16, నవంబర్ 2006, గురువారం

అనుకోకుండా, యాదృచ్ఛికంగా, కాకతాళీయంగా...

జీవితంలో అనుకోకుండా కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఎవరో కావాలని, మంచి ప్రణాళికాబద్ధంగా చేసినట్లుగా ఉంటాయి. కొన్ని సంతోషంతో గుండె ఝల్లుమనిపిస్తాయి, మరికొన్ని చెంప ఛెళ్ళుమనిపిస్తాయి. ఈ రెండో రకం యాదృచ్ఛికాలు బహు ప్రమాదకరమైనవి. ఏదో కాకతాళీయంగా జరిగాయిలే అని అనుకోకపోతే నిదరపట్టదు మనకు..

నా బ్లాగులోదే ఒక ఉదాహరణ రాస్తానిక్కడ..

"తెలుగు, ఆంధ్రం - కనకదుర్గ గారి అబద్ధాలు, దూషణలు" అనే నా గత జాబుకు కొన్ని స్పందనలు వచ్చాయి. వాటిలో మొదటి రెంటినీ చూద్దాం..
మొదటిది..
"చాలా బాగా వ్రాశారు, ఈ రచనతో కనకదుర్గ గారు మూర్ఖత్వానికి ఒక ఉదాహరణ అయ్యారు. అయినా ఆంధ్రజ్యోతి సంపాదకులు యధవలు కాబట్టె ఇలాంటి మూర్ఖుల రచనలు ప్రచురిస్తున్నారు."

ఇక రెండో వ్యాఖ్య చూడండి.

"అంధ్ర జ్యోతికి పంపండి. ఈ ప్రతిస్పందనను తప్పక అచ్చేసుకొంటారు." :-((

ఈ రెండు వ్యాఖ్యల్నీ ఒక్కసారే చూసాను. మొదటిది చూసాక సహజంగానే సమ్మగా అనిపించింది. రెండోది చూడగానే కళ్ళు బైర్లు కమ్మాయి. ఈ రెండు స్పందనల మధ్య తేడా కేవలం రెండే నిమిషాలు కాబట్టి అవి కాకతాళీయంగా రాసిన వ్యాఖ్యలేనన్న విషయం అర్థమై, ఉపశమనం కలిగింది.

అందుకే నిదురపోగలిగాను రాత్రి.

7 కామెంట్‌లు:

  1. అరే! మీరు చెప్పేదాక ఈ రెండు సందేశాల మధ్య ఇంత వైరుధ్యముందని గమనించ లేకపోయాను. మీ బ్లాగు పూర్తిగా చదివాక మనసారా నవ్వా.

    రిప్లయితొలగించండి
  2. నిజమే నాకూ ఇది కనిపించలేదు :-) తమాషాగా ఉంది.

    రిప్లయితొలగించండి
  3. చదువరి గారు...మీ వ్యాసం మొత్తం చదివా..ప్రతి స్పందనలతో సహా..కానీ మీరు రాసినాక గానీ తట్టలేదు నాకు...వీటిలో ఇంత అర్థం దాగుందని..మీ సమయ స్ఫూర్తి,చతురత అమోఘం..ఈ మధ్య కాలం లో మీ బ్లాగు చూడని రోజు లేదు..

    రిప్లయితొలగించండి
  4. మీ తార్కిక, సునిశిత దృష్టి కి జోహార్లు. రెండూ వేర్వేరు వాళ్ళు వ్రాసినవి కాబట్టి, మీరు హాయిగా నిద్రపోవచ్చు.

    రిప్లయితొలగించండి
  5. ఇది చదవండి

    http://www.andhrajyothy.com/mainshow.asp?qry=/2006/nov/20vividha4

    రిప్లయితొలగించండి
  6. రావుగారు, శోధన గారు, శ్రావణి గారు, రాధిక గారు, సత్యసాయి గారు.. మీకందరికీ కృతజ్ఞతలు. సుధాకర్ గారు, లింకిచ్చినందుకు కూడా! అక్కడి రెండు జవాబులు కూడా చాలా హుందాగా ఉన్నాయి.

    రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు