15, అక్టోబర్ 2011, శనివారం

సకల జనుల సమ్మె లో తొలి విరమణ

తెలంగాణ ఉద్యమంలో 2011 అక్టోబరు 15 ఒక గుర్తుంచుకోదగ్గ రోజు. అనేక సంఘటనలు కలగలిసి ఈ రోజుకు ప్రాముఖ్యత తీసుకొచ్చాయి. ముఖ్యంగా రెండు సంఘటనల గురించి చెప్పుకోవాలి:

సంఘటన 1: 

ప్రభుత్వం ఈ రోజున సమ్మె చేస్తున్న ఆర్టీసీ యూనియన్ల తోటి చర్చలు జరిపింది.వాళ్ళను తమవైపుకు తిప్పుకుంది. చర్చలు జరుగుతూండగానే వార్తలు బైటికొచ్చాయ్.. సమ్మె ముగించారని. అయితే ఆ నాయకులు బైటికి వచ్చి, కోదండరామ్ తో మాట్టాడి ఆయన ఏం చెబితే అదే చేస్తామని ప్రకటించారు. ఆ తరవాత కోదండరామ్ తో చర్చలు జరిపాక, యూనియన్ నాయకులంతా కోదండరామ్ తో కలిసి విలేకరులతో మాట్టాడుతూ సమ్మెను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. కోదండరామ్ మాట్టాడుతూ, ’సమ్మె కారణంగా ప్రజలకు అనేక ఇబ్బందులు ఎదురౌతున్నాయి అనేది ప్రధాన కారణం, కార్మికుల్లోని కొన్ని వర్గాల ఉద్యోగ భద్రతకు అపాయం వాటిల్లే ప్రమాదం ఏర్పడింది అనేది రెండో కారణం’ అని వాయిదాకు రెండు వంకలు చూపించాడు.  విరమణ అనే మాట ప్రకటించేందుకు వెనకాడి వాయిదా అని ప్రకటించారని తెలుస్తూనే ఉంది. వాయిదా వేస్తున్నామనే ప్రకటన చేసేందుకు ఒక్క యూనియన్ నాయకుడికి కూడా నోరు పెగల్లేదు. చివరికి ఎలాగో ప్రకటించామనిపించారు. ఉద్యమ నాయకత్వానికి ఈ వాయిదా  పెద్ద ఎదురుదెబ్బ. అంతకంటే దెబ్బ ఏంటంటే..

ప్రజలు ఇన్నాళ్ళుగా ఆక్రోశిస్తున్న నిజమొకటి కోదండరామ్ ప్రకటనతో స్పష్టమైంది: ఇది సకల జనుల సమ్మె కాదు, సకల జనుల’పై’ సమ్మె అని. ఎందుకు మా’పై’ఈ సమ్మె అని ఆవేదనగా అడిగిన ప్రజలకు ఏం సమాధానం చెబుతారు ఈ నాయకులు?

కోదండరామ్ కు ఇంకొన్ని ప్రశ్నలు: ప్రజల ఇబ్బందులు ఎదుర్కొంటున్నది ఆర్టీసీ సమ్మె వల్ల మాత్రమేనా? సింగరేణి సమ్మె వలన, కరెంటు లేక ఇబ్బందులు పడటం లేదా? బడులు మూసేసి పిల్లల చదువులు అటకెక్కించినందుకు తల్లిదండ్రులు పడుతున్న వేదన మీకు కనబడ్డం లేదా? అవి మీకు ఇబ్బందులుగా అనిపించడం లేదా? కోదండరామ్, ఎందుకు మీకింత హిపోక్రసీ?

రేపు ప్రజలడగబోయే ఈ ప్రశ్నలను కోదండరామ్ ఎలా ఎదుర్కొంటాడో చూడాలి.

కోదండరామ్ మామూలుగానే సీరియస్ గా ఉంటాడు. ఈ ప్రకటన చేస్తున్నపుడు అతడు మరింత సీరియస్ గా అనిపించాడు. సమ్మె వాయిదా వేసిన నిరుత్సాహం గుండెలో గుబులు రేపుతూ ఉండి ఉంటుంది బహుశా. ఇకపై మిగతా జాక్ ల పట్టుదల సడలనీకుండా సమ్మెను కొనసాగించడం అతడికి కష్టమే.

అది కష్టం కాదు, కత్తిమీద సామే అని చెప్పుకోదగ్గ సంఘటన అంతకు కొన్ని గంటల ముందు జరిగింది.

సంఘటన 2:

జానారెడ్డి, ఇతర మంత్రులు కలిసి ఉద్యమ నాయకులకు ఒక షాకిచ్చారు. వాళ్లంతా కలిసి జానారెడ్డి చేత విలేకరులతో మాట్టాడించారు. సకల జనుల సమ్మెను విరమించాల్సిందిగా కోరారు. తెలంగాణ అంశం పట్ల అధిష్ఠానం చర్యలు తీసుకుంటోంది కాబట్టి, సమ్మె కారణాన ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురౌతున్నాయి కాబట్టీ.. సమ్మెను విరమించాలని కోరారు. మేం తెలంగాణ సాధనలో అన్ని చర్యలూ తీసుకుంటన్నాం కాబట్టి ఇక ముగించమని చెప్పారు. ఈ ప్రకటన చేసినందుకుగాను, మధు యాస్కీ జానారెడ్డిని విమర్శించాడు.

ఉద్యోగుల నాయకుడు స్వామిగౌడ్ ఈపాటికే నాయకుల మీద విసుర్లు విసురుతూ, వాళ్లపై తన నిరసన తెలుపుతూ, నిరుత్సాహ పూరిత ప్రసంగాలు చేస్తూ ఉన్నాడు. మమ్మల్ని సమ్మెలో దింపి మీరుమాత్రం చోద్యం చూస్తున్నారు. మీ పనులు మీరు చేసుకుంటూ, మీ వ్యాపారాలు మీరు చేసుకుంటూ, మీ జీతాలు మీరు తీసుకుంటూ ఉన్నారు. మేం మాత్రం జీతాలు పోగొట్టుకున్నాం అని ఆక్రోశించాడు. ఇప్పుడు మంత్రుల ప్రకటన చూసాక, ఈ నిరుత్సాహం మరింత తీవ్రమై ఉద్యోగులు కూడా విరమణ మార్గంలో నడుస్తారని అనుకుంటున్నాను. ఒక గౌరవనీయమైన "బయటి దారి" ని చూపించడమే ప్రభుత్వం చెయ్యాల్సిన పని.

చిన్నచిన్నా సంఘటనలు కూడా కొన్ని జరిగాయి. ముందే ప్రకటించిన రైల్ రోకోతో రోజు మొదలైంది. గతంలో జరిగిన రైల్ రోకో లాగా కాకుండా ప్రభుత్వం ఈసారి ఆందోళనను ఎదుర్కోవడానికి గట్టి ఏర్పాట్లు చేసింది. పోలీసులు అనేకమంది నాయకులను ఎడాపెడా అరెస్ట్ చేసారు. పొన్నం ప్రభాకరును అరెస్టు చెయ్యడమే కాకుండా పద్నాలుగు రోజుల రిమాండుకు కూడా పంపారు. ఇవ్వాళ చేసిన అరెస్టులతో సమ్మెకు వ్యతిరేకంగా ప్రభుత్వం మరింత చురుగ్గా చర్యలు తీసుకుంది. ఇది కాకుండా సోమవారం నుంచి ప్రైవేటు బడులు తెరవాలని, లేకపోతే వాటి గుర్తింపులు రద్దు చేస్తామనీ ప్రభుత్వం ప్రకటించింది.

మొత్తమ్మీద అక్టోబరు 15 శనివారం నాడు ఉద్యమానికి ఎదురుదెబ్బలు తగిలాయి.

13 కామెంట్‌లు:

  1. ఈ తిక్క రాముడు ఏం మాట్లాడతాడో కూడా తెలీదు, ఒక వైపు ప్రజా రవాణా కి ఇబ్బంది అవుతుంది అని సమ్మె విరమించాం అంటాడు, ఇంకో వైపు రైళ్ళని ఆపేయమని చెప్తాడు... దానివల్ల కూడ తెలంగాణ ప్రజలకు ఇబ్బందులు లేవా?

    రిప్లయితొలగించండి
  2. ఏమి సేతుర లింగా ఏమీ సేతు
    రాజీనామాలు మురిగిపాయె
    సకల జనుల సమ్మె కాస్త కకావికలమయిపోయే
    ఏమి సేతుర లింగా ఏమీ సేతు
    కురచ బుద్ది "కచరా"కాస్త రాష్ట్రానికి మంటబెట్టె
    సివరాకరికెమో జూస్తే "కచరా"కే కాలింది
    ఏమి సేతుర లింగా ఏమీ సేతు
    అమాయకుల ఉసురుకాస్త అందరికీ తగిలింది
    అవేశ పడ్డవాళ్ళు జైళ్ళపాలు అయ్యిండ్రు
    ఏమి సేతుర లింగా ఏమీ సేతు
    బందులంటు,రోకోలంటు రచ్చరచ్చ జేస్తేను
    జనం కాస్త తిరగబడి "బొంద"బెట్టబట్టిండ్రు
    ఏమి సేతుర లింగా ఎమీ సేతు
    వా... :)

    రిప్లయితొలగించండి
  3. ముందుగా "గుడ్ జాబ్ సత్తి బాబు".

    అసలు సంగతేమిటంటే - కచరా, తెలంగాణా మిలిటెంట్ నాయకుడు కోదండుడి కుట్రారాజకీయాలను ఆర్టీసీవాళ్ళు గ్రహించినట్టున్నారు. అసలే జీతాల్లేక కడుపుకాలుతోంది కదా. తమంతట తామే సమ్మె విరమిస్తున్నట్టు చెబితే నవ్వులపాలవుతామని "మా మిలిటెంట్ నాయకుడితో చర్చిస్తాము" అని లొపలికెళ్ళి "నువ్వేమో జీతం తీసుకున్నావు, నీ పిల్లలేమో అమెరికాలో చదువుకుంటున్నారు. మా పిల్లలకు చదువులేదు, మాకు జీతాల్లేవు. నొర్మూసుకొని మేమిచ్చిన స్క్రిప్టును మీడియా ముందు చదువు. లేదంటే మేము సమ్మె విరమించడమే కాకుండా మిగతావారిని విరమించమని రెచ్చకొడతాము" అని వీడి కాలర్ పట్టుకొని ఉంటారు. దెబ్బకు వీడు లోలోపల ఏడుస్తూ పైకి ఎప్పటిలాగే వాడి చెక్క మొహాన్ని ప్రదర్శించాడు.

    "మీకు ఇబ్బందులుగా అనిపించడం లేదా? కోదండరామ్, ఎందుకు మీకింత హిపోక్రసీ? "

    నిన్నటిదాకా "బస్సులుంటే కదా స్కూళ్ళు నడిచేది" అంటూ ఒకదానికొకటి ముడిపెట్టారు. ఇప్పుడు ఒక్కొక్కరే నెమ్మదిగా సమ్మెనుండి జారుకుంటారు . ఇక అసలు తమాషా మొదలవుతుంది చూస్తుండండి.

    రిప్లయితొలగించండి
  4. "సకల జనుల సమ్మె వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు..సమ్మె విరమించండి" - జానారెడ్డి

    ఈ జానారెడ్డి సీమాంధ్ర తొత్తు గా మారిపొయాడు..మేమొప్పుకోం..వా... ఆ ...

    నిన్ననే స్వామి గౌడ్ కి ఞానోదయం అయ్యింది. తనని బకరా చేసారని అర్థం చేసుకున్నాడు. ఇక మిగతా వాళ్ళకి ఞానోదయం
    కావాలని ప్రార్థిస్తున్నాను.

    రిప్లయితొలగించండి
  5. ఇన్నాళ్ళు ప్రభుత్వాల సంయమనం పాటిచడంతో మాకు ఎదురే లేదు అన్నట్టు రెచ్చిపోయిన తెలబానులకు ఒక్క షాక్ ఇది. ముఖ్యంగా మన దున్నపోతు లీడర్ ను 14 రోజులు లోపలేయడం..! too good.

    It is soo good watching faces of కె'శవ'రావు, madhu-YEAK-CHEE and kodireddy yesterday.

    రిప్లయితొలగించండి
  6. సమ్మె ఇంకా కొంతకాలం సాగితే బావుండునని నేననుకున్నాను. "అలా తెలంగాణ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా ధ్వంసమయ్యాక ఇంక తెలబాన్లు ఆ దెబ్బనుంచి కోలుకోలేరు. మళ్ళీ ఉద్యమంలోకి రమ్మంటే ఎవడూ రాడు ఈసారి. అంతటితో ఉద్యమం మటాష్ శాశ్వతంగా" అనుకున్నాను. కానీ నేననుకున్నట్లు జరగకపోవడం చాలా నిరాశ కలిగించింది. కాస్త విశ్రాంతి తీసుకుని మళ్ళీ లేస్తారేమో అని ఇప్పుడు అనుమానంగా ఉంది.

    రిప్లయితొలగించండి
  7. @ Dontclike web. - నష్టపోయేది సామన్య ప్రజలే. KSR/ KSR group కి ఎటువంటి హాని జరగదు. వాళ్ళకి ఇటువంటప్పుడే ఆదాయం ఎక్కువ.

    కాముధ.

    రిప్లయితొలగించండి
  8. సమైఖ్యవాదులకు విజ్ఞప్తి కేసీర్ భవిష్యత్తుతో ఆడుకోకండి...వాడి బ్రతుకు తెరువు కోసం ఒక పార్టీ ...దాన్ని బ్రతికించుకోవడానికి ఒక ఉద్యమం....దానికి ఎప్పుడొ జరిగిన కధకు...ఇప్పుడు ప్రాణం పోసి...రియాలిటీ షో నడుపుతున్నాడు...కేటీర్...కవితా...ఈ పుడుంగులు పెద్ద హీరోలూ...హరీష్ అనబడే బ్లాక్ మార్కెట్లో టికెట్ లమ్ముకునే స్టాండర్డ్ వాడు...పెద్ద నాయకుడు...థూ నా తెలుగు ప్రజలరా...ఈ దేశంలో...ఇంతకంటే వెధవలు ఎవరూ దొరకలేదా??మీ నాయకులుగా..??

    రిప్లయితొలగించండి
  9. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  10. సమ్మె కాలాన్ని సెలవు గా పరిగణించాలి.. శాశ్వత ఉద్యోగులకు 15000, తాత్కాలిక ఉద్యోగులకు 10000 అడ్వాన్స్ ప్రకటించాలి. తాత్కాలిక ఉద్యోగులను పర్మినెంట్ చెయ్యాలి. -- ఆర్టీసీ జేఏసీ.

    సమ్మె కాలాన్ని సెలవు గా ప్రకటించాలి. సమ్మె సమయం లో బనాయించిన కేసులు ఎత్తివెయ్యాలి.. సమ్మె కాలానికి జీతాలు ఇవ్వాలి. - ఇదీ జీతాలు తీసుకోకుండా సంతకాలు చెయ్యకుండా విధులు నిర్వహిస్తామన్న టీచర్స్ జేఏసీ సమ్మె విరమణ షరతు.

    ఉద్యోగులకి 21 వేలు బోనస్ ప్రకటించాలి. సమ్మె కాలానికి జీతాలు చెల్లించాలి - సింగరేణి జేఏసీ.

    ...
    ...

    ఇలాంటి ప్రతిపాదనలే కొన్నాళ్ళ క్రితం సహాయ నిరాకరణ సమయం లో ఉద్యోగులు సాధించుకున్నారు. వీళ్ళు గాక రాజకీయ నాయకులు.. తెలంగాణ కోసం ప్రాణాలు సైతం అలవోకగా సమర్పించగలరు కానీ 10 రోజులు జైల్లో పెడితే అగ్గి మీద గుగ్గిలం అవుతారు. ప్రాణాలివ్వగలరు కానీ ఒక్క రాత్రి జైల్లో ఉంచితే మహిళలు అని కూడా బాధలు పెట్టారు అని వాపోతారు. తలలు తెగ్గొట్టుకోగలరు కానీ నిరాహార దీక్ష చెయ్యటానికి ఆరోగ్యం సహకరించదు అని చెప్పగల సంభాషణా చతురులు. బిచ్చమెత్తైనా ఉద్యోగుల జీతాలు చెల్లిస్తాం అంటారు కానీ తమ జీతాల్లో ఒక్క రూపాయి తగ్గనివ్వరు. ఇంక రాజకీయ పైరవీలు, బెదిరింపులు, దందాలు సరే సరి..

    అందరికన్నా ముదురు అచంట కోదండన్న.. తన బిడ్డ అమెరికాలో ఉద్యోగం చదువుకుంటూ సుఖం గా ఉండాలి. తను మాత్రం పాటాలు చెప్పకపోగా తెలంగాణ గురించి చైతన్య పరచటం అన్నిటికన్నా పెద్ద పాఠం అని నీతులు వల్లించగలడు. ఇక్కడ విధ్యార్ధులకి కంటి మీద కునుకు లేకుండా చెయ్యగలడు.

    తెలంగాణ 'వంక ' తో జరుగుతున్న ఈ తంతు అంతటి వలన ప్రభుత్వానికి నష్టం 'వేల కోట్లు '.. సగటు తెలంగాణ జీవి కి ప్రాంతీయ ద్వేషం అనే మత్తు ఎక్కించి, ప్రతీ రోజు అతని జీవితాన్ని నరకప్రాయం చేస్తున్న ఈ వికృత క్రీడకి ముగింపు ఎన్నడో..

    రిప్లయితొలగించండి
  11. Satya గారు బాగా ఎత్తిచూపారు.

    మెదడుకు మేత.

    రిప్లయితొలగించండి
  12. meeku kadupu chekkalayyelaa navvaalani undaa . naa telangana naa panasakaaya. chadavandi. idee linku.
    phani-flyingbirds.blogspot .com peru godaari.

    రిప్లయితొలగించండి
  13. మనసులో ఇంత విషం/ద్వేషం పెట్టుకొని మీరు తెలంగాణా వారితో ఎలా కలిసుంటారు...? ఇదంతా దొంగ ప్రేమేగా....! అయినా తెలంగాణా ఇచ్చేశారు...బ్లాగులు మూసుకొని భజన చేస్కోండి పుణ్యమైనా వస్తుంది.....

    రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు