10, మార్చి 2011, గురువారం

ప్రజాస్వామిక రౌడీయిజం

’ఇది ప్రజాస్వామిక , అహింసాయుత ఉద్యమం. మేమెంతో ప్రజాస్వామికంగా ఈ ఉద్యమాన్ని నడుపుతున్నాం. పోలీసులు, ప్రభుత్వం మమ్మల్ని అప్రజాస్వామికంగా అణచివేస్తున్నారు’ అంటూ తెవాద నాయకులు గోల పెడుతూ ఉంటారు. వాళ్ళు ఇవ్వాళ చేపట్టిన మిలియన్ మార్చి కూడా ఎంతో చక్కగా, కనీవినీ ఎరగనంత ప్రజాస్వామికంగా జరిగింది.


ట్యాంకుబండ్ మీద ఉన్న తెలుగు వెలుగుల విగ్రహాలను విరగ్గొట్టారు. చెర్లోకి కూలదోసారు. 
ఈ వ్యవహారాన్ని చిత్రీకరిస్తారేమోనన్న భయంతో టీవీ వాళ్ళ కెమెరాలను ధ్వంసం చేసి, చెర్లో పడేసారు.
టీవీ వాళ్ళపై చెయ్యి చేసుకున్నారు.
టీవీ వాళ్ళ ఓబీ వాహనాన్ని తగలబెట్టారు.
పోలీసుల వాహనాలను తగలబెట్టారు.
ఆంధ్రాబ్యాంకు ఏటీయెమ్ముకు నిప్పు పెట్టారు.
మార్చిలో పాల్గొందామని వెళ్ళిన కేకే, మధు యాస్కీలపై దాడి చేసారు.

విగ్రహాలను కూలదోయడంపై మీ స్పందన ఏంటి అని టీ-జాక్ కోచైర్మన్ ను అడిగితే ఆయనిచ్చిన సమాధానం ఇలా ఉంది: ’దాని గురించి మాకేం తెలవదు. మావాళ్ళెవరూ అలా చెయ్యలేదు. అది ఆంధ్రుల కుట్ర. అలా చేసినవాళ్ళు మీ కెమెరాల్లో కనబడితే వాళ్ళ మీద కేసు పెట్టుకోండి. అసలు మా నాయకులను అరెస్టులు చేసారు అందుచేత ఇక్కడ జరిగిన హింసను  మేం నియంత్రించలేం’

కనబడితే కేసుపెట్టుకోవాలంట -టీవీల్లో కనబడకుండా ఉండటానికేగా కెమెరాలను పగలగొట్టింది! ఉద్యమ నాయకులే ఇంత బాధ్యతారహితంగా మాట్టాడుతూంటే, ఇక ప్రజలు ఎంత బాధ్యతాయుతంగా ఉంటారో చెప్పనక్కర్లేదు.  ఇలాంటి నాయకులు ఉద్యమాన్ని శాంతియుతంగా నిర్వహిస్తారంటే మనం నమ్మగలమా? ఉద్యమాన్ని ప్రశాంతంగా నడపగలిగే శక్తి వీళ్ళకు లేదు. అస లిలాంటి పెద్ద పెద్ద ప్రజాకూటమిలకు పిలుపునిచ్చే అర్హత వీళ్ళకు లేదు. మిలియన్మార్చి, బిలియన్మార్చి అంటూ  బడాయిలు చెప్పారు. పదివేల మంది జనాన్నే నియంత్రించలేకపోయారు.., పది లక్షల మంది జనాన్ని నియంత్రించగలరా!?

ఈ మిలియన్మార్చి ఒక విషయాన్ని మాత్రం తెల్లం చేసింది -ఉద్యమ నాయకత్వం చాలా అసమర్థంగా ఉంది. వాళ్ళకు సరైన ప్రణాళిక లేదు. ఎవరేం చేస్తున్నారో ఎవరికీ తెలియనట్టుంది. మార్చి మార్చంటూ ఫిబ్రవరి నుంచీ పిలుపులిచ్చిన వాళ్ళు అయిపు లేరు, లేదా ఆలస్యంగా వచ్చారు. అంతా అయ్యాక ఒక తెరాస నాయకుడు ’ఇది మిలియన్మార్చి కాదు కేవలం ఒక ప్రదర్శన అని మాత్రమే అని చెప్పాం, పోలీసులను అనుమతి కూడా అడిగాం ’ అని చెప్పాడు. ఇంత సమన్వయ లేమితో నిర్వహించారు మార్చ్! తీరా హింస జరిగాక, మాకేం సంబంధం లేదంటూ ఒకరు, హింస జరగడం విచారకరం అని ఒకరు.. వ్యాఖ్యానిస్తున్నారు. ఉద్యమమన్నాక, హింసను పూర్తిగా ఆపలేకపోవచ్చు. కనీసం దాన్ని ఎదుర్కోడానికి ప్రయత్నించాలి. తప్పు జరిగిపోతే ధైర్యంగా ఒప్పుకోవాలి, హింసను ఖండించాలి. ఇవన్నీ చెయ్యాలంటే నాయకత్వానికి గుండెల్లో ధైర్యముండాలి. నాయకత్వ పటిమ ఉండాలి. జనం తోస్తూ ఉంటే ముందుకు బడి దొర్లుకుపోయే నాయకత్వానికి ముందు నిలబడి జనాన్ని తమవెంట నడిపించగలిగే సత్తా  యాడనుం చొస్తది!

ఈ దాడుల్ని రాష్ట్రప్రభుత్వం ఇంకా ఎన్నాళ్ళు భరిస్తుందో, అసలీ ప్రభుత్వాన్ని  కేంద్రం ఎన్నాళ్ళు భరిస్తుందో తెలవడంలేదు. వీళ్ళందరినీ మన మెన్నాళ్ళు భరించాలో !

22 కామెంట్‌లు:

  1. Cutular icons ని destroy చేయటం అనేది, speaks volumes about that society.

    Is this all we are?

    I am speachless with this display of monumental stupidity

    రిప్లయితొలగించండి
  2. >> నాయకత్వానికి గుండెల్లో ధైర్యముండాలి

    Who??? I guess there no real LEADERS out there at all...A bunch of innocent people (including students) + Goons + Disgusting politicians + Naxals + whatever....

    BUT NOT A SINGLE REAL LEADER FOR THE MOVEMENT..WHATSOEVER...

    రిప్లయితొలగించండి
  3. అసలేం జరుగుతోందో!!!!...

    అసలెన్నాళ్ళిలా ఈ దరిద్రులని సహిస్తూ చూస్తూ కూర్చోవడం???
    వీళ్ళకో, నీతినియమాలంటూ ఏవీ లేవా?? వీధిరౌడీ లా ఆకురౌడిల్లాగా ప్రవర్తించే విపరీత ధోరణులకు ఆనకట్టల్లేవా?
    ఇదసలు ఉద్యమమేనా? వీధిపొరాటల్లాగా. అనాగరిక జనాలను వెంటేసుకొని వీధుల్లో పడటమేనా ఉద్యమం అంటే.
    అసలు ఒక్కడయిన చదువుకున్న వాళ్ళలా ప్రవర్తిస్తున్నారా? సభ్యత సంస్కారం ఎక్కడయిన కనిపిస్తొందా... ఒక్కరి మొహాల్లొ అయినా...అంతా అలగా జనాలే!!!
    గుండె రగిలిపోతొంది.షూట్ అట్ సైట్ కింద చంపిపారెయ్యాలి ఒక్కొక్కళ్ళని.

    ఎటు తీసుకెళ్తున్నారు. రాస్ట్రాన్ని. ఏ గంగలో కలిపెయ్యాలని? అసలు అంధ్ర రాష్ట్రానికి పట్టిన పీడ / దరిద్రం తొలిగేనా?మళ్ళీ పూర్వ వైభవం సాధించాలంటే ఎన్నేళ్ళు పడుతుంది.?ఎన్నాళ్ళు శ్ర్రమించాలి....
    ఈ చీడ పురుగులకి మందు వేసే మహనీయుడు కనుచూపు మేర కనిపించడం లేదు.

    గుండె మంట తో అడుగుతున్నా....అసలు మనమేమి చెయ్యలేమా.. ? ఇలా చేతులు ముడుచుకు కూర్చోవలసిందేనా..

    రిప్లయితొలగించండి
  4. ఇంతజరిగాక ఇంకా సమైక్య వాదం ఏంటి చదువరిగారూ
    నేనైతే ప్రత్యేకాంధ్రా ఉద్యమానికి తెరతీయాలని గట్టిగా ఆకాంక్షిస్తున్నా.

    రిప్లయితొలగించండి
  5. విగ్రహాలు కూల్చాలన్నదే మిలియన్ మార్చ్ ఎజెండా! పొద్దున్నే కోదండరామ్ "విగ్రహాలు కూల్చే ప్లానేదీ లేదు" అని హింట్ ఇవ్వనే ఇచ్చాడు. సాయంత్రానికల్లా అమలు చేశారు.

    విగ్రహాల విషయంలో ఎప్పటినుంచో కసితో రగిలిపోతున్నారు. ఇప్పటికి కుదిరింది.

    ఇలా చేసీ చేసీ ఈ ఉన్మాద జ్వాలల్లో ఎప్పటికో వాళ్ళే మాడి మసైపోతారు! సర్వ నాశనమైపోతారు. పోవాలి కూడా

    రిప్లయితొలగించండి
  6. KumarN: "Is this all we are?" - నిజానికి విగ్రహాలను పడెయ్యడం ఏదో యథాలాపంగా జరిగింది కాదండి. ఉద్యమాన్ని నిర్మించే క్రమంలో ఎంతో విషప్రచారం చేసారు. వాటిలో ఇదీ ఒకటి -తెలంగాణ నడిబొడ్డున కోస్తా సీమ ప్రాంతీయుల విగ్రహాలా? విగ్రహాలు పెట్టడానికి తెలంగాణలో ప్రముఖులే లేరా ఆంటూ గతంలో రెచ్చగొట్టారు. ఆ రెచ్చగొట్టే వ్యాఖ్యల పర్యవసానమే ఇవ్వాళ్టి కూల్చివేత! ఇలాంటివి ఇంకా ఎన్నో ఉన్నాయి. నిజానికి మనమిలా మారేందుకు ఈ విషప్రచారాలు ముఖ్య కారణం.

    ఘోరమేంటంటే, ’ప్రభుత్వ నిర్ణయ రాహిత్యం వలన, తెలంగాణ ప్రజలు సహనం కోల్పోయారు, అలాంటప్పుడు ఇలాంటి సంఘటనలు జరుగుతాయి’ అంటూ సమర్ధించేవారు లేదా మృదువుగా విచారించేవాళ్ళేగానీ, గట్టిగా ఖండించేవారు లేరు. ’వందలాది ఆత్మహత్యలు జరిగితే పట్టించుకునేవాళ్ళే లేరు, విగ్రహాలు పోతే ఇంత బాధ పడుతున్నారే’ అని కూడా అన్నారు కొందరు. -అదీ పరిస్థితి!
    ..........
    "BUT NOT A SINGLE REAL LEADER FOR THE MOVEMENT..WHATSOEVER..." - నిజమే!
    ............
    "అసలు మనమేమి చెయ్యలేమా.. ? ఇలా చేతులు ముడుచుకు కూర్చోవలసిందేనా.." -రాబోయే మూణ్ణాలుగు రోజుల్లో పరిణామాలను బట్టి తెలుస్తుంది.
    ............

    భాస్కర్ రామరాజు: :)
    ............
    "విగ్రహాల విషయంలో ఎప్పటినుంచో కసితో రగిలిపోతున్నారు. ఇప్పటికి కుదిరింది. " - నిజమండి.

    రిప్లయితొలగించండి
  7. "ఆరు వందల మంది 'ప్రాణ త్యాగం' చేసారు, అ త్యాగాల ముందు ఈ విగ్రహాల ధ్వంసం పెద్ద విషయం కాదు" అంటున్నాడు కేసీయార్ కొడుకు రామారావు. ఈ ఆరు వందల లెక్కేంటో నాకర్థం కాదు. వైయస్సార్ మరణానంతరం ఆత్మహత్యల లాంటి లెక్కేనా ఇది కూడా?

    రిప్లయితొలగించండి
  8. ఓహ్. నాకు తెలీదు, ఇలా విగ్రహాల గురించి అంతకు ముందే కొన్ని మాటలు వినిపించాయని. అకస్మాత్తుగా ఈ వార్త చూసేసరికి, అయోమయపడ్డా, ఇదేంట్రా ఇంత దరిద్రం ఒకేసారి ఊడిపడిందీ అని. సో, ఈ విగ్రహాల మీద కన్ను అంతకుముందే ఉందన్న మాట, కనీసం కొన్ని క్వార్టర్స్ ఆఫ్ తెలంగాణ అజిటేషన్ లీడ్ చేస్తున్న వాళ్ళల్లో.

    వాళ్ళు మొదటి సారి అలా మాట్లాడినప్పుడు, రాష్ట్రం గురించి పోరాడితే పోరాడారు కానీ, కల్చరల్ ఐకాన్స్ గురించి గర్వపడండి , వాళ్ళ గురించి ప్రాంతీయ సంకుచితత్వం తో మాట్లాడకండి అనేంత గొతు రాష్ట్రం మొత్తం మీద ఎవ్వరికీ లేకుండిందా? సి ఎం గారు కూడా ఏమీ మాట్లాడలేదా అప్పుడు?

    This will go down in history books as the most shameful act.

    రిప్లయితొలగించండి
  9. ఈ గొడవల ఒక హృద్యమైన విషయం ఏంటంటే గోడ మీది పిల్లుల్లాంటి కొందరు నపుంసకులకు జరిగిన సన్మానం. అక్కడ ఢిల్లిలో అమ్మ గారు పృష్ఠం చూపించి తోలేస్తే ఇక్కడ ఉన్మాదులు చెప్పులతో కొట్టేరు.

    రిప్లయితొలగించండి
  10. ట్యాంకుబండ్ మీద ఉన్న సీమాంధ్రుల విగ్రహాలను కూలగొడతామని తెరాస నాయకులు గతంలో ప్రకటించారు. వారిలో కేటీయారు కూడా ఒకడు. ఇలాంటి రెచ్చగొట్టే మాటలు చాలనే మాట్టాడారు. వాటి పర్యవసానమే నేటి మిలియన్ మార్చ్ లో మిలిటెన్సీ!
    "DailyBugle" - :)

    రిప్లయితొలగించండి
  11. తాగి పడుకోవడంతప్ప వొళ్ళు వంచి పనిచేయడానికి చేతకాదుగానీ వెధవలకి తెలంగాణా కావాలట.

    రిప్లయితొలగించండి
  12. ఊర్కోండి సార్! ఉన్నవన్నీ ఇరగ్గొడితే పొయ్యేది. పోలీసోళ్లతో ఒప్పందం కూర్చుకుని ఊరకే బిళ్ల దెబ్బలెయ్యమని "ఆళ్లందరూ" అనగా కాంగిరేసోళ్లు, తెరాసోళ్లు, తెలుగుదేశమోళ్లు, భాజపా వోళ్లు గుండ్రం బల్లెక్కి కూర్చుని మందు తాగుతూ మాట్టాడుకున్నారు అని ఇక్కడ బోల్డు మంది అనుకుంటున్నారు.

    నన్నడిగితే ఆ మీడియా వాళ్లను కూడా మిత్రులుగా ప్రకటించుకొనో, లేపోతే లోపాయికారీ ఒప్పందం చేసుకునో ఎవడు ఇరగ్గొట్టాడు అన్నది ఇరగ్గొట్టేవాడి మొహాలు చూపిచ్చకుండా (తర్వాత కేసుల గోల మన చెవుల పడకుండా ఉండటానికీ, ఈ తతంగమంతా లా.......క్కుంటూ, సా...క్కుంటూ మన బుర్రలు తినకుండా ఉండటానికన్నమాట!) ఇరిగిపోతున్న ఇగ్రహాలూ మటుకు చూయిస్తే మనోళ్ల గొప్పతనం ప్రపంచానికంతా తెలిసిపోయేది, సంతోషించేది.

    వీరి కీర్తి దిగ్దిగంతాలకు వ్యాపించాలనీ,బారుబద్దలుగా బాహువులు చాచి ఆకాశంలోకి ఎగేసుకునిపోవాలనీ కోరుకుంటున్న వారిలో ప్రథముడిని.

    విగ్రహాలేగా పోయింది..మళ్ళీ కొత్తవి చెక్కుకోవచ్చు. టాంకు బండు కాకపోతే ఇంకో బండు మీద పెట్టుకోవచ్చు...తెలివి, విచక్షణ, విలువలు ఉన్నాయి చూసారూ - అవీ అసలుగా పాతాళంలోకి పడిపోయినాయి ఇక్కడ. అవి తిరిగి పైకి రప్పించుకోటం, తెలుసుకోటం, కట్టుకోటం అసంభవం.

    రిప్లయితొలగించండి
  13. తెలంగాణా వాళ్లకి తమ నాయకులని గౌరవించుకోవడం రాదు. వీలయితే తన్నడం ఒక్కటే వారికి తెలుసు. తెలంగాణలో ఎక్కడా తెలంగాణా నాయకుల విగ్రహాలే కనిపించవు. ఎవడు పెట్టుకోవద్దన్నాడు. పీవీ నరసింహా రావు, కొమరం భీమ, కాళోజి, దాశరధి, బూర్గుల, ఇట్లా ఎవరివైనా ప్రతి జిల్లాలో ప్రతి మండలం లో పెట్టుకోవచ్చు, కానీ పెట్టుకోరు. పైసా కర్చు పెట్టె సాహసం ఎవరికీ లేదు. ఇతరులు విగ్రహాలు పెడితే మాత్రం ఓర్వలేరు. ఇతర్ల డబ్బుతో వాళ్ళ విగ్రహాలు పెట్టివ్వాలి. ఆమధ్య కొమురం బీం విగ్రహం ట్యాంక్ బ్యాండ్ మీద పెట్టక పొతే ఆయనకు ట్యాంక్ బ్యాండ్ మీద చోటు లేక పొతే ఒక విగ్రహాన్ని కూల్చి అయినా పెట్టాలి అని ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసారు. ఇప్పుడు ఒక్కటేమిటి పది పదిహేను విగ్రహాలు కూల్చేశారు. ఇప్పుడు ఆ ప్లేస్ లో తెలంగాణా వాళ్ళ విగ్రహాలు పెట్టాలని డిమాండ్ చేస్తారేమో. ఎంత అన్యాయం ఇది. ఉద్యోగాలలో ౪౦ శాతం షేర్ కావాలి , విగ్రహాలలో కూడా ౪౦ శాతం షేర్ కావాలి. ఈ డిమాండ్లకు అంతం లేదా? జగన్ లాగా వై ఎస్ ఆర్ విగ్రహాలను పెట్టించే అటువంటి గుండె ధైర్యం ఉన్న వాడు ఒక్కడైనా వున్నాడా తెలంగాణాలో లేరు. తమకు చేత కాదు ఇతరులు చేస్తే చూసి ఓర్వలేరు. షెం... షెం.

    రిప్లయితొలగించండి
  14. తెలుగు సంస్కృతి, తెలుగు వెలుగులు విరిజిమ్మిన మహానుభావులపై గౌరవంలేని వెధవలకు తెలుగు గడ్డపై కలిసుండే అర్హత లేదు. వెలి వేయవలసిందే.

    రిప్లయితొలగించండి
  15. ఆ వేర్పాటువాదుల అనాగరిక ఆందోళన నైతిక పతనానికి తొలిమెట్టు. రాష్ట్ర/ప్రాంతాలకు అతీతంగా వున్న తటస్థులు, మద్దతుదారులను సమర్థించుకోలేని నైతిక దిగజారుడు తనం. పోయినవి విగ్రహాలు మాత్రమే కాదు, తెలంగాణ పరువు హుసేన్‌సాగర్లో నిమజ్జనం అయ్యింది. భాధాకరమైనా, ఒక విధంగా మంచే జరిగిందనుకోవాలి.
    వూరూరా వున్న రాజీవ్ గాంధి, ఇందిరా గాంధీల విగ్రహాలు కూలిస్తే గాని సోనియాకు తెలంగాణ 'గు** చప్పుడు'( అదే గుండె చప్పుడు) తెలిసిరాదు. కెసిఆర్, తోకాసలు, కోదండరాం ఈ విషయాన్ని మోకాలితో పరిశీలించాలి.

    రిప్లయితొలగించండి
  16. /ఇంతజరిగాక ఇంకా సమైక్య వాదం ఏంటి చదువరిగారూ
    నేనైతే ప్రత్యేకాంధ్రా ఉద్యమానికి తెరతీయాలని గట్టిగా ఆకాంక్షిస్తున్నా./
    అదే! అదే! అదే! ... అహాహా అహాహ..
    అదే తెలబాన్లు కోరుకున్నది
    ఇదే మీ మనసు లాగుతున్నది. :))
    -----
    నాకైతే .. ఇలాంటి గబ్బుగాళ్ళతో సమైఖ్యంగా వుంటూ, ఇక్కడినుంచి పారిపోయే వారి పెట్టుబడులతో ఆంధ్ర, సీమను అభివృద్ధి చేసుకుంటూ .. శేషజీవితం గడిపేయాలని వుంది. :P

    రిప్లయితొలగించండి
  17. @Sankar
    సమైఖ్యంగా వుంటూ, ఇక్కడినుంచి పారిపోయే వారి పెట్టుబడులతో ఆంధ్ర, సీమను అభివృద్ధి చేసుకుంటూ .. శేషజీవితం గడిపేయాలని వుంది. :P
    ;):)

    రిప్లయితొలగించండి
  18. @Sravya V
    అంతే కదండి :)
    ఈ మద్యమకారులు ఇలా రగులుతూనే హైటెక్ సిటీ, చార్మినారు, గోల్కొండ, సికింద్రాబాదు, గౌలిగూడ ... పడగొడుతూ, ఆటవిక ఆట-పాట లతో అలరిస్తూ వుంటే, ఇకడ ఒవైసీలు-తెలబాన్లు తప్ప అంతా ఖాళీ చేసి పోతారు. సీమాంధ్ర ఇంకా త్వరగా అభివృద్ధి చెందడానికి ఆస్కారం వుంటుంది.

    రిప్లయితొలగించండి
  19. మీ లక్ష్యం కోసం పోరాడే దమ్ములేక పిరికివాళ్ళలా ఆత్మ హత్య చేసుకుని చచ్చిన వాళ్ళని అమరవీరులు, బలిదానాలు, తొక్క తోటకూర అనడానికి సిగ్గులేదూ.
    నాలుగు వందలమంది అని ఒకడు అంటాడు, ఆరు వందల మంది అని ఆ మరుక్షణమే ఇంకోడంటాడు. ఎంత మంది చచ్చారో మీకే తెలియదు. అసలు ప్రాణం విలువ తెలిస్తే చచ్చిన వాడిన హీరో చేసి మరింత మంది చావడానికి కారణం అవరు. ట్యాంక్ బండ్ మీద మహనీయుల విగ్రహాల కూల్చివేతకి , మీరు చెప్తున్నా సోకాల్డ్ బలిదానాలకి పోలికా? ఆ మహనీయులలో ఎవరూ ఆత్మహత్యలు చేసుకుని చావలేదు.

    చేతనైతే మీ నాయకులని చావమనండి. శని వదిలిపోతుంది.

    రిప్లయితొలగించండి
  20. ఒక తెలంగానోడు11 మార్చి, 2011 11:19:00 AM ISTకి

    ఇక్కడా, వేరే బ్లాగుల్ల కామెంటుతున్నోల్లు తెలంగానోల్లు తమ లెక్కనే నాగరికులు అనుకుని, ఇగ్రగాలు కూలగొట్టుడు నాగరికులు చేసే పన్లు కావని కామెంటుతున్నరు. మావోల్లకు అసలు నాగరికత మొదటికెల్లి లేనేలేదు. గిప్పుడు కొత్తగ రాదు. నిష్టదరిద్రులు. నిజామ్ బాంచలు. ఏం చేస్దం ? గీల్లు పసువులకెక్వ, మనిషికి తక్వ. "నువ్వు పవిత్రమైనదానివమ్మా" అని ఆవుతోని అంటే దానికేమి సమజైతది ? దాని లెక్కనే గీల్లూ. ఒరేయ్ నువ్వు మనిషివిరా గిట్ల ప్రవర్తిచొద్దురా అని జెబితే గీల్లకూ సమజ్ గాదు.

    ఆంద్రోల్లు ఆ ఇగ్రగాలేవో మనుషులుండే తావుల బెట్టుకొన్రి. రేపు మావోల్ల టార్గెట్టు బుద్ద ఇగ్రగం. అందికనే నిన్న హరీషురావు ఆడిక్కూడా బోయి దాని ఆనూపానూ పరిసీలించి అచ్చిండు. ముందు పానం లేని ఇగ్రగాల సంగతి జూస్తరు. తరోత పానం ఉన్న ఆంద్రోల్ల సంగతి జూస్తరు. జర హుషార్ ఉండున్రి బై !

    రిప్లయితొలగించండి
  21. @ తె లంగా నోడు,
    ఊరుకో వోయ్ , నువ్వు ఈడకూడా జోకులేస్తే మంచి గుండదన్నట్టు.

    పశువల కెక్వ అంటవేంది.

    ఏనాడైనా పసువుల్లెక్కనయినా బిహేవ్ సేసిండ్రా మీరు ? అని నేను కొచ్చినింగు సేత్తున్న.

    నిన్న గేదో కొంతమది గొర్రెల్లెక్క టేంకు బండ సుట్టూ తిరిగిండ్రనుకో , అంత మాత్రానికే పశువులు అనేస్తవా? ఇంకోసారి గిట్లాంటి స్టేట్మెంట్లు ఇస్తే మంచిగుండదు.

    రిప్లయితొలగించండి
  22. తెలుగు, ఆంధ్ర అనే పదాలను సైతం ద్వేషించే స్థాయికి వెళ్లి పోయిన వారికి, ఇక తెలుగు బాష గొప్పదనాని, తెలుగు కీర్తిని దశదిశలా వ్యాపింపజేసిన వారిగురించి ఏమి తెలుస్తుంది. ఒక సారి మనస్సులో విష బీజాలు నాటిన తరువాత వేరే మొక్కని మొలవమంటే మొలుస్తుందా? చేసే ప్రతీ తప్పు పనిని కూడా నిర్లజ్జగా సమర్దినుచుకొనే స్థితికి దిగజారిన వారు (తెలంగాణా ప్రజలు కాదు వారి నాయకులు మాత్రామే) విగ్రహాలు కూల్చి ఆంధ్రులను ఓడించామనో ఏదో విజయం సాధించామనో నిర్లజ్జగా చెప్పుకోవచ్చు గాక. గానీ వారు చేసిన పనితో ఒక పవిత్రమైన తెలంగాణా ఉద్యమమాన్నికి తలవంపులు తెచ్చారు. ఇటువంటి నాయకుల చేతిలో తెలంగాణా పడితే ఇక మున్ముందు ఎలా ఉంటుందో యెవరు చెప్పలేరు కూడా.
    ముక్యంగా తెలంగాణాకీ అడ్డు పడుతున్నది సీమంధ్ర ప్రజలు మాత్రం కాదు. గానీ, తెలంగాణా వారి దృష్టిలో సేమంద్రులందరు అడ్డుపడుతునరనే భావన ఉంది.ఇక్కడ సీమంధ్ర లో జరిగే సమైక్యాంధ్ర ఉద్యమాలని అందరు వెనకేసుకు రావడం లేదని అక్కడి ప్రజలు తెలుసు కోవాలి.
    ఇక, తెలంగాణా రాష్ట్రం ఏర్పడడానికి ఇక్కడ జరిగే సమైక్యాంధ్ర ఉద్యమాలు అడ్డు కాదు. ముసుగులో గుద్దులాటల సాగుత్తున్న హైదరాబాద్ సమస్యే మూలకారణం.ముందు దానికి యెవరు అభ్యంతరం చెప్పుతున్నారో వారితో మాట్లాడుకోవాలి గానీ, విగ్రహాలు కూల్చి ఎవరినో జయిన్చేసామని అనుకోవడం చాలా తప్పు. ఇంతగా విద్వేషాలు పెంచుకోన్నాక రేపటి పరిస్థితి ఏమిటి అనికూడా ఆలోచించాలి అందరు. తెలంగాణా ఎర్పదాక దానిని మన దేశం నుండి ఎక్కడికి పట్టుకు పోరుగదా? కొత్త రాష్ట్రం ఏర్పడ్డాక అప్పుడు ఇరుగు పొరుగులుగా మెలగాల్సిన మనం ఇండియా పాకిస్థాన్లకు మల్లె జివిన్చాలేము కధా?
    ఆలోచిన్చామది అందరు.

    రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు