం లేదు, వారికి వారే నిరూపించు కుంటారు ***** అని. పాపం దుర్గ గారిని ఏమీ అనాలేము. ఆవిడ పేరు గురించి అడిగితే దుర్గ పేరు కూడా "దర్గా" అనే పదం నుంచి వచ్చింది అని అనుకుంటునరఏయ్మో.....

  రిప్లయితొలగించండి
 9. మీరు నాలాంటివారికి స్ఫురించని ఎన్నో అంశాలతో ఒక బుఱ్ఱతిరుగుడు వాదనని తిప్పి కొట్టారు. కృతజ్ఞతలు.ఎవరూ రాయకపోతే నేనే రాద్దామనుకున్నాను.

  మీరన్నది నిజం. ఒక ఉప ఎన్నిక గురించి భాషనే ముక్కలు చేసే స్థాయికి వెళ్ళారు TRS వారు.అసలది ఒక మహిళ రాసిన వ్యాసమేనా ? అని నా అనుమానం.అందులో వాడిన పరుష పదజాలమూ అర్థం లేని ఆవేశమూ నాకీ సందేహాన్ని కలిగిస్తున్నాయి.కాని TRS వారి వాదనకీ ఈమె వాదనకీ చాలా తేడాలున్నాయి.మాది తెలంగాణా భాష తెలుగు కాదంటున్నారు వారు.ఈమేమో తెలుగు మాదే మీది ఆంధ్రం అంటోంది.ఇది వారి తరహా వర్గపు మనుషుల అయోమయాన్ని ప్రతిబింబిస్తోంది.తామేం మాట్లాడుతున్నారో తమకే అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు.

  మాట్లాడ్డానికేమీ దొరక్క ఈరోజు TRS వారు ఆనపకాయల గురించి సొరకాయల గురించి తెలుగు గురించి మాట్లాడే స్థాయికి దిగజారిపోయారు.పాపం ఎంత desperate ! వారూ వారి వేర్పాటువాదాలూ మూడునాలుగేళ్ళలో మూలపడతాయనడంలో నాకెలాంటి సందేహమూ లేదు.

  రిప్లయితొలగించండి
 10. arthaM lEni vyAsaM idi. apArthAlu teccE mArgamidi.
  ceppina vishayaM ceDiMdi. ceppavalasinadi egiri pOyiMdi.
  itara yAsalatO bATu telaMgANa yAsa poMdina cinna cUpu,
  adhikAra, sinimA mAdhyamAllO aMdina avahELanalu,
  ceppukOvaDAniki ceTTaMta vishayaM uMDagA lEni leMkalanu,
  posagani kAraNAlanu, avAstava AdhArAlanu prAcina sAhityaMlO
  vetakE prayatnaM aMtA asalu arthaM lEni vyartha pani.

  telugu, AMdhra anEvi samAnArthAlE ayinA gata konni
  daSAbdAlugA vaccina rAjakIya, saMghika pariNAmAlu,
  "AMdhra" padAniki lEni arthAlanu aMTagaTTiMdi. aMta mAtrAniki
  reMDu vErE bhAshalainaTTu vAdiMcaDAniki prAcIna sAhityAnni
  uTaMkiMcaDaM arthaM lEni paniki AjyaM pOsinaTluMdi.

  I vyAsaM sAdhiMciMdi EmiTaMTE tiTTukOvaDAlaku pedda pITa veyyaDaM.
  Emanna maMci jarigiMdA aMTE deppukunnA kAnI aMdarU
  bhAsha mAtraM okkaTE ani marOsAri ceppukOvaDaM.

  okaTi mAtraM nijaM. kaLLu terici goMTu vippi dInni
  dummettipOsinaTlE, manaM anukuMTunna okEoka telugu
  bhAshayokka palu yAsalu palu rakAlugA nokkabaDi tokkabaDi
  navvulapAlainappuDellA kUDA koMta nOru terici iTlAnE mATlADitE
  I vaishamyAlu iMtagA perigi kuLLi peddavayyEvi kAvEmO ani
  mAtraM tOstuMdi, tolustuMdi.

  -SrInivAs^ nAgulapalli

  రిప్లయితొలగించండి
 11. simple ga cheppalante avida tala (head)piketti akasam meda vummi vesinatluga vundhi.

  రిప్లయితొలగించండి
 12. నమస్కారం!
  మీ బ్లాగు చూశాను. ముఖ్యంగా కనక దుర్గ గారి వ్యాసం పట్ల మీ స్పందన బాధ్యతా యుతంగా ఉంది. ఐతే ఆమెకు తెలుగు సాహిత్యం పట్ల గానీ, తెలుగు చరిత్రపట్ల ఉన్న అవగాహన ఏ పాటిదో ఆ వ్యాసంలోని విషయాలను బట్టే తెలిసిపోతుంది. ఇలాంటి వారి గురించి స్పందంచి మన విలువైన సమయాన్ని వృఇధ చేసుకోవటమే, కానీ ఊరుకోవటం వల్ల కూడ అబద్దాలు నిజమనుకొనే ప్రమాదమూ ఉంది.మీ అభిమానానికి కృతజ్ణతలు!!

  మీకు నా అభినంధనలు!


  డా.దార్ల వెంకటేశ్వర రావు

  రిప్లయితొలగించండి
 13. ఎంటో ఈ దిక్కు మాలిన "ఆంద్ర" తెలుగుకు అంత సోది అవసరమా

  రిప్లయితొలగించండి
 14. చూశారా అప్పుడే తెలంగాణావాదులు దుర్గమ్మ వ్యాసాన్ని తమ ప్రచారాయుధాల లిస్టులో చేర్చేసుకున్నారు. ఇక తెలంగాణా వస్తే మా జాతిపిత కాళోజీ అంటారేమో.
  http://telanganadiary.wordpress.com/2006/11/24/teluguandandhra/

  రిప్లయితొలగించండి
 15. రవీ, ఇప్పుడే చూసానండి. పైన కాళోజీ పేరుతో వ్యాఖ్య రాసినాయనే ఆ బ్లాగూ రాసినట్టున్నారు.

  రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు