14, డిసెంబర్ 2009, సోమవారం

కొందరు తెలంగాణ వాదుల అబద్ధాలు

తెలంగాణ ఎందుకు వేరు పడాలి అని ఎవరైనా తెలంగాణ వాదిని అడిగి చూడండి.. ఓ అరడజను లింకులు మన మొహాన పడేసి పోతారు. తెలంగాణ గ్రామాల్లో ఛిద్రమౌతున్న జీవితాలను చూడండి అంటూ భావోద్వేగాన్ని ఒలకబోస్తారు. మా ప్రాంతాన్ని దుర్మార్గంగా ఆక్రమించారు ఆంద్రోళ్ళు అని అంటారు, అక్కడికేదో కోస్తా సీమల వాళ్ళు వీళ్ళ పొలాలను కొనుక్కోకుండా కబ్జా చేసేసుకున్నట్టు! ఇంకా ఇలాంటివే బోలెడు కన్నీటి గాథలు చెప్పుకుంటూ పోతారు. ఎంతలా చెబుతారంటే.., అది నిజమే కాబోలునని జనం అనుకుంటారు. పైగా.., అన్నదమ్ముల్లా విడిపోవాలంట!


అన్నదమ్ముల్లాగా విడిపోదాం అనేది ఇప్పుడు మనకు ఊతపదం -చట్టం తనపని తాను చేసుకుపోతుందన్నట్టు! కలిసుండి కొట్టుకునే కంటే, సోదరభావంతో సాదరంగా విడిపోదాం అని వాక్రుచ్చుతూ ఉంటారీ తెలంగాణావాదులు. విడిపోవడమెందుకయ్యా ఆంటే.. వీళ్ళు చెప్పే కారణాల్లో "మీరువేరు మేం వేరు, అంచేత" అనేదొకటి. ఏంటయ్యా వేరు అని అంటే.. తెలుగు వేరు ఆంధ్రం వేరు, మీతిండి వేరు, మా తిండి వేరు, మీ సంస్కృతి వేరు మా సంస్కృతి వేరు ఆంటూ వేర్లు పడిపోతూ ఉంటారు. కొందరు కుహనా మేధావులు వీళ్ళ పక్కన చేరి తానా తందానా అంటూ చిడతలు వాయిస్తూ ఉంటారు.

మిగతా తేడాల సంగతి పక్కనబెట్టి, తెలుగు ఆంధ్రం నిజంగా వేరేనా అనే సంగతి చూద్దాం.

ఈ విషయం గురించి ఈమాటలో కొలిచాల సురేశ్ గారు ఓ చక్కటి వ్యాసం రాసారు. అనేక వ్యాసాలు, పుస్తకాలను ఉదహరిస్తూ ఆయన ఈ వ్యాసంలో ఆంధ్రం, తెలుగు రెండూ ఒకటేనని చెబుతూ "భాషాశాస్త్ర సిద్ధాంత దృష్టితో చూస్తే ఈ రెండు “భాషలు” ఒకే భాషకు చెందిన రెండు మాండలికాలుగానే తప్ప మరేరకమైన వాదన చేయడానికి వీలు లేదని తెలిసిపోతుంది." అని అన్నారు. ఈ వాదన చేసే తెలంగాణవాదులు, కుహనా మేధావులు తమతమ మేధో సంబంధ ఆభిజాత్యాలను పక్కనబెట్టి, తమతమ ఆక్రోశాలను వెళ్ళగక్కడం కాస్త ఆపి, కొలిచాల సురేశ్ గారి వ్యాసం చదవాలి.

'ఆంధ్ర' మహాభారతం వాదనొకటుంది: మహాభారతాన్ని 'ఆంధ్ర' మహాభారతం అని అన్నారు గానీ తెలుగు మహాభారతం అనలేదు, అంచేత మీది ఆంధ్రంగానీ, తెలుగు కాదు అని కొందరు తెలంగాణవాదులు అంటారు. ఈ వాదన చేసేవాళ్ళు అదే శ్రీ మదాంధ్రమహాభారతంలో ఆదికవి రాసిన ప్రసిద్ధ పద్యం "సారమతిం గవీంద్రులు.." అన్న పద్యాన్ని చూడాలి:

.. నన్నయభట్టు తెనుంగునన్ మహా భారతసంహితారచనబంధురుఁ డయ్యె జగద్ధితంబుగన్.

'తెనుగు'లో మహాభారతాన్ని రాయబూనానంటున్నాడు ఆదికవి. 11 వ శతాబ్దిలో నన్నయ చెప్పకనే చెప్పాడు - ఆంధ్రం, తెనుగు ఒకటేనని. తెలంగాణవాదులతో పాటు, కుహనా మేధావులు అది ఇదీ వేరంటూ తిక్క వాదనలు చేస్తున్నారు. అది చాలక, మీరు చెప్పేది తప్పంటూ దాడి చేస్తున్నారు.

గతంలో దంటు కనకదుర్గ అనే మనిషి ఇలాంటి తలతిక్క, తెలివి తక్కువ వాదనే చేసింది. మొన్నీ మధ్య ఓ బ్లాగులో ఓ తెలంగాణవాది, మరొకరూ రాసిన వ్యాఖ్యలు చూసాక, దంటు గారి చొప్పదంటు వాదన గుర్తుకొచ్చింది. ఆవిడేమి రాసిందో ఇప్పుడు తెలుసుకోవడం అసందర్భమేమీ కాదు కాబట్టి కొంత ఇక్కడ రాస్తున్నాను..

"..అంటే త్రిలింగదేశంలో ఉన్నవారు తెలుగువారు. త్రిలింగదేశం అంటే- ఒకవైపు కరీంనగర్‌లోని కాళేశ్వరం, ఇంకోవైపు ద్రాక్షారామం, దక్షిణంవైపు శ్రీశైలం- ఈమూడు లింగేశ్వర క్షేత్రాల మధ్యనున్న ప్రదేశం. ఇది 95 శాతం తెలంగాణలోకి వస్తుంది. అంటే ఇప్పటి తెలంగాణ వారు మాత్రమే తెలుగువారు అనుకోవలసి వస్తుంది. తెలుగు తెలంగాణ వారి స్వంతభాష. మాతృభాష. మహాకవి పోతన భాగవతాన్ని కూడా ప్రథమంగా ప్రచురించినప్పుడు తెలుగు భాగవతమనే ప్రచారంలో ఉండేది. తరువాత ఆంధ్ర ప్రచురణకర్తలు దానిని శ్రీమదాంధ్ర భాగవతంగా మార్చి, పోతననికూడా ఆంధ్రీకరించేశారు. ఈ ‘ఆంధ్ర’ అన్న పదానికి ఉన్న విశిష్టతని, దాని పూర్వాపరాలని పరిశీలిస్తే, ఆంధ్రం, తెలుగు అన్నవి వేరు జాతులనీ, వేరు భాషలనీ అర్థమవుతుంది. "

అంతేకాదు, ఇంకో వాదన కూడ చేసింది: "సుమారు 1100 ఏళ్ల కిందట అంటే నన్నయ కాలంలో కూడా ఆంధ్రప్రాంతం వారిని ఆంధ్రులనే అన్నారుగానీ, తెలుగువారని అనలేదు. కవిత్రయం వేదవ్యాసుని సంస్క­ృత భారతాన్ని ‘ఆంధ్రీకరించారే’కానీ ‘తెలుగీ’కరించలేదు. ఈ రోజుదాకా ఎన్ని రకాల భారతాలు ప్రచురించినా అవి ‘ఆంధ్ర భారతాలు’ అయ్యాయే కానీ పుస్తకం మీద ఎక్కడా తెలుగు భారతం అని ఉండదు."

ఇంకా, దంటు గారు చేసిన కింది మూర్ఖవాదన చూసి, ఇప్పుడు మాట్టాడుతున్న తెలంగాణవాదుల వాదనతో పోల్చి చూడండి. "ఇక ఆంధ్రవాళ్ళకి ఊతపదంగా తెలుగు ఎలా వచ్చిందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. సాంస్క­ృతికపరంగా- స్వతంత్రం రాకముందు- శంకరంబాడి సుందరాచారి అని బాపట్లకి చెందిన ఒక కవి ఈ తెలుగు తల్లిని సృష్టించాడు. అప్పటిదాకా ఎవరు రాసినా, ఎవరు మాట్లాడినా ‘ఆంధ్ర’ అన్న పదమే వాడేవారు. అయితే ఆంధ్ర అన్నది సంస్క­ృతానికి దగ్గరగా ఉండడంతో, లాలిత్యాన్ని తన పాటలో జొప్పించడానికి మొట్టమొదటి దోపిడీదారుగా ఆయ న తెలంగాణకి సంబంధించిన ‘తెలుగు’ అన్న పదాన్ని దొంగిలించి తన పాటలో పెట్టుకున్నాడు. అయితే అప్పుడు తెలంగాణ నిజాం పాలనలో ఉండి, ఆంధ్రతో ఎక్కువ సంబంధాలు లేక ఈ విషయం కూడా ఎవరికీ తెలియలేదు. ఇలా భాషాచోరత్వంతో మొదలైన దోపిడీ నీళ్ళు, నిధులు, నియామకాలు మొదలైన అన్ని విషయాలలోకి పాకింది."

ఆ వ్యాసంలో ఆవిడ గారు రాసిన మహా మొరటు వాదం పూర్తిగా చదివితే ఆవిడ మూర్ఖత్వం బైట పడతది. ఆవిడ వాదనను ఖండిస్తూ అప్పట్లో నేను రాసిన టపా చూడండి.

తెలంగాణ వాదులు తమ ఉద్యమంలో భాగంగా ప్రచారం చేసిన అనేక అబద్ధాల్లో తెలుగు ఆంధ్రం వేరువేరనే దొకటి. రాష్ట్రంలో ఒక్కో జిల్లాకు ఒకటో మరిన్నో యాసలుంటాయి, ఒకటో మరిన్నో మాండలికాలు మాట్టాడతారు. అంతమాత్రాన అవన్నీ ప్రత్యేక భాషలైపోతాయా?


----------------------------------------------


అన్నట్టు కేసీయారు మొన్నొక భయంకరమైన అబద్ధం చెప్పాడు.. దీక్ష అయ్యాక, ఎన్డీటీవీకి ఇంటర్వ్యూ ఇస్తూ, హై.లో కోస్తా సీమల వాళ్ళు 2 లక్షల మంది మాత్రమే ఉన్నారంట. కేసీయారు చెప్పిన అబద్ధాల్లో ఇదో చిన్న అబద్ధం! కాకపోతే ఇది లేటెస్టుది.
--------------------------------------------------

అబద్ధాలేంటో చూసాం. ఇక నిజమేంటంటే.., తెలుగు ఆంధ్రం ఒకటే! ఈ కారణంపై, తెలంగాణను విడదియ్యాలనే వాదన అసంబద్ధం. విడదియ్యడం అనవసరం.

59 కామెంట్‌లు:

  1. కె.సి.ఆర్. మాట సంగతి పక్కన పెట్టండి. 1983లో కూడా హైదరాబాద్ లో కోస్తా ఆంధ్రవాళ్ళు ఎక్కువగా ఉండేవాళ్ళు. మేము చిన్నప్పుడు వరంగల్, కాజీపేట, కరీంనగర్ లలో ఉండేవాళ్ళం. హైదరాబాద్ లో మాత్రం ఎక్కువ రోజులు ఉండలేదు. మొన్న హైదరాబాద్ విషయాలు మా అమ్మగారిని అడిగాను. మన కోస్తా ఆంధ్రవాళ్ళు ఇక్కడ సారవంతమైన వ్యవసాయ భూములతో లాభాలు సంపాదించి ఆ డబ్బుతో వెళ్ళి హైదరాబాద్ లో స్థిరపడ్డారు. అందుకే కోస్తా ఆంధ్రవాళ్ళు ప్రత్యేక తెలంగాణాకి ఒప్పుకోవడం లేదు అని మా అమ్మగారు అన్నారు.

    రిప్లయితొలగించండి
  2. దంటు వారి వ్యాసానికి జవాబుగా అప్పట్లో వివిధలో రాసిన వ్యాసం ఇది.
    http://www.andhrajyothy.com/mainshow.asp?qry=/2006/dec/11vividha3

    రిప్లయితొలగించండి
  3. ప్రత్యేక తెలంగాణా డిమాండ్ కి కారణం బాష కాదు. ఆర్థిక, సామాజిక పరిస్థితులు కారణం. 1983లో కూడా హైదరాబాద్ లో ఎక్కువగా ఉన్నది కోస్తా ఆంధ్రవాళ్ళే. అందుకు కారణం కోస్తా ఆంధ్రవాళ్ళు తెలంగాణావాళ్ళ కంటే ఆర్థికంగా ముందు ఉండడమే. ఆర్థిక, సామాజిక కారణాల ముందు బాష అనేది పెద్ద ఇష్యూ కాదు.

    రిప్లయితొలగించండి
  4. బాబూ ప్రవీణ్!, ఇక్కడ సమైక్యాంధ్ర కోసం ఉద్యమం చేస్తున్నది కేవలం కోస్తాంధ్ర నుంచి హైదరాబాద్ స్థిరపడిన వారు మాత్రమే కాదు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాయకులు, ప్రజలు. ఇక ఇలా ఉద్యమం చేస్తున్న వారంతా గూండాలు, రౌడీలు అన్నారంటే అది మీ అసంబద్ధ వాదానికి పరాకాష్ట.

    రిప్లయితొలగించండి
  5. చరిత్ర యేదైననప్పటికి ఆంధ్ర -తెలుగు ఒక భాషకే రెండు పర్యాయ పదాలు.తెలుగు తెనుగు జానపదుల భాష. ఆంధ్రం సంస్క్రుతేకరణమైన తెలుగు. ప్రాంతాలవారిగా కొస్తా,రాయలసీమ,తెలంగాన. ఆంద్ధ్ర పదం లొ మూడు కలిసి వున్నయి.

    లగటపాటి వారు తెలెంగాణ అంటే హైదరబాదు స్టేటు లొ భాగం కొస్తా,రాయలసీమ ప్రాంతాలు మద్రాసు నుండి విడివడి హైదరాబాదులొ కలసి మొత్తం ఆంధ్ర ప్రదెష్ అయ్యింది అంటారు. ఇది అలోచించవలిసిన విషయమే.

    రిప్లయితొలగించండి
  6. ప్రవీణ్ నిజం కదా ఆర్థిక, సామాజిక కారణాల తో విడిపోవచ్చు కదా ? మీరు బ్లాగులు . కామెంట్లు , కథలు రాయటం లో మా అందరికన్నా కనీసం ఒక 200 సంవత్సరాలు ముందున్నారు ఆ కారణం గా దయచేసి మీరు విడిపోయి మాకు అవకాశామివ్వమని నా మనవి . దీన్ని గురించి కొద్దిగా ఆలోచిందండి.

    చదువరి గారు ఈ తెలుగు ఆంధ్రం సంగతి ఏమో గాని నాకు ఈ చరిత్ర చరిత్ర అని చెప్పే వాళ్లకు మాత్రం గాని ఒకటి చెప్పాలనిపిస్తుంది - అయ్యలారా , అమ్మలారా మేము కూడా మనుషులమే మాకు కూడా తాతా , ముత్తాతలున్నారు , మేమేమి ఇప్పుడే మెషిన్ లో తయారయ్యి రాలేదు అని .

    రిప్లయితొలగించండి
  7. మా పట్టణంలో ఎవరూ స్వచ్ఛందంగా షాపులు ముయ్యలేదు. గూండాలని చూసిన తరువాతే మూశారు. నేను షాప్ తెరవడానికి వెళ్తున్నప్పుడు గూండాలు నన్ను కూడా కర్రలతో కొట్టబోయారు. ఇక టాపిక్ విషయానికి వద్దాం. ప్రత్యేక తెలంగాణా డిమాండ్ కి బాష కారణం కాదు. టి.ఆర్.ఎస్. కార్యకర్తలలో ముస్లింలూ, సిక్కులు కూడా ఉన్నారు. వాళ్ళ మాతృబాష తెలుగు కాదు. ఈ మధ్య వరంగల్ లో తెలంగాణా ముస్లిం ఫోరం తాము తెలంగాణాకి మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించింది. ఆర్థిక సామాజిక కారణాల ముందు కులం, మతం, బాష లాంటివి పెద్ద ఇష్యూస్ కావు.

    రిప్లయితొలగించండి
  8. అదేంటో ఈ తెలంగాణా రాజకీయ నిరుద్యోగుల,వృద్ద జంబూకాల గొంతు పాపం రాజశేఖరుడు సభాముఖంగా కడుగుతూ ఉంటే ఎక్కడ ఉండిందో,నోరే పెగలలేదు,గ్రేటర్ ఎన్నికలలో పోటీ చేయకుండా పారిపోయిన కాళ్ళని ఇప్పుడు ఎక్కడో మడిచి పెట్టుకుని ప్రజామద్దతువుందని ఎలా మాట్లాడుతున్నారో వీళ్ళకే తెలియాలి

    రిప్లయితొలగించండి
  9. ప్రవీణ్ కామెంట్లూ, వ్యాపార ప్రకటనలూ లేని ఏకైక సమైక్యాంధ్ర బ్లాగు. శరత్ కాలం బ్లాగు. రండి విచ్చేయండి, తలనొప్పికి దూరంగా వుండండి. ఎదవ గోల.

    రిప్లయితొలగించండి
  10. ee tingari telugu andhram vaadana prapamcham lo modatisari vintunnanu....ne chepattina kundelu annattu undi veella yevvaram
    thanks
    Sarath

    రిప్లయితొలగించండి
  11. చదువరీ, నీ బుర్ర ఖరాబయ్యిందయ్యా. ఆంధ్రం వేరు, తెలుగు వేరు అని ఇప్పటికీ అర్ధం చేసుకోలేకపోతే ఎలా. ఇన్నాళ్లుగా, ఇన్నేళ్లుగా మనం 'తెలుగు' అనుకుంటున్న 'ఆంధ్రం'లో (లేదా vice versa) నెత్తీ, నోరూ ఇంకా ఏమేం బాదుకోగలమో అవన్నీ వీరబాదుకుని మరీ చెబుతున్నా ఈ ప్రత్యేక వాదులకి ఏఁవీ అర్ధం కావటం లేదంటే - వాళ్ల భాషా మన భాషా వేర్వేరు కాబట్టే, మన భాష వారికి అర్ధం కాకపోబట్టే. ఇంతకు మించిన రుజువేం కావాలి, ఆంధ్రమూ తెలుగూ వేర్వేరనేదానికి?

    మీకు తెలుసో లేదో - ఆంగ్లమూ, ఇంగ్లీషూ కూడా అలాగే వేర్వేరు. ఈ విషయమ్మీద పరిశోధనేదన్నా చేసి పత్రాలు ప్రచురించేస్తే రెండో పదో డిగ్రీలొస్తాయి, ప్రపంచవ్యాప్త గుర్తింపొస్తుంది. ఇలాంటి టపాలు రాస్తే ఏమొస్తాయి, వేళ్ల నొప్పులు తప్ప?

    రిప్లయితొలగించండి
  12. చదువరి గారూ

    కొలిచాల వ్యాసం చదివితే అర్ధమవ్వాలిగా ముందు. అది ఆంధ్రంలో వున్నది, మాకు అర్ధం కాదు, తెలుగులో వ్రాసో/తర్జుమా చేసో మాకివ్వండి అని ఆయన ఎవరో గుడ్లెర్ర చేసి అంటారేమో. ఆ దిక్కుల గూడా మీరు సోచాయించాలె. ఇంకోరేమో తెలివితక్కువగానో, అతితెలివిగానో చిన్న రాష్ట్రాలు , అదీ పరిపాలనా సౌలభ్యం కోసం కావలసిందే అని ఎగురుతున్నారు. మీరు చెప్పిన మేధావులు "కుహనా" పరిధిలోకి వస్తారో నాకైతే తెలియదు కానీ, బుర్ర తక్కువ వెధవల్లోకి వస్తారు అని మటుకు నాలుగో క్లాసు పిల్లలు కూడా చెబుతారు. అబ్బా! నాలుగో క్లాసువాడికి అంత తెలివి ఉంటుందా అని ఆచ్చెర్యపోతారు ఈ "తెలుగు"వాళ్ళు.

    అభివృద్ధి కరువైనవాళ్ళుగా మరి, అన్నిట్లోనూ.. :)

    మాటలే కావాలనుకుంటే బోలెడు రాసివ్వొచ్చు. అందులో తెలివున్నోడికి, తెలివితక్కువగా రాయటం అంత పెద్ద పనీ కాదు. తెలివితక్కువోళ్ళకు అర్థమయ్యేటట్టు రాయటం పెద్ద పనీ కాదు :) అయినా మీ టపా మొత్తానికి నువ్వుశెట్టి గారి పీఠం కదిలించింది. చాలా రోజులకు కనపడ్డారు.

    వీలు చూస్కుని తర్వాత వస్తా..

    వంశీ

    రిప్లయితొలగించండి
  13. చదువరి గారు,
    చాలా అర్థవంతమైన వాదన.

    ఈ వ్యాసానికి మీరెంచుకున్న పేరులోనే ఒక అద్భుతమైన విశ్లేషణ మరో కో్ణంలో ఇమిడి ఉంది. అంటే...
    1. తెలంగాణ వాదులు చెప్పేవన్ని అబద్దాలు కాదు.
    2. కొందరు సమైఖ్యాంధ్రా వాదులవి కూడా అబద్దాలే.

    మీరింత వివరముగా చెబుతున్న ఆంధ్రం యొక్క అర్థం ఇప్పుడు తెలంగాణ వాదులు మండి పడుతూ ఎదిరిస్తున్న ఆంధ్ర అర్థం ఒకటి కాదేమోనని నాకనిపిస్తుంది. నాకు తెలిసి ఇప్పుడు ఆంధ్ర అంటే ఇక్కడివారిచ్చే నిర్వచనం: తెలంగాణకు పొట్టచేతబట్టుకుని బ్రతుకుదెరువు కోసం వచ్చి ఇక్కడి వారిపై ఆధిపత్యం చెలాయించడం నేర్చుకున్న వారని.

    నాణానికి మరోవైపున ఉన్న ఆ అర్థాన్ని కూడా మీరు గ్రహించగలరు. నిజంగా జరిగిన అన్యాయాలకు మీలాంటి వారి తోడు తెలంగాణా వాదులకుంటుంది. కాదంటారా?

    ఇట్లు - శ్రీధర్ రాజు.

    రిప్లయితొలగించండి
  14. శ్రీధర్ రాజు గారు,

    నేపధ్యం తెలీకుండా వ్యాఖ్యానిస్తున్నారు మీరు. అసలు మీరీ టపా చదివినట్లు కూడా అనిపించటం లేదు. చదువరిగారు మాట్లాడుతుంది 'తెలుగు భాష వేరు, ఆంధ్ర భాష వేరు' అని కొందరు ప్రత్యేకవాదులు చేసున్న వితండవాదన గురించే కానీ, 'ఆంధ్ర ప్రాంతీయులు' అనేదానికి ప్రత్యేకవాదులు ఇచ్చే నిర్వచనం గురించి కాదు.

    మీరు చెప్పండి. 'తెలుగు', 'ఆంధ్రము' వేర్వేరు భాషలా?

    రిప్లయితొలగించండి
  15. అబ్రకదబ్ర గారు,
    నేనేమైనా తప్పుగా అర్థం చేసుకున్నట్టయితే క్షమించండి.

    చదువరి గారి వివరణ ప్రకారం కొందరు తెలంగాణవాదులు మాట్లాడే అబద్దాలు ఖచ్చితంగా అబద్దాలే. నేను తెలుగు చదువుకుంది ఏడో తరగతి వరకే కాబట్టి నాకు తెలుగు భాషా పరిజ్ఞానం అసలు లేదనే చెప్పొచ్చు. అందుకే ఈ విషయంలో ఒకర్ని విమర్శించే తెలివిగాని స్థాయిగాని నాకు లేదు. ఈ వ్యాసం ద్వారా కొన్ని కొత్త విషయాలు తెలుసుకునే భాగ్యం కలిగింది.

    కాని ఆయన చెప్పే ఈ ఆంధ్రంకు అర్థం తెలిసిన తెలంగాణ తెలుగువారు ఎంతమంది ఉంటారు... చాలా తక్కువ. ఒకవేళ ఎవరైనా పనిగట్టుకుని చెప్పే ప్రయత్నం చేసి సాధించినా... ఇక్కడి వారు పోరాడే ప్రత్యేక రాష్ట్రానికి తెలంగాణాంధ్ర అని పెట్టేసుకోడానికి ఒప్పుకుంటారు.

    - శ్రీధర్ రాజు

    రిప్లయితొలగించండి
  16. శ్రీధర్ రాజు గారూ,

    పొట్ట చేత పట్టుకొని ఎవ్వరూ తెలంగాణాకు రాలేదు. వచ్చిన వాళ్ళంతా తమ రాష్ట్ర రాజధానికి వచ్చారు. హైదరాబాదుపై ఒక కరీం నగర్ వాసికి ఎంత హక్కు ఉందో ఒక కర్నూలు వాడికీ ఒక కాకినాడ వాడికీ అంతే అధికారం వుంది.
    ఇక బయటి వాడొచ్చి భూకబ్జాలు చెస్తున్నాడని మొత్తుకునే వారందరూ మాట్లాడేదెవరి గురించొ అందరికీ తెలుసు. రామోజీ రావు మీద ఎన్నొ అభియోగాలుండడంతొ తను ఈ కేసీఆర్ లాంటి వాళ్ళకు ఒక easy target. రామోజీ రావు తప్పు చేసుండొచ్చు. కాని దాన్నేదో తెలంగాణ గడ్డపై బయటి వాళ్ళొచ్చి ఆక్రమిస్తున్నుట్టు కేసీఆర్ లాంటి వాళ్ళు చిత్రీకరిచడం, దానికి మేధావులుగా చెలామణీవ్తున్న కొంతమంది వంత పాడడం అది ఒక (misplaced)public rage కు దారి తీయడం ఒక ట్రాజెడీ, a tragedy that is not too uncommon in India.

    రిప్లయితొలగించండి
  17. శ్రీధర్ రాజు గారు,

    అమెరికాలో ప్రస్తుత రిసెషన్ వల్ల విదేశీయుల మీద - ప్రత్యేకించి 'పొట్ట చేత పట్టుకుని అమెరికా వచ్చిన' మీలాంటి, నాలాంటి భారతీయ హెచ్-1 మరియు గ్రీన్ కార్డ్ హోల్డర్ల మీద వెల్లువెత్తుతున్న నిరసన మీరెరగనిది కాదు. వాళ్లకి రావలసిన ఉద్యోగాలు మనం కాజేస్తున్నామన్న ఆరోపణలు రెండేళ్లుగా ఊపందుకున్న సంగతీ మీరెరిగే ఉంటారు. ఏ తెల్లవాడైనా మీకెదురు పడి 'వలస దోపిడీదారు' అంటే మీకెలా ఉంటుంది. Does it hurt, or not? సూటిగా సమాధానం చెప్పండి.

    రిప్లయితొలగించండి
  18. @Zebra, You said very nicely...

    >>> A (misplaced) public rage can lead to a tragedy that is not too uncommon in India. >>>

    Hyderabad is not the only entity of Telangana and Romoji is not the only dominion, you must be thinking off when referring to tyrannical oppression. It is true throughout the state of Andhrapradesh and noticeably greater in entire Telangana region. Evidently known fact is that non-Telangana immigrants are in every township, disticts and rural areas of Telangana. Local people potrait them as "పొట్ట చేత పట్టుకొచ్చిన వలసదారులు" - because a majority of them earned such a reputation among locals with their behavior over a period of time... where as it is so hard to prove the other way; quite challenging to compare and equate the number of immigrants from Telangana to non-Telangana rural areas, townships and districts. Irrespective of our arguments - and wrong leaders like KCR and Lagada... does anyone of non-Telangana people accept that their people are more talented and dominant in nature as compared to Tealangana people. I'm not saying it's wrong to be talented - but the fight is for equal opportunity when locale fell behind.

    Yes - many (misplaced) public rages in this region for centuries lead to many tragedies that is not too uncommon in current and ancient India. :)


    Sorry for deviating from the original topic. Yes - a few biased separatists tell lies and so are non-separatists.

    రిప్లయితొలగించండి
  19. అబ్రకదబ్ర గారు,
    Yes - I truly understand you agony.

    There are hardly any similarities of Telangana struggle so to compare with America in anyway. Since you brought it up and just for the sake let us think the comparison; The foundation of this country enrooted from many immigrants quite different than those of in Telangana now. However majority of the crowd in America now regrets the brutal genocide took place ages ago against local tribes and cultures… too late to realize the facts. Let us stop the same from happening in Telangana.

    అమెరికాలో ఉన్న తెలుగువారందరూ అత్యధికంగా అణిగిమనిగి ఒదిగిపోయే తత్వం అలవరుచుకోంటారు... ఎందుకంటే ఇక్కడి ప్రవర్తనా నియమావళి అలా చేయిస్తుంది. అంతేకాదు సమాజంలో కలిగే సామాజిక స్పృహ వలన ఎవ్వరు "వలస దోపిడీదారు" కారు కాలేరు.

    ఇలాంటి ఓ పది నియమావళ్ళు తెలంగాణేతర వలసదారులకోసమూ పెట్టారు కాని అవన్ని కాగితాలవరకే పరిమితమైనాయి.

    అవును మీరంటున్నట్టుగా అమెరికాలో రిసెషన్ ఎదురైన ప్రతీసారి వారి ఉద్యోగాలు మనం కాజేస్తున్నామన్న భావన కొందరిలో వస్తునే ఉంది - కాని పో్యిన కొన్ని కోట్ల ఉద్యొగాలతో పోలిస్తే పట్టుమని మనం పది లక్షలు కూడాలేమని వీళ్ళకి తెలుసు.

    మీలాంటి, నాలాంటి భారతీయ తెలుగువారు హెచ్-1 నుండి గ్రీన్ కార్డ్ హోల్డర్లుగా ఆ తరువాత ఈ దేశ పౌరసత్వం తెచ్చుకునే సరికి సగం జివితం గడచిపోతుంది. కాని ఈ క్రమంలో ఇక్కడి స్థానిక సమాజాభివృద్దిలో పాలుపంచుకోకుండా తప్పించుకోగలమా? ఆదాయపు పన్ను ఎగవేతకు ప్రయత్నించగలమా? ఏ భీమవరమో కాకినాడకో తెలంగాణ వలసదారులు పంపినట్టుగా మన సంతానాన్ని ఇక్కడి పాఠశాలల్లో కాకుండా మన ఇండియాకు పంపి చదివించగలమా? ఈ భారతీయాంధ్ర భావాలను మన పిల్లలపై రుద్దగలమా? ఇక్కడి చరిత్ర పాఠ్యాంశంలో ధియోడోర్ రూస్వెల్ట్ కాకుండా టంగుటూరు ప్రకాశం పంతులు లేక జవహర్ లాల్ నెహ్రూ గురించో చొప్పించగలమా? లేకపోతే్ లంచాల ఎరజూపి హైదరాబాదు సచివాలయం ఉద్యోగాల్లో తెలంగాణేతరులు నిండినట్టుగా బాబి జిందాల్ గవర్నరుగా ఉన్న రాష్ట్ర సెక్రటరియేట్లో మనవాళ్ళని నింపేయగలమా?

    రిప్లయితొలగించండి
  20. contd...#2

    లేదండి అలా చేయలేం. It can only happen in Telangana by a few non-Telangana people with dominion talent.

    ఇట్లు,
    శ్రీధర్ రాజు

    రిప్లయితొలగించండి
  21. @శ్రీధర్ రాజు - చికాగో -

    మెజారిటీ జనాలు వలస ఒచ్చేది హైదరాబాదుకే, రాష్ట్ర రాజధాని కాబట్టి. తెలంగాణాలో మిగితా చోట్ల ఇతరులు ఉన్నా అరా కొరా మత్రమే - తెలంగాణా వాళ్ళ అవకాశాల్ని హరించేంత మాత్రం ఖచ్చితంగా కాదు.

    అయినా ఇన్ని ఏళ్ళలో తెలంగాణా నించి ఎన్నికయి అసెంబ్లీకీ, పార్లమెంటుకీ వెళ్ళిన నాయకులు ఎంత మంది ? వాళ్ళు చేసిన అభివృద్ది ఎంత ? అందరూ కలిసి కట్టుగా ఉండి ఒత్తిడి చేస్తే కొద్దో గొప్పో అభివృద్ది సాధ్యం అయ్యేది కాదా ? ఇప్పటికిప్పుడు కొత్త రాష్ట్రం చేస్తే భూతల స్వర్గంగా ఎలా మారిపోతుంది ? అసలు దీన్ని వేర్పాటు వాదం అని కూడా అనలేము - ఇది కేసీయారూ, చెన్నారెడ్డి, లగడపాటీ, టీజీ వెంకటేష్ లాంటి నాయకుల 'సాపాటు'వాదం. రాష్ట్ర ప్రజలందరూ ఈ మాయలోంచి ఎంత త్వరగా బయిటపడితే అంత మంచిది.

    రిప్లయితొలగించండి
  22. శ్రీధర్ రాజు గారు,

    తెలంగాణ స్ట్రగుల్‌కి అమెరికా చరిత్రతో నేను పోలిక పెట్టలేదు; శతాబ్దాల కిందట ఇక్కడ జరిగిన brutal genocide లాంటిది తెలంగాణలో జరుగుతుందంటూ అనవసర అపోహలు సృష్టిస్తుంది మీరు. అది జరగదని మీకు తెలుసు. ఆ సంగతి వదిలేద్దాం.

    నేనడిగింది ఒకే సూటి ప్రశ్న, కష్టపడి పనిచేసి నాలుగు రాళ్లు వెనకేసుకుంటున్న మిమ్మల్ని 'దోపిడీదారుడు' అనెవరన్నా అంటే మీకెలా ఉంటుంది అని. దానికి మీరు ఏదేదో చెప్పారు. అదేంటో చూద్దాం.

    >> "మీలాంటి, నాలాంటి భారతీయ తెలుగువారు హెచ్-1 నుండి గ్రీన్ కార్డ్ హోల్డర్లుగా ఆ తరువాత ఈ దేశ పౌరసత్వం తెచ్చుకునే సరికి సగం జివితం గడచిపోతుంది. కాని ఈ క్రమంలో ఇక్కడి స్థానిక సమాజాభివృద్దిలో పాలుపంచుకోకుండా తప్పించుకోగలమా?"

    తప్పించుకోలేం. అలాగే, ఆంధ్రా/సీమల నుండి వచ్చి హైదరాబాదులో స్థిరపడ్డ తెలుగువారు ఆ నగర అభివృద్ధిలో పంచుకోకుండా తప్పించుకోలేరు. వీళ్ల దాకా ఎందుకు, అలనాడెప్పుడో నిజాంసాగర్ కాల్వ కింద వ్యవసాయం నేర్పమన్న నిజాం పిలుపందుకుని తెలంగాణ జిల్లాలకి ఆంధ్రా నుండి వలస వెళ్లిన పేద రైతులకి (కేసీయార్ ఈసడింపులో 'కాళ్లకి చెప్పులూ గతిలేనివాళ్లు') ఆయా తెలంగాణ జిల్లాల అభివృద్ధిలో భాగం లేదా?

    >> "ఏ భీమవరమో కాకినాడకో తెలంగాణ వలసదారులు పంపినట్టుగా మన సంతానాన్ని ఇక్కడి పాఠశాలల్లో కాకుండా మన ఇండియాకు పంపి చదివించగలమా?"

    'చదివించగలమా' అన్నది సరైన ప్రశ్న కాదు. 'చదివిస్తామా?' అన్నది సరైనది. 'చదివించం' అన్నది సమాధానం. ఎందుకు? స్కూళ్లు ఎక్కడ బాగుంటే అక్కడికి పిల్లల్ని పంపి చదివించటం సహజం. నేను విజయవాడలో చదువుకున్నాను. నా సహాధ్యాయిల్లో తెలంగాణవాళ్లు ఉన్నారు, రాయలసీమ వారూ ఉన్నారు. ఇది ఎప్పటి సంగతో. అసలిప్పుడు భీమవరానికో, కాకినాడకో పంపి చదివించేవాళ్లు ఎవరు? పది, పదిహేనేళ్ల కిందటిదాకా గుంటూరు-విజయవాడ ప్రాంతం ఆంధ్రప్రదేశ్‌కి విద్యా కేంద్రంగా ఉండేది. మరి ఇప్పుడో? ఆ స్థానం హైదరాబాదుకి పోయింది. కోస్తా జిల్లాల నుండి సైతం హైదరాబాదుకి పిల్లల్ని పంపి చదివించేవాళ్లు పెరిగిపోయారు.

    మీలాంటివారితో సమస్యేమిటంటే, ఆంధ్రా 'వలసదారులు' హైదరాబాదులో సంపాదించిన సొమ్ముతో తమ స్వగ్రామాల్లో స్థలాలో, పొలాలో కొనుక్కుంటే మీ సంపద ఎక్కడికో తరలించేస్తున్నారని గగ్గోలు పెడతారు. అదే హైదరాబాదులోనే కొనుక్కుంటే మీ తాతల స్థలాలు ఆక్రమించేస్తున్నారంటారు! ఎలా వేగాలి :-)

    (మనలో మాట. అమెరికాలో సంపాదించిన సొమ్మంతా మీరు చికాగోలోనే పెట్టుబడి పెట్టారా? కుంచెం కూడా తెలంగాణలో మీ స్వగ్రామానికి పంపలేదా?)

    >> "లేకపోతే్ లంచాల ఎరజూపి హైదరాబాదు సచివాలయం ఉద్యోగాల్లో తెలంగాణేతరులు నిండినట్టుగా బాబి జిందాల్ గవర్నరుగా ఉన్న రాష్ట్ర సెక్రటరియేట్లో మనవాళ్ళని నింపేయగలమా?"

    Finally, something we both agree upon.

    లంచం. Yes. ఇదేమన్నా ఆంధ్రావాళ్లకే పరిమితమైన అంటువ్యాధా? అసలు దేశంలో ఇన్ని రకాల సమస్యలకీ కారణం ఇదేనన్న సంగతి మీకు తెలుసు, నాకూ తెలుసు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఇచ్చేసి, సెక్రటేరియట్‌ని తెలంగాణవారితో నింపేస్తే రాత్రికి రాత్రే లంచాలు ఆగిపోతాయా? అప్పుడు మాత్రం ఆ 'తెలంగాణ ఉద్యోగి' లంచం తీసుకుని నలుగురు ఆంధ్రావాళ్లకి ఉద్యోగాలివ్వడని మీరు గ్యారంటీ ఇవ్వగలరా?

    చెప్పొచ్చేదేంటంటే, సమస్య ఒక చోటుంటే పరిష్కారం మరొ చోట వెదుకుతున్నారు మీరు. ఆ పరిష్కారం మోసుకొచ్చే మరిన్ని కొత్త సమస్యల్ని మాత్రం గుర్తించటానికి నిరాకరిస్తున్నారు.

    రిప్లయితొలగించండి
  23. "తెలంగాణా భాష, ఆంధ్రా భాష"

    ఇన్నాళ్ళకు మీకు రెండూ ఒక్కటే అని స్పురించింది, సంతోషం. నేను భాషా వేత్తను కాదు. క్లుప్తంగా ఈ విషయంలో నేనేదుర్కొన్న అనుభవాలు చెప్తాను.

    నేను పడవ తరగతి వరకు మా ఊరిలోనే చదివాను. అప్పటివరకు నాకు 'ఆంధ్రా' వాళ్ళ పరిచయ భాగ్యం కలుగ లేదు. ఇంటర్ మీడియట్ లో నా మిత్రుల్లో ఆంధ్రా వారు కూడా ఉండే వారు. నేను 'బొక్క' అంటే, 'ఛీ, అదేమిటీ, ఎముక అనాలి' అని దెప్పి పొడిచే వారు. తెలంగాణా లో to make it empty అనే అర్థం లో 'వడ చేస్తారు' అని వాడుతారు. ఈ మాట వాడిన ప్రతీ సారి 'వడ చేస్తావా, ఇడ్లీ చేస్తావా' అని నవ్వే వారు. నా భాష నేను మాట్లాడినందుకు సిగ్గు తో తల వంచుకోవాల్సి వచ్చేది. ఇలా నేను ఎదుర్కున్న అనుభవాలు (పరాభవాలు?) పూర్తిగా వ్రాయడానికి ఈ కామెంటు సరిపోదు.

    ఇది నా ఒక్కడి అనుభవం కాదని తరువాత తెలిసింది.

    ఇక రెండో అబద్ధం, కేసీయారు చెప్పింది. అది అబద్ధమే. అయితే అరవై లక్షల మంది పైగా ఉన్నారని లగడపాటి, టీజీ, వగైరాలు చెప్తున్నారు. అవి నిజాలేనా? చెప్పండి చదువరి గారూ.

    ఇక మీ పాయింటు, "తెలంగాణా, ఆంధ్రా ఒక్కటే". అయితే ఏంటట? ఒక్క భాష మాట్లాడే రాష్ట్రాలు రెండు ఉండ కూడదా? హిందీ మాట్లాడే రాష్ట్రాలేన్ని లేవు?

    రిప్లయితొలగించండి
  24. "చదువరి" గారి భాష చదువుకున్న వారి భాషలాగా లేదు. తెలంగాణ వాళ్లను విమర్శించవచ్చు. వద్దనటం లేదు. కాని మీరు అవహేళన చేస్తున్నట్లు అనిపిస్తుంది.

    రిప్లయితొలగించండి
  25. @హరి దోర్నాల,
    మీరు వ్రాసిన వ్యాఖ్యకు భావం... నా భాషను అవమానించే కోస్తావాళ్ళనుండి విడిపోతాం అనా? ఆ మాత్రం దానికి సిగ్గుపడటం దేనికండి? వాళ్ళ జోకులేదో వాళ్ళేసుకుంటారు. వారితో పాటూ మీరూ హాయిగా నవ్వండి. వారు మీ యాస మీద జోకులేశారంటే, మీరు కూడా వారి యాస మీద సెటైర్లెయ్యటానికి లైసెన్సు ఇచ్చినట్లే. మీ స్నేహితుల యాసను కూడా అనుకరించి మీరు ఆనందించండి. ఈ మాత్రం దాని ద్వేషం పెంచుకొని, విడిపోవాలా.
    మా రాయలసీమ యాసను కూడా తెలంగాణా ప్రజ చీల్చి చెండాడుతారు ... దీనికేమంటారు. ఊదాహరణకు.. చిత్తూరు పక్క మొహం కడుక్కున్నారా అనటానికి.. .మూతి కడుక్కున్నారా అంటారు. "ఏందబ్బ ఇది..." అనటాన్ని కూడా కొజ్జాల భాష అని ఏడిపించటానికి ప్రయత్నిస్తారు. ఇవన్ని చిన్నపిల్లల చేష్టలు. దీన్ని లైట్‌గా తీసుకోవాలి అంతే కాని కోపం, ద్వేషం పెంచుకోకూడదు.

    రిప్లయితొలగించండి
  26. http://epaper.andhrajyothy.com/AJ/AJYOTHI/2009/12/15/Article//004/15_12_2009_004_004.jpg

    వేర్పాటువాదులని అలోచింపజేసే వ్యాసం.

    రిప్లయితొలగించండి
  27. @హరి దోర్నాల,
    కోస్తా ప్రాంతం లో అన్నాయ్ , అక్కాయ్ అనే పిలుపు చాల సాధారణం అని మీకు తెలిసే ఉంటుంది , కాని ఒక్క సారి వేరే ప్రాంతానికి వెళ్లి అదే పిలుపు పిలిస్తే ఎలా ఎగతాళి చేస్తారో నాకు స్వానుభవం మరి దీనికేమంటారు ?
    అసలు అక్కదాక ఎందుకు పైన సమతం గారు రాసారు చూసారా ?" చదువరి భాష చదువుకున్న వారి భాషలాగా లేదు" అని .

    రిప్లయితొలగించండి
  28. వికిపీడియా నుండి....
    In an effort to protect the interests of the Telugu people of Madras state, Amarajeevi Potti Sriramulu attempted to force the Madras state government to listen to public demands for the separation of Telugu speaking districts(Rayalaseema and Coastal Andhra) from Madras state to form the Andhra state.

    చదువరి గారు ఆ "interests of the Telugu people" ఇప్పుడు "interests of the Tel‌angana people" అయ్యాయేమో!!

    రిప్లయితొలగించండి
  29. బావుంది. ఓ తెలంగాణా బ్రదర్స్!! ఈ లెఖ్ఖన భారత్ లో ఉండడం వళ్ళ ఆంధ్రులకి అన్యాయమే జరిగింది, జరుగుతోంది కదా..కలిసి ఆంధ్రదేశం కోసం పోరాడదాం. ఆనక ఒక్క రాష్ట్రమేం ఖర్మ పది తెలంగాణా రాష్ట్రాలు సృష్టించుకుందాం. ఏమంటారు?

    రిప్లయితొలగించండి
  30. అవకాశవాద రాజకీయ నాయకులను (అందర్నీ) కడగండి, తెలంగాణా వాదులను కాదు.

    రిప్లయితొలగించండి
  31. http://andhrajyothy.com/editshow.asp?qry=/2009/dec/15edit2
    అందర్నీ ఆలోచింపజేసే వ్యాసం.

    రిప్లయితొలగించండి
  32. అందర్నీ ఆలోచింపజేసే లింకులకి కొరతేం లేదు. అదే ఆంధ్రజ్యోతిలో ఆ రంగనాయకమ్మ రాత కిందే ఇంకో రెండున్నాయి. అవి మాత్రం ఇవ్వరేం!?!

    ఇవిగో అవి

    ఆంధ్రకూ ఓదార్పు అవసరం
    వేర్పాటే పరిష్కారమా?

    వక్కలంక రమణ ఆవేదన వినండి. "ఇది ప్రత్యేక తెలంగాణవాదం కాదు. తెలంగాణవారి ప్రత్యేక ఆంధ్ర వాదం. 'మేం మీతో కలిసుండం, విడిపోతాం' అని పైకి చెబుతున్నా, 'మీరు మాతో ఉండొద్దు, హైదరాబాద్ నుండి బయటికి పోయి మీ రాజధానిని మీరు వెదుక్కోండి' అన్నది వారి అసలు డిమాండ్"

    కాదా?

    రిప్లయితొలగించండి
  33. వ్యాఖ్యాతలందరికీ నమస్కారం. మీమీ అభిప్రాయాలు రాసినందుకు నెనరులు.

    టపాలోని మూల భావాన్ని గ్రహించని కొందరికోసం ఈ వివరణ: తెలుగు, ఆంధ్రం అనేవి రెందు వేరువేరు భాషలు అనే అబద్ధాన్ని ప్రచారం చేసి తెలంగాణ విడిపోవడానికి దాన్నొక కారణంగా చూపించారనే దాని గురించి ఇక్కడ రాసాను. అంతే తప్ప ఆంధ్ర తెలంగాణ అనే ప్రాంతాల గురించి రాయలేదు.

    శ్రీధర రాజు: శీర్షికలో లేని అంతరార్ధం దేన్నో చూడబోయారు గానీ అది చెపుతున్న సూటి అర్థాన్ని చూడలేకపోయారు. కొందరు తెలంగాణవాదులు చెబుతున్న అబద్ధాలంటే అర్థం సమైక్యవాదులు అబద్ధాలు చెబుతారనో లేక నిజాలే చెబుతారనో కానే కాదు.

    "మీరింత వివరముగా చెబుతున్న ఆంధ్రం యొక్క అర్థం ఇప్పుడు తెలంగాణ వాదులు మండి పడుతూ ఎదిరిస్తున్న ఆంధ్ర అర్థం ఒకటి కాదేమోనని నాకనిపిస్తుంది. నాకు తెలిసి ఇప్పుడు ఆంధ్ర అంటే ఇక్కడివారిచ్చే నిర్వచనం: తెలంగాణకు పొట్టచేతబట్టుకుని బ్రతుకుదెరువు కోసం వచ్చి ఇక్కడి వారిపై ఆధిపత్యం చెలాయించడం నేర్చుకున్న వారని." - సరిగ్గా ఇదే తెలంగాణావాదుల ట్రేడ్‌మార్కు తిట్టు. ఆంధ్రకు మీరిచ్చే నిర్వచనం లాగే తెలంగాణ వాళ్ళకు కూడా నిర్వచనాలు ఇస్తే మీకెలా ఉంటుంది? మాటకు మాట సమాధానం ఇవ్వడం గొప్ప విద్యేమో గానీ, తిట్టుకు తిట్టు బదులివ్వడం బ్రహ్మవిద్యేమీ కాదు!

    హరి దోర్నాల: "ఇన్నాళ్ళకు మీకు రెండూ ఒక్కటే అని స్పురించింది," - చాలా అన్యాయమైన నింద సార్ ఇది. ఆ రెండూ ఒకటేనని నేను ఎప్పుడూ అంటాను. యాస వేరైనంత మాత్రాన భాష వేరైపోద్దా అని కవి అడగలా? నేను దాన్ని త్రికరణ శుద్ధిగా నమ్ముతాను.
    "ఒక్క భాష మాట్లాడే రాష్ట్రాలు రెండు ఉండ కూడదా?" - ఉండొచ్చు, కూడదని నేను అనలేదు. భాష ఒకటే కాబట్టి విడిపోకూడదని నేను అనడం లేదు. భాషలు వేరని అబద్ధాలు చెప్పి, విడిపోదామని చెప్పడం అసంబద్ధం అని చెబుతున్నాను అంతే!
    వడ సంగతి కొత్తగా వింటున్నాను. బొక్క సంగతి విన్నానులెండి. ఇంకోటుంది, పోరి -దీన్ని పూరీగా పొరబడిన సంగతి నా స్నేహితులకు అనుభవమే! ఒకేమాట వేరువేరు యాసల్లో వేరువేరు అర్థాలనిస్తే అది ఇలాంటి హాస్యానికి దారి తీయడం సహజం. దాన్ని ఎగతాళిగా భావిచడమూ సహజమేనేమో! దిండును టిక్కా అన్న నా కాకినాడ స్నేహితుణ్ణి రోజుల తరబడి ఏడిపించిన సంగతి నాకింకా గుర్తే. రాష్ట్ర విభజన కారణాల్లో వీటినీ చేర్చడం అనుచితం.
    "అరవై లక్షల మంది పైగా ఉన్నారని లగడపాటి, టీజీ, వగైరాలు చెప్తున్నారు. అవి నిజాలేనా" - అదెంత అబద్ధమో ఇదీ అంతే అబద్ధం.

    డా.ఇస్మాయిల్: ఆ వ్యాసంపై వేణువు బ్లాగులో సుజాత గారు రాసిన వ్యాఖ్య చూడండి.

    అబ్రకదబ్ర నేనూ సరిగ్గా ఆ లింకులనే ఇవ్వబోయాను.

    రిప్లయితొలగించండి
  34. సమైక్యత అనేది వట్టి కబురే అని రంగనాయకమ్మ గారు ఆ వ్యాసంలో వ్రాసారు. సుజాత గారేమో రాష్ట్రంలో మెజారిటీ ప్రజలు సమైక్యతని కోరుకుంటున్నారని వ్రాశారు. ఒకవేళ మెజారిటీ ప్రజలు సమైకయ రాష్ట్రాన్ని కోరుకుంటే కోస్తా ఆంధ్రలోనే బలవంతపు బంద్ లు ఎందుకు? సమైక్యత అనేది వట్టి కబురేనని రంగనాయకమ్మ గారు స్పష్టంగా చెప్పిన తరువాత సమైక్యత గురించి రంగనాయకమ్మ గారు ఆలోచించలేదని ఆరోపించడం ఏమిటి?

    ఈ టాపిక్ విషయానికి వద్దాం. ఆర్థిక, సామాజిక కారణాల ముందు బాష అనేది పెద్ద ఇష్యూ కాదు. యాభై ఏళ్ళుగా తెలంగాణాని ఎందుకు నిర్లక్ష్యం చెయ్యడం జరుగుతోందో చెప్పకుండా బాష గురించి మాట్లాడడం ఎందుకు? సమైక్యవాదులకి రంగనాయకమ్మ గారు కూడా ఇదే ప్రశ్న అడిగారు యాభై ఏళ్ళుగా తెలంగాణాని ఎందుకు నిర్లక్ష్యం చెయ్యడం జరుగుతోందో చెప్పకుండా సమైక్యత గురించి ఎందుకు మాట్లాడడం అని.

    రిప్లయితొలగించండి
  35. @చదువరి
    ఆంధ్రం అన్న పదానికి సరైన అర్థం తెలియక తెలంగాణ ప్రజలు అపోహలో పడిపోయారు. ఆంధ్రోళ్ళు అంటే బ్రతుకుదెరువుకోసం పొట్టచేతబట్టుకుని వేరే ప్రాంతానికి వలసపోయి కష్టపడి పనిచేసే జాతి అని ముద్ర పడిపోయింది. దానికి మీరు నేను వాదించుకుంటే లాభమేమిలేదు కదా! అలా కష్టపడటం తప్పు కాదు. అలాంటి ముద్ర పడిపోయేట్టు తరతరాలుగా ప్రవర్తించారు మరి - అది చెరిపేసుకోవడానికి ఏం కృషి చేస్తున్నట్టు? ఆ కష్టపడే క్రమంలో ఇతరులకు కలిగే ఇబ్బందులను పట్టించుకోరు - స్వంతలాభం కొంత మానడమనేది గాలికి వదిలేసారు. It could be just a perception and we all know perception is the reality.

    So, ఆంధ్రం అంటే అసలైన అర్థం తెలియచేసినందుకు ధన్యవాదములు. తెలంగాణ అంతటా దీనర్థం తెలియాల్సిన అవసరం ఉంది. ఒకవేళ అదేగనక జరిగితే ప్రత్యేక రాష్ట్రానికి 'తెలంగాణాంధ్ర' అనే పేరు ఒప్పేసుకుంటారు.

    ఈ ప్రజాఉద్యమం వెనుకనున్న నిజమైన ప్రజల గుండెల్లోంచి భాధతో తన్నుకు వచ్చే హూంకరింపును గుర్తించి మద్దత్తుగా సహకరిస్తే సంతోషిస్తాం లేదా మమ్మల్నిలా వదిలేయండి.

    అంతేకాని హేళన చేసేలా మాట్లాడవద్దు రాయవద్దు.

    @అబ్రకదబ్ర
    గుమ్మడి కాయల దొంగల్లాగా బుజాలెందుకయ్యా తడుముకుంటారు... అని వెనకటి తరం వాళ్ళు చాలా మంచి సామెతే చెప్పారు.

    కష్టపడి పనిచేసి నాలుగు రాళ్లు వెనకేసుకుంటున్న వారిని 'దోపిడీదారులు' అని ఎవ్వరనరండి - అన్నంత మాత్రాన అది నిజమై పోదు. ఆ క్రమంలో ఇతరులకు కలిగే ఇబ్బందులను పట్టించుకోక స్వంతలాభం చూసుకున్నప్పుడే ఇలాంటి అపవాదాలకు తావు.

    అవును మీరు నిజం చెప్పారు - ఇప్పుడు భీమవరానికో, కాకినాడకో పంపి చదివించేవాళ్లు ఎవరు - తెలంగాణా అంతటా విద్యావ్యాపారంలో పెట్టిన పెట్టుబడులకు ప్రతిఫలంగా ఆర్జించవద్దా? పనిలో పనిగా ప్రభుత్వ చదువును చెత్తగా మార్చేస్తే సరి!

    హైదరాబాదులో కాని చికాగోలో కాని సంపాదించిన సొమ్ముతో తమ స్వగ్రామాల్లో స్థలాలో, పొలాలో కొనుక్కుంటే ముమ్మాటికి తప్పుకాదు. ఆ ప్రక్రియలో స్థానిక సమాజాభివృద్దిలో కొద్దిగా కూడా పాలుపంచుకోక పోవడమే తప్పు. హైదరాబాదు ఏ ప్రాంతంలో ఉంది ఆ చుట్టుపక్కల స్థితి గతులెలా ఏడ్చిచస్తే నాకేంటి నేను బాగుంటే చాలు అనే ధోరణితో పోలోమని పడిపోయారు ఒక్క రాజధానిలోనే కాదు తెలంగాణ అంతటా!

    @వేమన గారు
    అరా కొరా కాదు - గ్రామాల్లో వందలు పట్టణాల్లో వేలల్లో ఉంటుందీ సంఖ్య. మరి రాష్ట్రంలో మిగతా తెలంగాణేతర ప్రాంతాలలో ఎంత వెదికినా కోటికొక్కరైనా కానరారు తెలంగాణా పౌరులు - ఎందుకంట?

    @rest of anti-telangana bloggers
    మేము తెలంగాణ మొత్తానికి జరిగిన వివక్ష గురించి మాట్లాడుతుంటే మీకు మాత్రం కొందరు చెప్పే తప్పుడు కారణాలు మాత్రమే అగుపడతాయి లేదా హైదరాబాదు ఒక్కటే కనపడుతోందెందుకు? గత 40–50 ఏళ్ళలో తెలంగాణ ప్రాంతంలో జరిగింది నిలువు దోపిడి – అభివృద్ది కాదు. హైదరాబాదులో సమసిపోయిన అందాలు, పచ్చదనం, సరస్సులు, విశృంకలంగా జరిగిన ఆక్రమణను మీరు అభివృద్ది అంటరా… హైదరాబాదును మీరు ప్రత్యేకంగా అభివృద్ధి చేసిందేమి లేదు. అప్పుడు ఐదో నగరమే ఇప్పుడూ ఐదో స్థానమే.

    ఇక అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడాలని ఉచిత సలహాలు పారేయకండి. మేం చేసిన పోరాటాలకు మీరెన్నిమార్లు మద్దత్తిచ్చారో వెనక్కి తిరిగి చూసుకోండి. ఇప్పటి వరకు ఓ పదీ ఇరవైదాకా వివిధ రకాలుగా లేచిన ఉద్యమాలను ప్రతీసారి GO-610 లాంటివాటితో బుజ్జగించే ప్రయత్నాలు చేసారు - అసలెవరండి అలాంటివి అమలు కాకుండా ఆపేది. మీలాంటి వారు కాదా? అయితే మాతో కలసి వచ్చి పోరాడలేదెందుకో? అట్లాంటి సమయాల్లో నోర్లెందుకు దగ్గర పడతాయో!!!

    అందుకే, ఒక మనవి – మీకు దమ్ముంటే, మీకు ఈ ప్రాంతం మీదున్న మమకారం నిజమైనదే అయితే – మీరుకాని, మీ తమ్ముల్లు, చెల్లెల్లు, కొడుకులు, కూతుల్లు, మనవల్లు, మనవరాల్లు కాని – తెలంగాణలో పెంచి పెద్దచేయండి. ప్రభుత్వంచే లేదా స్థానిక ప్రజలచే నడిపే బడులలో, కలశాల్లో చదివించండి. ఆప్పుడు తెలంగాణ ప్రజల కష్టసుఖాల గురించి మాట్లాడండి.

    తెలంగాణ ప్రజలకు జరిగిన అన్యాయమేంటో మీలాంటి జనానికి కనీస అవగాహన లేదు. తెలియకుండ చేయడంకూడా అణచివేతలో భాగమే!

    రిప్లయితొలగించండి
  36. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  37. @శ్రీధర్ రాజు:

    గురివింద గింజ సామెత కూడా ఆ పెద్దోళ్లే చెప్పారు. స్వయానా వలసవాదైన మీరు ఆ విషయాన్ని ఎన్ని రకాలుగా కవర్ చేసుకోజూసినా ఉపయోగం లేదు.

    ఒక్క తెలంగాణలో ఏం ఖర్మ, ఆంధ్ర ప్రదేశ్ మొత్తంలో ఎక్కడన్నా ప్రభుత్వ బడుల్లో పిల్లల్ని చేర్పించటానికి తల్లిదండ్రులెవరన్నా సిద్ధంగా ఉన్నారా? ఎవరు పుట్టి పెరిగిన ప్రాంతంపై వారికి మమకారం ఉంటుంది, ఉండాలి. మీరు పుట్టి పెరిగిన తెలంగాణపై మీకంత మమకారం ఉంటే, 'దమ్ముంటే' అంటూ మీరు విసిరిన సవాలుని ముందు మీరే అమల్లో పెట్టి చూపండి. మీ సవాలు స్వీకరించటానికి ఉండాల్సింది దమ్ము కాదు - అవసరం. ఆ అవసరం ఎవరికీ లేదు.

    మీ ప్రాంతానికి సమస్యల్లేవని ఎవరూ అనటం లేదిక్కడ. ఆ సానుభూతి ఉండబట్టే, గత ఎనిమిదేళ్లలో ప్రత్యేకవాదులు 'పంచెలూడగొడతాం, ఆంధ్రావాలే భాగో, వలస దోపిడీదారులు, దొంగలు, నాలుకలు తెగ్గోస్తాం, బొంద పెడతాం' లాంటి వాగుళ్లు ఎన్ని వాగినా మారు మాట్లాడకుండా సహించారు నాలాంటి సాధారణ తెలంగాణేతరులు. అలా మేమిచ్చిన అలుసు మీరిక్కడ రాసిన పై వ్యాఖ్యలో సైతం ప్రతిఫలిస్తుంది. మీ మహానాయకుడికి మల్లే మీరూ అందరినీ ఉద్దేశించి ఓ మాటనటం, ఆ వెంటనే 'అబ్బే అది మిమ్మల్ని కాదు' అనటం!

    మీకెందరు ఆంధ్రా/సీమ స్నేహితులున్నారో నాకు తెలీదు. మీ ధోరణికి అలాంటివారు ఉండే అవకాశాల్లేవు (ఇది చదివిన వెంటనే మీరొచ్చి 'ఉన్నారహో' అంటారనుకోండి). నాకున్నారు లెక్కలేనందరు తెలంగాణ స్నేహితులు. వాళ్లలో ఒకరిద్దరు తప్ప మిగతా అందరూ సమైక్యవాదులే. సమస్యల గురించి వాస్తవిక జ్ఞానం ఉన్నవారు, వాటి పరిష్కారాల గురించి విచక్షణతో ఆలోచించగలిగే వాళ్లూ - వాళ్లందరూ. మీలాగా తెలంగాణేతరులపై అకారణ ద్వేషం వెళ్లగక్కేవాళ్లు కారు.

    యాభయ్యేళ్లుగా వెనకబాటుదనం పేరుతో చేసిన బ్లాక్‌మెయిలింగ్ చాలు. ఇక ఆపండి.

    భూమండలమ్మీద ఏ నగరంలోనైనా అభివృద్ధి పేరుతో జరిగింది పచ్చదనాన్ని హరించటమే. అంత చిన్న విషయం తెలీకుండా హైదరాబాదు పచ్చదనం గురించి మాట్లాడుతున్న మీతో ఇంత సేపు వాదించి నా సమయం వృధా చేసుకున్నాను. You .. continue having fun. Me .. done.

    రిప్లయితొలగించండి
  38. అబ్రకదబ్ర,
    Very funny. Do you even read these responses?

    Don't change the topic and start attacking others on personal basis. You are absolutely narrow minded with your response.

    People like you fall to the niche levels and start personal attacks whenever you hear the right answers. No one said in this blog that they supported 'పంచెలూడగొడతాం, ఆంధ్రావాలే భాగో, వలస దోపిడీదారులు, దొంగలు, నాలుకలు తెగ్గోస్తాం, బొంద పెడతాం' - why do you think this situation arose? why are still living among such ugly people? can you eliminate them? మీలాంటి వారు కెలికితేనే అలాంటి బూతుల responses వస్తాయి.

    Praveen attempted for clarity and Sridhar gave specific answers to your concerns.

    Do you know 65% of Telangana children still go to government schools - please check state board of education statistics.

    Why these agitations arose? why the youth is getting attracted to naxalism? what's the real solution? Yes - Sridhar said for the fact - there are too many of you spread across Telangana and keep irritating locals quietly.

    Think through you will understand. We are not saying you are the only problem - corrupted leaders are everywhere... but because of you people the situation is becoming worse. The discrimination towards Telanagana people is widely openly visible.

    Still differ.... you may need to visit a psychiatrist.

    రిప్లయితొలగించండి
  39. తెలంగాణజనం మఱీ ఎక్కువదూరం ఆలోచించే తరహా కాదు. అంతదూరం లాగే సత్తా వారికి లేదు. రాష్ట్రం ఇచ్చాక ఇంటికి పోయి మందుకొట్టి పడుకునేవాళ్లు ఎక్కువ. తెలంగాణలో రాజకీయ నాయకులూ, వాళ్ళ తాబేదారులూ తప్ప కోస్తా-సీమల్లో మాదిరి నిజమైన స్వతంత్ర మేధావులెవరూ ఏ రంగంలోను లేరు.
    - http://www.tadepally.com

    సమైక్య వాదుల నినాదం ప్రకారం విడిపోవాలని గొడవ చేస్తున్నది కెసిఆర్‌. పదకొండు రోజుల ఉద్యమాన్ని స్పాన్సర్‌ చేసి నడిపించింది కెసిఆర్‌. ఈ వాదనల ప్రకారం తెలంగాణ ప్రజలకు కూడా తెలంగాణ కావాలని లేదన్నమాట.. అలాంటప్పుడు చిదంబరం ప్రకటన రాగానే నిరసన వ్యక్తం చేయాల్సింది నిజంగా ఎవరు? తెలంగాణ ప్రజలు.. మేము మా ఆంధ్ర సోదరులతోనే కలిసి ఉంటాం.. విడిపొమ్మనటానికి కెసిఆర్‌ ఎవరు? మమ్మల్ని అన్యాయం చేయకండి అని గొడవ చేయాల్సింది తెలంగాణ ప్రజలు... మరి పది జిల్లాల్లో ఒక్క చోట కూడా ఈ నినాదం వినిపించలేదు. సమైక్యం కోసం ఆందోళన జరగలేదు. పైగా సంబరాలు చేసుకున్నారు.. దీని అర్థం ఏమిటి? ఉద్యమాన్ని కెసిఆర్‌ స్పాన్సర్‌ చేస్తే.. తాము అన్యాయంగా విడిపోతామన్న ఆందోళన తెలంగాణ ప్రజల్లో ఉంటే స్పాంటేనియస్‌గా తెలంగాణ ప్రజల్లో నిరసన వ్యక్తం కావాలి కదా? ఎందుకు కాలేదు.. ఈ మాత్రం ఆలోచన వారిలో వచ్చేలాగా గత యాభై ఏళ్లలో ఆంధ్రప్రాంత ప్రజలు వారిని విద్యావంతులను చేయటంలో సక్సెస్‌ కాలేకపోయారా?
    - http://kovela.blogspot.com/2009/12/blog-post_14.html

    రిప్లయితొలగించండి
  40. @డా.ఇస్మాయిల్,
    >>మరి పది జిల్లాల్లో ఒక్క చోట కూడా ఈ నినాదం వినిపించలేదు. సమైక్యం కోసం ఆందోళన జరగలేదు
    పది జిల్లాల్లో ఏమి ఖర్మ, సాక్షాత్తు 'మన' హైదరబాదులోనే జరిగితేనూ. అదేదో కాలనీలో శాంతియుత సమైక్య ప్రదర్శన జరిగితే, కొందరు వేర్పాటువాదులు వచ్చి బ్యానర్లు చించి, ప్లెకార్డులు తగలబెట్టి, జనాల తలలు పగలగొట్టినంత పని చేసి తరిమి తరిమి కొట్టారు. చాలా మంది సామాన్య ప్రజలు భయస్తులు, తమ ఉద్దేశ్యాలను నడి రోడ్డు మీదకు వచ్చి ఉద్యమం పేరుతో గొడవ చేసి గొంతెత్తి చెప్పరు, ఓటేసి మరీ చెబుతారు.

    రిప్లయితొలగించండి
  41. నాకూ సమైక్యాంధ్ర కావాలి. నేను నూటికి నూరు శాతం 'రాయల సీమ' వాడిని. కానీ 'తెలంగాణా' పట్ల సహానుభూతి కలిగిన వాడిగా నా అభిప్రాయలు చెప్తున్నాను. కలసి ఉండలేం మహాప్రభో అంటే, రా! కలిసుందాం! రా! అని బలవంత పెట్టడం సబబనిపించడం లేదు. 1948 నుంచీ 1956 వరకూ ఇవి రెండు రాష్ట్రాలే-అంతకు ముందు కూడా భౌగోళికంగా ఇవి రెండు విభిన్న పరిపాలకుల కింద కొన్ని వందల సంవత్సరాలు పరిపాలించబడిన దాని కారణంగా తలెత్తిన చారిత్రిక, సాంస్కృతిక తేడాలు ఎన్నో- అప్పుడూ తెలంగాణా వారు కావాలనకపోయినా బలవంతంగా కలిపేసుకుందీ మనమే, దానికి పరిహారంగా సూత్రాలు, ఒప్పందాలు కుదుర్చుకొని వాటిని తుంగలో తొక్కిందీ మనమే.

    రిప్లయితొలగించండి
  42. గలీజొళ్ళం లుచాగాల్లం బేవార్సుగాల్లం మమ్మల్ని వదిలి వెళ్ళండి మాతో మీకెందుకు స్నేహం మా మూతులు ఎందుకునాకుతాండ్రు
    — జనార్ధన్

    దోపిడి చేసే ప్రాంతేతరులను, దూరం దాకా తన్ని తరుముతం
    ప్రాంతం వాడే దోపిడి చేస్తే, ప్రాణంతోనే పాతర వేస్తం
    — కాళోజి

    నేనురా తెలగాణ నిగళాలు తెగగొట్టి ఆకాశమంత యెత్తరచినాను
    — దాశరధి

    నవంబర్ ఒకటి గడ్లె కలిపిన రోజు
    యాదికస్తే యాన్నో కాల్సుకస్తది
    — అన్నవరం దేవేందర్

    ఒక జాతి పోరాటాన్ని గౌరవించలేనివాడు ఐక్యతకు ఎప్పుడూ నాంది పలుకలేడు
    — జూలూరు గౌరీశంకర్‌

    అలుముకొని కలుపుకొనుడు
    అటెనుక వెన్నుపోటు
    అదే సమైక్యత !
    — అన్నవరం దేవేందర్

    తెలంగాణ వేరైతే
    చెలిమి తుట్టి పడుతుందా?
    తెలంగాణ వేరైతే
    చెలిమి లెండిపొతాయా?
    తెలంగాణ వేరైతే
    దేశానికి ఆపత్తా?
    — కాళోజి

    ఓటేసెటప్పుడు ఏ నాయకుడు జెప్పలే "తెలంగాణ ఇవ్వం" అని - ఏ ఒక్కని కైనా ధైర్యముందా ప్రజలకు చెప్పనికి.
    — శ్రీధర్ రాజు

    రిప్లయితొలగించండి
  43. ఈ లుచ్చాగాడా సమైఖ్యవాది : ((సారి... గౌరవశ్రీ సామ్యుల్ జగన్మోహన్ రెడ్డి సమైఖ్యవాది:)
    http://www.youtube.com/watch?v=zgCNriFfB0U

    This immature idiot will sell the entire state to Vatican… may not hesitate to announce English to be the mother tongue of every statehood.

    యాసను భాష
    ఎక్కిరిచ్చింది
    తెలుగును చూసి
    ఇంగ్లీష్ ఇకిలిచ్చింది
    — అన్నవరం దేవేందర్

    The only district that pridely accomplished a complete administration in Telugu language is Nizamabad.

    అసలు సిసలైన తెలుగు
    బ్రతికుంది నా తెలంగాణలోనే – దాశరధి

    జై తెలంగాణ జై జై తెలంగాణ

    రిప్లయితొలగించండి
  44. ఒరిస్సాలోని తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉన్న గంజాం, కోరాపుట్ ప్రాంతాలని ఆంధ్ర ప్రదేశ్ లో కలపాలని డిమాండ్ ఉండేది. నిజానికి అక్కడ ఎక్కువ మంది తెలుగు వాళ్ళు కాదు. అక్కడ స్థానిక ప్రజలు మాట్లాడే సవర, కంధ బాషలలో తెలుగు పదాలు ఎక్కువ. దక్షిణ ఒరిస్సా తెలంగాణా కంటే వెనుకబడిన ప్రాంతం. సమైక్యత పేరుతో వట్టి కబుర్లు చెప్పేవాళ్ళు లేకపోతే దక్షిణ ఒరిస్సాని కూడా ఆంధ్ర ప్రదేశ్ లో విలీనం చెయ్యొచ్చు. సమైక్యత పేరుతో వట్టి కబుర్లు చెప్పడం వల్లే కదా ప్రత్యేక తెలంగాణా డిమాండ్ వచ్చింది.

    రిప్లయితొలగించండి
  45. అందరోక్కటే - ఎవ్వలు సక్కటోళ్ళు గాదు...
    మా తెలంగాణ మాకిచ్చేయ్యిండ్రి... మీ జగాల మీరు తన్నుకోండ్రి...
    మేం గలీజొళ్ళం మాతోని మీకు సోపతి కుదర్కచ్చింది...

    రిప్లయితొలగించండి
  46. గలీజొళ్ళం లుచాగాల్లం బేవార్సుగాల్లం మమ్మల్ని వదిలి వెళ్ళండి మాతో మీకెందుకు స్నేహం మా మూతులు ఎందుకునాకుతాండ్రు
    — జనార్ధన్

    ఇది వెటకార౦ కాదా? ఇదే మాటను ఏ కోస్తావాడో ఏ సీమ వాడో అను౦టే, ఎ౦త గొడవ చేసే వారు.
    తెల౦గాణ వాడన్నాడు కాబట్టి ఇది ఒక వేద౦ అయిపోయి౦ది.

    విరిగిన గాజుముక్కలను అతకట౦ కష్ట౦. కా౦గ్రెస్ ఖాతాలో మరో విభజన పుణ్య౦ జమ పడిపోయి౦ది.

    మీ ఆత్మ గౌరవ ఘోషతో విడిపో౦డి. రేపు నడివీధిలో ఒక్కడైన రోజు మళ్ళీ నీ ఆ ఆత్మ గౌరవ౦ గుర్తొస్తు౦ది. ఇది తెల౦గాణ వాడి్కే కాదు, సమస్త వేర్పాటు వాదులకూ.

    రిప్లయితొలగించండి
  47. పెదరాయ్డు,
    ఇది వెటకారం కానే కాదు.... ఎక్కణ్ణుంచో తన్నుకుని వచ్చే బాధతో కూడిన ఆర్థనాధం ... అసలు నీకు జనార్ధన్ ఎవరో తెలుసా?

    ఏ కోస్తావాడొ, సీమవాడొ అనడానికి ముందు, తెలంగాణ వాళ్ళు కోస్తాకో సీమకో వచ్చి అలాంటి పరిస్థితి మీ ప్రాంతాల్లో సృష్టించినపుడు - తప్పకుండా అనాల్సిందే... నేను కూడా మీతో గొంతు కలుపుతా... ఎందుకంటే నేనుకూడా గన్నవరం నుండి తెలంగాణకు వలస వచ్చినవాడినే (హైదరబాదుకు కాదు)...

    ఆత్మగౌరవమంటే మీకు నిజంగానే వెటకారం... కాని నువ్వు ఈ బ్లాగు రాసవన్నది ఎంత నిజమో ఈ ప్రాంతానికి వివక్ష జరిగింది అనడం కూడా అక్షరాల నిజం.

    రిప్లయితొలగించండి
  48. ఆంధ్రం అంటే ఇక్కడ అర్థం ఎవ్వరికి తెలియదు.

    But ఆంధ్రోళ్ళు అంటే, తమ సంతోషాల కొరకు ఇతరులకు కలిగే బాధలను లెక్కచెయ్యకుండా ప్రవర్తించే అతి నీచాతినీచమైన కుటిల బుద్ధి కలిగిన పొట్టచేతబట్టుకుని వలసొచ్చిన దురాక్రమణదారులు... నాలో కూడా అదే రక్తం కాని నాకు తెలిసిన, మీకుతెలియని, చెప్పినా నమ్మని నిజాల కారణంగా నేను తెలంగాణకు పూర్తి మద్దత్తు.

    I am done with this blog!!!

    By the way, can any one answer these questions:
    http://www.youtube.com/watch?v=3k286v3uLv8

    రిప్లయితొలగించండి
  49. అబ్లు: మీ ఆవేదనను నేను అర్థం చేసుకున్నాను. కానీ, చికాగో నుంచి మీరెంత గొంతు చించుకున్నా, మీరు తెలంగాణకు చేసిన ద్రోహం సమసిపోదు. మీ పశ్చాత్తాపం మీరు చేసిన పాపాలను కడిగెయ్యదు. మీరు వెంటనే చికాగో నుంచి వచ్చి మీరు ఆక్రమించుకున్న భూములను ఎవరివి వాళ్ళకు తిరిగి ఇచ్చేసి, గన్నవరం తిరిగెళ్ళిపోండి. లేకపోతే, మన సోదరులకు మీరు చేసిన ద్రోహాన్ని తెలంగాణ వాళ్ళే కాదు, ఆంధ్రులెవరూ క్షమించరు.

    రిప్లయితొలగించండి
  50. అబ్లు,

    "ఆంధ్రోళ్ళు అంటే, తమ సంతోషాల కొరకు ఇతరులకు కలిగే బాధలను లెక్కచెయ్యకుండా ప్రవర్తించే అతి నీచాతినీచమైన కుటిల బుద్ధి కలిగిన పొట్టచేతబట్టుకుని వలసొచ్చిన దురాక్రమణదారులు"

    ఇది చాలు, మీ మానసిక పరిణితి తెలియడానికి. ఆవేశపడకు౦డా ఆలోచి౦చ౦డి.

    జనార్దన్ గురి౦చి నాకు తెలియవలసి౦దేమీ లేదు, నేను వ్యాఖ్యాని౦చి౦ది అతని భావాలను గురి౦చి మాత్రమే.

    రిప్లయితొలగించండి
  51. వార్నీ , ఇన్నాళ్ళు నాకీ విషయం తెలియలేదు చూసారా దంటు దుర్గ గారూ! ఆంధ్ర వేరు...తెలుగు వేరు. భలే చెప్పారు. శంకరంబాడి గారు చెప్పేవరకు అసలు తెలుగనే మాటే లేదు. వారెవ్వా!! పాపం ఆయనెవరో శ్రీ కృష్ణ దేవరాయలంట కొందరు ఆయన్ని "ఆంధ్ర' భోజుడు అంటార్లెండి! మరి "దేశబాషలందు తెలుగు లెస్స' అని ఎలా చెప్పాడబ్బా? (అన్నట్టు మార్చే పోయాను ఆయనా మాట చెప్పింది ఇప్పుడు ఉత్తరాంధ్ర లో ఉన్న శ్రీకాకుళం పర్యటనలో ...చ చ మళ్ళీ ఆంధ్ర అని వచ్చేస్తోంది చూశారా) బహుశా ఆయన శంకరంబాడి గారి తర్వాత పుట్టుంటాడు. పోన్లెండి గొడవలెందుకు రెండు భాషలు వేరు వేరు. ఒప్పెసుకుంటా. మీరు వాడితే తెలుగు....ఆంధ్రా వాళ్ళు వాడితే అందరం. అంతేనా. తెలుగు భాష మీద పేటెంటు అచ్చంగా తెలంగాణా వాళ్ళదే సరేనా!

    ఇంక అందరూ హైదరాబాద్ వచ్చేస్తున్నారు....దోచుకు తినేస్తున్నారు అంటున్న అచ్చ తెలంగాణా వాదుల్లారా! అయ్యా రాష్ట్రానికి రాజధాని అంటే ప్రజలందరూ రావచ్చు. పొరపాట్న కర్నూలునే రాజధానిగా అప్పట్లో ఉంచేస్తే ఇప్పుడు మీరు ఉపయోగిస్తున్న "సెటిలర్స్' అనే మాట మిమ్మల్ని ఉద్దేశించి వాళ్ళు అనాల్సి వచ్చేదేమో. ఇప్పుడు మీ బాధ అంతా వాళ్ళు పడాల్సి వచ్చేదేమో. పోన్లెండి అయినా నాకెందుకు. ... అందరూ బావుండాలి అంతే!

    రిప్లయితొలగించండి
  52. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ దగ్గర 30చ.కి.మీ.విస్తీర్ణం ఉన్న కేంద్రపాలిత ప్రాంతం యానాం . దాదాపు 30వేల జనాభా.యానాం పర్యాటక ప్రాంతం. యానాం వార్తలు తూర్పుగోదావరి పేపర్లలోనే వస్తాయి.యానాంకు రాజధాని పాండిచ్చేరి సుదూరంగా తమిళనాడులో870కి.మీ దూరంలో ఉంది .యానాం 1954 దాకాభారత్ లో ఫ్రెంచ్ కాలనీగా ఉంది.నేడు పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతంలో భాగం.1954లో లో విమోచనం చెంది స్వతంత్రభారతావనిలో విలీనంచెందినా 1956 లో భాషా ప్రాతిపదికన తెలుగు రాష్ట్రంలో కలవలేదు.1948లో హైదరాబాద్ ను పోలీసు చర్యజరిపి ఇండియాలో కలిపారు.1949 లో అప్పటికి ఒక ఫ్రెంచి కాలనీ గా ఉన్న చంద్రనాగూర్, సమీపంలోని బెంగాల్ రాష్ట్రంలో విలీనం అయింది. కాకినాడ మునిసిపల్ కౌన్సిల్ కూడా యానాన్ని కలపాలని తీర్మానం చేసింది. 870కి.మీ దూరంలోని తమిళ పుదుచ్చేరి నుండి పాలన కష్టంగా ఉంది.పుదుచ్చేరికి యానాం ప్రజల ప్రయాణం ఆంధ్రలోని కాకినాడ నుండి జరుగుతుంది.దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని యానాంలో ఏర్పాటు చేయాలని యానాం కాంగ్రెస్ తీర్మానించింది.ఇండోర్ స్టేడియం,కళ్యాణమండపం,ధవళేశ్వరం-యానాం మంచినీటి ప్రాజెక్టులకు రాజశేఖరరెడ్డి పేరు పెడతామని పుదుచేరి రెవిన్యూ మంత్రి మల్లాడి కృష్ణారావు చెప్పారు. తెలుగుజాతి సమైఖ్యత,భాషాప్రయుక్తరాష్ట్ర ప్రధాన ఉద్దేశ్యం యానాం ఆంధ్రప్రదేశ్ లో కలిస్తే నెరవేరుతుంది.తెలుగుతల్లి బిడ్డలందరూ ఒకేరాష్ట్రంగా ఉంటారు.సమైక్యాంధ్ర కోసం ఇప్పుడు ఉద్యమాలు జరుగుతున్నాయి గనుక భౌగోళికంగా సామీప్యత, 100% తెలుగు ప్రజలున్న యానాం ను ఇప్పటికైనా తమిళ పుదుచ్చేరి నుండి విడదీసి సమైక్యాంధ్రలో కలపాలి.కలిస్తే బాగుంటుందని ఆశ.

    రిప్లయితొలగించండి
  53. ప్రవీణ్ కమ్యూనికేషన్స్ గారూ,

    రంగనాయకమ్మ గారి అభిమానులైనంత మాత్రాన ప్రతి ఒక్కరూ ఆమె ప్రతి అభిప్రాయాన్నీ కళ్ళు మూసుకుని బలపరచక్కర్లేదు. సమైక్యత వట్టిమాట ఎలా అవుతుంది? ఒక పక్క రాష్ట్రంలో స్వచ్ఛందంగా ప్రారంభమైన సమైక్య ఉద్యమాన్ని చూస్తూ కూడా ఈ మాటని ఎలా అంగీకరిస్తాం?

    తెలంగాణా తీర్మానాన్ని బలపరుస్తామని ముందు చెప్పిన చంద్రబాబు వగైరా రాజకీయ నాయకులు సైతం వెనకడుగు వేసింది ప్రజల నుంచి ఇంతటి వ్యతిరేకత ఊహించకనే! ఇది కేవలం రాజకీయ నాయకులు వెనకుండి నడిపిస్తున్న ఉద్యమం కాదు.

    పైన వంశీ గారు ఇచ్చిన గణాంక వివరాలు చూశాక 50 ఏళ్ళుగా తెలంగాణాని ఎవరు నిర్లక్ష్యం చేశారో తెలుస్తోందిగా!

    రంగనాయకమ్మ గారి వ్యాసంలో చివరి వాక్యాలు..."తెలంగాణాతో కలిసి ఉంటే వారికేదో(ఆంధ్రులకు) పెద్ద లాభం ఉందన్నమాట!ఆంధ్రాతో కలిసి ఉంటే తెలంగాణాకి పెద్ద నష్టమే ఉందన్నమాట" ...ఇవి విభేదాలు రేకెత్తించేవిగా మాత్రమే కనిపిస్తున్నాయి, సత్యాన్ని ఆవిష్కరిస్తున్నట్లు కాదు!

    రిప్లయితొలగించండి
  54. సుజాత గారు,
    చంద్రబాబు వంటి నాయకులు మరి కళ్ళు మూసుకునే తెలంగాణకు ముందు మద్దత్తు తెలిపి ఎన్నికల బరిలోకి దిగారని అనుకుంటున్నారా? ఇప్పుడెందుకు వెనకడుగు వేస్తున్నారో మీకు తెలుసా అని అడగవలసిన అవసరం లేకుండా మీరు చెప్పిందాంట్లోనే సమాధానముంది... పునాదులు కదిలిపోతాయనే చింత. తెలంగాణ ప్రజలపై ఎలాంటి స్వలాభాపేక్ష లేని ప్రేమ అని దీన్నే అంటారా? గొఱ్ఱెలెవరో అర్థమైయిందా? ఇలాంటి కప్ప దాటుడు వ్యవహారంతోనే గత 53 ఏళ్ళుగా సాగదీస్తూ వస్తున్నారు వలస పాలకులకు.

    పైన వంశీ గారి గణాంక వివరాలు ఏమి కనిపించలేదు. కాని వేరే బ్లాగులో ఎవరు పరిపాలించారో చెప్పిన గణాంకాలైతే తప్పు...

    తెలంగాణ నాయకులు పట్టుమని 7 ఏళ్ళు కూడా పరిపాలించలేదు. ఏ నాయకునికి తెలంగాణేతర వలసదారులు మద్దత్తు ఇవ్వలేదు. జలగం వెంగళరావు కోస్తాంధ్రా నుండి వలసొచ్చినవాడే... తెలంగాణకు వ్యతిరేకంగా Regional Development Committeeలను రద్దుచేసారాయన. తెలంగాణేతర ప్రాంతం వారు ముఖ్యమంత్రైయతే ఉప-ముఖ్యమంత్రి పదవిని తెలంగాణ వారికి ఇవ్వాలన్న నియమాణ్ణి తుంగలో తొక్కడంకూడా ఆయనతోనే ప్రారంభమైంది.

    తెలంగాణ ఎట్లాగు విడిపోతుంది అని తెలిసి ఇప్పటి తెలంగాణేతర రాజకీయ నాయకులు తమ స్వరాలెలా మారుస్తున్నారో చూస్తేనే అర్థమౌతోంది వాళ్ళ స్వార్థ ధోరణి. తెలంగాణలో తెలంగాణేతర రాజకీయ పార్టీల నాయకులకు ఇప్పటికైనా వీళ్ళ నిజమైన రూపం తెలిసి బుద్దొచ్చినందుకు చాలా సంతోషం.

    జై తెలంగాణ జై జై తెలంగాణ

    రిప్లయితొలగించండి
  55. ఇస్మాయిల్ గారూ,
    మీ బ్లాగులో వ్యాఖ్యానించడానికి అవకాశం లేనట్లుంది. మీరు చూపిన పటాలు చాలా inconvenient truths ని మరచిపోయాయి.
    తెలుగునాట మహోజ్జ్వలంగా వెలిగిన కాకతీయ సామ్రజ్యం యొక్క పటం చూపించకపోవటం ఒక మచ్చుతునక మాత్రమే.
    ఇంతకీ రాయలసీమని దత్త మండలం అని ఎందుకన్నారు? ఎవరు ఎవరికి దత్తత ఇచ్చారు? అంతకు ముందు అవి నిజాములే పాలించినవి కావా?
    "1948 నుంచీ 1956 వరకూ ఇవి రెండు రాష్ట్రాలే-అంతకు ముందు కూడా భౌగోళికంగా ఇవి రెండు విభిన్న పరిపాలకుల కింద కొన్ని వందల సంవత్సరాలు పరిపాలించబడిన దాని కారణంగా తలెత్తిన చారిత్రిక, సాంస్కృతిక తేడాలు ఎన్నో"
    నేనూ తెలంగాణకి మద్దతిస్తాను. కానీ ఆంధ్రం, తెలుగు వేరు, మన సంస్కృతులు వేరు అన్న అబద్ధాల ఆధారంగా కాదు. కేవలం ఒక మాండలిక వ్యవహారాన్ని అచ్చులో వ్రాసి కొత్త భాష అని చెలామణి చెయ్యటం మతితప్పిన వాళ్ళకే చెల్లుతుంది. అలా అయితే రాయలసీమ కూడా ప్రత్యేక భాషే (రానారే వ్రాస్తే ఆ పదాలు కూడా చాలామంది తెలుగువాళ్ళకు అర్ధం కావటం లేదు మరి)

    రిప్లయితొలగించండి
  56. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  57. వైజాసత్య గారూ...

    కాకతీయ సామ్రాజ్యం చూపకపోవడం నా దృష్టిలోపమే. ఇక మా రాయలసీమ విజయనగర రాజుల నుంచీ, పాలెగాళ్ల నుంచీ,మరాఠాల నుంచీ, టిప్పుసుల్తాన్ నుంచీ, నిజాము వరకూ ఆ తర్వాత వారు బ్రిటిషు వారికి దత్తత ఇవ్వడం ఈ చరిత్రంతా అవగతమే! నేను చెప్పిన అసమానతల్లో భాష గురించి నేనెక్కడా మాట్లాడలేదు. తెలంగాణాకు జరిగిన, జరుగుతున్న అన్యాయాల గురించి మీరు మాట్లాడకపోవడం ఆశ్చర్యపరుస్తోంది.ఒక్కసారి ఇక్కడ http://kovela.blogspot.com/2009/12/blog-post_19.html మీరూ మీ అభిప్రాయాల్ని తెలుపవలసిందని అభ్యర్థన.

    రిప్లయితొలగించండి
  58. @Ismaayil,
    You know the #G.O.# he was talking in that post was null&void, what do you say now? Why look at limited data, do you honestly beleive that in main areas like education, industrial development, agri development, infrastructure development the funds are allocated to kosta and/or Seema areas more per capita?
    If you or somebody beleives that can any of you including Talibaans can show one single wholesum study ( whitepaper) that shows the allocation of the funds in all the primary important areas for a given period? Without that why spreading false propaganda and beleiving it and supporting separation? If separation is needed it has to be done, but for sure it should not be based on false propaganda.
    It is real shame that people like you are also beleive these idiot's data, knowing it is not complete data and it is not true.

    రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు