3, అక్టోబర్ 2011, సోమవారం

ప్రజలపై తెవాదుల రాళ్లదాడులు

సకల జనుల సమ్మె పేరుతో మొదలైన సమ్మె ఇవ్వాళ రాళ్ళదాడికి చేరింది. విజయవాడ నుంచి హై. కు వస్తున్న బస్సులపై తెవాద మూకలు రాళ్ళేసి కొట్టాయి.పదికి పైగా బస్సుల అద్దాలు పగిలాయి. ప్రయాణీకులకు కూడా రాళ్ళ దెబ్బలు తగిలాయి. తెల్లారేటప్పటికి హై. చేరుకోవాల్సిన ప్రజలు మధ్యాహ్నం తరవాత చేరుకున్నారు. ఉద్యమాన్ని "మిలిటెంటు అహింస" వైపు  నడవమని తమ నాయకుడు కోదండరామ్ చెప్పాడు గదా.. ఇట్టాగే ఉంటాయి వాళ్ళ చేతలు!

ఈ రౌడీ మూకల దాడిని తెవాదులు సమర్ధించుకుంటున్న తీరును గమనించాలి. సింగరేణి కార్మికుల చేత సమ్మె చేయించింది వీళ్ళు. ఉన్న బొగ్గు కూడా రవాణా కానీకుండా అడ్డుకున్నదీ వీళ్ళే. తీరా ఇప్పుడు పొలాలకు ఇచ్చేందుకు కరెంటు లేకపోతే, కరెంటు ఇవ్వకపోడానికి కారణం ప్రభుత్వమేననీ, అందుకు కిరణ్ కుమారే బాధ్యత వహించాలనీ ఈ తెవాదులు మొండి వాదన చేస్తున్నారు. ఇలాంటి అడ్డగోలు వాదనలు చెయ్యడం మొదటినుంచీ వీళ్ళకున్న అలవాటే.

ఆ అలవాటు చొప్పునే ఇవ్వాళ బస్సుల పైన చేసిన దాడిని కూడా సమర్ధించుకున్నారు. వాళ్ళ సమర్ధనలు ఇలా ఉన్నాయి:
  • ఏదో నాలుగు బస్సులపై రాళ్ళేసారంతే.. దాన్ని టీవీలవాళ్ళు భూతద్దంలో చూపిస్తున్నారు అని ఒకాయన అన్నాడు.
  • ’ఉద్యమం జరుగుతున్నది కాబట్టి, కోస్తా సీమల ప్రజలు హైదరాబాదు రాకండి’ అని మరొకతడు అన్నాడు. 
  • ఇంకొకాయన, ఆర్టీసీ కార్మికులు సమ్మెలో ఉండగా,  ప్రైవేటు బస్సులు వేసి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తే  ప్రజల్లో వ్యతిరేకత కలగదా అని అన్నాడు. ఇదే వ్యక్తి ’సింగరేణి సమ్మె జరుగుతుందని నెల రోజుల ముందే చెప్పాం.. మరి కరెంటు కోసం ప్రత్యామ్న్యాయ ఏర్పాట్లు చేసుకోవద్దా’ అని అంతకు ముందే అన్నాడు. తెవాదుల అడ్డగోలు, వితండవాదానికి ఇది మచ్చుతునక. 

ఇంతకీ.. రాళ్ళు వెయ్యడం తప్పని ఒక్కడు కూడా చెప్పలేదు. రాళ్ళు వేసిన వాళ్లని విమర్శించలేదు. అందరూ ప్రభుత్వాన్ని విమర్శించినవాళ్ళే. సురేశ్ అని పౌరహక్కుల సంఘ కార్యదర్శి అంట,  అతడు వాళ్ళను రాళ్ళేసే పరిస్థితికి తీసుకొచ్చిన ప్రభుత్వాలది తప్పని అన్నాడు. పౌరహక్కులనేవి సమ్మె చేసేవాడికే గానీ, సామాన్యుడికి ఉండవని ఈ పౌరహక్కుల కార్యదర్శి భావన కాబోలు! లేక, కోస్తా సీమల వాళ్ళకు ఆ హక్కులు ఉండవో.. !


సమ్మె చెయ్యడం తమ హక్కు అని భావించేవాడు ఆ సమ్మె వలన ప్రజలకు కలిగే ఇబ్బందులకు బాధ్యత కూడా తీసుకోగలగాలి. కానీ ఈ తెవాదులు సమ్మె చేసే తమ హక్కును మాత్రమే గుర్తిస్తున్నారు, ఎలుగెత్తి చాటుతున్నారు. దాని వలన కలిగే ఇబ్బందులకు బాధ్యత మాత్రం తీసుకోవడం లేదు, ప్రభుత్వాన్ని దోషిగా నిలబెడుతున్నారు. టీవీల ముందుకు వచ్చి తమ వెకిలి వాదనను ప్రజల చేత నమ్మించ జూస్తున్నారు.

కోస్తా సీమల సామాన్యులపై మాకు వ్యతిరేకత లేదు అని చెబుతూ ఉంటారు  తెవాదులు. కానీ ఇప్పుడు రాళ్ళేస్తున్నది, ఆ సామాన్యులపైనే కదా! మరి ఈ దాడులు చేసినవాళ్ళను ఎందుకు తప్పు బట్టరు?

ఇది సకల జనుల సమ్మె కాదు. సకల జనులపై సమ్మెట దెబ్బ. సకల జనుల సజల కనులకు కారణం ఉద్యమ నేతలే. వాళ్ళే  ఈ దాడులకు బాధ్యత తీసుకోవాలి, ఇకపై జరక్కుండా ఆపాలి.

28 కామెంట్‌లు:

  1. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  2. ప్రభుత్వమే బాద్యత వహించాలని మీరు విమర్శించిన సందర్భాలు కొకల్లలు ..

    రిప్లయితొలగించండి
  3. my point:
    ఈ పరిస్థితులకు తెలంగాన ప్రజలు మాత్రమే కాదు, ప్రతి తెలుగు వాడూ బాద్యత వహించాలి.

    సమస్య జటిలమైనది. తెలంగానకు వ్యతిరేకంగా మాట్లాడితే తెలంగాన వాడు కూడా క్షేమంగా తిరిగే పరిస్థుతులు లేవిప్పుడు. లోకల్స్ దాడులు చేసేది వేరే చోటనుంచి బస్సులు, వాహనల మీదే. ఇన్ని రోజులు ఓపిక పట్టారంటే గ్రేటే.

    రిప్లయితొలగించండి
  4. గ్రేట్! నైతికంగా పతనమైన ఉజ్జమం 'గ్రేట్'! ఈ ఎదవలు రాజ్‌ఘాట్ మీద రాళ్ళేయకపోవడం 'గ్రేటే'!

    వుజ్జమం 'సరైన దిశ'లోనే సాగుతోంది అని నా అభిప్రాయం. వుజ్జమానికి తగిన పరిష్కారం కూడా త్వరలోనే ఉన్నట్టు అనిపిస్తోంది.

    రిప్లయితొలగించండి
  5. a2zdreams: "ప్రభుత్వమే బాద్యత వహించాలని మీరు విమర్శించిన సందర్భాలు కొకల్లలు" - విషయాన్ని అర్థం చేసుకోడంలో మీరు మళ్ళీ పప్పులో కాలేసారు. ప్రభుత్వానికి బాధ్యత లేదని నేను అనలేదు. మాకేం బాధ్యత లేదని తెవాదులు అనడం గురించి నేను రాసాను.
    "తెలంగానకు వ్యతిరేకంగా మాట్లాడితే తెలంగాన వాడు కూడా క్షేమంగా తిరిగే పరిస్థుతులు లేవిప్పుడు." - ఇప్పుడు కాదండీ.. ఏనాడూ లేవు ఆ పరిస్థితులు.
    "ఇన్ని రోజులు ఓపిక పట్టారంటే గ్రేటే" - ఓపిక పట్టారా.. ఎప్పుడూ? విగ్రహాలు కూలగొట్టిన సంగతి మీకు తెలవదనుకుంటాను. టీవీ చర్చల్లో ఎదటోణ్ణి కొట్టిన సంగతి, జేపీని కొట్టిన సంగతీ మీరు తెలవదుగామోసు. ఇక బూతుల సంగతి సరేసరి! ఇక వాళ్ళు ఓపిక పట్టిందెక్కడ? అది సర్లెండి.. వాళ్ళు గ్రేటు అవునో కాదోగానీ, తమను ఎనకేసుకొచ్చే వాళ్లకంటే మాత్రం వాళ్ళే నయం! ఎంచేతంటే తెవాదుల దాడి ఎదురుగా కనబడుతూంటుంది, ఎనకుండి ఎగదోసే బాపతు కాదు.

    రిప్లయితొలగించండి
  6. ఏంవయా మీరు. అంత తొందరెందుకు మీకు? అరె ఖండించే టైముకూడా వాళ్ళకివ్వకుండా మీరిక్కడ గోల చెస్తారేంది? ఇవ్వాళో రేపో ఉద్యమ నాయకత్వం దీన్ని ఖండించకుండావుంటదా? కోదండరాము సారు ఎందుకిలా జరిగిందో జనాలకు వివరించకుండా వుంటారా? ఈలోగా మీరు తొందరపడతారేంది?

    రిప్లయితొలగించండి
  7. /ప్రభుత్వమే బాద్యత వహించాలని మీరు విమర్శించిన సందర్భాలు కొకల్లలు .. /

    గాడ్సే మర్డర్ చేసాడు. So, మనమూ మర్డర్ లు చేయచ్చు.
    రజాకర్లు దోపిడీ లు చేసేవారు. So, మనమూ దోపిడీ లు చేయచ్చు.
    రజాకర్లు నేకెడ్ బతుకమ్మలు ఆడించేవారు. So, మనమూ ఆడించొచ్చు.
    రజాకర్లు గాంగ్ రేపులు చెసేవారు.....

    రిప్లయితొలగించండి
  8. కోదండరామ్ కీ, కేసీయార్ కీ సింగరేణిలో పలుకుబడేమీ లేదు. వాళ్ళ మాట మీద వీళ్లు సమ్మె చేయడం లేదు. సింగరేణి కార్మికుల సమ్మె వెనక మావోయిస్టులున్నారు. మావోయిస్టుల వెనక చైనా ఉంది. చైనా వెనక పశుపతి టు తిరుపతి ప్రాజెక్ట్ ఉంది. ప్రత్యేక తెలంగాణ ఏర్పడాలని మావోయిస్టులు (అన్నిప్రాంతాలవాళ్ళూ) బలంగా కోరుకుంటున్నారు. తద్ద్వారా ఆంధ్రా పెట్టుబడిదారుల్నీ, సీమ ఫ్యాక్షనిస్టుల్నీ తెలంగాణకి దూరం చేసి తమ పాత ఆశ్రయమైన తెలంగాణలో ఒక మావోయిస్టు కంచుకోటని సృష్టిస్తామని వాళ్ళు కలలు కంటున్నారు.

    రిప్లయితొలగించండి
  9. తాడేపల్లిగారూ..! బాగా చెప్పారు..
    నాక్కూడా మొదట్నుంచీ ఈ "తెలంగాణ ఉద్యమం" వెనుక చైనా ఉందేమోనన్న అనుమానం ఉంది.. దానికి సంబంధించిన వార్తలు.."2009 లో కే.సి.ఆర్‌ నిరాహార దీక్ష"కి ముందు చదివినట్టు గుర్తు..! "చైనా" సౌకర్యం కోసం "భారతదేశాన్ని 30 లేదా 40 దేశాలు"గా విభజించాలని, అక్కడి అధికార పార్టీ పేపర్లో వచ్చిందని విన్నాను. అయితే, ఖచ్చితంగా ఇదీ అని చెప్పలేను..! మీకు వివరాలు తెలిస్తే, మాక్కూడా చెప్పగలరు.

    రిప్లయితొలగించండి
  10. వివరాలు చెప్పను గానీ ఎవడు తీసిన గోతిలో వాడే పడతాడు. వచ్చే సంవత్సరం చూడండి తమాషా !

    రిప్లయితొలగించండి
  11. వివరాలు చెప్పను గానీ ఎవడు తీసిన గోతిలో వాడే పడతాడు. వచ్చే సంవత్సరం చూడండి తమాషా !

    రిప్లయితొలగించండి
  12. మావూరి బస్సొచ్చి నాతో కన్నీళ్ళు పెట్టుకుంది!!.. నీ
    మా ఊరంటే బస్సే గుర్తొస్తుంది..!

    చదువుకోటానికి నానా అగచాట్లు పడేప్పుడు
    ఫ్రీ-పాసులిచ్చి పదికిలోమీటర్లు పట్టుకెళ్ళి,
    అక్షరాలు నేర్పిన "అదే"గుర్తొస్తుంది.

    పొలంలో కోటేరుని,
    కొణిజర్లలో స్మసానం లో తగలబడుతున్న శవాన్ని..
    ఒళ్ళోకూర్చోబెట్టుకుని కళ్ళారా చూపిచ్చిన బస్సు గుర్తొస్తుంది.!
    కిటికీకి గడ్డం ఆనిచ్చిన చిన్నతనం,
    సీటెనుక పదేళ్ళప్పుడు రాసిన కవిత్వం గుర్తొస్తుంది.!

    బస్సంటే నన్ను చంకనెత్తుకున్న్న అవ్వ,
    బస్సంటే నావరకు గోరుముద్దలు తినిపించిన అమ్మ!

    మా ఊరి మోటుజనపు నేలవిమానం బస్సు

    ఎవడో చుట్టంగాడి పెళ్ళికి అందరూ..
    చిన్నకార్లలొ,మోటారుసైకిల్లలో వస్తే..
    మా గరీబు నాన్న ఎక్కించిన ఎర్రబస్సు గొప్పగా గుర్తొస్తంది !

    ఎదో పనిమీదెళ్తే..
    దిల్-సుఖ్-నగర్ రోడ్డుమీద మా బస్సు కనిపిస్తే
    ఎదురెళ్ళి ముఖం మీద ముద్దుపెట్టుకోబుద్దయ్యేది,
    ఒక పాత స్నేహితుణ్ణి చూసినట్టో..
    ఏదో విషాదం గుండె అడుగునుంచి కారుతున్నట్టొ వుండేది!

    * * *
    ఎవడో చదువుకున్నోడట బస్సుని రాళ్ళతో బద్దలు కొడుతున్నాడు!
    కసాయిలా కిరసనాయులు పోసి కాల్చేస్తునాడు!
    ఎవడొ.. దయామయి బస్సుని ధ్వంసం చేస్తున్నాడు!

    ఇప్పుడెందుకో బస్సుకి గొంతుంటే బాగుండనిపిస్తుంది నాకు!

    మావూరి మట్టిరోడ్డుమీద బస్సుపోతున్నట్లు
    నా ముఖం మీద కన్నీళ్ళు పోతున్నాయి

    తగలబడుతున్న బస్సుల మధ్య కూలబడి
    విజ్ఞానులనే అజ్ఞానుల ఉన్మాదాన్ని వార్తలు చేసుకుంటున్నా..,

    అయినా సరె..
    కారుతున్న నా కన్నీళ్ళని సీసాలో పట్టుంచా..
    తిలక్ ఓసారి ఇలావచ్చి తగలబడుతున్న బస్సుమీద పోసెళ్ళు..

    ఇంతకుముండె..
    మావూరి బస్సొచ్చి నాతో కన్నీళ్ళు పెట్టుకుంది!!

    ...... నీ

    (నకిరేకల్ వద్ద బస్ లపై రాళ్లు విసిరి అద్దాలు పగులకొట్టి , హైదరాబాద్ లో బస్సులను తగలబెడుతున్న విద్యార్ధి ఉద్యమకారులకి, మేధావులకి.. ఉద్యమస్పూర్తితో...అంకితం)

    రిప్లయితొలగించండి
  13. సీ ఎం రాజకీయం ఆలోచిస్తే ప్రజలు ఆగుతరా? రాళ్ళేస్తేనే కదా కరెంటిస్తం అని హామీ వచ్చింది మరి? మావోళ్ళు పాపం కరెంట్ లేదని 70వేలు పెట్టి డీజిల్ ఇంజను + డైనమో కొన్నరు.. ఏదో పెట్టగలిగేటోడు పెడ్తడు.. పైసల్ లేనోడు ఏం చేస్తడు... ఎవడో సమ్మె చేస్తే నాకు కరెంట్ ఎందుకు ఆపుతవ్ ర అని బస్సులాపక, రాళ్ళెయ్యక ముద్దు పెట్టుకుంటడా ? ప్రత్యామ్నాయాలు చూడనోడు సీఏం ఎట్లైతడు.. గుడ్డిగ ఉద్యమాన్ని విమర్శించే ముసుగులో ee హక్కుల పోరాటాన్ని తప్పు పట్టే నీలాంటోడిని ఎట్లా నమ్మమంటవ్ ?

    రిప్లయితొలగించండి
  14. కాయ: రాళ్ళేసింది మామూలు జనం అని నువ్వంటున్నావ్, కాదు, వాళ్ళు తెవాద రౌడీ బాచ్చి అని నేనంటున్నాను.

    నువ్వన్నదే రైటైతే.. ఆ ఎయ్యాల్సిన రాళ్ళు అబద్ధాలకోరులైన ఉద్యమ కారులమీద వేస్తే, మీవాళ్లకి రాళ్ళెయ్యాల్సిన ఖర్మ తప్పేది కాదు. రాష్ట్రాన్ని చీకట్లలోకి నెడతాం అని ప్రకటించి మరీ సమ్మెకు దిగినపుడే తెలివి తెచ్చుకుని ఉంటే మీవాళ్ళకి ఆ డెబ్బై వేలు ఖర్చు పెట్టుకోవాల్సిన ఖర్మ పట్టేది కాదు.

    పోతే, ఆ రౌడీ బ్యాచ్చి రాళ్ళెయ్యడం ఆపింది కరెంటొచ్చినందుక్కాదు.. రౌడీ చేష్టలు కొనసాగిస్తే, తమ తోలొల్చి చౌటుప్పలలోను, కోదాడలోనూ హైవే పక్కన మాంసం కొట్లలో యేలాడదీస్తారని భయమేసి ఉంటది బవుశా.

    మళ్ళీ పోతే.. నేను గుడ్డిగా ఉద్యమాన్ని విమర్శిస్తున్నానన్న నీ విమర్శ.. నేను గుడ్దిగా విమర్శించలేదు. నువ్వు జీవితాంతమూ ఉద్యమం చేసుకుంటూ ఉన్నా నేను విమర్శించను, పట్టించుకోను. నెప్పి నీది, ఉద్యమం నీది. కానీ నీకు నెప్పి పుట్టిందని నన్ను తిడితే నేనెందుకు ఊరుకుంటాను? ఈ మాత్రపు కనీస జ్ఞానం నీకెందుకు కొరవడింది? నా రాష్ట్రం నాక్కావాలె, నేబోతా అని నువ్వంటే నేనెందుకు ఆపుతాను? నా రాష్ట్రం నాక్కావాలె, నువ్వవతలికి పో అని నువ్వంటే నేనెందుకు ఊరుకుంటాను? ఈ మాత్రపు ఇంగితం లేకుండా ఉద్యమం చేసేవాణ్ణి గుడ్డిగా నమ్ముతున్నది నువ్వు. నామీద అబద్ధాలు చెప్పి నన్ను తిట్టే, నన్ను విమర్శించే నాయకుల కంత్రీతనాన్ని నేనెందుకు సహిస్తాను? (అయినా.., నువ్వెప్పుడూ తచ్చాడుతూ ఉండే ఒక బ్లాగులో ఉద్యమాన్ని ఎంత అవహేళన చేసారో నీకు తెలుసు. అంత ఎగతాళిగా నేను ఉద్యమం గురించి కాదు గదా, కనీసం తెవాదనాయకుల గురించి కూడా మాట్టాడలా.)

    ఇహ పోతే నువ్వు నన్ను నమ్మే సంగతి.. నువ్వు నన్నెందుకు నమ్ముతవ్? స్వార్థపూరిత, కుట్రపూరిత, హేటుపూరిత నేతలల్లిన అబద్ధాల ఉద్యమాన్ని హక్కుల పోరాటమని భ్రమ పడేవాడు నన్ను నమ్ముతడని నేనెట్ల నమ్ముత? నీ బతుకును ఢిల్లీలో తాకట్టు పెట్టే కేసీయారును నువ్వు నమ్ముతవ్. అతడు పన్నిన ఉచ్చులో పడి గిలగిల కొట్టుకుంటూ, ఆహా ఎంత సమ్మగుందిర బయ్ అనుకుంటూ మజా చేస్తవ్. అబద్ధాలు చెప్పి నీచేత శివాలేయిస్తున్న ఈ నాయకులు చివరికి నీ బట్టలూడదీయించి బజాట్టో తైతక్కలాడించే దాకా ఈళ్లని నమ్ముతనే ఉంటవ్. నీ కర్మట్టుంటె నేనేం చేస్తర బయ్? ఇంతకీ నువ్వు చేస్తున్నానుకుంటున్న హక్కుల పోరాటం ఎవరి హక్కుల కోసం చేస్తున్నావ్? కేసీయారువా, అతడి కొడుకు కూతుర్లవా?

    రాష్ట్రాన్ని చీకట్లోకి నెట్టాలనే లక్ష్యాన్ని పెట్టుకుని సమ్మె మొదలెట్టి, ప్రజలను ఈ పరిస్థితికి తీసుకొచ్చి, ఇప్పుడు కరెంటు ఇవ్వవేంటని ప్రభుత్వాన్ని తిట్టే మీ నాయకుల మీద రాళ్ళెయ్యడం సంగత్తరవాత.. కనీసం ప్రశ్నించే తెలివి తేటలు నీకు ఉండి ఉన్నా.. ఎవణ్ణి నమ్మాలో తెలీని అజ్ఞాన తిమిరాంధకారంలో పడి కొట్టుకుంటూ ఉండేవాడివి కాదు.

    రిప్లయితొలగించండి
  15. చదువరి గారూ,
    చప్పట్లు, చప్పట్లు

    రిప్లయితొలగించండి
  16. బాగా చెప్పారు చదువరిగారూ !

    సమ్మె చేయించి విద్యుదుత్పత్తిని బలవంతంగా ఆపేసినవాళ్ళ మీద ఏ కోపమూ లేదు. పనివాళ్లూ, బొగ్గూ పవర్ స్టేషన్లూ లేకుండా ప్రభుత్వం ఏమైనా గాల్లోంచి మంత్రదండంతో విద్యుత్తు సృష్టించి ఇస్తుందా ? "వాళ్ళు సమ్మెచేస్తే నాకెందుకు కరెంట్ సప్లై ఆపేశావ్ ?" అని అడగడానికి మెడకాయ మీద తలకాయ ఉండాలి. ఎక్కణ్ణుంచి వస్తాయి ప్రత్యామ్నాయాలు, అందఱూ పనిమానేసి ఇంట్లో కూర్చుంటే ? అయినా తనని ధిక్కరించిన ప్రజలున్న ప్రాంతానికి ఒక ప్రభుత్వం ఎందుకు సేవలు చేయాలి ? మీ చేతిలో ఉన్నది మీరు చేస్తున్నారు. మఱి ప్రభుత్వం చేతుల్లో ఉన్నది ప్రభుత్వం చేస్తే అందులో తప్పేంటబ్బా ? First off, obey the government and get its services. Government has no need to do fellatio to rebels.

    ఏంటో తలకాయ లేని ఉద్యమం, తలకాయ లేని వాదాలూ, తలకాయ లేని నాయకులూ, తలకాయలేని ప్రజలూ ! యాక్కి.... డోకొస్తోంది !

    రిప్లయితొలగించండి
  17. నిజం గా రౌడీ బాచీ ఐతే కరెంట్ హామీ ఇవ్వగానే రాళ్ళేయడం ఎందుకాపేసారు ?

    హహ.. మీరు వ్రాసిన మొదటి పారా(వాక్యం?) ఒక్కటే నా ప్రశ్నకి సమాధానం లెండి. అది రౌడీ బాచీ అనుకున్నా... ఆపటానికి పగలగొట్టడానికి పాపం తెలంగాణ ల బస్సులు లాంటి వాహనాలు తిరగట్లేవు కదా !!! ఇది నాకు మాత్రమే తెలుసో లేక మీ అందరికీ తెలుసో తెలియదు కానీ, రైతులు సమ్మె చేస్తున్నారా ? లేక ఉద్యోగులా ?

    తాడేపల్లి: సారీ మీ పేరు ఇంగ్లిష్ లో అనువదిస్తే ఏమనాలా అని ఆలోచిస్తూ ఉండిపోయా..
    మొదట్లో పేజీలకి పేజీలు వ్రాసేవారు.. ఈ మధ్య కామెంట్లు మాత్రమే వ్రాస్తున్నారేమి ? పైగా బూతు బ్లాగుల్లో ప్రముఖం గా కనిపిస్తున్నారు... బూతు కామెంటర్లకు తోడు నిలుస్తున్నారు.. ఎలాగైనా గెలవాలని దారి మళ్ళారా ?

    చదువరి గారు.. నిజం నాకు టీవిల్లో చూడటమే కానీ ఆంధ్రా ప్రాంతాల్లో మొత్తం గా కాకపోయినా మీ సొంత ఊళ్ళలో ఎన్ని గంటల కరెంట్ ఇస్తున్నారో చెప్తారా ?

    రిప్లయితొలగించండి
  18. రామ రామ.... నేను ఉద్యమాన్ని సపోర్ట్ చేస్తున్నా అని నా కామెంట్ లో మాటవరసకైనా వ్రాశానా ? మీరు నన్ను ఉద్యమ కారి అనడమూ ..అందరు చప్పట్లు కొట్టడమూ చూస్తుంటే .. నేనేం వ్రాశానా అని నాకే డౌట్ వచ్చింది..

    నాకు ఈ ఉద్యమం లో ఎలాంటి పత్రా లేదు...

    మీరన్న వాటిని మార్చుకుంటారా ?

    రిప్లయితొలగించండి
  19. చాలా ఆశ్చర్యంగా ఉంది. బూతు బ్లాగుల్లో నేను కనిపించడమేంటి ? అసలు బూతుబ్లాగులనేవి తెలుగులో ఉన్నాయా ? ఇప్పటిదాకా అలాంటివి ఇంగ్లీషులోనే ఉన్నాయనుకుంటూ ఉన్నాను. నన్ను బద్నామ్ చేద్దామని నా పేరు పెట్టుకుని ఎవఱైనా రాస్తూండవచ్చు. నా గురించి ఏమీ తెలీకపోయినా, నన్నెప్పుడూ చూదకపోయినా కేవలం నా అభిప్రాయాల ఆధారంగా నన్ను ఒక విలన్ ని చేసి ద్వేషించేవాళ్ళకి కొదవలేదు నెట్‌లో ! నా గుఱించి నాకే తెలియని మంచి సమాచారం ఇచ్చినందుకు నెనర్లు. అంతర్జాలంలో ఇవన్నీ మామూలే. సి.పి.ఐ. రాష్ట్రకార్యదర్శి బి.వి.రాఘవులుగారి పేరుతో ఎవఱో ట్విట్టర్ లీనూ, ఫేస్ బుక్కులోనూ ఖాతా తెఱిచారట. ఇహ మనం ఎంత ?

    సరే,, ఇంతకీ మీరు బూతుబ్లాగులు బాగా చూస్తూంటారనుకుంటా. నాకు అంత సమయం లేదు. ఆ వయసూ కాదు.

    నా బ్లాగు నిక్షేపంలా నడుస్తూనే ఉంది. మీరు చూడకపోతే అది నా తప్పు కాదు. ఈ సంవత్సరం 84 వ్యాసాలు వ్రాశాను.

    రిప్లయితొలగించండి
  20. బూతు సైట్ కాదు లెండి.. బూతు బ్లాగు మాత్రమే... ఉన్నాడుగా బూతు మాటల రక్త చరిత్ర..

    రిప్లయితొలగించండి
  21. శాంతియుత, అహింసా, మిలిటెంట్ తెలంగాణ ఉద్యమం.

    http://www.youtube.com/watch?v=azzm7Mb5Puw

    రిప్లయితొలగించండి
  22. కాయ: "మీరన్న వాటిని మార్చుకుంటారా ? " - నువ్వు మనసు మార్చుకున్నట్టున్నావ్. నీ మొదటి వ్యాఖ్యలో అరాచక తెవాది మనసు స్పష్టంగా తెలుస్తోంది, తెవాదివో కావో నువ్వు ప్రత్యేకంగా చెప్పనక్కర్లా. వ్యాఖ్య చెబుతోంది. తరువాతి వ్యాఖ్యల్లో ’నేనెక్కడన్నానూ..’ అంటూ నొక్కుతున్నావ్. చిన్నపిల్లలంటూంటారు చూడూ, ’నేను నిన్ననలేదు, అదుగో ఆ గోడను అన్నాను’ అనీ.. ఆ బాపతన్నమాట!

    పోతే.. మొదటి వ్యాఖ్యలో ఉన్న దూకుడు తగ్గించి ఇప్పుడు కుసింత బ్యాలెన్సుడుగా మాట్టాడావ్, ఊసరవెల్లి లాగా మాట మార్చావ్.

    అయితే.. నువ్వు మనసూ మాటా మార్చేసుకున్నంత తేలిగ్గా నేను మార్చలేను. అంచేత నీ అభ్యర్ధనను తిరస్కరిస్తున్నాను.

    రిప్లయితొలగించండి
  23. చాలా కాలంగా తెవాదులు కామెంట్ పోరాటానికి దొరకనట్టున్నరు... ఒక్కడు కనపడ గానే ఎగిరి గంతేసి నాలుగు లైన్ల నా కామెంటుకు ఆకలి తో ఉన్న పులి లా..నలభై లైన్ల రిప్లయ్ ఇచ్చినవ్...

    రిప్లయితొలగించండి
  24. కాయ: "చాలా కాలంగా తెవాదులు కామెంట్ పోరాటానికి దొరకనట్టున్నరు.." :) ఒక రకంగా నిజమే గానీ, అయితే అందుక్కాదు నేనలా రాసింది. ’గుడ్డిగా ఉద్యమాన్ని విమర్శిస్తున్నాన’ అన్న ఆరోపణకు ప్రతిగా అలా రాసాను. నా కెవరిమీదా ప్రత్యేకమైన కోపం లేదు -అబద్ధాలు చెప్పి కోస్తా, సీమల ప్రజలను నిందించే వాళ్ళమీద తప్ప!

    నా చివరి వ్యాఖ్యలో కటువుగా మాట్టాడాను, మన్నించండి.

    ఉద్యమం హక్కుల పోరాటమని అన్న మాటకు ప్రతిగా.. ఇవ్వాళ ఖమ్మం జిల్లాలో కేశవాపురం అనే ఊళ్ళో జనం వీధుల్లోకి వచ్చారు. మేమేం పాపం చేసాం, ఎందుకు మా’పై’ ఈ సమ్మె అంటూ ప్లకార్డులు పట్టుకుని ప్రదర్శన చేసారు. వీళ్ళ హక్కుల గురించి మాట్టాడేది ఎవరు? లేక, వీళ్లకు హక్కుల్లేవా?

    "మీ సొంత ఊళ్ళలో ఎన్ని గంటల కరెంట్ ఇస్తున్నారో చెప్తారా ?" అని మీరడిగిన ప్రశ్నకు సమాధానం రాయడం విస్మరించాను. పగలు తొమ్మిదింటి నుంచి సాయంత్రం ఆరింటిదాకా కరెంటుండదు. కరెంటాళ్ళకు దయ ఉంటే సరే.. లేదంటే రాత్రికి కూడా ఎంతో కొంత సేపు తీస్తారు. ఈ టైములు ఎప్పుడూ ఇలాగే ఉండవు.. మారుతూ ఉంటాయి. మరి వీళ్ళ హక్కుల మాటేంటి?

    రిప్లయితొలగించండి
  25. చదువరి గారూ ! నేను బ్లాగులు చదవడం మొదలుపెట్టిన తరువాత అన్ని బ్లాగుల కంటే మీ బ్లాగులో వ్యాసాలూ నన్ను చాలా ఆకట్టు కుంటున్నాయి.క్రమం తప్పకుండా చదువుతాను. కానీ మధ్యలో కొంతమంది చేస్తున్న వ్యాఖ్యలు శ్రుతి మించి చిరాకు కలిగిస్తున్నాయి.బ్లాగు యజమాని గా మీరు కొంచెం కంట్రోలు చేస్తే బావుంటుంది. అలాగే మీరు కూడా వారి స్థాయికి దిగి ఏకవచనం లో సంబోధించవద్దని మనవి. మీ బ్లాగు చూసిన తరువాత మీ స్ఫూర్తి తో నాకు కూడా తెలుగు లో బ్లాగు రాయాలని కోరిక పుట్టి " గోదారి " పేరుతో వ్రాస్తున్నాను. నేను పెద్దగా చదువుకోక పోయినా నా మనసులోని భావాలు నాకు తోచినట్టుగా వ్రాస్తున్నాను.దయచేసి ఒకసారి చూడండి. గౌరవ భావముతో---ఫణి కుమార్. నా బ్లాగు URL:
    http://phani-flyingbirds.blogspot.com/

    రిప్లయితొలగించండి
  26. "గుడ్డిగ" పక్కకు కామా పెట్టి ఉంటే సరిగా అర్థం వచ్చి ఉండేది... ఉద్యమాన్ని విమర్శించె ముసుగు లో ఇలా గుడ్డిగా ప్రతీ దాన్ని విమర్శిస్తూ పోతున్నరు అన్న..

    25 రోజులు ఐతుంది... అభివృద్ది మాట తరువాత... ముందు బతకడమే దుర్భరమవుతున్నది... వ్యవస్థ లో జవాబుతారీ తనం , ప్రశ్నించే తత్వం ఎక్కువ కాలం దాగి ఉండలేవు... ఇలా నష్టపోతున్నవారు గళం ఎత్తే రోజు ఎంత తొందరగా వస్తే ఆ చైతన్యం .. వ్యవస్థ అధికారాన్ని చేతిలో ఉంచుకున్న వారు అంత త్వరగా నిర్ణయాలు తీస్కునేలా వత్తిడి చేస్తుంది ...

    ఎవరో సమ్మె చేస్తే మాకెందుకు కరెంట్ ఇవ్వరు అని నేను అన్నది కేవలం తె రైతుల నుద్దేశించి మాత్రమే కాదు... ఆ హక్కు పొందాల్సిన అందరినీ ఉద్దేశించి... ఈ రకం కష్టాలు పడే అందరికీ నాలుక అయ్యి మాట్లాడించగల, చైతన్యం తేగల నాయకులు ఏమయ్ పోయారు ? నా చిన్నప్పటిలా మళ్ళీ అన్నలొచ్చి గ్రామ సమావేశాలు పెట్టాలా ?

    రిప్లయితొలగించండి
  27. ఒకసారి, తెలంగాణావాది(ఎవరో మీకు తెలుసు.ఇక్కడ వ్యక్తిగత ప్రస్తావన ముఖ్యం కాదు) ఒక T.V.ఇంటర్వూ లో ఇలా అన్నాడు."1956 నవంబర్ 1 కి ముందు మాది ఒక ప్రత్యేక రాష్ట్రం.1956 నవంబర్ 1 న రెండు రాష్ట్రాల కలయిక ఈ ఆంధ్రప్రదేశ్.ఇప్పుడు మేమడుగుతున్నది 1956 కి ముందు ఉన్న మా రాష్ట్రం.అప్పటి రాష్ట్రం లో ఒక్క ఇంచ్ తక్కువైనా ఊరుకోం.ఆంధ్ర ప్రాంతం నుండి ఒక్క ఇంచ్ కూడా మాకు అక్కరలేదు"అని.

    నిజానికి 1956 నవంబర్ 1 కి ముందు తెలంగాణా రాష్ట్ర మనేది ఏదీ లేదు.నిజాం పాలన లో "16 జిల్లాలుగా గల హైదరాబాద్ రాష్ట్రం" 1948 సెప్టెంబర్ 17 పోలీస్ చర్య తరువాత ఇండియన్ యూనియన్ లో విలీనమైంది.అప్పటి నుండి 1956 నవంబర్ 1 న భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడేవరకు హైదరాబాద్ ఒక రాష్ట్రంగా కొనసాగింది. అప్పటి "16 జిల్లాలుగా గల హైదరాబాద్ రాష్ట్రం"లో "8 జిల్లాలు గల తెలంగాణా ప్రాంతం(తరువాత 1978 లో రంగారెడ్డి,హైదరాబాద్ 9,10 వ జిల్లాలుగా ఏర్పడ్డాయి)" ఒక భాగం మాత్రమే.విలీనం తరువాత 1950 వరకు జనరల్ J.N.Chowdary సైనిక పాలన కొనసాగింది.తరువాత హైదరాబాద్ రాష్ట్ర తాత్కాలిక Civil Administrator గా M.K.Vellodi 1950 జనవరి 26 న భారత ప్రభుత్వం చే నియమింపబడ్డారు.1952 లో తొలి సారత్రిక ఎన్నికల్లో 175 అసెంబ్లీ సీట్లు గల హైదరాబాద్ రాష్ట్రం లో 93 సీట్లు గెల్చుకొన్న కాంగ్రెస్ పార్టీ,బూర్గుల రామకృష్ణా రావు CM గా ప్రభుత్వం ఏర్పాటు చేసింది.1955 లో 1st State Reorganisation Commission హైదరాబాద్ రాష్ట్రాన్ని 3 ముక్కలు చేసి కన్నడం మాట్లాడే 3 జిల్లాలని కర్ణాటక లో,మరాఠా మాట్లాడే 5 జిల్లాలని మహరాష్ట్ర లో కలిపి మిగిలిన "8 జిల్లాలు గా గల తెలంగాణా ప్రాంతాన్ని" ప్రత్యేక రాష్ట్రంగా గాని లేక అప్పటికే ఒక రాష్ట్రం గా ఉన్న ఆంధ్ర రాష్ట్రం లో గాని కలపవచ్చు అని సిఫార్సు చేసింది. భాషా ప్రయుక్త రాష్ట్రాలు కోసం కేంద్రం ప్రయత్నిస్తున్న తరుణం లో తెలుగు మాట్లాడే ఆంధ్ర రాష్ట్రం పక్కనే తెలంగాణా ను ప్రత్యేక రాష్ట్రం చేయడంలో అర్థం లేదు.అలాగని అప్రజాస్వామికంగా కలుపలేరు కాబట్టి 1955 డిసెంబర్ లో అప్పటి హైదరాబాద్ రాష్ట్ర అసెంబ్లీ లో తీర్మానం పెట్టగా హాజరైన 147 మందిలో 103 మంది తెలంగాణాను ఆంధ్ర రాష్ట్రం లో కలుపమని, 29 మంది వద్దని వాదించారు. 15 మంది తటస్థంగా ఉన్నారు.ఆ తరువాత కూడా తెలంగాణావాసుల అపోహలు తీరుస్తూ 1956 ఫిబ్రవరి 20 న పెద్దమనుషుల ఒప్పందం(Gentlemen's Agreement ) చేసుకొని ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక తెలంగాణా కు ప్రత్యేక హక్కులు,రాయితీలు కల్పిస్తామని ఆంధ్రనాయకులు హామీ ఇచ్చారు.దాంతో అప్పటి హైదరాబాద్ రాష్ట్రంలో ఆ "8 జిల్లాల తెలంగాణా ",ఆంధ్ర రాష్ట్రంలో విలీనం కావడానికి మార్గం సుగమమైంది. అప్పుడు హైదరాబాద్ రాష్ట్రాన్ని 3 ముక్కలు చేసారు.
    ఔరంగాబాద్,బీడ్,నాందేడ్, పర్భాని ,ఉస్మానాబాద్ అనే 5 జిల్లాలను మహరాష్ట్ర లో(అప్పటికి దాన్ని బోంబే రాష్ట్రం అనేవారు) కలిపారు.
    బీదర్,గుల్బర్గా,రాయచూర్ అనే 3 జిల్లాలను కర్ణాటక లో కలిపారు.
    "మిగిలిన 8 జిల్లాల తెలంగాణా"ను అప్పటి ఆంధ్రరాష్ట్రంతో కలిపి 1956 నవంబర్ 1 న ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేసారు.పై మార్పులన్నీఒకేసారి చేసారు.కాబట్టి తెలంగాణాను హైదరాబాద్ రాష్ట్రం నుండి వేరు చేయడం, ఆంధ్ర రాష్ట్రం లో విలీనం చేయడం రెండూ ఒకేసారి జరిగాయి.అంటే కనీసం ఒక్క రోజు కూడా తెలంగాణా ఒక ప్రత్యేక రాష్ట్రంగా గాని,కనీసం ప్రత్యేక పరిపాలనా విభాగం గా గాని చరిత్ర లో ఎప్పుడూ లేదు.మరి ఇప్పుడు తెలంగాణావాదులు అన్నట్టు అప్పటి హైదరాబాద్ రాష్ట్రం"ఒక్క ఇంచ్ కూడా" కోల్పోకుండా కావాలంటే మహరాష్ట్ర ని, కర్ణాటక ని కూడా అడగాలి.అడిగితే బాగుండేది వాళ్ళని "ఒక్క ఇంచ్ కోల్పోకుండా కావాలని ".అప్పుడు ఒక్క పంచ్ కూడా వేస్ట్ అవకుండా కుమ్మేస్తారు వాళ్ళు.అసలే ఆ రాజ్ ధాకరే మంచోడు కాదు

    రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు