నెల్లుట్ల వేణుగోపాల్ తెలంగాణ ఉద్యమంలోని హేతువును వివరిస్తూ, తెలంగాణకు జరిగిన అన్యాయాల గురించి మాట్టాడాడు. వివిధ ఒప్పందాలను ఏవిధంగా ఉల్లంఘించారో చెప్పాడు. స్వాభిమానం, స్వపరిపాలన అనేవి కేవలం స్థానిక స్వపరిపాలనకు మార్గమే తప్ప మరోటి కాదు అని చెప్పాడు. రాష్ట్ర విభజన జరిగాక, రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీటివివాదం వస్తే ప్రస్తుతం ఉన్న ఫ్రేమ్‌వర్కులోనే చాలా సామరస్యంగా పరిష్కరించుకోవచ్చు అని అన్నాడు. 'మీ పొరుగు ప్రజల కోరికలోని హేతుబద్ధతను గుర్తించండి.' అని ఇటీవల సమైక్య ఉద్యమం చేసిన విద్యార్థులు, ఉద్యోగులు ఇతర పెద్దలకు విజ్ఞప్తి చేసాడు.
మొత్తమ్మీద సమావేశానికి హాజరైనవారు వినిపించిన సమైక్యరాష్ట్ర అనుకూల వాదనల్లో ప్రధానమైనవి ఇవి:
1. తెలంగాణ ఉద్యమం కేవలం కొందరు రాజకీయ నాయకుల స్వార్థం కారణంగా తలెత్తింది. వాళ్ళ రాజకీయ ఆకాంక్షలకు సామాన్య ప్రజలు బలౌతున్నారు.
2. అభివృద్ధిలో తెలంగాణ వెనకబడిందనే మాట నిజం కాదు. 1956 లో ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడిన తరువాత రాష్ట్రంలో బాగా అభివృద్ధి చెందిన ప్రాంతం తెలంగాణయే. నీటిపారుదల, వైద్యం, విద్య, ఉద్యోగాలు, బ్యాంకులు, వంటి అనేక రంగాల్లో తెలంగాణ కోస్తా సీమలకు దీటుగా, అంతకంటే ఎక్కువగా అభివృద్ధి చెందింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం 1956 నుండి ఇప్పటిదాకా వివిధ ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలపై పెట్టిన ఖర్చును ఒక శ్వేతపత్రంగా వెలువరించాలి. ఏయే ప్రాంతాలు ఎలా అభివృద్ధి చెందాయి అనే విషయమై స్వతంత్ర ఆర్థిక నిపుణులతో పరిశోధన చేయించి వాస్తవాలేంటో తేల్చాలి.
3. తెలంగాణ వాదులు కోస్తా సీమల ప్రజలను నానారకాలుగా దుర్భాషలాడారు., ఆడుతున్నారు. తెలంగాణ మేధావులు ఈ తిట్లను వింటూ ఉన్నారేగానీ, అదేమని వాళ్ళను అడగలేదు, వారించలేదు. ఇటువంటి భావాలతో, రెచ్చగొట్టే ప్రసంగాలతో ప్రజల మనసులను చీల్చారు.
4. మనలో మనం కొట్టేసుకోడంతో సరిపోతోందిగానీ, పై రాష్ట్రాల వాళ్ళు నదులపై ఆనకట్టలు కట్టేస్తుంటే ఎదిరించకుండా ఊరుకుంటున్నాం. బాబ్లీ లాంటి ఆనకట్టలను కట్టేసుకుంటున్నాయి, పైరాష్ట్రాలు. మనం కలసికట్టుగా ఎదిరించకపోతే మన పరిస్థితి అధ్వాన్నమౌతుంది.
సమైక్యాంధ్రకు అనుకూలంగా మాట్టాడినవాళ్ళు 30 మందికి పైగానే ఉన్నారు. కొందరి వాదనలు ఇక్కడ:
- కోనేరు రంగారావు: విద్యార్థులను ఎందుకు ఈ రొంపిలోకి లాగారు అని ఆవేదన చెందాడీయన.
- ఎం.సి. దాస్: రాజకీయ విశ్లేషకుడు: ఈయన కొన్ని సూచనలు చేసాడు.
- తెలుగునాడు అని మన రాష్ట్రానికి పేరు మార్చుకుందాం.
- 3 ప్రాంతాలకూ ప్రాంతీయ అభివృద్ధి మండళ్ళు పెట్టాలి.
- 3 ప్రాంతాల నుండీ వంతులవారీగా ముఖ్యమంత్రులను నియమించాలి. అలాగే నిష్పత్తి ప్రకారం మంత్రులను నియమించాలి.
- డా. రమేష్: మా ప్రాంతంలో జరిగిన అభివృద్ధి అంటూ ఏమీ లేదని ఈయన అన్నాడు. సరైన అసుపత్రి సౌకర్యాలు లేవని, నిమ్స్ వంటి సంస్థ కోస్తా ప్రాంతంలో లేకపోవడం మా దౌర్భాగ్యం అని అన్నాడు. భావోద్వేగంతో ఈయనకు గొంతు పూడుకుపోయింది.
- అంబటి రాంబాబు: ఈయన గట్టిగా మాట్టాడాడు. ఆంద్రోళ్ళు పండక్కి వెళ్తే తిరిగిరారు అని, నాలుకలు కోస్తాం అనీ భయపెట్టి, రాష్ట్రాన్ని సాధించుకోడం కల్ల అని తెలియజేస్తున్నాను. నిజంగా విడిపోవాల్సే వస్తే, గౌరవంగా విడిపోతాం. సర్వహక్కులను సాధించుకుంటూ విడిపోతాం. అంతేగానీ దోపిడీదారులను ముద్ర వేసుకుని కాదు.
- దారా సాంబయ్య: గతంలో కుదుర్చుకున్న ఒప్పందాలేమీ ఉల్లంఘించబడలేదు. అన్నీ సక్రమంగా అమలు చేయబడ్డాయి. 'ఉల్లంఘించినట్టుగా ఏ తెలంగాణావావదైనా చెప్పే పనైతే, నేను చర్చకు సిద్ధమ'ని సవాలు చేసాడు. ఈయన చేసిన సూచనలు ఆలోచింపజేసేవిగా ఉన్నాయి. రాష్ట్రాన్ని విడగొట్టాలీ అనేది నిశ్చయమైతే, చిన్న రాష్ట్రాలే అందుకు ప్రాతిపదిక అయితే, గోదావరి నదీ పరీవాహక ప్రాంతం మొత్తాన్నీ ఒక రాష్ట్రంగానూ (ఉత్తరాంధ్ర), కృష్ణానదీ పరీవాహక ప్రాంతాన్ని, రాయలసీమనూ కలిపి మరో రాష్ట్రంగానూ (దక్షిణాంధ్ర) చేసి, రెంటికీ రాజధానిగా హైదరాబాదును పెట్టవచ్చు అనేది ఆయన సూచన. సరిగ్గా ఇదే విషయం ప్రముఖ బ్లాగరి పప్పు నాగరాజు గారు దాదాపు రెండేళ్ళ కిందట నాతో అన్నారు. 'నీళ్ళు అనేది ప్రధానమైన వనరు, సమష్టి వనరు. రాష్ట్ర విభజనలో అదే ప్రధాన అంశం. అలాంటపుడు నదీ పరీవాహక ప్రాంతాలను బట్టి రాష్ట్రాన్ని విభజిస్తే అందరికీ శ్రేయోదాయకం గదా! ' అని నాగరాజు గారు చెప్పారు. ఆలోచించాల్సిన విషయమది. (అయితే, తె.వాదుల ఎజెండాలో నిధులు, నీళ్ళు, నియామకాలు అనేవి లేవిప్పుడు. వాటితో తయారు చేసుకున్న అబద్ధాల పడవలు మునిగిపోవడం మొదలయ్యాక, ఆత్మగౌరవం, స్వపరిపాలన అనే లైఫ్ బోట్లు ఎక్కేసారు.)
- రాజయ్య, ఆంధ్రా ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ ఛైర్మన్: ధాన్యం సేకరణ కోసం ప్రభుత్వం ఇచ్చిన లక్ష్యాల ప్రకారం వివిధ జిల్లాలు కింది స్థానాల్లో ఉన్నాయి:
1. తూర్పు గోదావరి
2. కరీంనగరు
3. వరంగల్
4. నల్లగొండ
5. కృష్ణా
గుంటూరు జిల్లా ఎక్కడో అడుగున ఉందట. దీన్నిబట్టి తెలుస్తోంది -పంటలో ఎవరు అగ్రస్థానాల్లో ఉన్నారో అని ఆయన అన్నాడు.
- దేవినేని ఉమామహేశ్వరరావు: సమైక్యవాద ఉద్యమంలో ఎప్పుడూ వినని ఒక కొత్త వాదనను వినిపించాడు. 'పెద్దమనుషుల ఒప్పందాలు గానీ, రాష్ట్రపతి ఉత్తర్వులుగానీ ఎస్సీ ఎస్టీ, బీసీలకు ఏ మేలూ చెయ్యలేదు. ఈ ఒప్పందాలతో పేదలు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ఒరిగిందేమీ లేదు. తెలంగాణ వాదులు కూడా ఈ వర్గాల గురించి ఆలోచించడం లేదు. తెలంగాణ ఏర్పడితే మళ్ళీ దొరల సంస్కృతి, పటేల్ పట్వారీల సంస్కృతి వస్తుంది. తెలంగాణ విముక్తి పోరాటంలో తెలంగాణ, కోస్తా, సీమల ప్రజలు కలిసి పనిచేసారు. ఆ విధంగా రెండు ప్రాంతాల ప్రజల మధ్య సామరస్యం నెలకొంది. ఆ సామరస్యాన్ని తె.వాదులు తమ వాదాలతో దెబ్బతీస్తున్నారు.' ఈయన వాదనలో ఎంత పస ఉందో ఈ రోజున (సోమవారం నాడు) తెలంగాణలో మొదలైన చర్చ తెలియజేస్తుంది.
- పలనాటి శ్రీరాములు బహుజన కెరటాలు రాష్ట్ర కో కన్వీనర్, ఒంగోలు: ఈయనది పూర్తిగా దళిత దృక్కోణం. దళితులను ఇతర కులాలవాళ్ళు అణగదొక్కారు కాబట్టి రాష్ట్రాన్ని చీల్చాలి అనేది ఈయన వాదన. 'ఇక మీరు కుర్చీలను ఖాళీ చెయ్యండి, మేం కూర్చునే సమయమొచ్చింది ' అని ఖచ్చితంగా అంటున్నాడీయన. బహుశా కొత్త రాష్ట్రంలో దళితులకు రాజ్యాధికారం లభించే అవకాశాలు మెరుగౌతాయని ఆయన అభిప్రాయం కాబోలు. ఎస్సీ వర్గీకరణ అంశం ఆయన చేత ఈ మాటలను మాట్టాడించినట్టు నాకు అనిపించింది.
- లక్ష్మీపతి రాజు: ఈయన బీజేపీ నాయకుడు. రాష్ట్ర విభజనను సమర్ధించాడు. పార్టీ ఆధారిత రాజకీయ ప్రసంగం చేసింది ఈయనొక్కడే!
- వసంత నాగేశ్వరరావు: ఈయనేదో పెద్ద సంగతులు చెబుతాడనుకున్నాగానీ.., ఏం చెప్పలేదు. రాష్ట్ర విభజన గురించి ప్రస్తావించకుండా, 1969 తెలంగాణ ఉద్యమంలో తన స్వానుభవాన్ని చెప్పుకుంటూ పోయాడు. ఈ సుత్తిని తట్టుకోలేని ఆయన వ్యతిరేకులు గోల గోల చెయ్యడం మొదలెట్టారు. ఇక అక్కడినుంచీ ఆయన చెప్పింది అసలేమీ లేదు. ఇంతకీ.. తాను ఇంత సీనియరునైనా పట్టించుకోకుండా తనకంటే జూనియరులకు ముందు అవకాశాలిస్తున్నారని రామచంద్రమూర్తి గారిపై అలిగి వెళ్ళిపోతే మళ్ళీ బతిమిలాడి పిలిపించారు. తీరా చూస్తే, మాట్టాడిందేమీ లేదు, సుత్తి తప్ప.
- డీసీ రోశయ్య మాజీ అయ్యేయెస్ అధికారి. ఈయన 'కొన్ని షరతులకు లోబడి ఉంటేనే ప్రత్యేకాంధ్రను సమర్ధిస్తాను, లేకుంటే ప్రత్యేకాంధ్రే కావాలి ' అని అన్నాడు.
మొత్తమ్మీద విజయవాడ సమావేశంలో సమైక్య వాదన గట్టిగా వినిపించింది. అలాగే ప్రత్యేకాంధ్ర వాదన కూడా, పీలగానైనా, వినిపించింది. తెలంగాణ వాది నెల్లుట్ల వేణుగోపాల్‌ను అడ్డగించకుండా మాట్టాడనిచ్చారు. ఓసారి ఎవరో అభ్యంతరపెట్టినా, వెంటనే ఇతరులు వారించి కూచ్చోబెట్టారు. అయితే సమైక్య వాదులు, ప్రత్యేకాంధ్ర వాదుల మధ్య వాగ్యుద్ధం జరిగింది.
వాళ్ళు శ్వేత పత్రాన్ని విడుదల చేయమని పట్టుబట్టాలి .. విడుదల చేయించాలి... అంతే కాని.. అబద్దాలు బయట పడుతాయని.. వీళ్ళు వేరే నినాదాలు తీస్కున్నారంటున్నావే.. శ్వేత పత్రం విడుదల చేస్తే హైదరాబాద్ అభివృద్ది కూడా ఆ లెక్కలల్లో వస్తుంది కదా.. అసలే హైదరాబాద్ అభివృద్ది తో మిగతా రాష్ట్రం మొత్తాన్నీ కూడా పోల్చాలంటే ఆలోచించాలి..
రిప్లయితొలగించండిమిగతా వాళ్ళు శ్వేత పత్రం పై పట్టుబడితే తె వాదులు హైదరాబాద్ తప్ప మిగతా తెలంగాణ అభివృద్ది అడుగుతారు.. అప్పుడు పక్కన బెట్టే ఈ హైదరాబాద్ అందరిదీ అని మిగతావారు కొత్త లొల్లి తెస్తారు.. ఇవన్నీ నీకు తెలియవా.. అందుకే తె.వాదులు శ్వేత పత్రం పై వెనకడుగు వేస్తున్నారు.. ఈ నిజాన్ని నువ్వు ఒక అబద్దపు ప్రచారం తో అందరికీ తెలంగాణ వాదం యొక్క పునాది తప్పు అన్నట్లు ప్రచారం చేస్తున్న నువ్వు ఓ చదువరి వా... .
నీ వాదనలో నిజాలుంటే .. మరి జరుగుతున్న తప్పుడు ఉద్యమాన్ని ప్రజల్లోకి వెళ్ళి ఎదురించక ఇక్కడ కూచొని ఏం చేస్తున్నావు.. ఇవే నీ నిజాలని ప్రజల్లో వ్యాప్తి చేయించు.. దొంగలు దొంగలుగా దొరలు దొరలుగా గుర్తింప బడుతారు.. ఒక్కసారి ఆ టీవీ ల్లోకి వెళ్ళు.. వాళ్ళు నీ నిజాలకు ఉచిత పబ్లిసిటి ఇస్తారు.. నీ ఇష్ట రాష్ట్రం విడిపోదు.. ఇలాంటి వి చేయకుండా ఇక్కడ కూచొని అ ఆ లు దిద్దుతే ఏం లాభం.. అసలు పని చేయకుండా ..బ్లాగర్ల తో ఈ లొల్లి ఏం ఒరగపెడుతుంది.. అసలు నిన్ను నీ నిజాలను ఎలా నమ్మాలి....
రిప్లయితొలగించండిFirst, I don't agree with your opinion on 'Ajnata' comments. Your threat on IP addresses is stupid.
రిప్లయితొలగించండిComing to the discussion, I totally agree with point#4(Ambati) and Poit#2 of your summary.
Any demand to divide the state on sentiments/Atmagauravam/Culture/dialect need not be given any weightage.
I am against to change the name to 'TeluguNadu' or whatever. You may change name but not your fate! Andhra name is refers to the people lived between Godavari & Krishna rivers and it has historical reference dated back to Mahabharatha.
The main threat is from Maoists. They are eagerly waiting for the split and they would stage a come-back in weaker Telangana State, with far less resources as DGP pointed out. It would be a potential threat to Andhra-Rayalaseema with long border with Telangana. Still, Andhras will not have any concern if a buffer Hyderabad state is formed with Hyderabad, Rangareddy, Mahbubnagar, Nalgonda & Khammam and the rest can be Telangana state. Dividing state as per Nizam Kigngdom has no relevance as some of the area( Beedar, Raichur etc) is in neighbouring states.
Like in the past, this baseless agitation will also die-off, soon.
వీటి వల్ల ఏమన్నా ప్రయోజనం ఉంటుంది అంటారా. నాకైతే ఏం నమ్మకం లేదు. వేర్పాటు వాదాన్ని అబద్దాలు చెప్పి, బాగా ప్రచారం చేసి, బాగా లోతుకి తీసుకెళ్ళి పోయారు. విడిపోకుండా ఉన్నా ఇది వరకూ ఉన్నట్టు మాత్రం ఉండలేరనిపిస్తోంది.
రిప్లయితొలగించండిభయపెట్టి, ప్రజలమధ్య వైషమ్యాలు పెంచి రాష్ట్ర విభజన చేయించాలని చూస్తున్నారు. కలిసుండడానికి కారణాలు చెప్పాలనడం మూర్ఖత్వపు వాదన. రెచ్చగొట్టే నాయకులే తప్ప తార్కికంగా అలోచించే నాయకులే లేరు.
రిప్లయితొలగించండిRaja: తె.వాదుల దివాలాకోరు ఆలోచనను బాగానే బైటపెట్టావు. నేను చెబుతున్నదీ అదే. "దున్నేటప్పుడు దూడలలో, మేసేటప్పుడు ఎడ్లలో" ఈ సామెత ఇన్నావా? అవసరమైనప్పుడు హై.తో కూడిన తెలంగాణ, కుదరనప్పుడు హై. తక్క మిగిలిన తెలంగాణ. ఇలాంటి దివాలాకోరు వాదనలను సమైక్యవాదులు బైటపెడతంటే వంటిమీద జెర్రులు పాకుతున్నాయా? వెనకడుగు వెయ్యడం శ్వేతపత్రమ్మీద మాత్రమే కాదు.. చాలావాటిలో వెనకడుగే. ఆంద్రోళ్ళను తిట్టడంలోను, విభజన వ్యతిరేకవాదుల నోళ్ళను మూయించడంలోనూ దొంగలెక్కలు, అబద్ధాలూ చెప్పడం, చరిత్ర వక్రీకరణ, రావణాసురుడిలాంటి రాజును నెత్తిన పెట్టుకోడం,.. ఇలాంటి వాటిలో ఎప్పుడూ ముందడుగే! తె.వాదుల ముందు ప్రపంచంలో ఎవడైనా దిగదుడుపే!
రిప్లయితొలగించండి"ఒక్కసారి ఆ టీవీ ల్లోకి వెళ్ళు.. వాళ్ళు నీ నిజాలకు ఉచిత పబ్లిసిటి ఇస్తారు.." - ప్రచారం తె.వాదుల దొంగ లెక్కలకు కావాలిగానీ, నిజాలకు అక్కర్లేదు. నిజాలు వాటంతటవే వ్యాపిస్తాయి. కాబట్టి ఆ పనేదో నువ్వు చేసుకో.
"ఇలాంటి వి చేయకుండా ఇక్కడ కూచొని అ ఆ లు దిద్దుతే ఏం లాభం.. అసలు పని చేయకుండా ..బ్లాగర్ల తో ఈ లొల్లి ఏం ఒరగపెడుతుంది.. : - ఏఁ, నిజాలు వింటూంటే వంటిమీద జెర్రులు పాకుతున్నాయా? :)
"అసలు నిన్ను నీ నిజాలను ఎలా నమ్మాలి.." - నీకో చాయిసుంది. నమ్మకపోతే నేఁజెప్పేది తప్పని నిరూపించొచ్చు. ఇది చాతకానివాడే నువ్వు చేస్తున్న పని చేస్తాడు. తెలంగాణకు అన్యాయం జరిగిందో అంటూ బజాట్టోకొచ్చి ఎక్కెక్కి ఏడిస్తే ఒకసారి రెండుసార్లు జనం సముదాయిస్తారు. పద్దాక అలా ఏడుస్తూనే ఉంటే, చిరాకొస్తది, ఏంటి నీకు జరిగిన అన్యాయం అంటూ నిలదీస్తారు, వాస్తవాలను వెలికిదీస్తారు, అబద్ధాల ముసుగులు తీస్తారు. నిజాలు బయటపడ్డాక కూడా ఏడుస్తానంటే ఎట్టా?
ఏఁ, నిజాలు వింటూంటే వంటిమీద జెర్రులు పాకుతున్నాయా? :)
రిప్లయితొలగించండితె. వాదులు నీ పోస్ట్ లకు కామెంట్లు రాస్తే నీకు వంటిమీద జెర్రులు పాకుతున్నాయా? :) ఇట్ల ఎదురు దాడి చేసి ఎగిరెగిరి పడ్డోళ్ళు మహామహులే గాళ్ళో కలిసి పోయారు..
అవును నువ్వనుకున్న నిజాలు.. వింటుంటే అలానే అనిపిస్తుంది... ఎంత దిగజారి ప్రచారం చేస్తున్నాడని... నిజాలకు ప్రచారం అవసరం లేదా.. మరి గత 10 ఏళ్ళుగా నువ్వంటున్న ఈ నిజాలు ఎందుకు బయటకు రాలేదు.. సమైక్య వాదన చేసేది మీరు... మీ వాదన సరైందని నేను నిరూపించాలా.. ?
"అవసరమైనప్పుడు హై.తో కూడిన తెలంగాణ, కుదరనప్పుడు హై. తక్క మిగిలిన తెలంగాణ. ఇలాంటి దివాలాకోరు వాదనలను సమైక్యవాదులు బైటపెడతంటే వంటిమీద జెర్రులు పాకుతున్నాయా?"
అవును మాష్టారు.. మీరు అవునన్నా కాదన్నా హై. మాదే.. అది రాజధానిగా ఉంది కాబట్టి దాన్ని ఎట్లైనా అభివృద్ది చెయ్యాల్సిందే.. కానీ అంతకు ముందు హై. మాది.. అందుకు మీతో కలిసినందుకు మిగతా తెలంగాణ ప్రాంతాలకు కలిగిన మంచి ఏంటో కావాలని అడగటం తప్పా... మీవి లెక్క పెడితే హై. అందులో ఉండదు.. మావి లెక్క పెడితే మాత్రం అందులో హై. పెడుతరా.. దీన్ని ఏం అనాలి.. రంకు నేర్చినమ్మ బొంక నేర్వదా అంటరు...
నేను ఇంతకు ముందు 2008 లోనే నీతో ఇదే విషయంలో గొడవ పడ్డా.. అప్పుడు కూడా నేను ఆత్మ గౌరవం గురించే మాట్లాడా.. నీ ఇంతకు ముందు పోస్ట్ లొ నువ్వు చెప్పినట్ట్లు ఇంకేదొ వాదానికి మారి దాన్ని పట్టుకు వేలాడ లేదు.. తె. వాదుల అభివృద్ది అనేది చిన్న విషయం అంతే ... అభివృద్ది నిరంతరం..
నిరూపించుకొవాల్సిన స్థాయి ఎప్పుడో దాటి పోయాం.... మా లక్ష్యం ఇంకెంతో దూరం లో లేదు.. ఇప్పుడు చాన్స్ మీది .. సమైక్యం అంటున్న నీ లాంటి వాళ్ళ అవసరం ..నువ్వంటున్న నిజ నిరూపణ... ఇంకా ఇక్కడే అ ఆ లు దిద్దుతే .. దిద్దుకో..
@ రాజా..
రిప్లయితొలగించండిఅవును ఇంకెంతో దూరం లేదు, మీ జీవితాలు కుక్కలు చింపిన విస్తరి కావడానికి, రాబందుల లాటి రాజకీయ జేయేసీ మిమ్మల్ని ఖండ ఖండాలుగా చీల్చుకు తినడానికి. మీరు చేసిన తప్పుకు పశ్త్చాత్తపపడే రోజులు ముందు ముందు ఉన్నాయి.
@viswamitra: హహా హహహ... ఇంకా శాపనార్థాలు పెట్టు.. అవి తిరిగి మీమీదికే వస్తాయి జాగ్రత్త.. ముందైతే బయటి రాబందులను గెంటేసి ... తర్వాత లోపటి రాబందు(వు)లను పాతేస్తాం... ముందు ముందు ఎవరు పశ్చాత్తాప పడుతారో చూస్తావు గా .
రిప్లయితొలగించండిఆంధ్రప్రదేశ్ నెత్తి మీద లక్ష కోట్ల అప్పు ఉందంట. మరి రాష్ట్రాలు విడిపోతే ఎవరు ఎంత నెత్తి మీదకు ఎత్తుకుంటారో...
రిప్లయితొలగించండిCHAALA MANCHI VISHAYAALU CHEPPARU
రిప్లయితొలగించండిCHALA BAGUNDI
రిప్లయితొలగించండి>>>>రాజయ్య, ఆంధ్రా ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ ఛైర్మన్: ధాన్యం సేకరణ కోసం ప్రభుత్వం ఇచ్చిన లక్ష్యాల ప్రకారం వివిధ జిల్లాలు కింది స్థానాల్లో ఉన్నాయి:
రిప్లయితొలగించండి1. తూర్పు గోదావరి
2. కరీంనగరు
3. వరంగల్
4. నల్లగొండ
5. కృష్ణా
గుంటూరు జిల్లా ఎక్కడో అడుగున ఉందట. దీన్నిబట్టి తెలుస్తోంది -పంటలో ఎవరు అగ్రస్థానాల్లో ఉన్నారో అని ఆయన అన్నాడు.>>>>>
సమైఖ్య వాదుల అబద్దాలకి ఇది ఒక తార్కాణం. వాణిజ్య పంటలైన పొగాకు, పాత్తి, మిర్చి లో అగ్ర స్తానములో ఉన్న గుంటూర్ వరి పంటలో ఎక్కడొ చివరికి ఉన్దనే ఏడుపు. ఉన్న పొలంలోనే ప్రపంచంలో ఉన్న అన్ని పంటలను పండిన్చాలని కాబోలు ఈయన ఆరాటం.
వరి రాష్ట్రానికి జీవనాధారం. కనుక దాన్ని ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ప్రొక్యూర్‌మెంట్ చేస్తుంది. ఇదివఱకు వరి ప్రొక్యూర్‌మెంటులో మధ్యకోస్తాజిల్లాలు (Mid-Coastal districts) ఆక్రమించిన ప్రథమస్థానాన్ని ఇప్పుడు తెలంగాణ జిల్లాలు ఆక్రమించాయని ప్రభుత్వగణాంకాలు తెలియజేస్తున్నాయి. అందులో తప్పేముంది ? పొగాకు, మిఱప, వేరుశనగ, పత్తి - ఇవి జీవనాధార పంటలు కావు. ఇవైనా గుంటూరు జిల్లా అంతటా పండవు. వీటిల్లో ఒక్కొక్కటి అక్కడ కొన్ని మండలాలకే పరిమితం.
రిప్లయితొలగించండిఇహపోతే తెలంగాణరాష్ట్రం వచ్చేసిందన్న భ్రమలో ఉన్న నా సోదరులకి నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. వచ్చేది కాస్తా వెనక్కి పోయింది. పోయేట్టు చేశాం, పాపం ! మీ శ్రమంతా వృథా. ఇహ అది ఎప్పటికీ రాదు నాయనలారా ! చచ్చినోళ్ళక్కూడా అర్థమైపోయిన విషయం బతికున్నోళ్ళకి అర్థం కాకపోవడం ఒకింత ఆశ్చర్యాన్ని, వినోదాన్ని కలిగిస్తున్నది. సరే ! ఆ భ్రమలోనే ఉండండి. మంచిదే.
--తాడేపల్లి