పదునైన ఆలోచనాశక్తి, ఆలోచనలను ఆచరణలో పెట్టే నేర్పూ కలిగిన నాయకత్వం ఏ సంస్థనైనా విజయవంతంగా నడిపిస్తుంది. స్వచ్ఛంద సంస్థల నాయకత్వాలకు ఈ లక్షణాలు మరింత ముఖ్యం. పని మీదే శ్రద్ధ పెట్టి, కార్యకర్తలను ఏకోన్ముఖంగా నడిపించగలగడం స్వచ్ఛంద సంస్థల నాయకత్వానికి ఒక సవాలు. e-తెలుగు అలాంటి స్వచ్ఛంద సంస్థే! e-తెలుగు కార్యవర్గం అటువంటి సవాలును స్వీకరించిన నాయకత్వమే!
అంతర్జాలంలో తెలుగు వెలగాలి అనే లక్ష్యం e-తెలుగును నడిపించే చోదకశక్తి. కేవలం రెండు మూడు పదుల సభ్యులు, మరో రెండు మూడు డజన్ల ఔత్సాహికులు దాని ఆస్తి. ఈ ఆస్తిని పెట్టుబడిగా పెట్టి, అద్భుతాలు చేయబూనిన సంస్థ e-తెలుగు. అద్భుతాలు చేసింది కూడా. పదిరోజుల పాటు పుస్తక ప్రదర్శనలో స్టాలును నిర్వహించి, వేలాది కరపత్రాలను, వందలాది సీడీలను ప్రజలకు పంచి, అంతర్జాలంలో తెలుగును వేలాదిమందికి పరిచయం చేసింది. ఈ పనిలో శక్తివంచన లేకుండా కృషిచేసిన e-తెలుగు కార్యకర్తల కార్యకుశలత వేనోళ్ళ కొనియాడదగినది. నిస్వార్థంగా కేవలం తెలుగుపై అభిమానంతో ఈ యజ్ఞంలో పాల్గొన్న ఔత్సాహికులందరినీ పేరుపేరునా అభినందిస్తున్నాను.
ఈ కార్యక్రమం మొత్తాన్ని జయప్రదంగా నడిపించడానికి, నేపథ్యంలో ఒక యంత్రం రేయింబవళ్ళూ పనిచేసింది. అదే e-తెలుగు కార్యవర్గం. అనుకున్న పనిలో అనేక అడ్డంకులను ఎదుర్కొని కూడా దేన్నీ బయటకు కనబడనీయకుండా, అంతా సజావుగా నడిపిన e-తెలుగు కార్యవర్గ సభ్యులను అభినందిస్తున్నాను. కార్యవర్గ సభ్యులు కలసికట్టుగా ఓ చక్కటి విజయగాథను రచించారు.
e-తెలుగు కార్యవర్గానికి చక్కటి ఆలోచనాపటిమతో పాటు, చురుకైన కార్యాచరణశక్తి కూడా ఉందని ఈ స్టాలు విజయంతో నిరూపించారు. ఈ ఊపుతో 2010లో మరిన్ని కార్యక్రమాలను చేపట్టి, మరిన్ని విజయాలను సాధించాలని కోరుకుంటున్నాను.
మంచివార్త తెలిపారు. సమైఖ్యభావన, సమిష్టికృషి కలబోత. అంకురం సినిమాలో పాట
రిప్లయితొలగించండి"ఎవరో ఒకరు... ఎపుడో అపుడు
నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు
అటో ఇటో ఎటో వైపు......
మొదటి వాడు ఎప్పుడూ ఒక్కడే మరి
మొదటి అడుగు ఎప్పుడూ ఒంటరే మరి
వెనుక వచ్చు వాళ్ళకు బాట అయినది .."
ఇప్పటి రెండు మూడు పదుల సభ్యులు సంఖ్య ఇకపై వందలు కావచ్చునని ఆశిస్తూ..
e-తెలుగు కార్యకర్తలందరికీ ఈ సందర్భంగా నా అభినందనలు
రిప్లయితొలగించండిమీ సభ్య్లందరికి నా హృదయపూర్యక అభినందనలు మరియు కృతఙ్ఞతలు. మీరు చేస్తున్న ఈ కృషి వలన తెలుగు అంతర్జాలం బాగా వ్యప్తి చెందింది.
రిప్లయితొలగించండికాముధ
నేను కూడ అభినందుస్తున్నా నధ్యక్షా
రిప్లయితొలగించండిఇ తెలుగు కార్యవర్గ సభ్యులకు నా హార్దిక అభినందనలు.
రిప్లయితొలగించండిe-తెలుగు సభ్యులకు, ఔత్సాహికులకు అభినందనలు.
రిప్లయితొలగించండిమీరు కష్టపడి మాకు పూలబాటలు వేసారు.మేము హాయిగా సాగిపోతున్నాం.మీకు మేమెంతో ఋణపడిఉన్నాము.
రిప్లయితొలగించండిe-తెలుగు కార్యకర్తలందరికీ నా అభినందనలు
రిప్లయితొలగించండిe-తెలుగు కార్యకర్తలందరికీ ఈ సందర్భంగా నా అభినందనలు
రిప్లయితొలగించండి