12, ఆగస్టు 2006, శనివారం

ఎన్నోవాడు?

ఆ ఫోటోలో మీవాడు ఆ చివరి నుండి ఎన్నోవాడు?
ఈ వాక్యాన్ని ఇంగ్లీషులోకి అనువదించండి. "ఎన్నోవాడు" ను ఎలా అనువదిస్తారో చూడాలనుంది, అంతే!
ఎన్నోవాడు, ఎన్నోరోజు ఇలాంటివి ఇంగ్లీషులోకి అనువదించలేమట.
ఇలాంటివి ఇంకా ఉన్నాయా?

5 కామెంట్‌లు:

 1. "ఎన్నోవాడు?" అని ఇంగ్లీషులో అడగలేం. కానీ " 'మీ ఇంట్లో నువ్వు ఎన్నోవాడివి?' అని అడగాలంటే 'where do you stand in your family?' అని అడగొచ్చు. అంతకంటే నేరుగా అడగడానికి సాధ్యపడదు." అని కాలేజీలో మా ఇంగ్లీషు లెక్చరరు వై. హరేరామమూర్తి గారు చెప్పారు. దానికి "నా ఇష్టం. ఎక్కడైనా నిలబడతాను." అనే సమాధానం వచ్చే అవకాశమే ఎక్కువ. :D

  రిప్లయితొలగించండి
 2. "howmaniath" అని ఓ కొత్త పదాన్ని చేరుద్దాం ఆ భాషలోకి. howmaniath president is Mr.Kalaam? అని అడగొచ్చు :)

  రిప్లయితొలగించండి
 3. Howmanyeth బావుంది. కాని ఆ తరువాత "దాన్ని చూసి తెలుగులో 'ఎన్నోవాడు' అనే వాడుక పుట్టిం"దని చెబుతూ బండిని గుఱ్ఱానికి ముందు కట్టే మేధకులు కొందఱు బయల్దేఱతారేమో !

  రిప్లయితొలగించండి
 4. ఒక నవల్లో మల్లాది కృష్ణ మూర్తి గారు కూడా ఇలా ఇంగ్లీష్ లోకి అనువదించలేని వాక్యాలు కొన్ని చెప్తారు. అందులో కూడా "మీ నాన్నకి నువ్వు ఎన్నో వాడివి" అనే వాక్యం ఉంటుంది. నవల పేరు గుర్తు లేదు.

  రిప్లయితొలగించండి
 5. ఈ విషయంపై హిందూ పత్రికలో ఒకసారి చర్చ జరిగింది. ఈ చిక్కుకు షేక్ స్పియర్ గారే ఓ పరిష్కారం చెప్పారట. నాటకం పేరు గుర్తులేదు కానీ అందులో హీరోయిన్ను ఆమె స్నేహితురాలు "ఇతను నీకు ఎన్నవ భర్త?" అని అడగడానికి ఇలా అడుగుతుందట: "what number husband is he to you?" . ఇదే ఇప్పటివరకు ఆమోదయోగ్యమైన పద్ధతి అని వ్రాశారు.

  రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు