21, సెప్టెంబర్ 2013, శనివారం

ఐవీయార్ లో రాష్ట్ర విభజన

ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్సులు (ఐవీయార్) ఎక్కడబడితే అక్కడ వినిపిస్తున్నాయి యిప్పుడు. అవును మరి.. ఈ ఐవీయార్లతో ఆయా సంస్థలకు గొప్ప ప్రయోజనా లున్నాయి మరి! ఫోను చేసేవాళ్ళకు మాత్రం ఐవీయార్లు నరకం చూపిస్తాయి. ఉదాహరణ కావాలంటే ఐసీఐసీఐ బ్యాంకుకు ఫోను చేసి చూడండి..తిక్క పుట్టకపోతే నన్నడగండి.  ఒకసారి ఫోను చేసిన వాడు మళ్ళీ ఫోను చెయ్యడానికి ధైర్యం చెయ్యడు -ఎక్కడో నాలాంటి మందులు, తోలుమందులూ తప్పించి.


అంచేత, ఈ ఐవీయారు వలన ప్రయోజనమేంటంటే.. ఫోన్లు రాకుండా అరికట్టొచ్చు. ఒకవేళ వచ్చినా, ఫోను చేసినవాడికి ఏం కావాలో పట్టించుకోనక్కర్లేదు, మనకేం తెలుసో అదే చెప్పుకుపోవచ్చు. ఉదాహరణకు.., ఏపీ ఎక్సుప్రెస్సు ఎన్నింటికి వస్తుంది అని కాలరు అడగాడనుకోండి.., ఐవీయారు మాత్రం తమిళనాడు ఎక్సుప్రెస్సు పదింటికి వస్తది అని చెప్పొచ్చు, వాడేమీ అన్లేడు. బూతులు తిట్టినా ఐవీయారుకు తెలవదు. ఇన్ని ప్రయోజనాలుంటే రాజకీయ పార్టీలు వదులుకుంటాయా వాటిని? ముఖ్యంగా ఈ ఉద్యమాల కాలంలో!

రాష్ట్ర విభజన గురించి వివిధ పార్టీలు, ప్రజలూ ఏమనుకుంటున్నారో ఫోన్లు చేసి చూద్దాం.


హై. నుండి మహేందర్ రెడ్డి కాంగ్రెసు పార్టీ ఆఫీసుకు ఫోను చేసాడు.
ఐవీయారు:  సోనియా గాంధీకి జై....!  కాంగ్రెసు పార్టీకి స్వాగతం! తెలంగాణ ఇచ్చేది ఖాయం. బిల్లు పెట్టేది ఖాయం. దీన్నెవరూ అడ్డుకోలేరు. పోతే.., రాయల తెలంగాణ కావాలంటే 1 నొక్కండి. తెలకోస్తా కావాలంటే 2 నొక్కండి. తెలంగాణోత్తరాంధ్ర కావాలంటే 3 నొక్కండి. తెలంగాణ సీమ కావాలంటే 4 నొక్కండి. హైదాంధ్ర కావాలంటే 5 నొక్కండి. రాయలబాదు కావాలంటే 6 నొక్కండి. మీ దృష్టిలో వేరే కాంబినేషను ఏదైనా ఉంటే తెలుసుకోవాలనే ఆసక్తి మాకుంది.  అందుకు 7 నొక్కండి. లేకపోతే 9 నొక్కండి.

హై. తో కూడిన పదిజిల్లాల తెలంగాణ మాత్రమే ఇవ్వాలనే అంశం ఆ మెనూలో లేదు. దాని గురించి అడుగుదా మనుకుంటున్నాడు మహేందర్. అందుకని తొమ్మిది నొక్కాడు.
ఐవీయారు: హైదరాబాదు సీమాంధ్రకు కావాలంటే 1,  శాశ్వత ఉమ్మడి రాజధాని కోసం 2, రెండు ముక్కలు చేసి చెరొకటీ ఇచ్చేందుకు 3, తాత్కాలిక యూటీ చేసేందుకు 4, శాశ్వత యూటీ కోసం 5 నొక్కండి. అసలు ఎవ్వరికీ కాకుండా కేరళకో రాజస్థానుకో ఇచ్చేసేందుకు 6 నొక్కండి. మరేదైనా కావాంటే 9 నొక్కండి.

మహేందర్రెడ్డి 9 నొక్కాడు.
ఐవీయారు: ప్రస్తుతానికి ఇక్కడ ఆపుతాం. ఎన్నికల్లో మమ్మల్ని గెలిపిస్తే అప్పుడు మళ్ళీ ఆట మొదలెడదాం. 
--------------

కరీంనగర్ నుండి  రాజన్న తెదేపా ఆఫీసుకు ఫోను చేసాడు. విభజన పట్ల తెదేపా యొక్క ’ఇవ్వాళ్టి’ అభిప్రాయం ఏంటో తెలుసుకోవాలని అతడి ఉద్దేశం. ఒక రింగు కాగానే ఐవీయారు స్పందించింది.

ఐవీయారు: హలో, తెలుగుదేశం పార్టీకి స్వాగతం! విభజన కోసమైతే 1 నొక్కండి. సమైక్యత కోసం 2, విభజించి, కలపడం కోసం 3, కలిపేసి విడదీసేందుకు 4, ఆధునిక హైదరాబాదు చరిత్ర కోసం ఐదూ నొక్కండి. ఇతర విషయాల గురించైతే 9 నొక్కండి.

రాజన్న 9 నొక్కాడు
ఐ:  రాశేరె చేసిన తప్పుల గురించి తెలుసుకోడానికి ఒకటి, రోశయ్య తప్పుల కోసం రెండు, కిరణ్ తప్పుల కోసం మూడు, సోనియాను తిట్టడానికి నాలుగు, జగను ఆస్తుల కోసం ఐదు, ఇతరేతర సంగతుల కోసం తొమ్మిదీ నొక్కండి.

రాజన్న చిరాకు నణచుకోని, తొమ్మిది నొక్కాడు.
ఐ:  మీకేం కావాలో మాకు అర్థమైంది.  అది కావాలనుకుంటే క్రాడిల్ నొక్కండి.
--------------------------
గుంటూరు నుంచి సుబ్బారావు తెరాస ఆఫీసుకు ఫోను చేసాడు. తెలంగాణ ఏర్పాటు చేస్తే కోస్తా సీమలకు కలిగే నష్టాల గురించి చెప్పాలని అతడి ఉద్దేశం.

ఐవీయారు: జై త్తెలంగాణ!  నీ పేరు చెప్పి, ప్రశ్నేందో అడుగు.
తెరాస పెట్టిన ఐవీయారు మహా తెలివైంది. అది 9G (తొమ్మిదో జనరేషను) ఐవీయారు. దానికి నంబర్లు నొక్కనక్కర్లేదు, మాటలు అర్థమౌతాయి. ఫోను చేసినవాళ్ళ పేరునుబట్టి, వాళ్ళ యాసను బట్టి వాళ్ళు ఎక్కడివాళ్ళు, వాళ్ళ వయసూ, ఉద్యోగం వగైరాలను ఇట్టే పోల్చేస్తుంది.  సుబ్బారావును కూడా గుర్తు పట్టేసింది.

సుబ్బారావు:  నాపేరు సుబ్బారావు. తెలంగాణను ఏర్పాటు చేస్తే..
ఐ: చెప్పు సుబ్బారావ్, ఏమడుగుతవ్? తెలంగాణకు ఆంద్రోళ్ళు చేసిన ద్రోహం గురించి తెలుసుకోవాల్నా? తెలంగాణపై దాడి చేసిన ఆంద్రోళ్ళ గురించి ఇంటవా? ఆంద్రోళ్ళు దోపిడీ చేసిన తెలంగాణ గురించి తెలుసుకుంటవా?

సుబ్బారావు: అదికాదు, తెలంగాణను ఏర్పాటు చేస్త్..
ఐవీయారు: సుబ్బారావ్, తెలంగాణ ఏర్పడ్డాక ఆంద్ర ఉద్యోగులను ఎన్నాళ్ళలో తరిమికొడతామో, ఎట్టా తరుముతమో తెలుసుకుంటవా? ఆంద్రోళ్ళ ఆస్తులను ఎట్ట లాక్కుంటమో తెల్సుకుంటవా?


సుబ్బారావు: అదికాదు, తెలంగాణను ఏర్పాటు చేస్..
ఐ: చూడు సుబ్బారావ్, ఇప్పటిదాకా మేం చెప్పినవి తప్ప ఈ లోకంలో ఇంకేమీ లేవు. అయినా నీకు వేరే ప్రశ్నలొస్తున్నయంటే నీకు దమాకు లేదన్నమాట! ఫోను పెట్టెయ్ రా సాలె.
-----------

విశాఖ నుంచి శ్రీనివాసు సీమాంధ్ర కాంగ్రెసు ఎంపీల సమన్వయ ఫోరానికి ఫోను చేసాడు. ఈ సంఘంలో ఇరవైమంది దాకా ఎంపీలుండటాన ఇరవై రెళ్ళు -నలభై అభిప్రాయాలున్నై, రాష్ట్ర విభజన మీద. అంచేతే ఐవీయారును కూడా తెలివిగా పెట్టారు.

ఐవీయారు: నమస్కారం. విభజన జరగదు! విభజన జరగదు!! విభజన జరగదు!!! రాష్ట్ర విభజన అనేది జరిగే పని కాదు. ఒకవేళ ఎవరైనా అనుకున్నా, మేం వాయిదా వేయిస్తాం. ఒకవేళ మామాట వినకుండా విభజన మొదలైపోతే మేం రాజీనామాల్జేసి పారేస్తాం. మళ్ళీ ఎన్నికల్లో గెల్చేసి విభజనను అడ్డుకుంటాం. అప్పటిదాకా మీరు కూడా మాలాగే తడిగుడ్డేసుకుని పొడుకోండి. కాదూ కూడదూ.. ఏదో ఒకటి నొక్కాల్సిందే అని అనుకుంటన్నారా? సరే.. ఏం నొక్కుతారో నొక్కుకోండి.

అదేదో సినిమాలో కోట శ్రీనివాసరావు లాగా ’నీ పీక నొక్కుతా’ అని అనుకున్నాడు శ్రీనివాసు. అదెలాగూ చెయ్యలేడు కాబట్టి, 1 నొక్కాడు.
ఐవీయారు: మీరు రాంగునంబరు నొక్కారు. మళ్ళీ ప్రయత్నించండి.
ఈసారి 2 నొక్కాడు. 
ఐవీయారు: మీరు రాంగునంబరు నొక్కారు. మళ్ళీ ప్రయత్నించండి.
వరసపెట్టి అన్ని అంకెలూ నొక్కాడు. అన్ని సార్లూ మీరు రాంగునంబరు నొక్కారు. మళ్ళీ ప్రయత్నించండి. అనే చెప్పింది.

అసలీ ఎంపీలంతా రాంగునంబర్లే అని శ్రీనివాసు కర్థమైంది.
-------------

తిరుపతి నుంచి మునిరత్నం తెబ్లాదికి ఫోను చేసాడు. తెబ్లాది అంటే తెవాద బ్లాగర్ల జాక్ లెండి. వాళ్ళూ ఐవీయారొకటి పెట్టించుకున్నారు.

ఐవీయారు: జై త్తెలంగాణ! సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ఎగతాళి చెయ్యడానికి 1, ఏయే ఊళ్ళలో సమైక్య ఉద్యమానికి ఎంత తక్కువమంది జనం వచ్చారో తెలుసుకోడానికి 2, ఆ ఉద్యమంలో ఏ యే వయసుల వాళ్ళు ఎంతమంది పాల్గొంటున్నారో తెలుసుకోడానికి 3, పరీక్షల కోసం ఎంతో కష్టపడి చదూకుంటున్న మా అమాయక ఉస్మానియా పసిపిల్లలపై హాస్టల్లోకి వెళ్ళి మరీ సమైక్య ఉద్యమకారులు చేసిన రౌడీయిజం గురించి వినాలంటే 4 నొక్కండి. వేరే ఏదైనా కావాలంటే 9 నొక్కండి.

మునిరత్నానికి సమైక్య ఉద్యమం గురించి తన వెర్షను చెప్పాలని ఆశగా ఉంది. అంచేత 9 నొక్కాడు.
ఐవీయారు: 9 నొక్కిన్రా! దొరికారు!! ఇక వినండి... బెజవాడలో నిన్న జరిగిన సభకు అసలు జనమే రాలేదు తెలుసా. స్వయంగా మా ప్రతినిధి అక్కడి నుంచి రిపోర్టింగు చేసాడు. మావాళ్ళు అస్సలు అబద్ధాలాడరని మీకు తెలిసే ఉంటది. అన్నట్టు, సరిగ్గా అదే సమయానికి మా ప్రతినిధి గారి బావమరిది గారి అబ్బాయి పుట్టినరోజు పండగ జరిగింది. దానికి కోస్తా యావత్తూ నుంచి జనం వచ్చారు. ఆ ఫొటో ఇవ్వాళ ఆంధ్రజ్యోతి మొదటి పేజీలో వచ్చింది, చూడండి. సమైక్య ఉద్యమం కంటే మావాళ్ళ పుట్టిన్రోజుకే ఎక్కువ మంది జనం వచ్చారని రుజువైపోయింది. జై! జై!!

మునిరత్నానికి ఇంకేమీ నొక్కే అవకాశం లేకుండా ఫోను కట్టైంది.
---------------

అమెరికా నుంచి అప్పల్నాయుడు సీసీబ్లాదికి ఫోను చేసాడు. సీసీబ్లాది అంటే.. సీమాంధ్రులను విమర్శిస్తూ, తెవాదులను హత్తుకునే సీమాంధ్ర బ్లాగర్ల జాక్!
ఐవీయారు: నమస్కారం, నై సమైక్యాంధ్ర! మా సంస్థకో ప్రత్యేకత ఉంది. ఫోన్లో మీకు మేమేమీ చెప్పం. మీరు చెప్పినవే మేం వింటాం. మీరు మా సీమాంధ్రులను మెచ్చుకుంటే మేం వినం, ఫోను పెట్టేస్తాం. మా సీమాంధ్రుల్ని, మావాళ్ల ఉద్యమాన్నీ, మావాళ్ళ కోరికల్నీ, భాషనీ, కవుల్నీ, వైతాళికుల్నీ విమర్శిస్తేనే మేం వింటాం.

ఇక మా మెనూ వినండి:  సమైక్య వాదాన్ని తిట్టేందుకు 1 నొక్కండి. ఉద్యమాన్ని తిట్టేందుకు 2, బూతు కవితలు వినిపించేందుకు 3, తెవాదులను మెచ్చుకునేందుకు 4, తెలంగాణ ఉద్యమకారులు ఎంత గొప్పవారో, కోస్తా సీమల ఉద్యమకారులు ఎంత సన్నాసులో పక్కపక్కనే పెట్టి ఎగతాళి చేసేందుకు 5 నొక్కండి.

ఇంకా ఏదో చెబుతోందిగానీ, అప్పల్నాయుడు విరక్తిగా ఫోను పెట్టేసాడు.

14 కామెంట్‌లు:

  1. చాలా రోజుల తర్వాత ఇలా అందరినీ వివక్ష లేకుండా చాకి రేవెట్టడం చదువుతున్నా! :-)

    సీమాంధ్ర ఎంపీ లంతా రాంగ్ నంబర్లని ఈ సందర్భంగా అయినా చాలా మంది ప్రజలు గ్రహించే అవకాశం ఇచ్చినందుకు కె సి ఆర్ కి థాంక్స్

    రిప్లయితొలగించండి
  2. కొందరు సీమాంధ్రుల బ్లాగుల్లో తెలంగాణ ఉద్యమాన్ని పొగుడుతు, సమైక్య ఉద్యమాన్ని చులకన చెయ్యటం చదువుతుంటే అప్పల్నాయుడి లాగా విరక్తి కలుగుతు ఉంటుంది. వారి గురించి బాగా రాశారు.

    రిప్లయితొలగించండి
  3. Very sharp criticism. My pick is the one on సీమాంధ్ర కాంగ్రెసు ఎంపీల.

    రిప్లయితొలగించండి
  4. no words. excellent.

    (మీరన్నీ కతలే చెప్తరు. మెం చెప్పిందే నిజం. మీవన్నీ అభదాలే. అంటారంతే ఈ సీసీబ్లాది,తెబ్లాది. వాళ్ళు.)

    రిప్లయితొలగించండి
  5. మీకు బతుకమ్మ ఆట వచ్చా?రానప్పుడు బ్లాగు లో రాసే అర్హత లేదు!మాట్లాడే హక్కు లేదు!జీవించే హక్కు లేదు!తెలుగువాడు గా ఉండే హక్కు లేదు!మీరు మనుష్యులే కాదు!పైగా మీరు మేం ఎప్పుడూ ప్రాణంగా,మరో ఆలోచన లెకుండా,ప్రపంచమంతా ఎటు వెళ్తున్నా, వాస్తవాలతో సంబందం లేకుండా,యుగాలుగా మాకు దిన చర్యగా మారిన ఉద్యమానికి ద్రోహి గా కూడా ప్రకటిస్తున్నాం!మోసపు మాటలతో,రెచగొట్టుడే ఊపిరిగా జీవించే పార్టీలతో మేం ఈ ఆటా,పాటా ముందుకు తీసుకు పోయి,ప్రపంచంలో నెంబర్ వన్ గా ఈ దేశాన్ని నిలబెట్టి ,మీ లాంటి వారికి తగిన గుణపాటం నేర్పుతాం!!ఢమకు డమా..ఢమకు ఢమా..ఢముకు ఢమా..ఢం..ఢం..జై భారత్!!

    రిప్లయితొలగించండి
  6. సత్యవాణి గారు..దేశపతి శ్రీనివాస్ గారి వీడియో చూడండి...ఒక్క నిమషం సహనంతో కూర్చో లేక అసహనం తో ఉన్న ఆయన తెలంగాణా పేరుతో మూర్ఖపు సిద్ధాంతాలతో...ఫిక్స్డ్ అభిప్రాయాలతో,కనీసం కనీసం అవతలి వాళ్ళ వాదన వినాలన్న ఆలోచనలేకుండా..విడిపోతే ఉద్యో గాలొచ్చ్హేస్తాయ్..అన్న ఆలోచనె తప్ప మరొకటి కనబడ్డం లేదు.. పైగా అవతలి వారి పై, పేరు సరీగ్గా పలక లేదు లాంటి పిచ్చి విమర్శలె తప్ప..ఈ విషయంలో సీమాంధ్రులను అభినందించాల్సిందే...ఇక్కడ...ఆటోలు నడుపు కుంటూ...కిళ్ళీ బడ్డీలు పెట్టుకుని,చిన్న చిన్న హోటళ్ళు..కాకా హోటళ్ళు అంటారు..నడుపుకుంటూ...బాంకుల దగ్గర టీలు సప్లై చేస్తూ..ప్రైవేట్ అఫీసుల దగ్గర...చిన్న చిన్న పనులు చేసుకుంటూ...రోజుకు యాభై,వంద రూపాయలు సంపాదించుకుంటూ జీవితాల్ని నెట్టుకు వస్తున్నారు తప్పా...ఇలా దశాబ్దాలు తర బడి గవర్నమెంట్ ఉద్యో గాలే టార్గెట్ చేసుకుని...నానా యాగీ చేయడం లేదు..ఎప్పుడో ఇరవై ముప్పై ఏళ్ళ క్రితం మేం పుట్టకు మునుపు జరిగి ఉన్నాయ్యేమో..ఈ ఉద్యోగాలకు సంబందించి ఉన్న అపోహలను,అశోక బాబు మెన్నో ఇంటర్యూ లొ విడ మరిచి చెప్పారు కూడా...తప్పుడు ప్రచారాలను పట్టించుకోక పోవడం..వెను వెంటనె వాస్తవ గణాంకాలు బయట పెట్టక...విషయాన్ని తేలిక గా తీసుకోవడం వల్లనె...ఈ రోజు ఈ పరిస్థితి..

    రిప్లయితొలగించండి
  7. బతుకమ్మ పండుగకు శుభ్హాకాంక్షలు తెలపని మైక్రోసాఫ్ట్ సంస్థను హైద్రాబాద్ నుంచి బహిష్కరించాలి..
    http://www.youtube.com/watch?v=CDIw_fDUGLI#t=681

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. anni bahiska rinchandi Andrulani Rayalashimani kampinilani manchi thananni jaali hrudayanni manavatwanni total bahiska rinchandi

      తొలగించండి
  8. తెబ్లాది హైద్రాబాద్ ఆఫీస్ నుంచి సీనియర్ రిపోర్టర్ కు ఫోను వెళ్లింది. చూడు, వచ్చే నెలలో నెల్లూరులో పెట్తబోయే సభకు చాల తక్కువ మంది జనం వచ్చారు, చిన్నపిల్లలు ఎంతమంది, వాటి ఫొటోలు వగైరాలతో రిపోర్ట్ ఇంకా పంపలేదు ఏంటి? సభ కోసం ఇంకా పది రోజులు కూడా టైమ్ లేదు. IVR లో మొత్తం రిపోర్ట్ నంతా ఎక్కించటానికి ఈ టైమ్ సరిపోదురా బయ్! వెంటనే పంపించు. జై!

    నెట్లో వెతికి సూటబుల్ ఫొటోలు డౌన్లోడ్ చెయ్యటానికి చాల టైమ్ పట్టింది. ఇవ్వాళ పంపిస్తాన్లే! కాని మన రిపోర్ట్ల గురించి బ్లాగుల్లో నిజాలు తెలిసిపోయినయ్ బయ్, అందుకని జనం బాగానే వచ్చారని రిపోర్ట్ రాస్తాను సరేనా? జై జై!!

    ఏమి అక్కరలేదు. పదిసార్లు అబద్ధం చెప్తే అదే నిజమై పోద్దిరా బై. ఇంత మొహమాటం పనికిరాదు నీకు. వెంటనే రిపోర్త్ పంపు. జై!

    అలాగే, జై జై!

    రిప్లయితొలగించండి
  9. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు