తెలంగాణ ప్రాంతానికి వచ్చి, 'ఆంద్రోళ్ళు' పెద్దాళ్ళై పోయారు, మా భూముల్ని ఆక్రమించారు అనే వాదన వినిపిస్తారు తెలంగాణవాదులు. దాని వెంటనే మరో ముక్క చెబుతారు.. పొట్ట చేతపట్టుకొచ్చిన వాళ్ల గురించి మాకేం ఇబ్బంది లేదు, మా ఆస్తులని అక్రమంగా ఆక్రమించుకున్నవాళ్ల గురించే మా వ్యతిరేకతంతా అని అంటారు. ఎవరో కొందరు రావుల గురించో, కొందరు రెడ్డిల గురించో, కొందరు చౌదర్ల గురించో వీళ్ళ ఫిర్యాదు! వాళ్ళెవరో అక్రమంగా ఆస్తుల్ని సంపాదించుకుంటే యావజ్జాతీ తప్పు చేసినట్టా? ఆ కొందరి కారణంగా కోస్తా సీమల వాసులంతా దురాక్రమణదారులెలా అయ్యారు? 'అందరూ దురాక్రమణ దారులే అని మేమెక్కడన్నాం? కొందరే దురాక్రమణదారులు' అని అంటారు వెంటనే! మరి, ఎవరో కొందరి కారణంగా రాష్ట్రాన్ని ఎందుకు విడదీద్దామనుకుంటున్నారు? అటువంటి కబ్జాలే చేసిన తెలంగాణ వాళ్ళ సంగతేంటి? వాళ్ళ గురించేమీ మాట్టాడరేఁ? వాళ్ళ కోసం తెలంగాణను మళ్ళీ చీలుస్తారా?
సరే.., ఎవరో కొందరి కోసం రాష్ట్రాన్ని చీలుస్తారు, బానే ఉంది. జరిగిపోయిన దురాక్రమణలను ఎలా సరిదిద్దుతారు? ఆయా భూములను తిరిగి లాక్కుంటారా? అది సాధ్యమయ్యే పనేనా? చట్టపరమైన చిక్కులెన్ని? అసలు చట్టంతో చుట్టరికం నెరపి చట్టవిరుద్ధమైన పనులు చేసే రాజకీయ నాయకులు తెలంగాణ రాష్ట్రంలో ఉండరా? వాళ్ళు డబ్బుకు గడ్డి తినరా? ఇప్పటి ఉద్యమ నాయకుల సారథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినా సరే.., ఇప్పటిదాకా తమ బద్ధవిరోధి అయిన ఫలానా వారి లాంకో కొండలను స్వయంగా ప్రభుత్వమే లోపాయికారీగా రక్షిస్తుందనే విషయంలో ఎవరికైనా సందేహాలున్నాయా? సందేహాలున్నవారు 2004 కు ముందు పేపర్లనిండా పరుచుకున్న సవాళ్ళను, 2004 తరవాత జరిగిన వాస్తవాలనూ బేరీజు వేసి చూడాలి. చరిత్రను మళ్ళీ ఒకసారి చదూకోవాలి. ఐ.ఎమ్.జి భారత తప్ప మిగతా ఆరోపణలు, సవాళ్ళకేమయినా అయిందా అనే సంగతిని ఆరా తీయాలి.
కాబట్టి, తెలంగాణ ఏర్పడినంత మాత్రాన తెలంగాణవాదులు చెబుతున్న దురాక్రమణల విషయంలో అద్భుతాలేమీ జరగవు. అప్పుడు కూడా పరిస్థితులు ఇలాగే ఉంటాయి. అంతేకాదు, ఆ దురాక్రమణలు అప్పుడూ జరుగుతూనే ఉంటాయి. కానీ తిట్టడానికి 'ఆంద్రోడుం'డడు. అప్పుడెవరితో పోరాడతారు? పాలమూరు జిల్లావాళ్ళు, కరీంనగరంతోటి, నల్లగొండ వాళ్ళు నిజామాబాదుతోటీ పోట్టాడతారా? పోరాటాల పురిటిగడ్డ కదా!
పోరాటాల పురిటిగడ్డ తెలంగాణ అని అంటూంటారు, నిజమే. నిజాముతో పోరాడారు, చారిత్రాత్మకమైన విముక్తి పోరాటం చేసారు. కానీ ఇప్పుడు చేస్తున్నదేమిటి.. శత్రువెవరో తెలుసుకోకుండా పోరాటం చేస్తున్నారు -కాదు చేయిస్తున్నారు. లక్ష్యం ఒకదాన్ని పెట్టుకున్నారు -ప్రత్యేకరాష్ట్రం.. అంతే! అది సాధించడం కోసం శత్రువుగా ఎవర్ని ఎంచుకుంటే బాగుంటుందో చూసుకుని, 'ఆంద్రోళ్ళ'ను ఎంచుకున్నారు. ఇక ప్రచారం మొదలుపెట్టి ప్రజల మనసులను కలుషితం చేసి, పోరాటం చేయిస్తున్నారు. నిజమైన శత్రువెవరో గుర్తించలేక కాదు, గుర్తిస్తే, ఆ శత్రువు నెదిరించడానికీ, రాష్ట్ర విభజనకూ సంబంధమేంటీ అనే ప్రశ్న తలెత్తుతుంది. దానికి సమాధానం లేదు కాబట్టి 'ఆంద్రోళ్ళం'దరినీ శత్రువుగా చూపించారు. పోరాట సంప్రదాయాన్నే కొనసాగించాలనే తలంపుతో ఎవరితో పోరాడాలో చెప్పకుండా ఒక దిశలేని పోరాటం చేయిస్తున్నారు.
అంచేత, 'ఆంద్రోళ్ళ' దురాక్రమణ వాదం అనేది కూడా అబద్ధమే! కేవలం జనాల్లో తెలంగాణ వాదాన్ని నిలబెట్టి ఉంచడం కోసం, కొత్త తరానికి ఆ వాదాన్ని తలకెక్కించడం కోసం, కోస్తా, సీమల వ్యతిరేక భావోద్వేగాన్ని నిలబెట్టి ఉంచడం కోసం తెలంగాణ వాదుల చేతిలో ఉన్న మరో ఆయుధం 'ఆంద్రోళ్ళ' దురాక్రమణ అనే అబద్ధం. అంతేకాదు ఈ వాదనను నిరంతరం నిలబెడుతూ ప్రజల్లో సమైక్య భావన అనేది పాదుకొనకుండా పాటుబడుతున్నారు ఈ తెలంగాణ వాదులు.
అక్రమంగా ఆస్తులను సంపాదించుకున్న కొందరు తెలంగాణేతరులపై ఉన్న కోపాన్ని మొత్తం తెలంగాణేతరులపై మళ్ళిస్తున్నారు. అలా చూపెట్టి రాష్ట్రాన్ని విడగొట్టమంటున్నారు.
---------------------------------------
ఇవ్వాళొకాయన టీవీలో ఓ అబద్ధం చెప్పాడు. ఆయన చెప్పినదాని ప్రకారం.. తెలంగాణలో సహజవనరులు సమృద్ధిగా ఉన్నాయి. రాయలసీమలో ఏవో కాసిని గ్రానైటు లాంటివున్నాయిగానీ, కోస్తాలోనైతే అసలేమీ లేవు. విడిపోతే తమ మనుగడ ప్రశ్నార్థకమౌతుందని వాళ్లకు తెలుసు. అంచేతే సమైక్య వాదాన్ని ముందుకు తెచ్చారు. (తన వాదనకు నిరూపణగా అన్నట్టు, తెలంగాణలో బొగ్గు ఉంది, కోస్తాలో లేదని కూడా అన్నాడు) ఎలాంటి అబద్ధాలు, అసంబద్ధాలు చెప్పుకుపోతున్నారో చూడండి.
ఒకవేళ ఆ మాట నిజమే అయితే, రాష్ట్రాన్ని విడగొట్టడం తప్పే కాదు, దేశద్రోహ నేరం కూడా!
నాకు బ్లాగు లేదు. ఈ వ్యాఖను ప్రచురిస్తారో లేదో తెలియదు. అయినా వ్రాస్తున్నా!
రిప్లయితొలగించండిఎవడైనా అలా టీవీలో అబద్దాలు మాట్లాడినప్పుడు నిల దీయాల్సిన కనీస బాధ్యత టీవీ వాళ్ళదే! NDTV కి KCR ఇచ్చిన ఇంటర్వ్యూలో - హైదరాబాద్ లో 95 శాతం తెలంగాణా వాళ్ళు, అయిదు శాతం తెలంగాణేతరులు ఉన్నారని చెప్పాడు. ఎవడూ నిలదీసి ప్రశ్నించకపోతే...ఆ అబద్దాలే నిజాలుగా చెలామణి అవుతాయి. నిలదీసే అవకాశాలు, బాధ్యతలు - టీవీలకు, పత్రికలకే ఉన్నాయి. మీడియా కానీ, జర్నలిజం కానీ తమ పని తాము చిత్తశుద్దితో చెయ్యనంత కాలం, నాయకులు(అసలు వీళ్ళు నాయకులే కారు, నాయకులకు ఉండాల్సిన లక్షణాలే లేవు వీళ్ళలో...అది వేరే విషయం) ఇలాగే జనాలను వేధిస్తారు.
- siri
మరి ఇప్పుడు ఆంధ్రోళ్ళు... చేస్తున్న ఈ ఉధ్యమాల సంగతేంటి... మమ్మల్ని వదిలేయండిరా బాబు అని తెలంగాణ వాళ్ళు మొత్తుకున్నా.. లే.. మీరు ... మేము తెలుగోళ్ళం... మనం మాత్రం ఆంధ్ర ప్రదేశ్ లో ఉందాం అంటున్నరు..ఇప్పుడు కేవలం ఆంధ్రా లో జరుగుతున్న.. ఈ ఉధ్యమాన్ని దురాక్రమణ వాదం అనకుండా ఇంకేం అనాలో చెప్తావా,,, చ దు వ రి ... ఒకరు వద్దు వదిలేయండి..అంటున్నారు... ఇంకొకరు,,, మీరు కూడా మాతోటే ఉండాలని మారాం చేస్తున్నారు... దీన్నేమనాలి..
రిప్లయితొలగించండితెలంగాణా రాష్ట్రం ఏర్పడ గానే అద్భుతాలు జరగవని తెలంగాణా ప్రజలకు తెలుసు.
రిప్లయితొలగించండిబ్రిటష్ వాడు పోగానే భారత దేశం లోని దరిద్రం అంతా పోదని ఆనాటి భారతీయులకు కూడా తెలుసు.
స్వాతంత్ర్యం, స్వాభిమానం, స్వ పరిపాలన లోని అనిర్వచనీయమైన ఆనందం ఎలా వుంటుందో మీకు కూడా తెలుసు.
బ్రిటీషు వాడు రాక ముందు భారత దేశం ఎలా వుండేది. వాడు వచ్చినతర్వాత ఎలా వుంది.
వాడు తన దేశం నుంచి సంపద అంతా తెచ్చి మనల్ని ఉద్ధరించెందుకే వచ్చాడంటారా? , మనల్ని బాగు చేసేందుకే వాడు వచ్చాడంటారా? అన్నా ఎవరు నమ్మరు కదా.
ఇవాళ ఆంధ్రా వాళ్ళ వాదనలన్నీ అట్లాగే వున్నాయి.
రాష్ట్ర విలీనాన్ని. అప్పుడు కుదుర్చు కున్న ఒప్పందాలని, వాటి ఉల్లంఘనలని పక్కన బెట్టి మాట్లాడితే మీకు పరిష్కారం దొరకదు. ఆత్మ శాంతీ దొరకదు.
ముందు వాటిని ఉల్లంఘించిన , బె ఖాతరు చేసి తెలంగాణా ప్రజలకు వంచించిన ఆంద్ర నేతలను తప్పు పట్టాలి మీరు.
54 సంవత్సరాల అనంతరం కూడా మీరు ఆంద్ర వాళ్ళు గా మేము తెలంగాణా వాళ్ళుగా ఎందుకు మిగిలిపోయామో స్వార్ధ రాజకీయ నాయకుల దుర్మార్గం ఎంత ఘోరమైనదో ముందు గ్రహించాలి.
అంతెందుకు నిన్నటి వరకు మేము తెలంగాణాకు అనుకూలం అని ఖూని రాగాలు తీసిన కాంగ్రెస్, టీడీపీ, ప్రజా రాజ్యం పార్టీలన్నీ ఇవాళ ఓవర్ నైట్ లో సమైక్యతా రాగాన్ని ఆలపిస్తూ తెలంగాణాని ఎలా గేలి చేస్తున్నాయో మీరు గమనించడం లేదా.
ఇట్లాంటి రాజకీయ వంచనలను చూస్తూ తెలంగాణా తన అస్తిత్వాన్ని ఆంధ్రులకు అమ్ముకోవాల్సిన్దేనా?
మేమేమీ మీ భూభాగాన్ని పంచి ఇవ్వమనడం లేదు కదా, ఈ దేశం లోంచి విడిపోవడం లేదు కదా. మీరు రాష్ట్ర విభజనను భూతద్దం లో చూస్తూ ఎందుకు ఇంతగా హడలిపోతున్నారు?
నాకు తెలిసి తెలంగాణ ప్రజలను మేము (అనగ నేనుమరియు నేను కలిసిన తెలుగు వారు) ఎవరూ వేరే వాళ్ళలా చూడలేదు. ఇప్పుడు బ్లాగుల్లోని ప్రజల రాతలు చూస్తుంటే రాష్ట్రం లోని మిగతా ప్రాంతాల మీద తెలంగాణ ప్రజలకు ఇంత విద్వేషం గూడుకట్టుకుని ఉందా అని ఆశ్చర్యంగా/ఆందోళనగా ఉంది. కొన్ని నగరాలను చంపగల విషం చాలా వీజీ కక్కుతారు తరువాత మేమనేది ఆక్రమణదారులను మాత్రమే అంటారు.. ఈ లాజిక్కేంటో నాకిప్పటి వరకూ అర్థం కాలేదు. నేనొక వారం రోజుల క్రితం ఒక ప్రశ్న ఆదిగాను: తెలంగాణాకు అన్యాయం జరిగిన మాట వాస్తవమే, దానికి విభజన ఎలా పరిష్కారం?? ఇప్పుడు కేంద్ర గ్రాంటులను ఆంధ్రకు తీసుకుపోయే నాయకులు అప్పుడు కూడ ఆ పని చేయగల్రు. బినామీలతో భూములు ఆక్రమించేవాళ్ళు అప్పుడు కూడ ఆక్రమించగలరు... తెలంగాణ ఏర్పడ్డాక(అశుభం ప్రతిహతమౌగాక) నేను మా తెలంగాణ మిత్రుడి బినామీ తో ఒక 100 ఎకరాలు భూమి కోని అందులో పని చెయ్యటానికి 150 కుటుంబాలను కడప నుంచీ తీసుకుపోతే మీరాపగలరా??
రిప్లయితొలగించండిపైన ప్రభాకర్ మందార గారు రాసిన వ్యాఖ్యనే ఉదాహరణగా తీసుకోండి, ఎన్ని సార్లు "మీరూ" "మేమూ" అన్నారో?? కూటి కోసం గుడ్డ కోసం నీడ కోసం బ్రతుకుపోరాటం చేసే సగటు తెలుగు బిడ్డ తెలంగాణలో ఉన్నా రాయలసీమలో ఉన్నా ఒక్కటే!!
ప్రత్యేక వాదులారా ఒక్క విషయం గుర్తుంచుకోండి, రాష్ట్ర ప్రజల మధ్య మీరు రగిల్చిన ఈ విద్వేషాగ్ని ఇక్కడితో ఆగదు. ఒక వేళ తెలంగాణ ఏర్పడ్డా(అశుభం ప్రతిహతమౌగాక) ఈ మానసిక దూరం మాత్రం తగ్గదు.. తెలుగు వాళ్ళు ఎప్పటికీ ఒకే జాతిలా ఉండలేరు..మరో ఇండియా పాకిస్తాన్ కథ అవుతుంది..
అయ్యా చదువరి గారూ -
రిప్లయితొలగించండిఆంధ్ర నేతలు ఏమీ చెయ్యలేదు అన్నదానికి ఒక చిన్న లెక్క - అది ఒక రకంగా డొక్క చీల్చేదే...
పి.వీ నరసింహారావు ("జన్మ"జిల్లా - కరీం నగర్)- దాదాపు రెండేళ్ళు
జలగం వెంగళ రావు ("జన్మ"జిల్లా - ఖమ్మం!) - ఐదేళ్ళు
మర్రి చెన్నారెడ్డి ("జన్మ"జిల్లా - హైదరాబాదు) - దాదాపు మూడేళ్ళు
టంగుటూరి అంజయ్య ("జన్మ" జిల్లా - మెదక్) - దాదాపు రెండేళ్ళు
అంటే సుమారు 54 ఏళ్ళల్లో - 12 ఏళ్ళు తెలంగాణా బిడ్డలు ఏలారు ముఖ్యమంత్రులుగా
రాయలసీమ - దాదాపు 28 యేళ్ళు రాయలసీమ బిడ్డలు ముఖ్యమంత్రులు
సో కాల్డ్ - ఆంధ్రా బిడ్డలు పరిపాలించింది మిగిలిన 14 యేళ్ళు
ఈ లెక్కలు ఎక్కడివా ? ఏ స్కూల్ కుర్రోడిని అడిగినా చెబుతాడు.
ఇక ఒప్పందాలు - ఉల్లంఘింపు, బేఖాతరు సంగతికొస్తే అన్నీ సీమ నేతలే చేసారనుకోవచ్చా?. ఎందుకంటే ఎక్కువగా పరిపాలించింది వారే. పోనీ అన్నేళ్ళు పరిపాలించినా, మట్టిగడ్డలూ, బెడ్డలూ, కరువు కాటకం తప్పితే సీమలో సామాన్యుడికి ఒరిగిందేమిటి? అలానే తెలంగాణా పరిస్థితి. కాబట్టి ఈ వేర్పాటు వాదులు, అభిమానులు చేస్తున్న అర్థం పర్థం లేని వాదనలొదిలేస్తే మంచిది. ఉపయోగపడే పని ఏమిటో తెలుసా ? నాటకాలరాయుళ్ళని కాకుండా పనిచేసేవాళ్ళను మీ జిల్లాల నుండి పవరుకు పంపించుకుని ఉండుంటే, మీ ఒప్పందాలూ, మీ అభ్వృద్ధి మీకు జరిగేవి. అవన్నీ చెయ్యకా, చేసుకోలేక ఇతరమైన మాటలెందుకు, పనికొచ్చేవా పెట్టేవా! పోనీ పన్నేండేళ్ళు పవరులో ఉన్నోళ్ళు, తెలంగాణాకు ఏం చేసారో చెప్పమనండి - అంతకు మించిన అభివృద్ధి ఆంధ్రోళ్ళ 14 ఏళ్ళలో జరిగిందని మటుకు ఖచ్చితంగా చెప్పొచ్చు. లెక్ఖలు, ఆధారాలతో సహా, ఎవరైనా ఓపికుండి రాసుకోగలిగితే!
దురాక్రమణదారులు ఏమిటి - దాని సిగ కొయ్యా!
అయినా చదువరి గారూ - మీ టైమూ దండగా, మా టైమూ దండగ - ఈ సరంజామాలేని కామెంట్లు చదవలేక, చదివితే ఊరుకోలేక, ఉండబట్టలేక....అయ్యా అదీ సంగతి...కాబట్టి మీరు అదో , ఇదో - ఏదో ఒకటి చెయ్యాలని పురజనుల విజ్ఞప్తి :) :)
జలగం వెంగళరావు పుట్టినది ఖమ్మం జిల్లా కాదు. అతను పుట్టినది శ్రీకాకుళం జిల్లా సోపేరు గ్రామంలో. అతని కుటుంబం ఖమ్మం జిల్లా బయ్యన్నగూడెంలో స్థిరపడింది. సమైక్యాంధ్ర కబుర్లు చెప్పేవాళ్ళు తమ ప్రాంతంలోని వెనుకబడిన ప్రాంతాలని కూడా నిర్లక్ష్యం చేస్తున్నారు. అందుకే ఖమ్మం, వరంగల్ జిల్లాల కంటే శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు వెనుకబడి ఉన్నాయి.
రిప్లయితొలగించండివంశీ గారి వ్యాఖ్య ...కాపీ పేస్టు!
రిప్లయితొలగించండి" అయినా చదువరి గారూ - మీ టైమూ దండగా, మా టైమూ దండగ - ఈ సరంజామాలేని కామెంట్లు చదవలేక, చదివితే ఊరుకోలేక, ఉండబట్టలేక....అయ్యా అదీ సంగతి...కాబట్టి మీరు అదో , ఇదో - ఏదో ఒకటి చెయ్యాలని పురజనుల విజ్ఞప్తి :) :) "
రిప్లయితొలగించండిస్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్ళయినా మన సమస్యలేంటో మనకే తెలీదు. ఈ విషయంలో నేను జై లోక్ సత్తా !!
అయినా వేర్పాటువాదం రాకుండా చూసుకోవాలి, ఒకసారి వచ్చాక అది అవకాశవాద రాజకీయ నాయకుల అస్త్రం అవుతుంది.
ఈ దేశం బాగుపడుగాక!
A MUST WATCH… video on politicians of AP…
రిప్లయితొలగించండిhttp://www.youtube.com/watch?v=JcakfebNl1g
Vamsi,
Thanks for posting the statistics - it is clear evident that none of these leaders finished their 5years tenure completely... J.V.Rao was appointed as CM after presidents rule imposed by Indira Gandhi. In fact, JVR served just 4 years and 2 months. People saw him as a true Telugu leader favored none.
We all know PVNR never received enough recognition to his unbiased services.
The 100-odd Andhra MLAs met in Tirupati on December 31, 1972 and gave a call for an Andhra bandh and a 'no-tax' campaign. Narasimha Rao's continuance as Chief Minister became untenable, though his followers maintained that the "landlords of the Andhra region had ganged up to thwart the Land Reforms Bill Narasimha Rao had piloted in the Assembly." Narasimha Rao misjudged Delhi's mood so badly that he inducted eight new Ministers into his Cabinet on January 8, 1973 while a decision had already been taken by Indira Gandhi to put Andhra Pradesh under President's Rule. Harischandra Sarin, an Indian Civil Service officer, took over the administration. It was left to JVR, who became Chief Minister in December 1973, to restore order in the State. Jalagam Vengala Rao cemented the bonds among the Telugu-speaking people by holding the World Telugu Conference in Hyderabad in 1975.
During this period 3 new universities were established and JVR personally driven that development in three regions Telangana, Andhra and Rayalaseema. Originating from the border town - there are accusations after his service that he favored Andhra's development. I am not making these comments without any responsibility - I know his son Jalagam Venkat.
I think I went too far... Its the history... coming back to the present.
I support separate Telangana statehood - and that's the only possible solution to the current conflict.
Yes, Praveen is correct. JVR is an immigrant to the border town "ByAnna Gudem" of Khammam.
రిప్లయితొలగించండిHe is not originated from Telangana.
తెలుగువారిలో ఒకరికి మరొకరిపైన అంతకంతా పెరుగుతున్న ద్వేషభావం ఆందోళన కలిగిస్తుంది. ఒకే మాట పలు మార్లు వింటే అదే నిజమని మనిషి ఎలా భ్రమపడతాడో పంచతంత్రం కాకోలుకీయంలో వచ్చే 'బ్రాహ్మణుడు-ముగ్గరు దొంగలు' కథ వివరిస్తుంది.
రిప్లయితొలగించండిhttp://panchatantra.org/the-brahmin-and-the-crooks.html
ఈ విషయం ఎందుకు చెప్పానో ప్రత్యేకంగా వివరించనక్కర్లేదనుకుంటా. 'మీకు బాధలకంతా ఫలానా వాళ్ళే కారణం...కారణం...కారణం...' అని హిప్నటైజ్ చేస్తే ఏది మంచి అని ఆలోచించక నిందిస్తున్నారు.
మనం మనుష్యులం తరవాతే ఆంధ్రావాళ్ళం, తెలంగాణావాళ్ళం. కొందరు స్వార్థపరులైన రాజకీయ నాయకులు చేసిన తప్పులకు మొత్తం జాతి మీదే ద్వేషం పెంచుకోవడం మంచిది కాదు.
అందరోక్కటే - ఎవ్వలు సక్కటోళ్ళు గాదు...
రిప్లయితొలగించండిమా తెలంగాణ మాకిచ్చేయ్యిండ్రి... మీ జగాల మీరు తన్నుకోండ్రి...
మేం గలీజొళ్ళం మాతోని మీకు సోపతి కుదర్కచ్చింది...
ప్రవీణ్ కుమార్, శ్రీధర్ చికాగో.. మరి కేసీయారో.. కేసీయార్ తెలంగాణ వాడా?
రిప్లయితొలగించండిచదువరిగారూ,
రిప్లయితొలగించండిఅజ్ఞస్సుఖమారాధ్యస్సుఖమారాధ్యతే విశేషజ్ఞః జ్ఞానలవదుర్వదగ్ధం బ్రహ్మాపి నరం న రఞ్జయతి అని నీతిశతకకారుని మాట. సమైక్యాన్ధ్ర కోసం ఏం మాట్లాడినా అదంతా వృథా కంఠశోషగానే మిగిలిపోతుందేమో అన్న బాధకొద్దీ చెబుతున్నాను, కలిసుండనో అని అఱిచి గీపెట్టేవాడిని వదిలేసి నీ మానాన నువ్వు బ్రతుకు ఫో అని అచ్చువోసి వదిలివేయడమే మంచిదేమోనండీ. ఆలోచించగలరు.
నమస్సులతో
భవదీయుడు
నేను మీ టపా శీర్షిక కూడలిలో చూస్తోనే వంశీ గారిలాగా అనుకుంటూనే తెరిచా. తెలంగాణా బాగుపడక పోవచ్చు, ఆంధ్రా, సీమలు కూడా బాగుపడలేదని ఒక్క హైదరాబాదు మాత్రమే బాగుపడిందని అందరికీ తెలుసు. హైదరాబాదు ఎవరికీ చెందదని చిదంబరాన్ని ఒక్క ప్రకటన ఇమ్మనండి, తెలంగాణా ఎవరికీ అవసరం ఉండదు. వేర్పాటు వేర్పాటు కోసమే కానీ ఎవరినో ఉధ్ధరించేయాలని కాదు. అన్నిటికన్నా నాకు బాధ కలిగిన విషయం కేసీఆర్ ని రాత్రికి రాత్రి గాంధీని చేసేయడం. గాంధీ అంటే నాకు చాలా యిష్టం. గాంధీ దేశాన్ని కలిపి ఉంచడానికే ప్రయత్నించాడు, పదవికోసం కాదు.
రిప్లయితొలగించండితెలంగాణవారు తక్కిన తెలుగువారిని ద్వేషించడానికి ఇచ్చే ప్రాధాన్యం తాము బాగుపడడానికి ఇవ్వరు. ఈ మనస్తత్త్వంలో చదువుకున్న తెలగాణ్యుడు, చదువు రాని తెలగాణ్యుడనే తేడా కనిపించడం లేదు. వారు అలా తమ రాజకీయ నాయకుల చేత దశాబ్దాలుగా ప్రోగ్రామ్ చెయ్యబడ్డారు. వారిని ఆ మైండ్‌సెట్‌లోంచి బయటపడేసే మార్గమేదో అర్థం కాకుండా ఉంది. గత 53 సంవత్సరాల్లో నాన్-తెలంగాణవారి వల్లనే తెలంగాణ ఎంతో లాభపడింది. వారి మూలంగానే వారు తమ భూముల్ని అనుకున్నదానికంటే ఎక్కువ రేటుకి అమ్ముకోగలిగారు. వారి మూలంగానే, వారి సంస్థల వల్లనే వారు వేలాది రూపాయల జీతాలు కూడా కళ్ళ జూడగల్గుతున్నారు. కానీ ఆ విషయం నిజాయితీగా ఒప్పుకోవడానికి తెలంగాణవారికి మనసు రాదు.
రిప్లయితొలగించండిఇక్కడ తెలంగాణవారితో మాట్లాడ్డమే అసాధ్యమైపోయింది. చాలా మొండితనం, చండితనం, ద్వేషం, అపనమ్మకం, అనుమానం - ఇవన్నీ మనసులో పెట్టుకుని మాట్లాడుతూ దూషిస్తూంటే - వారి మూర్ఖత్వానికి, అజ్ఞానానికీ ఏం చెప్పాలో, ఎలా కూర్చోబెట్టి వివరించాలో అర్థం కాక మూగబోతున్నాం.
చాలా బాగా వ్రాశారండీ ! నిజమే ఈ తెలంగాణా వాళ్లకి ఎవ్వరితో పోట్లాడలో తెలియదు. ఆంధ్రా వాలా మీద పడుతునారు. ఆ పోరాటమేదో MP ల మీద MLA ల మీద చేస్తే బాగుంటుంది.
రిప్లయితొలగించండిLBS,
రిప్లయితొలగించండిWhat if I say the same to you?
You are just worried and purely talking about Hyderabad only. And they are talking about entire Telangana.
We just realized seriously how non-Telangana rulers attempted to program them. They never learned anything about themselves and their own history in schools. Neither you knew anything about Telangana struggles... from your schooling. Why? It is a conspiracy.
No one want to sell their lands in Telangana - they were forced to do so surrounding Hyderabad because the crops fields stopped yielding due to lack of water resources.
No one hates good people - they hate only those people (like you) who hates Telangana people. Why you are hesitant to accept the truth and keep declining the fact that this region was under oppression for centuries and it continued after Telangana merged with Andhra. They want self governance. You must respect that.
AppaRao Shastri,
These MLAs and MPs are also from Telangana region and are living as secondary citizens in those Houses of state assembly and central parliament. Do you know the history... don't just comment rudimentary.
Please find the facts and then comment. By the way... I am from Gannavaram - my family immigrated to Mancherial in 1975.... I was in 4th class. Due to financial troubles I had to go to local schools. And I literally saw teachers struggle to explain to students why their forefather's brave stories aren't being taught in schools and not included in Texts. The then Chief Minister PV Narsimha Rao attempted to bring land reforms and also established regional committees to self govern their regions. But he was fired by Indira Gandhi and replaced him by Vengal Rao... an immigrant ruler abolished regional committees and unrecognizably favored Andhra region.
So many times local leaders fought - even to an agreement that a Deputy Chief Minister from Telangana if CM is from non-Telangana. It was a conditional agreement during the merger. No one cared. And similar situation with GO610. Do you think these agreements and GOs were issued without MLAs and MPs fighting for... You are wrong my friend. Its you! who need to realize the facts.
Honestly Telangana region's culture is totally different than ours even-though we speak same language. I whole heartily support separate Telangana State. Though I still love Gannavaram. It is okay... as good as I travel to Mahor in neighbor state.
ఆంధ్రోళ్ళు దురాక్రమణదారులే.... ఖచ్చితంగా!!!
రిప్లయితొలగించండినిరూపణలతో సహా తమ సంతోషాల కొరకు ఇతరులకు కలిగే బాధలను లెక్కచెయ్యకుండా ప్రవర్తించే అతి నీచాతినీచమైన కుటిల బుద్ధి కలిగిన దురాక్రమణదారులే ఆంధ్రోళ్ళు.
I am done with this blog!!!
By the way, can any one answer these questions:
http://www.youtube.com/watch?v=3k286v3uLv8
అబ్లు: ఒక దురాక్రమణదారుడి పశ్చాత్తాప రోదన మీది! విని తీరాల్సిందే. ఇతర ప్రాంతాలకు వెళ్ళిన కోస్తా సీమ వాసులందరూ చెడ్డవాళ్ళు కాదు, ఏదో కొందరే దురాక్రమణవాదులు అని కరడుగట్టిన తెలంగాణవాది కూడా అనేమాట! ఆ కొందరిలో మీరూ ఒకరన్నమాట! మీవంటి కొందరి కారణంగానే మొత్తం కోస్తా సీమవాసులందరికీ దురాక్రమణ దారులని పేరొచ్చింది.
రిప్లయితొలగించండిసరే, మీరు అక్కడి వాళ్ళ భూములను దుర్మార్గంగా ఆక్రమించుకుని ఉంటే తిరిగి ఇచ్చెయ్యండి. అదే మీ పాపానికి నిష్కృతి! అంతేగానీ.., మీరు చేసిన తప్పులకు మొత్తం ఆంద్రోళ్ళనూ తిట్టేస్తే మీ పాపం పెరిగిపోతుంది. అసలైనా.., మీలో 'ఆంద్రోళ్ల'లో సాధారణంగా కనబడని తత్వం ఒకటి కనబడుతోంది.. తప్పు మీరు చేసి, మొత్తం 'ఆంద్రోళ్ళం'దరినీ తిడుతున్నారు.. ఎక్కడ నేర్చుకున్నారీ తత్వాన్ని?
అబ్లు కివ్వాల్సిన సమాధానం అయిపోయింది.
-----------
నాకో సందేహం..
తెలంగాణ అభివృద్ధి కాలేదు కాలేదు అని అంటూంటారో పక్క, మరి అదే నోటితో 'ఆంద్రోళ్ళు' మా పట్టణాల కొచ్చి, గ్రామాలకొచ్చి స్థిరపడిపోయి మా భూములను ఆక్రమించుకుంటున్నారు అని అంటూంటారు. అభివృద్ధి చెందిన ప్రాంతాల నుండి, ఏ అభివృద్ధీ లేని ప్రాంతాలకు వెళతారా ఎవరైనా? వెళ్ళినవాళ్ళెవరైనా ఎందుకెళతారు.. అక్కడ కాస్త బాగుపడదామనా? లేక అక్కడి పేదరికంలో కొంత భాగం పుచ్చుకుందామనా?
అన్నట్టు, అబ్లు గారూ, శ్రీధర్ రాజు అని ఒక మిత్రుడు చికాగో నుంచి వ్యాఖ్యానిస్తూంటారు. మీరూ చికాగో నుంచే తిడుతున్నారు గదా.. మీకాయన పరిచయమేనా? :)
రిప్లయితొలగించండిఈ దీక్షలు, రిలే నిరాహారదీక్షలు, ఆమరణ నిరాహారదీక్షలు చేసే రాజకీయ నాయకులకు ఇన్ని రోజులు ప్రజలకు యేం కావాలో పట్టలేదు, గ్రామాల్లో యేం కావాలో పట్టలేదు, నాయకుల అధికారుల అవినీతి పట్టలేదు. కాని ఇప్పుడు ...
రిప్లయితొలగించండిఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ దగ్గర 30చ.కి.మీ.విస్తీర్ణం ఉన్న కేంద్రపాలిత ప్రాంతం యానాం . దాదాపు 30వేల జనాభా.యానాం పర్యాటక ప్రాంతం. యానాం వార్తలు తూర్పుగోదావరి పేపర్లలోనే వస్తాయి.యానాంకు రాజధాని పాండిచ్చేరి సుదూరంగా తమిళనాడులో870కి.మీ దూరంలో ఉంది .యానాం 1954 దాకాభారత్ లో ఫ్రెంచ్ కాలనీగా ఉంది.నేడు పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతంలో భాగం.1954లో లో విమోచనం చెంది స్వతంత్రభారతావనిలో విలీనంచెందినా 1956 లో భాషా ప్రాతిపదికన తెలుగు రాష్ట్రంలో కలవలేదు.1948లో హైదరాబాద్ ను పోలీసు చర్యజరిపి ఇండియాలో కలిపారు.1949 లో అప్పటికి ఒక ఫ్రెంచి కాలనీ గా ఉన్న చంద్రనాగూర్, సమీపంలోని బెంగాల్ రాష్ట్రంలో విలీనం అయింది. కాకినాడ మునిసిపల్ కౌన్సిల్ కూడా యానాన్ని కలపాలని తీర్మానం చేసింది. 870కి.మీ దూరంలోని తమిళ పుదుచ్చేరి నుండి పాలన కష్టంగా ఉంది.పుదుచ్చేరికి యానాం ప్రజల ప్రయాణం ఆంధ్రలోని కాకినాడ నుండి జరుగుతుంది.దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని యానాంలో ఏర్పాటు చేయాలని యానాం కాంగ్రెస్ తీర్మానించింది.ఇండోర్ స్టేడియం,కళ్యాణమండపం,ధవళేశ్వరం-యానాం మంచినీటి ప్రాజెక్టులకు రాజశేఖరరెడ్డి పేరు పెడతామని పుదుచేరి రెవిన్యూ మంత్రి మల్లాడి కృష్ణారావు చెప్పారు. తెలుగుజాతి సమైఖ్యత,భాషాప్రయుక్తరాష్ట్ర ప్రధాన ఉద్దేశ్యం యానాం ఆంధ్రప్రదేశ్ లో కలిస్తే నెరవేరుతుంది.తెలుగుతల్లి బిడ్డలందరూ ఒకేరాష్ట్రంగా ఉంటారు.సమైక్యాంధ్ర కోసం ఇప్పుడు ఉద్యమాలు జరుగుతున్నాయి గనుక భౌగోళికంగా సామీప్యత, 100% తెలుగు ప్రజలున్న యానాం ను ఇప్పటికైనా తమిళ పుదుచ్చేరి నుండి విడదీసి సమైక్యాంధ్రలో కలపాలి.కలిస్తే బాగుంటుందని ఆశ.
రిప్లయితొలగించండిమధ్యలో ఈ రహంతుల్లా గారి యానాం గొడవ ఏమిటండీ బాబూ! ఏ బ్లాగులో చూసినా టపాకు సంబంధం ఉన్నా లేకపోయినా ఈ కామెంటు కనపడుతోంది. స్పామా ! స్కామా! ఆయన అకౌంటు ఎవరయినా "ఫిషింగు" చేసారేమో అనిపిస్తోంది....లేకపోతే కలక్టరుగారేంటి, ఇలా రాయటమేంటి -
రిప్లయితొలగించండిఇంకా బొల్లోజు బాబా గారు "ఇందుకు కలపలేదు" అని రాలేదెందుకో ! :) :) అలిసిపోయారేమో!
అయినా చదువరిగారూ - ఆ తెలంగాణా ఈ రాజకీయ నాయకుల చేతుల్లో వచ్చేదీ లేదు, ఆకులు కాలి, చేతులు పట్టుకున్నా, చేతులు కాలి ఆకులు పట్టుకున్నా - దేనికి నష్టమో తెలంగాణోళ్ళు చెప్పాలె.. :) కాబట్టి ఇటేపు రావటం తగ్గించుకోవాలె అని తీర్మానాలు జరుగుతున్నాయి అని బందిపోటు సమావేశంలో తెలిందిట.. అయ్యా అదీ సంగతి.. :)
కార్తీక్,
రిప్లయితొలగించండిమీ వ్యాఖ్య అద్భుతంగా ఉంది! ఇలాంటి లాజిక్ లకు తెలంగాణా వాదుల వద్ద సమాధానాలుండవు. ఎంత సేపూ "మీరూ మేమూ, మా తల్లి, మీ తల్లి.." ఇదే! సరే, తెలంగాణా అభివృద్ధి చెందలేదు. ఇప్పుడు విడగొడితే ఏ రకంగా అభివృద్ధి చేస్తారు? అనే సమాచారాత్మక ప్రశ్నకు(సవాలు కాదు)జవాబుందా అంటే ఉండదు. "మాది మాకియ్యండి" అంటారు కానీ!
ఆంద్రోల్లు దోచుకున్నారంటారు! శంషాబాదు వద్ద వట్టిపోయిన బీడుభూముల్ని ఎకరం కోట్లలో అమ్ముకుని బాగుపడిందెవరంటే జవాబు చెప్పరు.
సకల ఆంధ్ర ప్రజల మీదా ద్వేషం కక్కడం విషయంలో మాత్రం తాడేపల్లి గారు చెప్పినట్లు చదువుకున్న వాళ్ళూ, నిరక్షరాస్యులు అన్న తేడా లేదు. అంతా ఒకటే! మా తోట మాలి కూడా అడుగుతున్నాడు.."తెలంగాణా వస్తే ఈడికెల్లి ఆంద్రోల్లందర్నీ బగాయిస్తరట, నిజమేనా అమ్మా "అని! అంతగా ఆంద్రోల్లని తరిమి కొట్టాలన్నంత ద్వేషం నూరిపోశారు అందరికీ!
అయ్యా వంశీ గారు,
రిప్లయితొలగించండిచెన్నారెడ్డి పాలించింది 21 నెలలే. 3 ఏళ్ళు కాదు. మద్యలో 7 నెలలు మన రాష్ట్రాన్ని పక్క రాష్ట్ర గవర్నరు పరిపాలించారు.
జలగం తెలంగాణ వ్యతిరేకి కర్కశంగా రామగుండం సామర్థ్యం పెంచడాన్ని అడ్డుకుని నిధులu KTPCకి తరలించిన ఘణత ఆయనదే...
గణాంకాలు సరిచేసుకోండి.
@చదువరి,
రిప్లయితొలగించండిI am from Champaign... not exactly from Chicago but very close compared to the distance from your location in AP.
I may know Sridhar Raju as he frequently participates in Telangana related activities in midwest.
But I wonder why you are asking... do you think he may be influencing my opinions? If so, absolutely no.
ఒక వేళ ఆంధ్ర ప్రదేశ్ విడి పోక పొతే (అశుభం ప్రతిహతమవు గాక) .....మేడి పండులా కనిపిస్తది... మూడు ప్రాంతాలు... వంద రకాల రాజకీయాలు. తెలంగాణ ప్రాజెక్టు లకి పైసలు రావు... ఆంధ్ర ల మాత్రం పుష్కలం నీళ్ళు.. అధికారం చేతిలొ ఉన్న వాళ్ళు ఎలా చెబితే అలా నడుస్తది ఆ స్కోప్ లో ఉన్న వ్య్వస్థ మొత్తం... బినామీ పేర్లతో దొంగ లెక్కలు చేస్తా అంటే చేస్కో...బయటపడితే... దొంగవి.. లేక పొతే నీ మటుకు మాత్రం దొంగవి.. ఇప్పుడు కేంద్ర నిధులు తెచ్చే ఆంధ్ర రాజకీయ నాయకులు.. అప్పుడు కూడ తెచ్చుకోండి.. ఎవరొద్దాన్నారు... కానీ...మా నీళ్ళను న్యాయ పరం గా రావాల్సిన వాటా పొందటానికి నీటి ప్రాజెక్టులు కట్టుకుంటాం... మా కరెంటు కేంద్రాలను అభివ్రుద్ది చేసుకుంటాం.. ఎలా విడి పొయినా... మానసిక దూరం మాత్రం తగ్గదు..ఎందుకంటే.. అప్పుడు మేము మీకు తల నొప్పి లా అవుతాము కదా... మహా రాష్ట్ర కర్ణటక ల లాగా నీళ్ళు నీళ్ళు అంటూ మాతో... యుద్ధం చేయాల్సి వస్తది కదా... విడి పోతే వచే సమస్యలు ఇలాంటివే కదా..?? అనుద్కే కదా ఆంధ్రా వాళ్ళంతా వ్యతిరేఖించేది... ఒక వేళ విడిపోక పోతే.. (అశుభం ప్రతిహతమవు గాక) మీరు మాకు కొరక రాని కొయ్య లా తయారవుతారు... అప్పుడు మాకు తలనొప్పి...
రిప్లయితొలగించండిఇవీ కారణాలుః
రిప్లయితొలగించండి*కోస్తా ఆంధ్రుల భయాలు
పూర్తిగా అభివృద్ధి చెందిన తెలంగాణా ఇప్పుడు విడగొడితే కోస్తా వనరులన్నీ అటే వెళ్తాయి. దీనివల్ల కోస్తా ప్రాంతంలోని రైతులకు కష్టాలు తప్పవు, కోస్తాంధ్రకు ప్రధాన జలవనరులు కృష్ణా, గోదావరి జలాలు. సమైక్యాంధ్ర నుంచి తెలంగాణాను వేరుచేస్తే కోస్తాఆంధ్ర ఎడారిగా మారుతుంది. తెలంగాణా విడిపోతే ఆ ప్రాంత ప్రజలు కోస్తాంధ్రకు రావాల్సిన నీటిని అడ్డుకుంటారు, ఫలితంగా వ్యవసాయం, దాని అనుబంధ పరిశ్రమలు మూతపడి నిరుద్యోగం పెరుగుతుంది. ఖమ్మం జిల్లాలో 256 గ్రామాలు సుమారు లక్ష ఎకరాలు మునిగిపోతాయనే సాకుతో పోలవరం ప్రాజెక్టును కూడా అడ్డుకుంటారు. విద్యుత్తు సరఫరాలో కూడా అంతరాయాలు ఏర్పడతాయి, తెలంగాణాలో అత్యధిక సంఖ్యలో ఉన్న సీమాంధ్ర ఉద్యోగులు తిరిగి తరలివస్తారు. కోస్తాంధ్రకు ఆదాయాలు కూడా తగ్గుతాయి.హైదరాబాదులో అధిక ధరలకు కొని కూడబెట్టుకున్న కష్టార్జిత ఆస్తులు చౌకగా అమ్ముకోవాల్సివస్తుంది.
*తెలంగాణా వాదుల వాదనలు
ఇది ఆత్మ గౌరవ సమశ్య.మమ్మల్ని మేమే పరిపాలించుకుంటాము.పెద్దమనుషుల ఒప్పందాన్ని ఏనాడూ ఆంధ్రులు అమలు చేయలేదు.ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వటంలేదు.కృష్ణా గోదావరి నదుల పరివాహక ప్రాంతం 80 శాతం మాదైతే 88 శాతం నీళ్ళు వాళ్ళవి.కరెంటు70 శాతం ఉత్పత్తి మాది. 80 శాతం పంట ఋణాలు వాళ్ళవి.మూడొంతుల ఉద్యోగాలు వాళ్ళవి.తెలంగాణా ఆంధ్రుల వలస కేంద్రంగా మారింది.ఇక్కడ సెటిల్ అయిన ఆంధ్రవాళ్ళు ఇక్కడే ఉండి పోటీ చేసి గెలవండి..పొట్టకూటికోసంవచ్చిన వాళ్ళను వెళ్ళీపొమ్మనము గానీ మా పొట్ట కొట్టేటోళ్ళనే వెళ్ళిపొమ్మంటున్నాం.శాంతియుతంగా అన్నదమ్ముల్లా విడిపోదాం.
*ఐఏఎస్ ఐపిఎస్‌ల భయం
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయితే ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు చెందిన వారందరిలో ఎక్కువ శాతం కొత్తగా ఏర్పాటు అయ్యే ఆంధ్ర రాష్ట్రా సర్వీసుల్లోకి వెళ్ళాలి.ఒక వేళ గ్రేటర్ హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించినట్లయితే కేంద్ర సర్వీ సులకు చెందిన అధికారులను మూడుగా విభజిస్తారు.హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా గుర్తించినట్లయితే గ్రేటర్ హైదరాబాద్ పరిధి లోకి వచ్చేందుకు కేంద్ర సర్వీసు అధికారులు విముఖత చూపుతున్నారు. ఎందుకంటే యూనియన్ టెరిటరీ కేడర్‌లోకి వచ్చినట్లయితే ఇకపై వారి బదిలీలన్నీ కేంద్ర పాలిత ప్రాంతాలకే పరిమితమవుతాయి. దీని వల్ల హైదరాబాద్ యూనియన్ టెరిటరీ(కేంద్ర పాలిత ప్రాంతం) నుంచి వేరొక చోటకు బదిలీ కావాలంటే మరొక కేంద్ర పాలిత ప్రాంతానికే బదిలీ కావా ల్సి ఉంటుంది.
*తెలుగు సినీ పరిశ్రమ భయం
మద్రాసు నుండి హైదరాబాద్‌కు తరలివచ్చిన ఆంధ్ర ప్రాంతానికి చెందిన నిర్మాతలు రామకృష్ణ సినీ స్టుడియో, అన్నపూర్ణ సినీ స్టుడియో, రామానాయుడు స్టుడియో, పద్మాలయా స్టుడియో, రామోజీ ఫిలింసిటీ స్టుడియోలు నిర్మించారు. కె.రాఘవేంద్ర రావు, అక్కినేని నాగార్జునకు ప్రభుత్వం స్థలం కేటాయించింది. పద్మాలయా స్టుడియో లోని కొంత భాగాన్ని ఇతరులకు విక్రయించిన వ్యవహారం పై టిఆర్‌ఎస్ కోర్టుకెళ్ళింది. తమ ప్రాంతంలో పేదలకు పంపిణీ చేయవలసిన భూములను ఆంధ్రా ప్రాంతానికి చెందిన సినీవర్గాలకు ఇచ్చారన్న వివాదం మొదలయింది.
Jalagam vengalarao came from sreekakulam. thats fine. but where did K.C.R came from? vizayanagaram.
రిప్లయితొలగించండిjanalu rendu rakaalu boss. dobbe vaadu dobbichukune vaadu. dobbe vadiki region, religion ,caste ivemi vundav. dobbichukune vadiki ivanni kavali.