9, డిసెంబర్ 2009, బుధవారం

తెలంగాణపై కాంగ్రెసు సందిగ్ధ ప్రకటన

తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ మొదలు పెడతాం. శాసనసభలో సముచితమైన తీర్మానాన్ని ప్రవేశపెడతాం. అని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. సాయంత్రం నుంచీ జరిగిన కోర్ కమిటీ, ఇంకా ఇతర సమావేశాల తరవాత చిదంబరం ఈ సంగతి ప్రకటించాడు. ఉద్యమకారుల మీద పెట్టిన కేసులన్నిటినీ ఎత్తివేస్తామనీ ప్రకటించాడు.


ప్రక్రియ మొదలు పెడతాం అన్నాడు గానీ, ఎప్పుడు మొదలౌతుందో చెప్పలేదు. సముచితమైన తీర్మానం (ఎప్రాప్రియేట్ రిసొల్యూషన్) అని అన్నారుగానీ, ఖచ్చితంగా ఎలా ఉంటుందో చెప్పలేదు. తెలంగాణ పట్ల కాంగ్రెసు ధోరణిని దృష్టిలో ఉంచుకుని చూస్తే ఈ వ్యవహారాలు ఎలా ఉండబోతాయనే విషయము, ఎప్పుడు జరగబోతాయనే సంగతీ సందేహాస్పదమే!

మొత్తమ్మీద ఈ ప్రకటన ప్రధానంగా కేసీయారు దీక్షను విరమింపజేసేందుకు ఉద్దేశించినట్టు కనబడుతోంది. దీక్ష విరమించేందుకు అవసరమైన ఒక కారణాన్ని కాంగ్రెసు చూపించినట్టే కనబడుతోంది.

దీక్ష ద్వారా ప్రస్తుతానికి కేసీయారు విజయాన్ని సాధించినట్టే. ఆయన్ను అభినందించాలి. మిగతా ప్రాంతాల స్పందన ఎలా ఉంటుందో చూడాలి.

13 కామెంట్‌లు:

  1. రేపటి జే.ఏ.సి అసెంబ్లీ ముట్టడిని, కే.సీ.ఆర్ ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఓ కంటి తుడుపు ప్రకటన చేసినట్టుందండీ..

    రిప్లయితొలగించండి
  2. తూతూ మంత్రం దీక్షకి తూతూ మంత్రం ప్రకటన. ఏదో వంకతో దీక్ష విరమించటానికి అయ్యవారు సిద్ధంగా ఉన్నారు, ఆ వంక అధిష్టానం వారు చూయించారు.

    అసలు, నాకో సందేహం. ఏ తండ్రైనా చస్తానంటూ తిండి మానేస్తే వాళ్ల కుటుంబం చూస్తూ ఊరుకుంటుందా - అదెంత గొప్ప కారణమైనా? కేసీయార్ నిజంగా పన్నెండు రోజులు తిండి మానేసినోడిలా ఉన్నాడా, ఆ ఫోటోల్లో?

    రిప్లయితొలగించండి
  3. @ అబ్రకదబ్ర
    నిరాహారదీక్ష మీద డవుంటేంటండీ. గడ్డం పెరిగిందిగా!

    రిప్లయితొలగించండి
  4. జై తెలంగాణ జై జై తెలంగాణ

    ఇప్పుడే సంబరపడవద్దు - ఎన్ని తిరకాసులు పెట్టాలో అన్నీ పెడతారు. వాటన్నిటిని అడ్డుకుని నిలిచే ధైర్యం, శక్తి, ఓర్పు ప్రసాదించాలని తెలంగాణ ప్రజలందరిని కోరుకుంటున్నాను. ఈ ఉద్యమానికి ఊపిరి పోసిన కెసిఆర్ కు మరియు అర్థవంతంగా మలచిన విధ్యార్థులకు, మేధావులకు నా విజ్ఞప్తి ఇదే.

    జై తెలంగాణ జై జై తెలంగాణ
    జై తెలంగాణ జై జై తెలంగాణ
    జై తెలంగాణ జై జై తెలంగాణ

    రిప్లయితొలగించండి
  5. "ఇప్పుడే సంబరపడవద్దు" సమైక్య తెలంగాణా వాదులు, ముందు ముందు మా హైదరాబాద్ వోళ్ల మనోభావాలు, మా దానం, ముఖెష్ ల మనోభావాలు తెలుసుకొన్నాక సంబడాలు సేసుకోండి!!!

    గడ్డెం పెరిగింది కాబట్టి నిరాహార దీక్ష మీద డవుట్ వద్దు అంటారు, సమైక్య హైదరాబాద్ రాష్ట్ర వాదిగారూ :)

    రిప్లయితొలగించండి
  6. @క్రిష్ణ
    అంతే కదా గడ్డం ఎన్ని సెంటిమీటర్లు పెరిగిందన్నదే దీక్షకి కొలబద్ద.

    రిప్లయితొలగించండి
  7. @abrakadabra: baga chepparandi..........
    okavela kharmakaali telangana vasthe "ayyaaa manchineellu....... antu maharashtra, karnatakalanu, ayyaa budget ani kendranni adukkovalsindega..........

    రిప్లయితొలగించండి
  8. సందిగ్ధ ప్రకటన ? కాదేమో నండి, కాకపొతే ఇప్పుడే ఎన్నికలు లేవు కాబట్టి ఒక రెండు సంవత్సారాలు సాగ దీస్తారేమో అంటే ఈ లోపు తెలంగాణా కాంగ్రెస్స్ నాయకులు తమ ప్రాభవాన్ని పెంచుకోవచ్చు ఎటు అప్పటికి కెసిఆర్ గారు ఉండరు (ఈ మాట తప్పు అని నేననుకోవటం లేదు పెద్ద పెద్ద మనవ హక్కుల సంఘాల వారే YSR చనిపోయినప్పుడు కవితన్యాయం అని నిర్లజ్జ గా అన్నారు నేనెంత?) కాబట్టి కాంగ్రెస్స్ కే గెలిచే అవకాశాలు . కాకపొతే కోస్తాంద్ర , రాయలసీమ ప్రజలు మాత్రం మళ్ళీ మోసపోయారు .
    చరిత్ర చరిత్ర అని తెగ తవ్వి తీసి ఇప్పుడు పండగలు చేసుకోతున్న తెలంగాణా వాడు ఒక్క సారి ఇప్పుడున్న మీ ఆవేశాలు తగ్గించుకొని నిజాం భాధలు పడలేక కోస్త జిల్లాలకు పరిగిడితే తమను ఎవరు ఆదుకోన్నారో ఒక్క గుర్తు చేసుకుంటే బాగుంటుందని నా మనవి .

    రిప్లయితొలగించండి
  9. నా ఫై కామెంట్ లో తెలంగాణా వాడు కాదు తెలంగాణా వారు

    రిప్లయితొలగించండి
  10. ఏమైనా కర్ర విరక్కుండా పాము చావకుండా ఇప్పటికి ఈ గండం గడిచింది అంతే!

    రిప్లయితొలగించండి
  11. ఒక వేళ నిజంగా తెలంగాణ వస్తే ఎవరైతే అందరూ పెట్టుబడి పెట్టి పరిశ్రమలు స్థాపించారో వాటన్నిటినీ వారి వారి ప్రాంతాలకు తరలిచవలసిన అవసరం ఉంది. ఇక సామాన్య ప్రజల విషయానికి వస్తే, వారు చెమటోడ్చి సంపాదించిన డబ్బును ఖర్చుపెట్టి కొనుక్కున్న ఆస్తుల సంగతి ప్రశ్నార్ధకంగా ఉంది. బినామీలతోపాటు సామాన్య ప్రజల ఆస్తులకు కూడా ముప్పు పొంచి ఉంది. విడిపోయిన తరువాత ఎదురయ్యే తీవ్ర పరిణామాలను తె.రా.స. వారు గుర్తించినట్టు లేదు. ప్రతి విషయంలో కేంద్ర ప్రభుత్వం దగ్గర యాచించాలి.పార్లమెంటు సభ్యులు తగ్గిపోతారు. ఆరేడుగురు సభ్యులతో వెళ్ళి ఏం అడుగుతారు? ఐకమత్యంగా ఉండనిదే ఏమీ సాధించలేమన్న విషయం గుర్తుంచుకోవాలి.

    రిప్లయితొలగించండి
  12. Annaiah meru annatte dekashki kolabadda gaddam anntayite andau potti sriramulu chesindi uttadena .maakayite Adi Goppa Udyamga kanipistundi .mari meku elakanipistundo maku teliyadu..Ayya mekandariki telaya gesedi amitante Idi K.C.R Udyamam Kadu Telangana udayamam..Idi Meeru Marokasri gurthunchukovalsina vishayam

    2.nijam kalam nati vishayam pakkana bedithe prastuta paristi tesukonte Entha Mandi C.M lu Enni Telangana Dist lanu ,kosta andra urban areas ni entha abivruddi paricharo roju manam chustune unnam..

    Ayya lagada pati garu chesedi samikyandra udyamam kadu binami astula udyamam..gurtunchu kovalasindi ga ma manavi...

    రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు