7, జనవరి 2010, గురువారం

ఢిల్లీ చర్చలు

జనవరి 5 న జరిగిన చర్చల ద్వారా రెండు వైపుల ఉన్న ఉద్యమకారులూ వేసిన ముందడుగేమీ లేకపోవచ్చు. కేంద్రం మాత్రం విభజనవాదులను, సమైక్యవాదులనూ ఒకచోటికి చేర్చి మాట్టాడగలిగింది. మా అభిప్రాయాలనూ విన్నారు అనే భావనను వాళ్ళలో కలిగించ గలిగింది. ఉద్యమాలను ఆపాలని వాళ్లకు చెప్పి ఆపించగలిగింది. ఏదేమైనా, తెలంగాణ విషయంలో కేంద్రం వెనకడుగేసినట్టేమీ అనిపించలేదు.


చర్చల తరవాత రాజకీయ పేలుళ్ళేవో జరుగుతాయని, ఆయా పార్టీల అసలు వాదాలు బయటికొస్తాయనీ నేనుఅనుకున్నాను. కానీ అవేం జరగలేదు, పార్టీలు శాంతిమత్రం జపించాయి. ప్రణబ్ ముఖర్జీ చేసిన రెచ్చగొట్టే వ్యాఖ్యలను కూడా ఎవరూ గట్టిగా పట్టించుకున్నట్టు కనబళ్ళేదు. తెరాస వాళ్ళు అసలేమీ మాట్టాడ్డమే లేదు. చిదంబరం ఏం మందు పెట్టాడో!

ఇకపై ఢిల్లీ చర్చలు, మళ్ళీ చర్చలు, మళ్ళీమళ్ళీ చర్చలు..

-----------------

ఇక, తెలంగాణ పిడివాదుల మొండి వాదనల గురించి ఇంకాస్త-
కాంగ్రెసు, తెదేపా, ప్రజారాజ్యమూ, .. 'ఇలా ఈ పార్టీలన్నీ గతంలో తెలంగాణకు అనుకూలమని చెప్పి ఇప్పుడు తీరా తెలంగాణ ప్రకటించేసాక, మాట మార్చాయి/లేదా ఆయా పార్టీల కోస్తా సీమ నాయకులు మాటమార్చారు. ఎవడికి వాడు రాజీనామా చేసి సమైక్యవాదమంటూ దీక్షలు మొదలెట్టారు, ఊసరవెల్లులు, గోడమీద పిల్లులు ' అంటూ తెలంగాణావాదులు, టీవీల్లో కనబడే ఘంటా చక్రపాణీ తిట్టడం చూస్తూంటాం. సరే వాళ్ళు మాటమార్చారు నిజమే! కానీ ఇలా తిట్టేవాళ్ళు, తిట్టేసి సేద తీరేటపుడు కొన్ని సంగతులు ఆలోచించాలి..
  • రాష్ట్రవిభజన తెలంగాణవాదులకు రాజకీయ పార్టీలకూ సంబంధించిన సంగతి మాత్రమేనా? ఈ గొడవతో కోస్తా సీమ ప్రజలకేమీ సంబంధం లేదా?
  • వాళ్ళెన్నుకున్న నాయకులు వాళ్ళ మనోభావాలను ప్రతిబింబించాల్సిన అవసరం లేదా? అక్కడి నేతలు కూడా తెలంగాణవాదుల నినాదాలకు జైకొట్టాలా? తెలంగాణవాదాన్ని సమర్ధంగా వినిపించిన తెలంగాణ నాయకులను నెత్తికెత్తుకుని, సరిగ్గా వినిపించని వాళ్ళను ఎత్తి కుదెయ్యలేదా, ఈ తెలంగాణవాదులు? ఏఁ, ఆ మాత్రపు స్వాభిమానం, నాయకులమీద ఆ మాత్రపు హక్కు ఇతరులకుండదా?
  • తమ నాయకులు తమ అభిప్రాయాలను వినిపించనపుడు ఉద్యమాలు చేసి, సదరు నాయకులు తమ వాణిని వినిపించేలా చెయ్యకూడదా?
  • ఈ పనులు చేసే హక్కు తెలంగాణ వాదులకు మాత్రమే ఉందా? వీళ్ళు చేస్తే ఆత్మగౌరవమూను, వాళ్ళు చేస్తే అణగదొక్కడమూనా?
తాము చేసే పనినే కోస్తా సీమ వాసులు కూడా చేస్తే ఎందుకో వాళ్లకీ కడుపుమంట!!
..............................

మీ నుంచి మేం విడిపోతామని ఎవరైనా అంటే అవతలివాడికి ఇబ్బందేమీ ఉండకూడదు, ఉండదు కూడా! కానీ, వెళ్తూ వెళ్తూ 'మనందరం కలిసి కూడబెట్టుకున్న ఆస్తిపాస్తులని (హైదరాబాదును) మేం మాత్రమే పట్టుకుపోతాం' అనడం మాత్రం అతితెలివి! 'మేమలా పట్టుకుపోతుంటే నువ్వుమాత్రం నోరు మెదపకూడదు' అని అనడం కంత్రీతనం!! ఓపక్కన ఈ రకంగా వాదిస్తూ, మరోపక్క అన్నల్దమ్ముల్లాగా విడిపోదామనడం జగత్కంత్రీతనం!!!
..............................

దేశంలో చాలా రాష్ట్రాలు విడిపోయినై.. తెలంగాణ విడిపోడానికేంటి ఇబ్బంది అంటూ ఆవేశపడిపోతూ, ఆవేదన చెందుతూ ఉంటారు, తెలంగాణావాదులు. ఆయా రాష్ట్రాల్లో విడిపోయినవాళ్ళు తాము విడిపోయారు, విడిపోయి తమ రాజధాన్ని తాము ఏర్పాటు చేసుకున్నారు. అంతేగానీ రాజధాన్ని మేం పట్టుకుపోతాం మీరు వేరే రాజధాన్ని చూసుకోండి అని అనలా! ఆ మాటే గనక అని ఉంటే ఆ రాష్ట్రాలు విడిపోయేవి కావు. అంతేకాదు, బహుశా బీహార్లో రక్తపాతం జరిగుండేది. ఎంచేతంటే, అవి కోస్తా, తెలంగాణా, సీమలంత ప్రశాంతసీమలు కావు.

---------------------

తమిళనాడులోని హోసూరుకు శాసనసభలో ప్రాతినిధ్యం వహిస్తున్నది, గోపీనాథ్ అనే తెలుగువాడు. తెలుగు పట్ల ఎంతో అభిమానం ఉన్నవాడు. తెలుగు పట్ల ఆయనకున్న అభిమానం తెలిపే ఒక సంఘటన గురించి నా గత టపాలో రాసాను. ఇప్పుడాయన రాష్ట్రాన్ని చీల్చాలనే మన గొడవగురించి ఆవేదన చెందుతూ 'మనలో మనం గొడవ పెట్టేసుకుంటున్నామే..' అని బాధపడ్డాడంట! పాపం మన ఆత్మగౌరవం, మనాళ్ళ సెంటిమెంట్లు ఎక్కడున్నాయో ఆయనకు తెలిసినట్టు లేదు. తెలుగు, ఆంధ్రం వేరువేరనే మన ఆత్మగౌరవ రవాల గురించి, అమ్మను పూజించడంలో కాదు, తిట్టిపోయడంలో ఉన్న మన సెంటిమెంటు గురించీ పాపమాయనకు తెలిసుండదు.

46 కామెంట్‌లు:

  1. >>> ఆయా రాష్ట్రాల్లో విడిపోయినవాళ్ళు తాము విడిపోయారు, విడిపోయి తమ రాజధాన్ని తాము ఏర్పాటు చేసుకున్నారు. అంతేగానీ రాజధాన్ని మేం పట్టుకుపోతాం మీరు వేరే రాజధాన్ని చూసుకోండి అని అనలా! <<<

    ఇంతకీ మీరనేదేమిటే???
    తెలంగానానుంచి విడిపోయిన తరువాత మీ రాజధానిని కూడా హైదరాబాద్ లో నే పెట్టుకున్దామనా?
    అలాగే మీకు బాగుంటుందా?
    దేశం లో ఎక్కడైనా ఒక రాష్ట్రం రాజధాని మరో రాష్ట్రం లో ఉందా. ?

    దిల్లీని మేమే అభివృద్ది చేసాం కాబట్టి మీకు స్వాతంత్రం ప్రసాదించినా మా రెండో రాజధానిగా మీ దిల్లీనే వాడుకుంటాం అని బ్రిటీషు వాడు అంటే ఎట్లా వుండేది?

    రెండు రాష్ట్రాలువా విడిపోయిన తర్వాత కూడా రాజధాని విషయంలో తెలుగు వాళ్ళు మునుముందు కూడా ప్రశాంతత లేకుండా తన్నుకు చస్తూనే ఉండాలా?

    గుజరాత్ వాళ్ళు మహారాష్ట్ర నుంచి విడిపోయినప్పుడు హైదరాబాద్ కంటే ఏంటో అభివృద్ది చెందిన బోంబే ని వదిలి గాంధీనగర్ ని అభివృద్ది చేసుకున్నట్టు కేంద్రం ఇచ్చే పాకేజీతో మీరు మీ సొంత రాజధానిని అభివృద్ది పరచుకోలేరా?

    రిప్లయితొలగించండి
  2. @రాజన్నా..
    "దిల్లీని మేమే అభివృద్ది చేసాం కాబట్టి మీకు స్వాతంత్రం ప్రసాదించినా మా రెండో రాజధానిగా మీ దిల్లీనే వాడుకుంటాం అని బ్రిటీషు వాడు అంటే ఎట్లా వుండేది?"
    పోన్లే కనీసం ఇప్పటికైనా హై. అభివృద్దిలో అందరిపాత్ర ఉందని ఒప్పుకున్నావ్!

    గుజరాత్ వాళ్ళు మహారాష్ట్ర నుంచి విడిపోయినప్పుడు హైదరాబాద్ కంటే ఏంటో అభివృద్ది చెందిన బోంబే ని వదిలి గాంధీనగర్ ని అభివృద్ది చేసుకున్నట్టు కేంద్రం ఇచ్చే పాకేజీతో మీరు మీ సొంత రాజధానిని అభివృద్ది పరచుకోలేరా?

    అహ్మదాబాద్ అభివృద్ది చెందిన నగరమే అయినా బొంబాయి రేంజికి ఎదిగిందా?? ఎదగడానికి ఇంకా ఎన్ని దశాబ్దాలు పడుతుందో??

    రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటేనే దిక్కు లేదు ఇక కేంద్రం రాజధాని అభివృద్దికి నిధుల ఇస్తుందంటావా రాజన్నా?? కేంద్రం ఇచ్చే గ్రాంటుతో రాజధాని అభివృద్ది చేసుకునే బదులు ఇంకేదైనా పని చెయ్యచ్చు కదా??

    కొన్ని చిన్న చిన్న ప్రశ్నలు రాజన్నా:
    కేంద్ర మంత్రిగా ఉన్న కే.సి.ఆర్. తెలంగాణ కు ఏమి చేశాడు??
    ఇప్పటి దాకా నల్గొండ ఎం.పీ. లుగా ఉన్న వారు ఫ్లోరైడ్ సమస్య గురించి ఎంత ఖర్చుపెట్టారు?? ఎం.పీ. ల్యాడ్స్ నిధులు పూర్తిగా ఆ ఎం.పీ. విచక్షణ మీద ఆధారపడి ఉంటాయి.. అవి ఖర్చుపెట్టడానికి ఆంధ్రా వాళ్ళు ఎలా అడ్డు తగిలారు??
    బీడీల పై పుర్రె గుర్తుకు కే.సీ.ఆర్. మంత్రిగా ఎందుకు అడ్డు చెప్పలేదు??

    ఇవే ప్రశ్నలు నేను రాజన్నను పొయిన వారం కూడా అడిగాను. బహుశా ఆయన చూడలేదనుకుంటా

    రిప్లయితొలగించండి
  3. దేశం విడిపోయే పోలికే గనక నేను తీసుకువస్తే, రాష్ట్రవిభజనకూ దీనికీ పోలికా అంటూ ఒక కవితనో, కొటేషన్నో, ఓ లింకునో నా మొహాన విసిరేసిపోయేవాళ్ళు మీరు. మీరు మాత్రం బ్రిటిషువాడి పోలిక తెస్తున్నారు. మీరు పోలిక తేవాల్సింది ఇతర రాష్ట్ర విభజనలతో, బ్రిటిషు వాడితో కాదు!!! నే తెచ్చింది అదే!

    పోతే నేను చెబుతున్నది -ఇతర రాష్ట్రాలు విడిపోయినప్పుడు మనం విడిపోడానికి ఇబ్బందేంటి అని అడుగుతారు చూసారూ.. ఆ ప్రశ్నకు నేను సమాధానం చెప్పాను, అంతే! అక్కడ వెళ్ళిపోయేవాడు, చేతులూపుకుంటూ పోయాడు, అంచేతే సాఫీగా ఐపోయింది. తె.వాదులు అడుగుతున్నది, తెలంగాణ ఇమ్మని కాదు, కోస్తా సీమలను పొమ్మని. మేమెందుకు పోవాలోయ్ అని మేమడుగుతున్నాం.

    మీరూ ప్యాకేజీ తీసుకోలేరా? మీ రాజధాన్ని అభివృద్ధి చేసుకోలేరా? అని అడిగారు- వస్తుంది ఆ రోజూ వస్తుంది. మమ్మల్నంటూ పంపించేస్తే.. పంపించేసాక మేం హై.లో ఉండటమనేది జరగదులెండి. 'తె.వాదులేంటో అడుగుతున్నారని మమ్మల్ని పొమ్మంటారా, మేం పోం' అని మా ఉద్యమం ద్వారా మేం చెప్పాం. 'రాష్ట్ర విభజన అనేది తె.వాదుల ఆలోచన ప్రకారం జరిగేది కాదు, మేం కోరుకున్నట్టుగా జరగాలి.' అని మేం చెబుతున్నాం. అది అలాగే జరుగుతుంది, జరగాలి కూడా! అప్పటి దాకా మేం తె.వాదుల కవితలు వింటూంటాం.

    రిప్లయితొలగించండి
  4. [ఆయా రాష్ట్రాల్లో విడిపోయినవాళ్ళు తాము విడిపోయారు, విడిపోయి తమ రాజధాన్ని తాము ఏర్పాటు చేసుకున్నారు. అంతేగానీ రాజధాన్ని మేం పట్టుకుపోతాం మీరు వేరే రాజధాన్ని చూసుకోండి అని అనలా!]

    ఆంధ్ర రాష్ట్రం కన్నా ముందు ఏర్పడింది ఇప్పటి తెలంగాణ. తెలంగాణాలో ఆంధ్ర కలిసింది కానీ, ఆంధ్రలో తెలంగాణా కాదు. కాబట్టి, రాష్ట్ర రాజధాని ఎవరికి ఏది ఉండాలనే విషయంలో సందిగ్ధత ఉండదనే అనుకుంటున్నాను.
    ====
    [దిల్లీని మేమే అభివృద్ది చేసాం కాబట్టి మీకు స్వాతంత్రం ప్రసాదించినా మా రెండో రాజధానిగా మీ దిల్లీనే వాడుకుంటాం అని బ్రిటీషు వాడు అంటే ఎట్లా వుండేది?]
    రాజన్న గారు - మీ వాదన చాలా మూర్ఖంగా ఉంది. తెలంగాణా ప్రత్యేక దేశం కోసం పోరాడటం లేదు. ప్రత్యేక రాష్ట్రం కోసమే. అటువంటప్పుడు మీరు ఇస్తున్న 'బ్రిటీషు' ఉదాహరణలు, ఉద్యమంపై ఆల్రెడీ ఉన్న దురభిప్రాయలను మరింత పెంచి పోషిస్తాయి.

    రిప్లయితొలగించండి
  5. తెలంగాణా యాస సంస్కృతి వేరు అని చెప్పడానికి తెలంగాణా ఉద్యమకారులు ఎంతో ప్రయాస పడ్డారు. తెలంగాణా యాసలో మాట్లాడటం, బతుకమ్మ ఆడటం లాంటివి. కానీ ఎన్నిచేసినా వారు వాడవలిసినవి అచ్చమైన తెలుగు అక్షరాలే.

    మీరనమ్మట >>>>మేమలా పట్టుకుపోతుంటే నువ్వుమాత్రం నోరు మెదపకూడదు' అని అనడం కంత్రీతనం!! ఓపక్కన ఈ రకంగా వాదిస్తూ, మరోపక్క అన్నల్దమ్ముల్లాగా విదిపోదామనడం జగత్కంత్రీతనం!!!>>>>


    నూటికి నూరుపాళ్ళూ నిజం :)

    రిప్లయితొలగించండి
  6. 'రాష్ట్ర విభజన అనేది తె.వాదుల ఆలోచన ప్రకారం జరిగేది కాదు, మేం కోరుకున్నట్టుగా జరగాలి.' అని మేం చెబుతున్నాం...

    మీరు అది చెప్పాలనుకుంటే అదే చెప్పండి. 'సమైఖ్యాంధ్ర' అంటూ ముసుగులో గుద్దులాట దేనికి?

    రిప్లయితొలగించండి
  7. హరి దోర్నాల: నేనసలు "సమైఖ్యాంధ్ర" వాదిని కానే కానండి -ఐతే గియితే సమైక్యాంధ్రను సమర్ధిస్తానేమోగాని. పోతే ముసుగులో గుద్దులాట -గుండెల్లో మాటను సూటిగా బయటికి చెప్పిందెవరు చెప్పండి.. తెరాస చెప్పిందా? తె.వాదులు చెప్పారా? మరెవర్నైనా చెప్పనిచ్చారా?

    ఇంకో సంగతండి.. కోస్తా సీమ వాసులు తమ మనస్సును బయటపెట్టి ఉండకపోయి ఉంటే ఈపాటికి మనరాష్ట్రంలో బహురాష్ట్రాల కిచిడీ ఉడుకుతూ ఉండేది. వాళ్ళ మాటను పట్టించుకునేవాడే ఉండేవాడు కాదు. కోస్తా సీమవాసులు తెలంగాణాను ఉద్ధరించడానికే పుట్టిన కొవ్వొత్తులేమీ కాదుగదండీ. అంచేతే వాళ్ళకూ కోరికలుంటాయన్న సంగతిని వాళ్ళు ఢిల్లీ వినేట్టు చెప్పారు. ఇప్పుడు చూడండి, ఇకనుంచీ 'మీ అభిప్రాయం ఏంటి మేస్టార్లూ' అని తె.వాదులతో పాటు వాళ్ళనూ అడుగుతుంది, కేంద్రం. అందుకే ఈ చర్చలు.

    రాష్ట్రాన్ని విభజించాలా లేదా అనేది తె.వాదుల ఇష్ట ప్రకారం జరిగితే, ఎలా విభజించాలన్నది, విధివిధానాలేంటన్నది, ఆస్తిపాస్తుల పంపకాలు కోస్తా సీమ వాసుల ఇష్టం ప్రకారం జరుగుతాయి.

    రిప్లయితొలగించండి
  8. "....ఆంధ్ర రాష్ట్రం కన్నా ముందు ఏర్పడింది ఇప్పటి తెలంగాణ...."

    అవాస్తవిక, అతార్కిక క్లెయిములకి స్థానమిచ్చే ముందు అసలు విషయానికొద్దాం. భారతదేశ చరిత్రలో తెలంగాణ అనే రాష్ట్రం ఎప్పుడైనా ఉందా, "ఆంధ్రా కంటే ముందేర్పడింది" అనడానికి ? చరిత్రలో వరంగల్‌ని రాజధానిగా చేసుకున్న కాకతీయుల ఆంధ్రసామ్రాజ్యం ఉంది. కుతుబ్‌షాహీలు పరిపాలించిన గోల్కొండ సామ్రాజ్యం ఉంది. రాయలు పరిపాలించిన విజయనగర సామ్రాజ్యం ఉంది. నిజాములు పరిపాలించిన నైజామ్ ఉంది. అది ముక్కలయ్యాక హైదరాబాద్ స్టేట్ ఉంది. ఈ అన్నింటిలోను తెలంగాణ ఒక భాగంగా మాత్రమే ఉంది. హైదరాబాద్ రాష్ట్రంలో ఎనిమిది తెలంగాణ జిల్లాలు కాక మూడు కన్నడ జిల్లాలూ, నాలుగు మరాఠీ జిల్లాలూ కూడా ఉండేవి. అందుచేత హైదరాబాద్ స్టేట్ హైదరాబాద్ స్టేటే గానీ అది exclusive గా తెలంగాణ కాదు. అయితే తెలంగాణ అనే ఆధికారిక నామంతో చరిత్రలో ఏ రాజ్యం ఉంది ? ఏ సామ్రాజ్యం ఉంది ? కేవలం ఇప్పటి తెలంగాణ జిల్లాలతో ఏర్పడిన రాజ్యం ఏముంది ? ఏ పాతరాజ్యంలో నైనా తెలంగాణాయే కాక దానితో పాటుగా నాన్-తెలంగాణ ప్రాంతాలు కూడా సర్వదా సమాన భాగస్వాములుగా ఉంటూ వచ్చాయి. ఇప్పుడు కూడా అంతే. తెలంగాణ అనే పేరే స్వాతంత్ర్యం తరువాత ప్రాచుర్యంలోకి వచ్చింది. అంతకుముందు తెలంగాణకి బయట ఆ పేరు ఎవఱికీ తెలియదు. ఆంధ్ర, ఆంధ్రులు అనేది మాత్రం ప్రపంచమంతా తెలుసు.

    ఏది ఎందులో కలిసిందనే చర్చ అనవసరం అనుకుంటా. కలిశాయా ? లేదా ? అనేదే ముఖ్యం. మొత్తమ్మీద కలిశామనే కఠోర చారిత్రిక వాస్తవమే ముఖ్యం. ఒకసారి కలిశాక ఇహ హెచ్చుతగ్గులు లేవు. నీదీ, నాదీ లేదు. అందఱమూ సమానమే. అన్నీ అందఱివీను. "ఆ మాట ఒప్పుకోము" అని ఎవఱైనా అంటే అయితే ఇందులో కూడ కొన్ని సంప్రదాయాలున్నాయని మనవి చేస్తాను. సాధారణంగా చిన్న ప్రాంతం వెళ్ళి పెద్దప్రాంతంలో కలుస్తుంది. ఇక్కడ తెలంగాణ చిన్నప్రాంతం (1,14,000 చ.కిమీ.లు). ఆంధ్ర పెద్దప్రాంతం (1,60,000 చ.కి.మీ.లు). అదీ సంగతి.

    రిప్లయితొలగించండి
  9. నిజాం నుండి విడివడిన ప్రదేశాలతో ఏర్పడినదే హైద్రాబాద్ రాష్ట్రం. దాన్నే, తెలంగాణా అంటున్నాం. ఈ విషయాన్ని నిర్ధారించటానికి తర్కాలు అవసరంలేదు. చరిత్ర పుస్తకాలు తిరగేస్తే చాలు.
    ===
    Flip side - అప్పటి హైద్రాబాద్ రాష్ట్రంలోని ఇతర భాగాలను కూడా ఇప్పుడు ప్రత్యేక తెలంగాణాతోపాటుగా డిమాండ్ చేయాల్సిందే.
    :))

    రిప్లయితొలగించండి
  10. కార్తీక్,
    మీకు విసుగు లేదా? మీరడిగిన చిన్న చిన్న ప్రశ్నలకు ఏ తెలంగాణా వాది అయినా సమాధానం చెప్పగా చూశారా ఇంతవరకూ? ఎందుకంటే వాటి గురించి వాళ్ల వద్ద సమాధానాలు లేవు.

    తెలంగానానుంచి విడిపోయిన తరువాత మీ రాజధానిని కూడా హైదరాబాద్ లో నే పెట్టుకున్దామనా?
    అలాగే మీకు బాగుంటుందా?...

    అవునండీ, అలాగే బాగుంటుంది మాకు! అలాగే జరగాలని కూడా కోరుకుంటున్నాం! వంటంతా వండి విస్తరిలో వడ్డించిన తర్వాత కేవలం విస్తరి మాదనే వంకతో భోజనాన్నే తన్నుకుపోదామని చూస్తుంటే చూస్తూ ఊర్కోలేం కదండీ!

    "'రాష్ట్ర విభజన అనేది తె.వాదుల ఆలోచన ప్రకారం జరిగేది కాదు, మేం కోరుకున్నట్టుగా జరగాలి.' అని మేం చెబుతున్నాం. అది అలాగే జరుగుతుంది, జరగాలి కూడా! అప్పటి దాకా మేం తె.వాదుల కవితలు వింటూంటాం."...చదువరి గారూ,మీకేవైనా కవితల లింకులు వస్తే నాకూ పంపండి!

    రిప్లయితొలగించండి
  11. ఇప్పుడు మనం దేన్ని తెలంగాణ అంటున్నామనేదాని గుఱించి నాకు వివాదం లేదు. ఆంధ్ర కంటే తెలంగాణ ముందు ఏర్పడింది అన్నారు కనుక దాని గుఱించే నేనొక సందేహం వెలిబుచ్చాను. అయితే అది తీర్చబడలేదు.

    ఇహపోతే గతంలో నైజామ్ రాజ్యభాగాలుగా ఉన్న నాన్-తెలుగు జిల్లాలు కూడా ఇప్పటి తెలంగాణలో చేఱాలని గనక ఎవఱైనా ఉద్యమం మొదలుపెడితే అలాంటిదానికి నా పూర్తిమద్దతు ప్రకటిస్తాను. ఎందుకంటే ఆ మార్గంలో ప్రత్యేక తెలంగాణ ఇంకో వెయ్యేళ్ళక్కూడా రాదు కనుక.

    -తాడేపల్లి

    రిప్లయితొలగించండి
  12. సార్ అప్పట్లో, ఇప్పటి రాష్ట్రాల పేర్లు లేవండి. ఇదివరకు మద్రాసు రాష్ట్రమని, బొంబాయి రాష్ట్రమని ఎలా పిల్చారో, నిజాం చెర నుండి విడిపించబడిన తర్వాతా ఇప్పటి తెలంగాణా ప్రాంతాన్ని, మరికొన్ని ఇప్పటి ఇతర రాష్ట్రాలోని ప్రాంతాలని హైద్రాబాద్ రాష్ట్రమని అన్నారు. కాబట్టి, అప్పుడు తెలంగాణా అనే రాష్ట్రమే లేదు అనటం సరికాదు.

    రిప్లయితొలగించండి
  13. [ఇహపోతే గతంలో నైజామ్ రాజ్యభాగాలుగా ఉన్న నాన్-తెలుగు జిల్లాలు కూడా ఇప్పటి తెలంగాణలో చేఱాలని గనక ఎవఱైనా ఉద్యమం మొదలుపెడితే అలాంటిదానికి నా పూర్తిమద్దతు ప్రకటిస్తాను. ఎందుకంటే ఆ మార్గంలో ప్రత్యేక తెలంగాణ ఇంకో వెయ్యేళ్ళక్కూడా రాదు కనుక.]

    ఇప్పుడు మాత్రం వచ్చేసున్నదనుకుంటున్నారా!

    రిప్లయితొలగించండి
  14. మీరు చెప్పిన స్టేట్‌లూ, ప్రెసిడెన్సీలు ఉన్నమాట నిజమే. అలాగే తెలంగాణవంటి భూభాగమూ, అందులో మనుషులూ ఎల్లప్పుడూ ఉంటారు. కానీ official గా తెలంగాణ అనే రాజ్యవ్యవస్థ గతంలో అస్తిత్వంలో ఉందా ? తనని తాను ఆ పేరుతో వ్యవహరించుకొన్న రాజ్యం/ ప్రభుత్వం (Telangana Empire, Kingdom of Telangana, Government of Telangana) ఏదైనా గతంలో ఉందా ?

    నాకు తెలిసి అలాంటిదేదీ ఈ క్షణం దాకా లేదు. గతంలో బొత్తిగా అస్తిత్వంలో లేనిదాన్ని పునరుద్ధరించే ప్రశ్నే ఉదయించదు. Relative గా చూస్తే వేర్పాటువాదులు అడుగుతున్న తెలంగాణ రాష్ట్రం పూర్తిగా ఒక కొత్త కాన్సెప్టు. దీనికి precedent ఏదీ లేదు. అటువంటప్పుడు ఇది ఆంధ్ర కంటే ముందు ఉందనడం సమంజసం కాదు. ఆంధ్ర అనే పేరు మాత్రం ఐతరేయబ్రాహ్మణకాలం నుంచి ఉంది. మెగస్తనీసు కూడా ఆంధ్రదేశంలోని 30 పట్టణాల గుఱించి పేర్కొన్నాడు.

    రిప్లయితొలగించండి
  15. మీ వాదన ప్రకారం గతంలో తెలంగాణా అని పిలువబడిన రాజరిక వ్యవస్థ లేదు కాబట్టి ఇప్పుడు తెలంగాణా అనే రాష్ట్రాన్ని ఇవ్వాల్సిన ప్రసక్తే లేదు. సరే, తెలంగాణా అనే పేరుతో అభ్యంతరమున్నదనుకుంటే, ఇప్పటి తెలంగాణా ప్రాంతాన్నే హైద్రాబాదు రాష్ట్రంగా ప్రకటిస్తే మీకు అభ్యంతరం ఉండదనుకోమంటారా?

    అలాగే, తమిళనాడు, కర్ణాటక తదితర పేర్లతో ఏ రాచరిక వ్యవస్థలు గతంలో ఉన్నాయని ఇప్పుడు వాటి అస్థిత్త్వాన్ని ప్రశ్నించటంలేదు?

    ఐతరేయ బ్రాహ్మణాన్ని ప్రామాణికంగా తీసుకొని ఉంటే, ఛత్తీస్ ఘడ్ లు, జార్ఖండ్ లు ఏర్పాటయ్యేవే కావు.

    రిప్లయితొలగించండి
  16. నేను ఉటంకించిన చారిత్రిక సత్యాలు తెలంగాణా ఇవ్వాలా ? వద్దా ? అనే ప్రశ్నకి సమాధానంగా కాదు. మీరు మీ వ్యాఖ్యలో ఒక ఉద్ఘాటన చేశారు. నాకు తెలిసిన చారిత్రిక సత్యాల ఆధారంగా దాని మీద నాకున్న సందేహాల్ని వెలిబుచ్చాను. అంతే ! తెలంగాణ ఎందుకివ్వకూడదు ? అనేది వేఱే చర్చ. అది ఇంకెప్పుడైనా రాస్తాను.

    --తాడేపల్లి

    రిప్లయితొలగించండి
  17. చదువరి గారు. ముందుగా మీకు అభినందనలు. చాలా చక్కగా రాసారు. నేను సమైక్యభావన కలవాడినే. అయినప్పటికీ, హైదరాబాద్ విషయంలో, భౌగోళిక స్ధితి దృష్ట్యా, మీతో ఏకీభవించలేక పోతున్నా. హైదరాబాద్ విషయంలో మాత్రం మీ వాదం పసలేని వాదమే. ఒకవేళ తెలంగాణ రాష్ట్రం విడిపడితే హై.ని వదలుకోవలసినదే.

    రిప్లయితొలగించండి
  18. కామేష్ గారూ, హై. విషయంలో నా ఉద్దేశం కూడా మీరు చెప్పినదే! రాష్ట్రం విడిపోయాక, హై.లోనే ఆంధ్ర రాజధాని ఉండటం అర్థం లేని మాట అని నా ఉద్దేశం. అయితే రాష్ట్ర విభజన వలన కోస్తా సీమ వాసులు ఏం నష్టపోతున్నారో చెప్పానంతే!

    రిప్లయితొలగించండి
  19. ప్రసక్తే లేదండీ..ఏం అంతా వాళ్ళిష్టమేనా. సుజాత గారెక్కడో చెప్పినట్లుగా విస్తరి నాది కాబట్టి, వడ్డించిన విస్తరిని లాక్కు పోతానంటే ఎలా..ఏం. వాళ్ళకేనా తెలివితేటలుండేది. మిగతా వాళ్ళకు లేవా. అస్సలా స్టుపిడ్ థింకింగ్ ని ఎంకరేజ్ చేసే ప్రసక్తే లేదు. ఇంకో సారి ఎవ్వరూ హైదరాబాదు ని ఊరికే తెలంగాణ వాళ్ళకి వదిలేస్తామన్న మాట ఎత్తకండి.

    రిప్లయితొలగించండి
  20. ముందు రాష్ట్ర విభజన న్యాయమయిన డిమాండేనా కాదా అన్నది చర్చిద్దం. విభజన న్యాయమయిందని అనుకుంటే ఆ తరువాత ఎలా పంచుకోవాలో అలోచిద్దం. అంతే కానీ ఒక వైపు సమైఖ్యంగా ఉందామంటూ మరో పక్క హైదరాబాదు మాదే అనడం ఏం వాదన?

    రిప్లయితొలగించండి
  21. అంధ్ర ప్రదెశ్ ఎర్పద్దతరువత మనం అంతా కలిసి హైదరాబాదుని, విశాఖపట్నం కాకినాడ, తిరుపతి అన్నింటినీ అభివ్రుద్ధి చేసుకున్నాం. హైదరాబాదు కంటే ఎక్కువ రేటులో విశఖపట్నం అబివ్రుద్ధి చెందింది. అయినా విశఖ పట్నం, తురుపతి, కాకినాడల్లో వాటా ఇమ్మని తెలంగాణా వాల్లు అడగట్లేదు కదా? తెలంగాణా మధ్యలో ఉన్న హైదరాబాదు మీద మాత్రమే పేచీ ఎందుకు?

    హైదరాబాదులో ఉన్న ఆంధ్రా ప్రజలగురించి ఇబ్బంది అయితే, వాల్ల అభిప్రాయం మాత్రం తీసుకోవచ్చు కదా? దానికి మొత్తం సీమ, ఆంధ్ర వాసుల అభిప్రాయం ఎందుకు?

    రిప్లయితొలగించండి
  22. "అయినా విశఖ పట్నం, తురుపతి, కాకినాడల్లో వాటా ఇమ్మని తెలంగాణా వాల్లు అడగట్లేదు కదా?" - మీరు మాట్టాడేదానికి అర్థం లేదు. ఏఁ, కరీంనగరు, నిజామాబాదుల్లో జరిగిన అభివృద్ధి సంగతి నేను మాట్టాడానా? హై. మనకు రాజధాని, దాని అభివృద్ధి కోసం ఇతర ప్రాంతాల అభివృద్ధిని పణంగా పెట్టారు అనేది నా వాదన.

    "ముందు రాష్ట్ర విభజన న్యాయమయిన డిమాండేనా కాదా అన్నది చర్చిద్దం." - అది న్యాయమా కాదా అనేది అసలు చర్చనీయాంశమే కాదు. చర్చించాల్సింది, అది సహేతుకమా కాదా అనే సంగతి. హేతుబద్ధతను పక్కనబెట్టి, న్యాయమైనదా కాదా అనేదాన్ని చర్చల్లోకి తెచ్చేందుకే... అభివృద్ధిలో వెనకబడిపోయాం అనే సంగతిని పక్కనబెట్టి, కొత్తగా ఆత్మగౌరవం, స్వపరిపాలన అనేవాటిని పైకి తెచ్చి, ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టారు.

    రిప్లయితొలగించండి
  23. "హై. మనకు రాజధాని, దాని అభివృద్ధి కోసం ఇతర ప్రాంతాల అభివృద్ధిని పణంగా పెట్టారు అనేది నా వాదన".

    అది సరైన వాదన కాదనే నేను చెబుతున్నాను. ఢిల్లీ రాజధాని కదా అని ముంబై, చెన్నై,కోల్కతా ల అభివ్రుద్ధిని ఏం పణంగా పెట్టలేదు, దేని అవకాశాన్ని బట్టి అది అభివ్రుద్ధి చెందింది. అలాగే మన రాష్ట్రంలో హైదరాబాదు, విశాఖపట్నం, కాకిణాడ, తిరుపతి అన్నీ కూడా అభివ్రుద్ధి చెందాయి, ఒక్క హైదరాబాదు మాత్రమే కాదు.

    ఆ మాటకొస్తే ఆంధ్ర రాష్ట్రంలో రాజధానికి అనువయిన నగరం ఎదీ దొరకక పోవడంతో ఆంధ్రా వాల్లు తెలంగాణా తో కలిస్తే ఒక రెడీ మేడ్ రాజధాని దొరుకుతుందని అప్పుడు విశాలంధ్రకోసం అడిగారు. ఇది ఫజల్ అలి రిపోర్టూ సారాంశం. ఇక ఇన్ని రోజులూ హైదరాబాదు నగరం విశాలాంధ్ర కోసం రాజధానిగా సేవలందించినా తెలంగాణా వాల్లేమీ పరిహారం అడగట్లేదు మరి.

    రిప్లయితొలగించండి
  24. "అది న్యాయమా కాదా అనేది అసలు చర్చనీయాంశమే కాదు. చర్చించాల్సింది, అది సహేతుకమా కాదా అనే సంగతి"

    ఏవిధంగా హేతుబద్దం కాదో కూడా మీరే సెలవీయండి.

    రిప్లయితొలగించండి
  25. హైదరాబాదులో ఐటీ, ఫార్మా కంపనీలు వచ్చినట్లే విశాఖలో స్టీల్ ఫాక్టరీ, పోర్టు , నేవీ డాక్ యార్డ్ లాంటివి, కాకినాడలో ఫెర్టిలైజెర్ కంపనీలు వచ్చాయి. ఇక రాజధాని అవసరాలకోసం ఒక్క కొత్త భవనం కూడా కట్టలేదు, అన్నీ నిజాం కాలంలోనివే.

    ఒకవేళ హైదరాబాదు రాష్ట్రంలో కలవకుండా ఆంధ్ర రాష్ట్రం అల్లగే ఉంటే ఆంధ్ర రాష్ట్రంలో ఏ నగరమయినా హైదరాబాదు లాగా అభివ్రుద్ధి చెందేది అని చెప్పడానికి హేతువేమీ లేదు. హైదరాబాదు అప్పుడు దేసంలో ఎన్నొ స్థానంలో ఉండొ ఇప్పుడూ అల్లాగే ఉంది. రాజధాని కదా అని అభివ్రుద్ధి జరిగేట్టయితే భువనేశ్వర్, తిరువనంతపురం, లక్నో లాంటివన్నీ కూడా అభివ్రుద్ధి చెందాలి కానీ అలా జరగలేదు.

    రిప్లయితొలగించండి
  26. హైదరాబాదుతో పాటు ఐటీ రంగంలో ప్రోత్సాహకాలు విశాఖపట్నం, విజయవాడల్లో కూడా ఇచ్చారు, కానీ ఎందుచేతనో అక్కడ ఐటీ రంగం పెద్దగా అభివ్రుద్ధి చెందలేదు. అలాగే మిగతా రాష్ట్రాలలో భువనేష్వర్ లాంటి నగరాల పరిస్థితి. కాబట్టి హైదరాబాద్ ఆంధ్ర ప్రదేష్ రాజధాని కాబట్టే అభివ్రుద్ధి చెందింది, దీనికోసం మిగతా నగరాల అభివ్రుద్ధిని పణంగా పెట్టామనేవి అర్ధంలేని వాదనలు.

    రిప్లయితొలగించండి
  27. ఇక్కడ ముఖ్యమైన విషయం: హైదరాబాదు రాజధాని కనుక అభివ్రుద్ధి చెందింది అనేది సరి కాదు, హైదరాబాదు అభివ్రుద్ధి చెందిన నగరం కనుక దాన్ని అంధ్ర ప్రదెష్ రాజధానిగా ఎంచుకున్నారు.

    రిప్లయితొలగించండి
  28. సుజాతా గారూ,
    >>>> తెలంగాణా నుంచి విడిపోయిన తరువాత మీ రాజధానిని కూడా హైదరాబాద్ లో నే పెట్టుకున్దామనా?
    అలాగే మీకు బాగుంటుందా?...

    అవునండీ, అలాగే బాగుంటుంది మాకు!
    అలాగే జరగాలని కూడా కోరుకుంటున్నాం!
    వంటంతా వండి విస్తరిలో వడ్డించిన తర్వాత కేవలం విస్తరి మాదనే వంకతో భోజనాన్నే తన్నుకుపోదామని చూస్తుంటే చూస్తూ ఊర్కోలేం కదండీ!
    >>>>>>>

    చదువుకున్న వాళ్ళూ, మేధావి వర్గం వాళ్ళు అందరూ తెలంగాణా విషయం వచ్చేసరికి ఎందుకు ఇంతగా విచక్షణ ను కోల్పోయి వితండ వాదానికి దిగుతున్నారో అర్ధం కావడం లేదు.
    వీటి వల్ల ఆవేశకావేశాలు, పరస్పర విద్వేషాలు పెరగడం తప్ప వేరే ప్రయోజనం ఏమైనా ఉంటుందా?

    ఒక రాష్ట్రం నది బొడ్డున వున్న నగరం మరో రాష్ట్రానికి రాజధానిగా ఎట్లా ఉండగలుగుతుంది.?
    అబ్సర్డ్ కాకపొతే.

    ఈ నగరం కనీసం భద్రాచలం లా ఏ బార్దార్లో నో వున్నా అందుకు వీలయ్యేదేమో.
    ఇప్పుడు తెలంగాణా నత్త నడుమ వున్న హైదరాబాద్ ని బలవంతంగా ఉమ్మడి రాజధాని గా చేస్తే వచ్చే సమస్యల గురించి స్పృహ వుండే మాట్లాడుతున్నారా ?

    తెలుగు వాళ్ళ మధ్య ఈ విద్వేషాలు పగల సెగలు రావణ కాష్టం లా శాశ్వితం గా రగుల్తూ ఉండాలనేదే మీ ఆశయమా?

    అప్పటికే వడ్డించిన విస్తరిలా వున్న హైదరాబాద్ మీద ఆంద్ర నేతల పాపిష్టి కన్ను పడే కదా ప్రలోభపెట్టి, మాయదారి జంటిల్మెన్ అగ్రిమెంటు కుదుర్చుకుని తెలంగాణాను విలీనం చేసుకున్నది.

    మీరు వండి మాకు వారుస్తున్నదేమిటి?

    రాష్ట్ర విభజన జరిగితే మీరంతా ఇక్కడ కట్టుకున్న ఇళ్ళను మాకు తేరగా వదిలేసి పోతారా?
    మద్రాస్లో ముంబైలో ఇట్లాగే జరిగిందా?
    దేశం లో 1956 తర్వాత ఎన్నో రాష్ట్రాలు విభజించ బడి కొత్త రాష్ట్రాలు అవతరించాయి కదా అక్కడంతా ఇట్లాగే జరిగిందా?

    ఎందుకీ అర్ధం లేని వితండ వాదాలు... మొండి వాదాలు??
    ఇన్నాళ్ళు తెలంగాణా నీళ్ళను, ఉద్యోగాలను దొబ్బింది చాలదా?
    ఇంకా తెలంగాణా ... ఆంద్ర పెట్టుబడి దార్ల , రాజకీయ నీతి బాహ్యుల దోపిడీకి గురవుతూనే ఉండాలా?

    తెలంగాణా విడిపోతే ఆంద్ర ప్రాంత సామాన్య జనానికి ఏం నష్టమండీ ? ఏ జగడ పాటో మరొక అక్రమార్కుడో భయపడ్డట్టు మీరెందుకు భయపడుతున్నారు?????

    సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు చేసుకునే ఆంద్ర వాళ్ళు ఇతర రాష్ట్రాల్లో వుంటున్నట్టు హైదరాబాద్ లో ఉండలేరా?

    ఎందుకు తెలంగాణా ప్రజాల చిన్న చిరకాల ప్రజాస్వామిక ఆకాంక్షను నలిపేయాలని చూస్తారు?
    దాని వల్ల మీకేం లాభం ?

    రిప్లయితొలగించండి
  29. "చదువుకున్న వాళ్ళూ, మేధావి వర్గం వాళ్ళు అందరూ తెలంగాణా విషయం వచ్చేసరికి ఎందుకు ఇంతగా విచక్షణ ను కోల్పోయి వితండ వాదానికి దిగుతున్నారో అర్ధం కావడం లేదు." -తె.వాదులంతా చదూకున్నవాళ్ళే! కానీ నాలుక్కోస్తామన్నారు. ఆ చదూకున్నవాళ్ళే "ఆంద్రోళ్ళు మమ్మల్ని దోచేసుకున్నార"ని ఆరోపణలు చేసారు. వాళ్ళే 'ఆంద్రోళ్ళ'ను వలసవాదులన్నారు. మాటల్తో మొట్టారు, పాటల్తో కొట్టారు. నా రాష్ట్ర రాజధానిలో ఉన్న నన్ను అద్దె ఇంట్లో ఉంటున్నవాడికింద జమకట్టి ఏనాటికైనా అద్దె ఇల్లు ఖాళీ చెయ్యాల్సిందేనంటూ పల్లదనంగా మాట్టాడారు. 'ఇన్నాళ్ళు తెలంగాణా నీళ్ళను, ఉద్యోగాలను దొబ్బింది చాలదా?' అంటూ మాట్టాడింది కూడా చదూకున్నోళ్ళే! ఇంత పెడసరంగా మాట్టాడి, దెయ్యాలు వేదాలు వల్లించినట్టు 'చదూకున్నవాళ్ళు కూడా ఎందుకిలా మాట్టాడుతున్నారో అర్థం కావడంలేదు' అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. గురివిందగింజలా మాట్టాడితే ఎలా రాజన్న గారూ !!!

    రిప్లయితొలగించండి
  30. మిగతా ప్రాంతాల అభివ్రుద్ధిని పణంగా పెట్టి హైదరాబాదుని అభివ్రుద్ధి చేసామనడం పచ్చి అబద్ధం కాగా, నిజం ఏమిటంటే గత ఆరు సంవత్సరాలుగా హైదరాబాదులో ప్రభుత్వ ఆస్తులు తెగనమ్మి వచ్చిన దబ్బుతో సీమాంధ్రకి జలవనరులు తరలించే పోతిరెడ్డిపాడు లాంటి ప్రాజెక్టులకు ఖర్చు బెట్టారు.

    రిప్లయితొలగించండి
  31. "ఏవిధంగా హేతుబద్దం కాదో కూడా మీరే సెలవీయండి." - అభివృద్ధిలో వెనకబడిపోయాం అంటూ తె.వాదులు చెబుతున్నవి ఉత్త అబద్ధాలేనని, బ్లాగుల్లో రాస్తూనే ఉన్నారు. మీరు చూపించిన లెక్కలు తప్పని చెబుతూ లింకులు కూడా ఇస్తూనే ఉన్నారు (అవును లింకులు ఇవ్వడం కూడా నేర్చుకున్నారు తెలంగాణేతరులు!) అబ్రకదబ్ర బ్లాగుబద్ధం చేస్తున్న తె.వాదుల అబద్ధాల లెక్కలు చూస్తున్నారా? నా బ్లాగులో నేరాసిన గత టపాల్లోని లెక్కలు కూడా చూడండి. ఇంకా తె.వాదుల వాదనలో హేతువు కోసం వెతకదలిస్తే, ఇక మీ ఇష్టం.. ప్రయత్నించండి. వెతికి, ఎక్కడన్నా హేతువు దొరికితే చెప్పండి, చర్చిద్దాం.

    "హైదరాబాద్ ఆంధ్ర ప్రదేష్ రాజధాని కాబట్టే అభివ్రుద్ధి చెందింది,.. " - నేనంటున్నదీ అదే! తెలంగాణతో కలవకుండా, విడిగానే ఉండి ఉంటే హై. కేవలం తెలంగాణ రాజధానిగానే ఉండేది. కనీసం మా కర్నూలన్నా అభివృద్ధి చెంది ఉండేది.


    "..దీనికోసం మిగతా నగరాల అభివ్రుద్ధిని పణంగా పెట్టామనేవి అర్ధంలేని వాదనలు." - ఓహో.. అలా అయితే, రాష్ట్రం మొత్తమ్మీద వసూలయ్యే పన్నుల్లో 60 శాతానికి పైగా హై.లో వసూలౌతుంది -ఎందుకో చెప్పండి? అభివృద్ధి లేకుండానే ఒకటో రెండో శాతం ప్రాంతం 60 శాతం ఆదాయాన్నిస్తుందా? ప్రాంత వైశాల్యానికి ఏమాత్రం పొంతనలేని అభివృద్ధి ఎందుకు జరిగిందో తెలుసా? కేవలం ఆంధ్రప్రదేశ్ రాజధాని కాబట్టే! తెలంగాణ రాజధానిగానే ఉండుంటే ఇంత అభివృద్ధి ఖచ్చితంగా జరిగేది కాదు. మా ప్రాంతం మరింతగా అభివృద్ధి చెంది ఉండేది.

    ఇక్కడో సంగతి తెలుసా కరణ్ కుంభ్ - అనోసరంగా తెలంగాణోళ్ళతో మమ్మల్ని కలిపి మా ప్రాంతం అభివృద్ధి చెందకుండా చేసారు అంటూ నాటి 'పెద్దమనుషుల'ను కోస్తా సీమల వాళ్ళు దూషించరు.

    రిప్లయితొలగించండి
  32. మీ బ్లాగులో మీరు చూపించిన దొంగ లెక్కలకి నేనొక వివరణ పది రోజులక్రితం అడిగాను. మీరింతవరకూ సమాధానం ఇవ్వలేదు.

    ఇక పోతే నేను చెప్పిన విషయాలన్నీ పరిశీలించకుండా మల్లీ హైదరాబాదు ఆం.ప్ర. రాజధాని కాబట్టే అభివ్రుద్ధి చెందింది అని మీరు వితండ వాదం మొదలు పెట్టారు. హైదరాబాదులో ఆదాయం ఇప్పుడు కాదు ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడకముందునుంచే మిగతా ప్రాంతాలకంటే చాలా ఎక్కువ. కాబట్టి మీరు చెప్పే వాదన ద్వారా తేలేదేమంటే హైదరాబాదు మీద వచ్చిన ఆదాయాన్ని సీమాంధ్ర ప్రగతికి ఉపయోగించారన్నమాట. అంటే విడిపోతే హైదరాబాదు మీదా మీ హక్కు మాటేమిటో గానీ ఆ లెక్కలన్నీ తోడితే మీరే పరిహారం చెల్లించాలి.

    హైదరాబాదు ఆదాయాన్ని మీ అభివ్రుద్ధికి ఉపయోగించడంతో పాటు హైదరాబాదును రాజధాని అవసరాలకు వాడుకున్నందుకు కూడా పరిహారం ఇవ్వాలి.

    ఇకపోతే కేవలం రాజధాని అయినంత మాత్రాన ఎందుకు అభివ్రుద్ధి సాధ్యం కాదో నేను ఇప్పటికే వివరించాను. మల్లీ చెబుతాను. ఒక నగరం పారిశ్రామిక అభివ్రుద్ధి చెందాలంటే పరిశ్రమలకి అనువైన వాతావరణం ఉండాలి. పూనే రాజధాని కాకపోయినా అభివ్రుద్ధి జరిగింది. లక్నో, భువనేశ్వర్ లాంటి మరెన్నో నగరాలు రాజధాని అయినా అభివ్రుద్ధి జరగలేదు. హైదరాబాదు తెలంగానా రాజధాని అయినా, లేక ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అయినా సుమారుగా ఇలాగే ఉండేది. అల్లాగే ముథ కక్షలతో నిండిన కర్నూలు, కులగజ్జితో నిండిన విజయవాడలు ఆంధ్ర రాజధానిగా ఉన్నా, వాటిని ఆంధ్ర ప్రదేశ్కి రాజధాని చేసినా అవ్వి ఇలాగే ఉండేవి.

    రిప్లయితొలగించండి
  33. కరణ్ కుంభ్: తె.వాదుల అబద్ధాలను ఇక రాయడం ఆపేద్దామని అనుకున్నాను. కానీ మీరు ఇంకా అవే అబద్ధాలను వల్లె వేస్తున్నారు కాబట్టి, మీరు పై వ్యాఖ్యలో చెప్పిన ఒక అబద్ధం గురించి ఓ టపా రాసాను. అది చూడండి.
    "మీ బ్లాగులో మీరు చూపించిన దొంగ లెక్కలకి నేనొక వివరణ పది రోజులక్రితం అడిగాను. మీరింతవరకూ సమాధానం ఇవ్వలేదు." - ఏంటి మీరడిగిన వివరణ? మీ వ్యాఖ్యలకు చాలావాటికి సమాధానాలిచ్చాను. కానీ అడిగిందే అడుగుతూ ఊ..రికే జీళ్ళపాకంలాగా సాగదీస్తూ పోతుంటే పెతీదానికీ వివరణ ఇవ్వడం నాక్కుదరదు. చదరంగంలో ఒకటుంది.. ఊరికే వేసిన ఎత్తే మళ్ళీ మళ్ళీ వేస్తూ ఉంటే మూడెత్తుల తరవాత ఇకచాల్లే ఆపండంటూ ఆటను డ్రా చేసిపారేస్తారు. నేనూ అలాగే 'ఇహనీయనతో ఆట అనవసరం, ఊరికే చెప్పిందే చెబుతున్నాడు' అని అనుకుని సమాధానం ఇచ్చి ఉండను, బహుశా.

    ఇంకోటి.., మీరు వ్యాఖ్యలు రాసుకుంటూ పోతూంటే నేను సమాధానాలిస్తూ పోడానికి ఇదేమీ ఛాట్ రూము కాదు, నా బ్లాగు.

    రిప్లయితొలగించండి
  34. దేశంలో రాష్ట్రాలు భాషా ప్రాతిపదికన విభజింప బడ్డాయి. అభివౄద్ధి ప్రాతిపదికన కాదు.

    అలా అభివౄద్ధి ప్రాతిపదికన రాష్ట్రాల్ని విభజించితే, దేశంలో రాష్ట్రాలు వేలల్లో వుంటాయి.

    ఎందుకంటే, దేశంలోని ఏ రాష్ట్రం లోనూ, అన్ని ప్రాంతాల్లో అభివౄద్ధి సమానంగా వుండదు.

    తెలంగానా ప్రాంతాన్ని అభివౄద్ధి చేద్దాం అనాలి గాని, ప్రత్యేక రాష్ట్రం వల్ల మనకు ఏం ప్రయోజనం?

    తెలంగానాలో ఎక్కువమంది తెలుగు కాకుండా వేరే భాష మాట్లడినప్పుడు ప్రత్యేక రాష్ట్రం కోరవచ్చు.

    రాజకీయ నాయకుల స్వార్థానికి చదువురాని అమాయకులే కాదు, కొంత మంది చదువుకున్న వివేకం కలిగినవారూ బలి అవుతున్నారు.

    - రఘు, వరంగల్.

    రిప్లయితొలగించండి
  35. చదువరి గారూ,
    విషయాన్ని సూటిగా చెప్పినా మీరన్నట్లు కొందరు జీడిపాకం లాగా సాగదీస్తున్నారు. మీలా కరణ్ కుంభ్ గారి వ్యాఖ్యలకు నా ఇటీవలి టపాలో "నా బ్లాగు - నాకు నచ్చినది రాస్తాను" అని ఖరాఖండీ గా సమాధానం చెప్పాను. మనం మామూలుగా మంచిగా చెబుతున్న మాటలు కొందరి తలకు ఎక్కడంలేదు. మీ రాజధాని మీరు నిర్మించుకోలేరా? అని అడుగుతున్న వారికి - ఆ నిధులు అలా వృధా అయ్యేబదులు, అభివృద్ధి పనులకు వినియోగిస్తే ఎంతో మేలు అనే అలోచనే రాకపోవడం ఎంతో దురదృష్టం. ఎంతసేపటికీ మమ్మల్ని దోచుకున్నారంటూ మాట్లాడే వారికి - విచక్షణ ఎంత మాత్రం ఉందో ఈ ఒక్క విషయంలోనే అర్ధం అవుతూ ఉంది. మనం ఎన్ని విషయాలు విడమరచి చెప్పినా ఇటువంటి వారి తలకి ఎక్కవు.

    రఘు గారు అన్నట్లు భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు ఏర్పడ్డాయి. అభివృధ్ధి కాలేదని ప్రతీవారూ రాష్ట్రం అడుగుతూ పోతే, ఈ దేశంలో ఎన్ని జిల్లాలు రాష్ట్రాలుగా మారాలో?

    >> రాజన్నగారు ఒక మాట అన్నారు
    గుజరాత్ వాళ్ళు మహారాష్ట్ర నుంచి విడిపోయినప్పుడు హైదరాబాద్ కంటే ఏంటో అభివృద్ది చెందిన బోంబే ని వదిలి గాంధీనగర్ ని అభివృద్ది చేసుకున్నట్టు కేంద్రం ఇచ్చే పాకేజీతో మీరు మీ సొంత రాజధానిని అభివృద్ది పరచుకోలేరా?
    మనం కలిసి ఉంటే, మరో రాజధానికి బదులు అదే పాకేజీతో మొత్తం వెనుక బడ్డ ప్రాంతాలన్నీ అభివృధ్ధి చేసుకోవచ్చ్చు.

    మరో మాట. గుజరాత్ వారు విడిపోయినప్పుడు కొత్త రాష్ట్రంలో కొత్త రాజధానిని ఏర్పాటు చేసుకున్నారు - మరి, ఆ రకంగా చూస్తే, తెలంగాణా కొత్త రాష్ట్రం అయినప్పుడు పాత ఆంధ్రప్రదేశ్ రాజధానిని ఎందుకు ఇచ్చేయాలి? మీకు వచ్చే కొత్త రాష్ట్రంలో కొత్త రాజధానిని మీరే ఏర్పాటు చేసుకోవచ్చు కదా? దేశంలో ఏ కొత్త రాష్ట్రం ఏర్పడ్డా వారు వాళ్ళ రాజధానిని ఏర్పాటు చేసుకున్నారు కానీ ఉన్న రాజధాని మాదే అనలేదు. తెలంగాణా లో అభివృధ్ధి లేదు అంటూ, ఆంధ్ర ప్రదేశ్ లో అన్నిటికంటే ఎక్కువ అభివృధ్ధి చెందిన ప్రాంతాలని మీకే ఇచ్చేయమని అనడం మీకే చెల్లింది. అందరూ కలిసి అభివృధ్ధి చేసిన రాజధానిని విడిపోయే రాష్ట్రానికి ఇచ్చేసి, మిగతా ఆంధ్ర ప్రదేశ్ లో మళ్ళీ ఇంకో రాజధానిని ఏర్పాటు చేసుకోవాలా? ఆ మాటకొస్తే విడిపోవాలనుకుంటున్నది మీరు - అందుకే మీరే మరో రాజధానిని ఏర్పాటు చేసుకోవాలి. వెనకబడ్డ ప్రాంతాల జాబితా తయారు చేస్తే మొత్తం ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న అన్ని జిల్లాలలోనూ అభివృధ్ధి చెందని ప్రాంతాలు ఉన్నాయి. ఈ గొడవలు మాని నిజంగా అభివృధ్ధి అన్నిచోట్లా జరగాలని ఆశించండి. అంతే గానీ వ్యర్ధ వాధనలతో మనకు ఉన్న కాస్త అభివృధ్ధి అవకాశాలనీ వదలకండి.

    రిప్లయితొలగించండి
  36. కరణ్ కుంభ్: "అల్లాగే ముథ కక్షలతో నిండిన కర్నూలు, కులగజ్జితో నిండిన విజయవాడలు ఆంధ్ర రాజధానిగా ఉన్నా, వాటిని ఆంధ్ర ప్రదేశ్కి రాజధాని చేసినా అవ్వి ఇలాగే ఉండేవి." - మీ అభిప్రాయానికి నెనరులు. నిజమే, మాకు సవాలక్ష సమస్యలున్నాయి, మరో సవాలక్ష రుగ్మతలున్నాయి. వాటిని సరిచేసుకోవాల్సి ఉంది. కాలం గడిచేకొద్దీ అవి చక్కబడతాయని ఆశిద్దాం.

    కానీ, ఒకటి గమనించారా.. మా లోపాలను మేమెరుగుదుము. వాటికి బాధ్యత మాదేనని అనుకుంటం గానీ పక్కనోడి మీద పడి యాడవం. నా ముక్కు చీమిడి కారుతోంది, దానికి అదుగో ఆడే కారణం అని మేం చెప్పం.

    గతంలో విరజాజి గారి బ్లాగులో మీరు రాసారు.. హై.లో మతకలహాలు సృష్టించింది ఆంద్రోళ్ళేననీ, అంతకుముందు అక్కడ మతసామరస్యం వెల్లివిరిసేదనీను! తప్పు మీలో పెట్టుకుని గబుక్కున 'ఆంద్రోళ్ళ'ను అనేసారు. మీ భావన తప్పని తగు సమాధానం రాసాక, మీరు మళ్ళీ మాట్టాడలేదు.

    ఇలా మాట్టాడ్డం తె.వాదుల ట్రేడ్‌మార్కైపోయింది.

    రిప్లయితొలగించండి
  37. మా సమస్యలు మాకున్నాయి, మీ సమస్యలు మీకు ఉన్నాయి వాటిని ఎవరూ కాదనలేదు. కానీ మా ప్రాంతంలో మీవాల్లు సమస్యలు శ్రుష్టించారు, మీ ప్రాంతంలో మా వాల్లెన్నడూ కలుగజేసుకోలేదు. ఔను మరి.. ఎప్పుడొ అభివ్రుద్ధి చెందిన హైదరాబాదుని మేమే అభివ్రుద్ధి చేసామని చెప్పే ఆంధ్రా వాల్లు అక్కడ చేసిన గొడవల గురించి మాత్రం ఒప్పుకోరు.

    ఇంతకూ హైదరాబాదు ఏవిధంగా ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడకముందే అభివ్రుద్ధి చెందిందో నేను సవివరంగా చెప్పాక బహుషా ఇప్పటికైనా హైదరాబాదుని మీరు అభివ్రుద్ధి చేయలేదన్న విషయం ఒప్పుకుంటారా?

    రిప్లయితొలగించండి
  38. "హైదరాబాదుని మీరు అభివ్రుద్ధి చేయలేదన్న విషయం ఒప్పుకుంటారా? " - ఈ ముక్క నేనెప్పుడన్నాను? సమైక్య రాష్ట్రంలో అభివృద్ధంతా ఇక్కడే జరిగిందని అన్నాను. మేమే చేసామని చెప్పలేదు.
    హై. అభివృద్ధి గురించి.. ఒకటో రెండో శాతం ప్రాంతం 60 శాతం పైగా పన్నురాబడిని ఎలా అందిస్తోందో చెప్పండన్నాను. మీరు దానికి మీఏమీ అనలేదు. 1956 నాటి ఆంధ్ర రాష్ట్ర, హై. రాష్ట్ర అభివృద్ధిని పోలుస్తూ "తెలంగాణ వాదుల మరో పచ్చి అబద్ధం" అని ఒక టపాయే రాసాను. మీరు దానికీ సమాధానం చెప్పలేదు, కానీ '..అభివ్రుద్ధి చేయలేదన్న విషయం ఒప్పుకుంటారా? ' అని అడుగుతున్నారు!

    రిప్లయితొలగించండి
  39. మీరడిగిన దానికి నేనప్పుడే సమధానం ఇచ్చాను, మీకర్ధం కానట్టుంది మల్లీ ప్రయత్నిస్తాను.

    హైదరాబాదు అదాయం ఎక్కువ అన్న మాట నిజమే. కానీ హైదరాబాదు ఆదాయం ఒక్క ఈ సంవత్సరమే కాదు, 1956 నుంచీ ఎక్కువే అనేది నా వాదన. మీ దగ్గర సంవత్సరాలవారీగా డాటా ఉంటే 1956 నుంచి ఇప్పటిదాకా రాష్ట్ర ఆదాయం, హైదరాబాదు ఆదాయం ఇవ్వండి.

    అది ఒకవేల ఒక్క సారిగా ఇప్పుడే పెరిగినట్లయితే అందుకు కారణం ఎడా పెడా అమ్మేస్తున్న హైదరాబాదులోని భూములను ఆదాయంగా చూపించారేమో.

    రిప్లయితొలగించండి
  40. అభివౄద్ధి లేదూ అంటున్న KCR నే నిలదీయాలి, 10 ఏళ్ళుగా అధికారంలో వుండి ఏం చేశావని?

    తన కుటుంబానికి తప్ప, ప్రజలకేమీ చేయలేదు, పైగా నింద అంధ్రా వాళ్ళ పైనా?

    మనస్సాక్షి వున్న ఏ మనిషైనా ఇలా చేయగలడా? ఎందుకీ జీవితం?

    తెలుగు వారి మాన మర్యాదల్ని మంటకలిపే నీ చర్యలు నిన్ను చరిత్ర హీనుడిగా మిగల్చవా?

    అప్పుడు జిన్నా, ఇప్పుడు KCR. రెండూ కుట్రలే, బలి అయ్యేది అమాయక ప్రజలే. ఇంకా ఎంత కాలం ఈ మోసాలు?


    సాటి తెలుగు వారందరికీ నా విన్నపం:

    రాష్ట్ర విభజన అనే ఈ ఉపద్రవాన్ని ఆపడం మన అందరి బాధ్యత.

    తెలుగు వారి గౌరవాన్ని నిలబెట్టడానికి వీలైనంత ప్రయత్నం చేయండి.

    మనవల్ల ఏమవుంతుందిలే అని ఊరుకోకుండా, మీ ఆలోచనల్ని బయటకు తీయండి,
    ఎంత చిన్నదైనా సరే, అందరితో పంచుకోండి, ఇటువంటి ద్రోహుల ఆట కట్టించండి.

    - రఘు, వరంగల్.

    రిప్లయితొలగించండి
  41. అయ్యా కరణ్ కుంభ్ గారూ, మీకు అర్థమయ్యేలా చెప్పడంలో నాకు కొన్ని సమస్యలున్నట్టుగా తోస్తోంది. నిజానికి నేను సరిగ్గా చెప్పాలనే ప్రయత్నం చేస్తున్నాను, కానీ ఎందుకు విఫలమౌతున్నానో తెలీడం లేదు. కాబట్టి ఈ చర్చను ఇక ఇంతటితో ఆపుతాను.

    రిప్లయితొలగించండి
  42. అసలు అర్ధం లేని వాదనని అర్ధమయ్యేలా చెప్పడం సాధ్యమవుతుందా? అందుకే
    - బాబరీ కట్టడాన్ని ప్రభుత్వమే కూల్చి గుడికట్టాలనే వాదన,
    - నిజామాబాద్, కరీం నగర్ కంటే విస్తీర్ణంలో సగం లేని శ్రీకాకుళం, విజయనగరం, జలవనరులేవీ లేని అనంతపురం వరి ఉత్పత్తిలో తక్కువ అని చూపించి తెలంగాణ అభివ్రుద్ధి గురించి ఎక్కువ చేసి చూపే ప్రయత్నం,
    - హైదరాబాదు అభివ్రుద్ధిలో ఆంధ్రా వాల్ల వాటా

    ఏవీ కూడా అర్ధం చెయ్యలేకపోయారు మరి.

    రిప్లయితొలగించండి
  43. కరణ్ కుంభ్: నేను నిదర నటిస్తున్నాను, నన్ను లేపు అని మీరు అంటున్నారు. అది నావల్ల కాదు. ఇకపై మీ నటనిద్ర నుండి లేపమని నన్ను అడగకండి.

    రిప్లయితొలగించండి
  44. Dear Blogger,
    Your agrguement is sharp & straight! Many here are unable to answer your objections against seperation.

    Kondamudi's comments are funny! that ChattisGhad, Jharkhand were not divided based on Itereya Bramhanam and irrelevant just to side-track the main issue! :)

    రిప్లయితొలగించండి
  45. చదువరి, 12 జనవరి 2010 8:49:00 am GMT+05:30

    Yes! It is difficult to keep bluffing! T-propaganda is full of bluffs and baseless! It is impossibel to convince any sensible fellow! Only way is to provoke tensions & hatred! That is exactly what Telangana leaders are doing! That means they are exhausted on any sensible point to talk in their support!

    రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు