పదునైన ఆలోచనాశక్తి, ఆలోచనలను ఆచరణలో పెట్టే నేర్పూ కలిగిన నాయకత్వం ఏ సంస్థనైనా విజయవంతంగా నడిపిస్తుంది. స్వచ్ఛంద సంస్థల నాయకత్వాలకు ఈ లక్షణాలు మరింత ముఖ్యం. పని మీదే శ్రద్ధ పెట్టి, కార్యకర్తలను ఏకోన్ముఖంగా నడిపించగలగడం స్వచ్ఛంద సంస్థల నాయకత్వానికి ఒక సవాలు. e-తెలుగు అలాంటి స్వచ్ఛంద సంస్థే! e-తెలుగు కార్యవర్గం అటువంటి సవాలును స్వీకరించిన నాయకత్వమే!
29, డిసెంబర్ 2009, మంగళవారం
27, డిసెంబర్ 2009, ఆదివారం
తెలంగాణవాదుల దొంగ లెక్కలు
ఎప్పుడో ఐదారు దశాబ్దాల కిందట.. పోలీసు చర్య తరవాత హైదరాబాదు రాష్ట్రం ఏర్పడింది. ఆ తరవాత ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. రెండు రాష్ట్రాలూ కలిసి ఒకే రాష్త్రంగా ఏర్పడాలని పెద్దలు కోరుకున్నారు. హైదరాబాదు రాష్ట్ర శాసనసభ మెజారిటీతో ఈ ప్రతిపాదనను ఆమోదించింది. ఆ విధంగా ఏకమయ్యాక, తెలంగాణకు అనేక అన్యాయాలు జరిగాయనే ఉద్దేశంతో, విడిపోవాలనే ఉద్యమం మొదలెట్టారు, తెలంగాణవాదులు. 1969లో పెద్ద ఉద్యమమే చేసారు. అప్పటికి ఆ ఉద్యమం చల్లారిపోయింది. ఆ తరవాత, ఈ నలభై యేళ్ళలోనూ అనేక మార్పులొచ్చాయి, అభివృద్ధి జరిగింది. అయితే విడిపోవాలనే తెలంగాణవాది కోరిక అలాగే ఉండిపోయింది. తెలంగాణవాదుల కసి ('ఆంద్రోళ్ళు' అభివృద్ధి చెందారు, మేం చెందలేదు అనే కసి), కాంక్ష (పదవీ కాంక్ష) అలాగే ఉండిపోయాయి. కానీ ఈ కారణాలను బైటకు చెప్పుకోలేరు. అంచేత అభివృద్ధి జరగలేదని చెబుతూ రకరకాలుగా అబద్ధాలు వ్యాప్తి చేస్తున్నారు. చేస్తూ, ప్రత్యేకరాష్ట్ర ఉద్యమం చేస్తున్నారు.
24, డిసెంబర్ 2009, గురువారం
చవకబారున్నర విశ్లేషకుడు
ఆ మధ్య హై.లో సినిమా షూటింగుల మీదబడి ధ్వంసం చేసారు ముష్కరులు. మనోజ్ సినిమా షూటింగు సంఘటన పట్ల స్పందనగా మోహన్‌బాబు ఘాటుగానే మాట్టాడాడు. ఆ తరవాత అల్లు అర్జున్ సినిమా షూటింగు మీద కూడా దాడి జరిగింది.
మన టీవీలవాళ్ళకు ఘంటా చక్రపాణి అనే నిలయ విద్వాంసుడి లాంటి విశ్లేషకు డొకాయనున్నాడు. దాడి విషయమ్మీద ఓ టీవీలో మాట్టాడుతూ -
మన టీవీలవాళ్ళకు ఘంటా చక్రపాణి అనే నిలయ విద్వాంసుడి లాంటి విశ్లేషకు డొకాయనున్నాడు. దాడి విషయమ్మీద ఓ టీవీలో మాట్టాడుతూ -
ఇక సంప్రదింపులట!
2012 సినిమాలో కాబోలు.. భూమి ధ్రువాలు మారిపోతాయంట. ఉత్తర దక్షిణ ధ్రువాలు అటుదిటూ ఇటుదటూ కావడంతో ప్రళయం జరుగుతుందట. అలా ఎందుకు జరిగిందో కారణం నాకు తెలవదు.
2009 డిసెంబరు 23న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇలాంటి ధ్రువమార్పిడే జరిగింది. కోస్తా, సీమల్లో ఉద్యమాగ్ని చప్పున చల్లారిపోయి, తెలంగాణలో గుప్పున మంటలెగసాయి. కారణం మనందరికీ తెలుసు. కేంద్రం చేసిన మరో ప్రకటనతోఈ ధ్రువమార్పిడి జరిగింది. ఆంధ్రప్రదేశాన ఇలా జరగడం ఇది రెండో సారి. మొదటిసారి డిసెంబరు 9 న - తెల్లారితే పదో తేదీ అనగా - జరిగింది.
2009 డిసెంబరు 23న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇలాంటి ధ్రువమార్పిడే జరిగింది. కోస్తా, సీమల్లో ఉద్యమాగ్ని చప్పున చల్లారిపోయి, తెలంగాణలో గుప్పున మంటలెగసాయి. కారణం మనందరికీ తెలుసు. కేంద్రం చేసిన మరో ప్రకటనతోఈ ధ్రువమార్పిడి జరిగింది. ఆంధ్రప్రదేశాన ఇలా జరగడం ఇది రెండో సారి. మొదటిసారి డిసెంబరు 9 న - తెల్లారితే పదో తేదీ అనగా - జరిగింది.
19, డిసెంబర్ 2009, శనివారం
రాయలవారికి బహిరంగలేఖ!
మొత్తమ్మీద డాక్టరు గారు మళ్ళీ మనలోకంలో పడ్డారు. ఎటొచ్చీ.. 'నేజెప్పేది వినండి, మీరేదైనా చెప్పాలనుకుంటే పోయి మీమీ బ్లాగుల్లో ఏడవండి, ఇక్కడ మీ రాతలకు స్థానం లేదు అని అంటున్నారు.' సరే అలాక్కానివ్వండి సార్! కానీ, డాక్టరు గారూ, ఓటి గమనించారా..? మీకు రాయలంటే అభిమానం. మీ బ్లాగుకు ఆయన పేరే పెట్టుకున్నారు. ఆయనో సమైక్యవాది. -పోనీ విస్తరణవాది అనుకుందాం. మీరు మాత్రం విభజనవాది! రాయలు ధర్మం తెలిసినవాడు, గుర్రాలమ్ముకుందామని వచ్చి గొడవలు పెట్టుకున్నవాళ్లను కూడా సభకు రానిచ్చి, వాళ్ళు చెప్పింది విన్నాడంట. మీరేంటి సార్,
16, డిసెంబర్ 2009, బుధవారం
'ఆంద్రోళ్ళు' దురాక్రమణవాదులా?
తెలంగాణ ఎందుకు అని అడిగితే నీళ్ళు, నిధులు, నియామకాల కోసం అని సమాధానం వస్తుంది. ఇంకోటి కూడా వినవస్తుంది.. దాడి, దోపిడీ, దురాక్రమణలను ఎదుర్కొనేందుకు అని. సంస్కృతి మీద దాడి, నిధుల దోపిడీ, ఆస్తుల దురాక్రమణలను ను ఎదుర్కొనేందుకు అని వీటికర్థం. ఈ రెండో సెట్టు సరిగ్గా ఇదే కాకపోవచ్చు, నేను పొరపాటు పడి ఉండవచ్చు. కాస్త అటూ ఇటూగా ఇలాగే ఉంటది.
14, డిసెంబర్ 2009, సోమవారం
కొందరు తెలంగాణ వాదుల అబద్ధాలు
తెలంగాణ ఎందుకు వేరు పడాలి అని ఎవరైనా తెలంగాణ వాదిని అడిగి చూడండి.. ఓ అరడజను లింకులు మన మొహాన పడేసి పోతారు. తెలంగాణ గ్రామాల్లో ఛిద్రమౌతున్న జీవితాలను చూడండి అంటూ భావోద్వేగాన్ని ఒలకబోస్తారు. మా ప్రాంతాన్ని దుర్మార్గంగా ఆక్రమించారు ఆంద్రోళ్ళు అని అంటారు, అక్కడికేదో కోస్తా సీమల వాళ్ళు వీళ్ళ పొలాలను కొనుక్కోకుండా కబ్జా చేసేసుకున్నట్టు! ఇంకా ఇలాంటివే బోలెడు కన్నీటి గాథలు చెప్పుకుంటూ పోతారు. ఎంతలా చెబుతారంటే.., అది నిజమే కాబోలునని జనం అనుకుంటారు. పైగా.., అన్నదమ్ముల్లా విడిపోవాలంట!
9, డిసెంబర్ 2009, బుధవారం
తెలంగాణపై కాంగ్రెసు సందిగ్ధ ప్రకటన
తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ మొదలు పెడతాం. శాసనసభలో సముచితమైన తీర్మానాన్ని ప్రవేశపెడతాం. అని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. సాయంత్రం నుంచీ జరిగిన కోర్ కమిటీ, ఇంకా ఇతర సమావేశాల తరవాత చిదంబరం ఈ సంగతి ప్రకటించాడు. ఉద్యమకారుల మీద పెట్టిన కేసులన్నిటినీ ఎత్తివేస్తామనీ ప్రకటించాడు.
7, డిసెంబర్ 2009, సోమవారం
బాబ్రీకట్టడపు కూల్చివేత వార్షికోత్సవం
పురుషోత్తముడి గుడిని కూల్చేసి మసీదునొకదాన్ని కట్టాడో దురాక్రమణదారు. తన జాతి వారసత్వంపై మక్కువ, గర్వమూ ఉన్న ఏ స్వతంత్ర ప్రభుత్వమైనా ఆ కట్టడాన్ని పడేసి మళ్ళీ గుడి కట్టుకుంటుంది. ఎందుకంటే అది జాతి గౌరవంతో ముడిపడి ఉన్నది కాబట్టి. ఎంచేతో మన ప్రభుత్వాలు ఆ పని చెయ్యట్లేదు. మరి ఇవి ప్రభుత్వాలు కావో, లేక వాటికి ఈ జాతి వారసత్వం పట్ల గౌరవం లేదో!! ప్రభుత్వాలు ఎలాగన్నా పోనీండి.., ఆ పనేదో తామే చేసుకోవాలనుకున్నారు, హిందువులు. ఆ పనిలో సగభాగం పూర్తై మరో ఏడాది గడిచిపోయింది. గుడి కట్టే కార్యక్రమం మాత్రం ఇంకా మొదలు కాలేదు.
2, డిసెంబర్ 2009, బుధవారం
బలవన్మరణ దీక్ష
పులి మీద స్వారీ చెయ్యడానికి పూనుకుంటే మళ్ళీ దిగే వీలుంటుందో ఉండదోనని ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలంట. లంచావతారం సినిమాలో కాబోలు.. దాసరి చెబుతాడు, లంచం తీసుకోవడం పులిమీద స్వారీ లాంటిదని. స్వారీ మొదలెట్టడమే మన చేతిలో ఉంటుంది, దిగడం మనవల్ల కాదు. ఆమరణ నిరశనదీక్షలు కూడా అలాంటివేనని ఇప్పుడు తోస్తోంది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)
సంబంధిత టపాలు
loading..