10, సెప్టెంబర్ 2006, ఆదివారం

ఆత్మ లేని బతుకులు

  • ప్ర ముఖ రచయిత, సాహిత్యకారుడు, శివతాండవం గ్రంథకర్త దివంగత పుట్టపర్తి నారాయణాచార్యుల విగ్రహ స్థానంలో దివంగత ప్రధాని ఇందిరాగాంధీ విగ్రహాన్ని ప్రొద్దుటూరు పట్టణంలో ఏర్పాటు చేస్తున్నట్లు శాసనససభ్యుడు వరదరాజులరెడ్డి చేసిన ప్రకటన విమర్శకు తెరలేపింది. ఈనాడు
  • ప్రొద్దుటూరు పట్టణంలోని శివాలయం కూడలిలో ఉన్న సరస్వతీపుత్ర పుట్టపర్తి నారాయణాచార్యుల విగ్రహాన్ని శుక్రవారం రాత్రి11.15 గంటల సమయంలో తొలగించారు. ఆంధ్ర జ్యోతి
  • ఈ విషయాన్ని తెలుగు బ్లాగులోకపు దృష్టికి తెచ్చిన త్రివిక్రమ్ గారి బ్లాగు,
  • క్రిస్పీన్యూస్

కొందరు.. కొత్తబాటలు వేసుకుంటూ తమ వెనకున్న వారికి మార్గదర్శనం చేసే దార్శనికులు
మరికొందరు.. తప్పో ఒప్పో.. ముందు నడిచే వారి అడుగుజాడల్లోనే నడుస్తూ వెళ్ళే అనుచరులు.
ఇంకొందరు.. తమ ముందు నడిచిన వారి అడుగుల జాడలు చెరిపేసుకుంటూ వెళ్తారు.
ఈ మూడో రకానికి చెందిన వారే ప్రొద్దుటూరులో పుట్టపర్తి నారాయణాచార్యుల విగ్రహాన్ని తొలగింపజేసిన వాళ్ళు. తాలిబన్లు అని వీళ్ళకో పేరు కూడా ఉంది.

డబ్బే ప్రధానం, అధికారమే పరమావధిగా ఏదైనా చేసే నేలబారుతనం
నాయకుడి చల్లని చూపుల కోసం గడ్డి కరిచేందుకు కూడా వెనకాడని చవకబారుతనం
కుర్చీ కోసం పై కుర్చీలోని అయ్యనో, అమ్మనో మెప్పించేందుకు వాళ్ళ చెప్పులు నెత్తినెట్టుకుని ఊరేగే చవటతనం
తల తెల్లగా ముగ్గుబుట్టైనా, దాని లోపల లేశమైనా లేని జ్ఞానకోశం
మనవాళ్ళపై మనకుండాల్సిన కనీస అభిమానం కరవైన ఆత్మాభిమానం లేని బతుకులు
ఆత్మను అమ్ముకున్న బతుకులు
అసలు ఆత్మే లేని బతుకులు

కలిసి చేసిందే..
ప్రొద్దుటూరులో సరస్వతీపుత్రుని స్మృతి చిహ్నానికి జరిగిన అపచారం, ఆంధ్ర సరస్వతికి జరిగిన అవమానం


ఏమాశించి వీళ్ళీ పని చేసారో, అది నెరవేరకుండుగాక!

5 కామెంట్‌లు:

  1. సమయానికి తగు మాటలాడి....
    ఈ స్వార్థపరులకు ప్రజలే తగిన ఫాఠం,తగు సమయంలో (ఎన్నికలలలో)చెప్తారు.

    రిప్లయితొలగించండి
  2. chaduvari gaarU,

    mIru dInipai vOTiMg kaaMpain staarT ceyya vaccu kadaa.

    lEka trivikraM gaarO.

    manaku vElalO vOTlu vastE daanini mIDiyaaki paMpiMcavaccu.


    #puTTaparti satyanaaraayaNa gaari vigraha puna@h pratishTa kOsaM vOTiMg peTTaMDi #

    రిప్లయితొలగించండి
  3. సరస్వతీ పుత్రుడు పుట్టపర్తి ఎక్కడా? పొట్టకోస్తే అక్షరమ్ముక్క రాని ఇందిరమ్మ ఎక్కడ..నాకానికి బదులు నాగలోకం లా లేదూ???

    రిప్లయితొలగించండి
  4. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు...

    రిప్లయితొలగించండి
  5. naaga phani sarma gurinchi raayalEdEmiTanDi ??

    -- bujjidi

    రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు