చిరంజీవి పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేసాడు. ఏవో చాలా చెబుతాడనుకున్నా; పార్టీ గురించి, మౌలిక విధానాల గురించీ. అవేమీ చెప్పలేదు. కనీసం పార్టీ పేరు కూడా చెప్పలేదు. అన్నీ 26 న జరగబోయే బహిరంగ సభలోనే చెబుతాడట. ఈ సమావేశం ద్వారా ఏం సాధించదలచాడో తెలీలేదు. బహూశా ఈ రోజేదో మంచి రోజు లాంటిదేమైనా ఉండుంటుంది.. అందుకే ఈ సమావేశం పెట్టాడేమో!
తన సమావేశ ప్రసంగానికి బాగానే తయారై వచ్చాడు. బానే చెప్పాడు. విలేకరుల ప్రశ్నలు కూడా చాలావరకు అనుకున్నవే వచ్చాయి. వాటికి కూడా తయారై వచ్చాడు. మొదట్లో కొద్దిగా నెర్వస్‌గా కనబడ్డాడు గానీ, తరవాత బానే నడిపించాడు. అన్నీ తనకనుకూలమైన ప్రశ్నలు, తాననుకున్న ప్రశ్నలే. ఉదాహరణకు 'రాజకీయాలు మీకేం తెలుసని వస్తున్నారు?' అని ఎవరో అడిగితే, దానికి 'నాకు రక్తంలో ఎన్ని గ్రూపులుంటాయో తెలీదు. సమయానికి రక్తం అందిస్తే ప్రాణాలు నిలుస్తాయని మాత్రం తెలుసు. అలాగే...' అంటూ చక్కగా చెప్పాడు.
ఎక్కడో ఒకచోట ఒక ప్రశ్న ఎదురైంది. అది విని కాస్త కోపగించుకున్నట్టు కనబడింది. ఎటొచ్చీ సమావేశమంతా గందరగోళంగా ఉండడంతో ఆ ప్రశ్నే కాదు చాలా ప్రశ్నలు వినబడలేదు. చిరంజీవే సమాధానం చెప్పేముందు ఫలానా వాళ్ళు ఫలానా ప్రశ్న అడిగారు, దానికి నా సమాధానం ఇది అంటూ చెప్పాడు.
డబ్బులెక్కడినుండి వస్తాయి, రాజకీయాలల్లో మీకు స్ఫూర్తి ఎవరు, లాంటి కొన్ని ప్రశ్నలకు "ప్రజలే" అంటూ సమాధానం చెప్పాడు. ఇలాటి గ్యాలరీ సమాధానాలు చాలానే ఉన్నాయి. బంధువులు రాజకీయాల్లోకి రావచ్చా అనే ప్రశ్నకు 'సత్తా, ఆసక్తి, శక్తి ఉంటే రావచ్చు, అర్హత ఉంటే పదవులూ అలంకరించవచ్చు' అని అన్నాడు. ఇది మాత్రం గుర్తుంచుకోదగ్గ ప్రశ్న, సమాధానం అనిపించింది.
ప్రజాసమస్యలపై తన అవగాహన గురించి ప్రశ్న వచ్చింది. దానికి, 'సమస్యల గురించి చెప్పేందుకు మీరున్నారు గదా' అని అన్నాడు. చాలా హాస్యాస్పదమైన సమాధానం అది. సమస్యలపైన అవగాహన లేకుండా రాజకీయాల్లోకి దిగుతున్నాడా ఏంటి అనిపిస్తోంది. సమాజం ఎదుర్కొంటున్న సమస్యలేమిటి అనేది విలేకరులు చెబితేనే తెలుసుకుంటాడా!!
ఇక, ఒకటి రెండు రొడ్డకొట్టుడు సమాధానాలు..
తెలంగాణ వంటి వివిధ సమస్యలపై మీ విధానాలు ఏమిటి అని అడిగినపుడు, అందరితోటీ చర్చింది, తగు సమయంలో, అందరికీ ఆమోదయోగ్యంగా, ప్రజాభిప్రాయాలను పరిగణన లోకి తీసుకుని, ఇలాంటి సున్నిత సమస్యలపై నిర్ణయాలు తీసుకుంటాం అని చెప్పుకుపోయాడు. ప్రస్తుతానికైతే 'విధానం లేకపోవడమే ఆయన విధానం' లాగా అనిపించింది.
అవినీతి రహితమైన పార్టీ అంటున్నారు కదా.. ఇతర పార్టీల నుండి అవినీతి చరితులను ఎందుకు రానిస్తున్నారు అనే ప్రశ్నకు, 'తమ తమ పార్టీల్లో తామనుకున్న విధంగా కార్యక్రమాలు జరగడం లేదని భావించినపుడు, మా విధానాలు నచ్చితే మావద్దకు రావచ్చు' అని అన్నాడు. 'ఇతర పార్టీల్లో కూడా నీతిమంతులు ఉటారు గదా' అనీ అన్నాడు.
అందరితోటీ మంచిగా ఉంటాను అంటూ తను ఎప్పుడూ చెప్పుకుంటూండే ధోరణిలోనే ఇప్పుడూ మాట్టాడాడు. విలేకరులతో స్నేహం చేసుకునే ధోరణిలో వ్యవహరించాడు. మాటలూ అలాగే చెప్పాడు, శరీర భావాలూ అలాగే ఉన్నాయి. రాజకీయాల్లో మీకు ప్రత్యర్థులెవరు అని అడిగితే నాకు శత్రువులు, ప్రత్యర్థులు లేరు. నాకు శత్రువులల్లా సమస్యలే, పేదరికమే అంటూ చెప్పాడు. గ్యాలరీ సమాధానాల్లో ఇదొకటి.
మొత్తం మీద ఈ సమావేశం ద్వారా చిరంజీవి అసలు విషయం గురించి చెప్పింది తక్కువ, చెప్పనిది ఎక్కువ అనిపించింది. తాను రాజకీయాల్లోకి వస్తున్నాననే ఒక్క మాట మాత్రం చెప్పాడు. రాజకీయాల్లోకి కొత్తదనం ఏదైనా తేదలచుకున్నాడో లేదో గానీ, సమావేశ ప్రసంగంలోగానీ, విలేకరుల ప్రశ్నలకిచ్చిన సమాధానాల్లోగానీ కొత్తదనమేమీ లేదు.
17, ఆగస్టు 2008, ఆదివారం
13, ఆగస్టు 2008, బుధవారం
శతకోటికొక్కడు !
2012 ఒలింపిక్ పోటీల్లో మువ్వన్నెల జండాని చేబట్టి భారత జట్టుకు ముందు నడిచేదెవరో తేలిపోయింది. అతడే, వందకోట్ల మందిలో అతనొక్కడే -అభినవ్ భింద్రా!
భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు సురేష్ కల్మాడి ఒలింపిక్సుకు ముందు "అక్కడేదో అద్భుతాలు జరిగిపోతాయని ఆశలు పెట్టుకోకండి." అని అన్నాడు. ఒలింపిక్ చరిత్రలో మన మొట్టమొదటి వ్యక్తిగత బంగారు పతకాన్ని గెలుచుకొచ్చిన అభినవ్ భింద్రా మాత్రం అద్భుతమే సాధించాడు. అతనికి నా అభినందనలు కూడా!
వందకోట్ల మంది ఉన్న దేశంలో బంగారాన్ని గెలుచుకు రాగల మొనగాడి కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. మొదటి బంగారం తెచ్చుకోడానికి వందేళ్ళు పట్టింది. కానీ.. జనాభాకీ ఆటల్లో పతకాలకీ సంబంధం ఉందా అనేది ప్రశ్న. లేదని కొన్ని వాస్తవాలను చూస్తే అనిపిస్తోంది. జనసంఖ్యలో మనతో పోలిస్తే పిపీలికాలనిపించుకునే దేశాలకు కూడా బోలెడన్ని పతకాలు వస్తూంటాయి. అర్మేనియాలు, అజర్బైజాన్లూ, బుర్కినాఫాసోలు, ఇంకా బోలెడు పేర్లు వినని దేశాలు కూడా బంగారు, వెండి పతకాలు పట్టుకుపోతూ ఉంటాయి. బయటి దేశాల సంగతే ఎందుకు.. మన దేశంలోనే జాతీయ ఆటల పోటీలు పెడితే కేరళ, హర్యానా, పంజాబులే ముందు! ఇంకా విశేషమేంటంటే మణిపూరు, అసోంలు, వాటి మిగతా సోదరీమణులు కూడా కొన్నిసార్లు మనకంటే ముందే ఉంటాయి. (చంద్రబాబు హయాంలో జరిగిన జాతీయ ఆటల పోటీల్లో బయటి రాష్ట్రాల నుండి ఆటగాళ్ళను పట్టుకొచ్చి, మనల్ని బాగా ముందుకు తీసుకుపోయాడు, అది వేరే విషయం!) అంచేత..
తేడా జనాభాలో లేదు, మరెక్కడో ఉంది.
ఆటలకు అవసరమైన ఆధునిక సౌకర్యాలు కల్పించాలి. మనం హాకీలో వెనకబడిపోవడానికి ఒక ముఖ్య కారణం చాన్నాళ్ళపాటు మనకు ఏస్ట్రో టర్ఫు లేకపోవడమేనని చెబుతారు (తరవాత్తరవాత గిల్లుడు కూడా కారణమని తేల్చారనుకోండి). అలాగే ఆటగాళ్ళకు ఆటమీద ఏకదీక్ష, తాదాత్మ్యం ఉండాలంటే వాళ్లకు జీవిక గురించిన చింత ఉండకూడదు. రేపెలా గడుస్తుందా అనే ఆలోచన ఉంటే ఆటలేం ఆడతారు!? వాళ్లకు అలాంటి సదుపాయాలు కల్పిస్తున్నామా? ఉద్యోగాలిచ్చినా, మరోటిచ్చినా.. మన ప్రభుత్వాలు ఇచ్చే సౌకర్యాలన్నీ ఆటల్లో ఒక స్థాయికి వచ్చినవారికే! తగు చేయూతనిస్తే ఆ స్థాయికి చేరగలవాళ్ళు అనేకమంది ఉంటారు. తన స్మృతి బ్లాగులో ప్రవీణ్ ఇదేమాట చెప్పారు. పిల్లలుగా ఉన్నప్పుడే వాళ్ళను చేరదీసి, ఆటగాళ్ళుగా తీర్చిదిద్దే ప్రణాళికలుండాలి. వాళ్ళకు జీవన భద్రత కల్పించాలి. ఆటల సంస్కృతి ఒకటి అవసరం మనకు!
ఆటల్లో రాజకీయుల ప్రత్యక్ష జోక్యం ఉండకూడదు. ఎంతటి గొప్ప సంస్థనైనా తెల్లారేలోగా గబ్బు పట్టించగల సామర్థ్యం వాళ్ళ సొత్తు. వాళ్ళు లేకపోతే ఈ సంస్థల్లో రాజకీయాలు కూడా తగ్గుతాయి. (రాజకీయాలు అసలే లేకుండా ఉండవనుకోండి).
ఇంతటితో ఈ జాబును ముగించి..
పతకాలపై పెద్దగా ఆశలు పెట్టుకోవద్దన్న సురేష్ కల్మాడి గురించి రెండు ముక్కలు.. అతడో కాంగ్రెసు ఎంపీ! ఎన్నేళ్ళుగా ఉంటున్నాడో తెలీదుగానీ చాన్నాళ్ళుగా - కొన్ని ఒలింపిక్కులుగా - అతడే భారత ఒలింపిక్ సంఘానికి అధ్యక్షుడు. ఆటల పేరెత్తగానే గుర్తొచ్చేది గడ్డం పెంచుకున్న కల్మాడియే! అతని అర్హతలేమిటో తెలీదుగానీ, ఆటల పోటీలంటే చాలు ఆ పేరే వినిపిస్తుంది. ఒలింపిక్, కామన్‌వెల్త్, ఏషియన్, ఆఫ్రో ఏషియన్,ఏషియో ఆఫ్రికన్, ఏషియో అమెరికన్, అమెరికో ఏషియన్, ఏషియో ఆర్కిటిక్, ఆర్కిటికో ఏషియన్,.. ఇలా ఎన్ని రకాల ఆటలుంటే అన్నిట్లోనూ అతడే! (ఒకవేళ నేనిక్కడ రాసిన ఆటల పోటీలు లేకపోతే.. వాటిని మొదలుపెట్టినపుడు మాత్రం అధ్యక్షుడుగా అతడే ఉంటాడని చెప్పగలను) భారత అథ్లెటిక్ సమాఖ్యకు అతడు జీవితకాల అధ్యక్షుడు కూడా! 2010లో కామన్‌వెల్తు ఆటలు జరుగుతాయట.. దానికీ నేత ఆయనే! ఇన్నేళ్ళుగా ఒలింపిక్ సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నవాడు చెప్పేమాట ఏంటంటే.. "ఓ.. పతకాలు వచ్చేస్తాయనీ, అద్భుతాలు జరిగిపోతాయనీ భ్రమ పడకండి" అని. ఇదీ ఇతగాడి నిర్వాకం! ఇలాంటివాడే క్రికెట్టుకి జయవంత్ యశ్వంత్ లెలే అని ఉండేవాడు. మనాళ్ళు ఆస్ట్రేలియా వెళ్ళేముందు "చిత్తుగా ఓడిపోయి తిరిగొస్తారు" అని అన్నాడు. ఇలా ఉన్నారు మన ఆటల నిర్వాహకులు!

---------------------------------------

11, ఆగస్టు 2008, సోమవారం
అమరనాథ దేవాలయ స్థల వివాదం
సమర్థంగా వివాదాలను సృష్టించడంలోను, అత్యంత అసమర్థంగా వాటితో వ్యవహరించడంలోను కాంగ్రెసు మేటి. సరికొత్తగా అమరనాథ్ దేవాలయానికి స్థలం ఇచ్చినట్టే ఇచ్చి, మళ్ళీ తీసేసుకుని లేని గొడవొకదాన్ని సృష్టించారు. ఒక సున్నితమైన విషయాన్ని ఎంతలా కెలకొచ్చో అంతలానూ కెలికారు. ఎంత అసమర్థంగా వ్యవహరించారంటే..
ముందు దేవాలయ బోర్డుకు వందెకరాల అటవీస్థలాన్ని ఇచ్చారు. ఎందుకూ..? అమరనాథ యాత్ర చేసుకునే యాత్రికుల తాత్కాలిక వసతి నిమిత్తం గుడారాలను వేసేందుకు. కాంగ్రెసు, పీడీపీల ఉమ్మడి ప్రభుత్వం ఈ భూమిని ఇచ్చింది. సంతకం పెట్టిన మంత్రి పీడీపీకి చెందినవాడే. ఓ చేత్తో భూమిని ఇచ్చిన పీడీపీ నాయకులే, ఆ వెంటనే వీధుల్లోకి వచ్చి దాన్ని నిరసిస్తూ నాటకాలు మొదలుపెట్టారు.
ఆ నిరసనలకు కారణం తెలిస్తే బాధ కలుగుతుంది...

5, జులై 2008, శనివారం
వీళ్ళు మనకోసమే పోరాడుతున్నారా?
అంతమంది పోలీసులు హతులైతే హక్కుల నేతలెవరూ మాట్టాడరే, అని నేను రాసాను. దానికి స్పందనగా దిలీప్ గారు తన బ్లాగులో రాస్తూ నక్సల్ ఉద్యమ ప్రస్థానంలో జరిగిన చాలా విషయాల గురించి చెప్పారు. ఆయన రచనాశైలికి తగినట్టుగానే వ్యాసం ఎంతో విజ్ఞానదాయకంగా ఉంది.
ఆ జాబులో ఆయన లేవనెత్తిన అంశాలపై నా ఆలోచనలను కూడా రాద్దామని అనిపించింది. అయితే ఒక సామాజిక, సైద్ధాంతిక మరియూ రాజకీయ అవగాహన ఎర్పరచుకున్న తరువాతే అభిప్రాయాలు తెలిపితే పద్ధతిగా ఉంటుందని నాక్కూడా అనిపించి అక్కడ రాయలేదు.
ముందుగా ఒక్క విషయం.. పోలీసులు చేసిన తప్పుడు ఎన్‌కౌంటర్లను నేను సమర్ధించడం లేదు. నేనన్నదల్లా - రెండువైపులా తప్పులు జరిగినపుడు ఒక్కరినే ప్రశ్నిస్తారేమిటని! అటువైపు తప్పులు కనబడవేమిటని!!
నక్సలైట్లపై జరిగిన అమానుష హింస గురించి మనం తెలుసుకోవాలి, నిజమే! అలాగే నక్సలైట్ల ఇన్నాళ్ళుగా చేస్తున్నదేమిటో, ఇప్పటివరకూ వాళ్ళు సాధించిందేమిటో కూడా మనం గుర్తుకు తెచ్చుకోవాలి.
ముందుగా.. నక్సలైట్లపై చట్టబద్ధంగా చర్యలెలా తీసుకోవాలి -
ఏకే47లూ, రాకెట్లతో యుద్ధం చేసేవారిని చట్టబద్ధంగా శిక్షించడమెలాగ? (ఆ ఆయుధాలను పట్టుకుని మనపై తెగబడినవారినే అనేకానేక సంఘటనల్లో కాల్చిచంపేసింది - వాటిలో పార్లమెంటుపై దాడి ఒకటి) వాళ్ళని పట్టుకుని, సంకెళ్ళు వేసి తెచ్చేందుకు పోలీసులు ఏ ఆయుధాలు తీసుకెళ్ళాలి? ఏ విధంగా పట్టుకోవాలి? మందుపాతరలు పెట్టి అటుగా వచ్చే పోలీసులను (మనుషులను) పేల్చేసిన వారిని పట్టుకునేదెలా, శిక్షించేదెలా?
అలాగే నక్సలైట్లు ఇన్నాళ్ళుగా చేస్తున్నదేమిటో, ఇప్పటివరకూ వాళ్ళు సాధించిందేమిటో కూడా మనం గుర్తుకు తెచ్చుకోవాలి.
రైల్వే స్టేషన్లు, పోలీసు స్టేషన్లు, టెలిఫోను ఎక్స్ఛేంజీలు, ఆర్టీసీ బస్సులు, సెల్ టవర్లు మొదలైన అనేక ప్రజల ఆస్తులను ధ్వంసం చేసిందెందుకో కూడా మనం తెలుసుకోవాలి.
ఇన్నేళ్ళుగా వాళ్ళు వాడిన ఆయుధాలు, మందుపాతరలు, మందుగుండు సామాగ్రి ఎక్కడినుండి వచ్చాయో తెలుసుకోవాలి. తమ సాయుధ పోరాటాన్ని నడపడానికి అవసరమైన డబ్బును వాళ్ళు ఎక్కడినుండి ఎలా సమకూర్చుకున్నారో కూడా తెలుసుకోవాలి. ప్రజాప్రతినిధుల లాగానే వీళ్ళు కూడా కాంట్రాక్టర్ల దగ్గరి నుండి రౌడీమామూళ్ళు తీసుకుంటారన్న సంగతిని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. నక్సలైట్ల పేరు చెప్పుకుని ప్రజల దగ్గరినుండి డబ్బులు గుంజిన (ఎక్స్‌టార్షన్) నకిలీ నక్సలైట్లకు ఆ ఆలోచనలు ఎలా వచ్చాయో, చాలా సందర్భాల్లో ఆ మోసాలు ఎందుకు సఫలమయ్యాయో కూడా తెలుసుకోవాలి. నక్సలైట్లు ఆయుధాల డంపులతో పాటు డబ్బు డంపులు కూడా ఎలా సమకూర్చుకున్నారో తెలుసుకోవాలి. డబ్బులు పట్టుకుని దళాన్నొదిలి పారిపోయినవారి గురించి, డబ్బుల కోసం అయిన గొడవల గురించి కూడా తెలుసుకోవాలి. దళంలోని ఆడవారిపై దాడులు చేసిన సంగతులు కూడా మనం మననం చేసుకోవాలి.
పోలీసులు జీపుల్లో వెళ్ళటానికి భయపడి ఆర్టీసీ బస్సులో వెళ్ళబోతే ప్రజలు అడ్డుచెప్పిన సంఘటనలెందుకు ఎదురయ్యాయో, పోలీసులు అంటరానివారు ఎందుకయ్యారో కూడా తెలుసుకోవాలి. ఎన్నికల విధులను నిర్వర్తించేందుకు అటవీ ప్రాంతాలకు వెళ్ళే ఉద్యోగులు 'పోలీసులు మావెంట రక్షణగా వస్తే మేం వెళ్ళం' అనే పరిస్థితి ఎందుకొచ్చిందో, పోలీసులు వెంటరాకూడనివారు ఎందుకయ్యారో కూడా తెలుసుకోవాలి. 'ఎన్‌కౌంటరు జరిగిన ప్రదేశానికి వెళ్ళినపుడు అక్కడ మృత్యువాసన గుప్పున కొట్టింద'ని అంటూ ఉంటారు విప్లవ కవులు కొందరు, శ్రేష్టులలోకెల్లా శ్రేష్టులు కొందరు - మరి అంటరాని, వెంటరాకూడని ఆ పోలీసుల కళ్ళలో మృత్యువు నీడలు కనబడలేదో ! మందుపాతరల్లో మారుమోగిన మృత్యుఘోష వినబడలేదో!!
దిలీప్ గారన్నారు.. ఆ డబ్బులు ఆ ప్రాంతాల అభివృద్ధికి ఖర్చు చేసి ఉంటే నక్సలైట్ల అవసరం ఉండేదే కాదు అని. ఈ నక్సలైట్లు ఉండీ ఉపయోగమేం జరిగిందో నాకు అర్థం కాదు.. ఇవ్వాళ్టికి కూడా చింతపండు అమ్ముకునే దగ్గర గిరిజనులు దోపిడీకి గురవుతూనే ఉన్నారు. మొన్నటికి మొన్న కూడా - గిరిజనులను దోచుకుంటే ఊరుకునేది లేదని వ్యాపారులను బెదిరించి పోయారట! ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం చేసినా ఎంతో కొంత సాధించి ఉండేవారేమో!
ఇన్నేళ్ళ సాయుధ పోరాటం తరవాత, వాళ్ళు సాధించిన కొన్ని కీర్తి కిరీటాలు: టి.హయగ్రీవాచారి, దుద్దిళ్ళ శ్రీపాదరావు, మాగుంట సుబ్బరామిరెడ్డి, ఎలిమినేటి మాధవరెడ్డి, పాల్వాయి పురుషోత్తమరావు, ప్యానెల్ స్పీకరు సి.నర్సిరెడ్డి - ఆయనతోపాటు మరో పది పన్నెండు మంది. (ఇవి నాకు తెలిసినవి, తెలియనివెన్నో!) వీళ్ళెవరూ పోలీసులు కారు.
ఇన్నేళ్ళ వర్గపోరాటం ద్వారా ఏం సాధించారో, ప్రజలకు వీళ్ళెంత ఉపయోగపడ్డారో కూడా తెలుసుకోవాలి. నేపాలు నుండి దండకారణ్యం దాకా (లేక, నల్లమల దాకానో మరి.) ఎర్ర బాట (రివల్యూషనరీ కారిడార్ - RC) పరిచారు కదా! నేపాల్లో చెయ్యాల్సిన హింస అంతా చేసి ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికల్లో పాల్గొని పాలనలో కొచ్చారు. అక్కడంటే ఇన్నాళ్ళూ ప్రజాస్వామ్యం లేదు సరే, కానీ మనకుందే! మరి ఈ హింసా, విధ్వంసం అన్నీ మానేసి, ఎన్నికల్లో పాల్గొనవచ్చుగదా!ఆ బాటలో నడచే కామ్రేడ్లే గదా, వీళ్ళూను!! పోటీ చేసి, అధికారంలోకి వచ్చి, వర్గ నిర్మూలన చెయ్యొచ్చు కదా! వర్గ నిర్మూలన తుపాకీతో సాధ్యపడేదైతే ఈ 40 ఏళ్ళలోనూ జరగలేదే!!
వర్గనిర్మూలన, సమసమాజ స్థాపన అనేది ఉదాత్తమైన ఆశయమే కానీ నలభై ఏళ్ళ తరవాత అది ఉత్త ఆశయం ఐపోయినట్టు కనబడుతోంది.

3, జులై 2008, గురువారం
వాళ్ళు మనకోసం ప్రాణాలర్పించారు
అది యుద్ధం. గెరిల్లా యుద్ధం. 65 మంది పోలీసులు, ఇతర సిబ్బందీ నదిలో, నడిమజ్జన ఉండగా మావోయిస్టులు రాకెట్లూ తుపాకులతో దాడి చేస్తే పాపం చెల్లాచెదురయ్యారు. 29 మంది మాత్రం బ్రతికి బయట పడ్డారిప్పటికి. మిగిలినవారి జాడ ఇంకా తెలియరాలేదు. పోలీసుల అజాగ్రత్త వల్లనే ఈ సంఘటన జరిగిందని ఒక వంక చెబుతున్నారు. ఆ పడవ నడిపే అతను మావోయిస్టులతో కుమ్మక్కయ్యాడని మరో వాదన కూడా వినవస్తోంది. ఒక పోలీసు శవం నదిలో దొరికింది. అతడి చేతులు వెనక్కి విరిచి కట్టేసి ఉన్నాయని అంటున్నారు. అతడు మావోయిస్టులకు దొరికితే, చేతులు కట్టేసి నదిలోకి తోసేసి ఉంటారు. ఎంత క్రూరత్వం!
ఈ ప్రభుత్వం వచ్చాక మావోయిస్టులను బాగా అణచివేసారు. దాదాపు ప్రతిరోజూ వినబడుతూ ఉండే ఘాతుకాలు ఇప్పుడు ఆగిపోయాయి. బహుశా మితిమీరిన ఆత్మవిశ్వాసం పోలీసుల పాలిట మృత్యు వయ్యుండొచ్చు. అదను చూసి మావోయిస్టులు మాటేసి, కాటేసారు.
భలే జరుగుతోంది యుద్ధం!
-మావోయిస్టులు గెరిల్లా దాడులు చేస్తూ ఉన్నారు.
-పోలీసులు ప్రాణాలకు తెగించి వాళ్ళను వేటాడుతున్నారు.
-రాజధానిలో మాత్రం రాజకీయ నాయకత్వం మావోయిస్టు నాయకత్వంతో కులాసా కబుర్లు చెబుతోంది.వాళ్ళు జైల్లో ఉంటే జైలుకు, ఆసుపత్రిలో ఉంటే ఆసుపత్రికీ వెళ్ళి మరీ చర్చలు చేస్తోంది. అడవుల్లో పోలీసులు రక్తం ధారపోస్తుంటే. రాజకీయ నాయకులు ఆసుపత్రులకెళ్ళి అన్నలను పరామర్శిస్తున్నారు.
ఏ రాజన్ననో, రాజక్కనో అరెస్టు చేసారనే పుకారొస్తే చాలు మానవ హక్కులవారు గగ్గోలెడతారు, హడావుడి చేసేస్తారు. వాళ్ళను కోర్టుకప్పజెప్పాలి అంటూ చదును చదును చేస్తారు. (ఓసారిలాగే సుధాకరునో మరో దివాకరునో అరెస్టు చేసారనే వార్తలొచ్చాయి -అంతే ఈ వాదులు నిదర్లు పోలేదు. ఓ రోజో రెండ్రోజులో పోయాక సదరు వీరుడే ఒరిస్సా నుంచి ప్రకటన చేసాడు, అబ్బెబ్బే నేను వాళ్ళకి చిక్కలేదు, బానే ఉన్నానంటూ -అప్పుడాగింది వీళ్ళ హడావుడి.)
ముప్పైఐదు మందికి పైగా కుర్రాళ్ళు మనకోసం పనిచేస్తూ గల్లంతయ్యారు. రెండు రోజులైనా ఇంతవరకూ ఆచూకీ తెలియలేదు. వాళ్ళ సహచరులు.- ఏఁ, మేం మనుషులం కామా, మాకు మానవహక్కులు లేవా? అని అడుగుతున్నారు, ముందు మనుషులం ఆ తరవాతే పోలీసులం అని ఆక్రోశిస్తున్నారు.
ఔను మరి, వాళ్ళకు లేవా హక్కులు?

1, జులై 2008, మంగళవారం
బ్లాగరులో కొత్త అంశాలు
బ్లాగరు కొన్ని కొత్త అంశాలను ప్రవేశపెట్టింది. draft.blogger.com చూస్తున్నవారికి ఈసంగతి తెలిసే ఉంటుంది. కొత్త కొత్త అంశాలను ప్రవేశపెట్టడం బ్లాగరుకు మామూలే. ఈ సారి ప్రవేశపెట్టిన అంశాల్లో నాకు బాగా నచ్చినదొకటుంది. - వ్యాఖ్యలపెట్టె. బ్లాగరులో వ్యాఖ్యలు రాసేందుకు అంతగా వీలు ఉండదు. వ్యాఖ్య రాయాలంటే ఓ లింకు నొక్కాలి, అప్పుడు వేరే పేజీ తెరుచుకుంటుంది - అందులో రాయాల్సుంటుంది. అదొక తలనెప్పి వ్యవహారం. ఈ పద్ధతిని సంస్కరించి, వ్యాఖ్యలపెట్టె కూడా జాబు పేజీ (ఇన్‌లైను) లోనే వచ్చే ఏర్పాటు చేసారు. ఇప్పుడు వర్డ్‌ప్రెస్‌లో ఉండే వీలు బ్లాగరులో కూడా చేరింది. అయితే దీనికి కాస్త హంగు చెయ్యాల్సి ఉన్నట్టుంది. ఏదేమైనా ఇప్పుడున్న స్థితిలోనైనా ఇది బానే ఉంది. కొత్త అంశాలను చూసేందుకు draft.blogger.com లో లాగినయి, డ్యాష్‌బోర్డులో ఈ కొత్త అంశాలను చూడవచ్చు.ఈ అంశాన్ని వాడటంలో ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉంది. నాకెదురైంది. అప్పుడు ఇక్కడిచ్చిన సూచనలను అనుసరించి, సాధించాను.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)
సంబంధిత టపాలు
loading..