17, నవంబర్ 2006, శుక్రవారం

గొంతు విప్పిన బాలసుబ్రహ్మణ్యం

తెలుగు సినిమా పరిశ్రమలో హీరోలదే రాజ్యం అయిపోయింది. అక్కడ హీరో మేరునగధీరుడు. మిగతా వారంతా పిపీలికాలే.. చివరకు వాళ్ళకు తిండి పెట్టే నిర్మాతతో సహా! ఈ విషయంపై ఓ పెద్దమనిషి నోరు విప్పాడు. తెలుగు సినిమా దిగ్గజమూ, గాయకుడు, సంగీత దర్శకుడు, నటుడు, నిర్మాతా అయిన గానగంధర్వుడు, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఏదో టీవీకి చెప్పిన మాటలను దట్స్ తెలుగు వెబ్సైట్లో పెట్టారు. దాన్ని ఇక్కడ చూడొచ్చు: http://thatstelugu.oneindia.in/cinema/avi/spb-on-telugu-heroes.html

బాలు చేసిన కొన్ని వ్యాఖ్యలు: "నిర్మాత తర్వాతే ఎవ్వరైనా అనే స్ప­ృహ పోయిందిప్పుడు. సినిమా కేవలం హీరోల మాధ్యమమే కాదు. ఒక లైటుబాయ్ లేకపోయినా ఆ రోజు షూటింగ్ నడవదు. సినిమా పరిశ్రమలో ప్రతి ఒక్కరికీ ఒక నిర్దిష్టమైన బాధ్యత ఉంటుంది. కేవలం తమ వల్లనే సినిమాలు ఆడుతున్నాయి అని ఈ హీరోలు అనుకుంటే అది భ్రమే అవుతుంది."

బాలు ఇంకా ఇలా అన్నారు: "అక్షరం ముక్క రాయలేని వారు సైతం రచయితలు అయిపోతున్నారు. ఉచ్చారణ లేనివాళ్లు నటులవుతున్నారు. భాష తెలియని వారు, పరభాషా నటీనటులు ప్రాధాన్యం ఉన్న పాత్రలు పోషించేస్తున్నారు. సరిగమలు రానివారు సంగీత దర్శకులైపోతున్నారు. శ్రుతి శుద్ధి లేనివారు గాయకులవుతున్నారు.''

తామేం చెయ్యాలో తెలియని వారేం కాదు మన నిర్మాతలు; చెయ్యరంతే! డబ్బింగు సినిమాలను నిషేధిస్తేనో, సినిమా ఎలా ఉన్నా చూసి చావాల్సిందేనని నిర్బంధిస్తేనో సినిమాలు ఆడవు. మంచి సినిమాలు తీసేందుకు మంచి రచయితలు, దర్శకులు, సాంకేతికులు, కళాకారులు కావాలి.. స్టారులు, రత్నాలు, సామ్రాట్టులూ కాదు. మన నిర్మాతలు ఎప్పుడు ఆచరిస్తారో!


శభాష్ బాలూ! హిపోక్రసీకి నెలవైన సినీపరిశ్రమలో ఈ మాత్రం మాట్టాడ్డమంటే ఓ రకంగా సాహసమే!

3 కామెంట్‌లు:

  1. తప్పని కాదు కానీ ఇక్కడ గమనించ వలసిన విషయం ఒకటి ఉంది....
    బాలు కి చేతినిండా పాటలు ఉన్నంతవరకు ఆయన ఎప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చెయ్యలేదు ఇప్పుడు ఏమీ లేవు కాబట్టి ఇంత స్వేచ్ఛగా వ్యాఖ్యలు చెయ్యగలుగుతున్నాడు.

    మొదట్లో ఆసభ్యమైన, అర్థం లేని పాటలను పాడను అని మడికట్టుకున్న ఆయన తరువాత అన్ని పాటలు పాడారు మరి అదో ???

    రిప్లయితొలగించండి
  2. ఏది ఎమైనా బాలు గారి వ్యాక్యానము సహసొపితమైనదే

    రిప్లయితొలగించండి
  3. బాలు గొంతు విప్పటమే కాదు. రాజకీయ బ్లాగులతో హోరెత్తిపోయిన మాకు ఇలా భిన్నాంశంతో బ్లాగు రావటం గొప్ప relief.

    రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు