నా గత టపాలో జై గొట్టిముక్కల గారు ఒకవ్యాఖ్య రాసారు "దెబ్బలు తిన్నోడు గూండాగా, కొట్టినోడు హీరోగా కనిపిస్తున్నాడా?" అని. నా సమాధానం పెద్దదైపోవడంతో దాన్ని ఈ టపాగా రాస్తున్నాను.
సభకు వచ్చిన సీమాంధ్ర ఉద్యోగులు చాలా సంయమనంగా వ్యవహరించారు. ఎన్నో అడ్దంకులు, దాడులను ఎదుర్కొంటూ కూడా సహనం కోల్పోకుండా సభను జరుపుకున్నారు. అందుకే ఆ సభ విజయవంతమైంది. అసలీ సభ సాధించిన ప్రధాన విజయమే అది. ఒకటా, రెండా.. ఎన్నెన్ని అడ్డంకులు ఎదుర్కొన్నారు..
- తమ రాజధానిలో సభ పెట్టుకుంటామంటే దానికి తెవాదులు ఆటంకాలు కల్పించారు. పంతం కోసం అదే రోజున బందు జరపారు తెవాదులు.
- సభకోసం తెలంగాణ ప్రాంతం లోకి వచ్చేవాళ్లను ’తంతం’, ’తన్ని తీరతం’, ’వాళ్ళకు చావుదెబ్బలు తప్పవు’ అని మాట్టాడారు. ఈ యూ ట్యూబు వీడియో లో 40 వ సెకనులో చూడండి. పైగా అది మాట్టాడింది ఎక్కడ.. ప్రెస్ మీట్లో, టీవీ కెమెరాల ముందు! అతడలా మాట్టాడ్డం తప్పని తెవాదులెవరూ అనలేదు. ఇదే వ్యక్తి సంక్రాంతికి ఇళ్ళకు వెళ్ళిన సీమాంధ్రులను తిరిగి వెనక్కి రానివ్వం అని కూడా బెదిరించాడు గతంలో. ఏమిటిది, హీరోయిజమా, రౌడీయిజమా?
- సభావేదికపైకి చెప్పు విసరడం ఏంటి? ఇలాంటి సంఘటన తెలంగాణ సభలో ఎప్పుడైనా జరిగిందా?
- సమైక్యాంధ్ర సభలో జై తెలంగాణ అని నినదించడం ఏంటి? తెలంగాణ సభలో జై సమైక్యాంధ్ర అని ఎవరైనా అన్నారా?
- సభ జరుగుతున్న స్టేడియమ్ గేటు దగ్గర కొచ్చి జై తెలంగాణ నినాదాలు చేసారు. సమైక్యాంధ్ర ఉద్యమకారులతో ఘర్షణ పడ్డారు. కేవలం గొడవ పెట్టుకోడానికి కాకపోతే సభ దగ్గర నినాదాలివ్వడం ఏంటి? దీన్ని రౌడీయిజం అనే అంటారెవరైనా.
- ర్యాలీగా వెళ్తున్న ఉద్యోగులపై రాళ్ళెయ్యడం పద్ధతా? ఈ విద్యార్థి నాయకుల్లో ఒక ప్రముఖ నాయకుడు గతంలో ఒక టీవీ చర్చలో, స్టూడియోలో, చర్చలో పాల్గొన్న ఒకతనిపై దాడి చేసి చితక కొట్టాడన్న సంగతి మీకు తెలుసా? కెమెరా ముందే జరిగిన ఈ దాడిని లక్షలాది ప్రజలు చూసారు. ఇది హీరోయిజమా, రౌడీయిజమా?
- సభ నుండి తిరిగివెళ్ళే బస్సుల మీద రాళ్ళ దాడి చేస్తే దెబ్బలు తగిలి ఒక వ్యక్తి ఆస్పత్రి పాలయ్యాడు, పదో పన్నెండో బస్సులు దెబ్బతిన్నై. ఇది రౌడీయిజం కాకపోతే మరేంటి?
- పీక కోస్తా అని సైగ చేసిన వ్యక్తిని అతడి పక్కనే నడుస్తున్నతడు వెనువెంటనే వారించాడు. అదే వీడియోలో ఉంది. దాని గురించి తెవాదులెవరైనా మాట్టాడారా? అలా ప్రవర్తించిన దుందుడుకు తెవాదులను వారించే ప్రయత్నం గతంలో ఎప్పుడైనా జరిగి ఉంటే, ఇవ్వాళ ఈ రాళ్ల దాడులు, చెప్పులు వెయ్యడాలు, సభలో వ్యతిరేక నినాదాలు, దూషణలు జరిగేవి కావు.
- తెలంగాణ ఉద్యమంలో సంయమనం లేకపోవడానికి ప్రధాన కారణం తెరాస నాయకత్వం. కొందరు జాక్ నాయకులు కూడా అలాగే మాట్టాడతారు. టిఫిన్ సెంటర్లు పెట్టుకుందురుగాన్లే, రొయ్యలను అమ్ముకోవచ్చులే అంటూ వాళ్ళు చేసిన ఎగతాళి ప్రజలను నొప్పించింది. అయినా సామాన్య సీమాంధ్రులు వెనువెంటనే స్పందించరు -ఎందుకంటే వాళ్ళు సంయమనం పాటిస్తారు కాబట్టి! సత్యవాణి గారి ప్రసంగం సీమాంధ్రుల్లో కలిగిన బాధకు దర్పణం! ఆమె ఎంత సంయమనంగా మాట్టాడారో మీరు గుర్తించారా? హీరోయిజమంటే అదీ!
- సభ తరవాత స్పందించిన కొందరు తెలంగాణ నాయకుల మాటల్లో కూడా సంయమనం కనిపించలేదు. సీమాంధ్ర ఉద్యోగులపై కేసులు పెట్టాలని గర్జించినవాళ్ళే గానీ, సభను అడ్డుకోవడాన్ని నిరసించిన వాళ్ళున్నారా? సభ మరుసటి రోజు పొద్దున టీవీ చర్చల్లో తెలంగాణకు సంబంధించిన వ్యక్తుల మాటల్లో కూడా ఆ సంయమనం కనిపించలేదు. జై తెలంగాణ అన్న వ్యక్తిని కొడతారా అని ప్రొఫెసరు ఒకాయన అడిగాడు. కానీ అలా సభలో నినదించడం తప్పు కదా అని ఆలోచించలేకపోయా డా ’చిన్న మనిషి’.
సీమాంధ్రుల సంయమనానికి, తెవాదుల అసహనానికీ క్లాసిక్ ఉదాహరణ ఒకటిక్కడ:
2010 లో హెచ్చెమ్ టీవీ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లోను తెలంగాణ సమస్యపై ప్రజాభిప్రాయాన్ని ప్రోది చెయ్యడానికి
చర్చలు పెట్టింది. అప్పుడు సీమాంధ్రలో సభలు జరిగిన విధానాన్ని, తెలంగాణలో జరిగిన
విధానాన్నీ గమనించినవాళ్లకు ప్రజల స్పందనలో తేడా స్పష్టంగా తెలిసేది. సీమాంధ్ర సభల్లో తెవాదులు చక్కగా తమ వాదనను వినిపించేవాళ్ళు. సీమాంధ్రులను మాత్రం తెలంగాణలో మాట్టాడనిచ్చేవాళ్ళు కాదు. ఈ సంగతి తెలంగాణ పెద్దలే బహిరంగంగా చెప్పారు.వరంగల్లులో జరిపిన సభలో గందరగోళం జరిగి, సీమాంధ్రులను, ’మన్యసీమ’ నాయకులనూ మాట్టాడనివ్వకుండా అల్లరి చేస్తే, చర్చ సమన్వయకర్త, కె రామచంద్రమూర్తి (తెలంగాణ మద్దతుదారు) ఇలా చెప్పాడు.. తిరుపతిలో ప్రకాశ్ ను, విశాఖలో హరగోపాలును, విజయవాడలో నెల్లుట్ల వేణుగోపాలును అక్కడి ప్రజలు అడ్డుకోలేదు. మీరిలా అడ్డుకుంటే, అక్కడి ప్రజలు మన గురించి
ఏమనుకుంటారు? అదే సభ చివర్లో మాట్టాడుతూ ప్రొఫెసరు హరగోపాల్ (తెలంగాణ మద్దతుదారు) కూడా, ’ఈ చర్చ జరిగిన విధానం నాకు బాధ కలిగించింది. నేను విశాఖలో 40 నిముషాలు
మాట్టాడితే నన్నెవరూ అడ్డగించలేదు. నా తరువాత మాట్టాడినవాళ్ళు నన్ను విమర్శించినపుడు అక్కడి పెద్దలు నావద్దకు వచ్చి, వ్యక్తిగతంగా క్షమాపణలు
చెప్పారు. ఇక్కడ సీమాంధ్ర వక్తలను మీరు ఇలా అడ్డుకోవడం తప్పు’ అని చెప్పాడు. సీమాంధ్రులకు, తెవాదులకూ ఉన్న తేడాఅదీ! 2010 జనవరి 24 న జరిగిందా సభ.
హై.లో సభ రోజున సంఘటనలకు కారణం సభను అడ్డుకోవాలన్న తెవాదుల దౌర్జన్య ధోరణి, రౌడీయిజం తప్ప మరోటి కాదు. బస్సులపై రాళ్ళేసినవాళ్ళు, సభను అడ్డుకోబోయినవాళ్ళు, ర్యాలీపై రాళ్ళేసినవాళ్ళు, చెప్పులేసిన వాళ్ళు -వీళ్లను రౌడీలే అంటారు. ఇంత ప్రతికూల పరిస్థితుల్లోనూ సంయమనం పాటించి, సభను సజావుగా విజయవంతంగా జరుపుకున్నవాళ్ళే హీరోలు. వాళ్ళు హీరోలే!
జై లాంతి పచ్చి తెలంగాణ వాదికి సరైన సమాధనం చెప్పారు. HM TV సభ గురించి చెప్పిన విషయం మొత్తం ఆర్గ్యుమెంట్ను ప్రొవ్ చేసింది.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండితివిరి ఇసుకనుండి తైలము తీయవచ్చు.....
రిప్లయితొలగించండిజై గారికి ,
రిప్లయితొలగించండిఅయిన వారికి ఆకులలో కాని వారికి కంచాలలో పెట్టే అలవాటుంది. ఆంధ్ర చరిత్రను అమూలాగ్రంగ చదివీన అతను , శ్రుతిమిచి తురక వారిని కాకా పట్టటానికి పాచికలు వేస్తూంటాడు. ఇంత క్రితం కబుర్లు కాకరకయలు బ్లాగులో అతనికిసమధనం ఇవ్వటం జరిగింది. ఆయన వాటికి ఇప్పటి వరకు సమధానం ఇవ్వలేదు.
అనామకోత్తమా తమరు ఎ విషయంపై ఈ అలాగా వెధవకు చురకలు పెట్టారో చెబితే జవాబు ఇచ్చే సాహసం చేయగలను.
తొలగించండిwell said
రిప్లయితొలగించండిమా హైదరాబాద్ లో మా సభ కు అనుమతి ఇవ్వలేదని రచ్చ రచ్చ ఒకటి. ఇప్పటికి కొన్ని వేల సభలు, ధర్నాలు, రాస్తారోకో లు చేశారు. కనీసం ప్రెస్ ముందు మాట్లాడేటప్పుడు ఐనా అవి గుర్తు రాలేదేమో. అదే రోజు పోటా పోటీ సభ ఏంటి? ఇదేనా కడుపులో పెట్టుకుని చూసుకోవడం అంటే. దానికి శాంతి ర్యాలి అని పేరు మళ్లీ. ఇంకో సభ పేరు ఏంటిది అది? ఆ సద్భావన సభ. అంటే ఏంటో హరీష్ రావు ఒక సద్భావన సభలో మాట్లాడిన మాటలు వింటే అందరికీ కరెక్ట్ గా అర్థం అవుతుంది.
రిప్లయితొలగించండిపైగా తెలంగాణా వాళ్ళు సహకరించారు ధన్యవాదాలు అని డైలోగ్ ఒకటి. తెలంగాణా ప్రజలు మామూలుగానే ఉంటారు. ఈ తెలబాన్ మూకలకే పని పాటా ఉండదు. ఎప్పుడు చూడు ఏదో గొడవ చేయాలి నా నా యాగీ చేయాలి.
Excellent post
రిప్లయితొలగించండిilaage raasthundu annayya...
రిప్లయితొలగించండిhyderabad lo sabha petti chankalu guddukovadam kaadu....
రిప్లయితొలగించండిade mee vizag lone vijayawada lono telangaana sanbha pedite okka
telangaana vadaina bratiki batta katta kalada...idi....
inka edo poniley ani chaala samyamanam patincharu telangaana vallu..
ade mahaboob nagar vadda tolegate dwasam chesindi evaru??? entha samyamanam seemaandhra vaallaki...
deenni cheta kani tanam ga anukunte meebonda ilatni vunmada alochanalatho postlu pettekanna samaikyamga vunte em oruguthundo....
vidipothe em migalado(seemandhra vallaku) rayandi...janalu chaduvutharu....
lagadapati, Chandrababu, kavuri, rayapati,kirankumar reddy, JAGANMOHAN REDDY lanti avineeti parulani encourage cheyyandi..
telangaana nu aaputharu.... endukante vaalla chemata (AVINEETI boo dandalu) velle kada hyd devolop indi....
mee bokka lo postlu....daaniki edava commentlu...
చదువరిగారూ!
రిప్లయితొలగించండితెలంగాణవాదుల విమర్శలకు చక్కగా ప్రతిస్పందించారు. ఆకాశరామన్న బ్లాగులో నేను కూడా కిందివిధంగా స్పందించాను.
"ఒక బాధ్యత గల ప్రభుత్వోద్యోగి(కానిస్టేబుల్ శ్రీనివాస్) మరొకచోట డ్యూటీ ఉండగా సమైక్యాంధ్ర సభకు వచ్చి జై తెలంగాణ అని నినాదాలు చేయటం అల్లరిమూకలు చేసేపని. ఇదే పనిని తెలంగాణసభలో ఎవరైనా సమైక్యాంధ్ర వ్యక్తి చేస్తే అతనికి పుట్టగతులుంటాయా!
ఇకపోతే ఆ కానిస్టేబుల్ ను, దేశానికి ప్రాణాలర్పించిన, లేదా సర్వశక్తులూ ఒడ్డి దేశాన్ని కాపాడిన వ్యక్తిలాగా చిత్రిస్తూ, తెలంగాణ రాజకీయ నాయకులు పొగడటం సరే, ఒక బాధ్యత గల వార్తా పత్రిక - నమస్తే తెలంగాణ తమ పతాక శీర్షికలో, బ్యానర్ ఐటమ్ ప్రదేశంలో ఫోటో పెట్టడంకంటే దారుణం మరొకటి ఉంటుందా! ఇది సమాజంలోకి ఏ విధమైన సంకేతాలు పంపుతోంది అనేది ఆ పత్రిక సంపాదకవర్గం కొద్దిగానైనా ఆలోచించిందా! ఆ కానిస్టేబుల్ కు వచ్చిన కీర్తిని చూసి ఇతర తెలంగాణ వాదులు ఇంకా రెచ్చిపోయి మరింత దారుణాలకు పాల్పడితే దానికి ఈ పత్రిక కారణం అవదా!
తెలంగాణవాదులు రానురానూ తాలిబన్లుగా మారుతున్నారనటంలో ఎటువంటి సందేహంలేదు. తెలంగాణ రాష్ట్రం వస్తే ఆ ప్రాంతం అభివృద్ధి చెంది, ఉద్యోగావకాశాలు పెరగటమేమోగానీ, స్వతహాగా అమాయకులు, కల్లాకపటం తెలియని తెలంగాణ ప్రజలపై నాయకులవల్ల చెరగని మచ్చ ఏర్పడుతోంది. తెలంగాణ ఎలాగూ వెనక్కు వెళ్ళిపోయిందని కన్ ఫర్మ్ అయిపోయింది, కానీ ఇలాంటి ఉద్యమ నాయకులవల్ల ఆ ప్రాంతం మరింత వెనక్కు వెళ్ళటం ఖాయం."
కానీ, మీలాంటి, నాలాంటి వాదనలు వారి తలకెక్కవు. తెలంగాణ ఉద్యమ నాయకులు తెలంగాణావాదాన్ని తాలిబన్ స్థాయికి, జీహాద్ స్థాయికి తీసుకెళుతున్నారు.కల్లాకపటం తెలియని అమాయక తెలంగాణ ప్రజలే దీనిలో సమిధలు. ముందుముందు ఆత్మాహుతి దాడులకు తెగించినా ఆశ్చర్యపడనక్కరలేదు.
ఒక పోలీసు కానిస్టేబుల్ తన డ్యూటీ వేసిన ప్రదేశానికి కాక మరో డ్యూటీ ఎక్కితే గుర్తించలేనంత అయోమయంలో పోలీసు వ్యవస్థ ఉందా? లగడపాటి రాజగోపాల్ చెప్పగానే గుడ్డిగా నమ్మే బదులు రుజువులు చూపించండి.
తొలగించండిచదువరి గారూ, ప్రజాస్వామ్యంలో అందరికీ హక్కులు ఉంటాయి. సభ పెట్టుకునే హక్కు ఆంధ్రులకు ఉన్నట్టే, బంధు పిలుపు/నల్ల జండాల ప్రదర్శన హక్కులు తెలంగాణా వారికీ ఉంటాయి. కాదంటారా?
రిప్లయితొలగించండిసభకు ఇచ్చిన అనుమతి కొన్ని షరతులతో కూడినది. నినాదాలు చెయ్యొద్దని, ఊరేగింపులు తీయ్యోద్దని, ఉద్యోగేతరులను రానివ్వోద్దని షరతులను తుంగలో తొక్కడం సంవయనమా? పైగా గొంతులు కోస్తామని బెదిరింపు ఒకటి.
నిరసన తెలియచేయడం తప్పా? స్వ. టంగుటూరి ప్రకాశం గారు నల్ల జండాలతో సైమన్ గో-బాక్ నినాదాలు చేయలేదా?
సభ ముందటి రోజు పిడమర్తి రవి, మంద కృష్ణ మాదిగ లాంటి వారు రెచ్చగొట్టారు కాబట్టి *వేరే ఇంకెవరినో* కొట్టడం హీరొఇజమా?
ఆంధ్రుల సభలకు అడుగడునా అడ్డంకులు వచ్చాయా? ఏలిన వారు ఇన్ని రాచమర్యాదలు తెలంగాణా వారికి ఎప్పుడయినా ఇచ్చారా?
ఆంధ్రలో సభ పెట్టుకుంటే అన్ని ఏర్పాట్లు చేస్తామన్న వారు ఆ సహకారమెదొ సామాజిక ఆంద్ర వారి జై ఆంద్ర సభలకు ఇవ్వండి చూద్దాం.
మీరు HMTV దశ దిశ కార్యక్రమాలు కొన్ని మాత్రమె చూసారనుకుంటా. నెల్లూరులో పల్నాటి శ్రీరాములు గారిపై కుర్చీలు విసరడం, విశాఖలో జాన్ గారిని మాట్లాదనివ్వకపోవడం, గుంటూరులో ఒక న్యాయవాదిపై దాడి చేయడం మీరు చూడని కొన్ని మచ్చుతునకలు.
I followed your posts before December 9 with a great deal of interest. The posts were very balanced earning my respect.
Mr. Jai, Seemandhra news channels never telecast any news about Palnati Sriramulu. So, many people are not aware about him. I was informed about him only through Facebook posts.
తొలగించండిజై గారూ, తెవాదుల రౌడియిజానికి మీ సమర్ధన చూస్తే కొంత ఆశ్చర్యం కూడా కలిగింది నాకు. సమర్ధించినందుక్కాదు, మీరు చూపించిన కారణాలను చూసి.
తొలగించండి"సభ పెట్టుకునే హక్కు ఆంధ్రులకు ఉన్నట్టే, బంధు పిలుపు/నల్ల జండాల ప్రదర్శన హక్కులు తెలంగాణా వారికీ ఉంటాయి. కాదంటారా?" - కాదని నేనెక్కడన్నాను? కానీ అదే రోజున ఎందుకు? అదే రోజున ర్యాలీ చెయ్యాలని ఎందుకనుకున్నారు? అదే రోజున బందెందుకు చేసారు? గొడవలు లేపడానికి కాకపోతే అదే రోజున ఎందుకు చెయ్యాలనుకున్నారివి? ఇది రాజకీయ రౌడీయిజం!
"సభకు ఇచ్చిన అనుమతి కొన్ని షరతులతో కూడినది. నినాదాలు చెయ్యొద్దని, ఊరేగింపులు తీయ్యోద్దని, ఉద్యోగేతరులను రానివ్వోద్దని షరతులను తుంగలో తొక్కడం సంవయనమా?" - మీరు ఆరోజు బందే గనక చేసి ఉండకపోతే ఊరేగింపు జరిగేదే కాదు. బస్సులు తిరిగి ఉంటే సుబ్బరంగా బస్సుల్లో వెళ్ళేవాళ్ళు. బందు కారణంగా నడిచి వెళ్ళాల్సి వచ్చింది. అంతమంది కలిసి నడిచి వెళ్తే ఆటోమాటిగ్గా అది ఊరేగింపు అవుతుంది. అయినా.. షరతులు పెట్టిందెవరు -పోలీసులు, కోర్టులు! అనుమతులను మీరితే వాళ్ళు చూసుకుంటారు, ఏం చెయ్యాలో. తెవాదుల కెందుకులుకు? వాళ్ళ మీద చెప్పులు, రాళ్ళూ ఎందుకు వెయ్యాల్సొచ్చింది, రౌడీయిజం కాకపోతే?
"నిరసన తెలియచేయడం తప్పా? స్వ. టంగుటూరి ప్రకాశం గారు నల్ల జండాలతో సైమన్ గో-బాక్ నినాదాలు చేయలేదా?" - :) సమాధానం పొందే అర్హత ఈ ప్రశ్నకు లేదు.
"సభ ముందటి రోజు పిడమర్తి రవి, మంద కృష్ణ మాదిగ లాంటి వారు రెచ్చగొట్టారు కాబట్టి *వేరే ఇంకెవరినో* కొట్టడం హీరొఇజమా?" - ఓహో, అలాగా! మరి, *వేరే ఇంకెవరో* రెచ్చగొట్టే మాటలు మాట్టాడితే వీళ్ళెందుకు చెప్పులు, రాళ్ళూ వెయ్యాల్సొచ్చింది? సభలో జై తెలంగాణ అని ఎందుకనాల్సొచ్చింది? రౌడీయిజం ఎందుకు చెయ్యాల్సొచ్చింది?
"ఆంధ్రుల సభలకు అడుగడునా అడ్డంకులు వచ్చాయా? ఏలిన వారు ఇన్ని రాచమర్యాదలు తెలంగాణా వారికి ఎప్పుడయినా ఇచ్చారా?" - :) ఎవరు ఎంతటి మర్యాదస్తులో సభ రోజున జరిగిన అనేక సంఘటనలు చెబుతున్నై. సభలో సత్యవాణి గారి ప్రసంగం మర్యాదల్లోని అంతరాలను చాలా వివరంగా చెప్పింది.
"ఆంధ్రలో సభ పెట్టుకుంటే అన్ని ఏర్పాట్లు చేస్తామన్న వారు ఆ సహకారమెదొ సామాజిక ఆంద్ర వారి జై ఆంద్ర సభలకు ఇవ్వండి చూద్దాం." - వరంగల్లులో మన్యసీమ వాళ్ళు సభ పెట్టుకోగలరా? వాళ్లకివ్వండి మీ సహకారం చూస్తాం. కరీం నగర్లోనో, సిద్దిపేటలోనో సమైక్య సభ పెట్టుకోగలిగే వీలుందా?
"మీరు HMTV దశ దిశ కార్యక్రమాలు కొన్ని మాత్రమె చూసారనుకుంటా... ... మీరు చూడని కొన్ని మచ్చుతునకలు." :) మీరు అసలు సంగతిని కప్పిపుచ్చుతున్నారు.. మీరు నన్ను, నేను మిమ్మల్నీ విమర్శించుకోడంలో విశేషమేమీ లేదండీ. మన మల్పజీవులం, చూపుడువేలు ఒక్కటే మనకు ఉందనీ, ఇంకో నాలుగు వేళ్ళు మనెంకే చూస్తున్నాయనీ మనం లాఘవంగా మర్చిపోతూంటాం. అంచేతనే.. తెలంగాణ మేధావులిద్దరు, రెండు ప్రాంతాల్లోనూ స్వయంగా సభల్లో పాల్గొన్నవాళ్ళు, రెండు ప్రాంతాల ప్రజల ప్రవర్తనను పోల్చి మాట్టాడిన సంగతి చెప్పాను.
ఆంధ్రోళ్ళకు తమ రాజధానిలో సభను పెట్టుకుని సమస్యలు ముచ్చటించుకునే హక్కులు వుంటాయి అని తెలుస్తోంది. తప్పేమీ కాదు. ఆంధ్ర న్యాయవాదులు కూడా సభను శాంతియుతంగా హైద్రాబాదులో జరుపుకోవచ్చన్న మాట. ఆంధ్ర విద్యార్థులు, యువకులు కూడా హైద్రాబాదులో సభలు బాదితే ఒట్టి తడి కాదు, విభజనవాదులకు ఇత్తడే..
తొలగించండిఇంకోడి సభలో/పెళ్ళిలో/శుభకార్యాల్లో పోయి పెంటచేసే సంస్కృతి అలాంటి వాళ్లను సమర్థించే సంస్కృతి రాష్ట్రంలో కొందరికే వుంటుంది.
చదువరి గారూ:
రిప్లయితొలగించండిబందు వేరే రోజు ఎందుకు చెయ్యాలో నాకు అర్ధం కాలేదు. సైమన్ గో-బాక్ ఉద్యమం సదరు దొరగారు తిరిగి ఇంగ్లాండు వెళ్ళాక చేయాలన్నట్టు ఉంది మీ సలహా.
బందు విషయం పక్కన పెడితే, నల్ల జండా ప్రదర్శన మాత్రం వేరే రోజు చేయడం కుదరదు. నల్ల జండా చూపించిన వారు కూడా మీ ఉద్దేశ్యంలో గూండాలా? ఆ మాట చెప్పి మీరు స్వ. ప్రకాశం గారిని అవమానించకండి.
ఈ తెలంగాణా వ్యతిరేక సభకు కిరణ్ గారి ప్రభుత్వం ఆగమేఘాల మీద అనుమతి ఇవ్వడం, వారికి రాచమర్యాదలు చేయడం, షరతులను ఉల్లంఘించినా శీతకన్ను వేయడం వగైరాల వల్ల ఇది రాష్ట్రప్రభుత్వ ప్రాయోజిత వ్యవహారం అన్న అనుమానం బలపడింది. బందు పిలుపు ఇచ్చింది అందుకే. తెలంగాణా సభలకు ప్రభుత్వం & పోలీసులు ఎన్ని అడ్డంకులు విధించారో తమరికి విదితమే.
తెలంగాణా గడ్డపై జై తెలంగాణా అనడమే రెచ్చగొట్టడం అయితే, సత్యవాణి తెలంగాణా వారిని యుద్దంలో ఓడిపోయిన కౌరవులతో పోల్చడాన్ని ఏమనాలి? 15 ఏళ్ళు అధికారం ఇవ్వడానికి రాష్ట్రం ఈవిడ సొంత జాగీరా? బిచ్చం వేస్తె తీసుకోవడానికి సిద్దంగా ఎవరూ లేరన్న ఇంగిత గ్యానం కూడా ఆమెకి లేకపోయింది.
నేను బెదిరించిన వారిని కానీ, రాళ్ళు/చెప్పులు వేసిన వారిని సమర్తించలెదని మీరు గమనించాలి. అదే సమయంలో మీరు తెలంగాణా బిడ్డల్ని కొట్టిన వారిని మేచ్చుకోరని నా కోరిక. మన్యసీమ సభకు తెలంగాణా వాదులు సహకరిస్తారో లేదో నాకు తెలీదు కానీ నా మట్టుకు నేను వారిపై దాడి చేసిన వారిని హీరోలుగా వర్ణించను.
రెచ్చగొడితే ప్రతిచర్య ఒప్పెననే వాదన సరి కాదు. ఆ లెక్కన జయప్రకాశ్ నారాయణ్ తెలంగాణా ఉద్యమంపై అభాండాలు వేసినందుకే కొట్టానని సదరు నిందితుడు అంటే మీరూ నేనూ ఒప్పుకుంటామా?
నేను దశ దశ కార్యక్రమాన్ని దాదాపు సాంతంగా చూసాను. స్వల్ప తేడాలు మినహాయిస్తే అన్ని చోట్లా ఒకే రకంగా జరిగింది.
చర్యకు ప్రతిచర్య చేయడమే తెలంగాణా వ్యతిరేకుల లక్ష్యం అయితే దాని పర్యవసానం విభజనే అవుతుందని గుర్తు పెట్టుకోవాలి. కోట్లాది విడిపోవచ్చు కానీ కొట్లాడుతూ కలిసి ఉండలేమన్నది ప్రకృతి ధర్మం.
సామరస్యంగా తెలంగాణా రాదనే విషయం డిసెంబర్ 10 నాదే తేలిపోయింది. అయినా తెలంగాణా వారు సంవయనంగానే ఉన్నారు.
You can't clap with one hand. Unity by force is a nobrainer. These principles can be ignored only at your own peril. The way the meeting was held reduces the possibility of a 10 year joint capital.
Sorry for the many typos. My transliteration tool was not cooperating today. Moreover I am in a rush as I am traveling.
తొలగించండిలక్షమంది ఎంజీవోల సభతో, అశోక్ బాబు గారు తెరాస, తోకాసల నిక్కర్లు తడిచేయించిన విధంబెట్టిదనిన.. నీ ఇంటికొస్త, నీ తెలగాన కొస్తా, నీ హైద్రాబాదుకొస్తా, నట్టింటికొస్తా..హీ హీ హీ
తొలగించండి"బందు వేరే రోజు ఎందుకు చెయ్యాలో నాకు అర్ధం కాలేదు." - సింపుల్.. వేలాది మంది ఉద్యోగులు సభకు వచ్చినపుడు ఇలాంటివి చేస్తే గొడవలౌతాయి కాబట్టి!
తొలగించండి"..బందు పిలుపు ఇచ్చింది అందుకే. తెలంగాణా సభలకు ప్రభుత్వం & పోలీసులు ఎన్ని అడ్డంకులు విధించారో తమరికి విదితమే." - అది మీ అనుమానం. దానికి మీరు ప్రభుత్వాన్ని ఎదుర్కోండి. కానీ సభకొచ్చిన ఉద్యోగులపై రౌడీయిజం చెయ్యడమేంటి?
"తెలంగాణా గడ్డపై జై తెలంగాణా అనడమే రెచ్చగొట్టడం అయితే, .." - సరిగ్గా ఇదే తెవాదపు రౌడీయిజానికి పునాది. ఇది సకలాంధ్రుల రాజధాని. ఆంధ్ర ప్రదేశ్ గడ్డ. తెలంగాణ గడ్డ ఆంధ్ర ప్రదేశ్ లో భాగమే -విడిపోనంతవరకూ! ఇక్కడ మీకెంత హక్కుందో నాకూ అంతే హక్కుంది. నా గడ్దపై నేను జై తెలంగాణ అనడం తప్పేంటి అన్న ప్రశ్నలో దురహంకారం ధ్వనిస్తోంది. మీరు జై కొట్టుకోవచ్చు, కానీ సమైక్యాంధ్ర సభలో జై కొట్టడం ఖచ్చితంగా రెచ్చగొట్టడమే! దురహంకారమే!! ఏం.. నా రాజధానిలో నేను సభ పెట్టుకోడాన్ని అడ్డుకోడానికి మీరెవరు?
"నేను బెదిరించిన వారిని కానీ, రాళ్ళు/చెప్పులు వేసిన వారిని సమర్తించలెదని మీరు గమనించాలి." - !!!!! మరి??? మీరు మీ వ్యాఖ్యల్లో సమర్ధిస్తున్నది ఎనరిని?
"రెచ్చగొడితే ప్రతిచర్య ఒప్పెననే వాదన సరి కాదు."- రెచ్చగొట్టేట్టు మాట్టాడి ఊరుకోలేదండి.. దాన్ని అమల్లో పెట్టారు, ఊరేగింపుపై రాళ్ళేసారు, బస్సులపై రాళ్ళేసారు, సభలో చెప్పులేసారు. దీన్ని రౌడీయిజం అంటారు నాగరిక సమాజంలో.
".. ఆ లెక్కన జయప్రకాశ్ నారాయణ్ తెలంగాణా ఉద్యమంపై అభాండాలు వేసినందుకే కొట్టానని సదరు నిందితుడు అంటే మీరూ నేనూ ఒప్పుకుంటామా?" - ఒప్పుకోం. కానీ నిందితుడైన ఆ రౌడీ డ్రైవర్ని గానీ, చెప్పిన ఏనుగును గానీ, కొట్టుండి కొడుకును అని ఎగదోసిన కతార్నాకును (’ఖ’ దులు ’క’ రాయడం, ’త’ కు దీర్ఘం ఇవ్వడం టైపాట్లు కావు) గానీ అక్కడివాళ్ళు తిరిగి కొట్టారనుకోండి, అది తప్పు కాదు అని అంటాం. ఎందుకంటే, అది రౌడీయిజానికి వ్యతిరేకంగా అప్పటికప్పుడు అసంకల్పితంగా వచ్చిన ప్రజా ప్రతిస్పందన. మొన్న సభ రోజున సీమాంధ్ర ఉద్యోగులు చేసిందదే!!
"నేను దశ దశ కార్యక్రమాన్ని దాదాపు సాంతంగా చూసాను. స్వల్ప తేడాలు మినహాయిస్తే అన్ని చోట్లా ఒకే రకంగా జరిగింది." - నేను అన్నీ కాకపోయినా, చాలా చూసాను. నేను మాత్రం చాలా తేడాలు గమనించాను. అయితే, ఇక్కడ నేను చెప్పింది నా అభిప్రాయం కాదు, ఇద్దరు మేధావుల - తెలంగాణ అనుకూలురైన మేధావుల - అభిప్రాయం మాత్రమే.
"కోట్లాది విడిపోవచ్చు కానీ కొట్లాడుతూ కలిసి ఉండలేమన్నది ప్రకృతి ధర్మం." - ఒప్పుకుంటాను. తెవాదుల దౌర్జన్యానికి, రౌడీయిజానికీ కారణం ప్రధానంగా ఇదే. ఏదోరకంగా గొడవలు పెట్టుకుని, కొట్లాటలకు దిగి సమైక్యతను దెబ్బతీయాలనేది వాళ్ళ ఉద్దేశం. అందుకే ఈ బందులు, రాళ్ళు, చెప్పులు, సభావిధ్వంస ప్రయత్నాలూ, ఈ రౌడీయిజమూ!
"సామరస్యంగా తెలంగాణా రాదనే విషయం డిసెంబర్ 10 నాదే తేలిపోయింది. అయినా తెలంగాణా వారు సంవయనంగానే ఉన్నారు." - నిజానికి తెలంగాణ ఉద్యమం డిసెంబరు ముందు వరకూ ఎంతో కొంత సంయమనంగా ఉంది - తెరాస నేతృత్వం తప్పించి. ఆ తరవాతే అది అతివాదుల పాలబడింది, సంయమనం కోల్పోతూ వస్తోంది.
"ఇదే వ్యక్తి సంక్రాంతికి ఇళ్ళకు వెళ్ళిన సీమాంధ్రులను తిరిగి వెనక్కి రానివ్వం అని కూడా బెదిరించాడు గతంలో"
రిప్లయితొలగించండిAs I remember, it was a different person.
పోలీసు యూనిఫార్మ్ వేసుకుని సభలో నిప్పుతొక్కిన కోతిలా గెంతుతూ అల్లరి చేసిన వాణ్ణి పిచ్చికుక్కని కాల్చినట్టు కాల్చి అవతలకి పడేయాల్సింది.
రిప్లయితొలగించండిఅట్టా కాల్చితె సిమాన్ద్ర వాళ్ళు ఎవ్వాల్లు మిగలరు మరి, హి హి హి
రిప్లయితొలగించండిప్రకాశం గారికీ,పక్కోడు బాగుంటే ఏడ్చి,ఏడ్చి,వాడి సొమ్ము దొబ్బేయడానికి...దోపిడీలు జరిగిపోయాయని కధలు చెప్పే మీ గుంపుకు, పోలికా?హవ్వ!!నవ్విపోదురయ్యా!!-సగటు మనిషి
రిప్లయితొలగించండి@అట్టా కాల్చితె సిమాన్ద్ర వాళ్ళు ఎవ్వాల్లు మిగలరు మరి, హి హి ...అందర్నీ కాల్చేయడమేమిటి...పిచ్చి మాటలు కాకపోతే...డ్యూటి లో ఉండి ఇలా రభస చేయడాన్ని ఉద్దేశించి...ఆగ్రహం తో అన్న తప్పుడు మాటకు...మీ మూర్ఖత్వాన్ని బయట పెట్టుకున్నారు...
రిప్లయితొలగించండిజై తెలంగాణా అనాలీ!!జై భారత్ అని కూడా అనకూడదూ!రెండో వైపు చూస్తావ్!!
రిప్లయితొలగించండిhttp://epaper.andhrajyothy.com/index.aspx?eid=172
రిప్లయితొలగించండితాలిబన్లకు జడిచి...ఉపాద్యాయుడి మరణాన్ని ఓ మూలగా వేసారు హైద్రాబాద్ ఎడిషన్ లొ,మొదటి పేజీలోనే....సీమాంధ్ర జిల్లాల్లో ఇది, మొదటి పేజీ, మధ్య భాగం లో ప్రముఖంగా ప్రచురించారు...చాలా పత్రికలు ,తెలంగాణాలో వచ్చే తమ ఎడిషన్లలో ,సీమాంధ్ర ఉద్యమాన్ని తక్కువ చేసి చూపడానికి ప్రయత్నిస్తున్నయ్....(నెట్ లో అన్ని ఎడిషన్లను చూస్తే అర్ధం అవుతూంది..తెలంగానా ఉద్యమాన్ని సీమాంధ్రలొ ఎప్పూడూ,ప్రముఖంగానే ప్రచురిస్తూ వచ్చారు..)
...అసలు చూపిస్తే...ఎక్కడ తెలంగాణా గూండాలు...నాయకులు తమను వేటాడతారో ... అన్న భయం అక్కడ ఉంది, అందరిలొనూ...ఈ ఒక్క సంఘటనా చాలు.. వీళ్ళు ఉద్యమం పేరుతో చేస్తున్న గూండాయిజం....పెద్ద వాళ్ళనూ ఎంత భయ పెడుతుందో.. చివరికీ మీడియాను భయపెట్టారంటే??...ఇది ఒక్క మాఫియాలకే...సాధ్యం ..కాదంటారా..?గుండేల పై చేయి వేసుకుని చెప్పండి?(మళ్ళీ అఫ్ఫుడు దోపీడీ లు జరిగిపోయాయ్,అన్న కహానీలు వద్దు)
@అట్టా కాల్చితె సిమాన్ద్ర వాళ్ళు ఎవ్వాల్లు మిగలరు మరి,( హి హి ...అందర్నీ కాల్చేయడమేమిటి...పిచ్చి మాటలు కాకపోతే...డ్యూటి లో ఉండి ఇలా రభస చేయడాన్ని ఉద్దేశించి...ఆగ్రహం తో అన్న తప్పుడు మాటకు...మీ మూర్ఖత్వాన్ని బయట పెట్టుకున్నారు...)
రిప్లయితొలగించండిVAAlLA PICCHA KAAMENTLU ALAANE UNTAAY...EVVAALLU MIGALARU...CHAMPESTAAM,TARIMESTAAM..kaalikee,bodi gunduki mudipette moorkhula gumpu adi..pattinchukonakkaraledu..duty lo rabhaasa chesina vaadinee...migataa vaallanee oke gaatana katte janaalu...veellu..
ఈ మానసిక వికలాంగులు సత్యవాణి గారినీ వదల్లేదు!!
రిప్లయితొలగించండి