15, ఆగస్టు 2006, మంగళవారం

వెంటాడే జ్ఞాపకాలు

కొన్ని విషయాలుంటాయి. ఎప్పుడో ఓసారి యథాలాపంగా వాటి గురించి తెలుసుకుంటాం. అప్పటికి వాటిని వదిలేస్తాం. కానీ, తరువాత ఆ విషయాలు గుర్తొస్తూ ఉంటాయి. మళ్ళీ ఓసారి వాటి గురించి తెలుసుకుందామని అనుకుంటాం గానీ తెలుసుకోలేం. ఎక్కడా వాటి గురించిన సమాచారం దొరకదు. దాంతో అవి తెలుసుకోవాలన్న యావ పెరిగిపోతుంది. అలాంటిది నాకు ఒకటుంది.

ఎప్పుడో కనీసం ఓ పాతికేళ్ళ కిందటి విషయమై ఉంటుంది. రేడియోలో ఓ పాట విన్నాను. సినిమా పాట కాదు. ముసలి , నిరుపేద దంపతులు తమ కొడుకును తలుచుకుంటూ అతన్ని ఉద్దేశించి పాడే పాట అది. ఆరుగాలం శ్రమించి కొడుకును పెద్ద చదువులు చదివిస్తే, అతడు 'పెద్దవాడై' వీళ్ళను పట్టించుకోడు. ఆ బాధతో వాళ్ళు పాడే పాట అది. గుండెను మెలిదిప్పే పాట. ఓ రెండు వాక్యాలు మాత్రం గుర్తున్నాయి -

"కళ్ళజోడూ పెట్టుకోనీ నల్ల బూడుసు తొడుక్కోని,
కొడుకో బంగారు తండ్రీ... నిను కలకటేరు అనుకుంటిరో"

ఇలా సాగుతుంది, ఆపాట.

ఇలాంటిదే ఇంకో పాటుంది.. తన సొంత ఊరి గురించి ఒకతను పాడుకునే పాట అది.. చాలా బాగుంటుంది. అక్కడక్కడా ఓ రెండు పాదాలు గుర్తున్నాయి.

ఏటి గట్టు మీద ఉంది మాఊరు..
...
...
మాఊరు ఒకసారి వెళ్ళి రావాలి.

ఈ పాటలు ఎక్కడ దొరుకుతాయో మీకు తెలిస్తే నాకో ముక్క రాయండి, నేనూ కొనుక్కుంటాను. నాకు తెలిస్తే ఇక్కడ రాస్తాను. (ఎప్పుడో ఒకప్పుడు దొరక్కపోవు.)
మీకూ ఇలాంటి జ్ఞాపకాలు ఉన్నాయా?

3 కామెంట్‌లు:

 1. "కళ్ళజోడూ పెట్టుకోనీ నల్ల బూడుసు తొడుక్కోని,
  కొడుకో బంగారు తండ్రీ... నిను కలకటేరు అనుకుంటిరో"

  మంచి పాటను గుర్తు చేశారు. కానీ నాకు తెలిసి ఆ పాట ఆర్.నారాయణమూర్తి "ఎర్రసైన్యం " లోనిది. కొడుకు చనిపోతే ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా ఏడుస్తూ మన కంట నీరు తెప్పించే పాట అది.

  రిప్లయితొలగించండి
 2. "మా వూరు ఒక్కసారి పోయి రావాలి
  జ్ఞాపకాల బరువుతో తిరిగి రావాలి

  చిన్ననాటి నేస్తాలను పలకరించాలి"

  ఎప్పుడు విన్నా తలచుకొన్నా గుండె బరువెక్కించే పాట.
  చిన్నప్పుడు దూరదర్శన్ లలిత గీతాల్లో వచ్చేది.
  ఈ మధ్య ఓ సారి మా tv "పాడలని ఉంది" లో మళ్ళీ విన్నా
  కానీ ఎక్కడ దొరుకుతుందో తెలీదు.

  రిప్లయితొలగించండి
 3. అవునండీ, నేను కూడా చిన్నప్పుడు విన్నాను "ఒక్కసారి మా ఊరు వెళ్ళి రావాలి, చూసి రావాలి.."..."... ఏటిగట్టుదాటితే మా ఊరు.." అంటూ "పాలగుమ్మి విశ్వనాథం గారు" దూరదర్శన్‌ లలితసంగీత కర్యక్రమమ్లో పడుతుండగా. ఇప్పటివరకూ ఆ పాట ఈమాత్రమైన గుర్తుండటనికి కారణం మా తమ్ముడికి ఇది ఫేవరేట్ పాట అవటం, అస్తమాను పాడుతూనే ఉండటం. ఎక్కడయినా పాలగుమ్మి విశ్వనథంగారి పాటల కలెక్షన్‌ దొరుకుతుందేమో చూడండి, ఆకా్శవాణి వారి వాళ్ళ రికార్డింగ్స్ కేసెట్స్ లో కాని.

  రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు