7, సెప్టెంబర్ 2013, శనివారం

శభాష్ ఆంధ్ర ప్రదేశ్ ఉద్యోగులూ!

శభాష్ ఆంధ్ర ప్రదేశ్ ఉద్యోగులూ!
- మహానాయకుల్లేరు. రెచ్చగొట్టే మాటల్లేవ్. వేదికపై బరువు కోసం తెచ్చుకునే వెడల్పాటి జాతీయ నాయకుల్లేరు. అక్కడున్నదల్లా ఉద్యోగులకు మాత్రమే తెలిసిన, వాళ్ల నాయకులు మాత్రమే.

- మిలియన్ల జనం వస్తారని పోసుకోలు కబుర్లు చెప్పలేదు. ఎవరైతే వస్తారని చెప్పారో, వాళ్ళే వచ్చారు, గుర్తింపు కార్డులతో సహా వచ్చారు. క్రమశిక్షణతో కూచున్నారు, చెప్పింది విన్నారు.
- ఎక్కడా విధ్వంసం లేదు, విగ్రహాలు కూల్చడాల్లేవ్. గొడవలూ లేవ్. వేలాది మంది, వందల కిలోమీటర్ల దూరాల నుంచి వచ్చి ప్రశాంతంగా సభ జరుపుకున్నారు.
- ప్రసంగించిన వాళ్ళు నమ్రతతో మాట్టాడారు. ఎవర్నీ నిందించలేదు. తిట్టడాల్లేవ్. అంతేకాదు, తమను ఉన్మాదులని నిందించిన వాళ్లను, ఎగతాళి చేసినవాళ్లను, చావగొడతామని బెదిరించినవాళ్ళనూ కూడా నిందించింది లేదు.


అదీ సభంటే. అదీ పద్ధతంటే!

-----------

తెవాదులు సభను అడ్డుకోవాలని విశ్వప్రయత్నం చేసారు. ఇదే సమయానికి ర్యాలీ నిర్వహించాలని అనుకున్నారు. ఓ పక్కన అవతలి వాళ్ళు సభ నిర్వహించుకుంటూంటే ర్యాలీ పెట్టుకోవాలనడంలోని వీళ్ళ కుట్రని, కుచ్చితాన్ని పోలీసులు గుర్తించరా? సహజంగానే పోలీసులు ఒప్పుకోలేదు. అందుకని పంతం కోసం సభను ఎలాగైనా అడ్డుకోవాలని బందు చేసారు. (అర్థరాత్రి నుంచి బందంట!!) పోలీసులు ఈ కుట్రను కూడా సాగనివ్వలేదు. ప్రశాంతంగా ఉద్యోగులు హై. చేరుకున్నారు.

నిన్నో మొన్నో టీవీలో ఒకతను మాట్టాడుతూంటే చూసాను - సినిమాల్లో విలన్ల పక్కనుండే గూండాల గుంపులోని ఓ ఆకురౌడీ లాగా ఉన్నాడు, గుండుతో - అతడంటున్నాడు..సభకు వచ్చే సీమాంధ్రులను చావగొడతాం అని. బహుశా ఉస్మానియా విద్యార్థయ్యుంటాడు. అతడన్నట్టే పొద్దున్నే హై. చేరుకుంటున్న బస్సుల మీద రాళ్ళేసారంట. బస్సులలోని ఉద్యోగులు రాళ్ళేసిన వాళ్ళను తిరిగి కొట్టారంట. సభ అయ్యాక, తిరిగి వెళ్తున్న బస్సులపై తెవాద రౌడీలు మళ్ళీ రాళ్ళ దాడులు చేసారు.
------------

మధ్యాహ్నం టీవీలో ఒక సంఘటన చూసాను..  నాగం జనార్దనరెడ్డి సభ జరిగే స్టేడియమ్ దగ్గరకు వచ్చాడు. స్టేడియమ్ బైట అతడి అనుచరులు జై తెలంగాణ అంటూ నినదించారు. అతడూ అన్నట్టున్నాడు. ఓ టీవీవాడెవడో అతడి నోట్లో మైకు పెట్టబోయాడు. సీమాంధ్ర ఉద్యమకారులు అతడికో దణ్ణం పెట్టి పంపించేసారు. ఇదే నాగం ఉస్మానియాలో తెలంగాణ ఉద్యమం జరిగే రోజుల్లో ఓ రోజు అక్కడికి వెళ్తే, కుర్రాళ్ళు చుట్టుముట్టి చితక్కొట్టారు. చెప్పుదెబ్బలాభిషేకంతో సత్కరించారు.
అదీ తేడా!
-----------

సభలో ఉద్యోగుల నాయకుడు అశోక్ బాబు మాట్టాడుతూ ’తెలంగాణ నిర్ణయం జరిగిపోయిందని, ఇప్పుడు వెనక్కిపోలేమనీ చెబుతున్నారు. ముందుకు వెళ్ళే పరిస్థితి కూడా లేదని మనం చెబుతున్నాం’ అని అన్నాడు. ’ఢిల్లీలో వివిధ పార్టీల నాయకులతో మాట్టాడాం. మీ ప్రాంత ప్రజల సమస్యలను పట్టించుకోకుండా విభజన విషయంలో ముందుకు వెళ్ళే వీలు లేదని వాళ్ళు చెప్పారు’ అని అన్నాడు. ’విభజన కారణంగా ముందుగా ఇబ్బందులు ఎదుర్కొనే వర్గాలు మూడు -విద్యార్థులు, ఆర్టీసీ ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు’ అని చెప్పాడాయన. ’సమైక్యవాదం ఇప్పుడిక ఆగేది కాదు. విభజన ఆగకపోతే, ఇక్కడ పెరేడ్ గ్రౌండ్స్ లో మిలియన్ మార్చి నిర్వహిస్తాం’ అని కూడా చెప్పాడు. విభజనకు సరైన కారణం లేదని కూడా చెప్పాడు.

డా. మిత్రా సభకు రావడం, మాట్టాడ్డం సభలో ఒక విశేషం. ఆయన ప్రసంగంలో ’ఆంధ్ర ప్రదేశ్ ఒకటే, హై. ఒక్కటే. రాష్ట్ర విభజన కుదరదని నమ్మండి.’, ’విభజన ప్రక్రియ మొదలైంది, ఇక వెనక్కు పోలేం అనే మాట అబద్ధం, ఖచ్చితంగా దాన్ని ఆపొచ్చని నమ్మండి.’ అంటూ ప్రజలకు తమ లక్ష్యం మీద ఉన్న నమ్మకాన్ని ద్విగుణీకృతం చేసే ప్రయత్నం చేసాడు. ’హై. లో మనకు రక్షణ ఇస్తామని చెబుతున్నారు. వీళ్ళెవరు మనకు రక్షణ ఇచ్చేందుకు? మనల్ని మనం రక్షించుకోగలం’ అని చెప్పాడు.

మొత్తమ్మీద, కోట్లాది ప్రజలకు స్ఫూర్తినిచ్చేలా జరిగింది సభ. సమైక్యాధ్ర ఉద్యమానికి ఈ సభ ఒక ఊపు, ఉద్యమ ప్రస్థానంలో ఒక మేలిమలుపు.

జయహో ఆంధ్ర ప్రదేశ్!!

42 కామెంట్‌లు:

  1. అదీ సభంటే. అదీ పద్ధతంటే! జయహో ఆంధ్ర ప్రదేశ్!!

    రిప్లయితొలగించండి
  2. ఎంతటి క్రమశిక్షణ అదీ ఉద్యమం అంటే. హైదరాబాదు లో సభ సక్సెస్ అవడం మన ఆంద్రప్రదేశ్ ఉద్యొగులు సాదించిన మొదటి విజయం.

    వెంకట భాస్కర్

    రిప్లయితొలగించండి
  3. భలే రాసారు .
    ఎంతైనా పద్ధతి పద్దతే ..
    ఎవడో తాగుబోతోడు రెచ్చగొడితే రెచ్చిపోయే పిచ్చి మొహాలు కావు మనవి .
    మనకంటూ ఒక ఆలోచన ఉండాలి . అవి ఉన్నాయి కాబట్టే ఆంధ్ర వాళ్ళు ఎక్కడకేల్లినా బ్రతకగలుగుతున్నారు .
    ఉంపుడు గత్తెల కోసం కట్టిన రెండు మూడు ప్యాలస్ లు, ఉర్దూ తప్ప ఏమి లేని హైదరాబాద్ . నిజాం బ్రతికుండగా హైదరాబాద్ దాటి చూడలేదు . ఇంకొకర్ని చూడనివ్వలేదు . ఆకలి తో మాడి చచ్చినా పట్టించుకోలేదు , ఇప్పుడు వాడు దేవుడు .
    నలభై సంవత్సరాల నుండి ఇక్కడ బతుకుతూ , ఇక్కడ అభివృద్ధి లో భాగం అయినవాళ్ళు పరాయి వాళ్ళు . ఉద్యోగాలు బొక్కెస్తున్నామ్. కోట్లు కోట్లు పెట్టి భూములు అమ్ముకున్న నాడు ఈ ఆంధ్రావాళ్ళు గుర్తుకు రాలేదు. ఎవడో తాగుబోతు మంత్రి పదవి రాక సొల్లు చెప్తే ఎగేసుకుని బయలుదేరారు . మెదక్ లో మంచినీళ్ళు రాకపోవడానికి శ్రీకాకుళం లో ఉన్న ఆంధ్రావాడే కారణం, వాళ్ళ MLA కారణం కాదు . ఆదిలాబాద్ కి ట్రైన్ రూట్ లేకపోవడానికి విశాకపట్నం లో ఉన్న ఆంధ్రావాడే కారణం , వాళ్ళ MLA కాదు. బుర్ర పెట్టి ఆలోచిస్తే అన్ని అర్ధం అవుతాయి .
    కొంచెం కామన్ సెన్స్ ఉండి ఉంటె, అభివృద్ధి ఉంటుంది , క్రమశిక్షణ ఉంటుంది .

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. @నిజాం బ్రతికుండగా హైదెరాబాద్ దాటి చూడలేదు, ఇంకొకర్ని చూడనివ్వలేదు...
      సరైన మాట చెప్పారు. యాక్షన్ పోలో జరిగే వరకు కూపస్థ మండూ కాళ్ళా పెరిగిన వాళ్ళు మరి.

      తొలగించండి
  4. జై తెలంగాణ అని స్లోగన్ ఇచ్చిన పోలీస్ ను కొట్టిన్రు గదా, దాని గురించి రాయలేదే చదువరీ?

    రిప్లయితొలగించండి
  5. తెలంగాణ సభలోకొచ్చి జై సమైక్యాంధ్రా అంటే కొట్టరా డింగరీ...

    రిప్లయితొలగించండి
  6. meeku teliyadaa...oka partee petti..cader petti ...organasied gaa jaripina..jaruputunna ...udyam adi...prastuta kaalaaniki aa udyamaniki cheputunna kaaranaalu...ea vidangaanoo anvayinchadaaniki kudaradu...mana pakkintodu baagunte chooda leni common man manastatvaanni kcr recchagottaadu...kullu manastatvam unna vaallu aa trap lo...dopidee jarigipoyindani...oka wave srushtinchaaru...

    రిప్లయితొలగించండి
  7. "జై తెలంగాణ అని స్లోగన్ ఇచ్చిన పోలీస్ ను కొట్టిన్రు గదా, దాని గురించి రాయలేదే చదువరీ?"

    సోదరా.., పక్కనున్నపోలీసులే వాన్ని కొట్టిన్రు.., వీడియో చూడలే..?

    రిప్లయితొలగించండి
  8. meeting ki bandobastu pani meeda vacchi...allari srushtinchina vaanni...polees paddati lonE action teesukunnaaru...tappadu...duty ki vacchi raccha cheste...pakka vaallu manodani oorukoru kadaa...veediyo choodandi...

    రిప్లయితొలగించండి
  9. duty ki vacchi jai telangaanaa ani godava chEyadamemiti?

    రిప్లయితొలగించండి
  10. పోలీస్ రక్షణ ఉంది కాబట్టి వెళ్ళగలిగారు . లేకపోతె చంపేసేవాళ్ళు వామ్మో .
    అసలే బుర్ర తక్కువ జనాలు . రెచ్చగొడితే వెనక ముందు చూసుకోకుండా ఎగేసుకుని వస్తారు .
    రేపు చుడండి, మా వాళ్ళు అమాయకులు , ఆ బస్సు లు మీద దాడి చేసింది ఆంధ్రవాల్లె అని ఒక కథ చెప్తారు .

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఎవన్ని పడితె వాన్ని NGOs employes అని చెప్పి తీసుకొచ్చి students ని రెచ్చగొడితే... ఇలాగె వుంటుది. Telangana students ని సాయుధ పొరటం వైపు మళ్ళించద్దు. మీ problems ప్రభుత్వం తొ చెర్చించుకొండి

      http://missiontelangana.com/samaikya-goodaism-slit-throat/

      ఎవడు వీడు Hyderabad నడిబొడ్డున నిజాం కాలేజి విద్యార్ధులను చూస్తూ “పీక కోస్తాం” అంటె చూస్తూ ఊరుకోవలా ??


      జై తెలంగాణ !!! జై జై తెలంగాణ !!! జై జై తెలంగాణ !!!

      తొలగించండి
    2. "Telangana students ని సాయుధ పొరటం వైపు మళ్ళించద్దు" - (హమ్మొ హమ్మొ బయమేత్తాందండి.) సాయుధ పోరాటం పేరుజెప్పి తుపాకుల్జూపిచ్చి, డబ్బులున్నోళ్ళని బెదిరిచ్చి డబ్బులు బాగానే దండుకోవచ్చంటలెండి. ఇప్పుడు ఉద్యమం పేరుజెప్పి దండుకున్నట్టే అప్పుడు సాయుధ పోరాటం పేరుజెప్పి..!! బావుంది బావుంది.

      హై. కొస్తే చావగొడతాం అని టీవీల్లో వాగిన దానికి ప్రతిగానే ఆ బెదిరింపులొచ్చాయ్. మీ ఇష్టమొచ్చినట్టు వాగడం, తూగడం కుదరదు. ఒళ్ళు దగ్గరెట్టుకోండి. నాలుకలు అదుపులో పెట్టుకోండి.

      తొలగించండి
    3. అజ్ఞాత8 సెప్టెంబర్ 2013 5:40:00 PM IST: ఓయ్ అజ్ఞాతా, సభకు ముందు మీ ఉస్మానియా రౌడీలు వాగిన వాగుడు కింది వీడియోలో 40 వ సెకను దగ్గర్నుంచి చూడు. ఆళ్ళకి ఎంత బలుపో చూడు.
      https://www.youtube.com/watch?v=SJL_5iYUMY8

      తొలగించండి
    4. కొట్టుకోవడం అంటూ మొదలయితే ఎవరికి ఎన్ని దెబ్బలు తగుల్తాయో అటుంచి, ఇక సమైక్యం హుష్ కాకి అవుతుందని గుర్తుందా?

      The logical conclusion of a war can only be division, never unity.

      తొలగించండి
    5. గాడిదగుడ్డేం గాదూ! ఈ ఉస్మానియా రౌడీల ఈపు ఇమానం మోత మోగిత్తే, ఎక్కడా డక్కడుంటాడు. రౌడీయిజం సప్పుడు గిప్పుడు లేకుండా పడుంటది. రౌడీయిజ ముండాల్సింది జైల్లో, ఆష్టల్లో గాదు.

      తొలగించండి
    6. ఉస్మానియ students వీపు విమనం మోత మోగించె దమ్మున్న ఓ బెజవాడ రౌడి!! దొంగ CM and police security సపొర్ట్ లేకుండా రా ఎవడి వీపు మోత మొగుద్దో చూసుకుందాం! ఎక్కడొ U.S లొ కూర్చొని బ్లాగుల్లొ పిచ్చి రాతలు రాయడం కాదు , సాయుద పొరాటం అంటె ఒకసారి తెలంగాణా రైతాంగ సాయుధ పొరాటం గురుంచి చదువు తెలుస్తుంది , పొరాటం అంటె ఏమిటొ. పేరు కు చదువరి వి , కొంచం కూడ విజ్ఞత లేదు. ప్రజా విముక్తి పొరాటల మీద నీకున్న పరిజ్ఞాన కి జోహర్లు!!!. ప్రపంచ విప్లవ చరిత్ర లు ఒకసారి చదువు ఆనచివేత ఎంటొ తెలుస్తుంది. పెద్దపూరం పాపల మధ్య కాలక్షేపం చేసి 'నేను మొగాడి నె' అనిపించుకొనె మీకు బ్రతుకు పొరాటల విలువేం తెలుసు. ప్రతిదాంట్లొ అవినినీతి చేసె/చూసే మీకు ప్రతి పోరాటం డబ్బులు దండుకునెందు కె అన్నట్లు కనబడుతుంది .

      భయమేస్తందా.... మీకు భయం ,సిగ్గు లజ్జ ఎక్కడివి ?? ఇక్కడి వనరుల మేద కన్నేసి, మీది కాని ప్రాంతని సోదరులం అంటూ వచ్చి ,అందినకాడి కి అప్పనంగా మింగేసి ,ఇప్పుడు దాని నే అభివృద్ది అని చూపించే మీతొ మేము ఎందుకు కలిసిఉండాలొ చెప్పు . సమ్రాజ్యవాదా పెట్టుబడిదారుల కబంద హస్తాల నుండి జన్మభూని విదిపించడాని కి 50 ఏళ్ళ గా పోరాటం చేస్తున్న ఉస్మానియా students రౌడీ లా ? పదమూడు సంవత్సరాల నుండి మలి దశ తెలంగాణ ఉద్యమం జరుగుతంటే , మీరంత ఎక్కడ ఉన్నారు , నెల రోజుల కిందనె నిద్ర లేచార?? సంవత్సరాల గా ఎందుకు చెయ్యలేదు మీ so called 'సమైఖ్యం'. మీ NGO's ఎక్కడ పడుక్కున్నారు ఇన్ని రోజులు ? ఏమిటి మీ అసలు సమస్య హైదరాబాద్ చుట్టుపక్క ల ఉన్న భూముల గురించా ?? లేదా అప్పనంగా తరలిస్తున్న నీళ్ళు చలడం లేదా ????

      తొలగించండి
    7. అంకుల్ కి ఎక్కువ, తాతలకి తక్కువా.. వాళ్ళు స్టూడెంట్సేంట్రా నీ ఎంకమ్మ.

      ఒక్కొక్కడు ఏళ్ళ తరబడి మేం కట్టిన పన్ను లని హాటల్లలో మేస్తూ పందుల్లా పెరిగారు.. ఒక్కడికీ పొట్టకోస్తే అక్షరం ముక్క వచ్చా వాళ్ళకి?

      తొలగించండి
  11. tirgi veltunna vaalla pai daadi?ikanayinaa...telangaanaa peruto jarugutunna...racchani anni paarteelu aapaka pote... janam anni paartee lani cheppulato kodataaru...kcr paartee ni mukyam gaa...vandala kotla roopaayala vyaapaaram ayipoyindi aa family ki ..vibhajana annadi..

    రిప్లయితొలగించండి
  12. Semmandra Udlogulu anandi babu Post ki kasta adrdham untundi

    రిప్లయితొలగించండి
  13. sri krishna kamitee nivedika nu charcha ku pettaali..asemblee lo...

    రిప్లయితొలగించండి
  14. lekapothe 13 jillane AP ani nuvvu oppukunnattu avuthundi ( as per CWC decision)

    రిప్లయితొలగించండి
  15. cwc evadraa?ademainaa baibillOni neeti vaakyamaa?khuraan lOni pavitra vaakyaalaa?naluguru koorchuni...gottaam paarteelu icchina lekalatO teesukunna nirnayam adi...maarcha leka povadaaniki bhagavatgeeta lOni padyamaa? mee vaikari cheppandi ani okadini okadu bad chesukuni...lekalu icchaaru.. kakka leka mingalekaa icchaaru...evadoo ...separate state anedi jarige pani kaadani telisi lekalu icchaaru..ippudu rahuul pm kaavalante mp seatlu kaavaali kaabatti..ee nirnayam teesukunnaaru...nijam gaa separate state demand lo nyaayam unte inta kaalam enduku nasa pettinchukuntaaru?appude icchi chacche vaallu!!

    రిప్లయితొలగించండి
  16. This is a big lesson to our leaders. Damn leaders are more concerned about their personal interests and political gains. They are not even cared about the people's interests.

    రిప్లయితొలగించండి
  17. @ Chadu vari:

    Semmandra Udlogulu anandi babu Post ki kasta adrdham untundi, lekapothe 13 jillane AP ani nuvvu oppukunnattu avuthundi ( as per CWC decision)

    Lst time msg came 2 def places

    రిప్లయితొలగించండి
  18. అజ్ఞాత8 సెప్టెంబర్ 2013 7:11:00 AM IST: "..13 jillane AP ani .." అలాగా.. లాజిక్కు బాగుందండి. 13 జిల్లాలతో పాటు హై. నుండి కూడా ఉద్యోగులు ఈ సభకు వచ్చారు. కాబట్టి హై. తో కూడిన ఆంధ్ర ప్రదేశ్ ను ఏర్పాటు చెయ్యాలి. ఆ మిగిలినదానికి ’మిగిలిన ఆంధ్ర ప్రదేశ్’ అనో తెలంగాణ అనో పేరు పడేస్తే సరిపోద్ది. సీడబ్ల్యూసీకి ఓ మాట చెప్పండి.

    రిప్లయితొలగించండి
  19. అసలు ఈ హైదరబాద్ మాది అనె వాల్లంతా హైదరాబాద్ పై అక్కడి ప్రజల నుంచి ప్రజాభిప్రాయ సేకరణకు సిధమేనా? హైదరబాది లొకల్స్ కి ఎవ్వరికి తెలంగాణా ఇస్టం లేదు.

    రిప్లయితొలగించండి
  20. హహహ.. బాగా వాత పెట్టారు ఈ లాజిక్ మాస్టర్స్ కి.

    రిప్లయితొలగించండి
  21. Hi Chaduvari ,
    That true i am also saying Fight for 13 Districts and Hyderabad,
    Dont't name it Samaykyandra.

    రిప్లయితొలగించండి
  22. vaadu...tv mundu kurchuni...tantaamu...tantaamu...tantaamu...antunnaa...andaroo noru moosuku kurcho vaali?
    ika telipoyindi...ilaanti vaalla demand laku raashtraalu iste desam chanka naaki potundu...
    diggoo...ee okka visual chaalu....paristhitulu elaa undabotunnaayyO....pakka vaadu kashta padi paiki vastE kadupu manata thO vaadiapi edavadame...telangaanaa vaadam?
    evadu paiki vacchinaa vaadu dopidee daarule!!andaroo tini tongunte...andaroo daridram lo unte!!manaki kallu challa badataay!!

    రిప్లయితొలగించండి
  23. నిన్నటి సభ మానసికం గా మంచి విందారగించినట్లుంది చదువరి గారూ

    రిప్లయితొలగించండి
  24. మనసున్న మారాజులు తెలంగాణా సోదరులు....వీడియో చూడండి...అపార్ధాలు వీడండి...అప్రస్తుతమైతే క్షమించండి...

    http://nuvvusetty.wordpress.com/2013/09/08/save-andhra_satyavani/

    రిప్లయితొలగించండి
  25. "రౌడీయిజం సప్పుడు గిప్పుడు లేకుండా పడుంటది. రౌడీయిజ ముండాల్సింది జైల్లో, ఆష్టల్లో గాదు"

    చదువరి గారూ, దెబ్బలు తిన్నోడు గూండాగా, కొట్టినోడు హీరోగా కనిపిస్తున్నాడా? మీ "సమన్యాయం" భేషుగ్గా ఉందండీ.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. లేదురా గొట్టిముక్కల భయ్,

      మన హరీష్ రావ్ మొగాడంటే...ఆడు కొడితే కేసు లేదు... మన పొట్టచెక్కలయ్యే రాతల్లేవు..

      ఈడ సూడరాదే!
      http://telugu.greatandhra.com/politics/sep2013/08_nen_kod.php

      మస్తు గ బజాయించలేదే?

      తొలగించండి
    2. ఒక తప్పు చేసాన్నేను.. సీమాంధ్ర ఉద్యోగులను నేను హీరోలనలేదు. ఇప్పుడు నా తప్పును సవరించుకుంటున్నాను -వాళ్ళు హీరోలే! సభను అడ్డుకోవాలని ప్రయత్నించిన తెవాదులు రౌడీలే! (ఆ సంగతి అంతరాంతరాల్లో మీకూ తెలిసే ఉంటుంది బహుశా). ఇక, నాది "సమన్యాయం" ఎందుకయిందో, అది ఎందుకు భేషైనదో ఓ టపాగా ప్రచురించాను, చూడండి.

      తొలగించండి
  26. రా... రా... విస్పోటనపు మహా కవిత్వమై
    ఓరి సమైక్యాంద్రుడా నీ తాత లు నేర్పిందేందిరా ?

    ఓ అమరజీవి నీ త్యాగ ఫలమా ఇది
    నీ వేర్పాటువాద రాజ్యమే వికటించి
    మాపై విషం చిమ్ముతుంది
    రా విగ్రహం విదిలించుకు రా ... రా ...
    ఈ విధి నుండి విడిపించుటకు

    గుర్రం జాషువా
    కవి గాంచలే, రవి అసలే గాంచలే
    కానీ ఆంధ్రుడు తెలంగానమున గాంచి
    మా గుండెలను గుర్రపు డెక్క లతో పొక్కిలి జేస్తున్నడు
    రా మా గోడు వర్ణించగ రా ... రా ... గర్జించే గళమై

    వీరేశలింగం, గురజాడ లూ
    మీ వీరులు జాడలు మరచి
    మాకు గ్రహనమై పట్టిన్లు
    రా గురజాడా గురువై రా... రా... వీరి గుణాలను మార్చేందుకు
    రా... రా... వీరేశలింగం విడుపు కాగితం విప్పించుటకు ...

    శ్రీ శ్రీ దొరా... నీ బిడ్డలకు నేర్పిందేందయ్యా ?
    తాజ్ మహల్ కు రాళ్లెత్తిన కూలీలెవరని అడిగితివే !
    మరి గోల్కొండ కు రాల్లెత్తిన కూలీలను మర్సింది నీ జాతి
    రా కదిలించుకు రా... రా... విస్పోటనపు మహా కవిత్వమై
    ద్రుతరాష్ట్రులకు కనుచూపులు మొలిపించ !

    జై తెలంగాణా జై జై తెలంగాణా

    రిప్లయితొలగించండి
  27. నిజమే నీ కోపానికి అర్ధం ఉన్నది
    వండినోనికే పెట్టకుండా
    కడుపునిండా మేసినోనివి
    ఇప్పుడద్దంటే కోపం రాదా ?

    దూపకు నీళ్లిస్తే
    చెరువులనే మింగినవాయే !
    మనోడే గదాని సనువిస్తే,
    ఎలుకోలే పొలమంతా పాడు జేస్తివి
    ఇయ్యాల ఎండ్రిన్ సల్లుత అంటే నువ్వు ఊకుంటవా ?

    సోక్కపు మాటలతో మా కొలువులల్ల
    కూసోని జబర్దస్తి చేస్తివి !
    కుర్సి ఖాళి చెయ్యమంటే
    కుదరదనక మరేమంటవ్ ?

    కాళ్ళా వేళ్ళా పడి కబ్జా చేసి
    దందాలు నడిపిస్తివి !
    నీ బాగోతం బైట పడుతదని
    భయం కాదా నీకు ?

    మా ఊరినంతా మీవోల్ల
    విగ్రహాలతో నింపేస్తివి రాజన్నా
    నిన్ను బదునాం జేస్తరంటే
    నువ్వెట్ల ఊకుంటవ్ ?

    అయినా ఎవడెట్ల పోతే నీకేంది ?
    ఎన్ని కడుపులు కాలినా ,
    ఎన్ని గర్భశోకాలనుభవించినా,
    రక్తం చెమటలా కారి సావు కు దగ్గరౌతున్నా...!
    నీకేంది ?
    పాలమూరు వలస పోతేనీకేంది ?
    సేనేత మగ్గం సిక్కిపోతే నీకేంది ?
    ఏది ఏమైనా నీ మనసు చెదరదు...!

    ఎందుకంటే ఇప్పుడు నువ్వు
    మనిషివి కాదు, నువ్విప్పుడు
    సమైక్య రంగును పులుముకున్న
    సంఘవిద్రోహశక్తివి.

    నీకు పెత్తరమాసనాడు దయ్యం పట్టిందని
    పీరీల పండక్కు పకీరు తాత
    తల్లి పీరీ ఎత్తుకొని,
    నీ తోలు ఊడగొట్టేందుకు అచ్చిండు.

    అరేయ్ మొగల్తూరు ముండాఖోర్
    మద్రాసుల మోకాళ్ళ మీద
    అంబాడింది మర్సిపోయినవా లమిడి ?

    ఒరేయ్ బెజవాడ బాడ్జె
    మీ పిట్ట గూళ్ళ ఎవ్వారం
    మాకు ఎర్క లేదన్కున్నవా బద్మాష్

    నారా వారి పల్లె నల్లికుంట్ల భాడ్కావ్
    రెండెకరాలమ్ముకచ్చి
    ఎన్ని కోట్లు ఎనకేస్కున్నవ్

    అరె లుచ్చా గాల్లారా !
    మా ఆకిట్ల ఉచ్చ పోసి,
    అదే అభివృద్ధి అంటార్రా !

    ఒరేయ్ మాక్కేలౌడే
    మంచి నీళ్ళ మూసి నదిని,
    మురికి కాలువ చేసి
    ముందుకు తీస్కపోయినం అంటార్రా బెవకుఫ్

    బరబ్బరి గిది మా తాత జాగీరే
    పట్నం మా మిండెని ఆస్తే
    మా హైదరాబాద్ ల
    నిన్నెట్ల ఉండనిస్తం రా సాలె

    ఎలుకలు సావాలంటే ఎండ్రిన్ పోసుడే
    జబర్దస్తి చేసెటోని జబ్బల్ ఇరుసుడే
    బాగోతం బైట పెట్టి , బరి గీసి తరుముడే
    ఆంద్రోడు తమ్ముడే, అడ్డొస్తే తల నరుకుడే

    నీయ్యవ్వ...
    దెబ్బకు దయ్యం వదలాలె పకీర్ తాత

    జై తెలంగాణా జై జై తెలంగాణా

    రిప్లయితొలగించండి
  28. తెలంగాణా పెద్ద బిడ్డ

    పది జిల్లాల తెలంగాణా లో హైదరాబాద్ తొలుసూరు బిడ్డ
    పాలిచ్చి పెంచుకున్నాం , ప్రాణమిచ్చి సాదుకున్నం

    ఎన్నో శతాబ్దాల కడుపు కోతను అనుభవించి
    ఎందరో నవాబుల శస్త్ర చికిత్సల తర్వాత
    పుట్టిన నా పట్నం నాది కాకుండా పోతదా ?

    కుళీకుతుబ్షా ,భాగ్మతీల భాగ్యనగరం నాదే
    ఉసేన్ సాగర్ నీరు మా చెమట చుక్కల కు ప్రతిరూపం
    మా తాత ల మాంసపు ముద్దల అందమే ఆ చార్మినార్

    కంచర్ల గోపన్న ను ఖైదీ గ బందించిన గోల్కొండ సాక్షి గా
    చతుర్ముఖి చౌ మహల్లా ప్యాలస్ సాక్షి గా
    హైదర్ అలీ , సికిందర్ షా ల సాక్షి గా
    సాలార్ జంగ్ , చార్ కామాన్
    లక్డి క పూల్ , పురాణా పూల్ చెరువుల సాక్షి గా
    హైదరాబాద్ ముమ్మాటికి తెలంగాణే

    పది నేలలున్న సీత లంకదై పోదురా
    ల్యాంకో దహనానికి తెలంగాణానుమంతులున్నారు
    రామ యుద్ధం జరగబోతోంది సూడు
    రావణాంద్రుడా ఓరి లాగడరాయపాటిగా...
    జై తెలంగాణా జై జై తెలంగాణా

    రిప్లయితొలగించండి
  29. వడ్డేపల్లి రాంప్రసాదు గారూ, ఇట్టాంటి దిక్కుమాలిన బూతు కూతల్ని అసహ్యించుకుంటాన్నేను, పైగా ఇట్టాంటి అసందర్భ పేలాపనలను బ్లాగులో చూసి చిచ్ఛీ చెండాలం అని ఛీదరించుకోడం తప్ప ఏమీ చెయ్యలేని పరిస్థితి. మీ బ్లాగులో రాసుకుంటే ఎవుడూ సూట్టం లేదు కాబోలు ఇక్కడ రాసుకున్నారు లెమ్మని ఈ ఒక్కసారికి వదిలేస్తున్నా, ఇకనుంచీ మాత్రం మీ ఏడుపులు మీ బ్లాగులోనే ఏడవండి. జాలి దయా ఉన్నవాళ్ళు తమతమ శక్తి కొద్దీ ఒకటో నాలుగో వ్యాఖ్యలను ముష్టెయ్యకపోరు. నా బ్లాగులో మాత్రం అడుక్కోకండి. ఇట్టాంటి ముష్టి పాటలు వినే ఓపికా లేదు, ముష్టెదవలకి బిచ్చమేసే తీరికా లేదు నాకు.

    చిచ్ఛీ!

    రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు