5, నవంబర్ 2006, ఆదివారం

నీటి బొట్టు పెరిగిపోతె సంద్రమే!

కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలు సముద్రాలయ్యాయి. ఇప్పుడు కురిసినంత వాన ఈ మధ్య కాలంలో కురవలేదని అంటున్నారు. తుపానుల చరిత్రలో 1977 తుపాను ఓ మైలురాయి. ఆనాడు కూడా ఇంత వాన లేదని మా నాన్న అన్నారు. పొలాలెలాగూ మునిగిపోయాయి, ప్రజల జీవన పరిస్థితులు ఘోరంగా ఉన్నాయి. పల్లపు ప్రాంతాల్లో జనం శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. ప్రజలకు సరైన ఆహారం, గొడ్లకు మేతా దొరకని పరిస్థితి. దుర్భరమనిపించే పరిస్థితులు. కోస్తాలో తుపానుల గురించి గుర్నాం సింగ్ భల్లా గారి బ్లాగు చూడండి.

తుపానుల్లో జరిగే తక్షణ నష్టాన్ని పూర్తిగా అరికట్టలేకపోయినా, అ తరువాత జరిగే నష్టాన్ని నివారించడంలో ప్రభుత్వానిది గణనీయమైన పాత్ర. రోగాలు రాకుండా చర్యలు తీసుకోవడం, సాధారణ పరిస్థితి వచ్చేవరకు బాధితులకు బస, ఆహారం, గొడ్లకు మేత అందించడం మొదలైనవి సరిగా చేస్తే ఈ నష్టాన్ని అరికట్టవచ్చు. ఈ పనులు సరిగా జరగడం లేదని పేపర్లలో ఆరోపణలు మొదలయ్యాయి.

మామూలుగానే రాజకీయాలు కూడా మొదలయ్యాయి. శాసనసభ సమావేశాలు బహిష్కరించైనా న్యాయం చేస్తామని బాబు అంటే (సమావేశాలను బహిష్కరించడమంటే బాగా పనిచేసినట్లని ఈయన అనుకుంటున్నాడు), ఆయన రాజకీయం చేస్తున్నాడని కాంగ్రెసు విసురు. శాసనసభలోనే ఉండి నెత్తీ నోరూ కొట్టుకుని గోలపెట్టినా దిక్కులేదు, మరి సమావేశాలు బహిష్కరిస్తే న్యాయం ఎలా జరుగుతుంది బాబూ?

3 కామెంట్‌లు:

 1. శాసనసభ సమావేశాలు బహిష్కరించటం సమస్యా పరిష్కారానికి సరైన మార్గం కాదు. ప్రతిపక్షాలు గొడవ చేస్తుంటేనే సరిగా సకాల చర్య తీసుకోని ప్రభుత్వం, ప్రతిపక్షాలు ఎమైనా మాట్లాడితే మటుకు అవి ప్రతిదీ రాజకీయం చేసేస్తుందంటారు. ప్రలోభాలకు లొంగకుండా బాదిత ప్రజలకు సత్వర సహాయం అందించటం అవసరం.

  రిప్లయితొలగించండి
 2. మీ వ్యాసం నన్ను స్పందింపజేసింది... http://uniquespeck.blogspot.com/2006/11/blog-post_08.html

  రిప్లయితొలగించండి
 3. సి బి రావ్ గారి కామెంట్ బాగుంది, ప్రస్తుతం అలాగే జరుగుతుంది కూడా. ప్రభుత్వం చెసే విమర్శల్ని ప్రతిపక్షం తిప్పికొట్టలేకపొవటం విచారకరం.

  ఈ రాజకీయ నాయకులకు ఎప్పుడు ఏం చెయ్యాలో, ప్రజల్ని ఎలా మభ్యపెట్టాలో బాగా తెలుసు. ఓ పక్క తీవ్రమైన వరదలు వచ్చి జనం నానా బాధలు పడుతుంటే, దాన్ని పక్కదోవ పట్టించటానికి మార్గదర్శి విషయం బయటకు తెచ్చారు. మొన్నటివరకు ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని, అవినీతిని ఏకరువు పెట్టిన న్యూస్ పేపర్లకు మార్గదర్శి హాట్ టాపిక్ అయ్యింది, వరద విషయాన్ని మర్చిపోయెలా చేశాయి.

  ఇంక 'దేవుడు ' గారికి సంతోషం, వచ్చిన కొంత వరదసాయాన్ని తలా కొంత పంచుకొని మెక్కెయ్యొచ్చని.

  రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు