31, ఆగస్టు 2011, బుధవారం

తెలుగులో తేదీని ఎలా రాయాలి? (Date format in Telugu)

2 కామెంట్‌లు
తెలుగులో తేదీ ఆకృతి - తేదీ ఫార్మాట్ (Date format) - ఎలా ఉండాలి?

’ఎలా ఏముంది.. 08/31/11 అని ,అంతేగా’ అంటారు నేటి ఐటీ ఘనపాఠీలు. నాకు తెలిసిన ఐటీ కుర్రాడొకడు కిస్మీసు సెలవలకి అమెరికా నుంచి వాళ్ళూరు వచ్చాడు. వాళ్ళ తాతకు ఏదో కాగితం రాసిపెడుతూ తేదీని 12/13/06 అని రాసాడంట. అదిచూసి, ఆ పెద్దాయన, ’సదవేత్తే ఉండమతి పోయిందిరా నీకు’ అని అన్నాడంట. తేదీని తిరగరాసి, ’ఎమెరికన్స్ డేట్ ని అట్లాగే రాస్తారు తాతా’, అని అసలు సంగతి చెప్పాడంట, మనవడు. అమెరికా వోళ్ళకు తిక్కగానీ ఉందేంట్రా.. రోడ్డుకు కుడేపున పోతారంటగా? అని అడిగాడంట ఆయన.  ఔను తాతా. అంతేకాదు, లోకమంతా లీటర్లు, కిలోమీటర్లూ అంటూ ఉంటే వాళ్ళు ఔన్సులు, అడుగులూ, మైళ్ళూ అంటారు. వాళ్ళక్కొంచెం తిక్కలే! అని చెప్పాడంట.

26, ఆగస్టు 2011, శుక్రవారం

లే థింకర్లు, లే.థింకర్లు, భలే థింకర్లు, రిలే థింకర్లు

70 కామెంట్‌లు
ముందుగా లే. థింకర్ల గురించి. లే. థింకర్స్ అంటే లే థింకర్స్ (lay thinkers) అని కాదు, ’లే’ పక్కన చుక్క ఉంది చూడండి. లే. థింకర్స్ అంటే లేటరల్ థింకర్స్ అని అండి.  మామూలుగా సూటిగా, నిటారుగా ఆలోచించకుండా కొంత అడ్డంగా, కుసింత ఐమూలగా ఆలోచించేవాళ్ళను లేటరల్ థింకర్స్ అని అంటారు. కాబట్టి వీళ్ళను తేలిగ్గా తీసుకోవద్దని మనవి. కొన్ని సమాజాల్లో వీళ్ళని కూడా మేధావులు అనే అంటూంటారు. వీళ్ళ ఆలోచనలు సమాజం ఆలోచించే పద్ధతికి కొంత ’తేడా’గా ఉంటది. ఉదాహరణకు -

19, ఆగస్టు 2011, శుక్రవారం

పాపం అన్నా హజారే!

13 కామెంట్‌లు
ఎవరిమీదైనా లోక్ పాల్ కు మనం ఫిర్యాదించామనుకుందాం. ఆ తరవాత అది రుజువు కాలేదనుకోండి.. మన ఖర్మ కాలినట్టే! ఫిర్యాదు చేసినందుకు మన్ని తీసుకుపోయి జైల్లో పెడతారు. అంటే ఏంటనమాటా.. ఫిర్యాదించేముందు మనమే కేసును పూర్తిగా దర్యాప్తు చేసుకుని, మనకు మనం నిరూపించుకున్నాక, అప్పుడు చెయ్యాలి ఫిర్యాదు. మన ఎంపీలు పార్లమెంటులో వోటేసేందుకు డబ్బుల్తీసుకున్నారనుకోండి, పార్లమెంటులో ప్రశ్న అడగడానికి కూడా డబ్బులు తీసుకున్నారనుకోండి, మనం కళ్ళు మూసుక్కూచోవాలి. మాట్టాడకూడదు.

18, ఆగస్టు 2011, గురువారం

మన్మోహన్ అయ్యవారు ఏం చేస్తున్నారయ్యా అంటే..

4 కామెంట్‌లు
అడ్డెడ్డె...

అన్నా హజారే విషయంలో మన అప్రధానమంత్రి చేసిన పనులు చూస్తూంటే రాజకీయ ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం లాగా కనిపిస్తోంది. ’ఇహ నీతో పని అయిపోయింది, రాహుల్ గాంధీ కోసం సీటు ఖాళీ చెయ్యి’, అని నేరుగా చెప్పకుండా, ఇలా ఆత్మహత్య చేయిస్తున్నట్టున్నారు. లేకపోతే, ఇంత తెలివితక్కువ నిర్ణయాలు తీసుకుంటారా?

15, ఆగస్టు 2011, సోమవారం

తెవాదుల అబద్ధాల్ని మళ్ళీ ఇంకొకరు బైటపెట్టారు

52 కామెంట్‌లు
తెవాదుల అబద్ధాలు పదే పదే బైటకొస్తూ ఉన్నాయి. సీయెన్నెన్ ఐబీయెన్ టీవీ వాళ్ళు చేసిన సర్వే ఈ తెవాదులు కప్పుకున్న అబద్ధాల వలువలను వలిచి మరీ బజాట్టో నిలబెట్టింది.

"తెలంగాణలోని మొత్తం నాలుక్కోట్ల మందీ కూడా ప్రత్యేకరాష్ట్రం కోరుతున్నారు. సీమాంధ్ర ప్రజల్లో మెజారిటీ సంఖ్యలో జనం ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుతున్నారు" అనేది వీళ్ల సుప్రసిద్ధ అబద్ధం. ఒకే వాక్యంలో నాలుగైదు అబద్ధాల్ని కూరడం వీళ్ళకున్న చాతుర్యం. పై వాక్యంలో రెండు పెద్ద అబద్ధాలను ఇరికించారు. ఆ సంగతి ప్రతీ రోజూ కోస్తా సీమల నేతలు చెబుతూనే ఉన్నారు, బ్లాగరులు తమ టపాల్లో చెబుతున్నారు, మొన్న శ్రీకృష్ణ కమిటీ కూడా రాత పూర్వకంగా తమ నివేదికలో చెప్పింది. తాజాగా ఇప్పుడు సీబీయెన్ ఐబీయెన్ చెప్పింది -అంకెలతో సహా! ఏం చెప్పిందీ..

5, ఆగస్టు 2011, శుక్రవారం

సమస్యలు బాబోయ్ సమస్యలు

4 కామెంట్‌లు
ముసురుకున్న సమస్యల నుండి బైట పడటానికి నాయకులు దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. తాము ఎదుర్కొంటున్న సమస్య నుండి కాపాడమంటూ వేడుకుంటున్నారు. ఇలా సాగాయవి:

మేడమ్మ: ఎట్టాగోట్టా మబ్బాయిని ప్రధానమంత్రిని చెయ్యి ప్రభూ! నాకున్న సమస్యల్లా ఇదొక్కటే. ఈ దేశానికున్న ఏకైక సమస్య కూడా ఇదే! దీన్ని తీర్చావంటే నేను, ఈ దేశ ప్రజలూ కూడా శేష జీవితాన్ని హాయిగా గడిపెయ్యొచ్చు.

4, ఆగస్టు 2011, గురువారం

ఈ రోజుల్లో ఢిల్లీలో ఒకరోజు

10 కామెంట్‌లు
ఢిల్లీ నుంచి అందిన రెండు వార్తల గురించిన వివరాలివి, చదవండి.
.................................................................................

కాంగీసాఫీసులో విలేఖరుల సమావేశం జరుగుతోంది. అధికార ప్రతినిధి మాట్టాడుతున్నాడు..

మా మేడమ్మకు ఒంట్లో బాగోకపోడం మూలాన అమెరికా వెళ్ళారు. రెండు మూడు వారాల దాకా తిరిగి రారు. ఈ లోగా తాననుభవిస్తున్న అధికారాలను ఇలా సర్దారు..

సంబంధిత టపాలు