12, మార్చి 2011, శనివారం

విగ్రహాలను కూలుస్తున్న ముష్కరులెవరు?

విగ్రహాలను కూల్చింది ఎవరో మాకు తెలవదు అన్నారు. అదంతా సీమాంధ్రుల కుట్ర అని చెప్పారు. ఆ విగ్రహాల స్థానంలో తెలంగాణ అమరవీరుల విగ్రహాలు పెట్టాలని డిమాండ్లు చేసారు. మార్చికి అనుమతినిచ్చి ఉంటే ఈ విధ్వంసం జరిగి ఉండేది కాదంటూ చెప్పుకొచ్చారు. తెవాద నాయకులు ఎలా మాట్టాడ్డానికైనా సమర్ధులే! ఇవ్వాళ టీవీ 9 లో వచ్చిన వార్త చూసాక వీళ్ళు ఏం చెయ్యడానికైనా సమర్ధులేనని తెల్లమైంది.


మూడు రోజుల కిందట మెదక్ జిల్లా దౌలతాబాదు వద్ద తెలంగాణ తల్లి విగ్రహాన్ని కాల్చి పడేసారు ఎవరో దుండగులు. ఆ పాపాన్ని మంత్రి సునీతా లక్ష్మారెడ్డి మీదకు నెట్టడానికి ప్రయత్నించారు. ఎందుకంటే ఆ మధ్య ఎవరో ఆమె భర్త విగ్రహాన్ని విరగ్గొట్టారంట. అందుకు ప్రతీకారంగానే తెలంగాణ తల్లి విగ్రహాన్ని తగలబెట్టాం అని రాసిన కాగితాన్ని అక్కడ పెట్టి నేరాన్ని ఆమె మీదకు తోసారు. నాకే పాపం తెలీదని ఆమె చెప్పుకున్నారు. అయితే ఇవ్వాళ అసలు విషయం బయట పడింది. పోలీసులు దుండగులను పట్టుకున్నారు. వాళ్ళను టీవీ కెమెరాల ముందు పెట్టి నిజాన్ని వాళ్ళచేతే చెప్పించారు. సంగతేంటయ్యా అంటే వాళ్ళు తెరాస కార్యకర్తలు! తెలంగాణ తల్లి విగ్రహాన్ని కాల్చింది తెరాస కార్యకర్తలే! కాల్చేసి ఆ నేరాన్ని మంత్రి మీదకు నెట్టారు. ఇప్పుడు దొరికిపోయారు. ఏకంగా తల్లినే అవమానించారు వాళ్ళు. ఇదీ ఈ ఉద్యమకారుల సంస్కృతి.

ట్యాంకు బండ్ మీది విగ్రహాలు ధ్వంసమయ్యాక ఏం చెబుతున్నారు వీళ్ళు? ప్రజల మనోభావాలు ఎంతలా దెబ్బతినకపోతే విగ్రహాలను ధ్వంసం చేస్తారు? వాళ్ళ మానసిక స్థితిని అర్థం చేసుకోవాలి అని మాట్టాడారు. తల్లి విగ్రహాన్నే కాల్చేసిన వాళ్ళ చిత్తవృత్తిని మనం ఎలా అర్థం చేసుకోవాలి?

ట్యాంకుబండ్ మీది సీమాంధ్రుల విగ్రహాలు కూలిపోతాయ్ అని కొన్ని నెలల కిందట చెప్పారు తెరాస నాయకులు. ఇప్పుడు అవి ధ్వంసం అయి పోయాయి కూడా.  విగ్రహాలను ధ్వంసం చేసిన వారెవరో,  చేయించిన వారెవరో తేలాలి. వాళ్ళను పట్టుకుని కెమెరాల ముందు నిలబెట్టి, ప్రజలకు ఆ మొహాలను చూపించాలి. మా సంస్కృతి ఇదీ అంటూ దేశమంతా చాటింపు వేసిన దుండగులెవరో తేల్చాలి. మన చారిత్రిక వ్యక్తుల విగ్రహాలను అవమానించిన చరిత్రహీనులను బోనెక్కించాలి.

22 కామెంట్‌లు:

  1. చాలా సింపుల్ మాస్టారూ దీని మీద ఏ కే.సి.ఆర్. నో కోదండ రాం నో వివరణ అడిగితే వాళ్ళ సమాధానం ఇదిగో
    "అసలు వాళ్ళు మా కార్యకర్తలే కారు. వాళ్ళు పోలీసులు / సీమాంధ్రులు. మా ఉద్యమాన్ని బద్నాం చేయడానికి ఇది ప్రభుత్వం ఆడిస్తున్న నాటకం. అసలు తెలంగాణా తల్లిని కన్నదే మేము (ఇది కేక). మేం కాల్చుకుంటామా? "

    డౌట్ లేదు. ఖచ్చితం గా ఇదే సమాధానం వస్తుంది.

    రిప్లయితొలగించండి
  2. మేమట్ల కుట్ర లు చేసే రకం కాదు.. కుట్ర బుద్దులుఎవరివో అందరికీ తెలిసిందే. నాయకులు జైలు లో ఉంటే అల్లరి మూకలు ఎంత కైనా తెగిస్తాయి... ఇదంతా ప్రభుత్వం చేజేతులా చేస్కున్నదే..

    రిప్లయితొలగించండి
  3. హుస్సేన్సాగర్ మీది విగ్రహాలు మీవి ,అందులే తేలే శవాలన్నీ మావా ?అన్న కవి ప్రశ్న ఉదయించి పదేండ్లు అయ్యింది .మరి ఆ వాక్కు వట్టిగనే పొతదా?మహనీయుల విగ్రహాల మీద ఎవలకు రెండో రకం అభిప్రాయం లేదు.అవి పెట్టిచిన వాళ్ళ మీదనే మంట.ఇది సమైక్య రాష్ట్రమే అయితే హుస్సేన్సాగర్ కట్ట మీద మూడో నాలుగో విగ్రహాలు తెలంగాణ మహానీయులయి ఎందుకుంటాయి ?తక్కిన ఇరువై ముప్పై అంద్రాయి ఎందుకుంటాయి .మాకు బందగి,ఇలమ్మ షోయబుల్ల ఖాన్ ,తుర్రెబాజ్ ఖాన్ బద్దం ఎల్ల రెడ్డి ,వట్టికోట ఆళ్వారు స్వామి ,దాశరథి ,పాల్కురికి సోమన్న ,కాలోజి ,కొమురం భీమ్ ఇంకా ఎందరో ఉన్నారు వాళ్ళ విగ్రహాలు ఎక్కడ పెట్టరు .పోనీ ఆంద్ర ప్రాంతం లో ఎక్కడన్నా తెలంగాణ విగ్రహాలు ఉన్నాయా ? విశాఖ బీచ్ దగ్గర ఉన్న విగ్రహాలలో ఒక్కటైనా ఉన్నదా ?అగో అందుకే ఎక్కన్నో కాల్సుక వస్తది.కోపం రేశం వస్తది. విగ్రహ ఆగ్రహం వస్తది.నిజానికి తెలంగాణ ప్రజలకు ఎంత వోపిక ఉన్నదంటే తమ తమ పట్టణాల్లో ఉన్న తెలంగాణ వ్యతిరేకుల విగ్రహాలను ఇంకా ముట్టుకుంట లేరు .

    రిప్లయితొలగించండి
  4. @ తెలుగు
    .పోనీ ఆంద్ర ప్రాంతం లో ఎక్కడన్నా తెలంగాణ విగ్రహాలు ఉన్నాయా ?
    ఉంది. నెల్లూరు లో కొమరం భీమ్ విగ్రహం ఉంది. అది కూడా ఈ మధ్య పెట్టినది కాదు.
    ఇప్పుడు చెప్పండి, తెలంగాణాలో ఎన్ని కొమరం భీమ్ విగ్రహాలు ఉన్నాయి? (ఈ మధ్య ఆయన గుర్తొచ్చినప్పుడు ఆదరా బాదరాగా పెట్టినవి కాదు). ఎన్ని చాకలి ఐలమ్మల విగ్రహాలు ఉన్నాయి? గుర్తు తెచ్చుకోండి. రాత్రంతా ఆలోచించినా సింగిల్ డిజిట్ దాటుతుందా ఆ సంఖ్య?

    రిప్లయితొలగించండి
  5. @తెలుగు

    ఔ మల్ల...

    బిర్లా మందిర్ల రాయలసీమ దేవుడు ఉండు..చిల్కూర్ ల భి ఆయనే ఉండు....ఎత్తేద్దం పట్టు మల్ల...గా రాయలసీమ దేవున్ని...

    Airport భి మనది గాదన్న...రాయలసీమోడు కట్టిచిండు...దీన్ తల్లి..దాన్ని గూడ లెపేద్దం దా...

    Hitech city భి రయలసీమోడు గట్టిచిండు...దాన్ని గూడా...

    అన్నా....ఆఖిర్ల ఏం ఉంటదన్న గీడ....చార్మినార్...దాని చుట్టు ఖబర్స్థాన్ ...గది చాలు అన్నా మనకు...

    ఇంకో doubt అన్నా....MIM ఓడు జై సమైఖ్యంధ్ర అంటుండు....ఆని గడ్డంల ఎంటికలన్న పీకగలమా??

    రిప్లయితొలగించండి
  6. @తెలుగు

    షిర్డీ సాయి బాబా మనోడు గాదు.....మహారష్ట్ర ఓడు...
    గాడ తెలంగణ దేవుల్ల గుళ్ళు గెన్ని ఉన్నై అన్నా....మనమెందుకు పూజించాల్నే గా దేవున్ని...మనకు లేరా దేవుళ్ళు??
    గా దేవుని అన్ని గుళ్ళని ఎత్తేద్దాం పట్టు...

    రిప్లయితొలగించండి
  7. @తెలుగు

    అన్నా....మన చుట్టూ ఎన్ని "ఇందిరమ్మల" ఇగ్రహాలు, ఎన్ని "రాజీవుని" ఇగ్రహాలు ఎన్ని "గాంధి" ఇగ్రహాలు ఉన్నై....దంట్ల ఎవడన్న తెలంగాణోడు?? ఇందిరమ్మనే కద మొదట్ల ఒద్దు అన్నది తెలంగాణని...గాంధి ఖాందానే గసొంటిది అన్న...

    వాటిని పీకే దమ్ము ఉందా అన్నా??

    రిప్లయితొలగించండి
  8. @ చైతు
    బావున్నయ్ వివిధ బ్లాగుల్లో ఈ ఆంశం మీద మీ కామెంట్లు!

    రిప్లయితొలగించండి
  9. @శరత్'కాలమ్'
    Thanks :-)

    But above questions are indeed serious to _ANY_ person who supports vandalism on tankbund!

    రిప్లయితొలగించండి
  10. @ above అజ్ఞాత
    నిజమే బాస్. మీది తెలుగు జాతి కాదు. నువ్వు మాట్లాడేదీ తెలుగు కాదు. నీకు తెలుగు రాదు. నీ తల్లిదండ్రులు తెలుగు వాళ్ళు కాదు. కదా
    అవును హుస్సేన్ సాగర్ నిండా నీ తల్లి కన్నీళ్ళే. నిన్న మీరు చేసిన విధ్వంసానికి కుళ్ళి కుళ్ళి ఏడ్చింది పాపం
    మీ కొమరం భీమ్ ధైర్యానికి మసిపూసారా? ఎవరికి చెప్తావు బాస్. ఇందాకటి నుంచీ చెప్తున్నా మీరు పెట్టుకోలేదేమో గానీ ఎక్కడో నెల్లూర్ లో కొమరం భీమ్ విగ్రహం పెట్టుకున్నారు. మరి ఆ ధైర్యం ఎవరు గుర్తించినట్టు? మీరా? వాళ్ళా?
    రాయి అని ఇంకో సారంటే ఆ రాయితోనే మూతి పళ్ళు రాలగొడతాం. ఊరుకున్న కొద్దీ తెగ పెరిగిపోతోంది మీ ఉన్మాదం. చేతనైతే చార్మినార్ లో ఒక్క రాయి కదిలించి చూడు. ఉన్న చోటే పాతిపెడతారు. అక్కడికెళ్ళి చెప్పు ఇది రాయే కదా అని.

    ఇలా విడిపోతాం, విడిపోతాం అనే జార్ఖండ్, చత్తీస్ ఘడ్ ఇప్పుడు లాక్కో లేక పీక్కో లేక చస్తున్నాయి. అది చూసి కూడా మీకు బుర్రలో బల్బు వెలగదా? అయినా మీ నేల, మీ మట్టి ఏంటి? ఇండియాలో ఎక్కడయినా నీ నేలె, నా నేలె. చేతనయితే నువ్వు కూడా రా మిగిలినప్రాంతాలకి , అంతే కాని రావద్దు, ఉండద్దు అనే హక్కు నీకే కాదు ఈ దేశం లో ఎవడికీ లేదు.

    ఒక్కటి చెప్పనా తమ్ముడూ పైన తధాస్తు దేవతలు ఉంటారట. ఇలా ఎప్పుడు చూసినా మా బ్రతుకులింతే, మేం నాశనం అయిపోయాం, మాకు తినడానికి తిండి లేదు ఇలా అనుకుంటూన్నారనుకో ఎప్పుడో వాళ్ళు తధాస్తు అంటారు. మీ సరదా తీరిపోతుంది.

    రిప్లయితొలగించండి
  11. <>
    సంసృతా! వీళ్ళకు అవకాశాలిస్తే తాలిబాన్ల తలదన్నగలరు. వీళ్ళకు జాతా నీతా! టాంక్బండ్ మీద పోలీసు కాల్పులు అని ఒక్క పుకారు పుట్టినా, కనీసం 25శవాలు తొక్కిడిలో హుసేన్సాగలో తేలేవి. కాలచవద్దన్న ప్రభుత్వ ఆదేశాలకు పోలీసులు కట్టుబడి వుండటాన్ని తమ బలంగా చెప్పుకుంటున్న ఎదవలు.

    రిప్లయితొలగించండి
  12. చదువరీ,
    ఈ అర్థం లేని ఎదవఏడుపు కవితలను తొలగించి పాఠకులను రక్షిచాలి. కామెంట్లు చేతకాని ఎదవలు, ఎవరో ఒళ్ళుకొవ్వెక్కి నిలువుగా రాసిన మాటలు పేస్ట్ చేస్తూ, మీ బ్లాగు స్థలాన్ని దుర్వినీయోగం చేస్తున్నారు, దీంతో కొన్ని కామెంట్లు పైకి వెళ్ళి, మిస్ అవుతున్నాము. ఇది కావాలని ఈ ముష్కరులు చేస్తున్న చిల్లర ట్రిక్కు అని గ్రహించగలరు, బూతులుండవు కాబట్టి ఎలాగూ తొలగించరనే కుక్కతెలివితేటలు. అర్థవంతంగా రాసే సమైఖ్యాంధ్ర బ్లాగుల్లోనే ఈ చిల్లరగాళ్ళు ఇలాంటి ట్రిక్కులు వాడుతున్నారని గమనించగలరు.

    రిప్లయితొలగించండి
  13. చివరి అజ్ఞాత: గ్రహించాను. మీరు చెప్పింది నిజమే అందుకే తీసేసాను. ఆత్మ న్యూనతతో శిరస్సును పాతాళంలో దాచుకుని బతుకుతూ, ఆ న్యూనత నుంచి పొడుచుకొచ్చిన తలపొగరును ఆకాశంలో ఎగరేస్తున్న ఒక కొత్తజాతిని చూస్తున్నాం మనమిప్పుడు. ఈ కొత్తజాతికి జాతీయగీతం కాదగిన కవిత అది.

    రిప్లయితొలగించండి
  14. ఎందుకంటారు...ఉద్యమం పేరుతో వీళ్ళు వీరంగం చేస్తోంది?
    నాకైతే ఆంధ్రా వాళ్ళ చేతకానితనమే ప్రధాన కారణమనిపిస్తోంది. సున్నితమైన సమస్య, మనోభావాలు, మట్టీ మశానం, వల్లకాడు అంటూ - ఈ పనికిమాలిన వాళ్ళను ఇంతదాకా తెచ్చారు.
    ఇరువర్గాల మధ్య ఏకీభావం లేకపోవడమేగా సమస్య అంటే. మరి అది ఒకరికి సున్నితం మరొకరి బండరాయి కాదు! రెండు వైపులా ఉన్నది మనుషులే - మనోభావాలు అటువైపున్నట్లే ఇటువైపూ ఉంటాయి!
    ఇంకా ఈ పడికట్టు పదజాలాన్ని నమ్ముకుంటే...ఈ శనిగ్రహాల అర్థరహిత చర్యలతో ఇవ్వాళ విగ్రహాలు, రేపు ఏకంగా జీవాలే!
    సమైఖ్యాంధ్ర అని అరిచి గీపెడుతున్న నేతలు ఓ టీవీల్లో, చేతులు పిసుక్కుంటూ నంగి నంగిగా, చెప్పిన సోది కబుర్లే చెప్పకుండా చేతల్లో జవాబు ఇవ్వాలి.
    ఇలాంటి విధ్వంసమో, అనాగరిక దాడో జరిగిన ప్రతి సారి, తెలంగాణా నాయకులు (అసలు వీళ్ళని నాయకులనొచ్చా? వీళ్ళు నాయకులైతే ఇప్పుడీ కృత్రిమ ప్రత్యేక తెలంగాణా ఉద్యమ అవసరం ఉందేదా?) చెప్పేది - ఆత్మ హత్యల గురించి. అసలింతకీ వీళ్ళు లెక్క చెబుతున్న ఆత్మ హత్యల్లో హత్యలెన్ని? అందులో కె.సి.ఆర్. వాటా ఎంత? కే.సి.ఆర్. అయిదారేళ్ళనుంచి ఇదిగో తెలంగాణ, అదిగో తెలంగాణ అంటూ కల్లబొల్లి కబుర్లతో ఎంత మంది ఆశలకు ఉత్తుత్తి ఊప్రిలూదాడు? అది కారణం కాదా ఊపిర్లు పోవడానికి? నాలుగైదొందలమంది ఆత్మార్పణ చేసుకుటే ప్రత్యేక రాష్ట్రాలు ఇస్తూ పోతే...దేశంలో వెయ్యిమంది జనాభాఉన్న ప్రై వూరూ ఒక రాష్ట్రం కావొచ్చు.
    వీళ్ళ ఆగడాలకు అడ్డుకట్ట వేయాలంటే - రెండో వైపునుంచీ కూడా గట్టి సమాధానం రావాలి. అప్పటిదాకా ఈ విధ్వంసాల వెల్లువ కొనసాగుతుంది.

    రిప్లయితొలగించండి
  15. విగ్రహాల విధ్వంసం....
    ఔను...నా జాతి...తెలుగు జాతి..
    నిండుగ వెలుగు జాతి...
    తెలంగణ జాతి కాదు...సీమా కాదు...ఆంధ్రా కాదు...

    హుస్సైన్ సాగర్ నిండా మన తల్లి కన్నీళ్ళే...
    తన బిడ్డలు చేసిన ఘాతుకానికి దానికి కుళ్ళి కుళ్ళి ఏడ్చి కార్చిన కన్నీళ్ళు..
    ఎక్కడిదిరా నీకు హక్కు..
    తెలుగు జాతి వెలుగులను కదిలించడానికి...

    అందమైన హైదరాబాదును తయారు చేసిన మన రాజుల చరిత్ర..
    చారుమినారు ని అడుగు....గోల్కొండ కోట ని అడుగు....సాలార్జంగ్ మ్యూసెయం ని అడుగు చెబుతాయి...
    ఫలక్నుమా కోట ని అడుగు...చౌమొహల్లా కోటని కూడ అడుగు...
    అస్సెంబ్లీ బిల్డింగుని అడుగు....లెక్కలేనన్ని ఊసులు చెబుతాయి...
    మన కొమరం భీం ధైర్యానికి మసి పూసింది ఎవడు ..
    ఇరవై యేళ్ళ ముందు ఎంత మంది మన ఊళ్ళో సోచాయించిన్రు ఆయన గురించి...
    ఎన్ని విగ్రహాలు ఉండె మన ఊళ్ళల్లో...లెక్క ఉందా తమ్ముడు??

    రాద్ధాంతం రాయి బద్దలు అయినందుకు కాదు....
    రాయి వెనక ఉన్న గొప్పవారి భావాలకు మసక బారినందుకు.....
    ఈ జాగ నీది నీది అంటున్నావ్...ఏ జాగా నీది??
    గిది భారతదేశం తమ్మి....ఈ జాగ అందరిది.....
    నీ అబ్బ సొత్తు కాదు....నా అబ్బ సొత్తూ కాదు....

    మీరు గురి పెట్టింది విగ్రహాలని కాదు....
    పింగళి ని కూల్చారు....ఆయన దేశానికి ఇచ్చిన జెండా కూడ ఎందుకు?
    అది మరి "ఆంధ్రోల్లది" కాదా తమ్ముడు??
    వాళ్ళు ప్రాంతానికి సేవ చెయలేదు తమ్ముడు....మానవాళి కి చేసారు...
    వాళ్ళని కూల్చినందుకు మన తల్లి...అల్లదిగో అక్కడ...మౌనం గా రోదిస్తోంది...

    అమరవీరులెవరు మాకు జాగా కావాలని కోరలేదు తమ్ముడూ...
    ప్రజల గుండెల్లొ వాళ్ళకి ఎప్పటికి ఉంటది జాగా...
    విగ్రహాలే కావాల్నంటే నెక్లేసు రోడ్డు నిండా పెట్టొచ్చు...పూజించనూ వొచ్చు...
    కానీ ముష్కరులకి కావల్సినది అది కాదు తమ్ముడు...గది సొచాయించు......

    ఆగం ఐతున్న బతుకులు తెలు తమ్ముడూ...
    గవి అన్ని చోట్లా ఉన్నై...
    వాటి గురించి ఎప్పుడైన గట్టిగా ఉద్యమం చేసామా అసలు??
    గీ చిత్తశుద్ది సమస్యల పైన చూపించి ఉంటే..
    మన తల్లి అసలు రోదించేది కాదు కదా.....
    మనమే ఈ రోదన కి కారణం...
    కాదంటావా తమ్ముడు??

    మంచి చెడుల మధ్య రేఖ నలిగితే...
    ఉద్యమం ఉన్మాదం ఔతుంది....
    ఉన్మాదం ఉగ్రవాదం ఔతుంది....
    నష్టపొయేది మనమే.....

    కష్టకాలంలో కలిసుందాం...
    సమస్యలను కలిసి ఎదుర్కొందాం....
    మన తల్లి కి శాంతి చేకూర్చుదాం...

    రిప్లయితొలగించండి
  16. చదువరి గారు..
    పెద్దగా కమెంటినందుకు క్షమించండి....
    paina cheppinattu Follwup కష్టంగా ఉంటే commet delete చేయగలరు..

    -చైతు

    రిప్లయితొలగించండి
  17. not publishing my comment. whatz wrong with that ????????????

    రిప్లయితొలగించండి
  18. published this don't be greedy to have all comments published. give others a chance :)

    రిప్లయితొలగించండి
  19. moorkhulu...ee vigrahaalani koolche badulu..aa lagadapati ni lepeste emainaa labham, vedavalu vigrahaalani kooliste udhyamaanike avamanam

    రిప్లయితొలగించండి
  20. @ పై అజ్ఞాత

    లగడపాటి కి కేసిఆర్ కుమారునికి కొన్ని వ్యాపార లావాదేవీలు ఉన్నసంగతి మీకు తెలియదు అనుకుంటా

    రిప్లయితొలగించండి
  21. ఎవరైనా కొంచెం నెల్లూరు లోని కొమరం భీం విగ్రహానికి సంభందించిన ఫోటొ గాని, ఇతర ఆధారం కాని ఇస్తారా? డౌట్ తో అడగటం లేదు.. ఇది కొంతమంది వేర్పాటు వాదుల నోళ్ళు అయినా మూయించటానికి ఉపయోగపడుతుంది కదాని.

    రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు