సత్యసాయి ట్రస్టు నిర్వహించిన మొదటి విలేఖరుల సమావేశం జరిగిందివ్వాళ. బహుశా ఆ ట్రస్టు ఏర్పడ్డాకే ఇది మొదటిదై ఉండొచ్చు. ట్రస్టు సభ్యులంతా కూచ్చున్నారు. తొంభై శాతం మాట్టాడింది శ్రీనివాసన్ అనే అతడే. మిగతా వాళ్ళంతా ఉత్సవ విగ్రహాల్లా కూచ్చున్నారంతే.
చాలా చులాగ్గా లాగించేసారు సమావేశాన్ని. ’అంతా బాగానే ఉంది. అన్నీ పద్ధతిగానే ఉన్నాయి.’ అని చెప్పుకున్నారు. మీడియావాళ్ళు చాలా ప్రశ్నలు అడిగారు గానీ ఎక్కడా ట్రస్టును ఇబ్బంది పెట్టలేకపోయారు. కాస్తో కూస్తో ఇబ్బంది కలిగించే ప్రశ్నలను కూడా తేలిగ్గా తప్పించేసారు, ఇరుక్కోకుండా తప్పించేసుకున్నారు.
ట్రస్టు మీద వచ్చిన ఆరోపణలను దృష్టిలో పెట్టుకుని వాటన్నిటికీ సమాధానాలు చెప్పి తమ నిజాయితీని, నిబద్ధతనూ నిరూపించుకుందామన్న తలంపు ట్రస్టు సభ్యుల కసలు ఉందో లేదో గానీ, ఆ పని మాత్రం వాళ్ళు చెయ్యలేకపోయారు. వాళ్ల మీద ఉన్న అనుమానాలు చాలావరకూ అలాగే ఉండిపోయాయి.
బాబాకు సంబంధించిన మెడికల్ రికార్డులు (మొన్న హాస్పిటల్లో చేర్చడానికి ముందు ) దొరకలేదని వార్తలు వచ్చాయి. ఆయన వ్యక్తిగత మెడికల్ రికార్డులే జాగర్త చెయ్యలేని మీరు, ట్రస్టును ఎలా నిర్వహిస్తారు అని అడిగితే.. ’బాబా మెడికల్ వ్యవహారాలు - ఏ డాక్టర్ను కలవాలి వంటి విషయాలన్నీ - ఆయనే స్వయంగా చూసుకునేవారు. మాతో సంప్రదించేవారు కాదు.’ అని అన్నాడు. కాబట్టి వాటికీ మాకూ సంబంధం లేదు అని తెగేసి చెప్పినట్టే.
సత్యజిత్తు ఆయన దగ్గర ఎందుకు ఉండేవాడు అని అడిగితే అది బాబా ఇష్టం, తన వ్యక్తిగత వ్యవహారాలు చూసుకోడానికి బాబాయే స్వయంగా అతణ్ణి నియమించుకున్నారు అని తేల్చి చెప్పాడు.
అప్పుడెప్పుడో ప్రశాంతి నిలయంలో హత్యలు జరిగాయి, వాటి గురించి ఇంతవరకూ ఏమీ చెప్పలేదు అని అడిగితే, దాని గురించి ప్రభుత్వం చెయ్యాల్సిందంతా చేసింది, ఇక మేం చెప్పేదేమీ లేదు. అని అన్నారు.
బాబా మరణానికి ఇరవై రోజుల ముందే శవపేటికను ఎందుకు తెప్పించారు? అని అడిగితేఅది ఎవరో భక్తుడు తెప్పించాడు అని చెప్పాడు. భక్తుడైనా మరణానికి ముందే ఎలా తెప్పిస్తాడండీ అని అడిగితే దానికి దాటవేత సమాధానం చెప్పాడు.
’ట్రస్టుకు, డి కె ఆదికేశవులుకూ సంబంధం ఏంటి? అతడు ట్రస్టు సభ్యుల మీద ఎందుకు ఆరోపణలు చేస్తున్నాడు? అతడు ఐసీయూలోకి ఎలా వెళ్ళాడు?’ అని అడిగితే చొప్పదంటు సమాధాన మేదో చెప్పి తేల్చేసాడు. ఇది చాలా కీలకమైన ప్రశ్న, భవిష్యత్తులోనైనా దీనికి సమాధానం దొరుకుతుందేమో చూడాలి.
మొత్తమ్మీద ట్రస్టు సభ్యుల మీద వచ్చిన ఆరోపణలకు సంతృప్తికరమైన సమాధానాలు దొరకలేదు. విలేఖరులు కూడా వాళ్ళను పెద్దగా ఇబ్బంది పెట్టలేకపోయారు. అసలు కిటుకల్లా ఎక్కడుందంటే ఒక ప్రశ్న అడిగాక, అనుబంధ ప్రశ్న అడిగే అవకాశం ఆ వ్యక్తికి ఇవ్వకపోవడం. సమాధానం చెప్పేసి, ఇక నీ పని అయిపోయింది, ఇంక మాట్టాట్టానికి వీల్లేదు, అని చెప్పేసి తరవాతి వాళ్ళను అడగమనేవాడు, శ్రీనివాసన్. గట్టిగా అడగబోయిన కొందరిని పట్టించుకోలేదు. గంటన్నర పాటు సమావేశం జరిగినా, ట్రస్టు చేత పెద్దగా సమాధానాలు చెప్పించలేకపోయారు విలేఖరులు.
ఈ సమావేశం జరిగిన తీరు, అక్కడ కూచ్చున్న సభ్యులు, వాళ్ళ వ్యవహార విధానమూ వగైరాలను గమనిస్తే నాకు -ఆ ప్రశాంతి నిలయం క్రెమ్లిన్ లాగానూ, ట్రస్టు సోవియట్ కమ్యూనిస్టు పార్టీ లాగానూ, సభ్యులంతా బ్రెజ్నెవ్, కృశ్చెవ్, వగైరాల్లాగానూ అనిపించారు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికృష్చేవ్, బ్రెజ్నేవ్‌ల విషయం వేరు. అది సామ్రాజ్యవాదం & ప్రచ్ఛన్న యుద్ధానికి సంబంధించినది. ఇక్కడ జరుగుతున్నది అది కాదు. పుట్టపర్తిలో ఉన్నది ఏదో సమాంతర ప్రభుత్వమైనట్టు ప్రభుత్వం ఆ విషయం గురించి ట్రస్ట్ సభ్యులని అడగకపోవడం ఆశ్చర్యం కలిగించింది.
రిప్లయితొలగించండిమీరు గమనించారో లేదో విలేకర్లు మొదట్లో అన్నీ చచ్చు ప్రశ్నలు అడుగుతుండగా అనంతపురం లో ఒక లోకల్ పత్రిక నడితే వ్యక్తి గట్టిగా నిలదీసి కొన్ని ప్రశ్నలు అడిగాడు. ప్రతి దానికీ మీరే జవాబు చెప్తారేం, చక్రవర్తిని మాట్లాడమండి అని శ్రీనివాసన్ ని దులిపేశాడు. అప్పుడు గానీ మైకు చక్రవర్తికి ఇవ్వలేదు. సత్యజిత్ మాట్లాడాలని కూడా అతడే డిమాండ్ చేశాడు.
రిప్లయితొలగించండిఅతని తర్వాతే కాస్త మన పెద్ద పత్రికల వాళ్ళు కాస్త సెన్సిబుల్ ప్రశ్నలు అడిగారు. పైగా ఎలాంటి ప్రశ్నలు అడిగినా దాటవేత జవాబులే ఇచ్చారు.
ఇంతకు ముందు ట్రస్ట్ మీద ఛానెల్స్ లో వార్తలు వస్తుంటే "ఏమోలే, ఎంత నిజమో ఇదంతా" అనుకున్నా ఈ ప్రెస్ మీట్ తర్వాత మాత్రం ఖచ్చితంగా ట్రస్ట్ మీద మామూలు మనుషులకు సందేహం వచ్చి తీరాల్సిందే అన్నట్టుంది ఆ మీట్!
సత్యజిత్ ని పూర్తిగా పక్కన పెట్టినట్టే కనిపించారు ట్రస్ట్ మెంబర్లు.
గారం చేస్తే ఎవరైన చెడిపోతారు. ఈ ట్రుస్టుని ప్రభుత్వం బాగా గారం చేసి వదిలిపెట్టింది. ఇలా చేస్తే ఇదేమిటి, ఏ సంస్థైనా చెడిపోక తప్పదు. ఇదీ అంతే! TTDయె నయం, ఎంతో కొంత ప్రభుత్వ జోక్యం అన్నా ఉంది. ఈ ట్రుస్టుని ఈలాగే కొనసాగనిస్తే, ప్రజలకు సంబంధం లేని మరో బెలూచిస్తాన్లా తయారవుతుంది.
రిప్లయితొలగించండిప్రభుత్వం నమ్మకాల పేరుతో లోపాయికారీగా ట్రస్ట్‌కి స్వతంత్ర అధికారాలు ఇచ్చింది. గతంలో గ్రామీణాభివృద్ధి పేరుతో ప్రభుత్వ నిధులు భోంచేసిన స్వచ్ఛంద సంస్థలని మూసి వెయ్యించిన ప్రభుత్వం ఈ ట్రస్ట్ విషయంలో చూసీచూడనట్టు ఎందుకు వ్యవహరిస్తోంది? ప్రభుత్వానికి చట్టాలు ముఖ్యమా? వ్యక్తిగత నమ్మకాలు ముఖ్యమా? నాకు తెలిసి మన రాష్ట్రంలో బాబాకి వ్యతిరేకంగా సినిమా తీసిన ఎన్‌టిఆర్, ఇంకో మాజీ ముఖ్య మంత్రి నీలం సంజీవరెడ్డిలు తప్ప మిగిలిన రాజకీయ నాయకులందరూ బాబా భక్తులే. వ్యక్తిగత నమ్మకాల కోసం ఒక ట్రస్ట్‌కి చట్టాలకి అతీతమైన అధికారాలు ఇస్తారా?
రిప్లయితొలగించండిసురేష్,
రిప్లయితొలగించండిఇక్కడ మీరు రాసిన వ్యఖ్యలో మీదైన అభిప్రాయం ఏముందో చెప్పాలి? అరిగిపోయిన పాత రికార్డ్ లా రోజు తెలుగు వెలుగు పేపర్ లో ప్రచూరించే దానినే ఇక్కడ రాశారు. తెలుగు మీడీయా స్థాయి గురించి, దాని నిబద్దత గురించి ఎంత చెప్పుకొంటే అంత మంచిది.
" గారం చేస్తే ఎవరైన చెడిపోతారు. ఈ ట్రుస్టుని ప్రభుత్వం బాగా గారం చేసి వదిలిపెట్టింది."
ప్రభుత్వం ఏవిధం గా గారం చేసి వదిలిపెట్టిందో చెప్పిఉంట్టె బాగుండేది. అసలికి బాబా గారికి ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న గుర్తింపుకన్నా, బయటి రాష్ట్రాలలో, దేశాలలో గుర్తింపు ఎక్కువా. మీరు లెక్కలు తీసి చూస్తే వారే ఎక్కువడబ్బులు ఇచ్చి ఉంటారు. అసలికి ఆంధ్రా గవర్నమేంట్ ఎందుకు తల దుర్చాలో చెప్పండి? ఇక ఆ ట్రస్ట్ బోర్డ్ లో ఉన్నవారు 70 + సం||పైబడిన వారు. వారేవ్వరికి తెలుగు ప్రాంత నాయకుల మాదిరిగా అవినితి చరిత్ర, వెన్నుపోటు పొడిచిన చరిత్ర లేదని గమనించాలి. ఆబోర్డ్ మెంబర్లు వారి వారి రంగాలలో ఎంత విజయవంతమైన వారో నీకు తెలిసినట్లు లేదు. కొంచెం తెలుసుకొని మాట్లాడండి. అటువంటి వారినందరిని పక్కన పెట్టి గాసిప్ పేపర్ రాసే చెత్త ప్రశ్నలని నమ్మి వారి మీద చర్య తీసుకోవాలా? ఇంతకి వారు ఎమీ చేశారని చర్య తీసుకోవాలి?
Ram
నాదీ Ram గారి అభిప్రాయమే..!
రిప్లయితొలగించండి"ట్రస్ట్ ని ప్రభుత్వం స్వాధీన౦ చేసుకోవాలి లేదా గారం చేసింది" అనే వారు ఈ అజ్ఞానికి అందులోని తర్కం చెప్పగలరు. ట్రస్ట్లో ప్రభుత్వం డబ్బులు పెట్టిందా? లేక ఏ రూపేణా సాయం చేసిందా? ఏవైనా సాయం ఉందంటే అది బాబావారి నుంచే ప్రభుత్వానికి వెళ్ళింది.
అంటే రేపు మనింట్లో గొడవలు జరిగితే ప్రభుత్వానికి కబురెడాతమన్నమాట స్వాధీనం చేసుకోమని..! లేక మా ఇల్లు వేరు.. ట్రస్ట్ కాండం అంటారా? ;)
> దాచిందే ఎక్కువ!
రిప్లయితొలగించండిఅందరూ అదే చెబుతున్నారు
కొంత మంది భక్తులకి బాబా మీద కంటే ట్రస్ట్ మీద ఎక్కువ నమ్మకం ఉన్నట్టు ఉంది. ఇద్దరు ముగ్గురు రాజకీయ నాయకులు తప్ప మిగిలినవాళ్ళందరూ బాబాని నమ్మినవాళ్ళే. నమ్మకం సంగతి అటుంచితే చట్టాలని అనుసరించి పని చెయ్యాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? ట్రస్ట్ చట్టానికి అతీతమైనదైనట్టు ట్రస్ట్‌లో ఏమి జరుగుతోందో చూడకపోవడమేమిటి?
రిప్లయితొలగించండి/వ్యక్తిగత నమ్మకాల కోసం ఒక ట్రస్ట్‌కి చట్టాలకి అతీతమైన అధికారాలు ఇస్తారా?/
రిప్లయితొలగించండిఏమిటో 'అతీతమైన అధికారాలు'?!
ఎవలిచ్చిన్రు? ఏడికెల్లిచ్చిన్రు? :D :))))))
పరేషాన్ అవుతుండ్రా? ఫికర్ చేయకున్రి. తెలంగాన సోపతి విడిపోయేందుకు అతిముఖ్యమైన కారణాల సోది, సీకాంతాచారి గుండెసప్పుడు వినొచ్చి గిట్ల జర్ర వుత్తేజం పొందినా.
ఒక్క ముక్కలో చెప్పాలంటే .. ఇంతకీ మీ బాధేమిటో నాకర్థం కాలే, ఎందుకలా నసుగుతున్నారు? కాషాయం తీసేసి ఎర్రబట్ట చుట్టుకోమంటున్నారా?! లేదా బట్టలే తీసేసి నగ్నం(transparent)గా వుండాలి అంటున్నారా?! :))
ఏటి సెప్తున్నారు? ఏటి అని నాకీయాల నగ్నంగా మీరు సెప్పేయాల్సిందే(బొత్స సత్యన్నారాయన టైపులో)
ట్రస్ట్లో ఏమి జరుగుతోందో ప్రభుత్వం చూడకపోవడం చూస్తోంటే ట్రస్ట్‌కి చట్టాలకి అతీతమైన అధికారాలు ఉన్నాయని డౌట్ రావడం లేదా? నమ్మకాలే ముఖ్యమనుకుంటే సత్యసాయి ట్రస్ట్‌కే ఎందుకు, నిత్యానంద ఆశ్రమానికి కూడా చట్టానికి అతీతమైన అధికారాలు ఇవ్వొచ్చు. నమ్మకాలు వ్యక్తిగతమనుకోవచ్చు కానీ ఇక్కడ జరుగుతున్నది నమ్మకాల పేరుతో వ్యాపారం.
రిప్లయితొలగించండి/నమ్మకాలు వ్యక్తిగతమనుకోవచ్చు కానీ ఇక్కడ జరుగుతున్నది నమ్మకాల పేరుతో వ్యాపారం./
రిప్లయితొలగించండిడౌటా! ఏందుకు డౌటు, ఆయన్ని అందరిని పూడ్చినట్టే మట్టిలోనే సమాధి చేశారుగా!ఇందులో అతీతమేముందన్నా?! వూరికే 'ఎర్రజండ' పట్టుకుని 'నశించాలి! నశించాలి!' అని బ్లాగుల్లో పరేషానీ/గాభరా కైకూ యారో..? ఎండకాలం, ఇంద మజ్జిగ తాగు, జర నిమ్మళించి ఏమి నశించాలో చెప్పు, నీ బాంచన్ కాల్మొక్త జర ఇశదంగా చెప్పు పార్ట్‌టైమ్ కామ్రేడిపండ్..
నమ్మకాలమీద వ్యాపారం చేయవచ్చని మీరు నమ్ముతున్నారా?
1) ఇలాంటి వ్యాపారాలకు కంపెనీ చట్టం వర్తిస్తుందా? పబ్లిక్ లిస్టింగ్ వుండాల? మీరు/నేను షేర్లు కొనవచ్చా?
2) నమ్మకవ్యాపారం మీద వార్షిక ఆదాయమెంత? ఆదాయపు పన్ను కడుతున్నారా?
3) 'అతీత' అధికారాలు అంటే ఏమిటి? ఉదాహరణలు ఇవ్వండి.
4) నిత్యానంద అన్నారు, అతని ఆస్థులు జప్తు చేశారా? లేదే! బయట తిరుగుతున్నాడుగా! మరేంటి మీరు వూహించుకుంటున్న 'అతీత' అధికారాలు?
5) చైనాలో ఇలాంటి నమ్మకవ్యాపారాలు వుండవా? అక్కడ మావోని నమ్మకుంటే 'అతీతంగా' కుళ్ళబొడుస్తారంట కదా, నిజమేనా?
Snkr
చెత్త అనుమానాలు... పనికి మాలిన ప్రశ్నలు.. ట్రస్ట్ కి విరాళాలు ఇచ్చిన వాళ్ళు కూడా ఇంత ఫోజు కొట్టరు.
రిప్లయితొలగించండిసమాతర ప్రభుత్వాలా? తెలకపల్లి బ్లాగు లోంచి ఎత్తుకొచ్చిన పదమా? ఏం చేసారని సమాంతర ప్రభుత్వాలు అంటారయ్య? ప్రభుత్వ నిర్ణయాలను వేటినైన overrule చేస్తున్నారా? లేకపోతే తమరి మావోయిస్టుల్లాగా గ్రామాల్లో సొంత రాజ్యాలు నడిపి ప్రభుత్వాలను ధిక్కరిస్తున్నారా?
అసలు ఏ ప్రైవేట్ ట్రస్ట్ లో అయినా ప్రభుత్వం ఎందుకు జోక్యం చేసుకోవాల, ప్రాధమిక ఆధారాలు లేకుండా?
నమ్మకాలతో వ్యాపారమా? ఏ వ్యాపారం? ఉచితంగా విద్య, వైద్య చేసే వ్యాపారాలా? ఏనాడైనా కనీసం అక్కడికి వెళ్ళి చూసిన మొహాలేనా మాట్లాడేది?
ట్రస్ట్ లో ఏమి జరుగుతుందో ప్రభుత్వం ఆడిట్ లెక్కల్లో చూసుకుంటుంది. నిజానికి వాళ్ళకీ సమావేశం నిర్వహించాల్సిన అవసరం కూడా లేదు. కానీ నిజమైన స్వామి భక్తులకు అపోహలకు తావివ్వకూడదనే ఉద్దేశ్యం తో చేసినట్లున్నారు.
మన ప్రభుత్వాలు ఎన్నో ట్రస్ట్ ల నించి లక్షల ఎకరాల భూములు, కోట్లాది ఆస్తులు తీసుకొని ఏం అఘోరించింది అందరికి తెలుసు. కనీసం దీన్నైనా సవ్యం గా నడవనివ్వండి.
Regarding 'BABA' Horoscope and its analysis also similar to your comments. See the link
రిప్లయితొలగించండిhttp://astrokalachakra.webs.com/greatpeople.htm