30, అక్టోబర్ 2011, ఆదివారం

బ్లాగుల / సంకలినుల ద్వారా డబ్బు సంపాదించుకోవడం ఎలా?

మొన్న నేను బ్లాగరులో ఒక చిన్న పొరపాటు పని చేసాను. వేద్దామనుకున్న టపాతో పాటుగా, చిత్తుప్రతుల్లో ఉన్న మరో టపాను - ఇప్పుడప్పుడే వెయ్యదలచుకోనిది-  కూడా ప్రచురించేసాను. అనుకోకుండా జరిగింది. అడెడె.. అనుకుని వెనువెంటనే, దాదాపు అరనిముషం లోపే, దాన్ని ’అ’ప్రచురించేసాను, తిరిగి చిత్తుప్రతుల్లోకి పంపేసాను. ఎందుకైనా మంచిదని హారానికి వెళ్ళి చూసాను. అక్కడ చూపించలేదు. మాలిక లోనూ చూసాను, అక్కడా లేదు. కూడలిలోను, జల్లెడలోనూ రాలేదు.

నిన్న సంకలిని చూసాను. ’నెచ్చెలి’ గురించి రాసారు గదా.. ఏంటో చూద్దామని వెళ్ళాను. అక్కడ చూస్తే నేను అప్రచురించేసిన టపా ఉందక్కడ. ఆశ్చర్యపోయాను.  మిగతా కూడళ్ళలో రానిది, సంకలినిలో వచ్చిందేమిటా అని.

అది మిగతావాటికంటే వేగంగా ఉండటమే కారణమా?
--------------------
ఇది రాస్తూ ఉంటే మరి కొన్ని కూడా రాయాలనిపించింది. అందుకే కొనసాగిస్తున్నాను.

బ్లాగు కూడళ్ళకు వేగం ప్రధానమే అయినప్పటికీ, అది మాత్రమే చాలదని నా ఉద్దేశం. నామటుకు నేను సంకలినుల్లో కావాలనుకునేవి కొన్ని ఉన్నై. అవి ఇక్కడ:
 • పాతవి చూడగలగడం: పాత టపాలు, వ్యాఖ్యలు చూడగలగాలి.
 • ఒక బ్లాగులో వచ్చిన రచనలన్నిటినీ ఒకచోట చూడగలగడం
 • ఒక వ్యాఖ్యాత రాసిన వ్యాఖ్యలను ఒకచోట చదవగలగడం
 • చరిత్రలో ఫలానా రోజున వచ్చిన టపాలను, వ్యాఖ్యలను చూడగలగడం
 • ఒక టపాకు  వచ్చిన వ్యాఖ్యలను ఒకచోట చూడగలగడం (దీనికి అంత ప్రాధాన్యత లేదు)
 • వెతకగలగడం - టపాల శీర్షికలో వెతకగలిగే ఏర్పాటు ఉంటే చాలు. క్లుప్త పరిచయంలోనూ వెతకగలిగే ఏర్పాటుంటే కాదనేది లేదు.
టూమచ్చిగా అనిపిస్తున్నాయా? అడిగేదానికికూడా మొహమాటపడితే ఎలాండీ?
----------------------
ఇవి మాత్రమే చెప్పేసి పోదామని నేను అనుకోలేదు. అసలుది ఒకటుంది. గతంలో ఈ ఆలోచన కొందరితో అన్నానుగానీ, ఎక్కడా ఫలితం రాలేదు. అంచేత ఇక్కడ పెట్టేసి చేతులు దులిపేసుకుంటన్నాను.
 • తెలుగు బ్లాగులకు గూగులోడు యాడ్లు ఇవ్వడు. (ఏదో ఒక ఇంగ్లీషు బ్లాగు పేరిట యాడ్ సెన్సు కోడు తీసుకుని దాన్ని తెలుగు బ్లాగులో కూడా పెట్టుకున్నా, గమనించాడంటే తీసేస్తాడు, ఖాతాను నిలిపేస్తాడు.) అంచేత మన కూడళ్ళ వాళ్ళు ఈ యాడ్ సేవలను మొదలుపెట్టవచ్చు. తెలుగు బ్లాగుల్లో యాడ్లు వెయ్యదలిస్తే మమ్మల్ని సంప్రదించండి అంటూ ప్రకటనదారులను ఆకర్షిస్తారు. ప్రకటనలు వెయ్యదలచినవాళ్ళు వీళ్లదగ్గరకు వస్తే వీళ్ళు తమకు అనుబంధంగా ఉన్న బ్లాగులకు యాడ్లు సర్వు చేస్తారు. సగటున ఒక్కో బ్లాగుకు నెలకు వెయ్యి పేజీ వ్యూలుండే బ్లాగులు వెయ్యి ఉంటాయనుకుంటే, నెలకు పది లక్షల పేజీ వ్యూలుంటాయి. సంకలినులు కొంత సంపాదించుకోవచ్చు, బ్లాగరులు కూడా కొంత సంపాదించుకోవచ్చు.
 • ఈ యాడ్ల వలన మరో లాభముంది, కొత్త బ్లాగులు పుట్టుకొస్తాయి.
 • మరో లాభమూ ఉంది.. పొద్దు లాంటి పత్రికలు తమ ప్రచురణలకు డబ్బులు ఇవ్వవచ్చు.
 • ఇంకో లాభమూ ఉంటుంది.. డబ్బులిస్తున్నారు కాబట్టి వృత్తి రచయితలు జాలంలోనూ రాయడం మొదలుపెడతారు. 
 • మరింత నాణెమైన కంటెంటు వస్తుంది. 
 • ఇంకో లాభం..
 • మరోటి..
 • ఇలా.. అనేకానేక లాభాలున్నాయన్న మాట!
ఈ యాడ్లవలన ఒక ప్రత్యేకమైన లాభం పొందేవారు కూడా ఉన్నారు. ’నేను ఫలానావాణ్ణి తిడుతూ నా బ్లాగులో వీడియో పెట్టాను చూడండి’ అనో, ’నేనో కథ రాసాను చదవండి’ అనో ఇతరుల బ్లాగుల్లో కెళ్ళి వ్యాఖ్యలు పెడుతూంటారు కొందరు, చూసారా? అమాయక బ్లాగరులు కొందరు వాటిని అనుమతిస్తున్నప్పటికీ, నాబోటి అతితెలివి బ్లాగరులు అనుమతించడం లేదు. ఇప్పుడు ఈ యాడ్ సేవ అందుబాటులోకి వస్తే, సదరు వ్యాఖ్యాతలు ఎంచక్కా, వీటిని యాడ్లుగా వేసుకోవచ్చు.
’అప్పుడైనా అతితెలివి బ్లాగరులు వేసుకోకపోవచ్చు గదా’ అని ప్రశ్నించకండి.. డబ్బులొస్తున్నపుడు చెత్తైతే మాత్రం వేసుకోవడానికి ఏం తీపరం? నేనేమైనా వాటిని చూడబోతున్నానా? చదవబోతున్నానా?
------------------
ఒక సంగతి గమనించారా.. ఇక్కడ మూడు విషయాలు రాసాను. శీర్షికలో మాత్రం మూడో విషయాన్ని మాత్రమే స్పృశించాను. ఎంచేతా అంటే.. బాగా అకట్టుకునే శీర్షిక అదే కాబట్టి! అప్పుడైతే చూట్టానికి కొంచెం ఎక్కువ మంది వస్తారు కాబట్టి.
అదీ సంగతి! 
------------------
అన్నట్టు ఇంకో సంగతి..
నా బ్లాగు పక్కపట్టీలో ’కూజహామా’ కాస్తా ’కూమాజహాసం’ అయిపోయింది, చూసారా! 'సంకలిని'లోని ’సం’ బాగా అతికింది ఇక్కడ. ఇకపై కొత్త సంకలినులు ఎవరైనా పెట్టదలచుకుంటే, పేరు దీనికి సరిపోయేలా, కుసింత జాగర్తగా ఆలోచించి మరీ పెట్టుకోవాలని మనవి.
 

8 కామెంట్‌లు:

 1. ఉన్న నాలుగైదు వేల మందికి అది వర్త్ కాదేమో నండి.

  రిప్లయితొలగించండి
 2. blaagulu kuda tv9 laa tayaaravutaayemo appudu

  chala rojulaku sakala janula Tapaa vrasaaru ...:-)

  రిప్లయితొలగించండి
 3. మీ సూచనలు బావున్నాయి. ఎవరైనా ముందుకొస్తే బావుంటుంది.

  రిప్లయితొలగించండి
 4. శిరీష్ కుమార్ గారు
  సంకలిని కేవలం ౩౦ సెకన్లలో టపాను చూపించేస్తుంది . దీనికి స్నిప్పెట్ వ్యూ కూడా ఉండటం తో మీరు ఏమి రాసారో కూడా వచ్చేస్తుంది
  కాకపొతే మరీ వేగం గా ఉండటం వల్ల చాలా ఇబ్బందులు (బాలారిష్టాలు) ఎదుర్కుంది సంకలిని
  -----
  మీరు చెప్పిన రెండో పాయింట్ కి వస్తే
  http://www.telugubloggers.com/
  http://teluguwebmedia.in/aggregator/
  ఈ రెండు అగ్రిగేటర్ లు పాత టపాలు కూడా ఇస్తున్నాయి
  కాకపొతే మొదటిది ఆపెసినట్లు ఉన్నారు
  రెండవ దాంట్లో వర్టికల్ స్క్రోలింగ్ ఎక్కువ ఉంటుంది
  ------
  లాభాల లాజిక్ బాగుంది :)

  -----
  కూమాజహా"సం" బాగుంది అండీ
  వాటి ప్రక్కన చేర్చినందుకు ధన్యవాదములు

  రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు