15, ఏప్రిల్ 2011, శుక్రవారం

ఉండవల్లి అస్త్రం

ఉండవల్లి అరుణ్ కుమార్ జగనుపైకి ఒక పదునైన ఎన్నికల అస్త్రాన్ని విసిరాడు. పేరుబెట్టి పిలిచి, నిలదీసి ఉండవల్లికి అవకాశమిచ్చాడు జగను. అందివచ్చిన ఈ అవకాశాన్ని ఉండవల్లి బాగా వాడుకున్నాడు.

అసలు జరిగిందేంటంటే.., సాక్షి టీవీ వాళ్ళు ఒక ప్రత్యేక కార్యక్రమం పెట్టి ఉండవల్లిని ఊసరవెల్లి అంటూ ఒక అరగంట పాటు నానావిధాలుగా తిట్టారంట. ఏదో ఒక విషయం గురించి చెప్పడం, ఏమయ్యా ఉండవల్లీ దీనికి సమాధానం ఏంటి అని అడగడం - ఇలా సాగింది ఆ కార్యక్రమం. దానికి సమాధానంగా ఉండవల్లి ఏకంగా ఒక సీడీ తయారుచేసి, ఏప్రిల్ 14 న టీవీల వాళ్ళందరికీ పంచిపెట్టాడు. సాక్షి అడిగిన ఒక్కొక్క ప్రశ్ననూ చూపించడం, దానికి తన సమాధానం చూపించడం - ఇలా సాగింది ఆ సీడీ.  అందులో ఉన్న విషయాలన్నిటి జోలికీ పోనుగానీ, మచ్చుకు ఒక్కటి చెబుతాను.. రాశేరె మరణంపై వయ్యెస్ అభిమానుల్లో అనుమానాలున్నాయి. తూతూ మంత్రంగా జరిగిన దర్యాప్తుపై ఉండవల్లి ఎందుకు నోరెత్తలేదు? అనేది సాక్షి ప్రశ్న. దానికి ఉండవల్లి ఇచ్చిన సమాధానం - ’దర్యాప్తు తరవాత అది ప్రమాదమేని ధృవీకరించారు. అంచేత అది ప్రమాదమేనని నేను నమ్మాను. జగనూ! నువ్వు రాజశేఖరరెడ్డి కొడుకువి, అది కుట్ర అని అనుమానించావు, సంవత్సరన్నర పాటు పార్లమెంటు సభ్యుడిగా ఉన్నావు- మరి నువ్వు పార్లమెంటులో ఈ విషయాన్ని ఎందుకు లేవనెత్తలేదు?’ ఇలాంటి సూటి సమాధానాలే ఆ సీడీ నిండా. ఉండవల్లి ఇచ్చిన సమాధానాలన్నీ జగన్మోహనరెడ్డికి ముక్కుమీద గుద్దినట్టు గట్టిగా తగుల్తాయి.
టీవీ9 ఈ సీడీని వివరంగా ప్రసారం చేసి, ఆనక, ఉండవల్లితో చర్చ పెట్టింది. దాన్లోకి అంబటి రాంబాబును కూడా లాగాడు, రజనీకాంతు.ఉండవల్లి అంబటి రాంబాబును ఆటాడుకున్నాడు. మామూలుగా చర్చల్లో పెద్దగా మాట్టాడుతూ అవతలి వాళ్లను డామినేటు చేసే రాంబాబును, ఉండవల్లి తన వాదనతో మట్టికరిపించాడు.

జగనేయులందరూ ’రాశేరె చనిపోగానే కాంగ్రెసు వాళ్ళు ఆయన్ను మర్చిపోయారు, ఆయన కుటుంబానికి అన్యాయం చేసారు, చీల్చారు, ఆ కుటుంబంతో ఢిల్లీ మేడమ్మ మాట్టాట్టానిక్కూడా ఇష్టపళ్ళేదు’, అని మాట్టాడుతూ ఇమోషనల్ బ్లాక్ మెయిలింగు చేస్తూంటారు. అది వాళ్ళ ప్రధానాస్త్రం. ఈ సీడీద్వారా, టీవీ9 చర్చద్వారా, ఈమధ్య చేసిన తన ప్రకటనల ద్వారా ఉండవల్లి దీనిమీద దెబ్బకొట్టాడు. తనను వ్యక్తిగతంగా దూషించడం వల్లనే తాను ఇంతలా స్పందించాను అనే పిక్చరిచ్చినప్పటికీ,  ఇది ఒక చక్కటి ఎన్నికల ప్రచారాస్త్రం అనేది మాత్రం స్పష్టంగా తెలిసిపోయింది. ఆయన దాన్ని దాచిపెట్టే ప్రయత్నం కూడా చెయ్యలేదులెండి. సీడీలో ఉండవల్లి చెప్పిన మాటలు ఈ ఎన్నికల్లో కాంగ్రెసు ప్రచారకులకు బాగా పనికొస్తాయి. చాలా తార్కికంగా ఉన్న ఉండవల్లి వాదన తటస్థులను బాగా ఆకట్టుకోడమే కాదు, ఘన జగనేయులను కూడా నోరెత్తనివ్వవు.
-----------------------------------------
గత ఎన్నికల్లో ఉండవల్లి పాల్గొన్న ఒక చర్చను గురించి నేను రాసినది చదవండి.

13 కామెంట్‌లు:

  1. తెలుగుదేశం వాళ్ళంతా కాంగ్రెస్ కు సపోర్ట్ వాస్తవమేనని నిరూపించారు

    రిప్లయితొలగించండి
  2. అంతే కాని, రామోజి మీద యుద్దం చేసినప్పుడేమో "గొప్పవల్లి", ఇప్పుడేమో ఊసరవెల్లి జగన్ అభిమానులకు అయ్యాడు అని మాత్రం ఒప్పుకోరు. ఇంతకీ జగన్ అభిమానులు దగ్గర ఏమయినా సమాధానాలు ఉన్నాయా ఆయన అడిగిన ప్రశ్నలకు?

    చచ్చిన దేముడిని చంపింది కుట్ర చేసి అయితే, దేముని బిడ్డ నోరు ఎందుకు ఏడాది పైగా మూసుకుపోయిందో పార్లమెంట్లో యువారాజా అభిమానులు చెబుతారా? అప్పుడేమయ్యిందో ఆత్మాభిమానం?

    రిప్లయితొలగించండి
  3. నేను జగన్ కి మద్దతు దారుని కాను. అలాగే ఆయన అంటె ప్రత్యేక అభిమానం లేదు. నాకు ఉన్న ఒక కోరిక ఎమిటంటే కేంద్ర లో కాంగ్రెస్ ప్రభుత్వం శాశ్వతంగా పోవాలి/ కాంగ్రెస్ పార్టి దెబ్బతినాలి. అది ఎవరి వలనైనా వీలౌతుంది అంటే జగన్ కి మాత్రమే సాధ్యం. ఒకసారి జగన్ ఆంధ్రాలో బలపడితే చాలు. కేంద్రంలో కాంగ్రెస్ పని గల్లంతు. 2జి గురించిగాని, కాంగ్రెస్ పెద్దల గురించి కాని, సుబ్రమన్య స్వామి పేపర్ ప్రకటనలను సాక్షి పేపర్ మాత్రమే బాగా కవర్ చేస్తున్నాది. మిగతావాటి గురించి ఎంత తక్కువ చెప్పుకొంటె అంత మంచిది. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోక పోయినా జగన్ తెగువ, సాహసం,పోరాట పటిమ అద్భుతం. అది అతనిని ఒక ప్రత్యేక లీడర్ కేటగిరి కింద తీసుకు పోతుంది.
    ------------------------------------------
    తెలుగు రాజకీయ నాయకులలో సగం మందికి మైక్ ముందు మాట్లాడటం రాదు. అంతా ధన బలం, కుల బలం, కుటుంబం చరిత్ర పేరు తో టికేట్లు తెచ్చుకొని గెలుస్తూంటారు. ప్రస్తుత తెలుగునాట రాజకీయ నాయకులలో ఉన్న వారిలో టాలేంట్ ఉన్న వారు వేళ్ళ మీద లెక్క పేట్టవచ్చు. అతనిలాంటి టాలేంట్ ఉన్న రాజకీయ నాయకులకు ఇటువంటి (అంబటి) వారిని వాదించి గెలవటం ఒక లేక్క లోకి రాకపోవచ్చు. అలాంటివారు టి.వి. షోలు చూసే వారిని మెప్పించటం ఒక విషయమే కాదు. వెన్నతో పెట్టిన విద్య. కాని అటువంటి వారికి ఒక మంత్రి పదవి ఇవ్వలేని పార్టిని ఆయన ఆహా ఒహో అని పొగడటం. రీటైర్మేంట్ వయసు వస్తున్నా, ఆయనకి ఎటువంటి మంత్రి పదవి ఇవ్వకుండా ఇటువంటి టి వి షోలకు ఆయనని పరిమితం చేయటం చూస్తూంటె కంగ్రెస్ పార్టిని తెలుగు వారు అనవసరంగా నెత్తికెక్కించుకొని బండ చాకిరి చెస్తున్నారు. న్నో పార్టిలు మారిన జైపాల్ రేడ్డిగారికి మంత్రి పదవి ఇచ్చి, ఎన్నో సంవత్సరాలు పార్టిలో ఉన్న ఉండవల్లి గారిని ఎమీ గుర్తించారు? మిగతా యం.పి. ల మాదిరిగా ఆయనకి వేల కోట్ల వ్యాపారాలు లేవు కదా! మంత్రి పదవి ఇవ్వకపోయినా ఇంకొక విధంగా లాభం పొందటానికి. రాజకీయాలను సీరియస్ గా తీసుకొన్న ఇటువంటి వారిని కనీసం పదవులిచ్చి గుర్తించకపోతే ఎమీ లాభాం. ఉండవల్లి గారిని అల్ప సంతోషి అని అనుకోవాలి, ఆయనకి పార్టి ఎమీ ఇవ్వకపోయినా ఇంకా టివి షోల ముందు పార్టికి మద్దతుగా మాట్లాడటం చూస్తూంటే.
    ----------------------------
    *అందివచ్చిన ఈ అవకాశాన్ని ఉండవల్లి బాగా వాడుకున్నాడు.*
    ఆయన అవకాశం వాడుకోవటం తరువాత, ఆయ్నని అందరూ బాగా వాడుకొని, కూరలో కరివేపాకులా తీసేస్తున్నారు. పాపం ఉండవల్లిగారు !
    Ram

    రిప్లయితొలగించండి
  4. Ram:
    "కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం శాశ్వతంగా పోవాలి/ కాంగ్రెస్ పార్టి దెబ్బతినాలి."- నెహ్రూ కుటుంబ బానిసత్వం నుండి కాంగ్రెసు పార్టీ బైటపడాలి అనేది నా కోరిక.

    "2జి గురించిగాని, కాంగ్రెస్ పెద్దల గురించి కాని, సుబ్రమన్య స్వామి పేపర్ ప్రకటనలను సాక్షి పేపర్ మాత్రమే బాగా కవర్ చేస్తున్నాది." - మరి, తమ సొంత మచ్చలను చూపించుకునే తెగువ, సాహసం ఉండొద్దూ!!

    "మీరు ఒప్పుకున్నా ఒప్పుకోక పోయినా జగన్ తెగువ, సాహసం,పోరాట పటిమ అద్భుతం. అది అతనిని ఒక ప్రత్యేక లీడర్ కేటగిరి కింద తీసుకు పోతుంది. " - ఔనౌను, ఎంత తెగువ లేకపోతే లక్షలకోట్ల ఆస్తుల్ని దోపిడీ చెయ్యగలగుతాడు? అన్ని డబ్బులు ఎనకేసుకున్నవాడికి, ఇంకా సంపాయించాలనే యావ చావని వాడికి సాహసాలకు కొదవేమీ ఉండదులే. దోపిడీ, దౌర్జన్యాల విషయంలో అతడికి సాటి రాగల నాయకుడు అతడి తండ్రే, ఇంకొకరు లేరు. అంచేత మీరన్నట్టు, అతడు ఖచ్చితంగా ఒక ప్రత్యేక లీడర్ కేటగిరీయే.

    ఇక, ఉండవల్లి గురించి మీరు రాసిన వ్యాఖ్యల విషయంలో ప్రత్యేకించి నేను చెప్పేదేమీ లేదు. కాకపోతే, ఉండవల్లికి ఏం ఒరిగిందని కాకుండా అతడు చెప్పినదానిలో నిజమెంతో, దానికి జగను ఏం సమాధానం చెబుతాడో ఆలోచించాలి మీవంటి జగన్ మద్దతుదారులు, అభిమానులు కానివాళ్ళు.

    రిప్లయితొలగించండి
  5. @"నేను జగన్ కి మద్దతు దారుని కాను. అలాగే ఆయన అంటె ప్రత్యేక అభిమానం లేదు. "
    మంచిది చూద్దాం.
    @"నాకు ఉన్న ఒక కోరిక ఎమిటంటే కేంద్ర లో కాంగ్రెస్ ప్రభుత్వం శాశ్వతంగా పోవాలి/ కాంగ్రెస్ పార్టి దెబ్బతినాలి. అది ఎవరి వలనైనా వీలౌతుంది అంటే జగన్ కి మాత్రమే సాధ్యం. ఒకసారి జగన్ ఆంధ్రాలో బలపడితే చాలు. కేంద్రంలో కాంగ్రెస్ పని గల్లంతు."

    అది ఎలా? ఒక వేల ఆంధ్రాలో బలపడితే కాంగీ బలం తగ్గుతుంది అనుకొంటే, అది చెంద్ర బాబు దగ్గరనుండి, లోక్సత్తావరకు ఎవరయినా సరే బలపడి కాంగీ కి బలం తగ్గితే సరిపోతుంది కదా!! మరి జగన్ కు మాత్రమె ఎలా సాధ్యం? అవనీతితో సంపాదించిన డబ్బులా? మంగలిక్రిష్ణ లాంటి వారి అండా? గాలి అండా? సారీ మీకు జగన్ అంటే ప్రత్యెక అభిమానం లేదు కదూ ;-)

    @"2జి గురించిగాని, కాంగ్రెస్ పెద్దల గురించి కాని, సుబ్రమన్య స్వామి పేపర్ ప్రకటనలను సాక్షి పేపర్ మాత్రమే బాగా కవర్ చేస్తున్నాది. మిగతావాటి గురించి ఎంత తక్కువ చెప్పుకొంటె అంత మంచిది. "
    అలాగే ysr వర్ధంతి ని తెలుగు పండగలలో వేసి పంచాంగం మరీ కవర్ చేసేది సాక్షి మాత్రమె కదూ!! మిగతా పత్రికలూ ఏరకంగా తక్కువ? చదివే జనాలలోనా? కాన్గీని మట్టికరిపించిన చరిత్రలోనా? వేల ఎకరాలు అప్పనంగా అప్పగించి రైతులు కడుపుకొట్టి, ఆ డబ్బుతో పెట్టుబడులు తీసుకొని పత్రిక పెట్టి నడపటం లోనా? సారీ మీరు జగన్ మద్దతు దారు కాడు కదూ ;-)

    @"మీరు ఒప్పుకున్నా ఒప్పుకోక పోయినా జగన్ తెగువ, సాహసం,పోరాట పటిమ అద్భుతం. అది అతనిని ఒక ప్రత్యేక లీడర్ కేటగిరి కింద తీసుకు పోతుంది."
    మీరు ఒప్పుకొన్నారు కదా, మీరు అనే ఆ తెగువ, సాహసం లాంటివి ఆయనకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చి ఉంటె ఎవరి పాదాల దగ్గర ఉండేవో మీకు తెలియదా? ప్రత్యెక లీడర్ కేటగిరి అంటే, బాబు అధికారం తో రాష్ట్రాన్ని అంతా అమ్మి దోచిన డబ్బుతో, ముఖ్యమంత్రి కుర్చీ ఇవ్వకపోతే గొడవ చేయటమా?

    @"తెలుగు రాజకీయ నాయకులలో సగం మందికి మైక్ ముందు మాట్లాడటం రాదు. అంతా ధన బలం, కుల బలం, కుటుంబం చరిత్ర పేరు తో టికేట్లు తెచ్చుకొని గెలుస్తూంటారు."
    నిజమే, మరి మీరు చెప్పే నాయకుడు, ధన బలం, కుల బలం, కుటుంబ చరిత్ర పేరుతొ కాక, ప్రత్యెక లీడర్ అయ్యాడు కదూ, LooooL

    @"కాని అటువంటి వారికి ఒక మంత్రి పదవి ఇవ్వలేని పార్టిని ఆయన ఆహా ఒహో అని పొగడటం. రీటైర్మేంట్ వయసు వస్తున్నా, ఆయనకి ఎటువంటి మంత్రి పదవి ఇవ్వకుండా ఇటువంటి టి వి షోలకు ఆయనని పరిమితం చేయటం చూస్తూంటె కంగ్రెస్ పార్టిని తెలుగు వారు అనవసరంగా నెత్తికెక్కించుకొని బండ చాకిరి చెస్తున్నారు."
    ఎవరికీ మంత్రి పదవి ఇవ్వాలో, లేక ఎలా వాడుకోవాలో కాంగీ పార్టీ ఇష్టమా? లేక ప్రత్యెక లీడర్ మరి వారి వీరాభిమానుల ఇష్టమా? సరే ఉండవల్లి సమర్దుడే మంత్రి పదవి ఇవ్వాల్సిందే అనుకొంటే, ఆ సమర్ధుడు, గొప్పోడు ను ఉసరవెల్లి అన్న సాక్షి ఎలా గొప్ప పత్రిక అయ్యింది, ఆయన మాట వినకుండా అంబటి లాంటి వాళ్ళ మాటలు వినే ఆయన ప్రత్యెక లీడర్ ఎలా అయ్యాడు?

    @"న్నో పార్టిలు మారిన జైపాల్ రేడ్డిగారికి మంత్రి పదవి ఇచ్చి, ఎన్నో సంవత్సరాలు పార్టిలో ఉన్న ఉండవల్లి గారిని ఎమీ గుర్తించారు? మిగతా యం.పి. ల మాదిరిగా ఆయనకి వేల కోట్ల వ్యాపారాలు లేవు కదా!"
    మరి జైపాల్ రెడ్డి కి వేల కోట్ల వ్యాపార్లు ఉన్నాయా? నిజానికి వేల కోట్లు ఉన్నవాళ్ళను (లగడపాటి గట్రా) మంత్రులును చేసారా మన రాష్ట్రాన్నినుండి? పార్టీలు మారటం తప్పు అయితే, ysr ప్రస్తానం ఎక్కడ మొదలయ్యింది, రెడ్డి కాంగీ తో మొదలయ్యి, ఇందిరాగాంధీని తిట్టడం తో మొదలు కాలేదా? మరి ysr ని ముఖ్యమంత్రి చేయటం కూడా తప్పే నంటారా?

    @"ఉండవల్లి గారిని అల్ప సంతోషి అని అనుకోవాలి, ఆయనకి పార్టి ఎమీ ఇవ్వకపోయినా ఇంకా టివి షోల ముందు పార్టికి మద్దతుగా మాట్లాడటం చూస్తూంటే. "
    ఆయన నాకు కుల బలం, క్యాష్ బలం లేకపోయినా రెండు సార్లు MP పదవి ఇవ్వటమే గొప్ప, దానితోపాటు నా స్థాయి కి తగ్గ గుర్తింపే ఇచ్చారు అని చెబుతుంటే మీరు అల్పసంతోషి అంటున్నారు, పోనీ అలాంటి మంచి మనిషి మాటలు వినకుండా బయటకు పోయింది కాక, అయ్యన్ను ఊసరవెల్లి చేసిన సాక్షి గొప్ప పత్రిక, దాని నాయకుడు ప్రత్యెక లీడర్ ఎలా అవుతాడు?

    @"ఆయన అవకాశం వాడుకోవటం తరువాత, ఆయ్నని అందరూ బాగా వాడుకొని, కూరలో కరివేపాకులా తీసేస్తున్నారు. పాపం ఉండవల్లిగారు ! "
    అందరూ అంటే ఎవరు? ఆయన మొదట నుండి ysr అభిమానిని, ఆయనే రాష్ట్రం లో నాకు అండ అని చెబుతూ వస్తున్నాడు, 2004 నుండి, మరి ysr తనను నమ్ముకోన్నవాడిని కరివేపాకులాగా తీసేసాడనా మీ బాధ :) , పాపం ఉండవల్లి మాత్రం ysr అలాంటి వాడు కాదనే పోగుడుతున్నాడు, అదినిజం కాకపోవచ్చు, ఎందుకంటే ఉండవల్లి అల్పసంతోషి కదా, అందుకనే ఆ అల్పసంతోషం తోటే, ysr ని బ్రతికినప్పుడు పొగిడినట్లే ఇప్పుడూ పోగుడుతున్నాడు ;-)

    నేను మాత్రం ఒప్పుకొంటున్నాను, మీరు మాత్రం జగన్ అభిమానులు కాదు, ఉండవల్లి అభిమానులు మాత్రమె అని :))))

    రిప్లయితొలగించండి
  6. @చదువరి,

    "అతడు ఖచ్చితంగా ఒక ప్రత్యేక లీడర్ కేటగిరీయే. " బాగా చెప్పారు, జగన్ అభిమాని కాని అజ్నాతకు :)

    రిప్లయితొలగించండి
  7. @15 ఏప్రిల్ 2011 2:14:00 సా GMT+05:30
    అజ్ఞాతా,
    కొండను తవ్వి ఎలుకని పట్టినట్లుంది నీ సమాధానం. నేను రాసిన దానిని లైన్ ను లైన్ విడగొట్టి చాలా ప్రశ్నలు వేసుకొని అతి తక్కువ కాలం లో దానికి నీ సమాధానలు జత చేరుస్తూ వ్యఖ్య రాశావు. నువ్వు రాసిన దానిని నేను పూర్తిగా చదవ లేదు. నాకు చదవాల్సిన అవసరం లేదు. కాని దాని లెంగ్త్ ను చూసి ఆశ్చర్య పోయాను. నాలాంటి వాడు రాసిన ఒక అనామక ప్రాముఖ్యత లేని వ్యాఖ్యను లో ఎదో పెద్ద నాయకుడు ఇచ్చిన స్టేట్మెంట్ లా పట్టి పట్టి చదివి ఇంత పెద్ద సమాధనం ఇచ్చె పనిలేనివారు ఉంటారా అని మొదటిసారిగా ఆశ్చర్య పోయాను. ఇంత ఖాళి సమయం గల వారు బ్లాగులోకం లో తిరుగుతుంటారని తెలిసి ఆశ్చర్యానికి లోనైనాను.
    మీకు ఇంకా గొప్ప విశ్లేషకుడు పేరు రావాల్నంటె పద పదాన్ని విడగొట్టి ఒక పెద్ద టాపాపేరు పెట్టి రాసుకోండి. ఇలా అజ్ఞాతం గా రాస్తే ఎమి లాభం? నాకేమి అభ్యంతరంలేదు. దానిలో @, :), :-) ,:)))), $ ఇలా కనిపించిన ప్రత్సి సింబల్ ని పెట్టుకొని రాసుకొని జబ్బలు చరచుకోండి! మీరు ఇప్పుడిప్పుడే ఇటువంటి అనాలిసిస్ ఇప్పుడే మొదలు పేట్టినట్లు ఉన్నారు. కాని మీలాంటి విశ్లేషకులను నాచిన్న తనం నుంచి చూస్తున్నాను టీ కొట్టు దగ్గర, నాలుగు కూడళ్ళ దగ్గర, పార్క్ లో ఎంతో మందికి ఇదే పని. నాకేమి కొత్తకాదు. నేను చదువరి బ్లాగు రెగులర్ గా చదువుతాను కనుక నా అభిప్రాయం రాశను అంతే . మీకైతే చాలా ఖాళి సమయం చాలా ఉన్నట్లుంది కనుక ఈ వ్యాఖ్యను కూడా విడగొట్టి ఇంకొక వ్యాఖ్య రాసుకొన్నా నాకేమి అభ్యంతరం లేదు.
    Ram

    రిప్లయితొలగించండి
  8. 15 ఏప్రిల్ 2011 2:14:00 సా GMT+05:30

    బాగా చెప్పావు అజ్ఞాతా. Ram అజ్ఞాతకు మాటల్లేవు. :)

    రిప్లయితొలగించండి
  9. Ram,

    @"నువ్వు రాసిన దానిని నేను పూర్తిగా చదవ లేదు"
    Are you sure ?

    @"నాలాంటి వాడు రాసిన ఒక అనామక ప్రాముఖ్యత లేని వ్యాఖ్యను "

    భలే వాళ్లే, ఓ ప్రత్యేకమయిన లీడరుకు ప్రత్యేకమయిన అభిమానులు, మీరు అనామకులు ఏమిటి? మరీ మోడెస్టీ కాకపోతేనూ :)

    @"కాని మీలాంటి విశ్లేషకులను నాచిన్న తనం నుంచి చూస్తున్నాను టీ కొట్టు దగ్గర, నాలుగు కూడళ్ళ దగ్గర, పార్క్ లో ఎంతో మందికి ఇదే పని. నాకేమి కొత్తకాదు"

    మీరు కొత్త అని ఎవరన్నారు? ఆ టీ కొట్టులలో, నాలుగు కూడళ్ళలో అనుభవంతోనే కదా, ప్రత్యేకమయిన లీడరును దర్శించుకొంటున్నారు!!

    @"ఇంకొక వ్యాఖ్య రాసుకొన్నా నాకేమి అభ్యంతరం లేదు."

    హేమిటో సారు ఎంతైనా జగన్ కు మద్దతు దారులు కాకుండా, అల్పసంతోషి ఉండవల్లి అభిమానులు, అంతా మీ అల్పసంతోషమే !!

    btw, మీలాంటి వారు దీనినీ పూర్తిగా చదవరని తెలిసి, నా మనోభావాలు దెబ్బతిన్నాయి :)))

    మీరయినా సరే, మీ ప్రత్యేకమయిన లీడరయినా సరే బుగ్గలు నిమిరే ఓ యాత్రా కార్క్రమాన్ని మొదలెట్టేయవచ్చు ;-)

    రిప్లయితొలగించండి
  10. బుగ్గలు నిమిరే యంత్రాలు, ఓదార్చే రాబోట్లు జపాన్లో వచ్చాయిట. 'కిత్నా బదల్‌గయా టెక్నాలజియాన్' అని ఐ-పాడ్లో వింటూ, ప్రచార రథానికి నాలుగు వైపులా వాటిని బిగించేసుకుని జనాల్లో దూసుకుకెళ్ళడమే! ఈజీగా రోజుకు లచ్చమందికి నిమిరేయొచ్చు. టెక్నాలజీ బాగా డెవలప్ అయిపోతోందోయ్, జగదేసు రెడ్డి. :P

    రిప్లయితొలగించండి
  11. #బుగ్గలు నిమిరే యంత్రాలు, ఓదార్చే రాబోట్లు జపాన్లో వచ్చాయిట
    హహ్హా.. హవునా!!! హిక అందరూ ఓదార్పులు మొదలెట్టొచ్చు అవితే ;)

    **
    Leave that clown crow, let it cry wolf!
    ***
    It seems you didnt observe below one!!!, If not iggy! ;)

    $SNKR Ji

    This is for you :)

    http://www.youtube.com/watch?v=ph7yYe4VfSg

    Let me know If the quality is not apt.

    రిప్లయితొలగించండి
  12. Thanks a lot Rajesh ji. Couldn't find that song, when I searched 3-4months back.
    I remember that song and not a bit of the movie...

    Picture quality is okay, though audio quality is not. chaltaa hai... thanks.

    రిప్లయితొలగించండి
  13. #Rajesh ji.
    lol ;)

    #Couldn't..I searched 3-4months back.
    Hm.. It seems You didnt grasp that uploaded the video for you. ah.. :(

    Well..I too feel same about audio quality, But it is how the DVD built. If You wanna me upload whole DVD, lemme know :)

    రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు