19, సెప్టెంబర్ 2013, గురువారం

వీర శూర సీకాంగీసు నాయకులు

తప్పనిసరి పరిస్థితుల్లో రాష్ట్ర విభజనను అడ్డుకోవాల్సిన పరిస్థితి దాపురించిన సీకాంగీసు నాయకులు సోదియాను కలిసి విన్నవించుకోవాలని అనుకున్నారు. కానీ ఆమె అపాయింటుమెంటు దొరకడం లేదు. అంచేత వాళ్ళు ఆమె సెక్రెటరీ ఇంటికి వెళ్ళి, ఆమెతో తమ గోడు చెప్పుకున్నారు. ఆ ’సెక్రెటరీ’ సోదియాకు వ్యక్తిగత సహాయకురాలు - అంటే తల్లో పేలు చూట్టం, కొబ్బరినూనె రాసి తలదువ్వడం -ఇట్టాంటి పన్లు చేస్తుందన్నమాట! ఆమెకు పాపం వీళ్ల మీద జాలి కలిగి ’సర్లే, రేపు డ్యూటీకి వెళ్ళినపుడు ఆమెతో మాట్టాడతాలే’ అని అభయమిచ్చింది. మరసటిరోజు సెక్రెటరీ సోదియాతో మాట్టాడుతోంది..


సీకాంగీసు నాయకులు మిమ్మల్ని కలవాలంటున్నారు మేడం.
నేను లేను.
ఉన్నారుగా!!
లేనని చెప్పు.
ఎలాగైనా తమను కలిసే అవకాశమిమ్మని నా కాళ్ళపై పడి మీ కాళ్లనుకోమన్నారండి.
ఛత్, కలవనన్నానని చెప్పు
ఎందుకు?
ఉప్మా తినాలనుకుంటున్నాను, అందుకని.
ఉప్మా తినాలంటే కలవడం మానెయ్యాలా?
ఇప్పుడు ఉప్మా చెయ్యడం నేర్చుకుని సరిగ్గా తయారుచేసుకునేటప్పటికి ఇవ్వాళంతా పట్టేట్టుంది.
మరి రేపు రమ్మని చెప్పనా?
వద్దు.
ఏం?
రేపు పెసరట్టు తినాలనుంది.
ఎల్లుండి?
ఎహె.. ఏంటీ హింస? ఇది నా పార్టీ, వాళ్ళు నా సేవకులు. నాయిష్టం, నాకు కలవాలనిపిస్తే కలుస్తాను, లేకపోతే కలవను. వాళ్ళకు కారణాలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు.
కారణం చెప్పక్కర్లేదు, కనీసం వాళ్లకో ఎస్సెమ్మెస్సన్నా పంపిచ్చొచ్చుగా మేడం?
నా ఫోను డెడ్డైంది.

సరిగ్గా అప్పుడే అహ్మద్ పాటిల్ నుంచి ఎస్సెమ్మెస్సు వచ్చింది. రాగానే, వచ్చినట్టు మోత కూడా వచ్చింది. అది విన్న సెక్రెటరీ సాభిప్రాయంగా సోదియా వంక చూసింది. సోదియా గబుక్కున మొహం తిప్పుకుని ఆ ఎస్సెమ్మెస్సు చదువుకుంది. దాని సారాంశమిది: "నేను మీకు ఎస్సెమ్మెస్సు పంపేసానని ఆ సీకాంగీసు సన్నాసులకు చెప్పాను. ఇక మీరు ఉప్మా తిననక్కర్లేదు"

సెక్రెటరీ మళ్ళీ అందుకుంది.. ’అబద్ధం చెప్పడం ఎంత తేలికో నిజం దాచడం అంత కష్టం మేడం’.
నోర్ముయ్, నేనేం దాచడం లేదు. అయినా, ఆ సీకాంగీసు లేమైనా పోటుగాళ్ళా ఏంది? వచ్చే ఎన్నికల్లో గెలిచే మొహం ఒక్ఖటైనా ఉందా వాళ్ళలో? ఈ పుచ్చొంకాయలను కలిసేదేంటి? మా రౌలు బాబుకు కాస్తో కూస్తో సపోర్టు దొరికేది తెకాంగీసు తోటే! 
అసలు వీళ్లకి పదేసి మంత్రి పదవులు పారేసింది ఎందుకూ..నోర్మూసుకుని పడి ఉంటామని చెబితేనే గదా! ఇప్పుడేంటిది? నోరిప్పితే వాత పెడతానని చెప్పు సన్నాసులకి.

ఇక మాట్టాడ్డం అనవసరమని సెక్రెటరీ నోరు మూసుకుంది. ఆ రాత్రి సీకాంగీసు నాయకులు సెక్రెటరీ ఇంటికెళ్ళారు మళ్ళీ. ఆమె చెప్పింది, "మేడం గారు ఒబామాతో మాట్టాడుతూ ఇవ్వాళంతా బిజీగా ఉన్నారు. రేపు, ఎల్లుండి కూడా బిజీనే. ఆవలెల్లుండి ప్రయత్నించి చూద్దాంలెండి."
దీనంగా ఉన్న సీకాంగీసు నాయకుల మొహాలు ఆ చివరి మూడు మాటలతో తళుక్కున మెరిసాయి. సోదియా ఇంటి దిక్కుకు తిరిగి సాష్టాంగ ప్రణామం చేసి, మూడేసి గుంజీళ్ళు తీసి బైటికి వెళ్ళిపోయారు. వెళ్ళేముందు సెక్రెటరీతో ’మేం ఇలా దణ్ణాలు పెట్టామని, మూడేసి గుంజీళ్ళు కూడా తీసామనీ మేడంతో తప్పకుండా చెప్పమ్మా, ప్లీజ్’ అని చెప్పి మరీ వెళ్ళారు.

ఆ సాయంత్రం విలేకరులతో మాట్టాడుతూ సీకాంగీసు నాయకులు ఇలా చెప్పారు: "మేం రాష్ట్ర విభజనను వాయిదా వెయ్యగలిగాం. ఎప్పుడో నెల కిందట మొదలవ్వాల్సిన పనులు ఇంకా మొదలు కాలేదు, చూసారా? విభజనను అడ్డుకుని తీరతాం చూడండి."

తరవాత కొద్దిసేపటికే, ఢిల్లీలోనే వేరే చోట, పరాజయ్ సింగు విలేకరులతో మాట్టాడుతూ, "విభజన ప్రక్రియను దేవుడు కూడా ఆపలేడు..." అని చెప్పాడు. టీవీలో అది చూసిన సీకాంగీసు నాయకు డొకాయన ’చిచ్ఛీ, మన ఊళ్ళకు వెళ్ళే అదృష్టం ఇప్పుడప్పుడే లేనట్టే’ అంటూ తల పట్టుకున్నాడు. ఇంకొకాయన, ’పార్లమెంటు ఆఖరి సమావేశాలు కూడా అయ్యాక, ఏకంగా అన్నీ సర్దుకుని ఎల్దాంలే. ఎన్నికల తరవాత ఢిల్లీ వచ్చే పని ఎలాగూ ఉండదు’ అని గొణుక్కున్నాడు.

12 కామెంట్‌లు:

  1. ఆ కాంగీ నాయకులే వైకాపా పార్టీలోకి వెళ్ళతారు .. మళ్ళీ వాళ్ళే గెలుస్తారు ..

    మీరు ఇలా పొస్ట్లు మీద పొస్ట్లు వెయ్యాండి .. మేము కామెంట్స్ మీద కామెంట్స్ వేస్తూ వుంటాం ..

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జనాలు ఒకవేళ గజదొంగ గజన్ ని సపోర్ట్ చేస్తే ఆ పాపానికి అనుభవిస్తారు. ఆల్రెడీ YS ని గెలిపించిన పాపాన్ని అనుభవిస్తున్నారు.

      good governance + no rowdyism + no goondaism + no encrochments + good roads + responsible government offices + e - seva + srama daanam + water harvesting + electricity production + good transportation + IT + no hassles in getting fertilizers and seeds + education opportunities + security + tons of other things < FREE POWER

      That is the level of AP people. It is very difficult to strive with this kind of mind set.

      తొలగించండి
    2. "మేము కామెంట్స్ మీద కామెంట్స్ వేస్తూ వుంటాం .." - సరే, అలాగే కానీండి. ఎలాగూ మీ బ్లాగులో వ్యాఖ్యలు రాసే సౌకర్యం తీసేసారు కదా! :)

      తొలగించండి
  2. జనాలకి సిగ్గు శరం లాంటివి ఏమైనా ఉంటే ఇన్ని ఉద్యమాలు చేసిన తరువాత ఇప్పడు MLA, MP లుగా ఉన్న ఎదవలని మళ్లీ గెలిపించకూడదు. కానీ అది జరగదు. జనాలకి కూడా ఇటాలియన్ బ్రాండ్ బిస్కెట్లు కొన్ని విసరగానే కాంగ్రెస్ సంక నాకడానికి రెడీగా ఉంటారు. అలాంటప్పుడు ఇంకెందుకు తొక్కలో ఉద్యమాలు?

    ఇంత జరిగాక కొంచెమైనా జనాలకి తెలివి వచ్చి ఉంటె కుక్క బిస్కెట్ల కి ఆశ పడకుండా లోక్ సత్తా లాంటి నిజాయితీ కలిగిన పార్టీ లని గెలిపించాలి

    రిప్లయితొలగించండి
  3. జనానికి అని అందరిని కలప వద్దు, ఆ రెండు వర్గాలకు అని చెప్పు. వాళ్ల కి వారి వర్గాలే ఎప్పుడు అధికారంలో ఉండాలా, అందుకు ఎంతకు దిగజారటానికైనా రెడి. వీళ్ల అహంకారం వలననే ఈ రోజు ఈ పరిస్థితి దాపురించింది. ఎంత తక్కువగా తెలంగాణా వాదులను అంచనా వేశారు.నవ్విన నాప చేనే పండింది.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. @20 సెప్టెంబర్ 2013 8:11:00 PM IST
      ఆ రెండు వర్గాలా? ఎక్కడైనా చదివావా? ఎవరైనా చెప్పారా?

      4.3% & 6.4% ఉన్న వాళ్ళు వోట్లు వేస్తేనే వాళ్ళ వాళ్ళు అధికారం లోకి వస్తుంటే మిగిలిన వాళ్ళు ఏమి పీకుతున్నట్టు? ఇది ఒక కులానికో, ఒక వర్గానికో సంబందించినది కాదు. అన్ని కులాల వాళ్ళూ వాళ్లకి సుఖంగా ఉండేలా పర్సనల్ బెనిఫిట్స్ చేసే నాయకుడినే (?) ఎన్నుకుంటున్నారు.
      ఉదాహరణకి చంద్రబాబు ఉద్యోగులని లంచాలు తిననివ్వకుండా, టైం కి వచ్చి , బాధ్యతతో పని చేసేలా చూసాడు. దానికి కోపం తో ఉద్యోగులందరూ కలిసి (ఆయన వర్గం తో కలిపి) ఆయనకి వ్యతిరేకంగా వోటు వేసారు. చంద్రబాబు చేసింది రాష్ట్రానికి, ప్రజలకి మేలు చేసేది (ఉద్యోగులతో సహా ). కానీ ఏమి చేసారు? . అలా చేసే వాళ్ళని చేయనివ్వరు. ఇంక ఈ తొక్కలో ధర్నాలు, న్యాయం ధర్మం అని చాంతాడంత డైలాగులు ఎందుకు.
      అందుకే చెప్తున్నా. ప్రజల్లోనే మార్పు రావాలి. ఒకే పని చేస్తూ వేరే ఫలితం రావాలనుకోవడం మూర్ఖత్వం. అలాగే నీతి, నియమాలు లేకుండా ప్రజల ఆస్తుల్ని దోచుకునే నాయకులని , కుక్క బిస్కెట్ల లాగా ఏదో తాయిలం (ఫ్రీ బియ్యం, ఫ్రీగా అవినీతి లాంటివి) ఇస్తే ఎన్నుకుని వాళ్ళ నుండి మంచి ఫలితాలు ఆశించడం కూడా మూర్ఖత్వమే.
      అందుకే ఇప్పటికైనా కళ్ళు తెరిచి నీతి, నిజాయితీ తో పని చేసే లోక్ సత్తా లాంటి పార్టీ ని ఎన్నుకోవాలి. లేదు వాడు నా కులం వాడు, లేదంటే మా ఊరివాడు , లేదంటే చాలా ఫేమస్ , లేదంటే పెద్ద ఆస్తిపరుడు లాంటి క్రైటీరియా తో ఎన్నుకుంటే ఇంకో వంద ఏళ్ళయినా ఇలాగే ఉంటుంది ఆంధ్రప్రదేశ్ పరిస్థితి.

      తొలగించండి
  4. ఒకటో రెండో వర్గాల వల్ల్ కాదు ఈ సమస్య!
    ప్రతివాడు సొంతలాభం చూసుకోవడంతో ఇలా చంకనాకి పోతున్నాం!

    ఈ మధ్య కొత్థ వర్గాలు పుట్టుకొస్తున్నాయ్... విజయవాడ పరిసర ప్రాంతాల్లో లక్షలు మదుపుచేసి స్థలాలు కొనుక్కొని తెలంగాణా కోసం ఆశగా ఎదురుచూసే వర్గాలు!

    రిప్లయితొలగించండి
  5. అందరికీ నెనరులు.
    బుల్లబ్బాయ్: "..స్థలాలు కొనుక్కొని తెలంగాణా కోసం ఆశగా ఎదురుచూసే వర్గాలు!" - అవును.

    విభజన కోరేవాళ్ళకు, వద్దనేవాళ్ళకూ ఎవరి సొంత లాభాలు వాళ్ళకున్నై.

    రిప్లయితొలగించండి
  6. aaaa....antha in the lendi...thokkalo congress.....gajan lu antuu vuntaaru..repu ennikallo aa gajan ni gelipinchi mukhyamantrini chesthaaro emo naaku chaalaa bhayanga vundi ippati nunchee........

    asalu ee vudyamaalu anne andukega...lekapothe telangana meeda premaa? leka aandhraa meedaa..? annee draamaale.....Akkad moddabbay...ikkada dongabbay...managathi anthe

    రిప్లయితొలగించండి
  7. It seems division of AP is inevitable. What next for the non-telangana people. How do they work towards development.

    రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు