6, సెప్టెంబర్ 2006, బుధవారం

వందేమాతరం!

మహాత్మా గాంధీ తర్వాత అంత ప్రజాదరణ పొందినది, వందేమాతరం.
స్వాతంత్ర్య రథానికి చోదక శక్తి, వందేమాతరం!
స్వాతంత్ర్య యోధుల దేహాలపై తెల్ల లాఠీలు చేసిన గాయాలకు మందు, వందేమాతరం!
తుపాకుల తోటీ, ఉరితాళ్ళతోటి తెల్లవాడు వాళ్ళ ప్రాణాలు తీస్తున్నవేళ వారి చివరి కేక, వందేమాతరం!
మన జాతీయ గేయం, వందేమాతరం!

జాతీయ గేయం పాడననడం హేయం!
వందేమాతరం ను పాడమని చెబుతూ తోటి భారతీయుల మనసుల నుండి దూరం జరిగిపోతున్నామన్నది గ్రహిస్తున్నట్లు లేదు, వీళ్ళు.

పాడకపోవడాన్ని సమర్ధించడం ద్రోహం!
రేపు మరో మతస్తుడు 'నేను జాతీయ జండాను ఎగరెయ్యను, అది మా మతాచారాలకు విరుద్ధం. లేదా మా మతజండా కంటే తక్కువ ఎత్తులో మాత్రమే ఎగరేస్తాను' అంటే కూడా సమర్ధిస్తారేమో ఈ ద్రోహులు.

అవున్లే, సమర్ధించడం సమర్ధించకపోవడం అన్నది ఆ మతస్తులకు ఎన్ని వోట్లు ఉన్నాయనేదాన్ని బట్టి ఉంటుంది కదా!

5 కామెంట్‌లు:

 1. నచ్చని వాళ్ళ చేత బలవంతంగా పాడించడం వల్ల ఉపయోగం ఏం ఉండదని నా అభిప్రాయం. గుర్రాన్ని గుగ్గిళ్ళ వరకు తీసుకెళ్ళవచ్చుకాని తిని పించలేము కదా, అలానే పాడనన్న వారిచేత ఏదో ఒక చట్టంచేసి పాడించినా వారిలో లేని దేశభక్తిని తీసుకురాలేము. పైగా అందరూ కలసి వారికి ఇష్టంలేని పనిచేయిస్తున్నారని ఇంకా ద్వేషం పెంచుకోవచ్చు. దేశభక్తి వారంతట వారికి రావాలికాని,చట్టాలు చేసి తీసుకురాలేమని నా అభిప్రాయం.

  రిప్లయితొలగించండి
 2. జాతీయ గీతము అవసరము లేనివాళ్లకు జాతీయతకూడా ఎందుకు? వేరే ఏదైనా దేశము చూసుకుంటే పోలా?

  రిప్లయితొలగించండి
 3. నేను మీ భావాలతో అంగీకరిస్తున్నా ...చిన్న విన్నపం!
  వందేమాతరం ను పాడనంటున్నది ముస్లిములే కాదు సిక్కులు కూడా ఉన్నారు.కానీ పాడనంటున్న వారు అందులో చాలా చిన్న శాతం. ఈ గీతం రాసిన ఉద్దేశం పై వాదవివాదాలున్నా (http://en.wikipedia.org/wiki/Vandemataram),స్వాతంత్ర్య పోరాటంలో యుద్ధనినాదంలా(Battlecry)ఈ గేయానికి తగిన గౌరవం తప్పకుండా ఇవ్వాలి. దేశభక్తి మెండుగా గల ఎందరో ముస్లిములు ఇప్పటికీ ఈ దేశంలో ఉన్నారు.భగత్ సింగ్ తెలిసినంతగా అష్ఫకుల్లా ఖాన్ ఎంత మందికి తెలుసుచెప్పండి?

  రిప్లయితొలగించండి
 4. చింతు గారూ! ముస్లిములంతా వందేమాతరంను పాడమంటున్నారని నా ఉద్దేశ్యం కానేకాదు. ఒకవేళ ఈ వ్యాసంలో అటువంటి భావన బహిరంగంగా గానీ, అంతర్లీనంగా గానీ ఉండి ఉంటే.. క్షంతవ్యుణ్ణి. పాడననేవారు, వారెవరైనా.. వారిగురించి మాత్రమే రాసాను. వారిని సమర్ధించే అరాజకీయులది మాత్రం ద్రోహం. పాడకపోవడం తప్పని వాళ్ళకు తెలియజెప్పాల్సింది పోయి, పాడకపోయినా పర్లేదనడం మనసుకు కష్టం కలిగిస్తోంది. దానివలన ఇప్పటికిప్పుడు నష్టం ఏమీ లేకపోవచ్చు.. కానీ రేపు మరొకరు మరో విషయమై విభేదిస్తారు, వాళ్ళనూ బుజ్జగించాలి. ఆపై మరో సందర్భంలో మరొకరు.. దీనికిక అంతుండదు. ప్రస్తుత వివాదం జాతీయ గేయం గురించి కాబట్టి సరిపోయింది, అదే జాతీయ గీతం గురించి అయి ఉంటే, బహుశా అది రాజ్యాంగ ధిక్కారం అయి ఉండేది.

  అష్ఫకుల్లా ఖాన్ గురించి నాకూ తెలియదు. మీ బ్లాగులో రాస్తారని ఆశిస్తాను. భగత్‌సింగు ప్రస్తావన తెచ్చి, మరుగున పడ్డ నా ఆలోచన ఒకదాన్ని బయటకు రప్పించారు. నా ఇదివరకటి బ్లాగు ఒకదానికి అది మలి పర్వం. ఇవ్వాళో రేపో నా బ్లాగులో రాస్తాను.

  రిప్లయితొలగించండి
 5. చింతూ గారూ..అందుకే మీరు ఉధ్యమించి అస్ఫాకుల్లా ఖాన్ గురించి బ్లాగులోనో, తెలుగు వికిలోనో రాయాలండి. తెలుగు వికిలో రాసి బ్లాగులో లింకెండితే ఇంకా మంచిది. నిజ్జంగా మీరు చెప్పేదాకా ఆ వీరుని గురించి నాకు తెలియలేదు. నేను రంగ్ దే బసంతి సినిమా కూడా చూడ లేదు

  రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు