21, జనవరి 2010, గురువారం

2010 జనవరి 18 - తెలంగాణ ఉద్యమంలో కంచె అయిలయ్య రోజు!

తెలంగాణ ఉద్యమంలో 2010 జనవరి 18 న హఠాత్తుగా కులం ప్రసక్తి తలెత్తింది. ఉద్యమ నేతల కులాలను ఎత్తిచూపి, ఎందుకు వాళ్లకింత ప్రాముఖ్యత, దళిత బహుజనులకు ప్రాముఖ్యత ఎందుకు లేదు అంటూ కంచె అయిలయ్య ప్రశ్నిస్తూంటే చర్చలో పాల్గొన్న ఇతర నాయకులు, విశ్లేషక శేఖరులూ కొండొకచో మాటల కోసం తడుముకోవాల్సి వచ్చింది.

అయిలయ్యవి సూటిప్రశ్నలు.., తెలంగాణ రాజకీయ జేయేసీకి కోదండరామిరెడ్డి నాయకుడు. తెదేపా తరపున నాగం జనార్దనరెడ్డి, కాంగ్రెసు తరపున జానారెడ్డి, రామిరెడ్డి దామోదరరెడ్డి,.. అంతా వీళ్ళేనా? ఏఁ, జేయేసీ నాయకుడిగా కోదండరామిరెడ్డి కాకుండా మంద కృష్ణ మాదిగను ఎందుకు పెట్టలేదు? మంద కృష్ణను జేయేసీ నాయకుడిగా చేసి, తెలంగాణ ఏర్పడ్డాక ఆయన్ను ముఖ్యమంత్రిగా చేస్తామని ప్రకటించండి అని అన్నాడు. మొన్నమొన్నటిదాకా సిద్ధాంతకర్త జయశంకర్ ఉండేవాడు, ఇప్పుడసలు కనబడ్డమే లేదు. ఎందుకు ఆయన్ను పక్కనబెట్టారు? -ఇదీ వరస!

జేయేసీ నాయకుడిగా కోదండరామిరెడ్డి తెలంగాణ వ్యాప్తంగా సర్పంచులను, స్థానిక ప్రజా ప్రతినిధులను తమ పదవులకు రాజీనామాలు చెయ్యమని అడుగుతున్నాడు. అసలు ముందు ఆయన రాజీనామా చెయ్యాలి. ఆయన చెయ్యకుండా ఇతరులను చెయ్యమనడం ఏంటి? అని అయిలయ్య ప్రశ్నించాడు. ఉద్యమం జరుగుతున్న కాలంలో ఒకరోజున హరీష్ రావు పెట్రోలు పోసుకుని అంటించుకుంటానన్నాడు. కానీ అందరూ ఆపారు. ఆ తరవాత పదుల సంఖ్యలో దళిత బహుజన పిల్లలు పెట్రోలు పోసుకుని కాల్చుకుని చనిపోయారు. ఇప్పుడు జేయేసీ నాయకుడు మీరు రాజీనామాలు చేసెయ్యండి అని అంటున్నాడుగానీ తాను మాత్రం రాజీనామా చెయ్యడం లేదు అని పాయింటు లాగాడు.

రాష్ట్రవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన అత్యంత నిష్పాక్షిక (నిష్పాక్షికత = తెలంగాణ వాదం) రాజకీయ విశ్లేషకుడైన ఘంటా చక్రపాణి తన మామూలు ధోరణిలోనే - కోస్తా విద్యార్థి నాయకులను గౌరవించినట్టుగానే- అయిలయ్యనూ గౌరవించబోయాడు. 'ఆయా రాజకీయ పదవుల్లో ఉన్నవారు రాజీనామా చెయ్యడానికీ కోదండరామ్ రాజీనామా చెయ్యడానికీ సంబంధం ఏంటి? ఆ పదవుల్లో ఉన్నవాళ్లకు ఆ పదవే జీవనాధారం అంటే వాళ్లను అవమానించడమే' అని అన్నాడు. 'ఏదో బీసీలు బీసీలూ అని అంటున్నారే.. ఇంత ఉద్యమం జరుగుతూంటే బీసీలు ఎందుకు పాలుపంచుకోడం లేదండి?' అని అడిగాడు.  వెంటనే అయిలయ్య బీసీలను అవమానిస్తున్నారు అంటూ అనబోయాడు. నిష్పాక్షిక విశ్లేషకుడు వెంటనే సర్దుకుని, 'మీరెందుకు ఉద్యమంలో పాలుపంచుకోవడంలేదు?' అని అడిగాడు. 'మనలాగా స్టూడియోలకొచ్చి విమర్శించడం కాదండీ గొప్ప, ఉద్యమంలో చేరి, ప్రత్యక్ష కార్యాచరణలో పాలుపంచుకోవాలి' అనీ అన్నాడు. 'యూనివర్సిటీలో అంత ఉద్యమం జరుగుతూంటే కనీసం అటు తొంగైనా చూళ్ళేదు గానీ నాయకత్వం వహించి ఉద్యమాన్ని నడిపిస్తున్న కోదండరాం గారిని రాజీనామా చెయ్యమని అడగడమేంటండి' అంటూ ఈసడించాడు.

చర్చలో 'ఇప్పటిదాకా ఆయన్ను కోదండరామ్‌గానే ప్రజలెరుగుదురు. ఇప్పుడు మీరు రెడ్డి అంటూ కులం పేరుతో పిలిచి కులాన్ని మధ్యలోకి లాగుతున్నారు' అనే విమర్శ తలెత్తినపుడు, అయిలయ్య 'నేనేమీ కొత్తగా పిలవడం లేదు. యూనివర్సిటీలో ఆయన్ను కోదండరామిరెడ్డిగానే అందరూ పిలుస్తారు. ఇక్కడ కోదండరామ్ అని పిలుస్తున్న సంగతి నాకు తెలవదు' అని అన్నాడు.

అయిలయ్య కమ్యూనిస్టులను విమర్శిస్తూ, 'ఒక్క పుచ్చలపల్లి సుందరయ్య తప్పించి కమ్యూనిస్టుల్లో సరైన నాయకుడంటూ లేడు. అందరూ అగ్రకులాలకు చెందినవాళ్ళే. బెంగాల్లో కూడా అంతే.. బసులు, బెనర్జీలు, ముఖర్జీలు, .. అందరూ అగ్రకులాలవాళ్ళే', అంటూ విమర్శించాడు. చర్చలో మంద కృష్ణ పాల్గొంటూ, 'దళిత బహుజనులకు జేయేసీలో ప్రాముఖ్యత లేద'ని అయిలయ్యతో ఏకీభవించాడు. కడియం శ్రీహరి దళితులకు ప్రాధాన్యత లేదని అంగికరిస్తూనే, ప్రస్తుతం ఉద్యమమున్న పరిస్థితిలో ఏ కులాలను పట్టించుకోకూడదనీ, పక్కనబెట్టాలనీ అన్నాడు.

అయిలయ్యది దళిత బహుజనవాదం. ఈ వాదాన్ని ముందుకు తీసుకురావడానికి ఇది సందర్భమా కాదా అనేది ఆయనకు అనవసరం. తెలంగాణ ఏర్పడటం కంటే, దళిత బహుజనులు అధికారంలోకి రావడమే ఆయనకు ముఖ్యం. చర్చలో అయిలయ్య సమైక్యవాద నాయకులకు కూడా ఒక ప్రతిపాదన చేసాడు.. ఆంధ్ర ప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా ధర్మాన ప్రసాదరావును, ఉపముఖ్యమంత్రిగా తెలంగాణ నుండి దామోదర్ రాజనర్సింహను పెట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి నడిపిద్దాం రండి, నేనూ సమర్ధిస్తాను అని అన్నాడు. అదీ సంగతి!

24 కామెంట్‌లు:

  1. మీ టపాకి ఏ మాత్రం సంబంధం లేని కామెంట్ రాస్తున్నాను. కొణతం దిలీప్ అనే ఆయన బ్లాగులో తాజా టపా చదివి, అందులో విద్యార్ధుల్ని ఆత్మహత్యలకి పురికొల్పే వాక్యాలకి గుండె రగిలి రాసిన కామెంట్ ఇది. తీరా రాశాక చూస్తే ఆయన బ్లాగులో కామెంట్లు పబ్లిష్ అవ్వటం లేదు. అందుకని అదిక్కడ ఇస్తున్నాను. మీకు ఇష్టం లేకపోతే నిరభ్యంతరంగా తీసేయండి.

    -------------


    >> "అతని ఆత్మాహుతి ఒక మహోన్నత నిరసన"
    >> "అతని మరణం ఒక ధిక్కారం"

    దిలీప్ గారు,

    బాగున్నాయండీ మీ ఉపదేశాలు. అంత మహోన్నత నిరసనైతే మరి మీరూ చేసి చూపొచ్చుగా ఆ ధిక్కారమేదో. మీరు మాత్రం చెయ్యరు. మనం ఎప్పుడూ బాగుండాలి, కడుపులో చల్ల కదలకుండా. చేతిలో పెన్నులున్నాయని పడికట్టు పదాలతో ఇలాంటి రాతలు రాసి రెచ్చగొట్టటం మాత్రమే మనం చేస్తాం. ఈ చెత్తంతా చదివి ముందూ వెనకా ఆలోచించే జ్ఞానం లేని ఆవేశపరులు ఆత్మాహుతి మంటల్లో శలభాల్లా మాడి మసై ఉద్యమాలకి ఊపిర్లు పోయాలి. ఆ మంటల్లో మనం చలికాచుకోవాలి. కదా?

    తెలంగాణ ఉద్యమమైనా, సమైక్యాంధ్ర ఉద్యమమైనా, మరేదైనా .. మనుషుల్ని చచ్చి మరీ సాధించమని ప్రోత్సహించటం అచ్చమైన బాధ్యతారాహిత్యం, నేరం. గుర్తెరగండి.

    రిప్లయితొలగించండి
  2. అబ్రకదబ్ర ,

    అసలు వేణుగోపాల్ రెడ్డి ది ఆత్మహత్య కాదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అది గమనించారా?

    ఒక వీరుడు మరణించిన వేలకొలది ప్రభవింతురు అనేది ఈ ఉద్యమానికి వర్తిస్తుందా?

    ఆవేశంతో ఎగిరిపడే విద్యార్థులకు అందాల్సిన సందేశాలు ఇవేనా? ఇంకా ఎంతమందికి ప్రోత్సహిస్తారు? ఇంకా ఎంతమందిని రెచ్చగొడతారు?

    నిన్న ఎన్ టీవీలో ఒకావిడ ఫోన్ చేసి అడుగుతోంది.."ఒక్క ఎమ్మెల్యే అయినా చచ్చిండా? ఒక్క TRS అగ్రనాయకుడెవరన్నా గాస్ నూనె పోసుకుండా? మరి మా పిల్లల్నెందుకు పురిగొల్పుతున్నరు? మా పిల్లలెందుకు చావాలె మీ కోసం?" అని? ఈ ప్రశ్నలకు ఎవరి దగ్గర సమాధానాలున్నాయి?

    "మీరు అమరులు, మీరు దేవుళ్ళు, మీ త్యాగం వృధా కాదు"అని పొగిడి,జోహారులర్పించే నాయకులు తామూ ఆ బాటలో నడవాలని, త్యాగంతో ఉద్యమానికి ఊపిరి పోయాలని అనుకోరేం? పోయిన వారిని పొగడ్డంతో సరిపెడుతున్నారు?

    వేణు మరణంతో ఉద్యమం వేడెక్కిందని సంతోషిస్తున్నారే గానీ వారి కుటుంబ సభ్యుల మనో వేదన వీరు తీరుస్తారా?

    ముందూ వెనకా ఆలోచించకుండా దూకుతారు కాబట్టి విద్యార్థులను రెచ్చగొట్టి వేడుక చూస్తున్నారు.

    ఇకనైనా ఈ ఉద్యమానికి విద్యార్థులను వాడుకోకుండా ఉంటే తల్లి దండ్రుల కడుపుకోత కు కారణం కాకుండా ఉంటారు.
    చదువరి గారు, క్షమించాలి మీ స్పేస్ వాడుకున్నందుకు!

    రిప్లయితొలగించండి
  3. జే యే సీ లో ఉన్న ఈ అంతర్గత కలహాలు చాలు ఉద్యమంలో ఐక్యత ఎంతో తెలియడానికి! నిన్న అయిలయ్య అడిగిన ప్రశ్నలకు ఒక్కరూ సూటిగా తడుముకోకుండా జవాబు చెప్పకపోవడం ఎవరినీ ఆశ్చర్యపరలేదు.

    రిప్లయితొలగించండి
  4. @ అబ్రకదబ్ర : నిజమే బాగా చెప్పారండి !
    శ్రీ కాంత్ ని దాదాపు అందరూ మరిచి పోయారు.
    శ్రీ కాంత్ ఆత్మా హత్య చేసుకున్నాక ఆత్మహత్యాలని ప్రోత్సహించారు
    తత్ఫలితం మరిన్ని ఆత్మహత్యలు
    తెలంగాణా మీద కొన్ని టపాలు వ్రాసాను
    "తెలంగాణా వాదులు ఒళ్ళు కాల్చు కొంటుంటే !

    కొదరు చలి కాచుకుంటున్నారు!!

    కొదరి ఆత్మ 'హత్య' లను చూస్తూ!

    మరి కొదరు ఆనందిస్తున్నారు.!!"
    మరిన్ని టపాల కోసం

    రిప్లయితొలగించండి
  5. కులంపేరుతో ఉద్యమంలో చిచ్చు పెట్టడానికి ప్రయత్నించిన అయిలయ్యలాంటి వాళ్ళు తమ సొంత ఐడెంటిటీ కోసం తప్ప మరిదేనికీ ప్రాధాన్యమివ్వరు. కోదండరాం హక్కుల ఉద్యమ కార్యకర్తగా నిజాయితీగా పనిచేసిన వ్యక్తి. ఆయన కులం ప్రాధాన్యతగా నాయకత్వం చేయడంలేదు. ఆయన కార్యాచరణ తెలిసి, వివాదాలకతీతుడుగా ఆయన నేతృత్వాన్ని అంగీకరించారు.

    రిప్లయితొలగించండి
  6. కంచ ఐలయ్య గణపతిని, రామకృష్ణని కూడా కులం పేరుతో తిట్టాడు. అలాంటి కులగజ్జివాళ్ళ మాటలకి విలువ ఇవ్వడం అనవసరం.

    రిప్లయితొలగించండి
  7. " నేను తెలంగాణావాదినెట్లయితా "

    రిప్లయితొలగించండి
  8. కంచ ఐలయ్య దృష్టిలో బాపనోడు జంజెం తీసేసినా అతను బాపనోడే. ఐలయ్యని విదర్భకి తీసుకెళ్ళినా, బుందేల్ ఖండ్ కి తీసుకెళ్ళినా అక్కడ కూడా ప్రత్యేక రాష్ట్రవాదుల కులం గురించి అడుగుతాడు.

    రిప్లయితొలగించండి
  9. అబ్రకదబ్ర గారూ,

    చనిపోతున్న పిల్లల పట్ల ఆవేదనతో రాసిన ఆ వాక్యాలు మీకు మరో విధంగా అర్థం అయినట్టున్నాయి. ప్రతి రోజూ మేము వివిధ వేదికలపైనుండి ఈ బలిదానాలు ఆగాలని విజ్ఞప్తులు చేస్తూనే ఉన్నాము. మొదలు చనిపోయిన శ్రీకాంత్ ది మా పక్క ఊరే. మా కుటుంబానికి బాగా తెలిసిన వ్యక్తి. మొన్న చనిపోయిన వేణుగోపాల్ రెడ్డి అన్నయ్య ఉస్మానియాలో ప్రొఫెసరయిన మా మేనమామ విద్యార్ధి. నేను పుట్టి పెరిగిన సూర్యాపేట పక్కన ఉన్న దోసపాడు గ్రామస్థుడు.

    ఇలా మా ఆత్మీయులను మేమే చంపుకుంటామా?

    ఇంకొక్క ప్రాణం కూడా పోవడానికి వీలులేదు. బ్రతికి మన తెలంగాణా సాధించుకుందాం. అని అదే పోస్టులో రాసినది మీకు కనిపించలేదా?

    తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు ప్రకటన వచ్చే దాకా నిద్రపోయి ఇప్పుడు తమ డబ్బు, మంద బలంతో తెలంగాణా ఏర్పాటును అడ్డుకుంటున్న వారే ఈ పిల్లల మరణాలకు బాధ్యులు. తెలంగాణా ఏర్పాటుపై రోజుకో అయోమయం ప్రకటన చేస్తున్న కాంగ్రెస్ పెద్దల బాధ్యతారాహిత్యమే ఈ ఆత్మ బలిదానాలకు కారణం.

    (మీరు రాసిన వ్యాఖ్యకు నా జవాబు ఇది. దీనిపై మళ్ళీ మళ్లీ చర్చించేంత సమయం లేదు. మన్నించగలరు)

    కొణతం దిలీప్

    రిప్లయితొలగించండి
  10. అయిలయ్య గారు ప్రతి దానినీ కులం కోణంలో చూడడం నాకు కూడా నచ్చలేదు. అగ్రకులంలో పుట్టడమే మహా పాతకం అయినట్లు...ఆ కులాలలో పుట్టిన వారికి...అందరికీ మేలు జరగాలన్న సంకల్పం ఉండదన్నట్లు మాట్లాడడం సరికాదు. తెలంగాణా సాయుధ పోరాటం అంతా అగ్ర కులాల వారు నడిపారు. బలి అయ్యింది...అయిలమ్మ, కొమురయ్య లాంటి వారు. మరి ఆ ఉద్యమానికి నాయకత్వం వహించిన సుందరయ్య (రెడ్డి) గారు ఎందుకు చావలేదు అంతే...సమాధానం చెప్పలేము. అయినా..కొదండరాం గారు నిజాయితీగా ప్రజా ఉద్యమాల కోసం పనిచేసిన వారు. నల్గొండలో యురేనియం వ్యతిరేక ఉద్యమం జరిగితే....తీవ్ర నిర్భందం నడుమ కోదండ రాం గారు వచ్చి ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొనే వారు. ఆయన వాదన, నిబద్ధత...చాలా గొప్పగా ఉండేవి. అయిలయ్య గారు అలాంటి ఉద్యమాలలో పాల్గొన్న దాఖలాలు కనిపించడం లేదు. దళితులకు మేలు చేయాలనా వాదన మంచిదే...బడుగులకు ఆంగ్ల విద్య కావాలన్న ఆశయం ఆహ్వానించ దగినదే...అంత మాత్రాన ప్రతి దాంట్లో కులం పుల్లలు పెట్టడం ఏమి సమంజసం?

    అయినా...అయిలయ్య గారు..మంద క్రిష్ణ మాదిగ పేరు ప్రస్తావిస్తున్నారు. మరి ఇది ఏకపక్ష నిర్ణయం కాదా? బడుగులకు మద క్రిష్ణ ప్రతినిధి ఎలా అవుతాడు? అతని నిబద్ధత నికార్సైనదని చెప్పే నిదర్శనాలు ఏవి? నిజానికి ఒక బీ.సీ.ముఖ్యమంత్రి కావడం మంచిది...అయిలయ్య సార్ ఒక వ్యక్తి పై ప్రేమతో, మరొక వ్యక్తిపై కోపంతో మాట్లాడుతున్నట్లు నాకు అనిపిస్తున్నది. ఈ కులాల పంచాయితీలు మాని....ముందుగా రాష్ట్రంలో శాంతి నెలకొల్పే పని అంతా చేయాలి. పిల్లల మరణాలు ఆగడానికి ఏమి చేయాలో అయిలయ్య గారి లాంటి మేధావులు ఇప్పుడు సూచించాలి.

    రాము

    రిప్లయితొలగించండి
  11. దళితులను ,వెనకబడిన వర్గాలను ముఖ్యమంత్రిగా చేసినంత మాత్రాన ఆ వర్గాలకు చెందిన ప్రజలంతా బాగు పడతారనడం ఒక వితండ వాదం మాత్రమే.ఆ కులం లోనుండి తిరిగి సమాజానికి ఒక దళిత దొర,ఒక వెనకబడిన దొర మాత్రం దొరుకుతారు.చాలామంది రాజకీయంగా ఎదగడానికి మాత్రమే కులాన్ని వాడుకొని ఆ పదవి పొందిన తర్వాత తమ కులం వాళ్ళను పట్టించుకోని వాళ్ళు ఎందరో ఉన్నారు.చివరికి పెళ్ళిల్లు కూడా అగ్రవర్ణాల వాళ్ళను చేసుకొని, తమ కులాన్ని అవసరం వచ్హినప్పుడు మాత్రమే అప్పుడప్పుడు గుర్తుచేసుకుంటూ చివరికి తమ కులం పేరు చెప్పుకోవడానికి ఇష్టపడని పెద్దమనుషులు ఈ సమాజంలో ఎంతో మంది ఉన్నారు.

    రిప్లయితొలగించండి
  12. @మంచుపల్లకి :) అసలు నేను మడిసి నెట్లయితా ఇది ఒరిజినల్ !
    చదువరి గారు ఈ కంచ ఐలయ్య గారి కి వీరాభిమాని అని నాకుముందే తెలుసు ;) , కాని ఈ టపా వాక్యాలు చూస్తుంటే మాత్రం భలే విచిత్రం గా ఉంది , మన మిత్రులలో ఇద్దరికి ఇంత సడన్ గా కంచ ఐలయ్య ఇంత కుల పిచ్చి ఉన్న మనిషి అని జ్ఞానోదయం ఐంది ఏంటి చెప్మా అని ! (రాము గారు ఈ వాఖ్య మీకు సంబంధించి కాదండి )

    రిప్లయితొలగించండి
  13. కంచ ఐలయ్యకి కులగజ్జి ఎప్పటి నుంచో ఉంది. కులవ్యవస్థని తీవ్రంగా వ్యతిరేకించే ఒక కార్మిక వర్గ విప్లవ పార్టీకీ, ప్రభుత్వానికీ మధ్య చర్చలు జరుగుతున్న టైమ్ లో ఆ కార్మిక వర్గ పార్టీకి చెందిన ఇద్దరు నాయకులని కులం పేరుతో దూషించాడు కదా.

    రిప్లయితొలగించండి
  14. దిలీప్ గారు,

    వివరంగా బదులిచ్చినందుకు ధన్యవాదాలు.

    మీరు మిగతా మంచి విషయాలు ఎన్నిరాసినా, ఒక్క విషం చుక్క చాలు దాన్నంతా కలుషితం చెయ్యటానికి.

    మీరు దళారీ పశ్చాత్తాపం అనే అనువాద పుస్తక రచయిత అని ఇప్పుడే తెలిసింది. ఓ రచయితగా - ఏకవాక్య స్లోగన్స్ ఆకర్షించినంత తేలిగ్గా సుదీర్ఘ పేరాగ్రాఫులు చదువర్లని ఆకట్టుకోవన్న విషయం మీరెరుగనిది కాదు. నేనెత్తి చూపిన రెండు వాక్యాలూ ప్రముఖంగా కనపడేలా జాగ్రత్తపడి మరీ రాశారు మీరు. అదే నా అభ్యంతరం.

    ఈ చర్చకి నా తరపునా ఇంతటితో స్వస్తి.

    రిప్లయితొలగించండి
  15. >>తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు ప్రకటన వచ్చే దాకా నిద్రపోయి ఇప్పుడు తమ డబ్బు, మంద బలంతో తెలంగాణా ఏర్పాటును అడ్డుకుంటున్న వారే ఈ పిల్లల మరణాలకు బాధ్యులు. తెలంగాణా ఏర్పాటుపై రోజుకో అయోమయం ప్రకటన చేస్తున్న కాంగ్రెస్ పెద్దల బాధ్యతారాహిత్యమే ఈ ఆత్మ బలిదానాలకు కారణం.<<
    దిలీప్ గారు,
    పైనున్న మీ వ్యాఖ్య సహేతుకమైనదేనా?
    "ఇకపై తెలంగాణా అగ్నిగుండమే","తల నరుక్కుంటా","ఇచ్చుడో చచ్చుడో","బలిదానం","ఆత్మత్యాగం" ఇలాంటి ప్రకటనలు చేసేవాళ్ళు కాదా కారణం?
    బుల్లెట్లకు ఎదురుగా వెల్తాం, ప్రాణాలు అడ్డేస్తాం అన్న నాయకులలో ఒక్కడైనా ఎదురు వెళ్ళలేదే? నిన్న రబ్బరు బుల్లెట్ల నుండి హరీశ్ రావు ఎంత వీరోచితంగా తప్పించుకున్నాడో ఆంధ్రజ్యోతి లొ చదివాను.
    పైన అబ్రకదబ్ర గారు అడిగిన ప్రశ్నే, నేను కూడా అదుగుతున్నాను. తలనరుక్కునే వాల్లను ఎవరు ఆపుతున్నారో నాకింతవరకు అర్ధం కావట్లేదు.

    రిప్లయితొలగించండి
  16. Same as Dallas Nageswararao here - If at all Dileep intends to respond. But I doubt whether he will, for hez known for his habit of throwing stones and running away.

    రిప్లయితొలగించండి
  17. @మలక్పేట రౌడీ: బ్లాగుల్లో వాదించుకునేది ఉద్యమం కాదు. దిలీప్ కార్యశీలి. ఉద్యమంలో ఉండి మాట్లాడుతున్నమనిషి. ఆ విషయం తెలియకుండా మీరు వ్యాఖ్యానించడం హాస్యాస్పదం.

    రిప్లయితొలగించండి
  18. తెలంగాణా లో అమాయక యువతీ యువకుల ఆత్మహత్యలకు ప్రధాన కారణం తీవ్రమైన నిరాశ, నిస్పృహ, ఆశాభంగం.

    కేంద్ర ప్రభుత్వ మొదటి ప్రకటనతో తమ చిరకాల ప్రజాస్వామిక స్వప్నం నేరవేరబోతుందని సంతోషం తో గంతులేసిన ఆ తెలంగాణా యువతీ యువకులే - ఆ తరువాత అనూహ్య ,దుర్మార్గ నీతి బాహ్య పరిణామాలతో హతాశులయ్యారు.

    రాసి ఇచ్చిన మాటకు , తమ సొంత మానిఫెస్తోలకు కూడా కట్టుబడి వుండని రాజకీయ నాయకుల దివాళా కోరుతనం,
    కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సైతం న్యాయం చేయవు, ఎప్పుడైనా ప్లేట్లు ఫిరాయిస్తాయి అన్న నిజం వాళ్ళని ఫ్రస్టేట్ చేస్తోంది.
    కాళ్ళ కింద వున్న భూమిని కూడా నమ్మలేని స్థితి వస్తే ఏంచేయాలో తెలియని అయోమయం వాళ్ళది.
    అభం శుభం తెలియని అమాయకులు కదా. అందుకే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.

    ఇప్పటికి అలా గాలిలో కలిసిన ప్రాణాల సమాఖ్య 200 దాటింది.
    ఆ వందలాది అమాయకుల మరణాల పట్ల నిజంగా కన్సర్న్ వున్న వాళ్ళమే అయితే ఇప్పుడు మనమంతా చేయాల్సింది - "తప్పు మీదంటే మీదని" వాదులాడుకోవడం కాదు.

    ౧) తెలంగాణా సమస్యకు సత్వర పరిష్కారాన్ని కనుగొనడం మీద దృష్టి పెట్టాలి .
    ౨) అసెంబ్లీ లో , పార్లమెంటు లో నిజాయితీగా చర్చిం చాల్సిన అంశాన్ని వీధుల్లోకి తెచ్చి తమాషా చేస్తున్నారు మన నేతలు.
    వాళ్లకు బుద్ది చెప్పి ఈ సమస్యను తిరిగి అసెంబ్లీ, పార్లమెంటుకు తీసుకు పోయేట్టు చేయాలి .
    ౩) ఒకే పార్టీకే చెందిన ఇరుప్రాంతాల ఎం ఎల్ ఎ లు , ఎంపీలు, మంత్రులు రెండు నాలుకలతో, రెండు రకాలుగా మాట్లాడుతూ అమాయక ప్రజల్ని మోసం చేయకుండా అసలు ఎవరి పార్టీ స్టాండు ఏమిటో చర్చించుకుని ఒక నిర్ణయానికి వచ్చేట్టు చేయాలి . నీతి లేని రాజకీయాలను ప్రతి ఒక్కరూ అసహ్యించు కునేట్టు చేయాలి.
    ౪) కేంద్ర ప్రభుత్వం వెంటనే తెలంగాణా విషయంలో తను ప్రకటించిన ప్రజాస్వామిక ప్రక్రియను రాజ్యంగా బద్దంగా ప్రారంభిం చెట్టు చేయాలి..
    ౫) మన ప్రజాస్వామ్యం మీద తిరిగి కొంతైనా నమ్మకం కలిగే వాతావరణాన్ని సృష్టించేందుకు చిత్తశుద్ధితో అందరూ ప్రయత్నిం చాలి .

    ఈ పనులను చేయగలమా మనం?
    మనకా నిజాయితీ, నిబద్ధత పరస్పర గౌరవం ఉన్నాయా ?
    లేక ఎవరి వాదనల్ని వాళ్ళే పట్టుకుని వేల్లాడుతూ , గురజాడ చెప్పినట్టు తెలుగు వాళ్ళ వెధవాయిత్వపు ఖ్యాతి దిగంతాలకు వ్యాపిమ్చేలాగా ... ఇంకా ఇంకా అనేక జీవితాలు అనేక రకాలుగా నాశనమై పోయేలాగా... తెగే దాకా లాక్కుంటూ కూచుందామా?


    ..

    రిప్లయితొలగించండి
  19. కార్యశీలి .. కాకరకాయ కూరేమి కాదూ? బ్లాగుల్లోనే రెండు నాల్కలలతో మాట్లాడే ఈయనో పెద్ద ఉద్యమకారుడు. తెలంగాణా లాంటి జటిల సమస్య పరిష్కారమవ్వాలంటే కావాల్సింది ప్రజలకన్నా ముందు వరసలో ఉండే ఉద్యమకారులు. "నీ త్యాగం మహోన్నతం" అని బ్లాగుల్లో వెకిలి రాతలతో జనాలని రెచ్చగొట్టేట్టు రాస్తూ మిగాతావాళ్ళవి వెకిలి రాతలనేవాళ్ళు కాదు ... తమ వాదన బలపడడానికి పక్కవాడి ప్రాణాలు బలిచేసే వాళ్ళు అంతకన్నా కాదు ..

    రిప్లయితొలగించండి
  20. ౧) తెలంగాణా సమస్యకు సత్వర పరిష్కారాన్ని కనుగొనడం మీద దృష్టి పెట్టాలి .
    ౨) అసెంబ్లీ లో , పార్లమెంటు లో నిజాయితీగా చర్చిం చాల్సిన అంశాన్ని వీధుల్లోకి తెచ్చి తమాషా చేస్తున్నారు మన నేతలు.
    వాళ్లకు బుద్ది చెప్పి ఈ సమస్యను తిరిగి అసెంబ్లీ, పార్లమెంటుకు తీసుకు పోయేట్టు చేయాలి .
    _________________________________________________

    Well said ... this is what is needed eventually!

    రిప్లయితొలగించండి
  21. *కంచ ఐలయ్యకి కులగజ్జి ఎప్పటి నుంచో ఉంది.*
    Nadella Praveen Sarma గారికి,
    http://hyderabadbooktrust.blogspot.com/2009/05/blog-post.html
    మరి ఐయ్యలయ్య గురించి ఇంతతెలిసిన మీరు వారు రాసిన పుస్తక మీద రివ్యు రాయటం మీకు అవసరమా? అటువంటి కుల గజ్జి కలవాడు రాసిన వాటి లో నిజాలు ఏంత ఉంటాయి? మీకు బ్రాహ్మణుల నిందిచాలను కున్నపుడు బ్రాహ్మణ వాదం అనే ముసుగు వేసుకొని ఇటువంటి చెత్త రచయిత అభిప్రాయాలకు చాలా విలువనిచ్చి అతను చెప్పిన నిజాలు జీర్ణించుకోవడం కష్టము నూ, అదొక షాకింగ్ పుస్తకమా ? మీకు తెలంగాణా వాదం వచ్చెటప్పటికి ఆ రచయిత కుల గజ్జి కనిపించిదా?
    మీ మిత్రుడు మహేష్ అభిప్రాయం చూడండి.

    @కత్తి మహేష్ కుమార్ seD...
    ఇదొక షాకింగ్ పుస్తకం. కొన్ని చేదు నిజాల్ని జీర్ణించుకోవడం కష్టమే! అక్కడక్కడా over statements అనిపిస్తుంది. కానీ ఆ దళిత దృక్కోణం నుండీ చూస్తే, బహుశా సహేతుకం అనిపిస్తుంది. మనం ఈ రచయితతో అంగీకరించినా, విభేదించినా తప్పకుండా చదవ వలసిన పుస్తకం.
    http://hyderabadbooktrust.blogspot.com/2008/07/blog-post_03.html#comments

    రిప్లయితొలగించండి
  22. ఎప్పుడొ రేడియొ లో నాలుగు నాటకలు, రెండు తర్జుమా పుస్తకాలు రాసి, ఒక బ్లాగు పేట్టు కొని డబ్బా కొట్టుకునే వారంతా పెద్ద మేధావులుగా చెలామణి అవుతూ, కవిత్వం ముసుగులో తిట్లు కురిపిస్తూ ఒక పెద్దయన సాధిస్తాం పికేస్తాం జాగో బాగో అని అది ఫైల్ అయేటపటికి జాగో జగావో అని మొదలు పెట్టాడు. ముందర ఆయనకి జ్ఞానోదయం కాలేదు. మీరు ఏ రోజుల లో ఉన్నారు? ఎప్పటి లీడర్షిప్ మోడల్ మీరు ఫాలో అవుతున్నారు? పుస్తకాలు, సాహిత్యం చదివి సామాన్య ప్రజలు ఇప్పటిలా ఫ్రష్టెషన్ కి గురి కావలసిందే కాని వారికి జరిగె మేలు ఎమీ ఉండదు. కాక పోతె రచైతగా మీకు కొంచెం గుర్తింపు వస్తుందంతే. అంతకు మించి మీరు తీసుకు వచ్చె మార్పు ఎమీ ఉండదు. అది మీకేమి తెలియంది కాదు కాని మీ రచనా వ్యాపారం మీది. మీరు రాస్తూనే ఉంటారు హైదరబాద్ బుక్ హౌస్ ప్రచూరిస్తుంది, దానిని చదివి మార్తాండ లాంటి కత్తి రచైతలు పుట్టు కొస్తూనంటారు. Ultimatly you achieve nothing

    రిప్లయితొలగించండి
  23. మంచు పల్లకీ: :)
    శ్రావ్య వట్టికూటి: :)
    రాము.ఎస్: "అయిలయ్య సార్ ఒక వ్యక్తి పై ప్రేమతో, మరొక వ్యక్తిపై కోపంతో మాట్లాడుతున్నట్లు నాకు అనిపిస్తున్నది" - వ్యక్తిప్రేమ కంటే అగ్రకుల ద్వేషాన్ని తన మాటల్లో చిమ్ముతూంటాడాయన.
    రమణారెడ్డి: నిజం!
    జయహొ: కొందరు పెద్దలకు- అగ్రవర్ణాలను తిడితే సమ్మగా ఉంటది, ఇతరులను తిడితే కులతత్వం, సంకుచితత్వం కనిపిస్తుంది. ఈ బాపతు జనాన్ని దళితిస్టువాదులు అంటారు.

    రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు