25, ఆగస్టు 2006, శుక్రవారం

తెలంగాణ ధ్వనులు

తెలంగాణ ధ్వనులు ఇలా వినవస్తూ ఉన్నాయి:
చిన్నారెడ్డి: టీఆర్‌సీసీసీ ఏర్పాటులో ఈయనది ప్రముఖపాత్ర. ఒకప్పుడు వైఎస్‌కు సన్నిహితుడైనా, తెలంగాణ అంశంపై ఆయనతో విభేదించిన వ్యక్తి. (ఒక సందర్భంలో అప్పటి సీఎల్పీ నాయకుడు వైఎస్ తో చిన్నారెడ్డి ముభావంగా ఉంటే, ఆయనే "ఏంటి చిన్నా, నాపై కోపమా?" అని అడిగారు వైఎస్.) అలాంటి 'చిన్నా' ఇప్పుడు 'తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందుతోంది, ప్రత్యేక రాష్ట్రం అవసరం లేదన్నట్లు'గా అభిప్రాయపడుతున్నారు. అధికార వ్యామోహం ఎన్ని పిల్లిగంతులైనా వేయిస్తుంది! రాబోయే విస్తరణలో చిన్నారెడ్డికి మంత్రిత్వం వచ్చినట్లేననుకుంటాను.
ప్రణబ్‌ముఖర్జీ: తెలంగాణపై ఏర్పాటైన కమిటీకి నాయకుడీయన. యాభై ఏళ్ళుగా రాని తెలంగాణ ఆర్నెల్లలో వస్తుందా అని అడుగుతున్నారు. ఈ ఆలోచన మనసులో పెట్టుకుని తెరాసతో ఇన్నాళ్ళుగా వ్యవహారం నడిపారంటే, ఆశ్చర్యం కలుగుతుంది. నిన్నటి దాకా ఇదుగో అదుగో అన్నారు కదా, అలా అనకుండా ఇదేమాట అప్పుడే చెప్పుంటే బాగుండేది కదా. కాంగ్రెసు పైపై కబుర్లు చెబుతూ కాలం నెట్టుకొచ్చింది. తెరాస పైపై కబుర్లు వింటూ (అవి నిజమని నమ్మినట్లు మనల్ని నమ్మిస్తూ) కాలం నెట్టింది.
టీవీ9: చత్తీస్‌గఢ్ ఏర్పాటయ్యాక అక్కడ శాంతిభద్రతల పరిస్థితి ఎంత అధ్వాన్నంగా తయారయిందో చూపిస్తూ ఒక విశేష వార్తను ప్రసారం చేసారు. కొత్త రాష్ట్రంగా ఏర్పాటయ్యాక అక్కడ నక్సలైటు పేట్రేగిపోయినట్లే తెలంగాణ ఏర్పడ్డాక కూడా అలాగే కావచ్చని భయప(పె)డుతున్నారు. ఎవరి అభిప్రాయాన్ని వారు ఎడాపెడా చెప్పేస్తున్నారు.

2 కామెంట్‌లు:

 1. chaduvari gariki kruthagnathalu, nenu mee blog lo palu panchukovalanukontunnanu naku mee antha paripakvatha ledu kani konchem baane alochistanu naa abhiprayalu ekkadiki post cheyali
  naku sontaga blog modalu pettentha parignanam,samayam renDu levu mee email id gani,yedina ivvandi naa abhiprayalu baagunte mee blog lo post cheyandi.

  రిప్లయితొలగించండి
 2. శాంతి గారూ, మీరు నిన్న రాసిన వ్యాఖ్య చూసాను, సమాధానం రాయడంలో ఆలస్యమైంది. మన్నించాలి.
  మీరు నా బ్లాగులో రాస్తాననడం సంతోషం కలిగిస్తోంది! అయితే నా బ్లాగును ఇతరులు కూడా రాయగలిగే విధంగా మలచే ఆలోచన నాకు ఉంది. అప్పుడు మీ జాబులను నా బ్లాగులో మహద్భాగ్యంగా ప్రచురిస్తాను.

  ఇకపోతే, సొంతంగా బ్లాగు మొదలుపెట్టేంత పరిజ్ఞానం (సాంకేతిక), సమయం గురించి రాసారు.. నిజానికి బ్లాగును మొదలెట్టేందుకు అవి పెద్దగా అవసరం లేదు. అసలు బ్లాగుల విశిష్టతే అది!
  రెండే రెండు మెట్లు..
  1. www.blogger.com లో ఖాతా తెరవండి.
  2. ఒక బ్లాగు మూసను ఎంచుకోండి.
  ఇక బ్లాగు రాయడం మొదలెట్టండి. ఈ విషయంలో మరింత సాయం కావాలంటే నాకు (sirishtummala at the rate of gmail dot com) రాయండి. లేదా తెలుగుబ్లాగు (http://groups.google.com/group/telugublog) గుంపుకు రాయండి.

  రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు